godavarikhani
-
చెల్లికి ఫోన్ చేసి.. బావను చంపేసిన అన్న
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ప్రేమపెళ్లి వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. ‘నిన్ను చూడాలని ఉంది చెల్లీ.. సద్దుల బతుకమ్మకు మీ ఇంటికి వస్తున్నా’అని తన చెల్లికి ఫోన్ చేశాడు ఓ అన్న. నిజమేనని నమ్మిన ఆ చెల్లి.. తన భర్తను ఎదురు పంపించింది. అయితే అన్నతోపాటే, ఆమె మాజీ భర్త ఇంటికి చేరుకున్నారు. వచ్చీరాగానే చెల్లిని ఓ గదిలో బంధించిన అన్న.. బయట గడియపెట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో చెల్లి భర్తపై దాడిచేసి చంపేశాడు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏసీపీ రమేశ్ కథనం ప్రకారం.. యైటింక్లయిన్‌కాలనీలోని హనుమాన్‌నగర్‌కు చెందిన వడ్డాది వినయ్‌కుమార్(25) గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నాడు. అదే ఏరియాకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకోగా, రెండు కుటుంబాలు అంగీకరించలేదు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ సాగుతుండగానే వినయ్ ఆ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. యైటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌లో ఇంట్లో ఇద్దరూ అద్దెకు ఉంటున్నారు. అయితే తమ కొడుకు ఇష్టాన్ని కాదనలేక వినయ్ తల్లిదండ్రులు అద్దె ఉంటున్న ఇంటి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.చదవండి: కట్టుకున్నోడే కాలయముడయ్యాడుఅయితే సద్దుల బతుకమ్మ వేడుకను సాకుగా తీసుకున్న ఆ వివాహిత సోదరుడు.. ఆమెకు ఫోన్‌చేసి చూడాలని ఉందన్నాడు. అడ్రస్ తెలియదని, వినయ్‌ను తన వద్దకు పంపించాలని కోరాడు. ఇది నిజమని నమ్మిన ఆమె వినయ్‌కు విషయం చెప్పి తన అన్నను తీసుకురమ్మని పురమాయించింది. వినయ్ వివాహిత అన్నను తీసుకొని ఇంటికొచ్చాడు. ఆయన వెంట మాజీ భర్త కూడా వచ్చాడు. ఇంటికి రాగానే వివాహిత అన్న, మాజీ భర్త వినయ్‌పై విచక్షణా రహితంగా దాడిచేశారు. కత్తితో పొడిచి హత్య చేశారు. ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ ప్రసాద్‌రావుతో కలిసి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మిన్నంటిన రోదనలుకాగా కాలనీలో ఒక వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా మరో వైపు హత్య జరగడంతో సంచలనంగా మారింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఏకైక కుమారుడు హత్యకు గురికావడంతో ఆ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ప్రేమపెళ్లే తన కుమారున్ని పొట్టనబెట్టుకుందని మతుని తండ్రి కుమార్ రోధిస్తూ వెల్లడించారు. -
అమ్మా! వద్దు.. వద్దంటున్నా..
గోదావరిఖని: ‘అమ్మా.. వద్దు వద్దు! నువ్వు ఏం జేస్తున్నవో నాకు తెలుస్తలేదు.. ఆ పని చేయొద్దమ్మా.. నాకు భయమేస్తుంది అమ్మా!’అని కూతురు వారిస్తున్నా వినకుండా ఓ వివాహిత, ఓ వ్యక్తితో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం ఈ ఘటన జరిగింది.పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన చొప్పరి అంజయ్య, మాధవి భార్యాభర్తలు. ఉపాధి కోసం వారు పదేళ్ల క్రితం గోదావరిఖని విఠల్‌నగర్‌కు వలస వచ్చారు. అంజయ్య సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల వయసున్న రితిక అనే కూతురు ఉంది. తిలక్‌నగర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి ఎండీ యూసుఫ్ కుటుంబసభ్యులతో అంజయ్య, మాధవి కుటుంబానికి ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.ఈ క్రమంలో యూసుఫ్ తరచూ వీరి ఇంటికి వచ్చివెళ్లేవాడు. మాధవి, యూసుఫ్ ఫోన్లో కూడా మాట్లాడుకునేవారు. అంజయ్య శనివారం ఉదయం సెంట్రింగ్ పనులు చేసేందుకు గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామానికి వెళ్లాడు. ఏం జరిగిందో ఏమోకానీ.. యూసుఫ్‌తో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉదయం 10 గంటల సమయంలో మాధవి (30) ఉరివేసుకుంది. ఉరివేసుకుంటుండగా పక్కనే ఉన్న ఆమె కూతురు అమ్మా వద్దు వద్దు.. అని వారించినా వినలేదు. తన భార్య మరణం విషయంలో యూసుఫ్‌పై అనుమానంగా ఉందని మృతురాలి భర్త అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే
మంథని: నీరు లేక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ‘అధికార యంత్రాంగం స్పందించి ఇప్పటికైనా నీరు అందించి చేతికొచ్చే పంటలను కాపాడాలి.. లేదంటే మాకు చావుతప్ప మారోమార్గం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని – గోదావరిఖని ప్రధాన రహదారిపై మంగళవారం వేలాది మంది రైతులు రాస్తారోకో చేశారు. చేతుల్లో పురుగులమందు డబ్బాలు, వరి గంటలు పట్టుకొని రోడ్డుపై రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు ఉండిపోయారు. వరి పొట్టదశకు చేరిందని, నీరు అందక పంట కళ్లముందే ఎండిపోతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. కాలువ నీరే ఆధారంగా పంటలు సాగుచేస్తే ఎగువన ఉన్న కొందరు రైతులు మోటార్లు పెట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రోడ్డుకు ఇరు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని రైతులను కోరారు. నీటిపారుదల శాఖ ఈఈ బలరాం అక్కడకు చేరుకొని అక్రమంగా విద్యుత్ వినియోగించడంతోపాటు, కాలువలో విద్యుత్ మోటార్లు బిగిస్తున్న విషయంపై తమకు ఫిర్యాదు చేయాలన్నారు. విచా రణ జరిపి వాటిని తొలగించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. -
తమ్ముడికి రాఖీ కట్టేందుకు..ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా!
ఆత్మీయత.. ఆప్యాయత.. సోదరభావం.. భద్రత ఇవన్నీ మిళితమైన సెంటిమెంటే రాఖీ పండుగ. అందుకే అన్నకు చెల్లి... తమ్ముడికి అక్క రాఖీ కట్టి ఆశీర్వాదాలొకవైపు.. అండగా ఉంటా అనే భరోసా మరోవైపు.. ఇలా భిన్న పార్శ్వాలు కనిపించే సెంటిమెంట్ పండుగ రాఖీపౌర్ణమి. అయితే, రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకున్న ఓ చిన్నారి.. కాస్త భిన్నంగా రాఖీని తానే స్వయంగా తయారు చేసిన కథే ఇది. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మామిడి సహస్ర తల్లి ఇంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే, అమ్మతో పాటు కుట్లు, అల్లికలూ ప్రాక్టీస్ చేస్తున్న సహస్రకు ఓ ఆలోచన తట్టిందే ఆలస్యం.. ఓ క్లాత్ తీసుకుని దానిపై పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఆకట్టుకునేలా ఓ రాఖీగా మల్చింది. అంతేకాదు.. తమ్ముడు అని ఎంబ్రాయిడరీ చేసిన ఆ రాఖీని రేపు రాఖీ పున్నమ సందర్భంగా తన సోదరుడికి కట్టబోతోంది చిన్నారి సహస్ర. అలా సహస్ర ఐడియా షాపుకెళ్లి రాఖీ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చేస్తూనే.. అందరికంటే భిన్నమైన రాఖీని తమ్ముడికి కట్టేందుకు కారణమైంది. (చదవండి: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా!) -
ఏ హైదరాబాద్‌కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?
‘సిన్మా తీయాలంటే ఏ హైదరాబాద్‌కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?..’.. ‘ఏతులు గొట్టకుండా సింగిల్ లైన్లో ఒక్కటి చెప్పన్నారా? గోదావరి ఖనిల సిన్మా తియ్యాల్నంటే 100 దళపతులు, 100 రక్తచరిత్రలు తీయొచ్చు..’ .. ఇటీవల గోదావరిఖని నేపథ్యంలో వచ్చింన ‘కొత్త సినిమా’ చిత్రం ట్రైలర్‌లోని సంభాషణలివి.. ఇవి కేవలం సినిమాలో డైలాగులు మాత్రమే కాదు. జరుగుతున్న వాస్తవం కూడా. ఒకప్పుడు కేవలం బొగ్గు వెలికితీతకు కేంద్రంగా మాత్రమే సింగరేణి పారిశ్రామిక ప్రాంతానికి గుర్తింపు ఉండేది. అడపాదడపా సినిమాల షూటింగులు జరిగినా.. కార్మిక హక్కుల కోసం తీసిన సినిమాల్లో ఒకట్రెండు సన్నివేశాలనే చిత్రీకరించారు. కాలక్రమంలో పరిస్థితి మారింది. నాలుగేళ్ల కింద గనుల నేపథ్యంలో విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా మంచి జనాదరణ దక్కించుకుంది. ఓపెన్ మైన్లలో పోరాట సన్నివేశాలు ఆ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. అలాంటి సన్నివేశాలు, పోరాట దృశ్యాలు ఉండాలని కొందరు సినీహీరోలు, దర్శకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గనులకు నిలయమైన గోదావరిఖనికి ఆదరణ పెరిగింది. ఎన్నో ప్రత్యేకతలతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) గోదావరి లోయను ఆనుకుని సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఉంది. విశాలమైన గోదావరి నది, దాని లోయను ఆనుకుని ఏర్పడిన సింగరేణి గనులు, ఎన్టీపీసీ, బొగ్గురవాణా కోసం ఏర్పాటైన ప్రత్యేక రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీలు, కన్వేయర్ బెల్టులు, 40 నుంచి 50 అడుగుల ఎత్తయిన భారీ డంపర్లు, క్రేన్లు ఇలా భారీ యంత్రాలు, హంగామా వంటివి ఇక్కడ కనిపిస్తాయి. రెండు రకాల గనులతో.. ఇక్కడి గనుల్లో రెండు రకాలు ఉంటాయి. బొగ్గు నిక్షేపాలను గుర్తించిన కొత్తలో ఏటవాలుగా క్రమపద్ధతిలో లోపలికి తవ్వి బొగ్గు తీస్తే అది భూగర్భ మైనింగ్. నిల్వలు చివరిదశకు వచ్చాక పేలుళ్లతో మిగతా బొగ్గును వెలికితీసి, భారీ యంత్రాలతో తరలిస్తే ఓపెన్‌కాస్ట్ (ఉపరితల మైనింగ్). ఇవి వందల మీటర్ల లోతు వరకు ఉంటాయి. బొగ్గు కోసం నిత్యం జరిపే పేలుళ్లతో బొగ్గు పెళ్లలు వందల అడుగులు పైకెగిరి పడుతూ ఉంటాయి. ఆ బొగ్గును తరలించేందుకు భారీ క్రేన్లు, డంపర్లు ఉంటాయి. బయటి ప్రాంతాల వారికి ఇదంతా కొత్త ప్రపంచం. కేజీఎఫ్ సినిమా కూడా ఇలాంటి ఓపెన్ కాస్ట్ ఇనుప ఖనిజం గనుల్లో తీసిందే కావడం గమనార్హం. మెల్లగా పెరుగుతున్నషూటింగ్లు.. భారీ యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సింగరేణి ఓపెన్ కాస్టుల్లో షూటింగులు పెరుగుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రంలోని పలు యాక్షన్ సన్నివేశాలను ఇటీవలే సెంటినరీ కాలనీ సమీపంలోని ఓపెన్‌కాస్టుల్లో షూట్ చేశారు. నాని నటించిన ‘దసరా’ సినిమా పూర్తిగా గోదావరిఖని పట్టణానికి ఆనుకుని ఉన్న ‘వీర్లపల్లె’ నేపథ్యంగా వచ్చింనదే. ఆ చిత్రాన్ని కూడా ఓపెన్‌కాస్టు గనుల్లోనే చిత్రీకరించారు. ఇక జాతిరత్నాలు సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు అనుదీప్ తొలిచిత్రం ‘పిట్టగోడ’ కూడా గోదావరిఖని నేపథ్యంలో తీసినదే. ఇక ఇటీవల విడుదలైన క్రైం థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ‘సిరోంచ’ పేరుతో తీసిన సినిమాను నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఆ సినిమా నచ్చింనవారు దర్శకుడికి ఇప్పటికీ డబ్బులు పంపుతున్నారు. ఇవే కాకుండా ‘కొత్త సినిమా’ పేరుతో ఒక చిత్రం, మరికొన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకొంటున్నాయి. గతంలో ఆర్.నారాయణమూర్తి చీకటిసూర్యులు, రానా నటించిన లీడర్ వంటి సినిమాల్లోని పలు సీన్లను ఈ ప్రాంతంలోనే చిత్రీకరించారు. సినిమా షూటింగ్‌లకు అనుకూలం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం సినిమా షూటింగ్‌లకు ఎంతగానో అనుకూలం. సలార్ సినిమా షూటింగ్ ఓసీపీ–2లో రెండువారాల పాటు సాగింది. భూగర్భగనులు, ఓసీపీలు, ఓబీ ప్రాంతాల్లో షూటింగ్‌లు చేయవచ్చు. సినిమాలతోపాటు టెలిఫిల్్మలు, చిన్న సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. – కె.నారాయణ, ఆర్జీ–1 గని జనరల్ మేనేజర్ -
గోదావరిఖని.. ఇక పర్యాటక గని!
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పర్యాటక శోభను సంతరించుకుంటోంది. మూతపడిన జీడీకే 7 ఎల్ఈపీ గనికి సింగరేణి అధికారులు కొత్తరూపు ఇస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు సింగరేణి టూరిజం ప్యాకేజీని టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టడంతో ఈ నెల 27 నుంచే పర్యాటకులు ఇక్కడకు రానున్నట్లు తెలుస్తోంది. సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్ మూడు ఏరియా జీఎంలు కె.నారాయణ, ఎ.మనోహర్, టి.వెంకటేశ్వర్రావుతో కలిసి 7 ఎల్ఈïపీ గనిని సందర్శించారు. సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనులు అంటే అందరికీ తెలిసినప్పటికీ భూగర్భ గనిలోకి కార్మికులు ఎలా వెళ్తారు..? ఉత్పత్తి ఎలా తీస్తారు..? రక్షణ చర్యలు ఎలా ఉంటాయి..? ఇలా అనేక సందేహాలను పర్యాటకులకు నివృత్తి చేసేలా సింగరేణి చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే మొదటిసారిగా సింగరేణి సహకారంతో ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ సిద్ధం చేస్తోంది. ఇటీవల రామగుండంకు వచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్జీ–2 ఏరియాలోని వకీల్‌పల్లి గనిని కుటుంబసభ్యులతో సందర్శించారు. బొగ్గు గనులు, ఇక్కడి ప్రాజెక్టులతో కలిపి ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ చేస్తే బాగుంటుందని ప్రకటించిన ఆయన ప్యాకేజీకి సహకరించాలని సింగరేణికి లేఖ రాశారు. సింగరేణి బొగ్గు గని, ఓసీపీ, పవర్ ప్లాంట్‌తోపాటు రాబోయే రోజుల్లో పార్వతీ బ్యారేజీ, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పర్యాటకస్థలాలను పొందుపర్చనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఎండీ శ్రీధర్‌కు లేఖ రాయడంతో టూరిజం ప్యాకేజీ పనుల్లో వేగం పెరిగింది. టూర్ ఇలా.. హైదరాబాద్ నుంచి బయల్దేరే టూరిస్టులు మార్గమధ్యంలో లోయర్ మానేర్ డ్యాం సందర్శిస్తారు. ళీ అక్కడి నుంచి జీడీకే–7 ఎల్ఈపీ గనికి చేరుకుంటారు. అక్కడ సింగరేణి ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ ద్వారా సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం, రక్షణ చర్యల గురించి వివరిస్తారు. ళీ ఇందుకు యైటింక్లయిన్ కాలనీలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తారు. ళీ అక్కడ భోజనాలు ముగిసిన తర్వాత ఓసీపీ–3 వ్యూపాయింట్ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఓసీపీ–3లో జరిగే బ్లాస్టింగ్ చూపిస్తారు. ళీ అక్కడి నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్‌కు తీసుకెళ్లి విద్యుదుత్పత్తి తీరును వివరిస్తారు. -
ఉద్రిక్తతల మధ్య పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ
గోదావరిఖని: ఉద్రిక్తతల మధ్య పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగింది. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలో పర్యావరణ ఉల్లంఘన కింద మూసివేసిన మేడిపల్లి ఓసీపీ శుక్రవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్‌కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజినల్ ఇంజనీర్ భిక్షపతి ఆధ్వర్యంలో సభ కొనసాగింది. ప్రభావిత గ్రామాలైన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని లింగాపూర్, మేడిపల్లి, పాములపేట, రామగుండం గ్రామాలకు చెందిన ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాలపై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ ఆధ్వర్యంలో రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, వన్‌టౌన్ రెండో సీఐ ప్రసాద్‌రావు, మంథని సీఐ సతీశ్‌తో బలగాలు మోహరించాయి. -
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె
గోదావరిఖని (రామగుండం)/సింగరేణి(కొత్తగూడెం): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని కార్మికులు విధులు బహిష్కరించారు. మరోమూడు రోజుల తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తామని.. సమ్మె యోచన విరమించాలని యాజమాన్యం గురువారం కోరినా కాంట్రాక్టు కార్మిక సంఘాలు ససేమిరా అన్నాయి. సింగరేణి వ్యాప్తంగా సుమారు 23 వేల మంది కాంట్రాక్టు కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భూపాలపల్లి, ఆర్జీ–1,2,3, ఏపీఏ, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో పలు విభాగాల్లో పనులు నిలిచిపోయాయి. అత్యవసర విభాగాల్లో మాత్రం పనులు కొనసాగాయి. డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె.. పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమను యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం స్పందించి డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలని, సీఎంపీఎఫ్ అమలు చేయాలని, లాభాల్లో వాటా ఇవ్వాలి, కార్మికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న అన్నీ సమస్యలు పరిష్కరించాలని, కేటగిరీ ఆధారంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని, రామగుండం, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద వివిధ రూపాల్లో కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. భూపాలపల్లిలో రాస్తారోకో, మణుగూరులో ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ నాయకులు, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
రెండుసార్లు హత్యాయత్నం.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడిని ఇద్దరు వ్యక్తులు పిస్తోల్‌తో కాల్చిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కోరుకొప్పుల మొండయ్య అమృత దంపతుల కుమారుడు రాజేందర్‌కు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామానికి చెందిన రవళితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య (7), కార్తికేయ (4) సంతానం. రాజేందర్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–7లో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నాడు. అయితే రాజేందర్ శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. సుమారు 1.30 గంటల నుంచి రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే నిద్రిస్తున్న రాజేందర్‌పై వెంట తెచ్చుకున్న పిస్తోల్‌తో కుడివైపు కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఉదయం ఐదు గంటలవరకూ నిందితులు రాజేందర్ ఇంటిముందున్న గద్దెపైనే కూర్చున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత వివాహేతర సంబంధమే కారణమా? రవళికి పెళ్లికి ముందే తన మేనబావ, కిష్టంపేట్‌కు చెందిన బందం రాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపించాలని భావించింది. కొన్నాళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న రాజేందర్‌ను కారుతో ఢీకొట్టి చంపించేందుకు ప్రయత్నించగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి ఇంటిముందు గేట్‌కు కరెంట్ పెట్టి చంపాలని ప్రయత్నించగా..దాన్ని కూడా ప్రమాదంగానే రాజేందర్ భావించాడు. అయితే తాజా ఘటనతో అవి ప్రమాదంగా పరిగణించలేమని స్థానికులు చెబుతున్నారు. హత్య సమయంలో రవళి బాత్రూమ్లోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్, కోడలు రవళి కలిసి తమ కొడుకును తుపాకీతో కాల్చి చంపినట్లు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు సాంకేతిక ఆధారాలతో నిందితులను మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్‌స్క్వాడ్ బృందాన్ని రప్పించి తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ట్‌వెపన్‌తో కాల్చారు.. షార్ట్‌వెపన్‌తో కాల్చినట్లు భావిస్తున్నాం. నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. హత్యకు వాడింది లైసెన్స్డ్ వెపనా..? లేక దేశీ కట్టా వెపనా..? తేలాల్సి ఉంది. హత్యకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. –రూపేష్, పెద్దపల్లి డీసీపీ -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడిని ఇద్దరు వ్యక్తులు పిస్తోల్‌తో కాల్చిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కోరుకొప్పుల మొండయ్య అమృత దంపతుల కుమారుడు రాజేందర్‌కు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామానికి చెందిన రవళితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య (7), కార్తికేయ (4) సంతానం. రాజేందర్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–7లో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నాడు. అయితే రాజేందర్ శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా..సుమారు 1.30 గంటల నుంచి రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే నిద్రిస్తున్న రాజేందర్‌పై వెంట తెచ్చుకున్న పిస్తోల్‌తో కుడివైపు కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఉదయం ఐదు గంటలవరకూ నిందితులు రాజేందర్ ఇంటిముందున్న గద్దెపైనే కూర్చున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధమే కారణమా? రవళికి పెళ్లికి ముందే తన మేనబావ, కిష్టంపేట్‌కు చెందిన బందం రాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపించాలని భావించింది. కొన్నాళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న రాజేందర్‌ను కారుతో ఢీకొట్టి చంపించేందుకు ప్రయత్నించగా..త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి ఇంటిముందు గేట్‌కు కరెంట్ పెట్టి చంపాలని ప్రయత్నించగా..దాన్ని కూడా ప్రమాదంగానే రాజేందర్ భావించాడు. అయితే తాజా ఘటనతో అవి ప్రమాదంగా పరిగణించలేమని స్థానికులు చెబుతున్నారు. హత్య సమయంలో రవళి బాత్రూమ్లోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్, కోడలు రవళి కలిసి తమ కొడుకును తుపాకీతో కాల్చి చంపినట్లు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు సాంకేతిక ఆధారాలతో నిందితులను మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్‌స్క్వాడ్ బృందాన్ని రప్పించి తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ట్‌వెపన్‌తో కాల్చారు.. షార్ట్‌వెపన్‌తో కాల్చినట్లు భావిస్తున్నాం. నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. హత్యకు వాడింది లైసెన్స్డ్ వెపనా..? లేక దేశీ కట్టా వెపనా..? తేలాల్సి ఉంది. హత్యకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. –రూపేష్, పెద్దపల్లి డీసీపీ -
అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అందుబాటులోకి..
గోదావరిఖని/కందుకూరు: దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో రూ.423 కోట్లతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పారు. అనంతరం జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సందర్భంగా అధికారులు రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్‌షిప్‌లోని కాకతీయ ఫంక్షన్హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పెద్ద డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రారంభించిన అనంతరం ఎన్టీపీసీ సీజీఎం సునీల్ మాట్లాడుతూ ఈ ప్లాంట్‌ను దశలవారీగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ ఆవరణలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టు స్టేజీ–1లో రెండు యూనిట్ల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ రెండోవారంలో ట్రయల్‌కు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. భారత్ అగ్రగామిగా నిలవాలి: కిషన్‌రెడ్డి. విద్యుత్ సంస్కరణలతో రానున్న 25 ఏళ్లల్లో విద్యుత్ ఉత్పాదనలో ప్రపంచ దేశాల్లోనే మనదేశం అగ్రగామిగా నిలిచేలా ప్రధాని మోదీ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య పవర్ 2047 పేరుతో పీఎం మోదీ, కేంద్ర విద్యుత్ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల పరిషత్ సమావేశ మందిరం నుంచి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్‌కు 40 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. బోరుబావులకు ఎలాంటి మీటర్లు పెట్టడం లేదని, అయినా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న చర్యల కారణంగా రైతులకు యూరియా బాధలు తప్పాయని చెప్పారు. కార్యక్రమంలో పవర్‌గ్రిడ్ ఈడీ రాజేశ్ శ్రీవాత్సవ, సీనియర్ జీఎంలు హరినారాయణ, జీవీ రావు, పీవీఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
సింగరేణి(కొత్తగూడెం)/గోదావరిఖని: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో రోజుకు 1.24లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలు ప్రారంభమైన రెండుమూడ్రోజుల్లో నామమాత్రంగా బొగ్గు ఉత్పత్తి సాగినా, ఆ తర్వాత ఓవర్‌బర్డెన్ వెలికితీత పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 25 భూగర్భగనులు, 20 ఓపెన్‌కాస్ట్ (ఓసీ) గనుల్లో వర్షాకాలం కారణంగా తగ్గించిన లక్ష్యం మేరకు రోజుకు 1.84 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ, ఓసీల్లో 45 వేల టన్నులు, భూగర్భగనుల్లో 15 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు కూడా స్తంభించిపోయింది. కొత్తగూడెం ఏరియా నుంచి రోజుకు సుమారు 32 వేల టన్నుల బొగ్గు రవాణా జరగాల్సి ఉండగా, రోజుకు 8 వేల టన్నుల బొగ్గునే రవాణా చేస్తున్నారు. మొత్తంగా గత వారం నుంచి సింగరేణి పరిధిలో 9.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లగా, వారంలో రూ.300 కోట్ల మేర ఆదాయం మేర నష్టం జరిగినట్లు చెబుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 730 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
‘ఈ లోకంలో బతకాలని లేదు.. అమ్మా జాగ్రత్త’
గోదావరిఖని: ‘ఈ లోకంలో బతకాలని లేదు.. అమ్మా జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసు కున్నాడు. గోదావరిఖనిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం.. స్థానిక ఎల్బీ నగర్‌కు చెందిన శ్రీరాముల అరవింద్(27) సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొద్ది కాలం కిందటే అతని తండ్రి చనిపోయారు. అర వింద్ ఇంట్లో తల్లితోనే ఉంటూ.. వర్క్ ఫ్రం హోంచేస్తున్నాడు. సోమ వారం ఉరేసుకుని మృతి చెందాడు. ఇటీవల మరో కంపెనీలో ఉద్యోగం లో చేరిన అతడు, పని ఒత్తిడి తట్టు కోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ‘ఈ లోకంలో బత కడం ఇష్టం లేకనే చనిపోతున్నా.. అమ్మా జాగ్రత్త’ అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. చదవండి: పెళ్లయిన మూడో రోజే గొంతు కోసుకొని నవ వరుడి ఆత్మహత్య -
12 మీటర్ల లోతైన బ్లాస్టింగ్ హోల్లో పడిన శునకం.. సింగరేణి ఉద్యోగుల సాహసం
సాక్షి, గోదావరిఖని(పెద్దపల్లి): దారి తప్పి ఓసీపీ క్వారీ బ్లాస్టింగ్ ప్రాంతంలోకి శునకం పరుగెత్తుకొచ్చింది. బ్లాస్టింగ్ సిబ్బంది ఎక్స్‌ప్లో జివ్ నింపడంలో బిజీ అయ్యారు. అంతలోనే అటుగా వేగంగా వచ్చిన కుక్క 12 మీటర్ల లోతులో ఉన్న బ్లాస్టింగ్ హోల్లో పడిపోయింది. గమనించిన కార్మికులు కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో బ్లాస్టింగ్ ఇన్చార్జి డిప్యూటీ మేనేజర్ సంపత్‌కుమార్‌కు సమాచారం అందించారు. బ్లాస్టింగ్ హోల్లోకి పంపే తాడు చివరన ఐరన్ గొలుసు కట్టి లోపల ఉన్న కుక్క పట్టుకునేందుకు గొలుసుమధ్యలో కర్ర కట్టారు. దీంతో 12మీటర్ల లోతున ఉన్న కుక్క దాన్ని పట్టుకోవడంతో చాకచక్యంగా తాడుతో బయటకు లాగారు. బయటకు వచ్చిన శునకం బతుకు జీవుడా అంటూ పరుగుపెట్టింది. సింగరేణి ఉద్యోగులు, అధికారులను ఆర్జీ–2 జీఎం టీవీరావుతో పాటు పలువురు అభినందించారు. చదవండి: ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రెండేళ్లు కలిసి తిరిగాక.. -
సింగరేణి గని చూసొద్దామా?
గోదావరిఖని: మీరెన్నడూ బొగ్గుగని చూడలేదా..? మరి ఇప్పుడు కుటుంబంతో సహా చూడాలనుకుంటున్నారా? అయితే.. సింగరేణిలో భూగర్భగని టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు.. సౌకర్యాల కల్పనపై కేంద్ర బొగ్గుగనుల శాఖ ఆదేశాల మేరకు సింగరేణి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో సింగరేణి కూడా ఓ పర్యాటక ప్రాంతంగా మారబోతోంది. ఇందులో భాగంగా ఇటీవలే మూసివేసిన జీడీకే–7ఎల్ఈపీ గనిని దీనికోసం ఎంపిక చేయాలని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు గనిలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించా రు. ఇప్పటికే కోలిండియాలో ఇలాంటివి రెండు గనులు ఉండగా.. సింగరేణిలోనూ ఏర్పాటు చేయబోతున్నారు. సాంకేతిక కమిటీ పరిశీలించి గనిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎలాంటి సదుపాయాలు కల్పించాలి. రక్షణపరంగా సమస్యలేమిటి?.. ఇలా అనేక కోణా ల్లో పరిశీలించి నివేదిక అందిస్తుంది. 12 దశాబ్దాల చరిత్ర ఉన్న సింగరేణిలో ఎన్నో భూగర్భగనులు, ఓసీపీలను యాజమాన్యం మూసివేసింది. కానీ టూరిజం స్పాట్లుగా ఎక్కడా అభివృద్ధి చేయలేదు. గనిని పరిశీలించిన సాంకేతిక బృందం గోదావరిఖని పట్టణం సమీపంలోనే ఉన్న ఆర్జీ– 2 ఏరియా జీడీకే– 7ఎల్ఈపీ గనిని గురువారం సాంకేతిక కమిటీ పరిశీలించింది. ముందుగా మేనేజర్ కార్యాలయంలో గనికి సంబంధించిన మ్యాప్‌ను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ బృందంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జీఎం సుభాని, సేఫ్టీ జీఎం గురువయ్య, జీఎం సీపీపీ నాగభూషణ్‌రెడ్డి, ఎన్విరాన్మెంట్ జీఎం కొండయ్య, సివిల్జీఎం రమేశ్‌బాబు ఉన్నారు. అదృష్టమే.. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు రావడంతో సంస్థ సీఎండీ, ఇటీవలే మూసివేసిన గనిని ఎంపిక చేసి టెక్నికల్ కమిటీని అధ్యయనానికి పంపడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతం టూరిజంలో అభివృద్ధి చెందుతుంది. సింగరేణి గనులను కుటుంబంతో సహా చూసే అవకాశం ప్రజలకు దక్కుతుంది. – సుభాని, ఆర్అండ్డీ జీఎం టీం కన్వీనర్ -
కోడిపుంజుకు టికెట్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఆర్టీసీ బస్సులో కోడిపుంజుకు టికెట్.. అదీ ఫుల్ టికెట్ కొట్టిన ఘటన సోషల్ మీడియా ద్వారా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. దీనిపై ఇంటర్నెట్లో సెటైర్లు పేలుతున్నాయి. అలా విషయం తన దాకా రావడంతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్‌కు వెళ్తోంది. దారిలో రామగుండం బి పవర్‌హౌస్ వద్ద మహ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సెక్కాడు. కూడా ఓ కోడిని సంచితో దాచిపెట్టుకుని వెళ్తున్నాడు. బస్సు సుల్తానాబాద్‌కు చేరుకోగానే బస్సు కుదుపులకు పుంజు ఒక్కసారిగా అరిచింది. గమనించిన కండక్టర్ తిరుపతి కోడిపుంజుకు కూడా రూ. 30 టికెట్ తీసుకోవాలని గద్దించాడు. దీంతో చేసేది లేక అలీ టికెట్ తీసుకున్నాడు. ఈ విషయం టికెట్ ద్వారా సామాజిక మాధ్యమాలకు ఎక్కింది. ఇది చూసిన నెటిజన్లు ఆర్టీసీపై దుమ్మెత్తి పోశారు. ఏం జరిగిందంటే.. ఈ ఘటనలో ఏం జరిగిందో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్సుల్లో పశుపక్ష్యాదులకు అనుమతి లేదు. సుల్తాన్‌బాద్ దగ్గర కోడిపుంజును గుర్తించాక కండక్టర్ ఆ ప్రయాణికుడ్ని ప్రశ్నించాడు. అయితే అదే బస్సులో ఉన్న శ్రీ కుమార్ అనే ఓ న్యూస్ రిపోర్టర్.. కండక్టర్‌ను టికెట్ కొట్టమని వుసిగొల్పాడట. హాట్ న్యూస్ కోసం ఆ రిపోర్టర్ అలా ప్రోత్సహించగా.. కండక్టర్ ఆ ప్రభావంతో కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. కండక్టర్ ఆ రిపోర్టర్ చెప్పినట్లు.. అలా ప్రవర్తించాల్సింది కాదు. కండక్టర్ మీద చర్యలు తీసుకుంటాం అని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఘటనపై స్పందించిన డిపో మేనేజర్ వెంకటేశం చర్యలకు ఆదేశించినట్లు ప్రకటించగా.. ట్విటర్లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. pic.twitter.com/kVdLhLzy86 — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 9, 2022 సంబంధిత వార్త: పదేళ్లు కూడా బతకని కోడికి ఫుల్ టికెట్?? -
సింగరేణిలో కొత్త ఓసీపీ
గోదావరిఖని: సింగరేణిలో శనివారం మరో ఓపెన్ కాస్ట్‌గని (ఓసీపీ) ప్రారంభం కానుంది. పెద్దపల్లి జిల్లాలోని ఈ గనిలో 33 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. 11 సంవత్సరాల పాటు ఏటా 3 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీయనున్నారు. రూ.471 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అధికారులు ప్రభావిత గ్రామాలైన సుందిళ్ల, ముస్త్యాల, జనగామల్లో ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేశారు. ఇప్పటికే ఓబీ పనులు ప్రారంభమయ్యాయి. సంస్థలో ప్రస్తుతం 18 ఓసీపీలు ఉన్నాయి. కొత్త ఓసీపీ ఏర్పాటుతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు చేతులమీదుగా గనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా ఓసీపీలో పేలుళ్ల కారణంగా ఇబ్బందులు వస్తాయని, అలాగే భూగర్భ జలాలు అడుగంటి పోతాయనే ఆందోళన ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో నెలకొంది. కాగా, సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
వైద్యులూ.. వెల్డన్
కోల్‌సిటీ(రామగుండం)/ఆసిఫాబాద్ అర్బన్: కరోనా సోకిన ముగ్గురు గర్భిణులకు కాన్పులు చేసి విధి నిర్వహణపట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన గోదావరిఖని, ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందిని పలువురు అభినందించారు. మంథని మండలం వెంకటాపూర్, అంతర్గాం మండలం మర్రిపల్లికి చెందిన ఇద్దరు గర్భిణులకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కరోనా టెస్టులు చేయగా వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకరి తర్వాత మరొకరికి వైద్యులు కాన్పులు చేశారు. రిస్క్ కేస్ అయినప్పటికీ గైనకాలజిస్టు డాక్టర్ కల్యాణి, అనస్తీషియా డాక్టర్ మోహన్‌రావు, స్టాఫ్‌నర్స్ రుద్రమ పీపీఈ కిట్లు ధరించి ఆ గర్భిణులకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్ చేశారు. ఇద్దరికీ ఆడశిశువులే జన్మించారు. తల్లులు, శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని, వారిని కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన జాడి సింధూజకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించగా సిబ్బంది అంబులెన్‌లో తీసుకెళ్లి రాత్రి 7 గంటలకు అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి పురిటినొప్పులు రావడంతో సూపరింటెండెంట్ స్వామి సూచనల మేరకు డాక్టర్ నవీద్, స్టాఫ్ నర్సులు ప్రీత, సుదీవన పీపీ కిట్లు ధరించి, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పు చేశారు. సుఖ ప్రసవం చేసిన వైద్య సిబ్బందికి గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
మీదపడిన మృత్యువు
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో 2 నెలల పసికందు ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ వైపు వెళ్లేందుకు గోదావరిఖని గంగానగర్ ఫ్లైఓవర్‌పైకి ఎక్కుతున్న బొగ్గు లోడు లారీని మంచిర్యాల వైపు వెళ్తున్న బూడిద లోడు లారీ అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో రెండు లారీలు రెండు పక్కలకు పడిపోయాయి. ఈ క్రమం లో మంచిర్యాల వైపు వెళ్తున్న లారీ.. పక్కనే ఆగి ఉన్న ఆటోపై పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ సహా 8 మందిలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను రామగుండం ముబారక్‌నగర్‌కు చెందిన షేక్ షకీల్ (28), భార్య షేక్రేష్మా (22), చిన్న కుమార్తె షేక్ సాధియా ఉమేరా (2 నెలలు)గా గుర్తించారు. డ్రైవర్ రహీంబేగ్, షేక్‌హుస్సేన్, షేక్ షకీల్ పెద్ద కుమారుడు షేక్ షాకీర్, రెండో కూతురు షేక్‌షాదియా, తమ్ముడు తాజ్‌బాబా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంచిర్యాల జిల్లా ఇందారంలో జరిగే బంధువుల ఫంక్షన్ కోసం షకీల్ తన తండ్రి హుస్సేన్‌తో కలిసి ఆటోలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. -
చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు... వీటిని మనుషులు తింటే భయంకరమైన వ్యాధులు
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): చెత్తలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాలు కూడా కాసులు కురుపిస్తున్నాయి. కోళ్లను కోసిన అనంతరం వ్యర్థంగా పడేసే ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. ఏడాదంతా ఇదే దందా. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా ఈ వ్యర్థాలను రహస్యంగా పొరుగు జిల్లా మంచిర్యాలలోని చేపల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను తిన్న చేపలను మనుషులు తింటే క్యానర్స్వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ‘సాక్షి’ చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో మాఫియా దందా బయటపడింది. నమ్మలేని నిజాలు అనేకం వెలుగు చూశాయి. ఈ మాఫియా దందా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఫిషరీష్ తదితర శాఖల అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతినెలా మాఫియా ముట్టజెప్పే కాసులకు కక్కుర్తిపడి ఈ దందాపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్న యువకులు మాఫియాకు చికెన్ మార్కెట్ల అడ్డా... రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం, ఎఫ్‌సీఐ తదితర ప్రాంతాల్లోని చికెన్ మార్కెట్లు మాఫియాకు అడ్డాగా మారుతున్నాయి. పక్క జిల్లాకు సంబంధించిన ముఠా బహిరంగంగా ఈ దందా నిర్వహిస్తోంది. ఈ ముఠాకు బల్దియా అధికారులతోపాటు చికెన్ మార్కెట్ వ్యాపారులు సహకరిస్తున్నారు. చికెన్ వ్యర్థాల సేకరణే టార్గెట్.. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొందరు ముఠా సభ్యులు ప్రత్యేక వాహనాల్లో చికెన్ మార్కెట్లకు చేరుకుంటారు. వాహనంలో ముందుగానే ఏర్పాటు చేసుకున్న భారీ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కోళ్ల నుంచి తీసిన పేగులు, తల, కాళ్లు, చర్మం, ఈకలు సేకరిస్తారు. ఇలా ఒక్కో ట్రిప్పుకు సుమారు నాలుగు టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారు. పక్కా రూట్ మ్యాప్ ద్వారా సేకరణ చికెన్ వ్యర్థాలను సేకరించడానికి ఈ మాఫియా పక్కా రూట్ మ్యాప్ అమలు చేస్తోంది. ముందుగా గోదావరిఖని చికెన్మార్కెట్కు చేరుకుని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల నుంచి భారీ ఎత్తున వ్యర్థాలను సేకరించిన అనంతరం ఎల్బీనగర్, తిలక్‌నగర్, మార్కండేయకాలనీ, ఫైవింక్లయిన్ మీదుగా యైటింక్లయిన్‌కాలనీ చేరుకుంటుంది. ఈరూట్ మ్యాప్‌లోని అన్ని చికెన్‌సెంటర్ల నుంచి వ్యర్థాలను ముఠా సేకరిస్తుంది. మాఫియాకు సహకరిస్తున్న వ్యాపారులు చికెన్ వ్యర్థాలను సేకరించే మాఫియాకు పారిశ్రామిక ప్రాంతంలోని చికెన్ సెంటర్ల వ్యాపారులు, అసోసియేషన్ నాయకులు సహకరిస్తున్నారని తెలుస్తోంది. గతంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేవారు. అయితే ఈ మాఫియా క్యాట్‌ఫిష్ పెంపకానికి సేకరించడంపై దృష్టి పెట్టడంతో వ్యాపారులు మున్సిపల్ సిబ్బందికి వ్యర్థాలను ఇచ్చేందుకు నిరాకరించారు. వ్యర్థాలను తరలించడానికి ఈ మాఫియా బడా వ్యాపారులు, నాయకులు, అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యర్థాల అక్రమమార్గంతో ఆదాయానికి గండి రామగుండం నగరపాలక సంస్థకు వ్యర్థాలు కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా గతంలో నిబంధనలు రూపొందించారు. టన్ను వ్యర్థానికి రూ.వెయ్యి ఆదాయం వస్తుందని అంచనా వేసి వరంగల్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు చికెన్ వ్యర్థాలను సేకరించే పనిని అప్పగించారు. ఇందుకు సదరు కాంట్రాక్టర్ రూ.5వేలు బల్దియాకు ఫీజు రూపంలో చెల్లించారు. ఇలా సేకరించిన వ్యర్థాలను సదరు కాంట్రాక్టర్ రంగారెడ్డి జిల్లాలోని ఓ కంపెనీకి తరలిస్తామనేది ఒప్పందం. ఇలా కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు సుమారు 2 మెట్రిక్ టన్నులకు పైగా కోళ్ల వ్యర్థాలు వెలువడుతాయి. ఈలెక్కన బల్దియాకు రోజుకు రూ.2వేల చొప్పున ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు సదరు కాంట్రాక్టర్‌కు వ్యర్థాలను మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. పైగా కొందరు అధికారుల అండదండలతో ఈ వ్యర్థాలను కాంట్రాక్టర్‌కు కాకుండా అక్రమ మార్గాల్లో చేపల చెరువులకు తరలించడం వివాదాస్పదంగా మారుతోంది. -
తల్లికి కరోనా పాజిటివ్.. బిడ్డకు నెగెటివ్
కోల్‌సిటీ (రామగుండం): కరోనా సోకిన ఓ నిండు గర్భిణికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గురువారం ఆపరేషన్ చేసి పండంటి ఆడ శిశువుకు పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్మ గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. గోదావరిఖనిలోనే ఉంటున్న ఆమె భర్త ప్రతినెలా ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండడడంతో బుధవారం ఆస్పత్రికి రాగా.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, దీనికి ముందుగా కరోనా టెస్ట్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కరోనా టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెకు గురువారం కోవిడ్ నిబంధనల ప్రకారం గైనకాలజిస్ట్ డాక్టర్ కల్యాణి, అనస్థీషియా డాక్టర్ అగర్‌బాబా పీపీఈ కిట్ ధరించి ఆపరేషన్ చేశారు. పుట్టిన ఆడశిశువుకూ కరోనా టెస్ట్ చేయగా.. నెగెటివ్ వచ్చింది. బాలింతను కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు కళ్యాణి, అగర్‌బాబా, స్టాఫ్‌నర్సులు భవాని, లీలా, సిబ్బంది ఆశిష్, ఓదెలును ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎంఓ భీష్మ, కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఇన్చార్జి రాజశేఖర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రాజేంద్రప్రసాద్ తదితరులు అభినందించారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి.. తొమ్మిదో పెళ్లికి రెడీ చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
శభాష్ డాక్టర్.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ప్రశంస
సాక్షి, రామగుండం: గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్‌రెడ్డి బుధవారం కరోనాతో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను స్వయంగా పీపీఈ కిట్‌లో ప్యాక్ చేసి మున్సిపల్ సిబ్బందికి అప్పగించిన తీరుకు.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం రాత్రి ఫోన్ చేసి అభినందించారు. ‘ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో, ఒక డాక్టర్‌గా ఉండి మీరే స్వయంగా రెండు కోవిడ్ మృతదేహాలను ప్యాక్ చేయడం చాలా గొప్ప విషయం. మీరు చేసిన ఈ పని అభినందనీయం. సేవా భావంతోపాటు ధైర్యానికి, నిష్టకు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను. మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు.. నా అభినందనలు’ అంటూ ఫోన్లో సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డిని గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. కోవిడ్ మృతదేహాన్ని ప్యాక్ చేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి చదవండి:హమ్మా.. నేనొస్తే గేటు తీయరా..! -
తెలంగాణ హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం
-
అత్యాచారం, బలవంతపు అబార్షన్: న్యాయవాది
సాక్షి, హైదరాబాద్: అత్యాచారం కేసులో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ మహిళా న్యాయవాది(38) హైకోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. మురళి అనే వ్యక్తి తనను మోసం చేశాడంటూ గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా తనకు బలవంతంగా అబార్షన్ చేయించిన కుటుంబ సభ్యులపై కూడా కేసు పెట్టారు. అయితే తన విషయంలో పోలీసులు సరిగా స్పందించలేదని భావించిన ఆమె.. కోర్టును ఆశ్రయించగా నిందితులకు బెయిల్ వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. తన పట్ల అనుచితంగా వ్యవహరించి వారందరిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ నోట్ రాసి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. (చదవండి: ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి.. మృతి) బాధితురాలు పేర్కొన్న వివరాల మేరకు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బాధితురాలిని మురళి అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ క్రమంలో అతడు సదరు మహిళపై అత్యాచారం చేశాడు. మెసపోయానని గుర్తించిన బాధితురాలు అతడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే ఆమె గర్భవతి కావడంతో కుటుంబ సభ్యులు అబార్షన్ చేయించారు. వేరొకరి పేరిట ఆస్పత్రిలో వివరాలు నమోదు చేయించి ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా గర్భవిచ్చిత్తి చేయించారు. ఈ క్రమంలో తన తమ్ముడు సహా ఐదుగురు వ్యక్తులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మళ్లీ కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. తనకు అన్యాయం చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే కోర్టు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చి.. నిందితులకు బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆవేదనకు గురైన సదరు న్యాయవాది బలవంతంగా ప్రాణాలు తీసుకునేందుకు యత్నించారు. తన జీవితం నాశనమైందని, ఇలాంటి దుస్థితి ఏ అమ్మాయికి రాకూడదంటూ పోలీసులు, కుటుంబ సభ్యుల తీరును తప్పుబట్టారు. తోటి న్యాయవాదులు సైతం తనను ఇబ్బందులకు గురిచేసేలా మాట్లాడారని లేఖలో రాసుకొచ్చారు. తాను సమర్పించిన ఒరిజినల్ సాక్ష్యాధారాలను మాయం చేసి తననో పిచ్చిదానిలా ముద్ర వేసేందుకు ప్రయత్నించారని మనస్తాపం చెందారు. -
తండ్రి అనారోగ్యంతో.. తనయుడు కరోనాతో..
గోదావరిఖని(రామగుండం): అనారోగ్యంతో తండ్రి..కరోనాతో తనయుడు ఇద్దరు పదిరోజుల వ్యవధిలో మృతిచెందడం ఖనిలో విషాదం నింపింది. గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న వొడ్నాల శ్రీనివాస్(35) అనే వ్యాపారిని కరోనా కబలించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్సపొందుతున్న అతడి తండ్రి ఈ నెల 10న అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి తల్లి ఆరేళ్లక్రితమే మృతిచెందింది. తండ్రి కర్మకాండ నిర్వహించాలల్సిన తనయుడు కరోనా బారినపడ్డాడు. తండ్రి చనిపోయిన దుఖంలో ఉన్న తనయుడిని కరోనావైరస్ వెంటాడింది. శ్రీనివాస్ తండ్రి చనిపోయే ముందు నుంచి స్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 15న కరోనా అనుమానంతో గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి వెళ్లగా లక్షణాలు లేకుండా టెస్ట్ చేయలేమని చెప్పడంతో ఇంటికి తిరిగొచ్చాడు. అదేరోజు రాత్రి విపరీతమైన దగ్గుతో బాధపడ్డాడు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రయివేట్ ఆసుపత్రులో చేర్చుకునేందుకు నిరాకరించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రిపోర్టులు ఉంటేనే చేర్చుకుంటామని యశోద ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో చేసేదేమీ లేక వెనుతిరిగి వచ్చారు. చివరగా శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం సమీపంలో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఇంజక్షన్ దొరక్క మరింత విషమం.. శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో ప్రత్యేక ఇంజక్షన్ వేయాలని కుటుంబసభ్యులకు వైద్యులు తెలిపారు. ఆ ఇంజక్షన్ ఎంఆర్పీ ధర రూ.46 వేలు ఉంటే బ్లాక్ మార్కెట్లో రూ.1.40 లక్షల వరకు విక్రయిస్తున్నారని అదికూడా సకాలంలో లభించలేదని పేర్కొన్నారు. డబ్బు ఇచ్చిన తర్వాత నాలుగు గంటలకు ఇంజక్షన్ చేతికి అందిస్తున్నారన్నారు. అయినా కష్టపడి శనివారం మధ్యాహ్నం ఇంజక్షన్ కొనుగోలు చేసి తీసుకువచ్చి వేయించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారడంతో మృతిచెందాడు. ఆసుపత్రిలో రూ.4లక్షల బిల్లు అయ్యిందన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కడసారిచూపునకు నోచుకోని భార్యాపిల్లలు కోవిడ్–19 కరోనా వైరస్‌తో మృత్యువాతపడిన శ్రీనివాస్ మృతదేహాన్ని కడసారి చూపునకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో శవాన్ని తీ సుకెళ్లేందుకు డాక్టర్లు ఒప్పుకోలేదని కుటుంబసభ్యులు వా పోయారు. చేసేదేమీలేక జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు పే ర్కొన్నారు. అయితే మృతుడి భార్య, పిల్లలు ఇంటివద్దే ఉండడంతో కడసారి చూపునకు నోచుకోలేకపోయారు. కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. పదిరోజుల కిందటే ఇంటి పెద్ద, ఆదివారం అతడి కుమారుడు మృతిచెందడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఆర్టీసీలో సంక్షేమ బోర్డులు
గోదావరిఖనిటౌన్ (రామగుండం): ఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ సూచనల మేరకు బస్ డిపోలలో సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేశారు. సంక్షేమ బోర్డులో ఎంపిక చేసిన సభ్యులతో ప్రతీ వారం సమావేశం నిర్వహించి డిపో విధులు నిర్వహిస్తు ఉద్యోగులతో వారి సమస్యలపై సమావేశమవుతారు. సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవడం ఈ బోర్డల లక్ష్యం. డిపోకు ఐదుగురు సభ్యలను నియమిస్తారు. డిపో మేనజర్ ఈ కమిటీకి ముఖ్య అధికారిగా వ్యవహరిస్తారు. ఇద్దరు కార్మికులు, డిపో గ్యారేజీ ఇన్చార్జి, డిపో ట్రాఫిక్ ఇన్చార్జి ఇలా మోత్తం ఐదుగురు సభ్యులు ప్రతీవారం సమావేశమై డిపో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌ల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తారు. సమావేశం ఇలా..... ప్రస్తుతం ఆర్టీసీ డిపో నియమించిన సంక్షేమ కమిటీ అన్ని విషయాలలో కీలకంగా పని చేస్తుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించిన విషయాలకు ప్రధాన్యత ఉంటుంది. ఆర్టీసీ పని చేస్తున్న ఉద్యోగుల విధుల కేటాయింపు, జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సెలవులు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు. ఏమైన సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే సంస్థ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ఉద్యోగులకు మరింత మేలు జరిగే విధంగా ఎలాంటి అంశాలనైన ఈ సమావేశంలో పొందుపర్చవచ్చు. వారానికోరోజు, నెలలో నాలుగు రోజు లు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. నెలకు ఒక్కసారి జిల్లా ఆర్ఎం కార్యాలయంలో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేస్తారు. రెండు నెలలకోసారి జోనల్ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్ స్థాయిలో మూడు నెలలకు ఒక్కసారి సమస్యలు పరిష్కరిస్తారు. జిల్లాలో ఇలా... జిల్లాలో గోదావరిఖని, మంథని బస్ డిపోలు ఉన్నాయి. గోదావరిఖని బస్ డిపోలో 129 బస్సు ఉండగా, 640 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మంథని డిపోలో 92 బస్సులు ఉండగా 310 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గోదావరిఖని సంక్షేమ బోర్డు సభ్యులు.. 1. ఎ.కొంరయ్య 2. బి.నారాయణ 3. వి.ఇందిరాదేవి 4. మాధవి 5. డీకే.స్వామి మంథని సంక్షేమ బోర్డు సభ్యులు.. 1. డీఆర్.రావు 2. విజయ్‌కుమార్ 3. బేగం 4.పార్వతమ్మ 5. సడవలయ్య డిపోలలో ఫిర్యాదు బాక్సులు.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం బస్ డిపోలో సూచనల కోసం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ప్రతీ ఉద్యోగి ఈ ఫిర్యాదు బాక్స్‌ను వినియోగించుకోవచ్చు. ప్రతీ కార్మికుని సెవులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్టీసీ సంస్థ కోసం సూచించే ప్రతి అంశాన్నీ ఈ ఫిర్యాదు బాక్స్‌లో వేయవచ్చు. వారంలో జరిగే సమావేశంలో ఈ బాక్స్‌ను తెరిచి ప్రతీ కార్మికుడి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం ఈ బాక్స్ లక్ష్యం. క్షేత్రస్థాయి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లాస్థాయిలో జరిగే సమావేశంలో ప్రతిబింబింపజేస్తారు. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు సంక్షేమ బోర్డులో భాగంగా డిపోలలో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ల కోసం, మహిళ అధికారుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు, సౌకర్యలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రత్యేక అవసరాల కోసం ప్రత్యేక సౌకర్యాలను, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కోసం ఆర్టీసీలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. దీని కోసం బస్ డిపోలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేశాం. ప్రతీ ఉద్యోగి వారివారి సమస్యలను, సంస్థ అభివృద్ధి కోసం ఇచ్చే సూచనలు స్వీకరించి ప్రతీవారం పరిష్కరిస్తాం. దీంతో డిపోలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. – వెంకటేశ్వర్లు, గోదావరిఖని డిపో మేనేజర్ -
అసలేం జరిగింది?
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): సింగరేని సంస్థ రామగుండం డివిజన్ – 2 పరిధిలోని ఓసీపీ – 3 ప్రాజక్టులో సోమవారం ఉదయం జరిగిన డంపర్ ప్రమాదంపై డీడీఎంఎస్(డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ) అధికారులు కూపీ లాగుతున్నారు. ప్రమాదంలో కార్మికుడు మృతిచెందడాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు అసలు ఏం జరిగింది.. ప్రమాదం ఎలా జరిగింది.. అనే వివరాలు ఆరా తీస్తున్నారు. డీడీఎంఎస్ అధికారులు బాలసుబ్రహ్మణ్యం, రంగారావు మంగళవారం ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే ఆర్జీ–2 ఏరియాకు చేరుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతోపాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించారు. సోమవారం రాత్రి 9గంటల వరకు సంఘటనపై విచారణ జరిపారు. నిబందనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నట్లు గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో బొగ్గు, ఓబీ వెలికితీత పనులు నిలిపివేయాలని ఆదేశించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన డీడీఎంఎస్‌లు ప్రమాదంపై డీడీఎంఎస్ అధికారులు ప్రాజెక్టు క్వారీ, హాలేజీ రోడ్లు, డంప్‌యార్డులను క్షుణ్ణంగా రక్షణ చర్యలను తనిఖీ చేశారు. సేఫ్టీ కమిటీ టీంలను మూడు బృందాలుగా విభజించి షావల్స్, హాలేజీ రోడ్లు, డంప్‌యార్డు వైపు రక్షణ చర్యలు తనిఖీ నిర్వహించారు. సేఫ్టీ మెజర్స్ ప్రకారం షావల్స్ పనిచేస్తున్నాయా లేదా? అనే విషయాలను సేఫ్టీ బృందం ద్వారానే చెప్పించారు. షావల్ నిలిచే ప్రాంతం ఎగుడు, దిగుడుగా ఉందా.. రెస్ట్ షెల్టర్ సేఫ్టీ ప్రాంతంలో ఉందా? ఆప్రాంతంలో రాత్రి పూట లైటింగ్ ఏవిధంగా ఉంది అనే విషయాలను సేఫ్టీ బృందం సభ్యులతో చెప్పించారు. సేఫ్టీ రూ ల్స్ ఏమి చెబుతున్నాయి? ఇక్కడ అమలు ఏవిధంగా ఉందనే విషయాలని సేఫ్టీటీం సభ్యుల ద్వారా తనిఖీ చేయించారు. రక్షణ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని, పూర్తిస్థాయిలో రక్షణచర్యలు చేపట్టిన త ర్వాతే పనులకు నిర్వహించేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉత్పత్తి నిలివేయడం ఇదే ప్రథమం.. ప్రమాదంపై సీరియస్‌గా ఉన్న డీడీఎంఎస్ అధికారులు ప్రాజెక్టుకు చేరుకున్న వెంటనే పూర్తిగా పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు తాము చెప్పే వరకు పనులు ని ర్వహించొద్దని సూచించారు. సోమవారం రోజుంతా ఉత్పత్తి నిలిచిపోగా, మంగళవా రం ఉదయం 10 గంటల వరకు పనులు ప్రా రంభం కాలేదు. ఆతర్వాత కొద్దిగా వె నక్కి తగ్గిన డీడీఎంఎస్ అధికారులు మూడు షా వల్స్ ద్వారా ఓబీ పనులు నిర్వహించుకోవాలని, ఇంటర్నల్ డంప్‌యార్డు వద్దకే పనులు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. దీంతో పాక్షికంగా పనులు సాగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదాలపై విచారణ చేపట్టడం, సాక్షుల నుంచి వివరాలు సేకరించడం సాధారణంగా జరుగుతుండగా, ప్రాజెక్టులో పూ ర్తిగా ఉత్పత్తి నిలిపివేయడం ఇదే ప్రథమం. బాధ్యులపై చర్య తీసుకోవాలి ఓసీపీ–3లో జరిగిన ప్రమాద ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని టీబీజీకేఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు డీడీఎంఎస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రక్షణ చర్యలు పాటించడంలో యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఏదైనా సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే కార్మికుడిని ప్రాజెక్టు అధికారి వ్యక్తిగతంగా బెదిరించి క్రమశిక్షణ లేఖలు ఇస్తున్నారని ఆరోపించారు. రక్షణ వైఫల్యంతోనే ప్రమాదం ఏఐటీయూసీ ఓసీపీ–3లో ప్రమాదానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈమేరకు డీడీఎంఎస్‌కు వినతిపత్రం అందజేశారు. వంద టన్నుల సామర్థ్యం గల డంపర్ సంస్థాగతమైన రక్షణ ఏర్పాట్ల లోపాలతో ప్రమాదం జరిగి ఈపీ ఆపరేటర్ రమేశ్ మృతిచెందాడని తెలిపారు. అధిక పనిభారంతోనే ప్రమాదాలు.. సింగరేణి యాజమాన్యం పనిభారం పెంచడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని జీఎల్బీకేఎస్ రాష్ట్ర నాయకులు ఐ.కృష్ణ, ఇ.నరేష్, మల్యాల దుర్గయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. ఓసీపీ–3లో డంపర్ ఆపరేటర్ రమేశ్ ప్రమాదానికిగురై మరణించాడని తెలిపారు. సరైన రక్షణ చర్యలు యాజమాన్యం పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. రమేశ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద పూజలు
సాక్షి, పెద్దపల్లి : తెలంగాణ విమోచన దినోత్సవం(సెప్టెంబర్ 17) సందర్భంగా మంథని ఆర్డీవో కార్యాలయంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే ఆర్టీసీ మాజీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ కూడా తెలంగాణ విమోచన దినోత్పవం సందర్భంగా గోదావరిఖనిలో జాతియ జెండాను ఎగురవేశారు. కాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ప్రధాని నరేంద్రమెదీ జన్మదినం పురస్కరించుకొని స్థానిక వేణుగోపాలస్వామి గుడిలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
రేకుల షెడ్డు కరెంట్ బిల్లు రూ.6 లక్షలు
గోదావరిఖనిటౌన్: ఇది ఫ్యాక్టరీ కాదు, పెద్ద వ్యాపార సంస్థ అంతకన్నా కాదు. కేవలం ఒక చిన్నపాటి రేకుల షెడ్డు. దీనికి వచ్చిన నెల విద్యుత్ బిల్లు అక్షరాల రూ.6 లక్షలు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్‌నగర్‌కు చెందిన మాస రాజయ్యకు ఆగస్టు నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లు రూ.6,08,000 వచ్చింది. ఇది ఏమిటని అడిగితే సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెలకు ఇంత బిల్లు ఎలా వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదని రాజయ్య తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వాస్తవ బిల్లును ఇవ్వాలని కోరుతున్నాడు. -
డెంగీ భయం వద్దు: ఈటల
సాక్షి, పెద్దపల్లి : ‘వాతావరణ మార్పుల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. 99 శాతం ప్రజలు వైరల్ ఫీవర్‌తోనే బాధపడుతున్నారు. 12 జిల్లాలు తిరిగి వచ్చా.. గతంలో మాదిరిగా ఈ సారి డెంగీ ప్రభావం పెద్దగా లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి ముందుగా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఎన్టీపీసీ సీఎస్ఆర్ సంస్థ రూ.7.89 కోట్ల నిధులతో చేపట్టబోయే 50 అదనపు పడకల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి ఈటల రాజేందర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖలఅధికారులతో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పారిశుధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా విషజ్వరాలను నివారించవచ్చని రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రీదేవసేన, వివిధశాఖల అధికారులతో సీజనల్వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వైరల్ జ్వరాలు వస్తాయన్నారు. నివారణకు వైద్య,పంచాయతీరాజ్,మున్సిపల్‌శాఖల సమన్వయంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ జ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం 99శాతం వైరల్‌జ్వరాలు మాత్రమే వస్తున్నాయని స్పష్టం చేశారు. రోగాల బారినపడ్డ వారికి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్న మంత్రి వైద్యసిబ్బందికి నెలరోజుల పాటు సెలవులు రద్దు చేసినట్లు వివరించారు. వందశాతం ఓడీఎఫ్ జిల్లాగా పెద్దపల్లి జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించుకుని, గ్రామీణ ప్రాంతాల్లోని మురికి కాల్వలను మూసివేయడం ఆ దిశగా ఇప్పటికే జిల్లా పయనించడం ఆనందంగా ఉందన్నారు. పారిశుధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.ఆశావర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎంల ద్వారా గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. దోమల నివారణకు అవసరమైన ఫాగింగ్ చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పేదప్రజలను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేయవద్దని స్పష్టం చేశారు. యోగా సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఈటల ప్రభుత్వ సలహాలను అనుసరిస్తాం: కలెక్టర్ శ్రీదేవసేన కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు, ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం అందిస్తున్న సలహాలను అనుసరిస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు నాలుగు నెలలుగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జిల్లాలో కేవలం వైరల్ జ్వరాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పటి వరకు జిల్లాలో 17 డెంగీ, 4 చికెన్‌గున్యా కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పుట్టమధు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, పెద్దపల్లి, రామంగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకుంటి చందర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, డీఎంహెచ్ఓ ప్రమోద్‌కుమార్ తదతరులు పాల్గొన్నారు. రూ.7.89 కోట్లతో అదనపు 50 పడకల నిర్మాణానికి శంకుస్థాపన అంతకుముందు గోదావరిఖనిలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో 50 అదనపు పడకల నిర్మాణం కోసం, ఎన్టీపీసీ సీఎస్ఆర్ సంస్థ రూ.7.89 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టబోయే పనులకు శుక్రవారం పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌నేత, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పుట్టమధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ శ్రీదేవసేనతో కలిసి మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు.మంత్రి మాట్లాడుతూ... అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి ఆస్పత్రిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామన్నారు.నిధులు కేటాయించిన ఎన్టీపీసీ అధికారులను మంత్రి అభినందించారు. అనంతరం ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడారు.డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ సౌకర్యం ఇప్పించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ‘ఖని’లో వైద్య కళాశాల ఏర్పాటు, మాతా శిశు కేంద్రం ఏర్పాటు, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, డయాలసిస్ సెంటర్‌ను విస్తరించాని, ఆస్పత్రిలో నెలకొన్ని వైద్యులు, సిబ్బంది కొరత తీర్చాలని ఎమ్మెల్యే చందర్ మంత్రికి విన్నవించారు. గర్భిణుల యోగా కేంద్రం ప్రారంభం ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన గర్భిణీల యోగా కేంద్రం(ఆంటినెంటల్ ఎక్సెర్సైజ్ రూం)ను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. గర్భిణులకు ఆపరేషన్లు చేయడం కన్నా, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్యులకు మంత్రి సూచించారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, జెడ్పీటీసీలు కందుల సంధ్యారాణి, నారాయణ, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ డీజీఎం రమేష్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు గోలివాడ చంద్రకళ, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ అశోక్‌కుమార్, డీఎంహెచ్ఓ ప్రమోద్‌కుమార్, డీసీహెచ్ఎస్ రమాకాంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు
సాక్షి, గోదావరిఖని : జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. రామగుండం అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్ కమిషనరేట్‌లో శనివారం వివరాలు వెల్లడించారు. రామగుండం మండలం రాయదండికి చెందిన గుమ్మాల వసంతకుమార్, ఓ మైనర్, పాత రామగుండం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన పల్లికొండ సురేష్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఏడాది క్రితం మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మోటార్ల దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. మహిళను కత్తితో బెదిరించి.. అంతకు పదినెలల ముందుగానే 2017నవంబర్‌లో పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దంపేట గ్రామశివారులో పత్తి చేనులో పత్తి తీస్తున్న విమలను బెదిరించి రూ.1.05 లక్షల విలువైన మూడు తులాల బంగారు పుస్తెలుతాడు చోరీచేశారు. అప్పటినుంచి అనుమానం రాకుండా సెంట్రింగ్ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని పగటిపూట ఆటోలో తిరుగుతూ.. పంటపొలాల్లో ఒంటరిగా ఉన్నమహిళలను టార్గెట్ చేసుకొని వారిని బెదిరించి దొంగతనాలు చేశారు. ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లోని ఆలయం, టెలిఫోన్ కార్యాలయాల్లో సైతం చోరీలకు పాల్పడ్డారు. దొంగతనం చేసిన సొత్తును అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవారు. శనివారం సీఐ బుద్దస్వామి, అంతర్గాం ఎస్సై రామకృష్ణ, సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు బి–పవర్‌హౌస్ వద్ద ఆకస్మికంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఈ ముగ్గురు పట్టుపడ్డారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు.మూడు తులాల బంగారు పుస్తెలుతాడు రికవరీ చేశారు. నిందితులపై పీడీయాక్టు.. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు అడిషనల్ డీసీపీ వెల్లడించారు. మైనర్‌ను జూవైనల్ హోంకు తరలిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన సీసీఎస్ సీఐలు ఎ.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రావు, ఎస్సైలు మంగిలాల్, నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి, కానిస్టేబుళ్లు దేవేందర్, సుధాకర్, శ్రీనివాస్, అలెక్స్, రవి, రమేష్‌లను అడ్మిన్ డీసీపీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, సీఐలు బుద్దె స్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రావు, ఎస్సై రామక్రిష్ణ పాల్గొన్నారు. -
బాయిమీది పేరే లెక్క..
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): సింగరేణి కార్మికునికి వంద పేర్లున్నా బాయిమీద ఉన్న పేరునే యాజమాన్యం లెక్కలోకి తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు పేర్లున్నాయనే సాకుతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిచ్చేందుకు అడ్డుపడుతున్నారని, విజిలెన్స్ విచారణతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మారు పేర్ల మార్పుకు హామీ ఇచ్చినా సింగరేణి అదికారులు మాత్రం విజిలెన్స్ విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం శోచనీయమన్నారు. కేటీఆర్ దృష్టికి సమస్యలు.. సింగరేణి కార్మికుల ఎదుర్కొంటున్నసమస్యలను సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్, కోల్‌బెల్ట్‌ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే ఆయన సీఎండీతో మాట్లాడారని తెలిపారు.. ఆగస్టు రెండో వారంలో మరోసారి కేటీఆర్‌ను కలుస్తామన్నారు. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని జాతీయ సంఘాలు విమర్శించడంలో అర్థం లేదన్నారు. ముఖ్యమంత్రి జోక్యంతోనే కారుణ్య నియామకాలు ప్రారంభమైన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీని ధిక్కరించి వేరే ప్రచారం నిర్వహిస్తే వేటు తప్పదని వెంకట్రావు హెచ్చరించారు. టీఆర్ఎస్పార్టీ గెలుపుకోసం టీబీజీకేఎస్ శ్రేణులంతా కష్టించి పనిచేయాలన్నారు. కెంగర్లకు పదవి లేదు యూనియన్ బైలాస్ ప్రకారం టీబీజీకేఎస్ యూనియన్‌లో కెంగర్ల మల్లయ్యకు పదవి లేదని వెంకట్రావు అన్నారు. బైలాస్ ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లేదని.. ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో ప్రత్యేకంగా పదవి ప్రకటించిన విషయం వాస్తవమేనని, తర్వాత యూనియన్‌లో ఈపోస్టును సవరించాల్సి ఉన్నప్పటికి సాధ్యం కాలేదన్నారు. కనకం శ్యాంసన్, నూనె కొమురయ్య, గండ్ర దామోదర్‌రావు, దేవ వెంకటేశం, వెంకటేష్, పుట్ట రమేష్, ఎట్టెం క్రిష్ణ, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
భార్య మరో వ్యక్తితో చాటింగ్ చేస్తోందని..
సాక్షి, కోల్ సిటీ (రామగుండం) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన దుర్గం మౌనికను ఆమె భర్త శ్రావణ్ హత్యచేశాడు. మౌనిక తలపై ఇనుపరాడుతో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మౌనిక, శ్రావణ్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. భార్యను డిగ్రీ చదివించిన శ్రావణ్ ఇటీవల లాసెట్ పరీక్ష కూడా రాయించాడు. అయితే ఎలాంటి పనిచేయని శ్రావణ్ తండ్రి వారసత్వ ఉద్యోగం(సింగరేణి) కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో భార్యపై శ్రావణ్ అనుమానం పెంచుకున్నాడు. మొబైల్లో మరో వ్యక్తితో చాటింగ్ చేస్తోందని భార్యతో గొడవపడ్డ శ్రావణ్ ఆమెను హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘సింగరేణియన్స్ హౌస్’ నిధుల దుర్వినియోగం
సాక్షి, హైదరాబాద్: సింగరేణియన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో నిధులు దుర్వినియోగమయ్యాయనే వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. రూ.2.11 కోట్ల మేరకు నిధుల మోసం జరిగిందని పేర్కొంటూ సొసైటీ మెంబర్ గుండం గోపి దాఖలు చేసిన కేసులో ప్రతివాదులైన హోంశాఖ కార్యదర్శి, పోలీస్ కమిషనర్, సింగరేణి కంపెనీ సీఎండీ, జీఎం (పర్సనల్), సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ ఆరోపణలకు వివరణ ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఈ మేరకు ఇటీవల నోటీసులు జారీ చేశారు. గుండం గోపి వాదనలు వినిపిస్తూ.. సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్, సొసైటీ సెక్రటరీ ఆర్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్‌లు నిధుల్ని దుర్వినియోగం చేసినట్లుగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని, సొసైటీ బ్యాంకు ఖాతాల్ని యథాతథంగా నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అధ్యక్ష, కార్యదర్శులిద్దరికీ రాజకీయ పలుకుబడి ఉండటంతోనే నిధుల్ని దుర్వినియోగం చేశారనే తమ అభియోగాల్ని నమోదు చేయడం లేదన్నారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేశారు. -
దేశ గమనాన్ని, గతిని మారుస్తా: కేసీఆర్
సాక్షి, గోదావరిఖని: దేశంలో ప్రబలమైన గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలివిలేని వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారని.. కాంగ్రెస్, బీజేపీలతో దేశానికి ఒరిగేదేమీ లేదని విమర్శించారు. తాగునీటి సమస్య, కరెంట్ కటకట ఇంకా ఎందుకు ఉన్నాయని చర్చకు రమ్మంటే రాకుండా వ్యక్తిగతమైన నిందారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బొగ్గుగనిలో పనిచేసే కార్మికులు సైన్యం కంటే తక్కువ కాదని, వారికి ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా మోదీ సర్కారు పట్టించుకోలేదన్నారు. దేశంలో పన్నుల పద్ధతి బాలేదు కాబట్టే ఆదాయ పన్ను ఎగవేతలు ఎక్కువయ్యాయని తెలిపారు. 30 శాతం పన్ను కారణంగానే ఎగవేతలు పెచ్చుమీరుతున్నాయని, దీంతో నల్లధనం పేరుకుపోతోందన్నారు. తెలివిగల దేశాలు నల్లధనం మార్కెట్లోకి తేవాలన్నారు. మనదేశంలో స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం లోపభూయిష్టంగా ఉందన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిని 70 శాతం పన్ను కట్టమంటున్నారని, 30 శాతమే కట్టనివాళ్లు.. 70 శాతం ఎలా కడతారన్న కనీస అవగాహన పాలకులకు లేకుండా పోయిందని చురక అంటించారు. ఇండోనేషియా కేవలం నాలుగు శాతం పన్ను కట్టమంటే 24 లక్షల కోట్ల రూపాయలు వాళ్ల మార్కెట్లోకి వచ్చాయని వెల్లడించారు. చిన్న దేశానికే అంత డబ్బు వస్తే మన దేశంలో ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేస్తే ఎన్ని లక్షల కోట్లు వస్తాయో ఆలోచించాలన్నారు. ‘రిజర్వ్ బ్యాంకు దగ్గర 14 లక్షల కోట్ల వరకు మూలుగుతున్నాయి. మహారత్న కంపెనీల వద్ద మరో 12 లక్షల కోట్లు మూలుగుతున్నాయి. వాటిని వాడే తెలివి లేదు. దాదాపు రూ. 25 లక్షల కోట్లు వృధాగా పడివున్నాయి. వీటిని వాడరు. ఈ అంశం గురించి చర్చ పెట్టరు. ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యధికంగా యువకులు ఉన్న దేశం భారతదేశం. పని చేసేవారు, నీళ్లు నిధులు, యువశక్తి అన్నీ ఉండీ ఈ సన్నాసుల పరిపాలన వల్ల దేశం దెబ్బ తింటున్నది. అవసరానికి మించి కరెంట్ ఉంటే సగం కూడా వాడే తెలివిలేదు. సగం దేశం చీకట్లోనే ఉంటుంది. ఉన్న వనరులు, అవకాశాలు వాడలేని వాళ్లు పాలకులుగా పనికొస్తారా? కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజలు విముఖత చెందార’ని కేసీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు పూర్తి మెజారిటీ రాదన్నారు. ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని శాసించనుందని తెలిపారు. తనను దీవిస్తే ఈ దేశ గతిని, దిశను మారుస్తానని చెప్పారు. -
కుమారున్ని ఇటుకతో కొట్టి చంపిన తల్లి
సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో ఓ భార్య.. ఇద్దరు కొడుకులను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. వివరాలు. గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న రమాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు అజయ్, ఆర్యన్. భర్త ఎన్టీపీసీలో పని చేస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రమాదేవి భర్త విధులకు వెళ్లాడు. భర్త మీద కోపంతో రమాదేవి.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. దాంతో ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది రమాదేవి. ఈ లోపే స్థానికులు అక్కడికి చేరుకుని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. -
మెడి‘కలే’నా?
డ్యూటీ చేసేందుకు బాయిమీదికి వెళ్లిన మల్లయ్యకు ఛాతిలో నొప్పి.. హుటాహుటిన అంబులెన్స్‌లో సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అయితే మల్లయ్యను అంబులెన్స్‌లో తరలిస్తుండగా వైద్యం అందక మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు గోదావరిఖనిని ఆనుకొని ఉన్న ఐదు జిల్లాల వాసులు ఎదుర్కొంటున్న దుస్థితి. గోదావరిఖని(రామగుండం) : పారిశ్రామిక ప్రాంతంలో వైద్యకళాశాల ఏర్పాటు కలగా మారింది. సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కార్మిక కుటుంబాలు, కార్మికుల పిల్లలు ఎక్కువగా ఉన్నారు. దీంతో అందరికీ అందుబాటులో ఉండేలా గోదావరిఖనిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని గతఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అనంతరం ఐదు జిల్లాలకు చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి కళాశాల విషయం ఊసెత్తలేదు. కార్మికులే ఎక్కువ.. పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో కార్మిక కుటుంబాలతోపాటు మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేల సంఖ్యలో కార్మికులు ఉన్నారు. రామగుండంలో ఎన్టీపీసీలోనూ వేలాది మంది ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ఎఫ్సీఎల్ కూడా కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. అతిపెద్ద సంస్థలైన ఎన్టీపీసీ, సింగరేణి సహకారంతో రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో సీఎం కేసీఆర్ తలిచారు. 2014 ఎన్నికల సమయంలో గోదావరిఖని, మంథని ప్రచారానికి వచ్చిన సమయంలో తమను గెలిపిస్తే సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల సహకారంతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటైతే కార్మికులతోపాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతోపాటు కార్మికుల పిల్లలకు వైద్య విద్యకూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అందని వైద్య సేవలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని మందమర్రి, చెన్నూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో సింగరేణి ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో వైద్యనిపుణులు లేకపోవడంతో కార్మికులు వారి కుటుంబాలు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులు.. హైదరాబాద్, కరీంనగర్ లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లిలో గతంలోనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలుగా ఏర్పడిన తర్వాత అక్కడి ఆస్పత్రులను ప్రభుత్వం ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేసింది. కానీ.. ఏ ఆస్పత్రిలోనూ రోగులకు సరిపడా సౌకర్యాలు కల్పించలేదు. వైద్యులను నియమించలేదు. పెరిగిన ప్రసవాల సంఖ్య.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ ప్రభావంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఆస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు, వైద్యులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వైద్యుల కొరత కారణంగా కాన్పుల సమయంలో శిశువులు మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. సింగరేణి కార్మికులకు వైద్యం దూరం.. సింగరేణి ఆస్పత్రుల్లో కార్మికులకు వారి కుటుంబాలకూ సరైన వైద్యసేవలు అందడంలేదు. కార్మికుడు ప్రమాదశాత్తు గాయపడినా.. విధినిర్వహణలో గుండెపోటుకు గురైనా వెంటనే ఆయా జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ నిపుణులు లేకపోవడంతో సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్‌కు రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లే వరకు పరిస్థితి విషమంగా ఉన్న కార్మికులు మధ్యలోనే మృతిచెందిన సంఘటనలున్నాయి. అంతేకాదు.. పట్టణ ప్రాంతాలకు వెళ్లిన రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గని ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడూ తక్షణ వైద్య సేవలు అందకపోవడం గమనార్హం. వైద్య కళాశాల ఏర్పాటైతే.. గోదావరిఖనిలో వైద్య కళాశాల ఏర్పాటుచేస్తే ప్రజలకు, కార్మికులు, కార్మికుల కుటుంబాలకు అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కనీసం 500 పడకల సామర్థ్యంతో అన్నిరకాల వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఐసీయూ, ట్రామా, న్యూరో, ఆర్థో తదితర సేవలు అందనున్నాయి. ప్రాణాపాయస్థితిలో వచ్చినవారిని సత్వరసేవలు పొందే వీలుంది. పోస్టుమార్టం సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసుతలకు ఒకే చోట వైద్యం అందే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉపాధి అవకాశాలూ మెరుగుపడనున్నాయి. -
యువకుడి అనుమానాస్పద మృతి
గోదావరిఖని(రామగుండం) : అనుమానస్పద స్థితిలో ట్రైయినీ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. ఆశావర్కర్ వేసిన ఇంజక్షన్ వల్లే అజ్మీర విజయ్‌నాయక్(28) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై కరీంబాబా తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి ఉద్యోగాన్ని సాధించి సింగరేణిలో శిక్షణ పొందుతున్న అజ్మీర విజయ్‌నాయక్ గోదావరిఖని గంగానగర్‌లోని మిలీనియం క్వార్టర్లో నివాసముంటున్నాడు. ఈక్రమంలో మంచిర్యాల్ జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన తోట రాజేశ్వరి అనే ఆశా వర్కర్ విజయ్‌నాయక్ క్వార్టర్‌కు మంగళవారం రాత్రి వచ్చింది. అయితే నడుంనొప్పి ఉండటంతో అమె ఇంజక్షన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికే వాంతులు కావడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ ఆసుపత్రికి రెఫర్‌చేయగా మార్గమధ్యంలో విజయ్‌నాయక్ మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. మృతుని తండ్రి ఆజ్మీర లచ్చయ్యనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కరీంబాబా తెలిపారు. పదిహేను రోజుల్లో ఉద్యోగం.. శిక్షణ పూర్తి చేసుకుని మరో 15రోజుల్లో సింగరేణి ఉద్యోగంలో చేరబోతున్న ఇంటిపెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా రాత్రి పూట ఆశావర్కర్ అతని ఇంటికి ఎందుకువచ్చింది? ఇంజక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తేలాల్సి ఉంది. ప్రస్తుతం మృతుని భార్య నిండు గర్భిణి కావడంతో పుట్టింటికి వెళ్లగా మృతుడు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. కాగా ఇంజక్షన్ బాటిల్‌తో ఆసుపత్రికి వెళ్లడంతో పెయిన్‌కిల్లర్ ఇచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుతో కాంట్రాక్టర్లకే లాభం : కోదండరాం
సాక్షి, పెద్దపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కాంట్రాక్టర్లకే లాభం జరుగుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. జిల్లాలోని రామగుండం బి పవర్ హౌస్ రాజీవ్ రహదారి నుంచి గోదావరిఖని వరకు జనసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కోదండరాం పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన రణభేరిలో ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది ఉద్యమకారుల ఆత్మబలిదానాల ఫలితమే తెలంగాణ అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అమరుల త్యాగాలను మరిచారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పక్కనబెడితే.. ప్రభుత్వాన్ని కుల్చేస్తామన్నారు. సింగరేణి కార్మికుల పేరు మార్పిడిపై ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయం చేసుకునే కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. రాజకీయం మీ స్వార్ధం కోసం కాకుండా ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చేస్తే సంతోషిస్తాం. స్థానిక సమస్యలపై రేపటి నుంచే పోరాటాలు మొదలుపెడతాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలకంటే కాంట్రాక్టర్లకే ఎక్కువ లాభం జరుగుతుంది. వారిని ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సరైన పనికి సరైన వేతనం చెల్లించేలా ప్రభుత్వం కొట్లాట చేస్తాం’ అని కోదండరాం అన్నారు. -
సీఐ సస్పెన్షన్
గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని వన్‌టౌన్ సీఐ గజ్జి కృష్ణను సస్పెండ్ చేస్తూ కరీంనగర్ రేంజీ డీఐజీ ప్రమోద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గోదావరిఖని బాపూజీ నగర్లో ఫిబ్రవరి 16న తూడి స్వాతి ఆత్మహత్యకు ఆయనే కారణమని తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. వివరాలు.. తూడి స్వాతి నాలుగేళ్ల కూతురుపై అదే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తదనంతరం బాలుడు, ఆయన తండ్రి బెయిల్‌పై వచ్చి స్వాతితో పాటు కుటుంబ సభ్యులను తిట్టడం.. వేధించడం చేశారు. దీంతో స్వాతి న్యాయం చేయాలని వన్‌టౌన్ సీఐ గజ్జి కృష్ణను కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మానసికంగా వేదనకు గురైన ఆమె గతనెలలో ఆత్మహత్య చేసుకున్నారు. స్పందించిన సీపీ దుగ్గల్ వెంటనే సీఐ కృష్ణను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విచారణ అనంతరం ఆయనను సస్పెండ్ చేస్తూ డీఐజీ ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. అయితే సీఐని కమిషనరేట్‌కు అటాచ్ చేసినప్పటికీ ఉన్నతాధికారులకు తెలియకుండా విధులకు గైర్హాజరుకావడం.. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం కూడా సస్పెండ్‌కు కారణాలుగా తెలుస్తోంది. -
తెలంగాణలోనే పెద్ద‘పల్లి’
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: వ్యవసాయ, పారిశ్రామీకరణలో గణనీయ వృద్దిని సాధించి రాష్ట్రంలోనే ధనిక జిల్లాగా పెద్దపల్లి అవతరించబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోస్యం చెప్పారు. అంతర్గాం మండలం ముర్మూరు వద్ద రూ.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి మంగళవారం సీఎం శంకుస్థాపన చేశారు. లిఫ్ట్‌ల నిర్మాణానికి సంబంధించి అధికారులు మ్యాప్ ద్వారా సీఎంకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీళ్లతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎండిపోవడమనేది జరగదన్నారు. గోదావరి నది జలకళను సంతరించుకొంటుందదన్నారు. ఫలితంగా ఈ ప్రాంతం సుభిక్షంగా మారబోతుందన్నారు. ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా, 1600 మెగావాట్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరో 2400 మెగావాట్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఓ వైపు వ్యవసాయం, మరో వైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ, రాష్ట్రంలోనే పెద్దపల్లి ధనిక జిల్లాగా ఏర్పడబోతుందన్నారు. కాగా ముర్మూరు ఎత్తిపోతల పథకాన్ని ఐదు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా, అక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరం బ్రాంచి కాలువ ద్వారా, మరో 16 కిలోమీటర్ల దూరం పిల్ల కాలువ ద్వారా సాగునీళ్లు ఈ ప్రాంతానికి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు చెంతనే ఉన్నా రామగుండంలోని వ్యవసాయ భూములకు సాగునీరు రావడం లేదనే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. రెండు లిఫ్ట్‌లతో పాటు, మూడో లిఫ్ట్‌కు కావాల్సిన రూ.12 కోట్లు కూడా ఇస్తామన్నారు. ఈ పథకంతో దాదాపు 20 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని, 22 వేల ఎకరాలకు సాగునీళ్లు అందుతాయన్నారు. ప్రారంభోత్సవానికి మళ్లీ వస్తా... రామగుండం ఎత్తిపోతల పథకాన్ని శంఖుస్థాపన చేసిన తాను తిరిగి, ప్రారంభోత్సవానికి కూడా వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ పథకం త్వరగా పూర్తి కావాలంటే అక్కడక్కడ కొంత స్థలం అవసరముంటుందని, దానిని ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ ప్రాంతం తొందరగా బాగుపడాలనేది తన ఆకాంక్ష అన్నారు. ఎమ్మెల్యే గ్రూప్ జోష్ సీఎం కే సీఆర్ సభలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై ప్రశంసలు కురిపించడంతో ఆయన వర్గీయులు సంబరాల్లో మునిగిపోయారు. రామగుండంలో వర్గపోరు, ఆశావాహులు అధికంగా ఉన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల్లో, స్వయంగా గులాబీ బాస్ బహిరంగంగా పొగడడంతో వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ‘ఇగ దుకాణాలు బంద్’ అంటూ వ్యాఖ్యానిస్తూ, ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. ఆర్టీసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కె.కేశవరావు, బాల్క సుమన్, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ సలహదారు డాక్టర్ జి.వివేక్, పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ శ్రీదేవసేన, పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, మాతా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ ఆడెపు రాజేశం, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పోస్టాఫీస్‌కు కరెంట్ కట్
గోదావరిఖనిటౌన్ (రామగుండం) : జిల్లాలోనే అత్యధిక ఆదాయం ఉన్న గోదావరిఖని ప్రధాన పోస్టాఫీస్‌లో రెండు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. కార్యాలయం నిర్వహిస్తున్న భవనం యజమాని రెండు రోజుల క్రితం కరెంట్ కట్ చేశాడు. అద్దె ఒప్పందం ముగిసి మూడేళ్లు గడిచినా భవనం ఖాళీ చేయకపోవడంతో యజమాని కరెంటు సరఫరా నిలిపేశాడు. దీంతో కార్యాలయంలో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారుల ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం లక్ష్మీనగర్‌లోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం ఉంది. రెండు రోజులుగా ఇందులో సేవలు నిలిచిపోయాయి. 15 ఏళ్లుగా దస్తగిరి కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో నెలకు రూ.11 వేల అద్దెతో ప్రధాన పోస్టాఫీస్ నిర్వహిస్తున్నారు. భవనం యజమానికి పోస్టాఫీస్ మధ్య ఉన్న అద్దె ఒప్పందం మూడేళ్ల క్రితం ముగిసింది. దీంతో భవనం యజమాని ఫారుక్ ప్రత్యామ్నాయం చూసుకోవాలని మూడేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. అయితే స్థానికంగా వినియోగదారులకు అందుబాటులో మరో అద్దె భవనం దొరకకపోవడంతో ఖాళీ చేయలేదు. యజమాని సోమవారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరెంట్ కట్ చేశాడు. దీంతో రెండు రోజులుగా ప్రధాన పోస్టాఫీసులో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక వందలాది మంది పోస్టాఫీస్‌కు వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్నారు. రోజుకు రూ.లక్షల్లో నష్టం... పోస్టాఫీస్ సేవలన్నీ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రోజు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల నష్టం వాటిల్లుతోంది. కార్యాలయంలో ముఖ్యమైన సేవలు, డిపాజిట్లు, వడ్డీ స్వీకరణ, స్పీడ్ పోస్ట్‌లు, ఇతర 18 రకాల సేవలు స్తంభించాయి. వందలాది మంది నిత్యం నిర్వహించే కార్యకలాపాలు స్పీడ్ పోస్ట్, ఉత్తరాల పంపిణీ, రిజిస్టర్ పోస్ట్‌లు, రైల్వేటికెట్ బుకింగ్, ఆధార్ నమోదు, డిపాజిట్లు, వడ్డీ వితరణ, ఆన్లైన్ పోస్ట్, వెస్ట్రన్ మనీ ట్రాన్స్ఫర్ తదితర సేవలకు అంతరాయం కలిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి.. పోస్టల్ నిబంధనల ప్రకారం భవనానికి రూ.11 వేల నుంచి రూ.20 వేల వరకు అద్దె చెల్లించాలని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఈ అద్దెకు స్థానికంగా మరొక భవనం దొరకక ఇదే భవనంలో ఉండాల్సి వస్తోందని పోస్ట్‌మాస్టర్ ఫజుర్ రహమాన్ తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న భవనాన్ని రూ.20 వేలలోపు అద్దెకు కేటాయించాలని అధికారులకు విన్నవించామని పేర్కొన్నారు. వారు స్పందించక పోవడంతో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, రామగుండం మేయర్, సింగరేణి జీఎంకు కూడా వినతిపత్రాలు అందించామని వివరించారు. ఎవరూ స్పందించడం లేదని చెప్పారు. అధిక ఆదాయం ఉన్న పోస్టాఫీస్.. జిల్లాలో అత్యధికంగా 10 వేలకు పైగా ఖాతాదారులు ఉన్న పోస్టాఫీస్ గోదావరిఖని బ్రాంచ్ మాత్రమే. ఇందులో నిత్యం లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. ఈ పోస్టీఫీస్‌లో ప్రస్తుతం సేవలు నిలిపోవడంతో లక్షల రూపాయల నష్టం కలుగుతోంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. నష్టం కలుగకుండా చూడాలి నిత్యం చాలా రకాల సేవలు పోస్టాఫీస్‌లో జరుగుతాయి. ఆకస్మికంగా విద్యుత్ కట్ చేసి సేవలు నిలిపి వేస్తే ప్రజలతోపాటు సంస్థ నష్టపోతుంది. అధికారులు, పాలకులు స్పందించి వెంటనే కరెంట్ పునరుద్ధరించి నష్టం కలుగకుండా చూడాలి. పోస్టాఫీస్‌ను కూడా మరో భవనంలోకి మార్చేలా చొరవ తీసుకోవాలి. – ఫజుర్ రహమాన్, పోస్ట్‌మాస్టర్, గోదావరిఖని -
ఆ తల్లి ‘వెళ్లిపోయింది’
కోల్‌సిటీ(రామగుండం): ఆ తల్లిని వదిలించు కోవాలని బతికున్నప్పుడే ప్లాస్టిక్ సంచిలో కట్టి నిర్జన ప్రదేశంలో వదిలేశాడా కొడుకు.. అప్పటి నుంచి వృద్ధాశ్రమంలో ఉన్న ఆ తల్లి శనివారం చనిపోయింది. తల్లి చనిపోయిందని సమాచా రామిచ్చిన స్పందించలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని దహన సంస్కారాలు చేయించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మినగర్‌కు చెందిన రాజోజుల వెంకటాద్రి తన తల్లి జగదాంబను గత నెల 24న ప్లాస్టిక్ సంచి లో పెట్టి నిర్జన ప్రదేశంలో వదిలేసిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ‘సాక్షి’గత నెల 25న ‘అమ్మను వదిలించుకోవాలని’.. శీర్షికన వెలుగులోకి తీసుకొచ్చింది. నాడు పోలీసులు వచ్చి ఆ తల్లిని తిలక్‌నగర్‌లోని శ్రీధర్మశాస్త్ర వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. తీవ్ర అనారోగ్యంతో తల్లడిల్లుతున్న ఆమె శనివారం మృతి చెందింది. విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులు కౌటం బాబు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయినా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ జి. కృష్ణ వచ్చి మృతురాలి కుమారుడు వెంకటాద్రితో పాటు మనవడిని ఆశ్రమానికి పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించగా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నామని చెప్పారు. దీంతో సీఐ దహన సంస్కారాలకు ఆర్థిక సాయం చేశారు. దగ్గరుండి శ్మశానవాటికకు పంపించారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద ముగ్గు.. ఎక్కడేశారో తెలుసా?
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సంక్రాతి వేడుకల్లో భాగంగా 500 మంది మహిళలు ‘రామగుండం ముంగిట్లో రంగుల హరివిల్లు’ పేరుతో వేసిన ముగ్గు.. ‘ప్రపంచంలోనే అతిపెద్దది’గా రికార్డులకెక్కింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో శనివారం ఈ అతి పెద్ద ముగ్గువేశారు. 500 మంది మహిళలు భాగస్వామ్యమై.. 800 చదరపు అడుగుల్లో.. 1,939 చుక్కలతో ముగ్గువేశారు. తెలుగు సంవత్సరాది అయిన శాలివాహన శకాన్ని గుర్తు చేస్తూ.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ముగ్గు వేశారు. ప్రపంచంలోనే పెద్దముగ్గుగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు చెప్పారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఏసీపీ అపూర్వరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
గోదావరి పై మరో వంతెన
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై మరో భారీ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కిలోమీటర్ పొడవుతో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. గోదావరి ఇవతల రామగుండం వైపు రాజీవ్ రహదారిని, అటు గోదావరి ఎగువన మంచిర్యాల మీదు గా సాగుతున్న నిజామాబాద్–మంచిర్యాల–జగ్దల్పూర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ దీన్ని నిర్మించాల నేది ఆలోచన. దాదాపు మూడున్నరేళ్ల కిందే దీని నిర్మాణానికి పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించకపోవటంతో ఈ ఆలోచన అటకెక్కింది. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తు తం సీఎం పరిశీలనలో ఉంది. ఆయన సానుకూలంగా స్పం దిస్తే అధికారులు డీపీఆర్ సిద్ధం చేసి టెండర్లు ఆహ్వా నించనున్నారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న నేపథ్యంలో స్థానికుల కోరికను నిజం చేసి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాలని సీఎంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ‘రాజీవ్’ వంతెనకు ప్రత్యామ్నాయం.. గోదావరిపై గోదావరిఖని వద్ద ఈ వంతెన ఉంది. ఇక్కడే నదిని దాటి మంచిర్యాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మంచిర్యాల 15 కిలోమీటర్లు ఉంది. మంచిర్యాల వైపు నుంచి రామగుండం రావాలంటే మంచిర్యాల వద్ద రైలు వంతెన మాత్రమే ఉండటంతో రోడ్డు ప్రయాణికులు ఈ 15 కిలోమీటర్ల దూరం వచ్చి వంతెన దాటి వెనక్కి రావాలి. నదిలో నీళ్లు లేని సమయంలో రైలు వంతెన సమీ పం నుంచి దాటి నేరుగా అంతర్గామ్ మీదుగా తక్కువ దూరంతో ప్రయాణించి వెళ్తారు. మంచిర్యాల వద్ద వం తెన నిర్మిస్తే దూరాభారం తగ్గటంతోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. వంతెన, రోడ్డుకు కలిపి దాదాపు రూ.100 కోట్ల వరకు వ్యయమవుతుందని రోడ్లు భవనాల శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. -
గోదావరిఖని చర్చిలో తొలి చోరీ మొదలుపెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్ సిటీ) : 45 దొంగతనాలు.. 11 పోలీస్ స్టేషన్లు.. 11 నాన్‌బెయిలబుల్ వారెంట్లు.. పదిసార్లు జైలు శిక్ష.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌ను అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశాలతో కూడిన ఎన్బిడబ్ల్యూ వారెంట్.. ఎన్నిసార్లు జైలుకెళ్లినా, ఎన్నిసార్లు పోలీసులకు పట్టుబడ్డా తీరుమార్చుకోకుండా జల్సాలకు అలవాటుపడ్డాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ల్యాప్‌టాప్ దొంగగా పేర్గాంచిన దొంగను గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు ఇన్స్పెక్టర్ పూర్ణచందర్రావు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ముత్తు, ఎస్ఐ డీ శ్రీను నిందితుడి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ పాఠశాల వెనుకాల నివసించే నిట్టూరి స్నేహిత్‌రాజ్ అలియాస్ అభినవ్‌రాజు అలియాస్ అభిరామ్(28) నల్లకుంట సమీపంలోని తిలక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. 2004లో గోదావరిఖనిలో చర్చిలో మైక్‌లు దొంగతనానికి పాల్పడి అప్పటి నుంచి వరుసగా దొంగతనాలు చేస్తూ పలుమార్లు పట్టుబడి జైలుకు వెళ్లాడు. బ్యాచిలర్స్ రూమ్స్ టార్గెట్‌గా చేసుకొని ల్యాప్‌టాప్‌లు దొంగిలించడంలో సిద్దహస్తుడయ్యాడు. ల్యాప్‌టాప్ రిపేర్ వర్కర్ కావడంతో ఆయా ల్యాప్‌టాప్‌లను దొంగిలించి ఏ మాత్రం అనుమానం రాకుండా మార్చి ఓఎల్ఎక్స్లో పెట్టి విక్రయించేవాడు. గోదావరిఖని, భూపాలపల్లి, హుజూరాబాద్, మంచిర్యాల, గచ్చిబౌళి, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మీర్‌పేట, మాదాపూర్, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేస్తూ పలుమార్లు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 9 ల్యాప్‌టాప్‌లు, ఒక టూ వీలర్, మొబైల్‌ఫోన్‌ను కూడా రికవరీ చేశారు. -
ప్రాణం తీసిన ఫొటో సరదా
గోదావరిఖని: వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి ఫొటో దిగాలన్న కోరిక ఓ యువకుడి ప్రాణం తీసింది. గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన నస్పూరి సంపత్(32) ఓసీపీ–3 ప్రైవే టు ఓబీ కంపెనీలో డంపర్ ఆపరే టర్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని అల్వాల్ వద్ద మిత్రుడి వివాహం ఉండ డంతో స్నేహితులతో కలసి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో మిత్రులతో కలసి వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిల బడి ఫొటో దిగాలన్న కోరిక కలిగింది. హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేసే శ్రావణ్‌కుమార్‌తో ఫొటో దిగుతుండగా... మరో స్నేహితుడు ఫొటో తీస్తున్నాడు. వెనుకనుంచి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు అతి సమీపం లోకి వచ్చినా గమనించకుండా ఏమరుపాటుగా ఉండడంతో రైలు ఢీకొని సంపత్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్ చేయి నుజ్జునుజ్జు అయ్యింది. సంపత్‌కు భార్య, కవల పిల్లలున్నారు. -
జీవితంలో సేవ భాగం కావాలి
►జీవితంలో సేవ భాగం కావాలి గోదావరిఖని(రామగుండం): సేవచేయడం, సేవాదృక్పథాన్ని అలవర్చుకోవడం మనిషి జీవితంలో భాగం కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆకాంక్షించారు. గోదావరిఖని విద్యానగర్–2లోని ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో దీనబంధు స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఐదునుంచి 10ఏళ్ల లోపు వయస్సున్న 12మంది ఆడ పిల్లలకు గురువారం కర్ణవేదన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ పాల్గొని.. మేనమామ స్థానంలో కూర్చుని ఈ కార్యక్రమం జరిపించారు. అనంతరం మాట్లాడుతూ నిస్సహాయ ఆడ పిల్లలకు చెవులు కుట్టించేందుకు దీనబంధు స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. సేవాగుణంతో వచ్చే మార్పు సామాజిక ప్రగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వాలని, పేదవారికి అండగా నిలవాలని సూచించారు. ఆదుకునే చేతులుంటే ఆదరణ కోల్పోయే పిల్లలుండరని, నిస్సహాయ పిల్లలకు సాయం చేసి ఆదుకోవాలని కోరారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని అనాథలు, వికలాంగులు, ఇతర నిస్సహాయ పిల్లలకు సాయం చేసేందుకు ‘పునరావాసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో పనిచేసే హోంగార్డు నుంచి కమిషనర్ వరకు వారి వేతనాల నుంచి ప్రతీనెల కొంత డబ్బు రికవరీ చేసి పిల్లల కనీస అవసరాలకు, విద్యుత్ బిల్లులు, వాటర్ బిల్లు, ఫ్యాన్, కూలర్లు, నోట్‌పుస్తకాలు, స్కూల్ బ్యాగ్‌లు ఇలా వారికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఆదరణ నిస్సహాయ ఆశ్రమంలో సేదతీరుతున్న పిల్లల కోసం రూ.10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.పిల్లలు చెడు అలవాట్లకు లోనుకాకుండా మంచి ప్రవర్తన కలిగేలా తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. దీనబంధు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఎండీ.రహ్మత్పాష, కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సీఐలు జి.కృష్ణ, సీహెచ్. వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జాలి రాజమణి, మహంకాలి స్వామి, చందుయాదవ్, వివేక్, నాయకులు పెద్దంపేట శంకర్, గోపు అయిలయ్యయాదవ్, అందె సదానందం, అబ్బోజు రాంబాబు, కనకరాజు, తాండ్ర సదానందం, గోసిక మోహన్, ఆశ్రమ నిర్వాహకులు లక్ష్మి, శ్రీనివాస్, ఆర్చన, కృష్ణ పాల్గొన్నారు -
గోదావరిఖని, పెద్దపల్లిలో పోలీసుల తనిఖీలు
కరీంనగర్: గోదావరిఖని ఒకటవ పోలీస్ స్టెషన్ పరిధిలోని 7బి కాలనీ, విఠల్‌నగర్‌లో ఆదివారం వేకువజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమతి పత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు, నాలుగు ట్రాలీ ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సరైన అడ్రస్ తెలపని ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో సబ్ఇన్స్పెక్టర్లు, పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అలాగే పెద్దపల్లి శాంతినగర్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
‘టెన్’షన్ లేకుండా..
గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో 2 గంటల్లో పది మందికి పురుడు పోసిన వైద్యులు కోల్‌సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు మంగళవారం రికార్డుస్థాయిలో ప్రసవాలు జరిపించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల మధ్యలో పదిమంది గర్భిణులకు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్, గైనకాలజిస్ట్ సూర్యశ్రీ, మరో గైనకాలజిస్ట్ వనితతోపాటు అనస్తీషియా డాక్టర్ ప్రియాంక కలసి పురుడుపోశారు. పుట్టిన వారిలో ఆరుగురు మగ శిశువులు, నలుగురు ఆడశిశువులు ఉన్నారు. వారికి అప్పటికప్పుడు పీడియాట్రిషన్ డాక్టర్ శిల్ప వైద్యం అందించారు. పది మంది బాలింతలతోపాటు పుట్టిన పది మంది శిశువులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీ తెలిపారు. అయితే, అనుకోకుండా ఆపరేషన్లు జరిగాయని, రికార్డు కోసం చేయలేదని వెల్లడించారు. పదిమంది గర్భిణుల్లో ఐదుగురు గర్భిణులకు గతంలోనే పెద్ద ఆపరేషన్లు జరిగాయని, మిగిలిన వారికిS సాధారణ ప్రసవం జరిపేందుకు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో అందరికీ శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చిందని వివరించారు. -
ఖని ఆస్పత్రిలో ప్రసవాల రికార్డు
గోదావరి ఖని: ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్న గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఆస్పత్రి వైద్యులు మంగళవారం రికార్డు స్థాయిలో ప్రసవాలు జరిపించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో పది మందికి పురుడుపోశారు. పుట్టిన 10 మంది శిశువులూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆస్పత్రి సూపరిండెంటెండ్ గైనకాలజిస్ట్ సూర్యశ్రీ తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది దాదాపు 15 మంది కలిసి తాము ఈ పనిని విజయవంతంగా పూర్తి చేశామని ఆమె తెలిపారు. -
ప్రియుడులేని లోకంలో బతకలేక..
గోదవరిఖని: గోదావరిఖనిలో విషాదం చోటుచేసుకుంది. తన కళ్ల ముందే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ప్రియురాలు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. స్థానిక శారదానగర్‌కు చెందిన బోడకుంట ప్రియాంక(24) ఎమ్మెస్సీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరి కుటుంబం గతంలో విఠల్‌నగర్‌లో ఉన్నప్పుడు ఇంటి పక్కనే ఉండే ప్రవీణ్ గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఉద్యోగరిత్య శ్రీశైలంలో ఉంటున్న ప్రవీణ్ గౌడ్ గత కొంతకాలంగా ప్రియాంకపై పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేస్తున్నాడు. దీనికి ఆమె నిరకరిస్తూ వస్తోంది.. ఇంట్లో తనకు ఇంకో సోదరి ఉందని ఆమె పెళ్లి జరిగిన అనంతరం కుటుంబ సభ్యలకు ప్రేమ విషయం చెబుతానని వాయిదా వేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 15న వీరిద్దరు ప్రవీణ్ ఇంట్లో కలిసి ఈ విషయంపై గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన ప్రవీణ్ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న వ్యక్తి కళ్లముందే మృతిచెందడంతో.. కుంగిపోయిన ప్రియాంక.. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. క్షణ కాలంలో తీసుకున్న నిర్ణయాలు రెండు కుటుంబాల్లో తీరిని విషాదాన్ని నింపాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నీ ఎంఎల్ సంఘాలే..
ప్రపంచ మహాసభలతో ఒకే వేదికపైకి.. పెద్దపల్లి : గోదావరిఖనిలో ఈనెల 2నుంచి జరుగుతున్న అంతర్జాతీయ గని కార్మిక మహాసభలు.. మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. సింగరేణి కార్మిక సమాఖ్య తర్వాత ఆ స్థాయిలో విప్లవపంథాల్లో కార్మిక ఉద్యమాలను మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీల అనుబంధ సంఘాలే నడిపించాయి.. గోదావరిలోయ పరివాహక ప్రాంతాల్లో పార్టీలతోపాటు కార్మిక సంఘాల కార్యకలాపాలు కూడా విస్తరించాయి. ఫలితంగా జార్ఖండ్, బెంగాల్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎంఎల్ అనుబంధ సంఘాలు పురుడుపోసుకున్నాయి. దీంతో ఈ ప్రపంచ మహాసభలకు 17దేశాలకు చెందిన మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీల అనుబంధ సంఘాలతో పాటు దేశంలోని జార్ఖండ్, బెంగాల్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనుబంధ కార్మిక ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని బొగ్గు గని ప్రాంతంలో పనిచేస్తున్న ఏఐఎఫ్టీయూ, ఐఎఫ్టీయూ(రెండు వర్గాలు) సంయుక్తంగా ఈ సభలను నిర్వహిస్తోంది. ఇక ప్రపంచ మహాసభల నిర్వహణతో ఎంఎల్ పార్టీ ఉనికి మరోసారి కార్మిక సంఘాల్లో చాటుకున్నట్లయింది. గోదావరిఖని కేంద్రంగా ఇఫ్టూ సాగించిన పోరాటంలో సీపీఐ ఎంఎల్ విమోచన చండ్రపుల్లారెడ్డి వర్గానికి చెందిన నాయకులు పెద్దసంఖ్యలో అమరులయ్యారు. ఎన్ కౌంటర్ల కారణంగా రహస్యపార్టీ కార్యకర్తలను కోల్పోయినా.. ప్రజాసంఘాలు, ట్రేడ్ యూనియన్ల రూపంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కోల్‌బెల్ట్ ప్రాంతంలో సీపీఐఎంఎల్ జనశక్తి, విమోచన, న్యూడెమొక్రసీ అనుబంధ సంఘాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. చీలిపోయిన సంఘాలు కలిసి.. భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు–లెనినిస్టు)పార్టీ విమోచనగ్రూప్‌గా చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో గోదావరి లోయ పరివాహక ప్రాంతాలైన తెలంగాణతో పాటు జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో బొగ్గు గని కార్మిక సంఘాలను ప్రారంభించారు. తర్వాత చండ్ర పుల్లారెడ్డి గ్రూపు నుంచి పైలా వాసుదేవరావు, రాయల సుభాష్ చంద్రబోస్, చంద్రన్న వర్గం, రాంచంద్రన్ వర్గం, రాధక్క వర్గం విడిపోయాయి. ఇలా చీలికలు పేలికలైన చండ్ర పుల్లారెడ్డి వర్గంలోని కార్మిక సంఘం మాత్రం బలంగా ఉండడం విశేషం. ప్రస్తుతం గోదావరిఖనిలో నిర్వహిస్తున్న సభలకు చండ్రపుల్లారెడ్డి వర్గంతోపాటు దానినుంచి విడిపోయిన పార్టీల అనుబంధ సంఘాలు ఐఎఫ్టీయూ(రెండువర్గాలు). ఏఐఎఫ్టీయూ ఇలా మూడు గ్రూపులు కలిసి ప్రపంచ మహాసభలను నిర్వహిస్తున్నాయి. -
ఐటీఐ చదివి.. డాక్టర్ అయ్యాడు
గోదావరిఖని: ఐటీఐ చదువుకొని ఆ పై బంగారు నగల దుకాణంలో పనిచేసి అటునుంచి డాక్టర్ అవతారమెత్తాడో ప్రబుద్ధుడు. నేచురోపతి పేరుతో దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని అమాయకుల వద్ద నుంచి అందిన కాడికి దోచుకుంటున్న ఓ నకిలీ డాక్టర్ ఆట కట్టించారు పోలీసులు. కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని మార్కండేయ కాలనీలో నివాసముంటున్న సంపత్‌కుమార్ ఐటీఐ చదువుకున్నాడు. అనంతరం పొట్టకూటి కోసం కాగజ్‌నగర్‌లోని ఓ గోల్డ్ షాపులో కూలీగా పని చేశాడు. అక్కడి నుంచి మెరుగైన జీవనం కోసం హైదరాబాద్ చేరుకొని ఆ పని ఈ పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాధించాలనే కాంక్షతో.. నేచురోపతి నకిలీ సర్టిఫికెట్ సంపాదించి మార్కండేయ కాలనీలో ఆయుర్వేదిక్ క్లినిక్ తెరిచాడు. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని నమ్మించి రోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. ఇతని వ్యవహారం పై అనుమానం వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పక్కా ప్లాన్‌తో క్లినిక్ పై దాడులు నిర్వహించిన పోలీసులు సంపత్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ఓ ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. -
గోదావరిఖనిలో నకిలీ పోలీస్ అరెస్ట్
-
గోదావరిఖనిలో భారీ అగ్నిప్రమాదం
గోదావరిఖని: కరీంనగర్జిల్లా గోదావరిఖనిలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దారా దాసు అనే రిటైర్డు ఆర్టీసీ డ్రైవర్ కుటుంబసభ్యలుతో కలిసి చర్చికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల యువకులు గమనించి వెంటనే మంటలు ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఇంట్లో వంటకు ఉపయోగించే చిన్న సిలిండర్ ఒకటి పేలి పక్క ఇళ్లపై పడింది. దీంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మరో సిలిండర్ కూడా కాలిపోయింది. ఇంట్లో ఇంకా రెండు సిలిండర్లు కూడా ఉన్నాయని, అవి పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. వన్ టౌన్ ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
కల్వర్ట్ను ఢీకొన్న కారు: ముగ్గురి మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ వద్ద కల్వర్ట్ను శనివారం ఉదయం ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. షిరిడీ నుంచి గోదావరిఖని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. మృతులు గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
గోదావరిఖనిలో కార్డన్‌సెర్చ్
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): గోదావరిఖనిలోని 5 ఇంక్లైన్, విఠల్‌నగర్, చంద్రశేఖర్ నగర్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను, నిల్వ చేసిన బొగ్గు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఓ డీసీపీ, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 400 మంది పోలీసులు పాల్గొన్నారు. -
కమిషనరేట్ కోసం కసరత్తు షురూ
గోదావరిఖనిలో భవనాలను పరిశీలించిన ఎస్పీ జోయల్‌డేవిస్ గోదావరిఖని : రామగుండంలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు కసరత్తు మొ దలైంది. కమిషనరేట్ కార్యాలయం కోసం భవనాలను ఎస్పీ జోయల్ డేవిస్ గురువారం పరిశీలించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్‌లోనే కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఐజీ లేక డీఐజీ స్థాయి అధికారి పాలన ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎస్పీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోకి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను రెండు జోన్లుగా ఏర్పాటు చేసి పెద్దపల్లిలో ఒక డీసీపీ, ఒక ఏసీపీ, రామగుండంలో ఒక ఏసీపీ, మంచిర్యాలలో ఒక డీసీపీ, ఒక ఏసీపీ విధులు నిర్వహిస్తారని వివరించారు. ఈ నెల 11లోగా తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని, ఆ లోపే కార్యాలయాలను సిద్ధం చేయనున్నా మని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో అదనంగా ఉండే స్పెషల్ బ్రాంచ్, సిటీ క్రైమ్ బ్యూరో రికార్డు, ఐటీ టీమ్స్, ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్ల ఏర్పాటుకు భవనాలను చూస్తున్నామని చెప్పారు. ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్, టూటౌన్ సీఐ దేవారెడ్డి, రామగుండం సీఐ వాసుదేవరావు భవనాల పనులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను చేసేందుకు ఇద్దరు డీసీపీలు, పరిపాలన వ్యవహారాలు చూసేందుకు ఒక డీసీపీ, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు రామగుండంలో లేదా, మంచిర్యాలలో ఏసీపీలు ఉంటారని చెప్పారు. క్రైమ్ కోసం ఏసీపీ, ప్రత్యేకమైన లీగల్ సెల్, సైబర్ క్రైమ్, టాస్క్‌పోర్స్, కమ్యూనికేషన్స్‌కు కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. జిల్లాల్లో అన్ని మండలాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాతనే పోలీస్స్టేషన్ల సంఖ్యను పెంచే ఆలోచన చేస్తామని ఎస్పీ తెలిపారు. -
'ఖని’లో పోలీస్ కమిషనరేట్?
గోదావరిఖని: గోదావరిఖనిలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో జరగనున్న పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారుల మధ్య జరగనున్న సమావేశం జరగనుంది. ఇందులో గోదావరిఖనిలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు చేసే విషయమై చర్చించనుండగా... ఈ సమావేశానికి ఎస్పీ జోయల్ డేవిస్ హాజరవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల కార్పొరేషన్‌గా ఉన్న నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలను పోలీస్ కమిషనరేట్‌గా ప్రకటించగా... తాజాగా రామగుండం కార్పొరేషన్ ఏరియాను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దీని పరిధిలోకి రామగుండం, మంచిర్యాల మున్సిపాలిటీని తీసుకువచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. గతంలో గోదావరిఖని పోలీస్ సబ్ డివిజన్ ప్రాంతాన్ని కమిషనరేట్ చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. ఆనాడు ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. తాజాగా గోదావరిఖనిని పోలీస్‌కమిషనరేట్‌గా చేసేందుకు ఎస్పీ డేవిస్ ప్రతిపాదనలతో బుధవారం జరిగే సమావేశానికి హాజరవుతున్నారు. గోదావరిఖనిలో క మిషనరేట్ ఏర్పాటు చేసేందుకు అనువుగా పోలీస్ హెడ్‌క్వార్టర్ అందుబాటులో ఉంది. డీఐజీ అధికారి పర్యవేక్షణలో ఉండే కమిషనరేట్ కింద పరిపాలన సజావుగా సాగేందుకు రామగుండం, మంచిర్యాల పరిధిలో పోలీస్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచనున్నారు. -
శిథిలావస్థకు సింగరేణి క్వార్టర్లు
భయాందోళనలో కార్మిక కుటుంబాలు పట్టించుకోని అధికారులు గోదావరిఖని : గోదావరిఖని బస్టాండ్ కాలనీలోని సింగరేణి సంస్థకు చెందిన కార్వర్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో క్వార్టర్ల పైకప్పులు ఎప్పుడు కూలుతాయోననే కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో కార్మికుల నివాసానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో యాజమాన్యం 1991లో బస్టాండ్ కాలనీలో క్వార్టర్ల నిర్మాణం పూర్తిచేశారు. ఇందులో 302 టీ2 టైపు, 1995లో 180 ఎస్టీ-2 టైపు క్వార్టర్లను నిర్మించారు. టీ2 టైపు క్వార్టర్లు నిర్మించి 25 ఏళ్ళు, ఎస్టీ-2 టైపు క్వార్టర్లు నిర్మించి 21 ఏళ్ళు అవుతున్నా యాజమాన్యం వాటికి పూర్తిస్థాయి మరమ్మతులను చేపట్టడం లేదు. ఇటీవల ‘కార్మికుల వద్దకు యాజమాన్యం’ కార్యక్రమంలో అధ్వానంగా ఉన్న క్వార్టర్ల గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలను పుస్తకాలలో నమోదు చేసుకున్నారే తప్ప శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కూలుతున్న పైకప్పులు బస్టాండ్ కాలనీలోని సింగరేణి క్వార్టర్ల విషయంలో యాజమాన్య పర్యవేక్షణ లోపించడం తో క్వార్టర్ల మధ్యలో మొక్కలు మొలుస్తున్నా యి. వాటి వేర్లు క్వార్టర్ల గోడల లోపలికి చొచ్చుకుని వస్తూ అవి పగిలిపోయి కిందపడేలా చేస్తున్నాయి. క్వార్టర్లకు మరమ్మతులు లేకపోవడం తో బెడ్రూమ్లు, వంట గదులు, బాతురూమ్ లు, మరుగుదొడ్లలో పైకప్పులు కూలిపోతూ కు టుంబ సభ్యులపై పడుతున్నాయి. పలు క్వార్టర్ల పైకప్పులు కూలినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. క్వార్టర్ల మధ్యలో నిర్మించిన డ్రైరుునేజీ నిర్మాణాలు కూడా సరిగ్గా లేకపోవడం, కుండీల లోని మురుగు సరిగ్గా వెళ్ళలేక నిలిచి ఉండడం తో దుర్వాసన భరించలేకపోతున్నామని కార్మికులు అంటున్నారు. చాలా ఏళ్ళుగా సున్నం వేయకపోవడంతో గోడలన్నీ నల్లటి మరకలతో నిండిపోయూరుు. ఎవరైనా క్వార్టర్లలోకి కొత్తగా వస్తే క్వార్టర్ లోపలి భాగంలో మాత్రమే సున్నం వేసి బయట వేయకుండా వదిలేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే క్వార్టర్ బయట సున్నం వేయడం సింగరేణి నిబంధనల్లో లేదని అధికారులు చెబుతున్నారని కార్మికులు వాపోతున్నారు. మొత్తంగా బస్టాండ్ కాలనీలోని సింగరేణి క్వార్టర్లకు మరమ్మతులు చేయకపోతే పైకప్పులు కూలి కార్మికులు, వారి కుటుంబాల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. -
‘ఖని’ ప్రభుత్వాస్పత్రి పరిశీలన
కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని కేంద్ర ‘కాయకల్ప’ కార్యక్రమం ప్రతినిధుల బSృందం మంగళవారం పరిశీలించింది. మెరుగైన వైద్య సేవలతోపాటు పరిశుభ్రత పాటిస్తున్న ఆస్పత్రులకు కేంద్రం ‘కాయకల్ప’ పథకం ద్వారా పోటీలు నిర్వహించి ఎక్కువ మార్కులు వచ్చిన వాటికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఏరియా ఆస్పత్రిని కాయకల్ప ప్రతినిధులు రవినాయుడు, నాగరాజు, తులసి రవీందర్, మారుతిరావు సందర్శించారు. ఐసీయూ, ఎస్ఎన్సీయూ, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ప్రసూతీ వార్డులు, లేబర్ రూం, ఎక్స్‌రే, ఏఆర్టీ, బ్లడ్‌స్టోరేజీ, బాత్రూంలు, ఆస్పత్రి పార్క్‌తోపాటు ఆవరణను పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి వైద్యసేవలు అందిస్తున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులతో కూడా మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు ఆస్పత్రులను పరిశీలించినట్లు చెప్పారు. ఈనెల 15లోపు నివేదికలను కేంద్ర కాయకల్ప విభాగానికి అందజేస్తామని వెల్లడించారు. గోదావరిఖని ప్రభుత్వాస్పత్రి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యశ్రీరావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మమ్మ తాతయ్య ప్రేమ కోసం ఆత్మహత్య
కోల్‌సిటీ : గోదావరిఖని ఫైవింక్లయిన్ చౌరస్తాకు చెందిన రాసమల్ల అభినయ్(16) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అభినయ్ తల్లిదండ్రులు విజేందర్, కవిత హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరిది ప్రేమవివాహం కావడంతో బంధువులకు దూరమయ్యారు. అభినయ్ తనకు అమ్మమ్మ, తాతయ్య ప్రేమ కావాలని అనేకసార్లు బంధువులను కోరాడు. అయినా ప్రేమ పంచకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స మహేందర్ తెలిపారు. -
ఫ్రూట్స్ కోల్ట్ స్టోరేజీ సెంటర్లో అగ్ని ప్రమాదం
కోల్‌సిటీ : గోదావరిఖనిలోని ఓ ఫ్రూట్స్ కోల్డ్ స్టోరేజ్ సెంటర్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గంగానగర్‌లోని లారీల మెకానిక్ షెడ్ ప్రాంతంలో కొంతకాలంగా తాజ్ ఫ్రూట్స్ కోల్డ్‌స్టోరేజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ అరటిపండ్లు పండిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సెంటర్ నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఆస్కారం లేదని, విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఇటీవల కేంద్రానికి విద్యుత్ విభాగం అధికారులు పవర్ కట్ చేశారని స్టోరేజ్ సెంటర్ మేనేజర్ మోహిద్ వెల్లడించాడు. కేంద్రంలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఎక్కువగా వ్యాపించాయని ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ మహిపాల్ తెలిపారు. సకాలంలో చేరుకోకుంటే భారీ ప్రమాదం జరిగేదని పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని కేంద్రం నిర్వాహకులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో రూ.లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని యజమాని తాజొద్దీన్ తెలిపారు. వాస్తవ నష్టంపై అంచనా వేస్తున్నామని ఫైర్ అధికారులు వెల్లడించారు. -
వైద్యానికి డబ్బులు డిమాండ్
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అనాథ వృద్ధురాలు డీసీహెచ్ఎస్ విచారణ ఉచితంగా వైద్యసేవలందిస్తామని వైద్యుల హామీ లంచాల కోసం పీడిస్తే చర్యలు: డీసీహెచ్ఎస్ కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయడానికి రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ అనాథ వృద్ధురాలు కలెక్టర్‌కు ఫిర్యాదుచేసింది. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల నిర్వహణ సమన్వయకర్త(డీసీహెచ్ఎస్) అశోక్‌కుమార్ ఆస్పత్రిలో మంగళవారం విచారణ జరిపారు. సూరం లక్ష్మి అనే వృద్ధురాలిని ఆమె భర్త నారాయణ చాలాకాలం క్రితం వదిలేశాడు. వీరికి సంతానంలేదు. లక్ష్మి కొంతకాలంగా తిలక్‌నగర్‌లోని శ్రీధర్మశాస్త్ర నిత్యన్నదాన వేదికలో ఆశ్రయం పొందుతోంది. ఈ నెల 25న ఆశ్రమంలో గిన్నెలు తోముతున్న క్రమంలో కాలుజారి కిందపడింది. దీంతో కుడికాలు విరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయలేమని, అవసరమయ్యే రాడ్ కోసం రూ.10వేలు ఇస్తేనే ఆపరేషన్ చేస్తామని ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారని ఆరోపిస్తూ లక్ష్మి బంధువులు సోమవారం కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ విచారణ జరపాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. డబ్బులు డిమాండ్ చేయలేదు: డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి బాధితురాలిని పరిశీలించిన డీసీహెచ్ఎస్ మంగళవారం బాధితురాలి బంధువులు, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో సమస్యపై చర్చించారు. వృద్ధురాలికి ఉచితంగా ఆపరేషన్ చేస్తానని చెప్పానని, రాడ్ తీసుకురావడానికి రూ.5వేలవరకు ఖర్చు అవుతుందని మాత్రమే వారికి సలహా ఇచ్చానని డాక్టర్ వివరణ ఇచ్చారు. తను డబ్బులు ఎవరినీ డిమాండ్ చేయలేదని తెలిపారు. ఉచితంగా ఆపరేషన్ చేయిస్తాం వృద్ధురాలి కాలుకు ఉచితంగా ఆపరేషన్ చేయడంతోపాటు అవసరమైన రాడ్‌ను కూడా ఆస్పత్రి నిధుల నుంచి కొనుగోలు చేసి తెప్పిస్తామని డీసీహెచ్ఎస్ స్పష్టంచేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూపరింటెండెంట్ సూర్యశ్రీని ఆదేశించారు. ఉచితంగా ఆపరేషన్ చేయిస్తే చాలంటూ బంధువులు విజ్ఞప్తి చేశారు. లంచాల కోసం పీడిస్తే చర్యలు ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్న పేదల నుంచి లంచాల కోసం వస్తే చర్యలు తీసుకుంటామని డీసీహెచ్ఎస్ అశోక్‌కుమార్ హెచ్చరించారు. డబ్బుల కోసం రోగులను వేధిస్తున్నారని ఈ నెల 14న ‘ఖని’ ధర్మాస్పత్రిలో రాబందులు’ అనే కథనం ‘సాక్షి’లో ప్రచురితమైంది. దీనిపైనా డీసీహెచ్ఎస్ విచారణ జరిపారు. ప్రసవం కోసం వచ్చిన అనూష అనే గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి రూ.వెయ్యి డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలకు వైద్య సిబ్బంది నుంచి వివరణ తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునారవృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బల్దియాలో డెంగీ పాగా!
అప్రమత్తం చేసిన వైద్యాధికారులు స్పందించని కార్పొరేషన్ అధికారులు నగరంలో విచ్చవిడిగా డ్రెయినేజీ లీకేజీలు కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో పారిశుధ్యం అస్తవ్యస్తంతో ప్రజలు విషజ్వరాలబారిన పడుతున్నారు. విచ్చలవిడిగా పెరిగుతున్న దోమలతో ఇబ్బంది పడుతున్నారు. రామగుండం విద్యుత్‌నగర్‌కు చెందిన ఫక్రోద్దీన్ డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల్లో డెంగీ పాజిటీవ్ అని నిర్ధారణ అయినట్లు తెలిసింది. విషయం తెలిసిన జిల్లా వైద్యాధికారులు శుక్రవారం రాత్రి బల్దియా అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో స్పందించిన కమిషనర్ డి.జాన్‌శ్యాంసన్ శనివారం రామగుండం విద్యుత్నగర్తోపాటు పలు సమస్యాత్మకమైన ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఇంటింటికీ తిరిగి పారిశుధ్యం పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం మెరుగుపర్చడంతోపాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ హెచ్చరించారు. కంపుకొడుతున్న కాలనీలు.. లక్ష్మీనగర్‌లోని వ్యాపార కూడలి, డాక్టర్స్ స్ట్రీట్, విద్యాలయాల ప్రాతాలు, మార్కెట్ ప్రాంతాలలో చెత్త కుప్పలు, మరోవైపు రమేశ్‌నగర్, మార్కండేయకాలనీ, విఠల్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలలో భారీగా డ్రెయినేజీ లీకేజీలతో కంపుకొడుతున్నాయి. అంటురోగాలకు నిలయాలుగా మారుతున్నాయి. పందులు చెత్త కుప్పలపై స్వైరవివాహరం చేస్తున్నాయి. కానరాని బ్లీచింగ్ పౌండర్... పేరుకే మున్సిపల్ కార్పొరేషన్. కానీ పారిశుధ్యం విషయంలో గ్రామపంచాయతీలే నయమనిపిస్తుంది. తొలగించిన చెత్త ప్రాంతంలో దుర్వాసన వ్యాపించకుండా, ఈగలు, దోమలు వృద్ధిచెందకుండా బ్లీచింగ్ పౌండర్ చల్లాల్సి ఉంది. కానీ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా కానరావడం లేదు. ఇదేంటని అడిగితే... స్టాక్ తక్కువగా ఉందంటూ పొంతలేని సమాధానాలు ఇస్తున్నారు. వర్షాకాలం అని తెలిసీ కూడా బ్లీచింగ్ పౌండర్ ముందస్తుగా స్టాక్ ఏర్పాటు చేసుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. పొంచి ఉన్న వ్యాధులు... పారిశుధ్య నిర్వహణ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చాలా మంది జ్వరాలతో మంచం పట్టారు. పెరుగుతున్న దోమలు, ఈగలు, పందులతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. మలేరియా, డయేరియా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు కానరావడం లేదు. -
‘ఖని’ ధర్మాస్పత్రిలో రాబంధులు
డబ్బుల కోసం రోగులకు సిబ్బంది వేధింపులు డెలివరీ అయినందుకు రూ.వెయ్యి డిమాండ్ కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స కోసం వస్తున్న వారిని సిబ్బంది డబ్బుల కోసం పీడిస్తున్నారు. శనివారం ఓ మహిళకు ప్రసవం చేయగా.. ఆమె కుటుంబసభ్యుల నుంచి సిబ్బంది రూ.వెయ్యి డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని రూ.600 సమర్పించుకుంటే.. మెుత్తం ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశారు. దీంతో సదరు సిబ్బందిపై బాధితులు ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం... గోదావరిఖని జవహర్‌నగర్‌కు చెందిన పోరండ్ల వైకుంఠం, స్వరూప దంపతుల రెండవ కూతురు అనూష రెండవ కాన్పు కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేరింది. శనివారం వైద్యులు ప్రసవం చేశారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బాలింత అనూషతోపాటు శివువును బయటకు తీసుకొచ్చిన సిబ్బంది రూ.వెయ్యి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న అనూష తండ్రి వైకుంఠం రూ.500 ఇచ్చాడు. అవి సరిపోవని సిబ్బంది తీసుకోవడానికి నిరాకరించడంతో మరో రూ.వంద కలిపి రూ.600 ఇచ్చాడు. అయినా సంతృప్తి చెందని సిబ్బంది రూ.వెయ్యి ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో వైకుంఠం సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆస్ప్రత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీకి ఫిర్యాదు చేశాడు. పేదల దగ్గర లంచాల పేరుతో ఎలా వసూలు చేస్తున్నారని సిబ్బందితోపాటు సూపరింటెండెంట్‌ను నిలదీశాడు. ఆస్పత్రిలో చాలామంది నుంచి రూ.వెయ్యి నుంచి రూ.మూడువేల వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. సిబ్బంది మాత్రం తాము ఎవరీ దగ్గరా డబ్బులు డిమాండ్ చేయలేదని పేర్కొనడం పేర్కొనడం గమనార్హం. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం... –సూర్యశ్రీ, సూపరింటెండెంట్ ఆస్పత్రిలో సిబ్బంది డబ్బుల కోసం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుండా చూస్తాం. అవినీతిని అరికట్టడానికి త్వరలోనే ఆస్పత్రిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తాం. ఆస్పత్రిలో లంచాలు అడగటం, ఇవ్వడం నేరం. -
జల దీవెన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : శ్రావణ మాసం తొలి శుక్రవారం శోభ గోదావరి అంత్య పుష్కరాల్లోనూ కనిపించింది. పుష్కర స్నానాల అనంతరం భక్తులంతా సమీపంలోని అమ్మవార్ల ఆలయాలను దర్శించుకున్నారు. నదిలో వరద ప్రవాహం పెరగడంతో కొన్ని ఘాట్లను మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిని నిండైన భక్తితో కొలిచి చల్లగా చూడాలని మొక్కుతూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో సుమారు 13 వేల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. శుక్రవారం కూడా నరసాపురంలోని ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగింది. వలంధర రేవులో వేకువజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించారు. కొవ్వూరు వద్ద గోదావరి ఉగ్రరూపంతో ఉంటే నరసాపురంలో మాత్రం ప్రశాంతంగా దర్శనమిచ్చింది. నదిలో తగినంత నీరు లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. సముద్రానికి దగ్గరగా ఉండటంతో ఆటుపోట్ల ప్రభావం ఈ ఘాట్‌పై ఉంటుంది. అంత్యపుష్కరాల ప్రారంభం నుంచీ నరసాపురం గోదావరిలో పాటు సమయంలోనూ భక్తులు స్నానాలకు ఇబ్బంది పడేంతగా నీటిమట్టం తగ్గలేదు. శుక్రవారం మాత్రం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకూ నీటిమట్టం దారుణంగా పడిపోయింది. దీంతో జల్లు స్నానాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఆచంట మండలం కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పెదమల్లంలో మాచేనమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధాంతం కేదారీఘాట్‌లో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో గోదావరి మాతకు లక్ష కుంకుమ పూజ నిర్వహించారు. గోదారమ్మకు పసుపు కుంకుమలు సమర్పించి హారతులిచ్చారు. కుంకుమ పూజల్లో 108 మంది మహిళలు పాల్గొన్నారు. కేదారీఘాట్‌లో 6వ రోజున 6వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిట్టు అధికారులు లెక్కగట్టారు. ప్రమాదకర ఘాట్ల మూసివేత గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో కొవ్వూరులోని పాత పుష్కర ఘాట్‌ను మూసివేశారు. గత ఏడాది పుష్కరాల్లో విస్తరించిన నూతన ఘాట్లలో మాత్రమే అనుమతించారు. పెరవలి మండలంలోని ఖండవల్లి, కానూరు అగ్రహారం, ముక్కామల, ఉమ్మిడివారిపాలెం, కాకరపర్రు గ్రామాల్లోని 6 ఘాట్లు మూతపడ్డాయి. -
‘ఖని’లో ఫైనాన్స్ మాఫియా
అవసరానికి అధిక వడ్డీలకు అప్పులు బలవంతంగా అంటగడుతున్న చిట్టీలు కుదేలవుతున్న వ్యాపారుల గోదావరిఖని : గోదావరిఖనిలో ఫైనాన్స్ దందా జోరుగా సాగుతున్నది. బ్యాంకులు చిరు వ్యాపారులు, మధ్యతరహా వ్యాపారులకు ప్రభుత్వాలు, బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. మాఫియాను తలపించేలా ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రధాన వ్యాపారకేంద్రమైన లక్ష్మీనగర్ మార్కెట్లో వ్యాపార అవసరాలకు 8 నుంచి 10 శాతం వడ్డీకి అప్పులు ఇస్తూ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మరికొందరు రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రైవేటుగా చిట్టీలు నిర్వహిస్తూ బలవంతంగా చిట్టీలలో వ్యాపారులను చేరుస్తున్నారు. సమయానికి డబ్బులు చెల్లించని వారి ఆస్తులు జప్తు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి వడ్డీ.. ప్రధాన మార్కెట్ లక్ష్మీనగర్‌లో వ్యాపారం సాగించడానికి డబ్బులు అవసరం కాగా...దీన్ని వడ్డీ వ్యాపారులు అవకాశంగా తీసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. సాధారణంగా 2 శాతం వరకు మార్కెట్లో వడ్డీలకు ఇస్తుండగా...సదరు వ్యక్తులు అత్యవసరం పేరుతో లక్ష రూపాయలు ఇచ్చి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వడ్డీ వసూలు చే స్తున్నారు. ఇక డబ్బు అత్యవసరమై బంగారు నగలను కుదవపెట్టి అప్పులు తీసుకున్న వారు ఒకవేళ నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించని పక్షంలో ఆ బంగారు నగలను జప్తు చేసుకుంటున్నారు. ‘చిట్టీల గ్యాంగ్’ హల్చల్ పట్టణంలో ఓ వ్యక్తికి కొందమంది వ్యక్తులు అండగా ఉండి ప్రధాన మార్కెట్లో అనుమతి లేకుండా చిట్టీ వ్యాపారం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. వీరు ముందుగా ఆ చిట్టీలో ఎంత మంది ఉండాలో నిర్ణయించి ఆయా వ్యాపారులు, వ్యక్తుల పేర్లను రాసుకుని బలవంతంగా చిట్టీ వ్యాపారంలో భాగస్వామ్యులు కావాలని వారికి పుస్తకాలు అంటగడుతున్నారు. ‘రేపటి నుంచి మావోడు వస్తడు...డబ్బులు పంపించండి..మీకు రెండు మూడు నెలల్లో చిట్టీ ఇప్పిస్తాం’ అంటూ హుకుం జారీ చేస్తున్నారు. కోట్ల రూపాయాల్లో దందా గోదావరిఖని లక్ష్మీనగర్ మార్కెట్ కేంద్రంగా కోట్ల రూపాయల చిట్టీల దందా సాగుతోంది. ఎలాంటి అనుమతి లేకుండానే రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చిట్టీలను నిర్వహిస్తున్నారు. రూ.15 లక్షల చిట్టీ అయితే 20 నెలల కాలపరిమితిని నిర్ణయించి దుకాణ యజమానుల వద్ద రోజుకు రూ.2,500 చొప్పున నెలకు రూ.75 వేలు వసూలు చేస్తున్నారు. ఇలా మార్కెట్లో ప్రైవేటు చిట్టీల వ్యాపారమే సుమారు రూ.5 కోట్ల వరకు నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్, చిట్టీల దందా మాత్రం అక్రమంగా సాగుతున్నా అందరూ మామూలుగానే తీసుకుంటున్నారు. మాఫియాకు అడ్డుకట్ట వేయకుంటే వ్యాపారులు బిచానా ఎత్తేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. – ఓ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చూసిన వ్యక్తి తన ఆసుపత్రిలో పనిచేసేందుకు ఓ వైద్యుడికి అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చేందుకు అప్పులు చేశాడు. అయితే నెల వేతనం ఇవ్వడం కోసం ఆ సమయంలో ఎక్కువ వడ్డీలకు మరింత అప్పులు చేశాడు. ఈ అప్పులను తీర్చేందుకు చిట్టీలు వేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకువచ్చాడు. ఇలా ఆర్థిక భారం అధికం కావడంతో ఐపీ పెట్టాలని అనుకున్నాడు. చివరకు ఫైనాన్స్ నిర్వాహకులు సయోధ్యకు వచ్చినట్లు సమాచారం. – పట్టణంలో ఓ వ్యక్తి ల్యాబ్ నిర్వహణకు రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు అధిక వడ్డీలు వసూలు చేయడంతో నిర్వహణ కష్టంగా మారింది. చివరకు ఒక ఏడాదిలోనే రూ.15 లక్షల వరకు అప్పులు చే శాడు. ఈ డబ్బులకు బదులుగా ఆ వ్యక్తికి సంబంధించిన భూమిని ఫైనాన్సర్లు తమ పేరుపై రాయించుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ వ్యక్తి ల్యాబ్‌ను మూసివేసి కనిపించకుండాపోయాడు. -
మరో పవర్‌హౌస్ మూత
గోదావరిఖని 18 మెగావాట్ల ప్లాంట్ మూసివేతకు సింగరేణి నిర్ణయం ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం ఆందోళన బాటలో కార్మిక సంఘాలు గోదావరిఖని (కరీంనగర్) : కంపెనీ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం గోదావరిఖనిలో నెలకొల్పిన 18 మెగావాట్ల పవర్‌హౌస్ మూతపడనుంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి ఆధ్వర్యంలోనే 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పవర్‌హౌస్‌లో పనిచేస్తు న్న ఉద్యోగులను బదిలీ చేయడంలో భాగంగా స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్లకు వెళ్లడానికి దరఖాస్తులు సమర్పించాలని కోరింది. ఈ క్రమంలో పవర్‌హౌస్ మూసివేయవద్దని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు 1998లో బెల్లంపల్లి పవర్‌హౌస్, 2014లో కొత్తగూడెం పవర్‌హౌస్ మూసివేతకు గురికాగా ఆ జాబితాలో గోదావరిఖని పవర్‌హౌస్ చేరనున్నది. 1968 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం రామగుండం రీజియన్‌లో 1959 సంవత్సరం బొగ్గుగను లు చేపట్టగా 1961 నుంచి బొగ్గును వెలికితీత ప్రారంభమైంది. ఆ సమయంలో విద్యుత్‌కు ఇబ్బందిగా మారడం తో యాజమాన్యం గోదావరిఖనిలో 18 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్‌హౌస్‌ను రుమేనియా దేశ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.7కోట్ల వ్యయంతో నిర్మించింది. 1968 నుంచి మూడు టరై్బన్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైం ది. మొదట్లో 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినా.. క్రమేణా ఒక టరై్బన్‌తో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికే పరిమితమైంది. ఈ పవర్‌హౌస్‌లో 248 మంది పనిచేయా ల్సి ఉండగా ప్రస్తుతం 111 మంది మాత్రమే ఉన్నారు. రామగుండం, శ్రీరాంపూర్ ఏరియాలకు సరఫరా పవర్‌హౌస్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రామగుండం రీజియన్, శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని పలు బొగ్గుగను లు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నారు. పలు కాలనీలకు సైతం వినియోగిస్తున్నారు. 2013లో పవర్‌హౌస్‌లోని రెండవ టరై్బన్‌కు సంబంధించి రన్నర్ రీ–బ్లేడింగ్ చేయడానికి రూ.70లక్షల వ్యయంతో హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇప్పటివర కు ఆ టరై్బన్‌ను సదరు సంస్థ తీసుకువచ్చిన దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం ఒకే టరై్బన్‌తోనే నాలుగు మెగావా ట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం పవర్‌హౌస్ మూసివేతన నేపథ్యంలో అందులో పనిచేస్తు న్న ఉద్యోగుల్లో మొదటి విడతగా వివిధ డిజిగ్నేషన్లకు చెందిన 15 మందిని స్థానికంగా ఉన్న ఏరియా వర్క్‌షాపు, ఆటో వర్క్‌షాపులకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాల ని యాజమాన్యం ప్రకటించింది. అయితే పవర్‌హౌస్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్మికులను బదిలీ చేసే ఆలోచనను విరమించుకోవాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. -
గోదావరిఖనిలో చోరీ
గోదావరిఖని (కరీంనగర్) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లా గోదావరిఖనిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక 5వ ఇంక్లైన్ కాలనీలోని ఓ ఇంట్లో నిన్న రాత్రి దొంగలు పడి 15 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 70 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
కుదిరిన ముహూర్తం
ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్–1 ప్లాంట్లకు ముహూర్తం ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లలో నిమగ్నమైన యాజమాన్యాలు గోదావరిఖని : ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పారిశ్రామిక ప్రాంత పర్యటనకు ముహూర్తం ఖరారైంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని ఈ ప్రాంతానికి వస్తారని స్వయంగా కేంద్రమంత్రులే ప్రకటించినప్పటికీ ఆయన పర్యటన రదై్దంది. తాజాగా సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర పర్యటనకు రావాలని కోరడంతో ప్రధాని అంగీకరించారు. ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర పర్యటనకు వస్తున్న క్రమంలో రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్–1 ప్లాంట్, ఆర్ఎఫ్సీఎల్ గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మూసివేసిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని గ్యాస్ ఆధారితంగా పునర్నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అంతర్గత పనులు మార్చి 25న (జీరో డేట్) ప్రారంభమయ్యాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించే క్రమంలో రామగుండంలో తెలంగాణ స్టేజ్–1 కింద 800 మెగావాట్ల రెండు యూనిట్లను నెలకొల్పుతోంది. ఈ పనులు జనవరి 29న (జీరో డేట్) అంతర్గతంగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 7న లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో మూడు హెలీక్యాప్టర్లు ల్యాండ్ అయ్యేవిధంగా హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. పక్కనే గల స్టేడియంలో బహిరంగసభ నిర్వహించే అవకాశాలున్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో మహర్దశ గతంలో రామగుండం పారిశ్రామికాభివృద్ధికి ఎరువుల కర్మాగారం కీలకంగా నిలిచింది. అన్నపూర్ణ పేరుతో ఎరువులను తెలంగాణ ప్రాంతానికి అందించింది. అయితే నిర్వహణ లోపాలు, అప్పుల కారణంగా ఈ కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో 1999 మార్చి 31న ఉత్పత్తిని నిలిపివేశారు. బీఐఎఫ్ఆర్కు వెళ్లిన ఈ కంపెనీ రూ.10 వేల కోట్ల అప్పులను మాఫీ చేయడంతో చాలాకాలం తర్వాత అందులో నుంచి బయటపడింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని గ్యాస్ ఆధారితంగా పునర్నిర్మించడానికి నిర్ణయించింది. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్లో రూ.5,700 కోట్ల అంచనా వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు. 3,850 మెట్రిక్ టన్నులు అమోనియా, 2,200 మెట్రిక్ టన్నుల యూరియా ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఈనెల 8న గుజరాత్‌కు చెందిన కంపెనీతో ఒప్పందం జరిగింది. కాకినాడ నుంచి మల్లవరం వరకు వేసే పైపులైన్ నుంచి గ్యాస్‌ను తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రామగుండం ఎరువుల కర్మాగారం ఆవరణలోని పాత యంత్రాలు, విభాగాలను పూర్తిగా తొలగించి నేలను చదును చేశారు. యూరియా ప్రిల్లింగ్ టవర్, యూరియాను నిల్వ ఉంచే సైలో మినహా అన్నింటిని తొలగించారు. ఇందులో 500 మంది శాశ్వత ఉద్యోగులు, మరో వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి లభించనుంది. రెండు ప్లాంట్లు... 1600 మెగావాట్లు తెలంగాణ స్టేజ్–1 మొదటి దశలో 800 మెగావాట్ల రెండు యూనిట్ల నిర్మాణ పనులు వేగంగా నడుస్తున్నాయి. బాయిలర్ కాంట్రాక్టు పొందిన బీహెచ్ఈఎల్ సంస్థ గ్రౌండ్ లెవల్, గ్రేడింగ్ పనులను పూర్తి చేసి బాయిలర్లు నెలకొల్పేందుకు ఫౌండేషన్‌ను సిద్ధం చేసింది. టర్బైన్ కాంట్రాక్టును దక్కించుకున్న ఆల్స్టాం సంస్థ మట్టి పరీక్ష పనులను పూర్తి చేసి పవర్‌హౌస్ స్థలాన్ని చదును చేసి స్ట్రక్చర్ల నిర్మాణానికి సిద్ధం చేసింది. అలాగే పవర్‌హౌస్, బాయిలర్లు, కూలింగ్ టవర్లు, స్విచ్యార్డుతోపాటు 275 మీటర్ల చిమ్నీని నిర్మిస్తారు. తెలంగాణ ఫేస్–1 కోసం ఇప్పటికే రూ.10,500 కోట్లు మంజూరయ్యాయి. బాయిలర్, టర్బైన్ పనులు నడుస్తుండగా, మిగతా సివిల్ పనులను బీహెచ్ఈఎల్, ఆల్స్టాం సంస్థలు సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించాయి. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నందున ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 42 నెలల సమయం పడుతుంది. ఫేస్–2లో 800 మెగావాట్ల 3 యూనిట్లను ప్రస్తుత కొత్త ప్లాంట్ ప్రతిపాదిత స్థలంలోనే నిర్మించేందుకు కార్పొరేట్ ఇంజనీరింగ్ విభాగం నిర్ణయించింది. ఈ మూడు యూనిట్లకు అనుసంధానంగా ఉండే మెయిన్ ప్లాంటులోని బాయిలర్, టర్బైన్ తదితర విభాగాలను ఫేస్–1 పరిసరాలలోనే ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 7వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుండడంతో పనులు మరింత వేగవంతమవుతాయని భావిస్తున్నారు. -
సైబర్ క్రైం పోలీస్ పేరుతో సింగరేణి ఉద్యోగికి బెదిరింపు'
రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు కోల్‌సిటీ : తాను సైబర్ క్రైం పోలీసునంటూ గోదావరిఖనిలో ఓ పీఈటీ టీచర్ తప్పుడు ప్రచారం చేసుకుంటూ... ఓ సింగరేణి ఉద్యోగుడిని బెదిరించి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. అనుమానంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చాకచక్యంగా నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు, బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని తిరుమల్‌నగర్‌కు చెందిన ఎరుకల సంతోష్‌కుమార్ సింగరేణి ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో కోఆర్డినేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. స్థానిక రమేశ్‌నగర్‌కు చెందిన ఎనగందుల రమేశ్ పట్టణంలోని పలు ప్రైవేట్ స్కూళ్ళల్లో పీఈటీగా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సంతోష్‌కుమార్‌కు ఫోన్ చేసిన రమేశ్ తను సైబర్ క్రైం పోలీసునని పరిచయం చేసుకున్నాడు. ‘నీ మీద కేసయ్యింది... నీ కోసం తిరుగుతున్నాం... రూ.30 వేలు ఇస్తే పైఅధికారులకు చెప్పి కేసు లేకుండా చేస్తా... లేకుంటే నీకే నష్టం’ అంటూ బెదిరించాడు. అనుమానం వచ్చిన సంతోష్‌కుమార్ కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ విభాగంలో పని చేస్తున్న తన బంధువుకు ఈ విషయం చెప్పాడు. డబ్బు కోసం ఆ వ్యక్తి ఇలా చేస్తున్నాడని తెలుసుకున్న సంతోష్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం అడిగిన డబ్బులు ఇస్తానని రమేశ్‌ను, జీఎం ఆఫీస్ దగ్గరికి సంతోష్‌కుమార్ రప్పించాడు. రూ.30 వేలు లేవని, మూడు వేలు మాత్రం ఇస్తానని చెప్పడంతో రమేశ్ తీసుకున్నాడు. అదే సమయంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రులు
గోదావరిఖని(కరీంనగర్): కరీంనగర్ జిల్లా గోదావరిఖని బస్‌డిపోలో నూతన బస్సు సర్వీసులను మంత్రులు ప్రారంభించారు. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో డిపోనకు కొత్తగా మంజూరైన 10 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులతోపాటు తిరుపతికి ఏసీ బస్సును మంత్రులు ఈటల రాజేందర్, పట్నం మహేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు. -
శ్రీపాదరావు విగ్రహానికి నల్లరంగు పూసిన దుండగులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మాజీ అసెంబ్లీ స్పీకర్ డి. శ్రీపాదరావు విగ్రహానికి ఆగంతకులు శనివారం అర్థరాత్రి నల్లరంగు పూశారు. ఆదివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ శ్రీపాదరావు విగ్రహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను గుర్తించి కఠనంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
రెండు క్వింటాళ్ల గంజాయి పట్టివేత
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను కరీంనగర్ జిల్లా గోదావరిఖని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.11.50 లక్షల విలువైన 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాలివీ... రామగుండం మండలం కొత్తపల్లికి చెందిన మేరుగు సదయ్య, నేరేళ్ల సదయ్య పాత నేరస్తులు. వీరు కొత్తపల్లి గ్రామానికే చెందిన గంధం రవి, గొట్టెపర్తి ధర్మేందర్, పుట్నూర్‌కు చెందిన మేకల రవీందర్, హనుమంతునిపేట వాసి త్రిదండపాణి నరేశ్‌కుమార్, సుల్తానాబాద్ మండలం ఐతురాజుపల్లికి చెందిన చీకట్ల మధు కలిసి నాలుగు రోజుల క్రితం ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి మంగళవారం గోదావరిఖనికి చేరుకున్నారు. గోదావరిఖనితోపాటు సమీపంలోని పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో విక్రయించాలనే ఉద్దేశంతో వెళ్లేందుకు సరుకుతో బస్టాండ్‌లో వేచి చూస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. నేరెళ్ల సదయ్య పోలీసులను చూసి తన గంజాయిని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. మిగతా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సంచుల్లో ఉన్న 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భద్రాచలం టు మహారాష్ట్ర.. భద్రాచలం సమీపంలోని సీలేరు, చింతూరు, మెతుకుగూడెం, విశాఖపట్టణం సమీపంలోని రంపచోడవరం, ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మల్కనగిరి అటవీ ప్రాంతాల్లో పండించే గంజాయిని ప్రత్యేక ప్యాకింగ్‌తో స్మగ్లర్లు ఇక్కడికి తీసుకువచ్చి... తిరిగి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలకు రవాణా చేస్తుంటారు. ఒక కిలో గంజాయిని ఆయా ప్రాంతాల్లో రూ.1500కు కొనుగోలు చేసి దాన్ని రూ.5 వేల చొప్పున ఈ ముఠా విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. మేరుగు సదయ్య, నేరెళ్ల సదయ్య గతంలో గంజాయి అమ్మి పోలీసులకు చిక్కారు. అయినా తీరు మార్చుకోని వారు ఇదే దందాలోకి మరికొందరిని లాగి జైలు పాలయ్యారు. -
‘ఖని’ కేంద్రంగా గుట్కా దందా!
* నెలకు రూ.3 కోట్లకు పైగా అమ్మకాలు * ‘మామూలు’గా తీసుకుంటున్న పోలీసులు * సిద్దిపేటలో నిల్వ కేంద్రం * నేతలే పెట్టుబడిదారులు కరీంనగర్ క్రైం : జిల్లాలో గోదావరిఖని కేంద్రంగా గుట్కా దందా జోరుగా సాగుతోంది. పట్టించుకోవాల్సిన పోలీసులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్లో గుట్కాదందాకు స్థానిక పోలీసులు బ్రేక్ వేసినా.. ‘ఖని’లో మాత్రం అక్కడి పోలీసులు గుట్కా వ్యాపారులకే వంతపాడుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ‘ఖని’కి .. గతంలో జిల్లాకేంద్రంలో గుట్కా దందా జోరుగా కొనసాగేది. వివిధ ప్రాంతాలకు ఇక్కడినుంచే రవాణా చేసేవారు. ఎస్పీ జోయల్‌డేవిస్ గుట్కా రవాణాపై ఉక్కుపాదం మోపడంతో కిందిస్థాయి సిబ్బందిలో చలనం వచ్చింది. జిల్లాకేంద్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్ సీఐలు ఎప్పటికప్పుడు దాడులు చేసి పెద్దఎత్తున గుట్కాలను పట్టుకుని అమ్మకాలు, రవాణాకు బ్రేక్ వేశారు. దీంతో 95 శాతం అమ్మకాలు నిలిచిపోయాయి. ఇక్కడి గుట్కా వ్యాపారులు ఇతర వ్యాపకాలకు మళ్లారు. అదే సమయంలో గోదావరిఖనిలో గుట్కా అమ్మకాలు, వ్యాపా రం జోరుగా సాగుతుండడం చర్చనీయూంశమైంది. నెలకు రూ.కోట్లలో దందా గోదావరిఖని ప్రాంతంలో ప్రతినెలా గుట్కాల దందా రూ.మూడు నుంచి రూ.నాలుగు కోట్ల వరకు సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడినుంచే పొరుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, పెద్దపల్లి, మహారాష్ట్ర సరిహద్దు, ధర్మపురి వరకూ దందాను విస్తరించారని తెలిసింది. మహారాష్ట్ర, మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి గుట్కా లోడ్‌తో పదుల సంఖ్యలో లారీలు గోదావరిఖ నికి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వ్యాపారులు సిద్దిపేటకు చెందిన కొందరు బడా నేతలతో సత్సంబంధాలు పెట్టుకుని ఈ దందాకు తెరలేపినట్లు ఆరోపణలొస్తున్నారుు. కంపెనీల నుంచి తెప్పించి సిద్దిపేటలో నిల్వ చేసి అనంతరం ఖనికి తరలిస్తున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ గుట్కా దందాపై గోదావరిఖని పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఫిర్యాదు చేసినా పట్టుకోవాల్సిన పోలీసులే.. వ్యాపారులను అప్రమత్తం చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ‘లక్షల్లో మామూళ్లు ఇస్తున్నాం.. ఫలానా నాయకుడి అనుచరులు ఈ దందాల్లో భాగస్వాములు..’ అంటూ కొందరు గుట్కా వ్యాపారులు బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారంటే వారి వ్యాపారం ఎలా ఎదుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాకేంద్రంలో ఆర్నెల్ల కాలంలో సుమారు రూ.కోటిన్నర విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. అదే గోదావరిఖనిలో ఒక్కకేసూ నమోదు కాలేదు. ఎల్ఎండీ పోలీసులు కూడా రెండు నెలల క్రితం గోదావరిఖనికి రవాణా అవుతున్న రూ.50 లక్షల విలువైన గుట్కాను పట్టుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గుట్కా దందాను నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. భారీగా గుట్కాల పట్టివేత * ఒకరిపై కేసు నమోదు కరీంనగర్ క్రైం : జిల్లాకేంద్రం శివారులో నిల్వ చేసిన గుట్కాప్యాకెట్లను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గంజ్ ప్రాంతానికి చెందిన మాడిశెట్టి శ్రీనివాస్ కరీంనగర్ మండలంలోని రజిచమన్కాలనీలో ఓ రెండు గదులను అద్దెకు తీసుకుని వాటిలో భారీగా గుట్కా ప్యాకెట్లు నిల్వచేశాడు. విశ్వసనీయ సమాచారంతో కరీంనగర్ రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో దాడి చేశారు. షట్టర్లు ఓపెన్ చేసి చూడగా.. గుట్కాలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.రెండున్నర లక్షలకుపైగా ఉంటుందని గుర్తించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
కు.ని. కష్టాలు
కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. మొత్తం 90 మంది మహిళలు, పురుషులు శస్త్రచికిత్స కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఉదయం ఆపరేషన్లు చేస్తామని చెప్పిన అధికారులు సాయంత్రం 4గంటల వరకు కూడా ప్రారంభించలేదు. దీంతో భోజనాలు చేయకుండా వచ్చిన కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. సరిపడా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో ఆపరేషన్ థియేటర్లో నేలపై, మెట్లపై కూర్చొని డాక్టర్ల కోసం పడిగాపులు కాశారు. రాత్రి వరకు 65 మంది మహిళలకు డాక్టర్ రజినీప్రియదర్శిని, 22 మంది పురుషులకు డాక్టర్ రవీందర్ ఆపరేషన్లు చేశారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత మహిళలను నేలపై పడుకోబెట్టారు. ఆస్పత్రిలో ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రతిసారీ ఇదే దుస్థితి ఎదురవుతోంది. కు.ని. ఆపరేషన్లలో క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ భిక్షపతి, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీ, డాక్టర్లు కృపాభాయి, రవళి, రాణి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
బొగ్గు దొంగలపై పోలీసుల ఉక్కుపాదం
గోదావరిఖనిలో కార్డెన్ సెర్చ్ కోల్‌సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో బొగ్గు మాఫియా ఆటకట్టించడానికి ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ వేట ప్రారంభించారు. బొగ్గు దొంగతనాలపై ‘సాక్షి’ వరుసన కథనాలు సంచలనం సృష్టించాయి. ఇంతకాలం మౌనందాల్చిన పోలీసులను ‘సాక్షి’ కథనాలు కదిలించేలా చేశాయి. బొగ్గు మాఫియాను సీరియస్‌గా తీసుకున్న ఏఎస్పీ బుధవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘కార్డెన్ సెర్చ్’ నిర్వహించారు. వన్‌టౌన్ సీఐ ఆరె వెంకటేశ్వర్, నలుగురు ఎస్సైలు, 100 మంది కానిస్టేబుళ్లతో ఇంటింటిని సోదా చేశారు. స్థానిక భరత్‌నగర్, విఠల్‌నగర్, 7బీ కాలనీ, 6బీ గుడిసెలు, సంజయ్‌నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. స్థానిక సంజయ్‌నగర్‌లో కంటే రామస్వామి, బొగ్గు దేవేందర్‌లు బొగ్గు నిల్వ చేస్తూ పోలీసులను, సింగరేణి సెక్యూరిటీ విభాగం అధికారులను చూసి పారిపోయారు. పొదల్లో రూ.15 వేల విలువ గల సుమారు నాలుగు టన్నుల బొగ్గును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఏఎస్పీ కౌన్సెలింగ్ నిర్వహించారు. సింగరేణి సెక్యూరిటీ విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ అమిరిశెట్టి వైకుంఠం ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే, అనుమానాస్పందంగా కనిపించిన 7బీ కాలనీకి చెందిన బొల్లి శ్యాం, భూక్య ఏసు, నిమ్మల సెల్వరాజ్తోపాటు రాంనగర్‌కు చెందిన నల్ల శ్రీనివాస్, సంజయ్‌నగర్‌కు చెందిన సిరికొండ సదానందంలను బైండోవర్ చేసినట్లు తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
గోదావరిఖని (కరీంనగర్) : వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని బస్టాండ్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సదారాం సురేష్(45) ఎన్టీపీసీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. కాగా గురువారం సాయంత్రం గోదావరిఖని బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.