న్యూఢిల్లీ: కారు పార్కింగ్ విషయంతో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. బాధితుడు వరణ్ రోడ్డు వద్ద ఉండే తినుబండారాలకు సమీపంలో తన కారుని పక్కగా ఆపాడు. ఐతే వరుణ్ పార్కింగ్ వద్ద నిందితుడి కారు కూడా ఉంది. వరుణ్ అక్కడే పార్కింగ్ చేయడం వల్ల కారు డోర్‌లు ఓపెన్ చేయడం కుదరదు.
దీంతో సదరు వ్యక్తి కోపంతో వరుణ్‌తో పార్కింగ్ విషయమై గొడవపడ్డాడు. ఆ వాగ్వాదం కాస్త ఘర్ణణకు దారితీసింది. దీంతో నిందితుడు కోపంతో ఇటుకతో వరుణ్ తలను పగలుగొట్టి చంపి పారిపోయాడు. అందుకు సంబంధించిన ఘటనను ఒక పాదాచారి రికార్డు చేయడంతో వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితుడు తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి అని, వరుణ్ డైరీ బిజినెస్ చేస్తుంటాడని చెబుతున్నారు పోలీసులు. అంతేగాదు అదే సమయంలో బాధితుడి స్నేహితుడు దీపక్ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంత దారుణంగా శత్రువులను కూడా హతమార్చరంటూ బాధితుడి స్నేహితుడు దీపక్ కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
(చదవండి: అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...ఒకరు కిడ్నాప్, మరోకరు అఘాయిత్యాలు)
Comments
Please login to add a commentAdd a comment