
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై మరో భారీ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కిలోమీటర్ పొడవుతో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. గోదావరి ఇవతల రామగుండం వైపు రాజీవ్ రహదారిని, అటు గోదావరి ఎగువన మంచిర్యాల మీదు గా సాగుతున్న నిజామాబాద్–మంచిర్యాల–జగ్దల్‌పూర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ దీన్ని నిర్మించాల నేది ఆలోచన. దాదాపు మూడున్నరేళ్ల కిందే దీని నిర్మాణానికి పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించకపోవటంతో ఈ ఆలోచన అటకెక్కింది. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తు తం సీఎం పరిశీలనలో ఉంది. ఆయన సానుకూలంగా స్పం దిస్తే అధికారులు డీపీఆర్ సిద్ధం చేసి టెండర్లు ఆహ్వా నించనున్నారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న నేపథ్యంలో స్థానికుల కోరికను నిజం చేసి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాలని సీఎంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
‘రాజీవ్’ వంతెనకు ప్రత్యామ్నాయం..
గోదావరిపై గోదావరిఖని వద్ద ఈ వంతెన ఉంది. ఇక్కడే నదిని దాటి మంచిర్యాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మంచిర్యాల 15 కిలోమీటర్లు ఉంది. మంచిర్యాల వైపు నుంచి రామగుండం రావాలంటే మంచిర్యాల వద్ద రైలు వంతెన మాత్రమే ఉండటంతో రోడ్డు ప్రయాణికులు ఈ 15 కిలోమీటర్ల దూరం వచ్చి వంతెన దాటి వెనక్కి రావాలి. నదిలో నీళ్లు లేని సమయంలో రైలు వంతెన సమీ పం నుంచి దాటి నేరుగా అంతర్గామ్ మీదుగా తక్కువ దూరంతో ప్రయాణించి వెళ్తారు. మంచిర్యాల వద్ద వం తెన నిర్మిస్తే దూరాభారం తగ్గటంతోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. వంతెన, రోడ్డుకు కలిపి దాదాపు రూ.100 కోట్ల వరకు వ్యయమవుతుందని రోడ్లు భవనాల శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment