గోదావరిఖనిటౌన్, న్యూస్‌లైన్: గతంలో రాష్ట్రంలోనే అత్యధిక లాభాలు గడించిన ఖని ఆర్టీసీ డిపో ప్రస్తుతం నష్టాల బాట పట్టింది. మూడేళ్లుగా ఈ పరంపర కొనసాగుతుండగా ఇప్పటి వరకు రూ.3.36 కోట్ల నష్టాలకు చేరువైంది. ఈ ఏడాది మేడారం జాతరతోపాటు మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు ప్రత్యేక బస్సులు నడిపించినా నష్టాలను మాత్రం పూడ్చకోలేకపోయింది.
డిపో పరిధిలో 136 బస్సులు ప్రతిరోజు సుమారు 58వేల కిలో మీటర్లు తిరుగుతున్నాయి. 160 సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డిపో అక్యూపెన్సి రేషియో 68 శాతం ఉంది. గతంలో ప్రతిరోజు రూ.లక్ష వరకు వచ్చే లాభాలకు రివర్స్ గేర్ పడింది. ప్రస్తుతం రోజూ రూ.30 వేల నుంచి రూ.40 వేల నష్టంతో నడుస్తున్నది.
పారిశ్రామిక ప్రాంతంలో గతంతో పోల్చితే జనాభా తగ్గడం, సొంత వాహనాలు పెరగడం, వీటితోపాటు బంద్‌లు, ఆందోళనలతో పాటు డీజిల్ ధరల భారంతో ఖని ఆర్టీసీకి భారీగా నష్టం వాటిళ్లుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో ప్రతిరోజు 50 వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 30 వేలకు పడిపోయింది.
ప్రధానంగా దీంతోనే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. అలాగే వేసవిలో ప్రయాణికుల సంఖ్య తగ్గడం, డీజిల్ ధర తరుచూ పెరగడం కూడా కారణంగా తెలుస్తోంది. ఒక్క డీజిల్ ధర భారంతోనే సుమారు 15 శాతం వరకు నష్టం వాటిళ్లుతుందని అధికారులు చెబుతున్నారు.
కార్మికుల ప్రత్యేక ప్రోత్సాహకాలు
డిపోలో పనిచేసే ప్రతి కార్మికుడిని ప్రోత్సహించేందుకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, గ్రేడ్లు వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అయితే టెక్నాలజీని వినియోగిస్తూ త్వరిత గతిన మరమ్మతులు పూర్తి చేయడం, అక్యూపెన్సీరేషియో పెంచడంతో పాటు కార్మికులు,అధికారులు ప్రత్యేక చొరవ చూపితే తప్పకుండాలాభాల బాట పట్టే అవకాశముంటుంది.
ఆదాయంలో రివర్‌స గేర్
Published Mon, Apr 7 2014 3:55 AM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM
Advertisement
Advertisement