brick
-
బాబ్రీ మసీదును ఎక్కడ నిర్మిస్తున్నారు? నిధుల సేకరణ ఎలా?
అయోధ్యలో మసీదు నిర్మాణానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాబ్రీ మసీదు స్థానంలో మహ్మద్ బిన్ అబ్దుల్లా మసీదును నిర్మించనున్నారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని వాక్యాలను లిఖించిన ఇటుకలను మసీదు నిర్మాణం కోసం వినియోగించనున్నారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థానంలో నిర్మించబోయే ఈ మసీదుకు మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అని పేరు పెట్టారు. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్ గ్రామంలో ఈ మసీదును నిర్మించనున్నారు. అయోధ్య భూ వివాదంపై 2019లో తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.. ఐదు ఎకరాల స్థలంలో మసీదు నిర్మించాలని ఆదేశించింది. మసీదు నిర్మాణ బాధ్యతను ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అనుసంధానంగా ఉన్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చేపట్టింది. మీడియాకు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సీనియర్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలో మసీదు నిర్మాణం రాబోయే మే నెలలో ప్రారంభం కానుంది. నిర్మాణం పూర్తికావడానికి నాలుగేళ్లు పట్టవచ్చని భావిస్తున్నారు. మసీదు నిర్మాణం కోసం క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ద్వారా నిధులను సేకరించనున్నారు. ఈ మసీదులో ఐదు మినార్లు ఉండనున్నాయి. అతిపెద్ద ఖురాన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. మసీదు కాంప్లెక్స్‌లో ఆసుపత్రి, మ్యూజియం, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, ఇండో-ఇస్లామిక్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. మసీదు పునాదికి ఉపయోగించే పవిత్ర ఇటుకను మసీదు అభివృద్ధి కమిటీ అధిపతి హాజీ అరాఫత్ షేక్ భారతదేశానికి తీసుకువచ్చారు. ఈ ఇటుకపై మహ్మద్ ప్రవక్త ప్రవచనాలను బంగారంతో లిఖించారు. మసీదులో మొదటి ప్రార్థనను మక్కా ఇమామ్ ఇమామ్-ఎ-హరమ్ అబ్దుల్ రెహమాన్ అల్-సుదైస్ చేస్తారని సమాచారం. -
పిఠాపురంలో మహిమగల ఇటుక
-
నంద్యాల: కోతుల పోట్లాట.. మనిషి ప్రాణం పోయింది
క్రైమ్: నంద్యాల జిల్లా వెలుగోడులో విషాదం చోటు చేసుకుంది. కోతుల పోట్లాటలో ఓ వ్యక్తి బలయ్యాడు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై రెండు కోతులు పోట్లాడుకోగా.. ఒక కోతి మరో కోతిపైకి ఇటుకను విసిరింది. అది కిందపడి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడ్ని రఫీగా గుర్తించారు పోలీసులు. కూరగాయల కోసం ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో రఫీపై కోతి విసిరిన ఇటుక పడింది. రఫీకి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
బెంగళూరులో దారుణం...ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు
బెంగళూరులో అర్థరాత్రి జరిగిన దారుణ హత్య పెద్ద కలకలం సృష్టించింది. ఒక వ్యక్తిపై కొంతమంది వ్యక్తుల గుంపు పెద్ద ఇటుక రాయితో దాడిచేసి తలపగల కొట్టి చంపేశారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బెంగళూరులోని కెపీ అగ్రహార ప్రాంతంలోని ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళల గుంపు ఒక చోట కూర్చొని ఉన్న వ్యక్తి వద్దకు సముహంగా వచ్చారు. కాసేపు అతనితో వాగ్వాదానికి దిగి అతడిపై దాడి చేశారు. ఇంతలో ఒక మహిళ ఒక రాయిని తీసుకువచ్చి అతడి తలపగలు కొట్టింది. మరోవైపు కొంతమంది భాదితుడిని కదలకుండ పట్టుకుని ఉండగా... ఒక వ్యక్తి రాయితో అదేపనిగా కొడుతూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఐతే బాధితుడి కేకలు విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించి...పోలీసులకు సమాచారం అందించారు. కానీ సదరు వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బాదామి ప్రాంతానికి చెందినవాడని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకుని నిందితులు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. Murder On CCTV In Bengaluru, Group Smashes Man's Head With Stones#Bengaluru #cctvfootage #Murder #Badami #argument #crimenews #KPAgrahara #attackers #killed #Karnataka #news #latestupdate #dailynews #IndianJourno pic.twitter.com/sF4eyTPFF0 — Indian Journo (@indianjournoapp) December 6, 2022 (చదవండి: వ్యక్తిని హత్య చేసి..తెగిపడిన తలతో సెల్ఫీలు) -
కర్కశత్వం: పార్కింగ్ వివాదం...ఇటుకతో కొట్టి చంపేశాడు
న్యూఢిల్లీ: కారు పార్కింగ్ విషయంతో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. బాధితుడు వరణ్ రోడ్డు వద్ద ఉండే తినుబండారాలకు సమీపంలో తన కారుని పక్కగా ఆపాడు. ఐతే వరుణ్ పార్కింగ్ వద్ద నిందితుడి కారు కూడా ఉంది. వరుణ్ అక్కడే పార్కింగ్ చేయడం వల్ల కారు డోర్లు ఓపెన్ చేయడం కుదరదు. దీంతో సదరు వ్యక్తి కోపంతో వరుణ్‌తో పార్కింగ్ విషయమై గొడవపడ్డాడు. ఆ వాగ్వాదం కాస్త ఘర్ణణకు దారితీసింది. దీంతో నిందితుడు కోపంతో ఇటుకతో వరుణ్ తలను పగలుగొట్టి చంపి పారిపోయాడు. అందుకు సంబంధించిన ఘటనను ఒక పాదాచారి రికార్డు చేయడంతో వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి అని, వరుణ్ డైరీ బిజినెస్ చేస్తుంటాడని చెబుతున్నారు పోలీసులు. అంతేగాదు అదే సమయంలో బాధితుడి స్నేహితుడు దీపక్ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంత దారుణంగా శత్రువులను కూడా హతమార్చరంటూ బాధితుడి స్నేహితుడు దీపక్ కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...ఒకరు కిడ్నాప్, మరోకరు అఘాయిత్యాలు) -
కోతి చేసిన పని.. ఓ వ్యక్తి ప్రాణం పోయింది
ఢిల్లీ: కోతుల బెడతతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కున్న ఘటనలు మనం చూసే ఉంటాం. అయితే తాజాగా కోతి చేసిన పని వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలోని నబికరీం ప్రాంతంలో నివాసం ఉంటున్న మహ్మద్ కుర్బాన్ అనే వ్యక్తి తలపై ఓ ఇంటి నుంచి ఇటుక రాయి పడింది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారకులెవరో తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి నిర్లక్ష్యం ద్వారా ప్రమాదం జరిగినట్టు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు విచారణలో.. ఓం ప్రకాశ్ మిశ్రా అనే వ్యక్తి ఇంటిపై నుంచి ఇటుక పడిందని తేలింది. దీంతో అతన్ని విచారించగా.. ఆ ఇటుకలను తాను ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌పై పెట్టినట్లు అంగీకరించాడు. అక్కడ కోతులు నిత్యం ట్యాంక్ మూత తీస్తుంటాయని మూత రాకుండా ఉండేందుకే ఆ ఇటుకలు పెట్టానని అన్నాడు. ఈ క్రమంలోనే ఇంటిపైకి వచ్చిన కోతి ఆ ఇటుకను కిందకు విసరగా, మహ్మద్ కుర్బాన్ పై పడిందని తెలిపాడు. అలసత్వంతోనే కోతులు ఇటుకలను కింద పడేశాయని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కూతురితో ప్రేమ వ్యవహారం.. యువకుడిని కిడ్నాప్ చేసి.. -
రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణ!
హైదరాబాద్ : వ్యవసాయదారులకు, రైతుకూలీలకు ఉపయోకరంగా ఉండటమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ బాటలు వేసింది. వేస్ట్ టూ వెల్త్ వ్యవసాయం చేసేప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలతో బయో బ్రిక్స్ (ఇటుకలు)ను ఐఐటీ, హైదరాబాద్ విద్యార్థులు రూపొందించారు. సాగు చేసేప్పుడు వచ్చే చెత్తను సేకరించి దాన్ని ప్రత్యేక పద్దతిలో మిక్స్ చేసి ఈ ఇటుకలను రూపొందించారు. ప్రస్తుతం ప్రోటోటైప్‌లో ఉన్న ఈ ఇటుకలను కమర్షియల్ పద్దతిలో భారీ ఎత్తున తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందివ్వడంతో పాటు ఆఫ్ సీజన్లో రైతు కూలీలకు కూడా మరో పనిని అందుబాటులోకి తెచ్చినట్టు అవుతుందని ఐఐటీ , హైదరాబాద్ అధ్యాపకులు అంటున్నారు. ప్రాజెక్ట్ బిల్డ్ ఐఐటీ హైదరాబాద్‌లో బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్మెంట్ (బిల్డ్) పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టులో భాగంగా 2019 నుంచి బయె బ్రిక్ పరిశోధనలు ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్ క్యాంపస్‌లోనే ఈ ఇటుకలను ఉపయోగించి సెక్యూరిటీ గార్డ్ గదిని నిర్మించారు. బయె ఇటుక ప్రత్యేకతలు - సాధారణ ఇటుకలతో పోల్చినప్పుడు బయో ఇటుకలు చాలా తక్కువ (ఎనిమిదో వంతు) బరువును కలిగి ఉన్నాయి. దీంతో ఇంటి పైకప్పు నిర్మాణానికి సైతం వీటిని వినియోగించవచ్చు. పీవీసీ షీట్లపై ఈ ఇటుకలను పేచ్చి కప్పును పూర్తి చేయవచ్చు. - బయె ఇటుకలు వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్‌గా పని చేస్తాయి. కాబట్టి భవనానికి అదనపు రక్షణ లభిస్తుంది. అంతేకాదు కొంత మేరకు సౌండ్ ప్రూఫ్‌గా కూడా పని చేస్తున్నాయి. - సాధారణ ఇటుకలతో పోల్చితే బయో ఇటుకలను కాల్చేందుకు కనీసం 6 సెంటిగ్రేడ్ వరకు తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యం తగ్గిపోతుంది. - ఈ ఇటుకలను భారీ ఎత్తున తయారు చేస్తే ఒక్కో ఇటుక తయారీకి కేవలం రూ.2 నుంచి రూ. 3 ల వ్యయం అవుతుంది. దీంతో ఇటుకల రేటు తగ్గిపోతుంది. గ్రామీణ ప్రాంతాలకు ఉపయుక్తం బయో బ్రిక్ టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వస్తే రూరల్ ఇండియాకు ఎంతగానో మేలు జరుగుతుందని ఐఐటీ హైదరాబాద్ అధ్యాపక బృందం అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే వ్యర్థాలతో అతి తక్కువ ఖర్చుతోనే ఇటుకలు అందుబాటులోకి వస్తాయని, వీటి వల్ల ఇంటి నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందంటున్నారు. వ్యయం తగ్గడంతో పాటు ఇంటి నాణ్యత కూడా బాగుంటుందని హామీ ఇస్తున్నారు. చదవండి : Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో! ఎల్ అండ్ టీ కీలక నిర్ణయం? -
వైరల్ వీడియో: కష్టాన్ని కళగా మార్చి.. తలను గంప చేసి
-
వైరల్: కష్టాన్ని కళగా మార్చి.. తలను గంప చేసి
సాక్షి, ముంబై: వినూత్న ఆలోచనలు, స్ఫూర్తిదాయకమైన కథనాలు, వైవిధ్యమైన పనుల గురించి తెలియాలంటే ప్రముఖ వ్యాపారావేత్త ఆనంద్ మహీంద్ర ట్విటర్‌ని ఫాలో అయితే సరిపోతుంది. ఆసక్తిదాయకమైన వీడియోలకు ఆయన ట్విటర్ అకౌంట్ గోల్డ్‌మైన్‌లా మారింది. ఆలోచనాత్మక పోస్ట్‌లతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం ఆనంద్ మహీంద్రాకు ఇష్టం. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఆనంద్ మహీంద్ర తన ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. గంటలోపే ఈ వీడియోని 36 వేల మంది వీక్షించగా.. 3000 మంది లైక్ చేశారు. ఎప్పటిలానే ఓ అద్భుతమైన పనిమంతుడి వీడియోని షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర. 57 సెకన్ల నిడివిగల ఈ వీడియోని ఓ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్న ప్రదేశంలో తీశారు. ఇక్కడ దినసరి కూలీ అయిన ఓ యువకుడు తన తల మీద ఏకంగా 32 ఇటుకలను పేర్చుతాడు. అడ్డం, నిలువు బ్యాలెన్స్ చేసుకుని.. ఎవరి సాయం లేకుండా.. ఒక్కడే తల మీద 32 ఇటుకలను నిలబెట్టాడు. అతడి ప్రతిభకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర ‘‘ఎవరూ ఇంత కష్టమైన పని చేయాలనుకోరు. కానీ తన కష్టాన్ని అందమైన కళగా మార్చుకున్న ఈ వ్యక్తిని తప్పక అభినందించి తీరాలి. ఇతను ఎక్కడ పని చేస్తున్నాడో మీలో ఎవరికైనా తెలుసా.. అతని యజమానులు ఆటోమేషన్‌ను అందించగలరా.. అతని ఉన్నత-స్థాయి నైపుణ్యాలను కూడా గుర్తించగలరా’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియోపై నెటిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘భద్రత ముఖ్యమే మేం కూడా అగీకరిస్తాం.. కానీ ఇక్కడ ఆటోమేషన్‌ను ప్రవేశపెడితే.. పాపం అతడికి ఈ పని కూడా దూరమవుతుంది.. కుటుంబం ఆకలితో అలమటిస్తుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
ట్రెండ్ మారుతోంది.. అలాంటి ఇళ్లే కావాలంట!
పల్లె అందం ఇప్పుడు పట్టణపు ఇళ్లలో కనువిందు చేస్తోంది. పాత తరం ముచ్చట నట్టింట కళాత్మకమై కొలువుదీరుతోంది. డిజటల్ యుగంలో కాంక్రీట్ క్లీనింగ్ బోర్ అనుకున్నవారు మట్టివాసనకు చేరువలో ఉండాలని తపిస్తున్నారు. అందుకే, ఇటుక కనిపించేలా గోడలు, నగిషీలు చెక్కిన వుడ్‌తో ఫర్నిచర్, మసకబారిన బ్రాస్ కలెక్షన్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇల్లు, కార్యాలయం, కాఫీషాప్.. వంటి వాటికి ఔట్ సైడ్ బ్రిక్ స్టైల్ డిజైన్స్ చూస్తుంటాం. అయితే, ఇప్పుడిది ఇంటీరియర్‌కి ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో పాటే వింటేజ్ స్టైల్ సింపుల్ అండ్ గ్రాండ్ లుక్‌తో ఆకట్టుకోవడం కూడా ఇప్పుడీ స్టైల్ నగరవాసులకు ప్రియమైన డెకార్‌గా మారింది. నిర్లక్ష్యమే అందం ఇటుకను ప్రకృతిలోని దృశ్యాన్ని ఇంట్లోకి తీసుకువచ్చే ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. గది నాలుగు గోడలలో ఒక గోడను ప్రత్యేకంగా డిజైన్ చేయడం ఇంటి అలంకరణలో ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడదే పాత పుంతలను తొక్కుతోంది. లివింగ్ రూమ్, బెడ్రూమ్లలో ఒక వైపు ఇటుక గోడ రస్టిక్ ఫీల్‌ను ఇస్తుంది. సిమెంట్ తాపీ పని లేకుండా నిర్లక్ష్యంగా వదిలేశారనిపించేలా ఉండే ఎగుడుదిగుడుల ఇటుక గోడ క్రియేటివ్ స్పేస్‌గా మారిపోయింది. ఈ ఇటుక గోడపైన ఓల్డ్ స్టైల్ వాల్ ఫ్రేమ్స్ కొత్తగా కనువిందు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టు బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ వుడెన్ లేదా ఐరన్ ఎలాంటి హంగులు అవసరం లేకుండానే వింటేజ్ లుక్‌ను తీసుకువస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్‌లో ఇటుక ప్రధాన ఆకర్షణగా మారింది. వాల్ పేపర్‌తో వింటేజ్ లుక్ ఇంటి లోపల ఇటుక గోడ పెట్టక్కర్లేదు. రస్టిక్ లుక్ ఉన్న బ్రిక్ స్టైల్ వాల్‌పేపర్‌తో గది గోడను మార్చుకోవడం సులువు అవుతుంది. పెద్దగా ఖర్చూ ఉండదు. మార్చుకోవడం సులువు. అద్దె ఇంట్లోనైనా అనుకున్న లుక్‌ని ఆస్వాదించవచ్చు. ఫ్రేమ్ స్టైల్ బ్రిక్ లివింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్‌లలో ఒక ఫ్రేమ్ స్టైల్లోనూ ఇటుక గోడను డిజైన్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల తెల్లటి నున్నని గోడల మధ్య వెడల్పాటి ఇటుక గోడ ఒకటి ఫ్రేమ్స్టైల్లో డిజైన్ చేస్తే కళాత్మకతలో అదొక అందమైన ప్రదేశంగా మారిపోతుంది. సర్కిల్లా గుండ్రటి స్టైల్ మట్టి ఇటుక వచ్చేలా డిజైన్ చేస్తే ఇంటిలోపల యూనిక్ లుక్ కనువిందు చేస్తుంది. ఒక ఆర్ట్ వర్క్‌లా మారిపోతుంది. మరింత క్రియేటివ్‌గా మార్చుకోవాలంటే దీనికి కలపతో డిజైన్ చేసిన హ్యాంగింగ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. పార్టిషన్ వాల్ హాల్లో కొంత భాగం పార్టిషన్ చేసుకోవాలంటే అందుకు మిర్రర్, వుడ్ ఇతరత్రా ఆలోచనలు చేస్తారు. సన్నని ఇటుక గోడ పార్టిషన్‌తో భిన్నమైన కళ తీసుకురావచ్చు. ఇక ఈ ఇటుక గోడలకు వైట్ వాష్ లేదా బ్లాక్ వాష్ ఐడియాలతో కొత్త కళను తీసుకురావచ్చు. తరతరాల ముచ్చట పాత ఇంటి గోడలపై పెయింట్ చేసిన బొమ్మలు, ముగ్గులు, పిల్లల ఆటల్లో వారు గీసిన రేఖాచిత్రాలు .. ఇవన్నీ ఇప్పుడు ఇంటిలోపల గోడపై కనువిందు చేయడం విశేషమైపోయింది. ఆ మనోహర దృశ్యాలకు తమ ఇల్లు వేదికైందని మురిసిపోతున్నారు నవతరం కళాప్రియులు. -
డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర
చెన్నె: తాత మాజీ ముఖ్యమంత్రి.. తండ్రి పార్టీ అధినేత.. కుమారుడు సినీ రంగంలో ప్రవేశించి ఇప్పుడు రాజకీయాల్లో ఎంటరయ్యాడు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తాతకు తగ్గ మనుమడు అని తాజా ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ నిరూపించుకున్నాడు. అయితే ఉదయనిధి చేసిన ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మధురై ప్రచారంలో ఉదయనిధి వ్యంగ్యంగా చేసిన విమర్శలు.. చర్యలను ఓటర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. డీఎంకే గెలుపులో కీలక పాత్ర పోషించింది ఏమిటంటే ఒక ‘ఇటుక’. ప్రచారంలో ఉదయనిధి వాడిన ఇటుక వైరల్‌గా మారింది. ఆ పార్టీ విజయంలో ఇటుక పాత్ర ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం మధురైకు ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను మంజూరు చేసింది. మంజూరు చేసి మూడేళ్లు దాటినా ఇంతవరకు పనులు పూర్తికాలేదు. శంకుస్థాపనకే పరిమితమైంది. దీన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ దూసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీరును ‘ఇటుక’ చూయిస్తూ ఇదిగోండి ఎయిమ్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ అని రాసి ఉన్న ఇటుకను పార్టీ అధినేత, తన తండ్రి ఎంకే స్టాలిన్‌కు ఉదయనిధి ఆదివారం అప్పగించాడు. దానర్థం నాన్న మీరైనా ఎయిమ్స్‌ను పూర్తి చేయండి పరోక్షంగా చెప్పాడు. ఈ విధంగా తమిళనాడు ఎన్నికల్లో ఇటుక కీలక పాత్ర పోషించింది. ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ తొలిసారి చెపాక్కం- ట్రిప్లికేన్ నుంచి విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఏకంగా 68,880 ఓట్ల మెజార్టీ సాధించి తాత, తండ్రికి వారసుడిగా దూసుకొచ్చాడు. చదవండి: ఊహించని షాక్: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' తన తండ్రి స్టాలిన్‌కు ఎయిమ్స్ ఇటుక ఇస్తున్న ఉదయనిధి స్టాలిన్ #DMKwinsTN #AIIMS #TNwithDMK pic.twitter.com/da6aF5k6qW — Udhay (@Udhaystalin) May 2, 2021 -
‘ఇటుక’ చుట్టూ తమిళ రాజకీయం
చెన్నె: కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని తమిళ యువ నాయకుడు, డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి వ్యంగ్యంగా విమర్శలు చేశాడు. అయితే ఆ విమర్శలు విన్న ప్రజలంతా నవ్వుకుంటుండగా బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ యువ నేత ‘ఇటుక’ దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ పరిణామంతో ఇటుక చుట్టూ తమిళ రాజకీయంగా తిరుగుతోంది. గత మంగళవారం ఉదయనిధి స్టాలిన్ సత్తూరులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీని ప్రస్తావించి ఇరుకున పెట్టాడు. వాస్తవంగా మధురైకి ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి మధురైలోని తొప్పూర్లో 250 ఎకరాలు కేటాయించారు కూడా. ఆ పనులకు 2019 జనవరి 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆ పనులేవీ సాగలేదు. దీనిని విమర్శిస్తూ ‘ఇదిగో మధురై ఎయిమ్స్ తీసుకొచ్చా’ అని ప్రచార ర్యాలీలో ఉదయనిధి ఓ ఇటుకను చూయించాడు. దానిపై నిమ్స్ అని రాసి ఉంది. ఇది చూసిన ప్రజలంతా ఫక్కున నవ్వారు. ఇది బీజేపీ తీరు అంటూ ఎయిమ్స్ ఇంకా నిర్మించలేదని ఎద్దేవా చేస్తూ ఇటుకను చూయించాడు. ఈ ఇటుకనే ఎయిమ్స్ అని ఉదయనిధి చెప్పాడు. మూడేళ్లల్లో అన్నాడీఎంకే, బీజేపీ ఏమీ చేసిందని ప్రశ్నించారు. అయితే ఇక్కడితో వివాదం సమసిపోలేదు. ఆ ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఓ బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం మరో వింత. ఎయిమ్స్‌లోని ఓ ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ నిర్మాణాన్ని కాపాడాలని ఆ బీజేపీ నాయకుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఆ ఇటుకను తిరిగి తీసుకోవాలని కోరాడు. ఈ ఫిర్యాదును చూసి పోలీసులు అవాక్కయ్యారు. -
రామ మందిరం: మొఘల్ వారసుడి కానుక
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేవలం హిందువుల నుంచే కాదు, ఏ మతం వారు విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రముఖ పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ అయోధ్య రామాలయానికి బంగారపు ఇటుకను కానుకగా ఇస్తానని ప్రకటించారు. కిలో బరువున్న ఇటుకను ప్రధాని నరేంద్ర మోదీకి అందిస్తానని, దీన్ని ఆలయ నిర్మాణంలో వాడవచ్చని ఆయన ప్రకటించారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగబోతుంది. ఇది మనందరికి ఎంతో సంతోషకరమైన విషయం. నేను మాట ఇచ్చినట్లుగానే రామమందిర నిర్మాణానికి మొఘల్ వంశం తరపున కేజీ బంగారపు ఇటుకను ఇస్తున్నాను’ అని యాకుబ్ పేర్కొన్నారు. ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా కోరానని ఆయన దగ్గర నుంచి పిలుపు రావాల్సి ఉందని చెప్పారు. చదవండి: మందిరానికి విరాళాలు ఎవరిచ్చినా స్వీకరిస్తాం మొఘలుల వారసుడిగా చెప్పుకునే హబీదుద్దీన్ టూసీ గత సంవత్సరం తనను బాబ్రీ మసీదు కేర్ టేకర్ గా నియమించాలని డిమాండ్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఆగస్టు 5వతేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు అయోధ్య రామాలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. కరోనా మహమ్మరి నేపథ్యంలో దీని కోసం కొద్దిమంది ప్రముఖులనే ఆహ్వానిస్తున్నారు. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇప్పటికే రెండుసార్లు అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, తన సొంత డబ్బును విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఆకాశాన్నంటే రామ మందిరం -
కుమారున్ని ఇటుకతో కొట్టి చంపిన తల్లి
సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో ఓ భార్య.. ఇద్దరు కొడుకులను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. వివరాలు. గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న రమాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు అజయ్, ఆర్యన్. భర్త ఎన్టీపీసీలో పని చేస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రమాదేవి భర్త విధులకు వెళ్లాడు. భర్త మీద కోపంతో రమాదేవి.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. దాంతో ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది రమాదేవి. ఈ లోపే స్థానికులు అక్కడికి చేరుకుని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. -
మానవ మూత్రంతో ఇటుకలు!
మానవ మూత్రం అనగానే.. ఛీ అని అనుకుంటాంగానీ.. ఈ రోజుల్లో మొబైల్ ఛార్జింగ్ మొదలుకొని హైడ్రోజన్ ఉత్పత్తి వరకూ రకరకాలుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. కేప్‌టౌన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడీ జాబితాలోకి బయో కాంక్రీట్ కూడా వచ్చి చేరింది. సముద్రతీరంలో దొరికే పెంకులు ఉంటాయి చూశారు.. అచ్చం అలాగే ఈ బయో కాంక్రీట్‌ను తయారు చేయవచ్చు. అంతేకాదు.. అవసరాన్ని బట్టి ఎంత దృఢంగా ఉండాలో కూడా మనమే నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా బయో కాంక్రీట్ ఇటుకలను తయారు చేసుకోవచ్చునని అంటున్నారు డైలన్ రాండల్. ప్రత్యేకమైన బ్యాక్టీరియా, కొంత ఇసుక, మానవ మూత్రాలను ఉపయోగించడం ద్వారా ఈ బయో కాంక్రీట్ తయారవుతుంది. ఈ ప్రత్యేక బ్యాక్టీరియా ఇసుక రేణువులను గుళికలుగా మారుస్తుంది. ఆ తరువాత యూరేజ్ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తుంది. మానవ మూత్రం తాకినప్పుడు ఈ యూరేజ్ కాస్తా యూరియాగా మారిపోతుంది. అదే సమయంలో ఈ రసాయన చర్య కాస్తా కాల్షియం కార్బొనేట్ ఏర్పడేందుకు కారణమవుతుంది. ఈ పదార్థాన్ని అచ్చుల్లో పోస్తే ఇటుకలు తయారవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం గది ఉష్ణోగ్రతలోనే జరగడం వల్ల ఇటుకలు కాల్చేందుకు ఉపయోగించే ఇంధనం మొత్తాన్ని ఆదా చేయవచ్చునని డైలన్ వివరించారు. అంతేకాకుండా.. మానవ మూత్రంలోని పొటాసియం, నైట్రోజన్ ఫాస్పరస్‌లను ఎరువులుగా వాడుకునేందుకూ ఈ ప్రక్రియ అవకాశం కల్పిస్తుందని వివరించారు. మరింత స్పష్టమైన ఎక్స్‌రేలు... టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి లోపలి వ్యవహారాల గురించి తెలుసుకునేందుకు ఇప్పటికీ ఎక్స్రేలే చౌకైన మార్గం. అయితే వీటితో కొన్ని చిక్కులున్నాయి. చిత్రాల స్పష్టత కొంచెం తక్కువ. అదే సమయంలో రేడియోధార్మికత ముప్పు కొంత ఉంటుంది. ఈ రెండు సమస్యలను అధిగమించడంలో సింగపూర్‌లోని నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు విజయం సాధించారు . నానోస్థాయి స్ఫటికాలను ఉపయోగించడం ద్వారా ఎక్స్‌రే స్పష్టతను పెంచడమే కాకుండా.. రేడియోధార్మికత మోతాదును తగ్గించగలిగారు కూడా. సంప్రదాయ ఎక్స్‌రే యంత్రాల్లో ఎక్స్‌రే శక్తిని దృశ్య కాంతిగా మార్చేందుకు స్ఫటికాల్లాంటివి వాడతారు. సైంటిలేటర్లు అని పిలిచే ఈ స్ఫటికాలను అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటికి ప్రత్యామ్నాయంగా లెడ్ హాలైడ్ పెరోవిస్కైట్ నానో స్ఫటికాలు తయారయ్యాయి. వీటి వాడకం వల్ల ఎక్స్‌రేల నాణ్యత పెరగడంతోపాటు దుష్ప్రభావం తగ్గుతుందని చెన్ ఖుయిషూయి అంటున్నారు. -
కారు స్పీకర్ ఆర్డర్ చేస్తే.. ఇటుక వచ్చింది!
సాక్షి, అన్నానగర్: ఆన్లైన్ ద్వారా కారుస్పీకర్‌ను బుకింగ్ చేయగా కొరియర్ పార్శిల్లో ఇటుక వచ్చింది. ఈ ఘటన తూత్తుక్కుడి సమీపంలోని ముల్‌లైక్కాటులో చోటుచేసుకుంది. న్యాయవాది సెవ్వకుమార్ తన కారు స్పీకర్ కోసం గత 1వ తేదీన(జనవరి01) ఆన్లైన్ బుకింగ్ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం సదరు సంస్థ నుంచి వచ్చిన ఆ పార్శిల్ని ప్రైవేట్ కొరియర్ సంస్థ కార్మికుడు సెల్వకుమార్‌కు అందజేశాడు. సెల్వకుమార్ స్పీకర్ ధర రూ. 5వేలు చెల్లించి పార్శిల్‌ను తీసుకున్నాడు. ఆ పార్శిల్ తెరిచి చూడగా అందులో ఇటుక ఉంది. కొరియర్ సంస్థకు ఫోన్ చేయగా వారు సరిగ్గా సమాధానమివ్వలేదు. దీనిపై ఆయన మల్తైయాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కొరియర్ సంస్థ యజమానిని విచారణ చేశారు. సదరు కంపెనీ యజామాని సెల్వకుమార్‌కు నగదు తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
భారీ ఇటుకలు.. మట్టి పూసలు
మంచిర్యాల జిల్లా కర్ణమామిడిలో శాతవాహనులకు ముందునాటి ఆనవాళ్లు - పురావస్తు తవ్వకాల్లో బయటపడిన భారీ ఇటుకలు - టెర్రకోట మట్టి పూసలు, పాత్రలు, పెంకుల ముక్కలు కూడా.. - ఈ ప్రాంతాన్ని మూడు దశాబ్దాల కిందే గుర్తించినా ప్రభుత్వాల నిర్లక్ష్యం - దెబ్బతిన్న పురావస్తు సంపద.. - తాజా తవ్వకాల్లో వెలుగు చూస్తున్నది అవశేషాలే! సాక్షి, హైదరాబాద్, మంచిర్యాల రూరల్: పెద్ద పెద్ద ఇటుకలు.. ఒక్కోటి 60 సెంటీమీటర్ల పొడవు.. అంటే ఇప్పుడు మనం వాడే ఇటుకలకు మూడింతలు పెద్దవి.. ఎరుపురంగులో గట్టిగా ఉన్నాయి.. ఇంకేం స్థానికులు దొరికినవి దొరికినట్లుగా తీసుకెళ్లి ఇళ్ల నిర్మాణంలో వాడేసుకున్నారు. మరి ఆ ఇటుకలు ఎప్పటివో తెలుసా..? సుమారు 2,000 ఏళ్ల కిందటి నాటివి. శాతవాహనుల తొలి రాజధానికి చేరువలో ఉన్న ఓ పట్టణానికి సంబంధించిన నిర్మాణాలవి. ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం సాగుభూమిగా మారిపోయింది. ఇక్కడి చారిత్రక సంపద దెబ్బతిన్నది. తీరా ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు ప్రారంభించేసరికి గోడల దిగువభాగాలే మిగిలాయి. శనివారం పురావస్తు శాఖ తవ్వకాల్లో శాతవాహనుల నాటి ఇటు క గోడను, టెర్రకోట మట్టి పూసలు బయటపడ్డాయి. మూడున్నర దశాబ్దాల కిందే గుర్తించినా.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి శివారులో గోదావరి నది ఒడ్డున పాటిగడ్డ ప్రాంతం ఉంది. ప్రస్తుతం ఇది ఎల్లంపల్లి రిజర్వాయర్ బ్యాక్ వాటర్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో అతి పురాతన పట్టణం ఉండేదని దాదాపు మూడున్నర దశాబ్దాల కింద.. అప్పటి పురావస్తు శాఖ డైరెక్టర్ కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో గుర్తిం చారు. ఆ ఆనవాళ్లు శాతవాహనుల కంటే ముందునాటివని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రాంతంలో శాతవాహనుల కంటే ముందు రాజ్యం ఉండేదా, లేక శాతవాహనుల రాజధానికి అనుబంధంగా నిర్మి తమైన పట్టణమా అన్న దిశగా పరిశోధన చేశారు. అయితే ఆ తర్వాత తవ్వకాలు నిలిచిపోయాయి. మన చరిత్రలో కొత్త అంశం మరుగున పడిపోయింది. బ్యాక్‌వాటర్‌లో మునిగిపోవడంతో.. ఇటీవలే పురావస్తు శాఖ డైరెక్టర్ విశాలాక్షి కర్ణమామిడి ప్రత్యేకతపై దృష్టి సారించి.. తవ్వకాల కోసం కేంద్రం నుంచి అనుమతి పొందారు. కానీ ఆ ప్రాంతం ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయి ఉండటంతో తవ్వకాలు సాధ్యం కాలేదు. జూన్‌లో నీటి నిల్వ తగ్గి ఈ ప్రాంతం బయడపడటంతో తవ్వకాలు మొదలుపెట్టినా.. భారీ వర్షాలతో బురదమయం కావటంతో నిలిపివేశారు. కొద్దిరోజులుగా వర్షాలు నిలిచిపోవడంతో తిరిగి మూడు రోజుల కింద తవ్వకాలు చేపట్టారు. పురావస్తుశాఖ సహాయ సంచాలకుడు నాగరాజు, ఆ శాఖ రిటైర్డ్ అధికారి భానుమూర్తిల ఆధ్వర్యంలో శనివారం జరిపిన అన్వేషణలో.. భారీ నిర్మాణానికి చెందిన పురాతన గోడ, పాత్రల అవశేషాలు, టెర్రకోట మట్టి పూసలు బయటపడ్డాయి. 60 సెంటీమీటర్ల పొడవు, 28 సెంటీమీటర్ల వెడల్పు, 8 సెంటీమీటర్ల మందం ఉన్న ఇటుకలతో ఈ గోడను నిర్మించినట్టు గుర్తించారు. ఆ ఇటుకలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి. గోడ సమీపంలో ఇంటి పైకప్పు కోసం వాడే పెంకులు, టైల్స్ ముక్కలు కూడా దొరికాయి. అయితే ఈ గోడ కేవలం 3 వరుసల ఇటుకలతో 30 సెంటీమీటర్ల ఎత్తుతో మాత్రమే మిగిలింది. ఇవి గోడ దిగువ భాగం ఇటుకలని.. పైన ఉన్న ఇటుకలను రైతులు వ్యవసాయం చేస్తున్న సందర్భంలో పెకలించి తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఐదెకరాల్లో తవ్వకాలు ఈ ప్రాంతం దాదాపు 40 ఎకýరాలుండగా.. ప్రస్తుతం ఐదెకరాల్లో తవ్వకాలు జరపాలని నిర్ణయించి, పని ప్రారంభించారు. శనివారం పలు ఆధారాలు వెలుగుచూడటంతో.. ముందుముందు మరిన్ని విశేషాలు బయటపడతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తవ్వకాలు చేపట్టామని.. 15 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 20 రోజులపాటు తవ్వకాలు చేపడతామని పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు వెల్లడించారు. మళ్లీ వర్షాలు కురిసేలోపు వీలైనంత మేర తవ్వకాలు జరపాలని భావిస్తున్నామని శాఖ అధికారి నాగరాజు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మళ్లీ నిండితే.. వచ్చే ఎండాకాలంలో తవ్వకాలు పూర్తి చేస్తామన్నారు. చాలా వరకు ధ్వంసమయ్యాయి ‘‘1980 ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని నాటి డైరెక్టర్ కృష్ణశాస్త్రితో కలసి పరిశీలించినప్పుడు గోడ ఆనవాళ్లు భద్రంగా ఉన్నాయి. అప్పుడే తవ్వకాలు జరిపి ఉంటే అప్పటి నిర్మాణాలు, విశేషాలు వెలుగుచూసి ఉండేవి. ఇప్పుడు గోడలు చాలావరకు ధ్వంసమయ్యాయి. మిగిలిన నిర్మాణ భాగాలను పరిరక్షించేందుకు చర్యలు చేపడతాం..’’ – పురావస్తు శాఖ రిటైర్డ్ ఉద్యోగి, తవ్వకాల బృందం సభ్యుడు భానుమూర్తి -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కుచ్చుటోపీ..!
ఖరీదైన వస్తువులు అతి తక్కువ ధరకు వస్తున్నాయంటే ఎవరికైనా ఆశే మరి! సరిగ్గా అలాంటి ఆశే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నిండా ముంచేసింది. రూ.60 వేలకు రెండు యాపిల్ ఐఫోన్లతోపాటు మ్యాక్ బుక్ కూడ ఇస్తామంటే 'మంచి బేరమేకదా' అనుకున్నాడు. తీరా డబ్బులు చెల్లించాకగానీ తాను మోసపోయానని తెలుసుకోలేకపోయాడు. బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వెంకటనారాయణను అడ్రస్ అడిగే నెపంతో ఇద్దరు వ్యక్తులు కలిశారు. మాటల మధ్యలో బ్యాగ్ లోని యాపిల్ ప్రొడక్ట్స్ చూపించి కొనమని అడిగారు. పైగా వాటిని అరవై శాతం డిస్కౌంట్ కు ఇస్తామన్నారు. వెంకటనాయరాయణను నమ్మించేందుకు ఆ వస్తువుల బిల్లులను కూడ చూపించారు. అంతఖరీదైన వస్తువులు తక్కువ ధరకు వస్తుండటంతో ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అప్పటికప్పుడే ఏటీఎంనుంచి డబ్బు డ్రాచేసి మరీ ఇచ్చి వాటిని సొంతం చేసుకున్నాడు. మోసగాళ్ల నుంచి బ్యాగ్ తీసుకున్న కాసేపటితర్వాత తెరచిచూస్తే అందులో ఉన్నది ఒట్టి ఇటుక మాత్రమేనని గ్రహించిన ఇంజనీర్.. పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తాను మోసపోయినందుకు ఎంతో సిగ్పడుతున్నానని, అయితే, తనలా మరెవరూ మోసపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని నారాయణ చెప్తున్నాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ను బట్టి దుండగుల ఆచూకీ తెలిసే అవకాశం ఉండొచ్చని పోలీసులు భరోసా ఇచ్చారు. -
మహిళపై దాడికేసులో కానిస్టేబుల్‌పై వేటు
న్యూఢిల్లీ : లంచం ఇవ్వలేదని ఓ మహిళపై ఇటుకతో దాడి చేసిన కేసులో ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ చంద్రపై వేటు పడింది. అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం వెల్లడించారు. అండర్ ఆర్టికల్ 311 (2) (బి) సెక్షన్ ప్రకారం ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. కాగా ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించినందుకు రూ.200 లంచం ఇవ్వాలంటూ ఓ మహిళను సతీష్ చంద్ర డిమాండ్ చేశాడు. అయితే అందుకు ఆ మహిళ నిరాకరించటంతో ఇటుకతో ఆమెపై దాడి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనను ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ రాయి పట్టుకుని మహిళను కొడుతున్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేయటంతో సరిపోదన్నారు. కాగా ఈ కేసులో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
లంచం ఇవ్వనందుకు ఇటుక రాయితో దాడి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ మహిళపై పట్టపగలు ఇటుక రాయితో దాడి చేసిన ఘటనలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. ... తన ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ సౌత్ ఢిల్లీలో స్కూటీపై వెళుతుండగా సతీష్ చంద్ర అనే హెడ్ కానిస్టేబుల్ ఆమెను ఆపాడు. నిబంధనలు విరుద్ధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నావంటూ మహిళను ఆపి లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఆ మహిళ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. అదికాస్తా వాగ్వివాదానికి దారితీసింది. దాంతో సహనం కోల్పోయిన సతీష్ చంద్ర ...మహిళపై ఇటుకతో దాడి చేశాడు. ఈ వ్యవహారాన్ని దారిన వెళ్లే వాళ్లు తీసిన వీడియో బయటకు రావటంతో కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. వీడియో క్లిప్ ఆధారంగా కానిస్టేబుల్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. -
మహిళపై ఇటుకతో ట్రాఫిక్ పోలిస్ దాడి
-
స్టీల్, సిమెంట్ ధరలు పైపైకి
బాన్సువాడ రూరల్ : సిమెంట్, స్టీల్, ఇటుకల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో భవన నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఫలితంగా ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ అప్పుచేసి సొంతిల్లు నిర్మించుకుందామనుకున్న సామాన్యుడి కల నెరవేరటం లేదు. అకాశాన్ని అంటుతున్న బిల్డింగ్ మెటీరియల్ ధరలతో సగంలోనే నిర్మాణాలు ఆగిపోతున్నాయి. బాన్సువాడలో నెలరోజుల క్రితం వరకు రూ. 200 ఉన్న బస్తా సిమెంట్ ధర ప్రస్తుతం రూ. 300కు చేరింది. సాధారణ ఇటుక ధరసైతం మొన్నటి వరకు వెయ్యికి రూ. 2,500 ఉండగా ప్రస్తుతం రూ. 3,000లకు చేరింది. స్టీలు క్వింటాలుకు రూ. 4,500 పలుకుతోంది. పెరిగిన ధరలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా సిమెంట్, ఇటుక, స్టీలు ధరలు పెరుగుతుండటంతో ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టిన వారుకూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకు ధరలు పెరుగిపోతూ ఉండటంతో పలువురు నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలోనే గృహ నిర్మాణాలు ఎక్కువగా కొనసాగుతాయి. దీంతో నిర్మాణాలు ప్రారంభించినవారు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. నిర్మాణాలకు చేయాల్సిన ఖర్చు అంచనాలకు రెట్టింపు అవుతోందని భవన నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టీల్, సిమెంట్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో సాధారణంగా గ్రామాల్లో పెంకుటిళ్లను మాత్రమే నిర్మించుకునేవారు. ఆర్సీసీ బిల్డింగ్‌ల నిర్మాణాలు అరుదుగా జరిగేవి. అయితే ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా పెంకుటిళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్సీసీ భవనాల నిర్మాణాలు పెరిగాయి. స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు కూడా మందగించాయి. ప్రభుత్వం స్పందించాలి.. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్యుడికి సొంతింటి కల నెరవేరని పరిస్థితులు నెలకొంటాయి. సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ సీఏం కేసీఆర్ వెంటనే కొత్తవారితోపాటు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారికి సైతం గృహ నిర్మాణానికి రూ. 3 లక్షలు మంజూరు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇల్లు...కట్టినోళ్లు గొల్లు!
సిమెంట్ ధరలు పైపైకి... అదే దారిలో ఇతర ముడి సరుకు ధరలు నిర్మాణాలపై అదనపు భారం ‘ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు...’ అన్నారు పెద్దలు. పెళ్లి మాటేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారింది. సిమెంట్ ధర వారం రోజుల వ్యవధిలో గతంలో ఉన్నడూ లేనంతగా పెరిగింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ముడి సరుకు ధరలూ అదే తరహాలో పెరుగుతుండడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల వ్యవధిలో సిమెంట్, ఇటుక, స్టీల్, చిప్స్(కంకర), ఇసుక ధరలు పెరగడం వల్ల నిర్మాణాలపై అదనపు భారం పడుతోంది. పిల్లర్లు, స్లాబులకు ఉపయోగించే ఇనుము(స్టీల్) కొంత ఊరట నిస్తున్నాయి. కానీ మిగిలిన ముడి సరుకుల ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మండలంలో సొంత ఇళ్లు, ఇతర వాణిజ్య సముదాయాలు, పాఠశాల భవనాలు అధిక సంఖ్యలో నిర్మాణ దశల్లో ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా మందగించాయి. వేసవిలోనే నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని భావించిన వారికి పెరిగిన ధరలు షాక్‌నిస్తున్నాయి. రూ.300 చేరిన సిమెంట్ వారం రోజుల క్రితం సిమెంట్ ధర అరకులోయలో రూ. 245 ఉంటే అదే సిమెంట్ ధర ఇపుడు రూ. 300 చేరింది. సిమెంట్ పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా ఏర్పడడంతో ఒక్కసారిగా ధరలు ఆకాశనంటుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరలా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తాకు రూ. 60 వరకు పెరగడం గమనార్హం. ఇటుకల ధరలు పైపైకి... భవన నిర్మాణానికి అవసరమైన అన్ని ముడి సరుకుల మాదిరిగానే ఇటుకల ధరలు పెరిగాయి. రెండు వేల మట్టి ఇటుక గతంలో రూ. 8వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 10 వేలుకు పెరిగింది. వెయ్యి ఫాల్ జి బ్రిక్స్ రూ. 13వేలు నుంచి రూ. 15వేలకు పెరిగింది. ఇసుక బంగారమే... భవన నిర్మాణానికి ఇసుక ప్రాణదాత. చుట్టుపక్కల గెడ్డల్లో ఇసుక లభిస్తున్నా ధర మాత్రం ఎక్కువగానే ఉంది. ఇసుక బంగారంగా మారింది. ఇదే అదనుగా ట్రాక్టర్, లారీల యజమానులు అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ. 800 నుంచి రూ. 1000 పలుకుతోంది. వర్షాకాలం రానుండడంతో ట్రాక్టర్, లారీల యజమానులు ఇసుక నిల్వలు చేసుకుంటున్నారు. మార్కెట్లో గిరాకీని బట్టి ధరలు పెంచుతున్నారు. కంకర...ధర కటకట : నిర్మాణాలకు అవసరమైన కంకర ఎస్.కోట సమీపం నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువగా దిగుమతి అవుతోంది. నాణ్యమైన కంకర కావడంతో వినియోగదారులు వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కంకర ధర బాగా పెరిగింది. కొద్ది రోజుల క్రితం రెండు యూనిట్ల లారీ లోడు రూ. రూ.10వేల నుంచి రూ.13వేలకు చేరింది. 40 యం.యం. లారీ లోడు రూ. 7,500 నుండి రూ.9 వేలుకు చేరింది. పునాది బండ...గుది బండ : పునాదులకు ఉపయోగించే బండ రాళ్ల ధర కూడ బాగా పెరిగింది. పునాదులకు అవసరమైన ట్రాక్టర్ లోడు బండరాళ్లు రూ. 1200 నుంచి రూ. 1500 చేరింది. అయినా ఒక యూనిట్ రాయి పూర్తిగా రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.