Rakhi Celebrations
-
తమ్ముడికి రాఖీ కట్టేందుకు..ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా!
ఆత్మీయత.. ఆప్యాయత.. సోదరభావం.. భద్రత ఇవన్నీ మిళితమైన సెంటిమెంటే రాఖీ పండుగ. అందుకే అన్నకు చెల్లి... తమ్ముడికి అక్క రాఖీ కట్టి ఆశీర్వాదాలొకవైపు.. అండగా ఉంటా అనే భరోసా మరోవైపు.. ఇలా భిన్న పార్శ్వాలు కనిపించే సెంటిమెంట్ పండుగ రాఖీపౌర్ణమి. అయితే, రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకున్న ఓ చిన్నారి.. కాస్త భిన్నంగా రాఖీని తానే స్వయంగా తయారు చేసిన కథే ఇది. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మామిడి సహస్ర తల్లి ఇంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే, అమ్మతో పాటు కుట్లు, అల్లికలూ ప్రాక్టీస్ చేస్తున్న సహస్రకు ఓ ఆలోచన తట్టిందే ఆలస్యం.. ఓ క్లాత్ తీసుకుని దానిపై పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఆకట్టుకునేలా ఓ రాఖీగా మల్చింది. అంతేకాదు.. తమ్ముడు అని ఎంబ్రాయిడరీ చేసిన ఆ రాఖీని రేపు రాఖీ పున్నమ సందర్భంగా తన సోదరుడికి కట్టబోతోంది చిన్నారి సహస్ర. అలా సహస్ర ఐడియా షాపుకెళ్లి రాఖీ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చేస్తూనే.. అందరికంటే భిన్నమైన రాఖీని తమ్ముడికి కట్టేందుకు కారణమైంది. (చదవండి: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా!) -
యుద్ధంలో మరణించిన అన్న... విగ్రహానికి రాఖీ కట్టిన చెల్లి..
ఎప్పుడూ వెన్నంటి ఉండనవసరం లేదు. అయినా, అండగా ఓ అన్నో, తమ్ముడో ఉన్నాడన్న ధీమా మామూలుగా ఉండదు. కానీ, ఆ చెల్లి భరోసాను యుద్ధం తీసుకెళ్లింది. దేశంకోసం అమరుడైన సోదరుడి విగ్రహానికి రాఖీ కట్టిన సోదరి అందరినీ కంట నీరు పెట్టించింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా ఖుడియాలకు చెందిన గణ్‌పత్ రామ్ ఆర్మీలో పనిచేసేవాడు. 2017లో సెప్టెంబర్ 24న జమ్మూకశ్మీర్‌లో జరిగిన శత్రువుల దాడిలో గణ్‌పత్ ప్రాణాలు కోల్పోయాడు. అతని సోదరి అన్న విగ్రహానికి రాఖీ కడుతున్న ఫొటోను వేదాంత్ బిర్లా లింక్డ్ ఇన్‌లో షేర్ చేశారు. ‘‘ఇదే భారత దేశ గొప్పదనం. బాధ, గర్వం కలగలిసిన ఓ క్షణం ఇది. అన్నను కోల్పోవడం బాధ, అతను దేశంకోసం ప్రాణ త్యాగం చేసినవాడు కావడం గర్వం. ఈ రాఖీ పర్వదినాన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టలేకపోయినందుకు ఆ సోదరి ఎంత మానసిక బాధ అనుభవించి ఉంటుంది. అందుకే అతని విగ్రహానికి కట్టింది’’ అంటూ కామెంట్ చేశారు. ఆ ఫొటో చూసిన నెటిజన్స్ ఆ అన్నాచెల్లెళ్లకు నీరాజనాలు పలుకుతున్నారు. -
సన్నీ లియోన్ ఇంట రాఖీ సంబరాలు, ఫొటోలు వైరల్
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇంట రాఖీ పండుగ సందడి నెలకొంది. తన భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండగను సెలబ్రెట్ చేసుకుంది. దత్త కూతురు నిష, తన కవల సోదరులు రాఖీ కట్టిన ఫొటోనలు ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇద్దరు కుమారులు, కుమార్తెతో ఉన్న ఫొటోను సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. చదవండి: పంత్‌కు రీకౌంటర్ ఇచ్చిన ఊర్వశి, ‘కౌగర్ హంటర్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు ‘అందరికీ సంతోషకరమైన రక్షా బంధన్ శుభాకాంక్షలు. నా కుటుంబాన్ని ప్రేమిస్తాను’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. అలాగే సన్నీ తన స్నేహితుడైన రోహిత్ వర్మ, సెక్యూరిటీ సలహాదారు యూసుఫ్ ఇబ్రహీంకు రాఖీ కట్టిన ఫొటోలను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అలాగే సన్నీ ఆమె ఫాలోవర్స్ రాఖీ శుభాకాంక్షలు చెబుతూ తన పోస్ట్‌పై రియాక్ట్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
సీఎం వైఎస్ జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
-
ఈ ఏడాది రాఖీ చాలా ప్రత్యేకం.. అయిదేళ్ల తర్వాత..: ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ రక్షాబంధన్ ఎంతో ప్రత్యేకమని చెప్పింది. బాలీవుడ్లో అగ్రనటిగా కొనసాగిన ప్రియాంక చోప్రా గత కొన్నాళ్లుగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో వివాహం అనంతరం ప్రియాంక అక్కడే సెటిలైపోయింది. అక్కడే హాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా మారింది. ఇక నిన్న జరిగిన రక్షాబంధన్ ఆమెకు చాలా ప్రత్యేకంగా నిలిచిందంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రాతో కలసి ఐదేళ్ల తర్వాత ఆమె రక్షాబంధన్ పండుగ జరుపుకున్నట్లు ఆమె పేర్కొంది. చదవండి: మేయర్ అభ్యర్థిగా సోనూసూద్.. క్లారిటీ ఇచ్చిన ‘రియల్ హీరో’! ఇస్టాగ్రామ్‌లో తన సోదరుడు సిద్ధార్థ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఈ ఏడాది రక్షాబంధన్ నాకు చాలా ప్రత్యేకంగా నిలిచింది. అయిదేళ్ల తర్వాత నా తమ్ముడికి రాఖీ కట్టాను. నా ఆర్మీలోని సోదరులందరికీ హ్యాపీ రాఖీ’ అంటూ విషెస్ తెలిపింది. మీరందరూ ఎక్కడ ఉన్నా ప్రేమాభిమానాలను, రాఖీలను పంపుతున్నానని, త్వరగా రాఖీ కానుకలు వస్తాయని ఆశిస్తున్నానని పేర్కొంది. ప్రస్తుతం ప్రియాంక లండన్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తన తాజా సిరీస్ ‘సైటడెల్’ షూటింగ్లో షూటింగ్ జరుపుకుంటోంది. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
వైరల్ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా రాఖీ సెలబ్రేషన్స్
Rakhi Celebrations At Chiranjeevi House : మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న(ఆగస్టు22)న చిరు పుట్టినరోజు కూడా కావడంతో మెగా కుటుంబంలో అట్టహాసంగా సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కొణిదెల ఆడపడుచులు మెగా బ్రదర్స్‌కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రామ్‌చరణ్, సాయితేజ్ ఇలా మెగా కుటుంబం అంతా ఒకచోట చేరి సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : Chiru154 : పూనకాలు లోడింగ్.. అదిరిపోయిన పోస్టర్ ఊహించిందే జరిగింది.. చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్ -
పర్యావరణం ఉట్టిపడేలా రాఖీ పండుగను నిర్వహించేందుకు గ్రీన్ వేవ్స్ సంస్థ ప్లాన్
-
ప్రజలందరికీ రక్షకులు నర్సులు
న్యూఢిల్లీ: ఎదుటివారని రక్షించేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతోన్న రక్షకులు అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నర్సులను అభివర్ణించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో నర్సింగ్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి కోవింద్ రక్షాబంధన్‌ను జరుపుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి నర్సులు రాఖీలు కట్టి, కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ అనుభవాలను రాష్ట్రపతితో పంచుకున్నారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌ని ఎదుర్కోవడంలో ముందు వరుసలో నిలిచి పోరాడుతోన్న నర్సుల సేవలను, వారి నిబద్ధతను, కొనియాడిన రామ్‌నాథ్ కోవింద్ వారిని సత్కరించారు. సహజంగా రక్షాబంధన్ రోజు, తమ సోదరుల నుంచి అక్కాచెల్లెళ్ళు రక్షణను కోరకుంటారు. అయితే నర్సులు మాత్రం ఎంతో నిబద్ధతతో, అంకిత భావంతో సోదరులకు, ప్రజలందరికీ రక్షణగా నిలుస్తారు అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నర్సులపై ప్రశంసల వర్షం కురిపించారు. కోవిడ్ మహమ్మారితో పోరాడుతోన్న వారికి సేవలందిస్తూ కరోనా బారిన పడినప్పటికీ తిరిగి కోలుకుని, నూతన శక్తితో విధులను నిర్వర్తించిన సైనిక విభాగంలోని నర్సులను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంసించారు. నర్సులందరికీ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. -
ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్లాస్మా దాతలతో రక్షాబంధన్‌ను జరుపుకున్నారు. కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసి కోవిడ్ పేషెంట్లు కోలుకోవడానికి సాయం చేసిన 13 మంది ప్లాస్మా దాతలకు గవర్నర్ సోమవారం రాజ్‌భవన్‌లో రాఖీలు, స్వీట్లు అందించారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్ లో జరిగిన ఈ ప్రత్యేక సంబురాల్లో భాగంగా గవర్నర్ ప్లాస్మా దాతల దాతృత్వాన్ని, ప్లాస్మా దానం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. వారు ఇతరులకు స్ఫూర్తి దాతలని తమిళిసై కొనియాడారు. తక్కువ ఖర్చుతో కోవిడ్ చికిత్స.. 13 మంది ప్లాస్మా దాతలు కోవిడ్ బారిన పడినప్పడు ప్రభుత్వ వైద్యశాలల్లోనే, ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లోనే చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘ప్రభుత్వ ఆసుపత్రులు, అక్కడి వైద్యులు కోవిడ్–19 చికిత్సలో గొప్ప సేవలు చేస్తున్నారని’ అభినందించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు తావు లేకుండా, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్సను నమ్మకంగా తీసుకోవచ్చని, అక్కడ వైద్యులు, ఇతర సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కోవిడ్–19 బాధితులకు తక్కువ ఖర్చుతో, మానవతా దృక్పథంతో సేవలు అందించాలని, రోగులను, వారి కుటుంబాలను మరింత కుంగదీయకుండా బాధ్యతగా వ్యవహరించాలని గవర్నర్ సూచించారు. ఈ సందర్భంగా ప్లాస్మా దాత లు తమ కరోనా చికిత్స, ప్లాస్మా దానం చేయడానికి వచ్చిన ప్రేరణ, తదితర విషయాలను గవర్నర్‌తో పంచుకున్నారు. గవర్నర్ ఈ దిశ గా చేస్తున్న కృషి తమలో స్ఫూర్తిని నింపాయ ని వివరించారు. గవర్నర్‌తో రాఖీలు, అభినం దనలు అందుకున్న ప్లాస్మా దాతలలో రాష్ట్రం లో మొట్టమొదటి కోవిడ్ పేషెంట్ రాంతేజ గంపాల, నాలుగు సార్లు ప్లాస్మా దానం చేసిన ఐఐటీ ముంబై, గ్రాడ్యుయేట్ బి.నితిన్‌కుమా ర్, రాష్ట్రంలో మొదటి ప్లాస్మా దాత ఎన్నంశెట్టి అఖిల్, సురం శివప్రతాప్, సయ్యద్ ముస్తఫా ఇర్ఫాన్, ఉమర్ ఫరూఖ్, డా. సుమీత్, జె.రా జ్‌కుమార్, పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై పీ రామకృష్ణాగౌడ్, ఎస్. శివానంద్, డా. సాయి సోమసుందర్, డా. రూపదర్శిని ఉన్నారు. ఇందులో మొత్తం ఆరుగురు రెండు సార్లు, అంతకన్నా ఎక్కువసార్లు ప్లాస్మా దానం చేయడం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. -
ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: సోదరసోదరీమణుల మధ్య బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతి భవన్లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, జయమ్మ, లక్ష్మీబాయి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ఈ పండుగ ప్రతీక అన్నారు. మహిళలను గౌరవించాలనే నిబద్ధతను ఈ పండుగ తెలియజేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అలాగే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుకు ఆయన సోదరి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ వేడుకలో సీఎం కేసీఆర్ సతీమణి శోభారాణి, కేటీఆర్ భార్య శైలిమ పాల్గొన్నారు. పండుగ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, ఇతరులు కేటీఆర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి తదితరులు కేటీఆర్‌కు రాఖీ కట్టిన వారిలో ఉన్నారు. ఆత్మీయ అనుబంధానికి ప్రతీక: హరీశ్‌రావు రాఖీ పర్వదినం సోదరసోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రక్షాబంధన్ సందర్భం గా కొండాపూర్‌లోని మంత్రి నివాసంలో పలువురు టీఆర్ఎస్ మహిళా నేతలు హరీశ్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయతను పంచుకుంటూనే కరోనా నేపథ్యంలో స్వీయ రక్షణ పాటించాలని ఈ సందర్భంగా హరీశ్‌పిలుపునిచ్చారు. -
సీఎం కేసీఆర్ నివాసంలో రక్షాబంధన్
సాక్షి, హైదరాబాద్ : ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అక్కచెల్లెళ్లతో పాటు పలువురు మహిళలు గురువారం రాఖీ కట్టారు. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన సోదరి కవిత రాఖీ కట్టారు. ముందుగా కేటీఆర్‌కు బొట్టు పెట్టి హారతి ఇచ్చి ‘కేటీఆర్’ పేరుతో ఉన్న రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఆ తర్వాత సోదరుడి వద్ద కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు కూడా కవిత రాఖీ కట్టారు. ‘కొన్ని బంధాలు నిజంగా ప్రత్యేకమైనవి’ అంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ తన ట్విటర్లో షేర్ చేశారు. సంతోష్ కుమార్ సతీమణి కూడా కేటీఆర్‌కు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. Some bonds are truly special! 