ఆత్మీయత.. ఆప్యాయత.. సోదరభావం.. భద్రత ఇవన్నీ మిళితమైన సెంటిమెంటే రాఖీ పండుగ. అందుకే అన్నకు చెల్లి... తమ్ముడికి అక్క రాఖీ కట్టి ఆశీర్వాదాలొకవైపు.. అండగా ఉంటా అనే భరోసా మరోవైపు.. ఇలా భిన్న పార్శ్వాలు కనిపించే సెంటిమెంట్ పండుగ రాఖీపౌర్ణమి. అయితే, రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకున్న ఓ చిన్నారి.. కాస్త భిన్నంగా రాఖీని తానే స్వయంగా తయారు చేసిన కథే ఇది.
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మామిడి సహస్ర తల్లి ఇంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే, అమ్మతో పాటు కుట్లు, అల్లికలూ ప్రాక్టీస్ చేస్తున్న సహస్రకు ఓ ఆలోచన తట్టిందే ఆలస్యం.. ఓ క్లాత్ తీసుకుని దానిపై పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఆకట్టుకునేలా ఓ రాఖీగా మల్చింది. అంతేకాదు.. తమ్ముడు అని ఎంబ్రాయిడరీ చేసిన ఆ రాఖీని రేపు రాఖీ పున్నమ సందర్భంగా తన సోదరుడికి కట్టబోతోంది చిన్నారి సహస్ర. అలా సహస్ర ఐడియా షాపుకెళ్లి రాఖీ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చేస్తూనే.. అందరికంటే భిన్నమైన రాఖీని తమ్ముడికి కట్టేందుకు కారణమైంది.
(చదవండి: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా!)
Comments
Please login to add a commentAdd a comment