కవ్విస్తున్న వ్యభిచారిణుల అరెస్ట్ | Four Prostitutes Arrest at Mahatma Gandhi Bus Station | Sakshi
Sakshi News home page

కవ్విస్తున్న వ్యభిచారిణుల అరెస్ట్

Published Mon, Dec 23 2013 8:33 PM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM

కవ్విస్తున్న వ్యభిచారిణుల అరెస్ట్ - Sakshi

కవ్విస్తున్న వ్యభిచారిణుల అరెస్ట్

హైదరాబాద్: అసభ్యకర చేష్టలు, సైగలతో విటులను ఆకర్షించేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యభిచారిణులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం...గౌలిగూడలోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో విటులను ఆకర్షించేందుకు ఉప్పల్‌కు చెందిన నలుగురు వ్యభిచారిణులు ఆ దారిన వెళ్తున్న ప్రయాణికులకు సైగలు చేస్తూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.  వారు ఎంజీబీఎస్ ప్రాంగణంలో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న వ్యభిచారిణులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement