కుమారున్ని ఇటుకతో కొట్టి చంపిన తల్లి | In Peddapalli District Mother Beating Children With Brick | Sakshi
Sakshi News home page

కుమారున్ని ఇటుకతో కొట్టి చంపిన తల్లి

Published Mon, Mar 4 2019 12:09 PM | Last Updated on Mon, Mar 4 2019 12:28 PM

In Peddapalli District Mother Beating Children With Brick - Sakshi

సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో ఓ భార్య.. ఇద్దరు కొడుకులను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. వివరాలు. గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న రమాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు అజయ్‌, ఆర్యన్‌. భర్త ఎన్టీపీసీలో పని చేస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రమాదేవి భర్త విధులకు వెళ్లాడు. భర్త మీద కోపంతో రమాదేవి.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

దాంతో ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్‌(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత గ్యాస్‌ లీక్‌ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది రమాదేవి. ఈ లోపే స్థానికులు అక్కడికి చేరుకుని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement