వేములవాడ (కరీంనగర్) : దక్షిణ కాశీగా పేరొందిన కరీంనగర్ జిల్లా వేములవాడ క్షేత్రంలో సోమవారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచి 5 క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పిస్తున్నప్పటికీ దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. దీంతో క్యూలైన్లలోనే భక్తులు పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. స్త్రీలు, వృద్ధులు, పిల్లల ఇక్కట్లు వర్ణనాతీతం. అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమయింది. సాయంత్రం వరకూ ఇదే తీరు కొనసాగేలా ఉంది.