😊 Happy Rakshabandhan to all the lovely sisters pic.twitter.com/wbywo0TgVn — KTR (@KTRTRS) August 15, 2019 అలాగే రక్షాబంధన్ సంప్రదాయాన్ని జూనియర్స్ కూడా ఫాలో అవుతున్నారంటూ కవిత కూడా ట్విటర్లో ఫోటోలు పెట్టారు. And the juniors follow ... pic.twitter.com/Lk6umwwcpM — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 15, 2019 సీఎం జగన్‌కు రాఖీ కట్టిన వాసిరెడ్డి పద్మ అలాగే స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఇవాళ రక్షాబంధన్ కూడా కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలువురు రాఖీలు కట్టారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జరిగిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభం సందర్భంగా పలువురు మహిళా వాలంటీర్లు సీఎం జగన్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లలో కూడా రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో తెలంగాణ గవర్నర్ నరసింహన్, విజయవాడలో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పలువురు విద్యార్థులు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి ఆశీస్సులు అందుకున్నారు. -
తాటాకు రాఖీలతో వేడుకలు
మల్కన్‌గిరి : జిల్లాలోని కలిమెల సమితి సీక్‌పల్లి పంచాయతీకి చెందిన గోరకుంట గ్రామ పాఠశాల విద్యార్థులు వినూత్నంగా తాటాకు రాఖీలు వినియోగించి పలువురిని ఆకర్షించారు. కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ రాఖీలకు బదులుగా తాటి ఆకుతో తయారు చేసిన రాఖీలు వాడి రాఖీ పౌర్ణమి సందర్భంగా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సందర్భంగా తమ తోటి విద్యార్థులు, సోదరులకు తాటాకు రాఖీలు కట్టారు. అలాగే చిత్రకొండ సమితిలోని సరస్వతీ విద్యామందిర్ విద్యార్థులు 18వ బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవానులకు రాఖీలు కట్టారు. కమాండెంట్ అమరేస్కుమార్ రాఖీ కట్టిన విద్యార్థులకు స్కూల్ బ్యాగులను గిఫ్ట్‌లుగా అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బరంపురంలో... బరంపురం : స్థానిక గిరి రోడ్లో ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాలయానికి చెందిన బ్రహ్మకుమారీలు మంజు, మాల పలువురికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా బరంపురం సర్కిల్ జైల్లో ఉన్న జీవిత ఖైదీలకు తమ సోదరీమణులు రాఖీలు కట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి : పట్టణంలో ప్రతి ఇంట రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సోదరీమణులందరూ తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి, తమ ఆత్మీయతను చాటుకున్నారు. పట్టణంలోని పలు వీధుల్లో కొందరు మగవారు కొత్త జంధ్యాలను ధరించారు. అనంతరం పట్టణంలోని జంగం, సేరి వీధుల్లో సాంప్రదాయ సిద్ధమైన గుమ్మను ఏర్పాటు చేసి, గుమ్మ గెంతాటలో యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా పావుతులం బంగారం, మిగతా వారికి వివిధ గృహోపకరణాలను అందజేశారు. -
కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత
-
కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత
హైదరాబాద్: శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగ వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండగ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కె.కవిత తన సోదరుడు ఐటీ మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఈ రోజు ఉదయమే సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. అనంతరం సోదరుడు కేటీఆర్ చేతికి రాఖీ కట్టి.. స్వీట్ అందించారు. ఈ వేడుకల్లో కేటీఆర్ కుటుంబ సభ్యులతోపాటు కవిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మాకుమారిస్ కూడా కేటీఆర్ కి రాఖీ కట్టారు. అలాగే ఈ పండగను పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు ఈ వేడుకల్లో గవర్నర్ దంపతులు.. నగర వాసులు పాల్గొనున్నారు.