vemulawada
-
వేములవాడలో ట్రాన్స్ జెండర్స్ వివాహం.. ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత వైభవంగా శివ కల్యాణం (ఫొటోలు)
-
వేములవాడ : మళ్లొస్తాం రాజన్నా (ఫొటోలు)
-
శివరాత్రి శోభతో అలరారుతున్న తెలుగు రాష్ట్రాలు
-
అత్త మరణవార్త విని అల్లుడి మృతి
వేములవాడ/కథలాపూర్: అత్త మరణవార్త విని అల్లుడు మృతి చెందాడు. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ సంఘటన వివరాలివి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మార్కండేయనగర్కు చెందిన అలువాల లక్ష్మి (82) శుక్రవారం అనారోగ్యంతో మరణించింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురిని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన గుంటుక పర్శరాం (58)కు ఇచ్చి పెళ్లి చేశారు. కరోనా సమయంలో పెద్దకూతురు మరణించింది. శుక్రవారం ఉదయం అత్త అలువాల లక్ష్మి మరణించిందని.. అల్లుడు పర్శరాంకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. అయితే దైవదర్శనానికి విజయవాడకు వెళ్లిన పర్శరాం అక్కడే గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. ఒకేరోజు అత్త వేములవాడలో, అల్లుడు విజయవాడలో మరణించడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. పర్శరాం ముంబైలో స్థిరపడ్డాడు. పర్శరాంకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. మృతదేహాన్ని గంభీర్‌పూర్‌కు తీసుకొస్తున్నారు. -
TG GOVT: మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
-
వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు
-
నేడు వేములవాడకు సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రజాపాలన విజయోత్స వాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లా పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేవంత్ బుధవారం ఉదయం 10 గంటలకు వేములవాడకు చేరుకొని శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం గుడి చెరువు ఖాళీ స్థలంలో వేములవాడ పట్టణాభివృద్ధికి, దేవాలయ అభివృద్ధికి రూ. 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు.ప్రభుత్వం శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. అలాగే సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అనంతరం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సభ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. -
వేములవాడలో శ్రావణ శోభ..
-
అగ్గిపెట్టేలో అమ్మవారికి చీర సమర్పించిన భక్తుడు
-
కష్టపడి పెంచిన బిడ్డా.. ఇడిసిపోతివా?
చందుర్తి(వేములవాడ): ఆస్తి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఒక్కగానొక్క బిడ్డవని రెక్కల కష్టం చేసి, పెంచి పెద్ద చేసుకుంటిని బిడ్డా.. నన్ను ఇడిసిపెట్టి ఎలా పోవాలనిపించింది బిడ్డా.. ఎవరిని చూసుకొని బతకాలె బిడ్డా అంటూ ఆమె తల్లి రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. చందుర్తి మండలం బండపల్లికి చెందిన కుమ్మరి లచ్చయ్యకు భార్య లలిత, కుమారుడు బాబు ఉన్నారు. లలిత తల్లిగారింటికి వెళ్లిపోయి, కాపురానికి రాలేదు. తర్వాత లచ్చయ్య లచ్చవ్వను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కూతురు శ్రీవాణి(14) జన్మించింది. ఆమె తొమ్మిదోతరగతి చదువుతోంది. లచ్చయ్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటివరకు ఎలాంటి బాధ లేని ఆ కు టుంబంలో లచ్చయ్య మరణంతో ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ఇంటితోపాటు రెండెకరాల భూమిలో తమ కు వాటా ఉందని అతని మొదటి భార్య కొడుకు బాబు పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అప్పటినుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఇంటి వెనక స్థలంలో గుడిసె వేసుకోవాలని బాబు చూడగా లచ్చవ్వ అడ్డు చెప్పింది. ఆస్తిలో తనకు హక్కు ఉందని అతను.. తమకు వీలునామా రాశాడని ఆమె గొ డవ పడుతున్నారు. దీంతో శ్రీవాణి మనస్తాపానికి గురైంది. ఈ నెల 1న ఇంట్లోనే దూలానికి ఉరి పెట్టుకుంది. గమనించిన తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి, ఆమెను కిందికి దించారు. అపస్మారక స్థితిలోకి చేరిన శ్రీవాణిని ఆటోలో వేములవాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు బాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాగా, శ్రీవాణి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, రాత్రి స్వగ్రామం తరలించారు. -
ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని
-
PM Narendra Modi: వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
తెలంగాణలో ‘RR’ ట్యాక్స్‌పై చర్చ నడుస్తోంది: ప్రధాని మోదీ
సాక్షి, వేములవాడ: బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్ అని అన్నారు ప్రధాని మోదీ. అలాగే, మూడో దశ పోలింగ్ తర్వాత ఇండియా కూటమికి ఫ్యూజ్ ఎగిరిపోయిందని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజలు ఓటు వేసిన కారణంగానే బీజేపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని స్పష్టం చేశారు.కాగా, ప్రధాని మోదీ వేములవాడలో పర్యటించారు. ఈ సందర్బంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం, వేములవాడలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా ఖాయమని కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదు.రేవంత్, రాహుల్ ట్యాక్స్..కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పెద్ద తేడా ఏమీ లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను అవినీతి కలుపుతోంది. తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కాపాడాలి. ఓటుకు నోటు కేసుపై బీఆర్ఎస్ ఎందుకు విచారణ చేయించలేదు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై కాంగ్రెస్ ఇంత వరకూ ఎందుకు విచారణకు ఆదేశించలేదు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తే.. ఇప్పుడు 3-4 నెలల్లోనే ‘ఆర్ఆర్’ (రేవంత్, రాహుల్) ట్యాక్స్ దాన్ని మించిపోయింది. ఇక్కడి వసూళ్లు ఢిల్లీకి పంపుతున్నారు. రాహుల్ గాంధీ నాలుగున్నరేళ్లుగా అంబానీ-అదానీ పేర్లు జపించారు. ఎన్నికలు ప్రారంభం కాగానే రాహుల్.. అంబానీ-అదానీ పేర్లు జపించడం మానేశారు. అంబానీ-అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజ్‌కు ఇచ్చాయి. తొలిసారిగా ఎంఐఎంకు బీజేపీ సవాల్ విసురుతోంది. భారత్ ముందుకు సాగుతోంది..కాంగ్రెస్ అతి కష్టం మీద కరీంనగర్లో అభ్యర్థిని బరిలో నిలిపింది. పీవీని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో మనమంతా చూశాం. పీవీని భారతరత్నతో సన్మానించాము. నిన్ననే ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పీవీని ఎంతగానో గౌరవించాము. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం.. నాకు గుజరాత్లో కూడా సాధ్యం కాదు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.మన దేశంలో ఎంతో సమర్థత ఉన్నా.. ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యలవలయంగా మార్చింది. బీజేపీ, ఎన్డీఏ హయాంలోనే ఈ దేశంలో సమగ్రాభివృద్ధి జరుగుతోంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయమందించి, బీమా అందిస్తూ లాభసాటిగా మార్చాం. పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మన దేశం చేరింది. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే.. దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అయోధ్యకు రామమందిరం తలుపులు తెలంగాణ నుంచే వచ్చాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాకుండా కాంగ్రెస్ ప్రయత్నించింది. మాదిగలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లన్నీ ముస్లింలకు చెందాలని కాంగ్రెస్ నేత అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు లాక్కొని వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
-
Vemulawada : వేములవాడ ఆలయంలో రాజన్న కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
మహా జాతర షురూ
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున ఆ ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. ఉద యం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తుల రాక మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్న ను దర్శించుకుని, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ గౌతమి, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మూడు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. -
వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తిరుపతి/హైదరాబాద్, సాక్షి: వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక.. వీఐపీల తాకిడి వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్‌లు విచ్చేశారు. అలాగే.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలో.. మరోవైపు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. -
అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలు
వేములవాడ: బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యో గాలిచ్చి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఇందులో మహిళలకే 5 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ ప్రకృతి ఆగ్రహించి టెంట్లను కూల్చి వేసినట్లుగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. ఏనాడూ రాని దొరలు ఇప్పుడు ఓటుకు రూ.2 వేలు ఇస్తామంటూ మన ఇంటికి వస్తున్నారన్నారు. ఒక్కసారి ఓటు అమ్ముకుంటే మన బిడ్డల భవిష్యత్‌ను బొంద పెట్టుకున్నట్లేనని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం రాగానే భూమిలేని ప్రతీ నిరుపేదకు ఎకరం భూమి ఇస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ మూడెకరాలు ఇస్తామని నమ్మబలికి దళితులకు చెందిన 35 వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్ వాగ్దానం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ బాధితులకోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కులాలవారీగా కాంట్రాక్టులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమంగా రూ.100 కోట్లు ఢిల్లీకి పంపిందని, ఆమె రూ.20 లక్షల ఖరీదైన వాచ్ ధరిస్తుందని ఆరోపించారు. పార్టీ వేములవాడ అభ్యర్థి, విద్యావంతుడైన డాక్టర్ గోలి మోహన్‌కు కాకుండా ఎవరికి ఓటు వేసినా మీ జీవితాలు నాశనమేనన్నారు. కూలిన టెంట్లు.. పలువురికి గాయాలు సభ ప్రారంభంలో వేములవాడ అభ్యర్థి గోలి మోహన్ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలితో టెంట్లు కూలిపోయాయి. అనుకోని ఈ ఘటనతో పలువురు మహిళలు, జర్నలిస్టులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి పరామర్శించారు. -
బీజేపీకి తుల ఉమ రాజీనామా
-
Vemulawada: తుల ఉమకు బీజేపీ షాక్.. వికాస్ రావుకే బీ-ఫామ్
సాక్షి, వేములవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు, నేతలు వేగం పెంచారు. నామినేషన్ల స్వీకరణకు నేడు(శుక్రవారం) చివరి తేదీ కావడంతో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వేములవాడ బీజేపీలో కోల్డ్ వార్ జరుగుతోంది. ఒకే అసెంబ్లీ స్థానానికి ఇద్దరు బీజేపీ నేతలు పోటాపోటీ నామినేషన్లు వేశారు. వేములవాడ అసెంబ్లీకి బీజేపీ పార్టీ తరుపున తుల ఉమ శుక్రవారం నామినేషన్ వేశారు. అయితే కమలం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు తరపున ఆయన వర్గీయులు నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. వేములవాడ బీజేపీ రెండు గ్రూప్‌లుగా చీలిపోవడంతో నేతల మధ్య టికెట్ ఫైట్ ఉత్కంఠ రేపుతోంది. తుల ఉమకు షాక్.. వికాస్ రావుకే బీఫామ్ వేమలవాడ బీజేపీలో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. తుల ఉమను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ.. చివరికి ఆమెకు మొండిచేయి చూపింది. మరికొద్ది గంటల్లో నామినేషన్ ప్రక్రియ ముగియనున్న సమయంలో వేమలవాడ అభ్యర్థిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుకు బీ-ఫామ్ అందించింది. దీంతో తనే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నానని ఆశించిన తుల ఉమకు ఆఖరి క్షణంలో భంగపాటు తప్పలేదు. అదే విధంగా సంగారెడ్డిలో బీజేపీ తమ అభ్యర్థిని మార్చింది. ముందుగా ప్రకటించిన రాజేశ్వరరావు దేశ్‌పాండేకు కాకుండా పులిమామిడి రాజుకు బీ-ఫామ్ అందజేసింది. చదవండి: తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్ -
Vemulawada: వికాస్ రావుకు కాకుండా తుల ఉమాకు టికెట్ ఎలా ఇస్తారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ యువ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వేములవాడ టికెట్ కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు కాకుండా, తుల ఉమకు ఎలా ఇస్తారని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. కచ్చితంగా బీజేపి టికెట్ వికాస్ రావుకి ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న ఇతర కార్యకర్తలు, పోలీసులు అప్రమత్తమై యువకుడిని అడ్డుకున్నారు. ఈ ప్రమాదంలో యువకుడికి స్వల్ప గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. అయితే వేములవాడ బీజేపీ టికెట్ వికాస్‌కు ఇచ్చే వరకు వెళ్ళేది లేదని వేములవాడ పట్టణ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్, ఎంపీ ప్రకాష్ జవదేకర్ రంగంలోకి దిగారు. వికాస్‌రావు మద్దతుదారులతో మాట్లాడి వారికి సర్దిచెప్పారు. కాగా ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నాలుగో విడతల్లో 100 స్థానాలకు అభ్యర్థుల జాబితాలను బీజేపీ విడుదల చేసింది. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను బుధవారం ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా.. చెన్నూరు(ఎస్సీ) – దుర్గం అశోక్, ఎల్లారెడ్డి– వి.సుభాష్‌రెడ్డి, వేములవాడ– తుల ఉమ, హుస్నాబాద్–బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, సిద్దిపేట– దూది శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్ (ఎస్సీ) – పెద్దింటి నవీన్‌కుమార్, కొడంగల్– బంటు రమేశ్‌కుమార్, గద్వాల్– బోయ శివ, మిర్యాలగూడ– సాదినేని శివ, మునుగోడు– చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్ (ఎస్సీ)– నకిరకంటి మొగులయ్య, ములుగు(ఎస్టీ)– అజ్మీరా ప్రహ్లాద్ నాయక్. -
తిరగబడతా.. పోరాటం చేస్తా.. ఎమ్మెల్యే చెన్నమనేని మరోసారి హాట్ కామెంట్స్
సాక్షి, కరీంనగర్ జిల్లా: వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో.. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవంలో మిడ్ మానేరు ముంపు గ్రామాలనుద్ధేశించి తన మనసులో మాటలన్నీ వెళ్లగక్కారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే తానే తిరగబడి పోరాటం చేస్తానంటూ తనదైన ధిక్కారస్వరాన్ని వినిపించిన చెన్నమనేని.. ముంపు గ్రామాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండి ఉంటే ఎప్పుడో సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు. ఆ విషయాన్ని సూటిగా కేటీఆర్‌తో కూడా ప్రస్తావించినట్టు చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ముంపు గ్రామాల సమస్యలపై అధికార పక్షంలాగా కాకుండా.. ఓ ప్రతిపక్ష నేతగా పోరాటం చేశానన్న చెన్నమనేని రమేష్ బాబు.. తాను మంత్రినైనా బాగుండేదేమో, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం సులభమయ్యేదేమోనన్నారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలపై నేను ప్రశ్నించానన్న విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టే చెబుతున్నానన్న చెన్నమనేని.. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నారు. కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశానని.. చెన్నమనేని రాజేశ్వరరావు కూమారుడిని కాబట్టి, ఆత్మగౌరవం ఉంది కాబట్టి, ఆ పని చేయలేకపోయానన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ పోరాటం చేస్తానన్న రమేష్‌బాబు.. మిడ్ మానేరు ముంపు నిర్వాసితుల విషాదగాథల నుండి పాఠాలు నేర్చుకోవాలని తమ అభ్యర్థి చల్మెడకు సూచిస్తున్నానన్నారు. రమేష్ బాబు షాకింగ్ కామెంట్స్‌తో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ నిశ్ఛేష్ఠుడై చూస్తూ కూర్చుండిపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి వ్యవసాయ సలహాదారుగా చెన్నమనేనిని నియమించాక.. చెన్నమనేని, చల్మెడ మధ్య సయోధ్య కుదిరిందనుకుంటున్న తరుణంలోనూ ఎమ్మెల్యే రమేష్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. చదవండి: కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్? -
వేములవాడలో బీజీపీ నేతల మధ్య టికెట్ ఫైట్
సిరిసిల్ల జిల్లా: తెలంగాణాలో అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో అన్ని పార్టీలు గేరు మార్చి స్పీడును పెంచేశాయి. ఇదిలా ఉండగా వేములవాడలో బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థుల మధ్య టికెట్ కోసం కోల్డ్ వార్ జరుగుతోంది. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ మధ్య టికెట్ వార్ తారాస్థాయికి చేరుకుంది. వివాదాస్పద పోస్టర్లు.. ఇప్పటికే బీజేపీ కార్యాలయంలో టికెట్య్ కోసం దరఖాస్తు చేసుకున్న తుల ఉమ వేములవాడలో పాగా వేసే క్రమంలో 'సాలు దొర - సెలవు దొర' అంటూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ అభివృద్ధికి తనతో కలిసి రావాలని పోస్టర్స్ ద్వారా అభ్యర్ధించారు. బీజేపీ ఆశావహ అభ్యర్థిగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న తుల ఉమ ప్రచార కార్యక్రమానికి పోస్టర్లతో శ్రీకారం చుట్టారు. సాలు దొర - సెలవు దొర పోస్టర్ల పేరిట తుల ఉమ ఓవైపు కేసీఆర్ పాలనను లక్ష్యం చేసుకుని మరోవైపు వేములవాడలో చెన్నమనేని వంశీయుల పాలనపైన కూడా విమర్శనాస్త్రాలను సంధించారు. దీంతో వేములవాడలో బీజేపీ రెండు గ్రూపులుగా చీలిపోయినట్లయింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలో అర్ధంకాక బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. టికెట్ వార్.. వేములవాడలో బీజేపీ టికెట్ బీసీలకే కేటాయిస్తారని ఆ ప్రకారం చూస్తే తమకే టికెట్ దక్కుతుందని తుల ఉమ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఎర్రం మహేష్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కూడా టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా చెన్నమనేని వికాస్ ఎంట్రీతో వేములవాడ బీజేపీలో రసాభాస మొదలైంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
కేసీఆర్‌ను కలిసినా మౌనం వీడని చెన్నమనేని!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేల వేములవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి మరోసారి టికెట్ ఆశించి భంగపడిన చెన్నమేనని పంచాయితీ వారం రోజులుగా ఓ కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బుధవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం మాజీ ఎంపీ వినోద్ మధ్యవర్తిత్వంతో కేసీఆర్‌తో చెన్నమనేని భేటీ అయ్యారు. సీఎంను కలిసినా రమేష్ బాబు మౌనం వీడలేదు. చెన్నమనేనితో పాటు చల్మెడకూ ప్రగతీభవన్ పిలుపురాగా.. ఇద్దరి సమక్షంలో సీఎం మంతనాలు జరిపారు. అయితే భేటీకి సంబంధించి విషయాన్ని చెన్నమనేని, చల్మెడ వర్గీయులు గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో భేటీ సారాంశంపై ఉత్కంఠ నెలకొంది. చదవండి: మైనంపల్లికి సన్‌స్ట్రోక్ తప్పదా? కాగా బీఆర్ఎస్ అధిష్టానం మేములవాడ టికెట్ చల్మెడ లక్ష్మీ నర్సింహరావుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో చెన్నమనేని అలకబూనారు. అప్పటి నుంచి అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు కలుస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారు పదవి ప్రకటించినా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబులో జ్వాలలు ఆరడం లేదు. ఇప్పటికే వేములవాడ బీఆర్ఎస్లో రెండు వర్గాలుగా చీలిపోయి అంతర్గతంగా ప్రతిష్ఠంభన నెలకొంది. చల్మెడ వర్సెస్ చెన్నమనేని అనుచరుల మధ్య వార్ కొనసాగుతోంది. అంతేగాక రమేష్ బాబు సలహాదారు పదవిపైనా ఇప్పటివరకూ అధికారికంగా ఉత్తర్వులు జారీ కాలేదు. గులాబీ బాస్‌తో భేటీ తర్వాతైనా వేములవాడ బీఆర్ఎస్ అంతర్గత కలహాలకు చెక్ పడుతుందా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. శుక్రవారం తన తండ్రి శత జయంతి ఉత్సవాలకు రమేష్ బాబు వేములవాడ రానున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ బాబు ఏం చెప్పబోతున్నారనే దానిపై ప్రాధాన్యత సంతరించుకుంది. -
రోజుకో ప్రచారం.. కేసీఆర్-చెన్నమనేని భేటీపై ఉత్కంఠ
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టికెట్ చల్మెడ లక్ష్మీ నర్సింహరావుకు కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీలో రాజుకున్న చిచ్చు ఆరడం లేదు. ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారు పదవి ప్రకటించినా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబులో జ్వాలలు ఆరడం లేదు. ఈ నేపథ్యంలో వేములవాడలో చల్మెడ వర్సెస్ చెన్నమనేని అనుచరుల మధ్య వార్ కొనసాగుతోంది. అలక వీడని రమేష్ బాబు పంతంతో వేములవాడ బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభం ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. చెన్నమనేని తీరు గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సీఎం కేసీఆర్‌తో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని భేటీపై రోజుకో తీరు ప్రచారం సాగుతోంది. గత మూడురోజుల నుంచి కేసీఆర్‌ను కలువనున్నట్టు ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటి వరకూ సీఎంను ఆయన కలవలేదు. ముఖ్యమంత్రి వ్యవసాయ రంగ సలహాదారుగా నియమించినా ఎక్కడా తన స్పందనను తెలియజేయలేదు. ఈ నేపథ్యంలో వేములవాడలో చల్మెడ వర్సెస్ చెన్నమనేని అనుచరుల మధ్య వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎంను నేడు కలవనున్నట్లు మళ్లీ ప్రచారం మొదలైంది. సోమవారం హరీష్ రావును కలిసిన చెన్నమనేని.. నేడు సాయంత్రం వేములవాడకు చేరుకొని ముఖ్య కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఎల్లుండి ఆగస్ట్ 31న తన తండ్రి దివంగత కమ్యూనిస్ట్ నేత రాజేశ్వర్ రావు శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లు ఇప్పటికే మొదలు కాగా.. ఈ మొత్తం పరిణామాలపై చెన్నమనేని స్పందనేంటనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి: -
ఇదేం పిచ్చి రా బాబోయ్.. మొహాలకు న్యూస్ పేపర్లు చుట్టుకొని..
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: రీల్స్ పిచ్చిలో పడి కొందరు యువకులు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ పట్టణంలో ముగ్గురు యువకులు బైక్‌పై మొహాలు కనబడకుండా న్యూస్ పేపర్లు చుట్టుకొని వేములవాడ వీధుల గుండా పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ తిరగడంతో.. పట్టణ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు యువకులు వారిని వెంబడించి పట్టుకొని ప్రశ్నించగా తాము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామని, ప్రమోషన్ కోసం వీడియో షూట్ చేశామని తెలిపారు. ఆ మాటలు విన్న పట్టణ వాసులు ఒక్కసారిగా అవాక్కై.. ఒకింత చిరాకు పడ్డారు. ఇదేం పిచ్చి రా బాబోయ్ అంటూ తలలు పట్టుకున్నారు. చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
బీజేపీవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని !
సాక్షి, రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. 115 స్థానాలకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 9 స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలో చోటు దక్కని నేతలు కేసీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆశతో పార్టీ మారేందుకు యత్నిస్తున్నారు. ప్రత్నామ్నాయ బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతలతో చర్చలు జరుపుతున్నాయి. ఇక అనుకున్నట్టుగానే వేములవాడ చెన్నమనేనికి కాకుండా పోయింది. అంతా భావించినట్టుగానే చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల చైర్మన్ చల్మెడ లక్ష్మీనర్సింహారావుకే దక్కింది. అయితే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దారెటు..? బీఆర్ఎస్ లోనే ఉంటూ చల్మెడ కోరినట్టుగా ఆయనకు సహకరిస్తారా..? లేక, ఇంకో మార్గమేదైనా చూసుకుంటారా..? చెన్నమనేని రాజకీయ వారసత్వానికి కామానో.. లేక, ఫుల్ స్టాప్ పడేందుకు ఆయన సుముఖంగా ఉంటారా..? టిక్కెట్ కొట్లాటకు ముందు ఎంత ఉత్కంఠైతే నెలకొందో.. అదే ఆసక్తి టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా వేములవాడలో కనిపిస్తోంది. చదవండి: వామపక్షాలతో పొత్తులేదని తేల్చేసిన కేసీఆర్.. కమ్యూనిస్టుల కీలక భేటీ వేములవాడ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు అంతా ఊహించినట్టుగానే ఈసారి టిక్కెట్ దక్కలేదు. అందుకోసం గులాబీబాస్ కేసీఆర్ చెప్పిన కారణం.. చెన్నమనేనిపై వేములవాడ కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఎప్పట్నుంచో పోరాటం చేస్తూ కోర్టుల్లో రచ్చరచ్చగా మారి ద్వంద్వ పౌరసత్వ వివాదమే. అయితే, అది ఆయన్ను పక్కకు పెట్టేందుకు కేవలం సాకు మాత్రమేనని వాదనా ఇప్పుడు రమేష్ బాబు వర్గం నుంచి వినిపిస్తోంది. అలాగైతే.. 2014, 2018కి ముందు నుంచే ఈ వివాదం కొనసాగుతున్నప్పుడు.. అప్పుడెలా మరి రమేష్ బాబు అధికార బీఆర్ఎస్ అభ్యర్థయ్యారో చెప్పాలన్న వాదన ఇప్పుడు రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం నుంచి వినిపిస్తోంది. అయితే గతంలో తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన వేములవాడ.. చెన్నమనేని ఫ్యామిలీకి ఓ కంచుకోటగా మారిపోయింది. ఈసారి తమ ప్రాతినిథ్యమే లేకపోతే.. అది కామాగా భావించాలని ఎవరైనా చెప్పినా.. ఆ తర్వాత అదే పూర్తిగా ఫుల్ స్టాప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మరొకరు వచ్చి జెండా పాతారంటే.. కచ్చితంగా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలోనే రమేష్ బాబు వేములవాడలో తన తదుపరి భవిష్యత్ కార్యాచరణకై సీరియస్ గా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తా: రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు పైగా నిన్న తనకు టిక్కెట్ దక్కదన్న ప్రచారం నేపథ్యంలోనే.. కేసీఆర్ ప్రకటన కంటే ముందే ఓ భావోద్వేగంతో.. ఒకింత నిర్వేదంతో తన తండ్రి మాటలను ఉటంకిస్తూ.. ఆత్మగౌరవం అనే పదాన్ని వాడుతూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆయన అంతరగాన్ని తెలియజెప్పింది. ఈ క్రమంలో అనుకున్నట్టుగానే వేములవాడ టిక్కెట్ ను కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న చల్మెడకు కేటాయించడంతో వేములవాడలో ఒకవైపు చల్మెడ అనుచరుల్లో ఆనందం కనిపిస్తే.. ఇంకోవైపు ఒకింత నైరాశ్యం, మరింత స్తబ్దత వాతావరణం కనిపించింది. తన తండ్రి నుంచి కొనసాగుతూ వస్తున్న రాజకీయ వారసత్వాన్ని వదలుకోవడానికి చెన్నమనేని ఫ్యామిలీ సిద్ధంగా లేదన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బాబాయ్ అబ్బాయ్ తో పాటు.. చెన్నమనేని ఫ్యామిలీ సభ్యుల్లో కీలకమైనవారంతా వేములవాడలో నెక్స్ట్ జరుగబోయే రాజకీయమెలా ఉండబోతోంది.. తామేం చేయాలనే సమాలోచనల్లో పడ్డట్టుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే బీజేపి ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్.. చెన్నమనేనితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జర్మనీలో ఉన్న రమేష్ బాబు.. ఈనెల ఆగస్ట్ 25వ తేదీన వేములవాడకు రానున్నారు. మొత్తంగా రమేష్ బాబు చూపు కూడా బీజేపీ వైపు పడినట్టుగా తెలుస్తోంది. అందుకు తన బాబాయ్ సపోర్ట్ తో పాటు.. ఈటెల కూడా చొరవ తీసుకోవడంతో.. వేములవాడ నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న యోచనలో రమేష్ బాబు కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నర్సాపూర్‌లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం పెద్దలకు కూడా ఈటెల చేరవేసినట్టు తెలుస్తుండగా.. మరి రమేష్ బాబు పయనమెటు...? ప్రచారం జరుగుతున్నట్టుగా ఆయన బీజేపీలో చేరతారా...? ఈసారి తన టిక్కెట్ కు గండికొట్టే సాకుగా మారిన ద్వంద్వ పౌరసత్వ వివాదాన్నీ.. కేంద్రంలో ఉన్న పార్టీతో కలిస్తే ఏమైనా తొలగించుకునే అవకాశం దొరుకుతుందా వంటి పలు విశ్లేషణలతో కూడిన చర్చలకు ఇప్పుడు తెర లేస్తోంది. మొత్తంగా టిక్కెట్ కన్ఫర్మేషన్కు ముందు రసవత్తరంగా సాగిన రాజన్న క్షేత్రంలోని రాజకీయం.. టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా అంతకంతకూ రసకందాయంగా మారుతుండటం ఇక్కడి విశేషం. -
ఈ తల్లి ధైర్యానికి సెల్యూట్.. దొంగను ఉరికించింది
సాక్షి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా వేములవాడలో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. ఆమెపై దొంగ దాడి చేస్తున్నా భయంతో బెదరకుండా అతడితో పోరాడింది. వివరాలు.. భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు కాగా మొదటి అమ్మాయికి వివాహం జరిగింది. రెండో కూతురు అమెరికాలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీలత ఇంట్లోకి ఓ దుండగుడు దొంగతానికి వచ్చాడు. ఇంటి ముందు చప్పుడు కావడంతో శబ్దాలకు ఆమె బయటకు వచ్చి చూసింది. ఇంటి ఆవరణలో చీకట్లో నక్కిన ఆగంతకుడు మహిళను చూసి రాడ్‌తో ఆమెను కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే శ్రీలత ఎంతమాత్రం భయపడకుండా దొంగను ధైర్యంగా ప్రతిఘటించింది. చాకచక్యంగా వ్యవహరించి చీకట్లోనే అతనితో పోరాడింది. చివరికి గట్టిగా కేకలు వేయడంతో దొంగ చేతికి చిక్కిన ఏడు గ్రాముల బంగారు గొలుసుతో అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళా ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. తల్లి ధైర్యానికి సెల్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కర్టెన్ ఉపయోగించి, దొంగ దాడి నుంచి తప్పించుకున్న విధానాన్ని ప్రశంసిస్తున్నారు. వేములవాడలో మహిళపై దాడి చేసిన దొంగ .. ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ వేములవాడ - భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె మొదటి కూతురుకు వివాహం కాగా, రెండో కూతురు అమెరికాలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి దొంగతనానికి యత్నించాడు. శ్రీలత… pic.twitter.com/TSl6uZTTkQ — Telugu Scribe (@TeluguScribe) August 14, 2023 -
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళపై దుండగుడి దాడి
-
మందు పోయను, ఓడిపోతే మాత్రం.. : కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ప్రతి పక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి చెప్పి నిలదీయండి అంటూ తెలంగాణ సమాజానికి మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. బీసీ బందు పథకంలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. సుమారు 600 మందికి చెక్కులను కేటీఆర్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా. మందు పోయను. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఎలాగైనా మీకు సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటా అంటూ వ్యాఖ్యానించారాయన. అలాగే.. పింఛన్ పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా కేటీఆర్ స్పందించారు. ‘‘ప్రతిపక్షాలు మాకు సలహాలు ఇస్తే కేసీఆర్ పెన్షన్ పెంచలేదు. ఆరువందల మందికి పెన్షన్ వస్తే వార్త కాదు.. ఆరుగురికి రాకపోతే ఇవాళ రేపు వార్త అవుతోంది. తెలంగాణాలో 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. వేములవాడ తిప్పాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 70% శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లాలో వచ్చే నెలలో కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. చేనేత దినోత్సవం సందర్భంగా 9 రకాల పథకాలు అమలు చేసుకున్నాం. అలాగే.. బీసీబంధు అంటే లోన్ కాదు. ఇది కేవలం మీ(బీసీ లబ్ధిదారుల్ని ఉద్దేశించి..) కులవృతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. తిగిగి కట్టవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ‘‘వేములవాడకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. 24 గంటలు మంచి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాం. వేములవాడ ఆలయాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తాం’’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇదీ చదవండి: కోకాపేట వేలంపాటపై సంచలన ఆరోపణలు -
గులాబీ కోటలో కొత్త టెన్షన్.. ఆ ఐదు సెగ్మెంట్లలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రత్యర్థులకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ముఖ్యంగా అయిదు సెగ్మెంట్లలో గులాబీ పార్టీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు లేని కొరతను సొంత పార్టీ వారే తీరుస్తున్నారు. నియోజకవర్గాల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు సెగ్మెంట్ల కథేంటీ... ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన కోరుకంటి చందర్ తర్వాతి కాలంలో కారెక్కి విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్‌కు సీటిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకులు గులాబీ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆశయసాధన పేరుతో యాత్ర చేస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఫోటోను మాత్రం పెట్టలేదు. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పాదయాత్ర నిర్వహించగా.. రెండు వర్గాలు రామగుండంలో వీధిపోరాటానికి దిగాయి. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ నిర్వేదంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న కొలువై ఉన్న వేములవాడలోనూ గులాబీ పార్టీలో గ్రూప్‌లు ఏర్పడి కుమ్ములాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులతో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టిక్కెట్‌కు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అడ్డుపడుతున్నారు. కొద్దికాలంగా రమేష్ బాబు వర్సెస్ చల్మెడ ఎపిసోడ్ వేములవాడ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చాయి. ఇద్దరి మధ్యా ఉప్పునిప్పూ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి రమేష్ బాబు టికెట్‌కు గండి కొట్టి.. చల్మెడకే కన్ఫర్మ్ అనే టాక్ వేములవాడలో చాలా రోజులుగా నడుస్తోంది. టికెట్ రాదేమోనన్న నిర్వేదంతో పాటు.. పార్టీలోని ప్రత్యర్థులపై అక్కసు, ఆక్రోశమూ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మాటల్లో కనిపిస్తోంది. తనను ధిక్కరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈటలతో యుద్ధానికి పంపిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ కేసీఆర్ ఆశల్ని తుంచేస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తొలగించాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వంటివారు మీడియా ముందుకు రావడం.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే.. మరింత రెబల్‌గా సమ్మిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అంతేకాదు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కౌశిక్‌కు వ్యతిరేకంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో హుజూరాబాద్‌లో అభ్యర్థెవ్వరన్న ప్రశ్నలతో పాటు.. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా.. మిగిలిన వర్గాలు ఎంతవరకూ మద్దతిస్తాయన్నది కూడా సందేహమే. ఇక పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై కూడా పార్టీలో అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రాజయ్య ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి తీరుపై అలిగి ఆయన కీలక అనుచరుడైన ఉప్పు రాజ్ కుమార్ పార్టీనుంచే బయటకు వెళ్ళిపోయాడు. అయితే అతణ్ని బ్రతిమాలి మళ్ళీ పార్టీలోకి తీసుకువచ్చారు. చదవండి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ... స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ రావు కూడా ఈసారి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీతో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు సఖ్యత లేకపోవడం వల్ల ఆయనకు ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఈసారి బీసీలకే పెద్దపెల్లి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో పాటు.. సామాజిక సమీకరణలు కూడా పార్టీకి తలబొప్పి కట్టిస్తున్నాయి. జూలపల్లి జెడ్పీటీసి లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ఎమ్మెల్యే దాసరిపై కనిపించని యుద్ధం చేస్తున్నారు. జూలపల్లి జడ్పీటీసీ కూడా పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పైకి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతున్నా..వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎవ్వరినీ కలుపుకుపోలేని ఆయన తీరు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు టిక్కెట్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రవిశంకర్‌కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరంగానే మద్దతు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా చొప్పదండిలో పోటీకి రెండు మూడు పేర్లను నియోజకవర్గ నేతలు తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇక్కడి గులాబీ కోటకు ప్రమాదమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి గులాబీ బాస్ తన కోటకు మరమ్మతులు చేస్తారా? రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారా? వేచి చూడాల్సిందే. -
వేములవాడ మహా శివరాత్రి వేడుకలు
-
వేములవాడ : వైభవంగా పార్వతీ రాజరాజేశ్వర కల్యాణం (ఫొటోలు)
-
వైఎస్సార్‌లాంటి పాలన అందిస్తాం: రేవంత్ రెడ్డి
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించి తెలంగాణ ఇచి్చన కాంగ్రెస్ పారీ్టకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వైఎస్సార్ లాంటి పాలన అందిస్తాం’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర లో భాగంగా ఆదివారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. 2024లో కాంగ్రెస్ అధికారంలోకొస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, రూ.500కే ఇంటికి గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీనిచ్చారు. ఆది శ్రీనివాస్ సూచనతో.. 2005లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్థానిక కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సూచనతో మెట్టప్రాంతమైన వేములవాడకు రూ.1,735 కోట్లతో ఎల్లంపల్లి నీళ్లను ఫాజుల్‌నగర్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచి్చందని రేవంత్ చెప్పారు. ఇది తెలుసుకున్న సీపీఐ సీనియర్ నేత సీహెచ్.రాజేశ్వర్‌రావు ఓ సభలో స్వయంగా ఆది శ్రీనివాస్ వయసులో చిన్నవాడైనా వైఎస్సార్‌ను ఒప్పించి ఈ ప్రాంతానికి సాగునీరు తెచ్చి ఎంతో గొప్ప పని చేశారంటూ మెచ్చుకున్న వైనం ఈ ప్రాంతప్రజలు మరచిపోవద్దన్నారు. 43 వేల ఎకరాలకు సాగునీరు హామీ ప్రగల్బాలే స్వరాష్ట్రం సిద్ధించాక అధికారంలోకి వచ్చినపుడు మంత్రి హరీశ్‌రావు ఫాజుల్‌నగర్‌లో 43 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రగల్భాలు పలికారని రేవంత్ విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు దండుకుని ఇప్పటికీ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ వివక్ష కథలాపూర్: ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రుల మాదిరిగానే తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై వివక్ష చూపిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కలిగోట గ్రామ శివారులోని అసంపూర్తిగా మిగిలిన సూరమ్మ రిజర్వాయర్‌ను పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఆది శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే 18 నెలల్లో సూరమ్మ రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామన్నారు. -
హరహర మహాదేవ... రాజన్నను దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాజన్న దర్శనానికి దాదాపు 3 లక్షల మంది వరకు వేములవాడకు తరలివచ్చారు. ఒక్కోభక్తుడి దర్శనానికి దాదాపు పది గంటల సమయం పట్టింది. శివమాలాధారులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సాయంత్రం 6 గంటల నుంచి నిరంతరం లఘు దర్శనాలకు అవకాశం కల్పించారు. ఉదయం వేళలో మధ్య మధ్యలో దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్జిత సేవలు రద్దు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లలో భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎసీపీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఏఎస్పీ చంద్రయ్య, తహసీల్దార్ రాజారెడ్డి పరిశీలించారు. రాజన్నకు వెంకన్న పట్టువస్త్రాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ బృందం సమర్పించారు. వీరికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ప్రసాదాలు అందించి, సత్కరించారు. రూ.50 కోట్లతో అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వేములవాడ, సిరిసిల్ల పట్టణాలను రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్ స్వాగతం పలికారు. రాజన్న దర్శనం అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వేములవాడపై ప్రత్యేక దృష్టి పెట్టారని, రాష్ట్రంలోనే ఎములాడ రాజన్న ఆదాయంలో నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. గుడి చెరువు, ధర్మ గుండంలను ఎల్లప్పుడు గోదావరి జలాలతో నింపుతామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థఫు మాధవి, కౌన్సిలర్లు ఉన్నారు. మార్మోగిన ఆలయాలు కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ పట్టణంతో పాటు జిల్యావ్యాప్తంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కరీంనగర్ పాతబజారులోని శివాలయం, కమాన్ వద్ద రామేశ్వరాలయంలో స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు. ► శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం వేకువజాము 3.30 గంటలు: స్థానికుల దర్శనాల అనంతరం నిరంతరం లఘు దర్శనాల కొనసాగింపు. ► శనివారం ఉదయం 7 గంటలు: టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఆధ్వర్యంలో రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. ► ఉదయం 8: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పట్టువస్త్రాలు సమర్పించారు. ► మధ్యాహ్నం 3.30: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజన్నను దర్శించుకున్నారు. ► సాయంత్రం 4: శివమాలధారులు రాజన్నను దర్శించుకున్నారు. ► సాయంత్రం 6: అద్దాల మండపంలో అనువంశిక అర్చకుల ఆధ్వర్యం లో సామూహిక మహాలింగార్చన. ► సాయంత్రం 6 నుంచి ..: రాష్ట్ర భాషా, సాంస్కృతికశాఖ జాయింట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో శివార్చన. ► రాత్రి 11.35 నుంచి ఉదయం 4 గంటలు: లింగోద్భవ సమయంలో రాజన్నకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. సేవలు ఇలా.. ► రాజన్న మహాజాతరలో 2 వేల మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. ► 650 మంది శానిటేషన్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు విధులకు హాజరయ్యారు. ► ఎంపీవోలు 80 మంది, మెడికల్ సిబ్బంది 300, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ 150, అంగన్వాడీలు 150, స్వచ్ఛంద సంస్థ సభ్యులు వెయ్యి మంది జాతరలో విధులు నిర్వహించారు. ► ఆలయ సిబ్బంది 850, సెస్ ఉద్యోగులు 90, ఎక్సైజ్ 75 మంది విధులకు హాజరయ్యారు. ► 800 బస్సుల్లో భక్తులను వివిధ ప్రాంతాలకు చేరవేశారు. ► 14 ఉచిత బస్సులు తిప్పాపూర్ నుంచి రాజన్న ఆలయానికి భక్తులను ఉచితంగా చేరవేశాయి. చదవండి: ఊరూవాడా శివనామ స్మరణ -
రాజన్న దర్శనం కోసం వేములవాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతోంది. శివమాలధారులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆధ్యాత్మిక క్షేత్రం కిక్కిరిసిపోతోంది. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాజాతరకు నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే గుడారాలు వేసుకుంటున్నారు. ధర్మగుండంలోకి అనుమతి లేకపోవడంతో షవర్ల వద్ద స్నానాలు చేస్తున్నారు. గుడి ఆవరణలో జాగరణ కోసం భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసిన ఆలయ అధికారులు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రూ.3.70 కోట్లతో జాతర ఏర్పాట్లు చేశారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,600 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాస్‌ల జారీ విషయంలో ఉద్యోగులు, పురప్రముఖులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి జాతరకు 3 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారుల అంచనా. స్వామి మహామంటపంలో ఉత్సవమూర్తులను సిద్ధం చేసి ఉంచారు. అన్నదానం ప్రారంభం జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి స్థానిక వాసవీ సేవా సమితి, మన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఈవో కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ అన్నదానం శని, ఆదివారాలు సైతం కొనసాగుతుందని నిర్వాహకులు మోటూరి మధు, కొమ్మ నటరాజ్ తెలిపారు. దాదాపు 30 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు సేవలు దేవస్థానం తరఫున 14 ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ సేవలను శుక్రవారం ప్రారంభించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి బైపాస్‌రోడ్డు గుండా జగిత్యాల బస్టాండు, గుడిప్రాంతం, బైపాస్‌రోడ్డు ద్వారా కోరుట్లబస్టాండు, ప్రాంతాలను కలుపుతూ తిరిగి తిప్పాపూర్ బస్టాండ్ వరకు చేరుకుంటాయి. భక్తుల రద్దీని బట్టి బస్సులను తింపనున్నట్లు డీఎం మురళీకృష్ణ తెలిపారు. ప్యూరిఫైడ్ వాటర్ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఆలయ ఈవో కార్యాలయం వద్ద, గుడి పక్కన పార్కింగ్ ఏరియా, బద్దిపోచమ్మ గుడి వద్ద రాజన్న జలప్రసాదం మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్ బాబు తదితరులు శివార్చన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు -
వెలిగిపోతున్న వేములవాడ రాజన్న
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానాచార్యుడు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని శనివారం ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున జేఈవో బృందం, అనంతరం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రూ.3.7 కోట్ల వ్యయంతో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు 3 లక్ష ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 2 వేల మందితో ఎస్పీ అఖిల్‌మహాజన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సౌకర్యం కల్పించారు. జాతర ఉత్సవాల చైర్మన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. రాజన్న భక్తుల కోసం గుడి చెరువులోకి గోదా వరి జలాలను శుక్రవారం విడుదల చేశారు. -
మహాశివరాత్రి జాతరకు సీఎంకు ఆహ్వానం
వేములవాడ : ఈ నెల 18న జరిగే వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే మహా శివరాత్రి జాతరకు హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఆహ్వానించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్, వేద పండితులు సీఎంకు శాలువాకప్పి ఆహ్వాన పత్రిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 33 జిల్లాల్లో కార్మిక భవనాలు మంజూరు చేసినందుకు కేసీఆర్‌కు మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
రాజన్నకు 50, అంజన్నకు 100 కోట్ల రూపాయల నిధుల విడుదల
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. దేవాలయ అభివృద్ధికోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె, రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులూ అధికసంఖ్యలో వస్తుంటారు. ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న ఆలయాలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం దక్కినట్లయ్యింది. మొన్న రాజన్న ఆలయానికి రూ.50 కోట్లు కేటాయించిన సర్కారు.. తాజాగా కొండగట్టుకు రూ.100 కోట్లు ప్రకటించింది. దీంతో ఆలయాల అభివృద్ధికి ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చినట్లయ్యింది. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించిన సీఎం గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి అశేష భక్తజనం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. pic.twitter.com/spGZ3N4NUb — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 8, 2023 ఎములాడ జంక్షన్ల సుందరీకరణ.. రాజన్న గుడి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ 18 జూన్ 2015న స్వయంగా గుడి, పట్టణం కలియ తిరిగారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఇందుకు ఏటా రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని ప్రకటించారు. ముందుగా రూ.71 కోట్లు మంజూరు చేశారు. అనంతరం వీటీడీఏ ఏర్పాటు చేసి కమిటీనీ ప్రకటించారు. చైర్మన్‌గా సీఎం కేసీఆర్, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పురుషోత్తంరెడ్డిని నియమించారు. నిధులను వీటీడీఏ ద్వారానే ఖర్చు చేయాలని జీవో విడుదల చేశారు. వేములవాడ రాజన్న ఆలయం ఆ మేరకు ఆలయ అధికారులు రూ.410 కోట్లతో భక్తుల సౌకర్యాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. గతేడాది, ఈసారి బడ్జెట్లో రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. తాజా నిధులతో బద్దిపోచమ్మ గుడి వద్ద సేకరించిన భూమికి ప్రహరీ, బోనాల మంటపం నిర్మిస్తామని వీటీడీఏ వైస్ చైర్మన్ వెల్లడించారు. నగరమంతా ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గుడి ట్యాంక్‌బండ్‌పై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ పనులు చేపడతామని, నందికమాన్ నుంచి వేములవాడకు చేరుకునే రోడ్డు సుందరీకరణ, జంక్షన్లు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గోదావరినదిలో పడవల పోటీ(ఫైల్) కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక కాళేశ్వరం.. దాని అనుబంధ ప్రాజెక్టుల వద్ద పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పేరిట బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించింది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, గోదావరిఖని వంతెన, కోటిలింగాల బ్యాక్ వాటర్, లోయర్, మధ్య, ఎగువ మానేరు డ్యామ్‌ల వద్ద పర్యాటక అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాను పర్యాటక క్షేత్రంగా మలచాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎప్పటిలోగా నెరవేరుతుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. కొండగట్టు కొండగట్టుకు మాస్టర్‌ప్లాన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి బడ్జెట్లో రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత డిసెంబరు 7న జగిత్యాల సభలో స్వామివారికి రూ.100 కోట్లు ఇస్తామన్న సీఎం.. సరిగ్గా 50 రోజులకు తన మాట నిలబెట్టుకున్నారు. రానున్న 50 ఏళ్లలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాల్సి ఉందని, ప్రత్యేక ప్రణాళికతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. నాంపల్లి గుట్ట నాంపల్లి గుట్టకు రోప్‌వే వేములవాడను తీర్చిదిద్దే క్రమంలో మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నాంపల్లిగుట్టపై రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం జరగనుంది. వేములవాడకు వచ్చే కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేట్రాక్ నాంపల్లి గుట్టను ఆనుకుంటూ వెళ్లనుంది. దీంతో హైదరాబాద్, మేడ్చల్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఇక్కడి పరిసరాలను తీర్చిదిద్దనున్నారు. ఈ పనులపై కేటీఆర్ ఇప్పటికే సమీక్షించారు కూడా. -
‘సెస్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్
సిరిసిల్ల: తెలంగాణలోని ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంఘ (సెస్) పాలకవర్గం ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 15 డైరెక్టర్ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం వేములవాడలో లెక్కింపు చేపట్టగా.. మొత్తం 15 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. అయితే వేములవాడ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి బి.మమత తొలుత ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు రీకౌంటింగ్ కోరడంతో ఓట్ల లెక్కింపు చేపట్టి.. బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజు 3 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. అలాగే చందుర్తిలో బీజేపీ అభ్యర్థి అల్లాడి రమేశ్ 18 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేశారు. రాత్రి 8 గంటల తర్వాత చందుర్తి డైరెక్టర్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి పి.శ్రీనివాసరావు రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ రెండు ఉదంతాలపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు లాఠీచార్జి చేసి.. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ అడ్డదారులు: సంజయ్ ‘సెస్’ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కిందని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడ రూరల్, చందుర్తిల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆ మేరకు ఫలితాలు వెల్లడించకుండా చేశారని ఆరోపించారు. ఆ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ‘సెస్’ ఎన్నికల్లో అధికారులు అధికార పార్టీ నేతలకు చెంచాల్లా వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమాదేవి ఒక ప్రకటనలో ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా జిల్లాలో బలపడిన బీజేపీని ప్రజల మనసుల్లోంచి తొలగించలేరని పేర్కొన్నారు. -
వేములవాడలో ‘రూ. వంద కోట్ల’ ప్రకంపనలు
వేములవాడ: వేములవాడలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని, కొందరు అడ్డగోలుగా భూములు, గుట్టలు కబ్జాలు చేసుకున్నారని, ఆ విషయాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన రమేశ్‌బాబు వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో సొంతపార్టీ నేతలున్నా వదలబోనని హెచ్చరించడంపై స్థానికంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. వేములవాడలో ఈ నెల 5న జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు తుపాకీ, మైనింగ్ లైసెన్సులు తీసుకొని రాజ్యమేలాలని చూస్తున్నారని రమేశ్ వ్యాఖ్యానించడంతో స్థానికంగా దుమారం చెలరేగుతోంది. వేములవాడ పట్టణ శివారులోని అగ్రహారం గుట్టలు, నందికమాన్ ప్రాంతంలో భూములను విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. దీంతో అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా భుజాలు తడుముకుంటున్నారు. ఇప్పటికే చాలామంది అధికార పార్టీ నాయకులు మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు. వేములవాడ చుట్టుపక్కల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దడ పుట్టిస్తున్నాయి. -
అమ్మానాన్న నన్ను క్షమించండి..
చందుర్తి (వేములవాడ): ఎప్పుడో విడిపోయిన తల్లిదండ్రులను కలపడానికి ప్రయత్నించి విఫలమైన ఒక కొడుకు.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో జరిగింది. ఈ విషాద ఘటనపై పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆశిరెడ్డిపల్లెకు చెందిన కట్కూరి ప్రశాంత్ (23) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులు నర్సయ్య, నాగవ్వ పదిహేనేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి తల్లి.. అమ్మమ్మ గ్రామం వేములవాడ మండలం హన్మాజిపేటలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. తల్లిదండ్రుల ఎడబాటుతో ఎంతో జీవితాన్ని కోల్పోయానని భావించిన కొడుకు ప్రశాంత్.. తల్లి వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరాడు. ఇందుకు తల్లి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. -
కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో
సాకక్షి, కరీంనగర్: అక్షర జ్ఞానం అందించి అందరిలో మిన్నగా భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కొందరు పెడదారిలో వెళ్తు ఉపాధ్యాయ వృత్తికి అపవాదు తీసుకువస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఓ పాఠశాలలో మహిళా ఉద్యోగిపై, విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. – మొన్న వేములవాడ.. నేడు సిరిసిల్ల.. వేములవాడ రూరల్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళ హెచ్ఎంను అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దుర్భాషలాడాడు. దీంతో సదరు హెచ్ఎం వేములవాడ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ బన్సీలాల్ ఘటనపై పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విషయం తెలుకున్న డీఈవో రాధాకిషన్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘం నాయకులు స్పందిస్తు విచారణ చేపట్టకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని విద్యాశాఖ అధికారులను విమర్శించారు. ఈ ఘటన మరువకముందే మరో ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థిని వేధింపులకు గురిచేసిన ఘటన సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తనను పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యారి్థని తన తల్లికి తెలపడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలో పోలీసులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. పర్యవేక్షణ కరువు... ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలు విద్యార్థులకు ఉన్న వసతులపై పర్యవేక్షించే శాశ్వత అధికారులు జిల్లాలో లేరు. విద్యాశాఖలో 640 ప్రభుత్వ పాఠశాలలుంటే వీటిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఎంఈఓలున్నారు. వీరందరూ ఏదో ఒక పాఠశాలలో హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారేకావడం గమనార్హం. వీరి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, గతంలో వీరితో పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది వీరి ఆదేశాలను పాటించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా డీఈవో కూడా డిప్యూటేషన్‌లో పనిచేస్తుండం గమనార్హం. ఇలా పర్యవేక్షణ అధికారులు రెగ్యులర్ కాకపోవడంతో పర్యవేక్షణ లోపం జిల్లాలో అధికంగా ఉందని ఇదే కారణంగా అనేక పాఠశాలలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయ సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. వెంటనే రెగ్యులర్ ఎంఈవోలు, డీఈవో వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చట్టపరమైన చర్యలుంటాయి. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. – లక్ష్మారెడ్డి, ఎస్సై, తంగళ్ల్లపల్లి -
వేములవాడకు త్వరలో ఉపఎన్నిక.. బీజేపీని నాలుగుసార్లు ఓడించా..
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. పౌరసత్వ వివాదంలో ఇరుక్కున్న రమేశ్‌బాబుకు పదవీ గండం ఉందని, త్వరలోనే వేములవాడకు ఉప ఎన్నిక వస్తుందని రఘునందన్‌రావు జోస్యం చెప్పారు. దీనిపై రమేశ్‌బాబు దీటుగా స్పందించారు. మునుగోడు నుంచి అసెంబ్లీకి మరో ‘ఆర్’ వేములవాడ: ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ తరఫున ట్రిపుల్ ‘ఆర్’ ఉందని, మునుగోడు ఎన్నికతో మరో ‘ఆర్’ అసెంబ్లీలోకి అడుగు పెడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకుడు తిరుపతిరావు, అర్చకుల బృందం స్వామివారి ప్రసాదం అందించి, సత్కరించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వం అంశంపై కోర్టు తీర్పు వస్తుందని, త్వరలోనే ఇక్కడ కూడా ఉపఎన్నిక జరుగుతుందని చెప్పారు. వేములవాడలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పేరు మార్చి, ఎంఐఎం అనుమతితో ప్రభుత్వం వేడుకలు నిర్వహించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది సెక్యులరిజమా లేక మతతత్వమా? సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని మాట తప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని తెలిసి, ఆయనకు నిద్ర పట్టడం లేదని పేర్కొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే 8 ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. కేవలం రంగురంగుల బ్రోచర్లు తప్ప నయాపైసా పని చేయలేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు సంతోష్‌బాబు, శ్రీనివాస్, సుదర్శన్‌యాదవ్, అన్నారం శ్రీనివాస్, కిష్టస్వామి, రమేశ్ తదితరులున్నారు. (క్లిక్ చేయండి: కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు) రాజన్న గుడికొచ్చి రాజకీయం చేయొద్దు వేములవాడ: నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను నాలుగుసార్లు ఓడించానని, సొంత బాబాయ్, బీజేపీ అభ్యర్థి సీహెచ్.విద్యాసాగర్‌రావుపై 20 వేల ఓట్లతో గెలిచానని ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పౌరసత్వ వివాదం కోర్టు పరిధిలో ఉందని, దానిపై నో కామెంట్ అన్నారు. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ చాలా సార్లు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారని, ఆయన వేసుకునే దుస్తులు ఆయన ఇష్టమని తెలిపారు. మంత్రి సారథ్యంలో జిల్లా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. రాజన్న గుడి చెరువులో 365 రోజులు గోదావరి జలాలు ఉండేలా చూస్తున్నామని, గుడికొచ్చిన మీకు ఇది కనిపించలేదా అని ప్రశ్నించారు. పోచమ్మ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించామన్నారు. మీరిప్పటి వరకు కేంద్రం నుంచి ఒక్క పైసానన్న రాజన్న ఆలయానికి తీసుకొచ్చారా అని మండిపడ్డారు. వేములవాడలో ఉపఎన్నిక అంటూ ఊదరగొడుతున్నారని అన్నారు. ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కౌన్సిలర్‌గా ఓడిపోయారని, ఇదీ వేములవాడలో ఆ పార్టీకి ఉన్న బలం అంటూ ఎద్దేవా చేశారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. (క్లిక్ చేయండి: టీఆర్ఎస్లో బయటపడ్డ అంతర్గత విభేదాలు) -
ఐదోసారికి కేటీఆర్ సిద్ధం.. వేములవాడ నుంచి బండి సంజయ్ బరిలోకి?
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా మూడు ప్రధాన పార్టీలు అప్పుడే నువ్వా నేనా అన్నట్టు ప్రచారబరిలోకి దిగాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కారు జోరుకు బ్రేకులు వేయాలని కాంగ్రెస్, కమలం పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులే ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేస్తారు. ఎత్తుకు పై ఎత్తులు రామగుండం నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేలా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మరోవైపు గులాబీ పార్టీ ఎత్తుకు బీజేపీ పై ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఎలాగైనా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టేశారు మూడు పార్టీల నాయకులు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్‌లో రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ రానున్న ఎన్నికలు సవాల్తీగాసుకుని తమ పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతున్నారు. సింగరేణి కార్మికులదే రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణం, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉంటాయి. సింగరేణి కార్మికులు మొత్తం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీల్లో ఉంటారు. ఇక్కడ కార్మికుల కుటుంబాలు, మహిళా ఓటర్లు ఎక్కువ. సింగరేణి కార్మికులు యూనియన్ల పరంగా పోటాపోటీగా ఉంటాయి. కారుణ్య నియామకాలు, పేరు మార్పిడి జీఓ, బోనస్ లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పింఛన్లు టీఆర్ఎస్కు అనుకూలమే. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ అనుచరుల తీరు వల్ల కొంత ఇబ్బంది ఉంటుందనే చర్చ నడుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ది కలిసి వస్తుందని బీజీపీ నేత సోమారపు భావిస్తున్నారు. చదవండి: పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు ద్విముఖ పోటీనే మంథని నియోజకవర్గం పేరు వినగానే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నియోజక వర్గంలోనిదే. మహాదేవ్ పూర్ ప్రాంతం భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లడంతో కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మి పంపు హౌజ్ ఉన్న ప్రాంతాలు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పార్వతీ బ్యారేజ్ సరస్వతీ పంపు హౌజ్ మంథని నియోజక వర్గంలోనే ఉన్నాయి. ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశాలు కన్పిస్తుడంతో రాజకీయ నాయకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. అనేక ఏండ్లుగా ఇక్కడ ద్విముఖ పోటీనే ఎక్కువగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కొసాగుతోంది. కానీ ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీధర్‌బాబుపై అసంతృప్తి మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించారు. నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అయనపై ఇంకా అసంతృప్తి కన్పిస్తోంది. కార్యకర్తల ఫోన్లు లిఫ్ట్ చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు శ్రీధర్‌బాబు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల సునీల్ రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చందుపట్ల బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధిష్టానం దృష్టిలో వడినట్లు సమాచారం. పుట్టమధుపై ఆరోపణలు న్యాయవాది వామన్ రావు హత్య విషయంలో టీఆర్ఎస్నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ వద్దే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. ఈ రెండు అంశాలు గులాబీ పార్టీకి మైనస్‌అని భావిస్తున్నారు. పుట్ట మధు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉంటారనే టాక్ ఉంది. గులాబీ పార్టీ టికెట్ రాకపోతే పుట్ట మధు బీజేపీలోకి వెళ్ళవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండుసార్లు పట్టం వరుసగా రెండుసార్లు ఏ పార్టీని ఆదరించని పెద్దపల్లి ప్రజలు ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే రెండుసార్లు పట్టం కట్టారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నందున ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వదని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. టిక్కెట్ఇవ్వని పక్షంలో తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని మనోహర్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం. బండి సంజయ్ వర్గీయుడికి టికెట్? ఇక కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన చింతకుంట విజయరమణారావు ఈసారయినా గెలిచి తీరాలనే పట్టుదలగా ఉన్నారు. అయితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, ఓదెల ఎంపిపి గంట రాములు పక్కలో బల్లెంలా తయారయ్యారని టాక్. పెద్దపల్లిలో పోటీలో ఉండే కమలనాధులెవరనే ప్రశ్న వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ అనుమానమేనంటున్నారు. బండి సంజయ్ వర్గీయుడు ప్రదీప్ రావుకు పెద్దపల్లి టికెట్ ఇవ్వచ్చని సమాచారం. 100 కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి సున్నా దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉన్న నియోజక వర్గ కేంద్రం అది. ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తున్నా రాజన్న ఆలయం అభివృద్ధి కాలేదు. నియోజక వర్గం కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ 2009 నుంచి చెన్నమనేని రమేష్ బాబు గెలుస్తూ వస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉండేది. దీనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కోర్టులోను, కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతోంది. పోటీలోకి మాజీ గవర్నర్ కొడుకు! సీనియర్ కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టీఆర్ఎస్ టికెట్ చల్మెడకే అనే టాక్ వినిపిస్తోంది. మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కొండ దేవయ్య కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన సీహెచ్. విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని సిరిసిల్ల అనగానే చేనేత.. సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు గుర్తుకు వస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ పేరు వినగానే సిరిసిల్ల గుర్తుకు వచ్చే పరిస్తితి వచ్చింది. చెన్నమనేని రాజేశ్వరావు లాగే కేటీఆర్ కూడా సిరిసిల్లలో నాలుగు సార్లు గెలుపొందారు. ఐదోసారి కూడా విజయకేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌తోపాటు మంత్రి కావడం, ముఖ్యమంత్రి కుమారుడు కావడం సిరిసిల్లకు కలిసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతోంది. సిరిసిల్లలో చాలా అభివృద్ధి పనులు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసారి కూడా కేకేనే సిరిసిల్ల టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కుమ్ములాటలు జనాల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తోంది.. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. 2009లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కకేకే మహేందర్‌రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్తరపున పోటీచేసినా ఓడారు. కేకేకు కాంగ్రెస్ నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా కేకే మహేందర్ రెడ్డినే పోటీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇక సిరిసిల్లలో బీజేపీ పుంజుకుంటోంది. ఈసారి బీజేపీ తరపున మృత్యుంజయం లేదా జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పోటీ చేస్తారని తెలుస్తోంది. -
అమెరికాలో వేములవాడ యువకుడి మృతి
వేములవాడ: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నత చదువులకు వెళ్లిన వేములవాడ యువకుడు కంటె యశ్వంత్(25) విహార యాత్రకు వెళ్లి సముద్రంలో అలల తాకిడికి మరణించారు. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం అందింది. యశ్వంత్ మిత్రులు, కుటుంబసభ్యుల సమాచారం మేరకు.. వేములవాడ సుభాష్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్ ఎమ్మెస్ చదివేందుకు 8 నెలల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. వారాంతం కావడంతో ఈనెల 29న యశ్వంత్, అతడి స్నేహితులు శుభోదయ్, మైసూరా, చరణ్, శ్రీకర్, శార్వరితో కలిసి ఐర్లాండ్‌లోని దీవులకు వెళ్లారు. అక్కడే ప్రైవేట్ బోటు తీసుకుని పిటా దీవుల వద్దకు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం 5.35 గంటలకు బోట్ స్టార్ట్ చేయగా.. ఇంజిన్ ఆన్ కాలేదు. అలల తాకిడికి బోటు 3 మీటర్ల లోతు ప్రాంతం నుంచి 25 మీటర్ల లోతు ప్రాంతానికి చేరుకుంది. ఇది గమనించని యశ్వంత్ నీటిలోకి దిగారు. అలలు ఎక్కువగా ఉండటంతో ఎంత ఈతకొట్టిన బోటును చేరుకోలేకపోయారు. యశ్వంత్‌ను కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. లైఫ్ జాకెట్స్ ధరించి నీటిలోకి దిగి దాదాపు 3 గంటలపాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు ఈ విషయాన్ని యశ్వంత్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మిత్రుడిని కోల్పోయిన దుఃఖంలో వీరంతా సమీపంలోని వసతి గదులకు చేరుకున్నారు. పోలీసులు గాలింపు చేపట్టగా.. సోమవారం రాత్రి మృతదేహం లభ్యం అయినట్లు తెలిసింది. ఉన్నత చదువులకు వెళ్లిన యశ్వంత్ మృతితో సుభాష్‌నగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. -
వివాహేతర సంబంధం.. భర్తకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందని..
సాక్షి, వేములవాడ: ప్రియురాలి భర్తపై హత్యాయత్నం చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడటౌన్ సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాలు.. వేములవాడకు చెందిన మహిళకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లెకు చెందిన విష్ణుతో 2011లో వివాహమైంది. విష్ణు ఉపాధి కోసం దుబాయి వెళ్లి వస్తుండగా అతని భార్య వేములవాడకు చెందిన సాయికుమార్‌తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. గత మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇటీవల మళ్లీ భర్త విష్ణుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందన్న అనుమానం సాయికుమార్‌కు కలిగింది. బుధవారం రాత్రి విష్ణు వేములవాడ మీదుగా కరీంనగర్ వెళ్తున్నట్లు తెలుసుకొని తన స్నేహితుడు దేవేందర్‌తో కలిసి హత్యకు ప్రయత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్న విష్ణు వేములవాడటౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. సాయికుమార్, దేవేందర్లను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
హత్యకు 5 లక్షల సుపారీ
సిరిసిల్ల క్రైం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హత్య చేసేందుకు రూ.ఐదు లక్షల డీల్ కుదుర్చుకున్న సు పారీ గ్యాంగ్ కుట్రను ఛేదించినట్టు సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. ఈ ఘాతుకానికి ప్రణాళిక చేసిన ముగ్గురితోపాటు హత్య చేయడానికి ఒప్పుకున్న బిహారీని అరెస్టు చేసినట్టు చెప్పా రు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. వేములవాడలోని తిప్పపూర్‌కు చెందిన నీలం శ్రీనివాస్ కుమార్తెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్తకు తెలియకుండా వేములవాడకు చెందిన మనోజ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పద్ధతి మార్చుకోవాలంటూ మనోజ్‌కు పెద్దల సమక్షం లో పలుమార్లు పంచాయితీలు పెట్టారు. కానీ ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. శ్రీనివాస్ తన పరిచయస్తులకు ఈ విషయాన్ని చెప్పాడు. మనోజ్ హత్యకు శ్రీనివాస్.. తిప్పపూర్‌లో ఉండేæ మానుకు కుంటయ్య, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బొమ్మాడి రాజ్‌కుమార్, బిహార్‌కు చెందిన లిఖింద్ర సాహ్నితో రూ.5 లక్షలు సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మనోజ్ రోజు కూలి కోసం వేములవాడ బైపాస్ నుంచి వస్తాడని గ్రహించిన వీరు గురువారం ఉదయం బైపాస్‌లోని బతుకమ్మతెప్పవద్ద మరణాయుధాలతో కారులో మాటువేశారు. ఇదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి అక్కడున్న కారును తనిఖీ చేశారు. అందులో 2 పెద్దకత్తులున్నాయి. దీంతో వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, మనోజ్‌ను హత్య చేయడానికి చేసిన కుట్రను శ్రీనివాస్, కుంటయ్య, రాజ్‌కుమార్, సాహ్ని వెల్లడించారు. పోలీసులు వీరి నుంచి కారు, బైక్, 4 సెల్ఫోన్లు, చంపాలనుకున్న వ్యక్తి ఫొటో, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
రాజన్న సన్నిధిలో రామన్న కల్యాణం
వేములవాడ: హరిహరక్షేత్రంగా వెలుగొందుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాజా తరను తలపించేలా దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు. శివపార్వతులు (జోగినులు, హిజ్రాలు) చేతిలో త్రిశూలం పట్టుకుని రాజన్నను వివాహమాడారు. -
వైభవంగా రాజన్న కల్యాణోత్సవం
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు కల్యాణోత్సవానికి మున్సిపాలిటీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ శ్యాంసుందర్‌రావు పట్టువస్త్రాలు, ఆలయ ఈవో రమాదేవి తలంబ్రాలు సమర్పించారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణాల మధ్య రెండున్నర గంటల పాటు కల్యాణం కనులపండువగా సాగింది. ఎదుర్కోళ్ల సమయంలో వరుడి తరఫున స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, వధువు పక్షాన ఈవో రమాదేవి కట్నకానుకలు మాట్లాడుకున్నారు. అనంతరం స్వామివారిని పెద్దసేవపై ఊరేగించారు. కల్యాణ వేడుక ఆలయంలో నిర్వహించడం తో చాలామంది భక్తులు ఆలయం బయటే ఎండలో ఉండిపోయారు. ఎల్ఈడీ టీవీలు పనిచేయకపోవడంతో శివపార్వతులు గోల గోల చేశారు. కన్యాదాతలుగా గోపన్నగారి వసంత్–సరిత దంపతులు, వ్యాఖ్యాతగా తిగుళ్ల శ్రీహరిశర్మ, చంద్రగిరిశరత్ వ్యవహరించారు. కల్యాణోత్సవానికి లక్షమంది కిపైగా తరలివచ్చారు. 23న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం జరగనుంది. -
నీలకంథరా దేవా..
వేములవాడ/వరంగల్/నాగర్‌కర్నూలు: ఉదయమంతా శివయ్య దర్శనాలు.. రాత్రి జాగరణలు.. ‘ఓం నమఃశివాయ’నామస్మరణతో మంగళవారం రోజంతా శివాలయాలు మార్మోగాయి. పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఇటు వేములవాడ రాజన్న.. అటు వేయిస్తంభాల ఆలయం లోని రుద్రేశ్వరుడు.. మరోపక్క చెంచుల మల్లికార్జునుడు.. భక్తజన దర్శనాలతో ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో లయకారుడు లింగాకారుడై ఉద్భవించిన పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం స్వామికి మహాలింగార్చనను స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం ఘనంగా నిర్వహించింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీసీ సంక్షేమమంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వపక్షాన స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తిరుమల తిరుపతి వెంకన్న తరఫున టీటీడీ ఏఈవో మోహన్‌రాజు, వేదమూర్తులు సూర్యనారాయణశాస్త్రి, జితేశ్‌ల బృందం రాజన్నకు పట్టువస్త్రాలను సమర్పించారు. ‘కొడుకునియ్యి రాజన్నా..నీకు కోడెను గడుతాం రాజన్నా..’ అని గీతాలాపన చేస్తూ 2 లక్షలమంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. సాయంత్రం 6 గంటలకు వేదమూర్తులతో మహాలింగార్చన వైభవోపేతంగా సాగింది. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఆలయాన్ని తెరిచే ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. దర్శనానికి 6 గంటలు సోమవారం అర్ధరాత్రి 12 నుంచి మంగళవారం వేకువజామున 3.30 వరకు స్థానికుల దర్శనాల అనంతరం లఘుదర్శనాలను కొనసాగించారు. దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టింది. దీంతో క్యూలైన్లలో పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆరోగ్యసిబ్బంది సేవలందించారు. భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షవర్ల వద్ద స్నానాలు చేసి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గుడిచెరువులో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా, రాజన్న దర్శనంలో మంగళవారం దాదాపు ఆరుసార్లు బ్రేక్ విధించారు. దీంతో భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వేయిస్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. నగరంలోని వేయిస్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. ప్రధాన దారినుంచి రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులుదీరారు. రాత్రి శ్రీ రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరదేవీ కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణంలో పాల్గొన్నారు. కాళేశ్వరంలో భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో పెద్దపట్నం వేశారు. రాత్రి స్వామి కల్యాణం జరిగింది. కురవి వీరన్న ఆలయంలో కల్యాణం వైభవంగా జరిగింది. పిల్లలమర్రి కిటకిట... సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని శివాలయం మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే దర్శనాలు, అభిషేకాలు నిర్వహించేందుకు భక్తులు బారులుదీరారు. అనంతరం రాత్రి స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
వేములవాడ: రాజన్న కోడెకు ఎంత కష్టం..!!
-
బీజం వేములవాడలోనే?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన జగిత్యాల త్రిబుల్ మర్డర్ ఉదంతం వెనక సరికొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. వాస్తవానికి నాగేశ్వరరావు, ఆయన కుమారులను మట్టుబెట్టాలన్న పథకం ఇప్పటిదికాదని.. నెల రోజుల కిందే వారిపై వేములవాడలో హత్యాయత్నం జరిగిందని బాధిత కుటుంబం చెప్తోంది. వేములవాడ పోలీసులు కేసులను తారుమారు చేశారని, కేవలం దాడిగా చూపారని ఆరోపిస్తోంది. ఆనాడే హత్యాయత్నం కేసు నమోదు చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటే ఇంత ఘోరం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే వేములవాడలో దాడి, జగిత్యాల ఘటన వేర్వేరని.. అయినా ఈ అంశంలో పూర్తిస్థాయి విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. డిసెంబర్ 17న ఏం జరిగింది? బాధితుల బంధువుల వివరాల ప్రకారం.. డిసెంబర్ 17న వేములవాడ ఠాణా పరిధి లోని అగ్రహారం శ్మశానవాటిక సమీపంలో ఓ కుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి నాగేశ్వరరావు, అతడి కుమారులు రాంబాబు, రమేశ్ హాజరయ్యారు. సమావేశం తర్వాత వారు ఊరి వైపు బయల్దేరగా.. మధ్యలోనే వారి కారు ను ఏడుగురు వ్యక్తులు అడ్డగించారు. పెద్ద పెద్ద రాళ్లు విసిరారు. కారుదిగిన తండ్రీకొడుకులపై కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడికి దిగారు. సమీపంలో ఉన్న కొందరు మహిళలు, గొర్ల కాపరులు అక్కడికి వచ్చి విడిపించే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ తండ్రీకొడుకులు సమీపంలోని గుట్టవైపు పరుగులు తీసి ప్రాణా లు కాపాడుకున్నారు. వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని మరునాడు రమ్మన్నారు. బాధితులు తర్వాతి రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేసరికి.. సీన్ మారిపోయింది. నాగేశ్వరరావు, ఆయన కుమారులు తమపైనే దాడిచేశారంటూ ప్రత్యర్థి వర్గం ఫిర్యాదు చేసి రెడీగా ఉంది. ప్రత్యర్థులు తమను చంపాలని చూశారని నాగేశ్వరరావు వాపోయినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుల ఫిర్యాదునే ముందుకు తెచ్చి! నాగేశ్వరరావు 17వ తేదీనే ఫిర్యాదు చేసినా.. పోలీసులు మరునాడు 341, 427, 324 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నం. 547/2021 నమోదు చేశారు. అదే నాగేశ్వరరావు, అతడి కుమారులపై ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 290, 324, 323 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నం. 546/2021 నమోదైంది. ప్రత్యర్థుల ఫిర్యా దు 18న రాత్రి 8 ప్రాంతంలో వచ్చిందని, తర్వా రాత్రి 9గంటలకు నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారని పోలీసులు నమోదు చేశారు. దీనిపై నాగేశ్వరరావు కుటుంబ సభ్యు లు మండిపడుతున్నారు. నాగేశ్వర్రావు 17న సాయంత్రమే ఫిర్యాదు చేసినా.. ప్ర త్యర్థుల ఫిర్యాదు తర్వాతే చేసినట్టు చూపడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్ని స్తున్నారు. పోలీస్‌స్టేషన్ ముందు ఫొటోతో.. 17న దాడి జరిగాక రక్తమోడుతున్న గాయాలతో నాగేశ్వరరావు, ఆయన కుమారులు వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాక.. పోలీసుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి వ స్తూ.. దాదాపు రాత్రి 7.05 సమయంలో ఆయన కుమారులు తమ ఫొటో తీసుకున్నారు. ఇది ఇప్పుడు కీలకంగా మారింది. నాగేశ్వర్రావు 18నే ఫిర్యాదు చేస్తే.. ఆయన గాయాలు తడి ఆరి ఉండాలని గుర్తుచేస్తున్నారు. మరి 17వ తేదీనే ఫిర్యాదు ఇచ్చి ఉంటే.. మొదట నాగేశ్వరరావు ఫిర్యాదు కేసుగా నమోదు కావాలి. ప్రత్యర్థుల కేసు ముందుగా ఎలా తీసుకున్నారని బందువులు ప్రశ్నిస్తున్నారు. ఓ నేత ప్రమేయంతోనే..? నాగేశ్వర్రావు, ఆయన కుమారులపై దాడిచేసిన నిందితుల తరఫున అగ్రహారానికి చెందిన ఓ నాయకుడు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చాడని.. అందుకే నిందితులపై, బాధితులపై ఒకే సెక్షన్లతో కేసులు పెట్టారని బాధిత కుటుం బ సభ్యులు చెప్తున్నారు. హత్యాయత్నంపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లనే లేదని, సాక్షులను విచారించలేదని ఆరోపిస్తున్నారు. కాగా, వేములవాడలో హత్యాయత్నానికి ప్రయత్నించిన వారి బంధువులే.. జగిత్యాలలో నాగేశ్వరరావు, ఆయన కుమారులను పొట్టన బెట్టుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు వేములవాడలోనే పథకం వేశారని.. జగిత్యాలలో అమలు చేయించారని అంటున్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు వేములవాడలో జరిగిన దాడి, జగిత్యాలలో జరిగిన దాడి రెండూ వేర్వేరు. వేర్వేరు కారణాలు, నేపథ్యాలు ఉన్నాయి. ఇరువర్గాల ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదయ్యాయి. నిందితులు తమకు ప్రాణహాని ఉందని పోలీసులతో చెప్పలేదు. ఇక్కడి నిందితులకు, జగిత్యాలలో హత్యలకు పాల్పడినవారికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై విచారణ చేయిస్తాం. – రాహుల్ హెగ్డే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం
సాక్షి, కరీంనగర్/వేములవాడ: ఓవైపు కరోనా వైరస్ ఉధృతి, మరోవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరల వల్ల పుట్టిన రోజు వేడుక ఎంత చిన్నగా చేసినా ఎంత లేదన్నా రూ. 10 వేలు ఆవిరి అవుతున్నాయి. అలాంటిది ఇక పెళ్లితంతుకు అయ్యే ఖర్చు గురించి చెప్పనక్కర్లేదు. అందులోనూ తినుబండారాలు, కూరలు, వంటలు ఎక్కువగా చేసే ముస్లిం ఇళ్లల్లో పెళ్లిళ్లకు ఖర్చు మరీ ఎక్కువవుతుంది. రానురాను ఈ వివాహ విందు ఖర్చు పెరిగిపోతుండటంతో ఆడపిల్లల కుటుంబాలను ఖర్చు బాధల నుంచి బయటపడేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన మతపెద్దలంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ పెళ్లి అయినా సరే ఒకటే కూర, ఒకటే స్వీటు ఉండాలని తీర్మానించుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చదవండి: తెలంగాణ: ఓపీ చూసి.. మందులు రాసి! నిర్ణయం వెనక ఏం జరిగింది? సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో పెళ్లిలో అమ్మాయి తరఫువారు పసందైన రుచులతో తీరొక్క తీపి పదార్థాలు సిద్ధం చేస్తారు. చికెన్, మటన్‌తో అనేక రకాల వంటలు, బిర్యానీ, చపాతీ రోటీ, కుర్బానీ కా మీఠా, ఖద్దూ కా కీర్, ఐస్‌క్రీం, షేమియా, షీర్ కుర్మా.. ఇట్టా చెప్పుకుంటే పోతే.. అబ్బో ఐటం లిస్టు గోల్కొండ కోట అంత పెద్దగా ఉంటుంది. కానీ కరోనా కాలంలో చాలామంది వ్యాపారాలు మందగించాయి. ఎంతో మంది నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో ఆడపిల్ల పెళ్లిలో ఒకప్పటిలా రకరకాల ఆహార పదార్థాలతో విందులు ఏర్పాటు చేయడం భారమైంది. పెళ్లికూతురుకు పుట్టింటి వారు కట్నకానుకలు లేదా సారె కింద ఇచ్చే వాటి కంటే ఈ విందులో వడ్డించే వెరైటీల ఖర్చు అనేక రెట్లు అధికమైంది. ఎంత తక్కువలో వెరైటీలు ప్లాన్ చేసినా.. ఎంతలేదన్నా.. రూ. మూడున్నర నుంచి రూ.నాలుగున్నర లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఈ ఖర్చుపై పేద, సామాన్య ముస్లిం కుటుంబాల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చదవండి: కృష్ణుడు రాకున్నా.. ఏకంగా 1,37,000 కిలోల బరువున్న గిరిని ‘ఎత్తేయొచ్చు’! భగారా, చికెన్ లేదా మటన్, ఒక స్వీట్ వివాహంలో పెరుగుతున్న విందు ఖర్చును నియంత్రించేందుకు ఇటీవల వేములవాడలోని షాదీఖానాలో 8 మజీద్ కమిటీల పెద్దలు సమావేశమయ్యారు. స్థానికంగా జరిగే విందుల్లో భగారాతో పాటు ఒకటే కూర చికెన్ లేదా మటన్ మాత్రమే వడ్డించాలని తీర్మానించారు. గతంలో మాదిరి గంపెడు స్వీట్లు చేయకుండా ఏదైనా ఒకే స్వీటు పెట్టాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానం ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. -
ప్రయాణికుడి ట్వీట్.. స్పందించిన సజ్జనార్
వేములవాడ: ప్రయాణికుడు చేసిన ట్వీట్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. వేములవాడకు చెందిన వెల్దండి సదానందం ఈనెల 6న వేములవాడ నుంచి కరీంనగర్‌కు బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో వీడియో తీసి ట్విట్టర్లో సజ్జనార్‌కు పోస్టుచేశారు. దీనిపై స్పందించిన సజ్జనార్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: Drunk And Drive Test: ఇక రోజూ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చుక్కేస్తే.. చిక్కినట్టే! అదేరోజు కరీంనగర్లో దిగి బస్టాండ్‌లో మరుగుదొడ్ల నిర్వహణ, వాటర్ బాటిళ్ల అమ్మకాలపై అధిక వసూళ్లు చేస్తున్నట్లు పోస్టు చేయడంతో వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని ఆదేశించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్లే క్రమంలో కండక్టర్ మాస్క్ లేకుండా విధులు నిర్వహిస్తున్న ఫొటో షేర్ చేయడంతో కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. -
నిరుద్యోగులకు అండగా నిలిస్తే అరెస్టులా?
చందుర్తి (వేములవాడ): నిరుద్యోగ యువతకు అండగా నిలిస్తే ప్రభుత్వం అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. చందుర్తిలో శనివారం గాంధీ విగ్రహ ఆవిష్కరణకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్, పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌లతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ చేపట్టిన జంగ్ సైరన్ కార్యక్రమానికి జీవన్‌రెడ్డి వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌చేశారు. దీంతో కార్యకర్తలు పోలీసుల వైఖరికి నిరసనగా వాహనానికి అడ్డుగా బైఠాయించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు కార్యకర్తలను అడ్డు తొలగించి జీవన్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్‌ను చందుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఠాణాలో విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని హామీఇచ్చారు. జెడ్పీటీసీ కుమార్, నాయకులు రాం రెడ్డి, ముకుందరెడ్డి, లింగారెడ్డి, రామస్వామి, ఫీర్ మహ్మద్ పాషా, 100 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి
వేములవాడ అర్బన్: రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని.. ఇప్పుడు మోసం చేశాడని యువతి మేనబావ ఇంటి ఎదుట బైఠాయించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌కు చెందిన తన మేనబావ ఎదురుగట్ల రాము అదేకాలనీలో నివసిస్తున్న తన మేనమామ కూతురు గౌతమిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. రెండేళ్లుగా ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడని ఆ యువతి వాపోయింది. తన తల్లిమాటలు విని తప్పించుకు తిరుగుతున్నాడని గౌతమి ఆవేదన చెందింది. చదవండి: హుజురాబాద్.. తుపాకులు అప్పగించాలె.. లేదంటే ఈ విషయమై నాలుగు రోజుల కిందట గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేశ్ ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపింది. అయినప్పటికీ రాము మారకపోవడంతో బుధవారం ఉదయం ఈ విషయమై గౌతమి అడిగేందుకు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తల్లికుమారుడు వెళ్లిపోయారని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు మేనబావ ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట -
వేములవాడలో ‘బుల్లెట్టు బండి’ కపుల్.. ఎగబడ్డ జనం
సాక్షి, వేములవాడ: ‘బుల్లెట్టు బండి’ పాటకు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన జంట శుక్రవారం సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈనెల 14న వీరి పెళ్లి అవ్వగా నేడు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని రాజన్నకు పూజలు చేశారు. దైవ దర్శనం కోసం వచ్చిన దంపతులు అశోక్ సాయిశ్రీయలను చూసేందుకు జనం ఎగబడ్డారు. సోషల్ మీడియా ట్రెండింగ్ కపుల్ కోసం మీడియా సైతం కవరేజీ కోసం పోటీ పడింది. కాగా బుల్లెట్ బండి పాటపై బారాత్ లో సాయి ప్రియ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిన విషయం తెలిసిందే. చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. భర్త ఫిదా రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఎస్కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకోగా ఇక లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి. -
అబ్బురపడేలా రాజన్న ఆలయం
సాక్షి, హైదరాబాద్: దేశం అబ్బురపడేలా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్‌లో వేములవాడ ఆలయ, పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి ఆరా తీశారు. దేశం అబ్బురపడేలా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారని, వేములవాడ ఆలయాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. వీటీడీఏ, దేవాదాయ, పురపాలక, రోడ్లు, భవనాల శాఖ అధికారులు, స్తపతులను భాగస్వాములను చేసి వారి సలహాలు, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు సమాంతరంగా పట్టణాభివృద్ధి జరగాలని సూచించారు. వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పుష్కరిణి, కల్యాణకట్ట, కల్యాణ మండపం, క్యూ కాంప్లెక్స్, కళాభవనం పనుల్లో వేగం పెరగాలని చెప్పారు. టెంపుల్ టూరిజంగా వేములవాడ దేవాలయ పర్యాటకంలో భాగంగా వేములవాడను సమగ్ర అభివృద్ధి చేయాలని, చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ నిర్మించాలని, బోటింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేములవాడ, మిడ్‌మానేరులో పర్యాటక రంగాన్ని మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని, స్థల సేకరణ వెంటనే చేపట్టాలని, విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. వేములవాడలో దశల వారీగా రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని, బ్రిడ్జి నుంచి గుడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. బస్టాండ్ నుంచి ఆలయం వరకు ఉచిత ప్రయాణం కల్పించాలని, దానికి అనుగుణంగా మినీ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
వలలో 20 కిలోల చేప.. మనోడికి పండగే పండగ
రుద్రంగి (వేములవాడ): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, కలికోట శివారులోని సూరమ్మ చెరువు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత అలుగు దూకింది. దీంతో శుక్రవారం సూరమ్మ ప్రాజెక్టులో నుంచి భారీ ఎత్తున చేపలు బయటకు వచ్చాయి. వాటిని పట్టేందుకు రెండు గ్రామాల ప్రజలు పోటెత్తారు. పెద్ద చేపలు పడడంతో జాలరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కలికోటకు చెందిన ఎల్ల రాజు వలకు దాదాపు 20 కిలోల చేప చిక్కింది. దాన్ని విక్రయించగా రూ.1,600 వచ్చినట్లు రాజు చెప్పాడు. మానేరు అందాలు.. చూడగానే వాహ్.. అనిపించే ఈ సుందర దృశ్యం కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు ప్రాజెక్టుది. ఎగువ నుంచి వస్తున్న వరదకుతోడు స్థానికంగా కురుస్తున్న వానలతో మానేరు డ్యామ్ జలకళతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. భారీగా వరద వస్తుండడంతో అధికారులు గురువారం రాత్రి 12 గేట్లను తెరిచారు. శుక్రవారం మరో ఆరు గేట్లను తెరిచారు. మొత్తం 18 గేట్ల ద్వారా లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. నిండుకుండలా కనిపిస్తున్న డ్యామ్.. పచ్చని పొలాలు.. ఆ పక్కన కరీంనగర్ నగరం.. ఆకట్టుకునే హైదరాబాద్ హైవే.. తీగల వంతెనను తాకుతూ వరద వెళ్తుండడంతో ఆ దృశ్యం మరింత ఆకర్షణీయంగా మారింది. – కరీంనగర్ సీనియర్ ఫొటోగ్రాఫర్, శైలేంద్రారెడ్డి చెరువు అలుగే జలపాతమై.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకీబాయి చెరువు పూర్తిగా నిండటంతో 40 అడుగుల ఎత్తు ఉన్న అలుగు నుంచి జలపాతాన్ని తలపిస్తూ నీరు కిందికి జాలువారుతోంది. వర్షాకాలం ముగిసేంత వరకు ఈ అలుగు పర్యాటకులను ఆకర్షిస్తోంది. గత రెండేళ్లుగా పర్యాటకులు పెరగడంతో వారి భద్రతకోసం మరిన్ని సౌకర్యాలు కల్పించినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. – ఇందల్వాయి, రాజ్‌కుమార్ -
దసరాలోగా అందరికీ తాగునీరు: మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: దసరాలోగా అందరికీ తాగునీరు అందిస్తామని రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ పట్టణ ప్రగతిలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రైతుబజార్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 100 పడకల ఆస్పత్రిలో రూ.40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేశామని పేర్కొన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరు గాంచిందని.. రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారన్నారు. ఈ నేపథ్యంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి, ఆదర్శంగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. -
అమ్మా.. నాన్న ఫోన్ ఎందుకు చేస్తలేడు?
మేడిపెల్లి (వేములవాడ): ‘దుబాయ్ పోయి పైసలు సంపాదించి పిల్లలకు ఏ లోటు రాకుండా చూద్దామని అంటివి. అమ్మను ఏడిపించొద్దు.. చెప్పినట్టు వినాలని పిల్లలకు చెప్తివి. పిల్లలను మంచిగ చూసుకో.. డబ్బులు పంపిస్త.. అని చెప్పి పోయి ఆరు నెలలైతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోన్ లేదు. అమ్మా.. నాన్న ఎందుకు ఫోన్ చేస్తలేడని పిల్లలు అడిగితే ఇప్పటిదాకా ఏదోలాగా సమాధానం చెప్పుకొచ్చిన. నువ్వు ఎక్కడున్నా మాతో ఫోన్లో మాట్లాడి క్షేమంగా ఉన్నానని చెప్పు’అంటూ జాడలేని తన భర్తకోసం ఓ ఇల్లాలు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెంకు చెందిన శ్రీరాముల హరిప్రసాద్ (40) ఊళ్లోనే టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి భార్య నీరజతో పాటు పవన్ (9), రక్షిత (7) ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలు ఎదుగుతుండటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అయినప్పటికీ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని ఆశ పడ్డాడు. గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకొని, అబుదాబిలో హోటల్లో పనికోసం రూ.2 లక్షలు చెల్లించి గతేడాది డిసెంబర్ 27న అక్కడికి వెళ్లాడు. కరోనా నిబంధనల ప్రకారం కంపెనీ వారు హరిప్రసాద్‌ను 10 రోజులపాటు క్వారంటైన్లో ఉంచారు. జనవరి 5న కంపెనీ కేటాయించిన రూములోకి మారాడు. రూల్స్ ప్రకారం మెడికల్ టెస్టులు చేయించి జనవరి 19 నుంచి పనికి రావాలని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అయితే జనవరి 18న చిన్న పని ఉందని తనతో రూమ్‌లో ఉన్నవారికి చెప్పి బయటకు వెళ్లిన హరిప్రసాద్ అదృశ్యమయ్యాడు. ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. తన భర్త అబుదాబి వెళ్లి ఫోన్ చేయకపోవడంతో భర్త పనికి కుదిరిన ప్రాంతంలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది నీరజ. వారు అక్కడికి వెళ్లి చూడగా హరిప్రసాద్ ఫోన్‌తోపాటు లగేజీ కూడా రూములోనే ఉన్నాయి. కంపెనీ వారు సైతం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. హరిప్రసాద్ ఇంటి నుంచి వెళ్లి ఆరు నెలలు అవుతున్నా భార్య, ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తన భర్తను ఇంటికి రప్పించేలా చూడాలని భార్యా పిల్లలు చేతులు జోడించి వేడుకుంటున్నారు. హరిప్రసాద్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని, స్వగ్రామానికి తీసుకువచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
ఒంట్లో బాగోలేదని: బామ్మను ఇంట్లోకి అనుమతించని మనుమరాలు
సాక్షి, వేములవాడ: ఆమె శతాధిక వృద్ధురాలు.. నిలువనీడలేదు.. మండుటెండలు.. పైగా అనారోగ్యం.. జీవిత చరమాంకంలో ఆ బామ్మకు ఎంత కష్టం! మాతృ దినోత్సవం రోజునే ఈ ముసలమ్మకు ఎంత కష్టం! తలదాచుకునేందుకు దిక్కులేక బిక్కుబిక్కుమంటోంది.. రోడ్డు పక్కన టెంట్ కింద మూలుగుతోంది. ఎములాడ రాజన్నకు కూడా ఆమె మూగరోదన వినిపించనట్టుంది! ‘బామ్మా.. మా ఇంటికి రా’అని ఆపన్నహస్తం అందించేవారే కరువయ్యారు. మానవత్వం మంటగలిసింది. వివరాలు... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పంబి వెంకటస్వామి తన తల్లి తులసమ్మ(103), భార్యతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం తులసమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఆమె చనిపోతే తమకు అరిష్టమని భావించి ఇంటి యజమానులు వారిని బయటకు వెళ్లగొట్టారు. దీంతో వెంకటస్వామి తల్లి, భార్యను తీసుకుని అదే పట్టణంలో ఉంటున్న తన కుమార్తె సునీత ఇంటికి వెళ్లాడు. అయితే, సునీత, ఆమె కుమారుడు శ్రీకాంత్, కూతురు.. బామ్మను ఇంట్లోకి రానివ్వలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న బామ్మకు ఏమైనా అయితే మంచిది కాదని భావించి, ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో వెంకటస్వామి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సూచనతో మళ్లీ అద్దె ఇంటికి వెళ్లినా యజమానులు అనుమతించలేదు. గత్యంతరంలేక మళ్లీ తన కూతురి ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆమె ససేమిరా అనడంతో రోడ్డు పక్కన టెంట్ వేసుకొని దాని కిందే తన తల్లితో కలసి తలదాచుకుంటున్నారు. పోలీసులు స్పందించి వెంకటస్వామి కూతురు, మనుమడు, మనుమరాలుకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చదవండి: వేల ఏళ్ల క్రితమే కరోనా కజిన్ సిస్టర్! -
చాటింగ్ చేసి నిండా ముంచిన ‘వంటలక్క’
సాక్షి, వేములవాడరూరల్: వంటలు చేసే ఓ మహిళకు దుబాయిలో ఉండే వేములవాడ మండల యువకుడి ఫోన్ నంబర్ లభించింది. మాటలతో అతడిని మాయ చేసింది. పేరు మార్చి చాటింగ్ చేస్తూ రూ.15లక్షలు వసూలు చేసింది. మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. వేములవాడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శనివారం అరెస్టు చేశారు. వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్ శనివారం రాత్రి విలేకరులకు వివరాలు వెల్లడించాడు. వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన నరెడ్ల గంగారెడ్డి ఉపాధి నిమిత్తం దుబాయిలో ఉంటున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన పుట్ట సునీత శుభకార్యాల్లో వంట పని చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు దొరికిన పుస్తకంలో గంగారెడ్డి ఫోన్‌నంబర్ లభించింది. ఆ నంబరుతో ఆమె చాటింగ్ ప్రారంభించింది. హైదరాబాద్‌కు చెందిన నందుగా గంగారెడ్డితో పరిచయం చేసుకుంది. టిక్‌టాక్‌లో ఫొటోలు అప్లోడ్ చేసి తనవేనని పంపించింది. మూడు నెలల తర్వాత గొంతుమార్చి తన పేరు వైశు అని, తాను నందు స్నేహితురాలినని పరిచయం చేసుకుంది. హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్తుండగా నందు రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిందని నమ్మించింది. ఆమె మొబైల్ఫోన్లో మీ ఇద్దరి ఫొటోలు ఉన్నాయని, తనకు కొంత డబ్బు ఇస్తే ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పనని బెదిరించింది. ఆ తర్వాత తన పేరు సునీత అని మళ్లీ పేరు మార్చుకుని గంగారెడ్డికి ఫోన్‌చేసింది. నందు, వైశు ఇద్దరూ మృతిచెందారని, ఇందుకు నీవే కారణమని మరోసారి బెదిరించి గంగారెడ్డిని డబ్బు డిమాండ్ చేసింది. ఇలా గంగారెడ్డికి జగిత్యాలకు చెందిన జిరాక్స్ షాపు నిర్వాహకుడు ఇటిక్యాల రవి బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చింది. అందులో పలుసార్లు డబ్బు వేయాలని సూచించింది. డబ్బులు పంపకుంటే ఇద్దరి మృతికి నువ్వే కారణమని చెబుతానని బెదిరించింది. భయానికి గురైన గంగారెడ్డి ఖాతా నంబరుకు డబ్బులు పంపించాడు. ఇలా మొత్తం రూ.15లక్షల వరకు పంపించాడు. దుబాయి నుంచి వచ్చిన గంగారెడ్డి ఈ విషయంపై ఈ నెల 8న వేములవాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ బన్సీలాల్, ఎస్సై మాలకొండరాయుడు, సిబ్బంది రంగంలోకి దిగారు. సదరు మహిళ, ఆమెకు సహకరించిన ఇటిక్యాల రవిని వేములవాడ కోర్టు ప్రాంతంలో శనివారం పట్టుకున్నారు. సునీతను విచారించి, రూ.35వేలు, తులం బంగారు గొలుసు, మొబైల్ ఫోన్, బ్యాంకు పాస్‌బుక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. -
రాజన్న సిరిసిల్ల: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం
సాక్షి, వేములవాడ: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల కాల్పుల అనంతరం రాష్ట్రంలో విస్తృత తనిఖీలు చేపడుతున్న సమయంలో టిఫిన్ బాక్స్ బాంబు వెలుగులోకి వచ్చింది. దీంతో సిరిసిల్ల జిల్లాలో కలకలం ఏర్పడింది. కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులోని అటవీ ప్రాంతంలో టిఫిన్ బాక్స్ బాంబు బయటపడింది. ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని సురక్షితంగా టిఫిన్ బాక్స్ బాంబును వెలికితీశారు. ఇంకా ఏమైనా మందుపాతరలు ఉన్నాయేమోనని పోలీసులు ఆ ప్రాంతాన్ని జేసీబీతో తవ్వించారు. ప్రస్తుతం ఒక టిఫిన్ బాక్స్ బాంబు మాత్రమే బయటపడింది. దాన్ని నిర్వీర్యం చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాజన్న సిరిసిల్ల - నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతం మర్రిమడ్ల, మానాల అటవీ ప్రాంతం గతంలో మావోయిస్టులు, జనశక్తి నక్సల్స్‌కు పట్టున్న ప్రాంతం. అప్పట్లో నక్సలైట్లు ఈ టిఫిన్ బాక్స్ బాంబును పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాంబు వెలికితీసిన పోలీసులు, బాంబ్ డిస్పోజల్ బృందం సభ్యులు ఆ ప్రాంతంలో క్షుణ్నంగా తనిఖీ చేపట్టారు. ఎక్కడ ఎలాంటి మందుపాతరలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒక టిఫిన్ బాక్స్ బాబు బయటకు కనిపించడం అటవీశాఖ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం దానిని నిర్వీర్యం చేసే పనిలో పోలీసులు ఉన్నారు. బయటపడ్డ టిఫిన్ బాక్స్ బాంబుపై పోలీసులు విచారణ చేపట్టారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పుల నేపథ్యంలో తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ఈ బాక్స్ బాంబు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. -
వైభవంగా రాజన్న కల్యాణోత్సవం..
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. వేదమూర్తుల మంత్రోచ్ఛరణల మధ్య ఉదయం 10.50 గంటలకు కల్యాణం జరిపించారు. రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఈ తంతు నిర్వహించారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో సుమారు రెండున్నర గంటలపాటు కల్యాణం జరిపించారు. కోవిడ్–19 నిబంధనల మే రకు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆలయంలోకి భక్తులు రాకుండా కట్టడిచేశారు. ఒకే క్యూలైన్ ద్వారా రాజన్న దర్శనానికి అనుమతించారు. అయినప్పటికీ, 50 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. చేతిలో త్రిశూలం, తలపై జీలకర్ర, బాసింగాలతో శివ పార్వతులు శ్రీరాజరాజేశ్వరస్వామిని వివాహం చేసుకున్నారు. మాస్క్‌లు లేకుండా భక్తులు భారీసంఖ్యలో తరలిరావడంతోపాటు ఎక్కడా కోవిడ్ నిబంధనలు అమలు కాలేదు. -
గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ
సాక్షి, వేములవాడ: ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో మరింత ఆదరణ సొంతం చేసుకుంది. బిగ్‌బాస్‌లో కుర్రాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను అలరించింది. తన మార్క్ పల్లెటూరి డైలాగ్ లతో అందరినీ ఆకట్టుకుంది. ఆమెకు ఓట్లు వేసేందుకు సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడిచింది. అయితే బిగ్‌బాస్ హౌజ్ వాతావరణం పడకపోవడంతో ఆమె అనారోగ్యం పాలైంది. దాంతో హౌజ్నుంచి మధ్యలోనే బయటకు రాక తప్పలేదు. ఇక బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున చలువతో సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా.. తన చిరకాల కోరికను తీర్చుకుంది. ఆమె హెలీకాప్టర్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అంతెత్తు ఆకాశం నుంచి తన ఊరు పొలాలను, ఇళ్లను చూసి ఆమె మురిసిపోయింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలో హెలీకాప్టర్ సేవలు మొదలైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాజన్న దర్శనానికి వెళ్లిన గంగవ్వ గాలి మోటార్ ఎక్కి పరవశించిపోయింది. -
రండి.. రాజన్న సేవలో తరించండి!
వేములవాడ: పేదల దేవుడు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం ఆలయ అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు జాగరణచేపట్టేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, వసతీసౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారం రాత్రి నుంచే వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల రాక మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ వేములవాడకు చేరుకుంటారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ‘మహా’ జాతర ఏర్పాట్లపై సమీక్ష వేములవాడ రాజన్న సన్నిధిలో బుధవారం నుంచి మూడురోజులపాటు జరిగే మహాశివరాత్రి జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ చాంబర్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. కోవిడ్–19 నిబంధనలు సడలించాక రాజన్న భక్తులు తమ ఇలవేల్పు వేములవాడ రావడం అధికమైందన్నారు. భక్తులకు రవాణా సౌకర్యం కల్పించాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. అందరికీ వసతి లభించేలా, మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటులోకి తేవాలన్నారు. శానిటైజర్లు, మాసు్కలు పంపిణీ చేయాలని చెప్పారు. వైద్యసేవలు అందించాలని, భద్రత కల్పించాలని ఆదేశించారు. పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఆర్టీవో శ్రీనివాస్‌రా వు, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్‌బాషా, అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, తహసీల్దార్ మునీందర్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, 14మంది ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల సేవలో నిమగ్నం కావాలని మంత్రి సూచించారు. -
నేటి నుంచి వేములవాడలో హెలీకాప్టర్ సేవలు
వేములవాడ: వేములవాడ రాజన్న జాతర మహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హెలిట్యాక్సీ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి రాజన్న గుడి చెరువు కట్టపై స్థల పరిశీలన చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు గగనతలంలో 7 నిమిషాలపాటు తిరిగేందుకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున తీసుకోనున్నారు. నాంపల్లి గుట్ట, వేములవాడ పట్టణం చుట్టూ తిప్పుతూ తిరిగి గుడి చెరువు వద్దకు తీసుకువస్తారు. 15 నిమిషాలు గగనతలంలో విహరించేందుకు ఒక్కొక్కరికి రూ.5,500 తీసుకొని నాంపల్లి గుట్ట, మిడ్‌మానేరు చూపించనున్నారు. హెలికాప్టర్ ఒక్కో ట్రిప్పులో ఐదుగురి చొప్పున తీసుకెళ్తారని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 94003 99999, 74834 32752, 99800 05519, 95444 44693 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చదవండి: వైరల్: ఆకలేస్తే అంతేమరీ! -
ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడు మన దగ్గరే!
మేడిపెల్లి(వేములవాడ): దేశంలోని అన్ని శివాలయాల్లో శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తుంటాడు. కానీ ఇక్కడ మాత్రం శివుడు నిజరూపంలో దర్శనం ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పవచ్చు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని తొంబర్రావుపేట శివాలయంలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహం ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడి విగ్రహంగా పేరు పొందింది. శివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి.. తొంబర్రావుపేట శివాలయంలో మహాశివరాత్రిని పురష్కరించుకొని నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ నెల 10న పుణ్యహవచనం, స్థాపిత దేవతల పూజలు, అభిషేకాలు, 11న స్వామివారి కల్యాణం, జాగారం, లింగోధ్భావం, 12న రథోత్సవం, అన్నదానం, 13న బద్దిపోచమ్మకు బోనాలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చదవండి: నైట్‌షిఫ్ట్‌తో క్యాన్సర్ ముప్పు! -
అమ్మకొంగు పట్టుకుని వచ్చి.. అనంత లోకాలకు
కథలాపూర్(వేములవాడ): అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న బాలుడు అమ్మకొంగు పట్టుకుని వచ్చి అనంతలోకాలు చేరాడు. కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామంలో ఆటో ఢీకొనడంతో రాస రియన్స్(16 నెలలు) మంగళవారం రాత్రి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తాండ్య్రాల గ్రామానికి చెందిన రాస గణేశ్–తేజస్విని దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు రియన్స్ ఉన్నాడు. గ్రామానికి మంగళవారం రాత్రి వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే ఆటో వచ్చింది. తేజస్విని సిలిండర్ తీసుకునేందుకు వచ్చింది. వెంట రియన్స్ వచ్చాడు. తేజశ్విని చిల్లర డబ్బుల కోసం బాలుడిని ఇంటిముందు వదిలి లోపలికి వెళ్లింది. ఇంతలో బాలుడిని గమనించని డ్రైవర్ ఆటోను రివర్స్ తీశాడు. ఆటో రియన్స్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్‌తోపాటు అసిస్టెంట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. చదవండి: మేనకోడలిని దారుణంగా చంపేశాడు! -
ఎమ్మెల్యే పౌరసత్వంపై వీడని సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గతకొంత కాలంగా సాగుతున్న ఈ వివాదంపై మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్లో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు గడువుకోసం కోర్టును కోరారు. కేంద్రం మాత్రం వారంలో విచారణ పూర్తిచేయాలని కోరుతోంది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తు.. సిద్ధంగా ఉండాలని హైకోర్టు ఇరుపక్షాలకు సూచించింది. జర్మనీ పౌరసత్వం కలిగి పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ కోర్టుకు తెలిపారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. రమేష్ పౌరసత్వం వివాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటంలేదన్నారు. కాగా 2017లో కేంద్ర హోంశాఖ చేపట్టిన మొదటి విచారణలో రమేష్ భారత పౌరుడు కారని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఓ సారి సమీక్షించాలని రమేష్ అభ్యర్తించగా రెండోసారి కేంద్ర హోంశాఖ పౌరసత్వం పై సమీక్షించి.. భారత పౌరుడు కాదని తేల్చింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలను సవాలు చేస్తూ రమేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని కోర్టును అభ్యర్థించాడు. దీంతో జూలై 23. 2019 తేదిన గతంలో కేంద్ర హోం శాఖ ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేస్తూ త్రిమెన్ ఇచ్చిన నివేదికను నుంచి పున: పరిశీలించాలని, పౌరసత్వం లో 10(3) నిబంధనను కూడా చట్టప్రకారం పరిశీలించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 12 వారాలలో తేల్చాలని కేంద్రహోం శాఖకు తిరిగి అదేశించింది. అక్టోబర్ 31, 2019 న ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ బోర్డర్ మేనేజ్ మెంట్ సెక్రటరీ నార్త్ బ్లాక్‌లోని ఓ గది లో ఇరుపక్షాలను విచారించారు. హైకోర్టు ఇచ్చిన 12 వారాల గడువు అనంతరం మళ్లీ కేంద్ర హోం శాఖ చెన్నమనేని భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మళ్ళీ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై న్యాయస్థానం విచారిస్తోంది. మరో రెండు వారాల్లో ఇరుపక్షాలు దాఖలు చేసిన కౌంటర్ అనంతరం తిరిగి విచారించనుంది. తుది వాదనలకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్ట్ ఎలాంటి ఆదేశాలు జారీచేస్తుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
దారుణం: అప్పుడే పుట్టిన బిడ్డను ముళ్లపొదల్లో..
సాక్షి, వేములవాడ: పేగు బంధం మరిచింది.. రక్తసంబంధాన్ని కాదనుకుంది.. కడుపున మోసిన ప్రతిరూపాన్ని వద్దనుకుంది.. లోకం పోకడ తెలియకముందే ముళ్లపొదల్లో పడేసి తన దారిన తాను వెళ్లిపోయింది.. కారణాలు ఏమో తెలియదు గానీ.. అమ్మతనం మంట గలిసేలా వ్యవహరించింది.. కాకులు పొడిచి, చీమలు కుట్టి, పందులు కొరికేస్తుండగా పసికూన కేకలు వేసింది.. సరిగా అర్థం చేసుకోలేని స్థానికులు.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని నివ్వెరపోయారు.. స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడలోని న్యూఅర్బన్‌కాలనీలో సోమవారం సాయంత్రం చిన్నపిల్లలు రేగుపండ్లు తెంపుకునేందుకు సమీప ముళ్లపొదల్లోకి వెళ్లారు. అక్కడ పసికందు కనిపించింది. ఈ విషయాన్ని కాలనీవాసుల దృష్టికి తీసుకెళ్లారు. వారు అక్కడికి చేరుకొని చూసే సరికే అప్పుడే పుట్టిన మగశిశువు మృతదేహం కనిపించింది. అప్పటికే కుడిచేయి కనిపించలేదు. వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ వెంకటేశ్ ఘటనాస్థలికి చేరుకొని మున్సిపల్ సిబ్బంది సహాయంతో శిశువు మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించనున్నట్లు సీఐ తెలిపారు. శిశువును పడేసింది ఈ ప్రాంతానికి చెందినవారా? లేక ఇతర ప్రాంతాలకు చెందిన వారా? అనే విషయమై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. -
కోడెమొక్కు చెల్లించుకున్న ముస్లిం మహిళ
వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన అప్సర్ షాహిన అనే ముస్లిం మహిళ మంగళవారం కోడె మొక్కు చెల్లించుకున్నారు. రాజన్న క్షేత్రంలో హిందూ ఆలయాలతోపాటు దర్గా కూడా ఉంది. కులమతాలకు అతీతంగా ఇక్కడ దర్శనాలు జరుగుతాయి. రాజన్నను దర్శించుకున్న వారు దర్గాను, దర్గాను దర్శించుకున్న వారు రాజన్నను దర్శించుకుంటుంటారు. ఇందులో భాగంగానే అప్సర్ షాహిన కోడెమొక్కు చెల్లించుకుని మతసామరస్యాన్ని ప్రదర్శించారు. -
నరకం: ‘నీ ఇద్దరు పిల్లల్ని అమ్మేస్తాం’
వేములవాడ: ‘నీ ఇద్దరు పిల్లల్ని అమ్మేస్తాం’ అని బెదిరించి వేములవాడ పట్టణానికి చెందిన ఓ వివాహితను బలవంతంగా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన బాబు లక్ష్మణ్ జగవత్‌కు మూడో పెళ్లి చేసిన వైనం వెలుగు చూసింది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మహిళకు నాలుగేళ్ల కుమారుడు, ఏడాది పాప ఉన్నారు. ఇంట్లో తరచూ భర్తతో గొడవ కావడంతో విసుగెత్తిన ఆమె మార్చి 4న ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేములవాడ నుంచి కామారెడ్డి, అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరింది. అక్కడే మూడు రోజు గడిపింది. ఈ విషయాన్ని గమనించిన ఓ వృద్ధురాలు వివాహితను చేరదీసినట్లు నటించింది. పని ఇప్పిస్తానని చెప్పి మహారాష్ట్రలోని పర్భాని ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడే ఉన్న రాజారాం అనే వ్యక్తికి రూ. లక్షకు అమ్మేసింది. పది రోజుల పాటు తనవద్దే ఉంచేసుకున్న రాజారాం నాసిక్ ప్రాంతంలో ఉండే తన బావమరిది బాబు లక్ష్మణ్ జగపత్‌కు అప్పగించాడు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అతడిని పెళ్లి చేసుకోవాలని, లేదంటే పిల్లల్ని ఎత్తుకొచ్చి అమ్మేస్తానని బెదిరించి బలవంతంగా మూడో పెళ్లి చేశాడు.(చదవండి: టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దాడులు ) ఫోన్ ట్రాకింగ్‌తో.. 8 నెలల క్రితం అదృశ్యమైన వివాహిత ఆచూకీ లభ్యం కాలేదు. ఓ రోజు తన ఆడపడుచుకు, తెలియని నంబర్ నుంచి ఫోన్ రావడంతో విషయం బయటపడింది. ఫోన్ నంబర్ ఆధారంగా వేములవాడ పోలీసులు ఆ ప్రాంతాన్ని కనుగొన్నారు. ఓ పోలీసు బృందం నాసిక్ చేరుకుని వివాహిత కోసం ఆరా తీసింది. ఆమెను మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని ఈనెల 28న వేములవాడకు తీసుకువచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ జగపత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమస్యలు పరిష్కరించుకోవాలి: సీఐ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలకు వివాహితలు బయటికి వెళ్లిపోయి మాయ మాటలు చెప్పే వారి ఉచ్చులో పడవద్దని టౌన్ సీఐ వెంకటేశ్ ఈ సందర్భంగా సూచించారు. బంధువల సమక్షంలో సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. -
జర్మనీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. భిక్షాటనతో నిరసన
సాక్షి, కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. కరోనా కాలంలోనూ కంటికి కనిపించడంలేదని మండిపడుతున్నారు. నియోజకవర్గంలో రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్యెల్యే జాడలేకపోవడంతో నిరసన తెలియజేస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిసి.. జర్మనీలో ఉంటున్న ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్‌పై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జర్మనీలో ఉన్న రమేష్ బాబును నియోజకవర్గానికి రప్పించేందుకు విమాన చార్జీల కోసం గురువారం వేములవాడ రాజన్న ఆలయం ముందు భిక్షాటనకు దిగారు. జర్మనీ నుంచి తమ ఎమ్మెల్యేను ప్రత్యేక విమానం ద్వారా తీసుకురావాలని డబ్బు జమ చేస్తున్నామని వారు తెలిపారు. సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రజా సమస్యలపై పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని గతంలోనూ రమేష్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యే కనపడుటలేదంటూ పోలీసులు సైతం స్థానికులు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. -
కాళ్లు మొక్కి పెళ్లి చేసుకున్నాడు, కానీ..
సాక్షి, కోనరావుపేట(వేములవాడ): వెంటపడ్డాడు.. ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె తల్లడిల్లిపోయింది. నిత్యం వేధింపులు తాళలేక తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. కోనరావుపేట మ ండలం కొలనూర్‌కు చెందిన వీరవేణి పర్శరాములు–పద్మ దంపతుల కుమారుడు అజయ్ సిరిసిల్ల మండలం పెద్దూర్‌కు చెందిన ఇన్నారం దేవయ్య–మంగ దంపతుల కూతురు రాణి ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం చేయగా అజయ్ అడ్డుకున్నాడు. రాణిని తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆ సంబంధాన్ని చెడగొట్టాడు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో రాణి తల్లిదండ్రులు కొలనూర్‌కు వచ్చి అజయ్‌ను నిలదీశారు. దీంతో అతను వారి కాళ్లు మొక్కి, రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆగస్టు 12న పెళ్లి... అజయ్, రాణిలు ఆగస్టు 12న నిజామాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అన ంతరం అజయ్ ఆమెను కొలనూర్‌లోని ఇంటికి తీ సుకెళ్లాడు. ఇది నచ్చని అతని తల్లిదండ్రులు, నాన మ్మ రాణిని చిత్రహింసలకు గురిచేశారు. నిత్యం కులం పేరుతో దూషించేవారు. ప్రతిరోజూ ఇంటి, పొలం పనులు చేయిస్తూ పస్తులుంచేవారు. వారి వేధింపులు తీవ్రం కావడంతో రాణి తల్లి ఈ నెల 14న ఆమెను ఇంటికి తీసుకెళ్లింది. తిరిగి మంగళవారం కొలనూర్‌కు వస్తే అజయ్ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో రా ణి అత్తవారింటి ఎదుట బైఠాయించింది. బాధితులరాలికి మహిళా సంఘాలు, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పోలీసులు తనకు న్యాయం చేయాలని రాణి వేడుకుంటోంది. ఐపీఎల్ బెట్టింగ్ నిందితుల అరెస్టు గోదావరిఖని(రామగుండం): ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిందితులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లాలోని సీసీసీ నస్పూర్ ఏరియాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ కమీషన్లు తీసుకుంటున్న ప్రధాన నిందితుడు, ఆర్ఎంపీ జబ్రీ ఇక్బాల్‌తో సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ అడ్మిన్ అశోక్‌కుమార్ వివరాలు వెల్లడించారు. సీసీసీ నస్పూర్ ఏరియాలో భారీగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు రామగుండం సీసీఎస్ ఏసీపీ పీవీ.గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారన్నారు. మదర్ క్లినిక్ కేంద్రంగా ఈ దందా సాగుతోందని చెప్పారు. క్లినిక్ ఆర్ఎంపీ డాక్టర్ జబ్రీ ఇక్బాల్ ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్‌కు దిగేవారిని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. 2019లోనూ ఇక్బాల్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాలడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అతని బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నగదు, సెల్ఫోన్లు స్వాధీనం... క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 15 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ అడ్మిన్ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు జబ్రి ఇక్బాల్‌తో పాటు సీసీసీ నస్పూర్‌కు చెందిన జబ్రి హాధి, జబ్రి అఖిల్, కొమ్మెర విజయ్, ఎండీ.ఫహీమ్, సుంకరి సాగర్, అనుమాస్ సంతోష్‌కుమార్, నేదూరి శ్రీనివాస్, అగ్గు కిరణ్, అగ్గు స్వామి, చిట్యాల ప్రశాంత్, సూరిమిల్ల కార్తీక్, చాతరాజు శరత్చంద్ర, మాచర్ల సాయి, కోట ఉదయ్రాజ్లను అరెస్టు చేశామన్నా రు. మంచిర్యాల మారుతినగర్‌కు చెందిన దేవేందర్ పరా రీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.40 లక్షలు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడి ంచారు. అనంతరం నిందితులతో ప్రతిజ్ఞ చేయించారు. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండి, తమ విలువైన భవిష్యత్‌ను కాపాడుకోవాలని డీసీపీ అడ్మిన్ అశోక్‌కుమార్ సూచించారు. క్రికెట్ బెట్టింగ్‌లపై పోలీసుల నిఘా కొనసాగుతోందని, ఎలాంటి సమాచారం అందినా ఆకస్మిక దాడులు నిర్వహిస్తామన్నారు. బెట్టింగ్‌లో పాల్గొంటే కేసులు నమోదు చేయడంతో పాటు, పలుమార్లు ఇదే వ్యవహారంలో దొరికితే పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీ గణేష్, సీఐలు రమణబాబు, వెంకటేశ్వర్, వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం సీఐ బి.స్వామి, ఎస్బీ సీఐ టి.నారాయణ పాల్గొన్నారు. -
ప్రారంభమైన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు
సాక్షి, రాజన్నసిరిసిల్ల జిల్లా : వేములవాడలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అధికమాసం రావడంతో ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించి వచ్చే నెల 17 నుండి మళ్లీ యాథవిధిగా బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు. రాష్ట్రంలో జరిగే వేడుకలకు భిన్నంగా వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించనున్నారు. దీంతో స్థానిక మహిళలు అటు పుట్టినింట్లో ఇటు మెట్టినింట్లో రెండు చోట్ల వేడుకలు జరుపుకునే అవకాశం ఉంది. రాష్ట్రమంతా అక్టోబర్ 22 తేదిన సద్దుల బతుకమ్మ వేడుకలు జరపనున్నారు. (17న ఎంగిలిపూల బతుకమ్మ ) (‘తెలంగాణ నుంచి స్పందన లేదు..’) -
అగ్రహారం గుట్టల్లో భూతవైద్యుడి బాగోతం
సాక్షి, సిరిసిల్లా : మంచిర్యాల జిల్లాలో భూత వైద్యానికి బాలింత బలై మూడు రోజులు గడవక ముందే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో భూతవైద్యం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల సమీపంలోని పెద్దూరుకు చెందిన భూతవైద్యుడు వేములవాడ మండలం అగ్రహారం గుట్టల్లో భూతవైద్యం చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. వీడియో చిత్రీకరణ చేయడంతో భూతవైద్యుడితోపాటు దంపతులు పారిపోయారు. (భూతవైద్యం: ప్రాణాలు కోల్పోయిన రజిత) ఇంట్లో ఒంట్లో సమస్యలు ఉంటే నయం చేస్తామని నమ్మించి గుట్టలోకి తీసుకెళ్లి పూజలు మొదలుపెట్టగానే స్థానికులు అక్కడికి చేరుకుని నిలదీశారు. ఇక్కడ ఏం పూజలు చేస్తున్నారు, ఏం వైద్యం చేస్తున్నారంటూ నిలదీస్తూ వీడియో తీయడంతో ఆరోగ్యం బాగు లేకుంటే పూజలు చేస్తున్నామని దంపతులతో పాటు వారి వెంట వచ్చినవారు తెలిపారు. ఇంటి వద్దే వైద్యం చేయించుకోవచ్చు కదా అని సూచించడంతో కరోనా వల్ల ఇంటి వద్దకు కుదరక గుట్టల్లో పూజలు చేస్తున్నామని బ్రతిమాలుతూ భూతవైద్యుడితో పాటు దంపతులు పారిపోయారు. మంచిర్యాల జిల్లాలో భూత వైద్యానికి బాలింత ప్రాణాలు కోల్పోయిన నాలుగు రోజులు గడవక ముందే సిరిసిల్ల జిల్లాలో భూతవైద్యం వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే భూత వైద్యుల నకిలీబాబా ల పట్ల పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. -
కొత్త రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో ఉన్న వేములవాడ, వేములవాడ (రూరల్), చందుర్తి, బోయిన్పల్లి, కోనరావుపేట్, రుద్రంగి మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన వేములవాడ రెవెన్యూ డివిజన్లో విలీనం చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వేములవాడను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వినోద్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని వినోద్ సంతోషం వ్యక్తం చేశారు. -
వేములవాడలో గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన
రాజన్నసిరిసిల్ల: వేములవాడలో ఆదివారం సాయంత్రం గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన చోటుచేసుకుంది. రెండు వర్గాలవారు దాదాపు 20 నిముషాలపాటు రణరంగాన్ని సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వివరాలు.. రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ఓ యువకుడిని మరో యువకుడు ప్రశ్నించాడు. నెమ్మదిగా వెళ్లాలని మందలించాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు యువకుల స్నేహితులు సైతం రంగంలోకి దిగడంతో వివాదం మరింత ముదిరింది. రెండు గ్రూపుల యువకుల పరస్పర దాడులతో స్థానియకులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. పది మందిపై కేసు నమోదు చేశారు. గొడవకు సంబంధించిన వీడియో బయటికొచ్చింది. (చదవండి: వెళ్లనీయరు.. ఉండనీయరు..) -
కరోనా రెడ్ జోన్ ఏరియాలో కేటీఆర్ పర్యటన
-
కరోనా రెడ్ జోన్ ఏరియాలో కేటీఆర్ పర్యటన
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. వేములవాడలోని కోవిడ్ ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు. రెడ్ జోన్ ఏరియాలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందుతున్నాయా అని మంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సామాజిక దూరం పాటించి.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. మే 3 వరకు ఇళ్ళకే పరిమితం కావాలి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. (చదవండి: లాక్డౌన్ : నలుగురికి స్పూర్తిగా) అమెరికా ఏం చేయలేకపోయింది.. అగ్రరాజ్యమైన అమెరికా కరోనా వైరస్‌ను తట్టుకోలేకపోయిందని, అక్కడ శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని తెలిపారు. కరోనాకు నియంత్రణనే మందు అని గుర్తు చేశారు. కరోనా సోకకుండా జిల్లా యంత్రాంగం అప్రత్తమైందని.. జిల్లాలో ఒకే ఒక పాజిటివ్ కేసు నమోదైందని వెల్లడించారు. జిల్లాలో మళ్లీ కొత్త కేసులు నమోదు కావద్దని, అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: మళ్లీనా!) ‘దేశానికే తెలంగాణ అన్నపూర్ణ. ఎండాకాలంలో మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. పల్లెల్లో భౌతిక దూరం పాటిస్తున్నారు. కానీ, పట్టణాలలో యువత పాటించడం లేదు. ప్రజలు అధికారులకు సహకరించాలి. లేని యెడల చట్ట రీత్యా చర్యలు తప్పవు. రాబోయే మరో రెండు వారాలు ప్రజలు సహకరించాలి. త్వరలో కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకుందాం’అని మంత్రి అన్నారు. -
రాజన్న ఆలయం మూసివేత
సాక్షి, వేములవాడ: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా వేములవాడ రాజన్న గుడిని ఆలయ అధికారులు గురువారం రాత్రి నుంచి మూసివేశారు. ఈ నెల 31 వరకు భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండబోవని ఈవో కృష్ణవేణి ప్రకటించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు. ఆలయం తెరచిన తర్వాతనే దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఎప్పుడు తెరిచేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అప్పటి వరకు భక్తులు ఆలయానికి రావద్దని కోరారు. 1980లో కలరా వ్యాపించడంతో ఆ సమయంలో 40 రోజులపాటు రాజన్నగుడిని మూసివేశారని, మళ్లీ కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పుడు మూసివేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మూసివేయడంతో భక్తులు లేక వెలవెలబోతున్న కోనేరు -
మా భర్తలను అనుమతించండి
వేములవాడ: వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం పట్టణ ప్రగతిపై ఏర్పాటు చేసిన సమీక్షలో గందరగోళం నెలకొంది. సమావేశానికి తమ భర్తలను అనుమతించాలని మహిళా కౌన్సిలర్లు చేసిన డిమాండ్‌ను కమిషనర్ అంగీకరించలేదు. దీంతో కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. వేములవాడలో 5 రోజులుగా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతోంది. దీని సమీక్షలో మహిళా కౌన్సిలర్ల భర్తలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే.. ‘ఇది అధికారిక సమావేశం.. కౌన్సిలర్ల భర్తలు బయటికి వెళ్లిపోవాలి’అని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. దీనికి చైర్పర్సన్ సహా మిగిలిన కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ వాకౌట్ చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి.. అసంతృప్తితో ఉన్న చైర్పర్సన్ సహా కౌన్సిలర్లందరినీ ఆహ్వానించారు. అనంతరం సమావేశం కొనసాగింది. ఈ విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా, అధికారిక కార్యక్రమాల్లో కేవలం కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావాలి కదా అని బదులిచ్చారు. రెండోసారి కమిషనర్ కౌన్సిలర్లను ఆహ్వానించినప్పుడు మహిళా కౌన్సిలర్ల భర్తలు కూడా హాజరయ్యారు. అనంతరం సమావేశం సజావుగా సాగింది. -
ఓటు వేయలేదని.. కత్తి దించాడు!
-
వేములవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే కోపంతో ముద్రకోల వెంకటేశ్ అనే మాజీ కౌన్సిలర్ శివ అనే యువకుడిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు..వేములవాడ మున్సిపాలిటీలోని 3వ వార్డు నుంచి వెంకటేశ్ టీఆర్ఎస్ తరపున పోటీచేశాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి దివ్య చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే, తన ఓటమి కారణం శివే అని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తనకు కాకుండా దివ్యకు ఓటు వేసిన శివను చంపుతానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో అతనిపై కత్తితో దాడికి దిగాడు. నిందితుడు వెంకటేశ్, అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
పులకించిన శైవ క్షేత్రాలు
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. రాజన్న నామస్మరణంతో వేములవాడ క్షేత్రం పులకించిపోయింది. తొలుత స్వామికి మహాలింగార్చన నిర్వహిం చారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, గురవరాజులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ కృష్ణభాస్కర్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చారని ఆలయ అధికారులు అంచనా వేశారు. ప్రముఖుల దర్శనాలు, ప్రత్యేక పూజల సందర్భంగా ఐదుసార్లు భక్తుల దర్శనానికి బ్రేక్‌లు పడ్డాయి. మరోవైపు.. రాజన్న గుడిచెరువు ఖాళీ స్థలంలో భక్తులు జాగరణ ప్రారంభించారు. ఉపవాస దీక్షతో తెల్లవార్లూ జాగరణ చేశారు. భక్తులకు ఉత్సాహం ఇచ్చేలా భక్తితో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అలాగే, హన్మకొండలోని ప్రసిద్ధ వేయిస్తంభాల ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాశివుడిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి సైతం శుక్రవారం ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లా పాలంపేట రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయం శివ నామస్మరణతో మారుమోగింది. రామప్ప దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివపార్వతుల కల్యాణం కనుల పండువగా జరిగింది. అలాగే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరాలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. -
భక్తులతో కిటకిటలాడుతున్న వేములవాడ
-
దివ్య హత్య కేసు: వేరే వాళ్లకు దక్కకూడదనే..
-
దివ్య హత్య కేసు: వేరే వాళ్లకు దక్కకూడదనే..
సాక్షి, గజ్వేల్(సిద్ధిపేట): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగిని దివ్య(23)హత్య కేసులో నిందితుడైన వెంకటేశ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారం రోజుల్లో పెళ్లి అనగా.. దివ్యను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధిస్తున్న నిందితుడు వెంకటేష్ ఈ నెల 18న ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు. మొదట పోలీసులు వెంకటేష్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడంతో.. నిందితుడు తానే స్వయంగా వచ్చి నిన్న(బుధవారం) వేములవాడ పోలీసు స్టేషన్లో లొంగిపోయిన విషయం తెలిసిందే. విచారణలో నిందితుడు తానే దివ్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో వేములవాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక నిందితుడు దివ్యను హత్య చేసిన తీరును పోలీసులు వివరిస్తూ.. ఈ నెల 18 దివ్య తండ్రి లక్ష్మీరాజ్యం పోలీసు స్టేషన్‌కు వచ్చి.. తన కూతురుని వేధిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేశ్.. తనను హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత, ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో నిన్న(బుధవారం) రాత్రి వేములవాడ పట్టణంలో స్పెషల్ టీమ్స్ అధికారులు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే దివ్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దివ్య హత్య : పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు కాగా 5 నెలల క్రితం దివ్యకు గజ్వేల్ ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. గతంలో వెంకటేశ్‌తో సన్నిహితంగా మెలిగిన దివ్య.. ఉద్యోగం వచ్చిన నాటి నుంచి తనను దూరం పెడుతోందని భావించిన వెంకటేశ్.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో దివ్యకు వేరేవారితో పెళ్లి కుదరడంతో తనకు దక్కనిది, మరెవరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం దివ్య ఉద్యోగం చేస్తున్న గజ్వేల్ బ్యాంకు వద్దకు, ఆమె ఇంటికి పలుమార్లు వచ్చి వెళ్ళాడు. ఈ క్రమంలో ఈనెల 18న రాత్రి సుమారు 7:45 గంటల సమయంలో బ్యాంకు నుండి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న దివ్యను గమనించి వెంబడించాడు. ఇక ఆ సమయంలో ఇంటిలో దివ్య తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో నిందితుడు తన వెంట తెచ్చుకుని కత్తి తీసి దివ్య గొంతు, ఇతర శరీర భాగాలపై పొడిచి హత్య చేశాడు. (వారం రోజుల్లో ఆమెకు పెళ్లి, ఈలోగా ఘోరం..) ఈ నేపథ్యంలో పోలీసు స్టేషనులో లొంగిపోయిన వెంకటేశ్‌ను.. పోలీసులు విచారించగా తానే దివ్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు అంగీకరించాడు. తొలుత ఘటనాస్థలం నుంచి నేరుగా సికింద్రాబాద్ నుంచి రైలులో విజయవాడకు, అక్కడి నుంచి వరంగల్ మీదుగా వేములవాడకు వచ్చినట్లు వెల్లడించాడు. కాగా నిందితుడికి కఠిన శిక్ష పడి దివ్యకు న్యాయం జరిగేలా కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు. ఇక కేసు 24 గంటల్లో చేధించిన గజ్వేల్ ఏసీపీ నారాయణ, గజ్వేల్ సీఐ ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. -
మహాశివరాత్రికి ముస్తాబైన వేములవాడ
-
ప్రముఖులకు షాకిచ్చిన మున్సిపల్ ఎన్నికలు..
సాక్షి, వేములవాడ: వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రముఖులు ఓటవి చవిచూశారు. 2014 మొట్టమొదటి మున్సిపల్‌పై బీజేపీ జెండా ఎగురవేసిన సందర్భంగా అప్పుడు చైర్‌పర్సన్‌గా నామాల ఉమ, వైస్ చైర్మన్‌గా ప్రతాప రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. అనంతరం బీజేపీ నుంచి నామాల ఉమ టీఆర్ఎస్లో చేరిపోయారు. అప్పటి నుంచి టీఆర్ఎస్లోనే కొనసాగారు. అసమ్మతి రాగంలోనూ తన పట్టు నిరూపించుకుని పూర్తిస్థాయి బాధ్యతలు పూర్తిచేశారు. 2019 ఎన్నికల్లో 26వ వార్డు నుంచి పోటీ చేసిన నామాల ఉమ బీజేపీ అభ్యర్థి ముప్పిడి సునంద చేతిలో పరాభవం చవిచూశారు. 2014లో వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రతాప రామకృష్ణ (బీజేపీ జిల్లా అధ్యక్షుడు) 2019లో 23వ వార్డు నుంచి పోటీ చేసి మధు రాజేందర్ చేతిలో ఓటమిపొందారు. బీజేపీ దళితమోర్చ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శంకర్, ఆయన సతీమణి కుమ్మరి జ్యోతి ఓటమి చెందారు. మున్సిపల్ చైర్మన్ సీటు జనరల్ మహిళకు రిజర్వు కావడంతో 24వ వార్డు నుంచి ప్రముఖ వ్యాపారవేత్త చీకోటి శ్రీనివాస్ ఆయన సతీమణి అనురాధను పోటీలో దింపారు. స్వతంత్ర అభ్యర్థి అన్నారం ఉమారాణి చేతిలో పరాభవం పొందారు. 12వ వార్డులో ప్రముఖ వ్యాపారి తీగల వెంకటేశ్వర్రావు ఆయన సతీమణి శైలజను పోటీలో నిలిపారు. బీజేపీ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి చేతిలో ఓడారు. గత పాలకవర్గంలో పని చేసిన పుల్కం శ్రీలక్ష్మి, ముద్రకోల వెంకటేశ్, సూగూరి లక్ష్మి, జంగం రాజేందర్ సతీమణి మఠం సంధ్యారాణి, నామాల వరలక్ష్మి, నూకలమర్రి వసంత ఓటమిపాలయ్యారు. పారిశుధ్య కార్మికురాలి నుంచి ప్రజాప్రతినిధిగా.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న బెక్కం అంజమ్మ అదే మున్సిపాలిటీ పాలకమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ 19వ వార్డు ఎస్సీ రిజర్వు కాగా ఈస్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్ అనూహ్యంగా కేటాయించడంతో ఎన్నికయ్యారు. 322 ఓట్లు సాధించిన అంజమ్మ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నల్లాల అన్నమ్మపై 111 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 23 ఏళ్లకే కౌన్సిలర్ రాయికల్(జగిత్యాల): పట్టణంలోని 7వ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనుమల్ల దివ్య 23 ఏళ్లకే కౌన్సిలర్‌గా గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రాజుబాయిపై 183 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయమే.. 48వ వార్డు అభ్యర్థి దేవేందర్‌నాయక్ హ్యాట్రిక్ జగిత్యాల: ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం ఆయన సొంతం. హ్యాట్రిక్ సాధించారు. జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన దేవేందర్‌నాయక్ షెడ్యూల్ కులాలకు చెందిన దేవేందర్‌నాయక్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నాడు. అప్పటినుంచి టీఆర్ఎస్ నుంచే గెలుస్తున్నారు. 2005లో 2వ వార్డు ఎస్టీకి రిజర్వుడుకాగా పోటీ చేసి విజయం సాధించాడు. 2014లోనూ 9వ వార్డు ఎస్టీకి రిజర్వుగా పోటీ చేసి గెలిచారు. పునర్విభజన అనంతరం పలు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనంకావడంతో ప్రస్తుతం టీఆర్‌నగర్ 48వ వార్డుకు కేటాయించారు. ఎస్టీకి రిజర్వుకాగా టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిపై 393 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భార్యాభర్తల ఓటమి జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని 17, 18 వార్డుల నుంచి బీజేపీ నుంచి పోటీ చేసిన భార్యాభర్తలు ఓటమిచెందారు. గతంలో బీజేపీ నుంచి వీరు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ప్రస్తుతం 17వ వార్డు నుంచి భార్య అర్వ లక్ష్మీ పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి సిరికొండ పద్మపై ఓటమిపాలయ్యారు. భర్త అర్వ చంద్రశేఖర్‌రాజు 18వ వార్డునుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చుక్క నవీన్‌కుమార్‌పై ఓటమిచెందారు ఇద్దరికి సున్నా..ముగ్గురికి ఒక్కొక్క ఓటు మంథని: మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఒక్కఓటు కూడా పడని అభ్యర్థులు ఇద్దరు ఉండగా కేవలం ఒకేఓటు సాధించిన అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. నాలుగోవార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి కేతిరి రాజయ్య, 8వ వార్డు అభ్యర్థి కొత్త పద్మకు ఓట్లు రాలేదు. అదేవిధంగా 2 వార్డు స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ అయోషా, నాలుగోవార్డులో ఆంగోతు రాజునాయక్, 11 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మంథని రాహుల్‌కు ఒకేఓటు వచ్చింది. కేంద్రంలో అధికారంలోని బీజేపీ తరఫున పోటీ చేసిన 8 మంది అభ్యర్థులకు 163 ఓట్లు రాగా పార్వర్డ్ బ్లాక్ పార్టీ మూడుస్థానాల్లో పోటీచేయగా మూడోవార్డులో బొడ్డెల తిరుమల 184 ఓట్లు సాధించింది. నాడు సర్పంచులు.. నేడు కౌన్సిలర్లు జమ్మికుంటటౌన్(హుజూరాబాద్): జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇద్దరు మాజీ సర్పంచులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. పురపాలక సంఘం పరిధిలోని మోత్కులగూడెంకు చెందిన పొనగంటి మల్లయ్య 1995 నుంచి 2001 వరకు జమ్మికుంట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పని చేశారు. ప్రస్తుతం బల్దియా పరిధిలోని 23వ వార్డు (జనరల్) నుంచి పోటీ చేసిన మల్లయ్య 177 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి వాసిఅయిన బొద్దుల అరుణ 2006 నుంచి 2011 వరకు కొత్తపల్లి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు బల్దియా పోరులో 18వవార్డు (బీసీ మహిళ) నుంచి తలపడిన అరుణ 94 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నాడు తొలి ఎంపీపీగా..నేడు కౌన్సిలర్‌గా మెట్పల్లి(కోరుట్ల): మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 10వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన బోయినపల్లి చంద్రశేఖర్‌రావు గతంలో ఎంపీపీగా పనిచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలాల వ్యవస్థను ఏర్పాటు చేసి 1987లో మండల పరిషత్ అధ్యక్ష పదవీకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరిపారు. ఆ ఎన్నికల్లో మెట్పల్లి నుంచి టీడీపీ తరఫున చంద్రశేఖర్‌రావు పోటీచేసి విజయం సాధించారు. మండల తొలి ఎంపీపీగా ఐదేళ్లు పని చేసిన ఆయన ఆ తర్వాత చాలాకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టీఆర్ఎస్ వైస్‌చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. చాలాకాలం తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వచ్చిన తనను ఎమ్మెల్యే కీలక పదవీకి ఎంపిక చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ వి‘జయ’శ్రీ జగిత్యాలలోని 35వ వార్డు నుంచి అనుమండ్ల జయశ్రీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 82 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఫ్లోర్‌లీడర్‌గా కొనసాగారు. ఇటీవల రాజకీయ పరిణామాల్లో భాగంగా టీఆర్ఎస్లో చేరారు. అనూహ్యంగా ఆమెకు టికెట్ దక్కకపోవడంతో రెబల్‌గా పోటీకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థిపై 82 ఓట్లతో విజయం సాధించారు. ఇది ప్రజా విజయమని ఆమె పేర్కొన్నారు. జయశ్రీ భర్త రఘు ఆమెను ఎత్తుకొని అభినందించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, జగిత్యాల భార్య గెలుపు..భర్త ఓటమి కోరుట్ల: కోరుట్ల మున్సిపాల్టీలోని 10,11వ వార్డుల్లో బీజేపీ తరఫున బరిలో దిగిన భార్యాభర్తలు దాసరి రాజశేఖర్–దాసరి సునీతల్లో ఒకరు గెలిచి మరొకరు ఓటమి పాలుకావడం చిత్రమైన సన్నివేశానికి తెరతీసింది. రెండు వార్డులకు సంబంధించిన కౌంటింగ్ పక్కపక్కనే ఉండడంతో ఇద్దరు ఒకేచోట ఉండి కౌంటింగ్‌ను పరిశీలించారు. 11వ వార్డులో బీజేపీ తరఫున బరిలో నిలిచిన దాసరి సునీత టీఆర్ఎస్ అభ్యర్థి కస్తూరి వాణిపై 470 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. పదో వార్డులో బీజేపీ అభ్యర్థి దాసరి రాజశేఖర్ టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డమీద పవన్‌పై 37 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. భార్య దాసరి సునీత గెలుపొందడం..భర్త రాజశేఖర్ ఓటమి పాలుకావడం విశేషం. -
రాజన్నకు కేసీఆర్ కుటుంబం ప్రత్యేక పూజలు
-
రాజన్నను దర్శించుకున్న కేసీఆర్ కుటుంబం
సాక్షి, వేములవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం కేసీఆర్‌కు తీర్థ ప్రసాదాలు అందచేశారు. మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి మూడు గంటలకు హైదరాబాద్ బయల్దేరతారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్ ఉన్నారు. గోదావరికి జల హారతి అంతకు ముందు ఆయన సిరిసిల్ల బ్రిడ్జ్ దగ్గర కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదికి కేసీఆర్ జలహారతి ఇచ్చారు. అలాగే మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌ను ఆయన పరిశీలించారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి అధికారికంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే పార్టీ నాయకులు మాత్రం సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. -
వేయులవాడ బయల్డేరిన కేసీఆర్
-
రాజన్న ఆలయంలో చోరీ!
వేములవాడ: వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించే కానుకల చోరీ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత నెల 23, ఈ నెల 6న హుండీ లెక్కించారు. కానుకలను లెక్కిస్తున్న క్రమంలో హుండీలోని వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఎంత మొత్తంలో ఆభరణాలు చోరీకి గురయ్యాయో తెలియరాలేదు. కాగా, వేములవాడలోని శాస్త్రీనగర్‌కి చెందిన ఫిరోజ్ నిత్యం రాజన్న గుడిలో భక్తులు ఆలయంలోని విగ్రహాలపై చల్లిన బియ్యం సేకరించి అమ్ముకుంటుంటాడు. కొద్ది రోజుల క్రితం క్యూలైన్ల వద్ద బియ్యం సేకరిస్తున్న క్రమంలో కార్పెట్ల కింద ఓ సంచిని చూశాడు. అందులో అభరణాలు ఉండటంతో వీటిని అమ్మేందుకు కరీంనగర్ వెళ్లాడు. అనుమానం వచ్చిన వ్యాపారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం సీసీఎస్ పోలీసులు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు గురువారం అప్పగించారు. ఆభరణాలు ఎలా బయటకు వచ్చాయి? అనే కోణంలో టౌన్ సీఐ వెంకటస్వామి దర్యాప్తు చేస్తున్నారు. -
చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ/ కరీంనగర్:పౌరసత్వం వివాదంలో వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత పౌరసత్వానికి ఆయన అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని పొందేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో మన దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆది వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపి, తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించింది. తప్పుడు సమాచారం ఇచ్చారు.. ‘‘భారత పౌరసత్వం కోసం చెన్నమనేని రమేశ్ 31.03.2008న దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్ 5 (1) (ఎఫ్) ప్రకారం దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఏడాది పాటు భారతదేశంలో నివసించి ఉండాలి. ఈ విషయంలో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారు. 21.11.2008న గత 12 నెలల్లో విదేశాలకు వెళ్లిన వివరాలను సమర్పించాలని హోంశాఖ ఆయన్ను కోరగా.. తాను విదేశాలకు వెళ్లలేదని 27.11.2008న రమేశ్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో 04.02.2009న ఆయనకు కేంద్ర హోంశాఖ భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. దీనిపై ఆది శ్రీనివాస్ 15.06.2009న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా సంస్థల నివేదిక ప్రకారం రమేశ్ 01.03.2007 నుంచి 26.11.2007 వరకు, 20.12.2007 నుంచి 28.02.2008 వరకు విదేశాల్లో ఉన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లేఖ ద్వారా 01.09.2009న ధ్రువీకరించింది. పౌరసత్వ చట్టం సెక్షన్ 10(5) పరిధిలో ఒక విచారణ కమిటీని నియమించగా.. ఆ కమిటీ 10.03.2017న తన నివేదిక సమర్పించింది. జర్మనీకి వెళ్లిన విషయాన్ని రమేశ్ నిజాయతీగా వెల్లడించలేదని, 27.11.2008న తప్పుడు సమాచారం ఇచ్చారని కమిటీ నిర్ణయానికి వచ్చింది. రమేశ్ భారత ప్రభుత్వాన్ని మోసగించడం ద్వారా పౌరసత్వాన్ని పొందారని తేలింది’’అని హోంశాఖ పేర్కొంది. రమేశ్ తప్పుడు అభ్యర్థన చేశారని, వాస్తవాలను మరుగున పెట్టారని, పౌరసత్వ దరఖాస్తుకు ముందు చేసిన విదేశీ పర్యటనలను దాచి ఉంచినట్టు వెల్లడైందని వివరించింది. వాస్తవాలను మరుగుపరచడం, తప్పుడు సమాచారం ద్వారా పౌరసత్వం పొందితే సెక్షన్ 10(2) వర్తిస్తుందని, అంటే ఆయన పౌరసత్వం తొలగించాల్సి వస్తుందని తెలిపింది. ఉదాహరణగా ఉండాల్సిన వారు ఇలా చేస్తే? ‘‘తాను ప్రజాసేవలో ఉన్నందున సెక్షన్ 10(3)ను పరిగణనలోకి తీసుకోవాలని చెన్నమనేని అభ్యర్థించారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేనని, ఎలాంటి నేరచరిత్ర లేదని, క్రిమినల్ కేసు లేదని, తీవ్రవాదం వంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇవ్వడం, వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. దరఖాస్తు నాటికి ఏడాది ముందు కాలం పాటు పూర్తిగా భారతదేశంలో నివసించలేదని సమాచారం ఇచ్చి ఉంటే అధీకృత యంత్రాంగం ఆయనకు పౌరసత్వం ఇచ్చి ఉండేది కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఇచ్చే సమాచారం సరైనదిగా ఉండాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు ఆయన ప్రవర్తన ఉదాహరణగా ఉండాలి. ఒక వ్యక్తి దేశ పౌరసత్వం పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటే, సమాజానికి సదరు వ్యక్తి చేసే మంచిని ఊహించగలం. నేరారోపణలు లేనంత మాత్రాన తప్పుడు సమాచారం ఇవ్వడం మంచి చేయడానికే అని అర్థం కాదు. ప్రజాప్రతినిధిగా ఉండి అసత్య సమాచారం ఇవ్వడం ప్రజాశ్రేయస్సుకు మంచిది కాదు. ఆయన ఎలాంటి నేరాలకు పాల్పడలేదని భావించి పౌరసత్వాన్ని కొనసాగిస్తే ఇదొక ఉదాహరణగా మారి మరికొందరు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పౌరసత్వాన్ని పొందుతారు. వీటన్నింటి దృష్ట్యా ఆయన భారత దేశపౌరుడిగా కొనసాగడం ప్రజాశ్రేయస్సుకు దోహదం చేయదని నిర్ణయించి, రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’’అని హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పదేళ్ల న్యాయ పోరాటం చివరికి ఇలా... రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 జూన్‌లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ విచారణ జరిపి, రమేశ్ కేవలం 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నారని నివేదిక సమర్పించారు. 2010 ఉప ఎన్నికల అనంతరం రమేశ్‌బాబు ఎన్నికను సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఆగస్టు 14న రమేశ్‌బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటరు జాబితాలో పేరు తొలగించాలని తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రమేశ్‌బాబు 2013లో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ ఈ వ్యవహారం కేంద్ర హోంశాఖకు మారింది. రమేశ్‌బాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా ఆయన మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని తేల్చి చెప్పింది. దీంతో 2017 ఆగస్టు 31న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది. అయితే, తాను ప్రజలకు సేవలు అందిస్తున్నానని, తన పౌరసత్వం కొనసాగించాలని మరోసారి ఆయన హోంశాఖను కోరారు. అనంతరం 2018 జనవరి 5న మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వగా.. దానిని ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 2019 జూలై 10న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ మూడు మాసాల్లో తేల్చాలని ఆదేశించింది. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: చెన్నమనేని తన పౌరసత్వ పరిరక్షణకు మరోమారు హైకోర్టును ఆశ్రయిస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తెలిపారు. ఈ ఏడాది జూలై 15న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ‘నా పౌరసత్వాన్ని 2017లో హోంశాఖ రద్దు చేసిన తరువాత హైకోర్టు వెంటనే స్టే మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ ఏడాది జూలై 15న నా పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని కొట్టివేసింది. పౌరసత్వ చట్టం, వాటి నియమ నిబంధనలు, దరఖాస్తులను సమగ్రంగా హేతుబద్దంగా, నైతిక విలువలు, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్ 10.3) చూడాలి తప్ప, సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని తన 25 పేజీల తీర్పులో హైకోర్టు స్పష్టంచేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది. ఒకవేళ సెక్షన్ 10.3ని పరిగణించకుండా.. ఏ నిర్ణయం వచ్చినా న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 31న మరోమారు ఢిల్లీలో హోంమంత్రిత్వ శాఖ వద్ద వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు తీర్పులో పేర్కొన్న ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’అని చెన్నమనేని పేర్కొన్నారు. న్యాయం గెలిచింది: ఆది శ్రీనివాస్ రమేశ్‌బాబు భారతదేశ పౌరుడు కాదని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని, ఇన్నాళ్లకు న్యాయం గెలిచిందని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మచ్చలేని నాయకుడనని చెప్పుకుంటున్న రమేశ్‌బాబు ఈ దేశ పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ ప్రకటించిందని, ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ‘ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని నేను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ న్యాయస్థానంలో ఉంది. గతంలో వచ్చిన తీర్పుల ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి ఆ పదవిలోకి వస్తే సమీప ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందని భావిస్తున్నా’అని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వేటా.. చెల్లుబాటా? రమేశ్ భారత పౌరసత్వం రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేప థ్యంలో, ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై ఉత్కంఠ నెలకొంది. హోం శాఖ నిర్ణ యం నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారా, సమీప ప్రత్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే హోంశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మరోమారు హైకో ర్టును ఆశ్రయిస్తానని రమేశ్ ప్రకటించిన నేపథ్యంలో, ఎమ్మెల్యేగా ఆయన భవితవ్యంపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2010 ఉప ఎన్నికతో పాటు 2014, 2018 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. భారతీయుడైన రమేశ్ 1993లో జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించగా, 2008 మార్చి 31న తిరిగి భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ ఎదురుదెబ్బ!
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వం విషయంలో టీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దయింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తమ అభ్యంతరాలను కేంద్ర హోంశాఖకు మూడు వారాల్లోగా చెప్పాలని చెన్నమనేనికి, పిటిషనర్‌కు సూచనలు చేసింది. దీనిపై పునఃసమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ చెన్నమనేని మోసపూరితంగా భారత పౌరసత్వాన్ని పొందారని తేల్చింది. అనేక వాస్తవాలు దాచి తప్పుడు మార్గాలలో పౌరసత్వం కలిగి ఉన్నారని నిర్థారించింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయన జర్మనీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో ద్వంద్వ పౌరసత్వం అంశం తెరపైకి వచ్చింది. నేను చెప్పిందే నిజమైంది! చెన్నమనేని రమేష్ బాబు భారతీయుడు కాదని తాను చెప్పింది నిజమైందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తప్పుడు పత్రాలతో భారతదేశ పౌరసత్వం పొంది, మరో భారత పౌరుడికి చెన్నమనేని అన్యాయం చేశారని, కాలయాపన కోసమే రమేష్ బాబు తిరిగారే తప్ప ఆయన వాదనలో నిజం లేదని తేలిందని అన్నారు. -
మరణంతో ఏకం.. ఒకే గోతిలో ప్రేమజంట ఖననం
సాక్షి, కథలాపూర్(కరీంనగర్) : బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట మరణంలో ఏకమయ్యారు. ప్రేమ పెళ్లికి అంగీకరించని పెద్దలు ఇద్దరినీ ఒకే గోతిలో పూడ్చిపెట్టి వారికి కన్నీటీ వీడ్కోలు పలికిన హృదయ విదారకర సంఘటన ఆదివారం కథలాపూర్ మండలంలోని రాజారాం తండాలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రాజారాం తండాకు చెందిన భూక్య శిరీష, లకావత్ మహిపాల్ పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. శిరీష తల్లిదండ్రులు ఇటీవలే వేరే యువకుడితో పెళ్లి చేయడానికి నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ప్రేమికులు ఇద్దరు తీవ్రమనస్తాపానికి గురయ్యారు. పెద్దలను ఎదురించలేక, ప్రేమ పెళ్లి చేసుకోలేక చావే శరణ్యమని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో కరీంనగర్లో చదువుతున్న మహిపాల్ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన శిరీష, మహిపాల్‌లు శనివారం సిరికొండ శివారులోని అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరికి ఆదివారం బంధువులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపారు. ఇద్దరిని ఒకే గోతిలో ఖననం చేశారు. బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట చివరికి మరణంలో ఏకం కావడం, వారిద్దరిని కూడా ఒకే గోతిలో ఖననం చేసిన హృదయ విదారకర సంఘటన ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. -
జీవితాంతం కలిసుందామనుకున్నారు కానీ..
సాక్షి, కథలాపూర్(వేములవాడ): జీవితాంతం కలిసి ఉండలేక ఒక్కటిగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం కథలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. యువతికి ఇటీవల మరో యువకుడితో నిశ్చితార్థం కావడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పూనుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు. కథలాపూర్ మండలం రాజారాం తండాలో భూక్యా బుల్లి–తిరుపతి దంపతుల కూతురు భూక్యా శిరీష(18), అదే గ్రామానికి చెందిన లకావత్ సూర్యనాయక్– ప్రమీల దంపతుల కుమారుడు లకావత్ మహిపాల్(18) పాఠశాల స్థాయి నుంచే ఒకరిపై మరొకరికి ప్రేమ ఏర్పడింది. శిరీష ప్రస్తుతం కోరుట్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా.. మహిపాల్ కరీంనగర్‌లోని ఎస్సాఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చుదువుతున్నాడు. వీరి ప్రేమవ్యవహారం పెద్దలకు తెలియడంతో నాలుగునెలలక్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలకు చెందిన యువకుడితో శిరీషకు నిశ్చితార్థం చేశారు. మరో రెండునెలల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే మహిపాల్ కరీంనగర్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం వీరిద్దరు గ్రామం నుంచి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రం సిరికొండ శివారులోని అటవీప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. సంఘటన స్థలం పక్కనే ఇద్దరి బ్యాగులు, పుస్తకాలు, నోటుబుక్కులు పడేసి ఉన్నాయి. విషయం తెలుసుకున్న మెట్పల్లి సీఐ రవికుమార్, కథలాపూర్ ఎస్సై రాజప్రమీల సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
వేములవాడలో కుప్పకూలిన బ్రిడ్జి
సాక్షి, సిరిసిల్ల : వేములవాడలో కురుస్తున్న వర్షాలకు మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో శుక్రవారం నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. మూలవాగుపై 2 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేందుకు సాయి కన్ర్స్టక్షన్స్ 28 కోట్లకు టెండర్లు దక్కిందచుకుంది. ఒక బ్రిడ్జి నిర్మాణం పూర్తై వినియోగంలోకి రాకముందే మరో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాగా, ముడు నెలల క్రితం ప్రభుత్వం నుంచి రావావల్సిన బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసి వెళ్లిపోయారు. 190 మీటర్ల పొడవు గల బ్రిడ్జిలో ఇప్పటికి 150 మీటర్ల వరకు సెంట్రింగ్ పనిపూర్తయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో ఒక్క పిల్లర్ ఒరిగిపోగా, బ్రిడ్జిలోని 16 భీములకు పగుళ్లు ఏర్పాడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నాణ్యత లోపంతో పని చేయడంవల్లే బ్రిడ్జి కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ప్రేమపాశానికి యువకుడు బలి..!
సాక్షి, వేములవాడ: ప్రేమపాశానికి ఓ నిండు ప్రాణం బలైంది. యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన యువకుడు ఆ ఇంటి పరిసరాల్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన దారుణ ఘటన రుద్రంగి మండలం మానాల శివారులోని హన్మాన్తండాలో జరిగింది. యువతి కుటుంబ సభ్యులే యువకుడిని చంపారని ఆరోపిస్తూ.. అమ్మాయి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. గ్రామస్థుల క థనం ప్రకారం.. దెగావత్తండాకు చెందిన కున్సోత్ సురేందర్(19) హన్మాన్ తండాకు చెందిన యువతి(17)ని ప్రేమిస్తున్నాడు. ఆమె ఇంటికి శనివారం రాత్రి స్నేహితుడు పవన్‌తో కలిసి వెళ్లాడు. అప్పటి నుంచి సురేందర్ అదృశ్యమయ్యాడు. యువకుడి కోసం తల్లి బుజ్జి, సోదరులు, తండావాసులు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో సదరు యువతి కుటుంబసభ్యులపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పొలంలో మృతదేహం.. హన్మాన్ తండా శివారులోని పొలంలో సోమవారం సురేందర్ మృతదేహం లభించింది. పొలానికి అమర్చిన కరెంటు తీగ తాకి మరణించినట్లుగా ఉంది. సురేందర్ ఒంటిపై గాయాలున్నాయి. సదరు యువతి ఇంటి సమీపంలో శవం లభించడంతో యువతి కుటుంబసభ్యులే సురేందర్‌ను చంపారని ఆరోపిస్తూ దెగావత్ తండా వాసులు ఆందోళనకు దిగారు. సురేందర్ తండ్రి గంగాధర్ గల్ఫ్‌లో ఉండగా సురేందర్ అదృశ్యమై తెలిసి సోమవారం గల్ఫ్ నుంచి వచ్చాడు. ఆ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉండగా సురేందర్ చిన్నోడు. కరీంనగర్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమ పాశానికి యువకుడు బలి కావడం గిరిజన తండాల్లో విషాదం నింపింది. అట్టుడికిన తండా.. సురేందర్ శవం లభించడంతో మానాల తండాలు అట్టుడికాయి. యువకుడి చావుకు అమ్మాయి కుటుంబసభ్యులే కారణమని వారి ఇంటిపై దాడికి యత్నించారు. వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, సీఐలు విజయ్‌కుమార్, శ్రీనివాస్‌చౌదరి, ఐదుగురు ఎస్సైలు పోలీసు బలగాలతో చేరుకొని గిరిజనులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఒక దశలో పోలీసు బలగాలను తోసుకొని వెళ్లి యువతి ఇంటిపై దాడి చేసి సామగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని «ధ్వంసం చేస్తున్న వారిని కట్టడి చేశారు. యువతి ఇంటిపై దాడి చేస్తున్న మహిళలు అనుమానాస్పద కేసు నమోదు.. సురేందర్ మృతిపై పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటరమణ హామీ ఇచ్చారు. సురేందర్‌ను ఎవరైనా హత్య చేశారా..? విద్యుత్ షాక్‌తో మరణించాడా విచారణలో తేలుతుందని పోలీసులు పేర్కొన్నారు. యువతి కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు సోమవారం రాత్రి వరకు ఆందోళన కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించకుండా అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న గిరిజనులతో పోలీసుల సంప్రదింపులు కొనసాగుతున్నాయి. -
చేతులు కాలాకా..
సాక్షి, వేములవాడ : నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు నడుపుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరించిన విద్యాశాఖ, ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా పట్టించుకోని రవాణా శాఖ అధికారులకు ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయిన తర్వాత కనువిప్పు కలిగింది. ‘చేతుల కాలాకా.. ఆకులు పట్టుకున్నారన్న చందంగా’ విద్యాశాఖ, రవాణాశాఖ తేరుకుని చర్యలకు పూనుకుంది. ఈనెల 28న వేములవాడ బస్‌డిపో ప్రాంతంలో డివైడర్‌ను ఢీకొని వ్యాన్ బోల్తా పడటంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కంటి తుడుపు చర్యల్లో భాగంగా విద్యాశాఖ అధికారులు గురువారం వేములవాడ పట్టణంలోని వాగేశ్వరీ స్కూల్‌ను సీజ్ చేశారు. ఇక రవాణాశాఖ అధికారులు హడావిడిగా వేములవాడ ప్రాంతానికి చేరుకుని వాహనాల తనిఖీలు ప్రారంభించారు. వేములవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబకడంతో రాబోయే ప్రమాదాలనను ముందే పసిగట్టిన ప్రయివేటు విద్యా సంస్థలు ఐదు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారుల బలికావడంపై యావత్ సమాజం అధికార యంత్రాంగంపై దుమ్మెత్తి పోస్తోంది. తేరుకున్న విద్యాశాఖ.. వాగేశ్వరి స్కూల్ సీజ్ వేములవాడలో అనుమతులు లేకుండా నడుస్తున్న వాగేశ్వరి పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడటంతో విద్యాశాఖ తేరుకుంది. గురువారం స్థానిక పోలీసులకు సమాచారం అందించి పట్టణంలోని వాసుదేవా టవర్స్‌లో నిర్వహిస్తున్న వాగేశ్వరీ స్కూల్‌ను ఎంఈవో కే.సురేశ్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు అనుమతులు లేవని, హాస్టల్ నడిపించడం రూల్స్‌లో లేవన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న వాగేశ్వరి స్కూల్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కూల్‌ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చిన్నారుల మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై, వ్యాన్ డ్రైవర్ రఫీక్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎన్. వెంకటస్వామి తెలిపారు. అయోమయంలో పేరెంట్స్ వేములవాడ పట్టణంలోని వాగేశ్వరి స్కూల్ అనుమతులు లేకుండా నడుస్తుండటంతో గురువారం ఎంఈవో సురేశ్ సీజ్ చేశారు. దీంతో ఈ పాఠశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో గురువారం పలువురు పేరెంట్స్ పాఠశాల వద్దకు చేరుకుని విషయం తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. నాలుగు వేలిచ్చుకో.. ఫిట్నెస్ సర్టిఫికెట్ పుచ్చుకో.. ప్రతీ ఏడాది వాహనాలకు తప్పకుండా ఫిట్నెస్ చేయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు గత జూన్ మాసంలోనే విద్యా సంస్థలకు చెందిన వ్యాన్లు, బస్సులు, మినీ బస్సులకు ఫిట్నెస్ చేయించడంలో రవాణా శాఖ బిజీ అయ్యింది. ఈక్రమంలో ఒక్కో వాహనానికి రూ.4 వేల చొప్పున పైకం పుచ్చుకుని సర్టిఫికేట్లు ఇచ్చేసినట్లు పలువురు పాఠశాల యజమానులే పేర్కొంటున్నారు. ఫిట్నెస్ సమయంలో సరైన నిబంధనలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖ అధికారులు కేవలం జూన్ మాసంలోనే హడావిడి సృష్టించి ఆ తర్వాత స్కూల్ వ్యాన్ల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న ఆరోపణలు గుప్పు మంటున్నాయి. వేములవాడ ప్రాంతంలో ఎన్ని స్కూళ్లు ఉన్నాయి..? వాటికి ఎన్ని బస్సులు ఉన్నాయన్న అంశం ఆ శాఖ అధికారులకు తెలిసినప్పుడు మిగతా వాహనాలపై ఎందుకు దృష్టి సారించలేకపోయారంటూ జనం ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు మూలనపడిన కాలం చెల్లిన బస్సులను సైతం రోడ్లపై తిప్పుతుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరగడం, అమాయక విద్యార్థులు బలవుతున్నారు. బస్‌డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం సైతం బస్ ఫిట్నెస్ లేకపోవడమే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. అనుమతిలేని హాస్టల్ రద్దు రెండు నెలల క్రితం చింతాలఠాణ ఆర్అండ్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన రేకుల షెడ్డులో వాగేశ్వరి పాఠశాల హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. దానికి అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదని డీఈవో రాధాకిషన్ బుధవారం వెల్లడించారు. ఆ హస్టల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు సుమారుగా 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఉదయం ఇక్కడి నుంచి విద్యార్థులు స్కూల్‌కు వ్యాన్‌లో వెళ్లి మధ్యాహ్నం భోజనానికి వ్యాన్‌లో వచ్చి వెళ్తారు. మళ్లీ సాయంత్రం హాస్టల్‌కు వస్తారు. వరుసగా ఐదు రోజులు సెలవులు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పట్టణంలోని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు గురు, శుక్ర, శనివారాలు సెలవులు ప్రకటించారు. మరో రెండు రోజులు ఒకరోజు అదివారం, సోమవారం వినాయక చవితి కావడంతో విద్యార్థులకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. -
చిన్నారులను చిదిమేశారు !
సాక్షి, వేములవాడ : తమలాగే తమ పిల్లల బతుకులు మారొద్దనుకున్నారు. ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే అయినా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కలగన్నారు. కానీ విధి వారి జీవితాలతో ఆటాడుకుంది. పిల్లల గురించి ఎన్నోకలలుగన్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిల్చింది. ప్రైవేటు పాఠశాల యజమాన్య నిర్లక్ష్య వైఖరి.. ఫిట్‌నెస్‌లేని స్కూలు వ్యాన్.. డ్రైవర్ ఉన్మాదంతో అతివేగంగా వాహనం నడపడం వెరసి.. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముగ్గురు చిన్నారులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్ శివారులో బుధవారం స్కూల్‌వ్యాన్ బోల్తాపడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ పట్టణంలోని వాగేశ్వరి (శ్రీచైతన్య) హైస్కూల్‌కు పాఠశాల, హాస్టల్ వేర్వేరు చోట్ల ఉన్నాయి. విద్యార్థులు పట్టణ పరిధిలోని తిప్పాపూర్ శివారులో ఉన్న స్కూల్ హాస్టల్లో ఉంటారు. రోజూ పాఠశాల నుంచి స్కూల్ వ్యానులో హాస్టల్‌కు వచ్చి మధ్యాహ్న భోజనం తర్వాత మళ్లీ స్కూల్‌కు వెళ్తుంటారు. ఎప్పటిలాగే.. బుధవారం కూడా మధ్యాహ్నం భోజనం కోసం 27 మంది విద్యార్థులు వ్యాన్ (ఏపీ 15 టీబీ 7800)లో హాస్టల్‌కు బయల్దేరారు. వేములవాడ ఆర్టీసీ డిపో ప్రాంతానికి రాగానే.. ఈ స్కూలు వ్యాన్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. వాహనం వేగంగా ఉండడంతో అందులోని విద్యార్థులు కొందరు కిటికీల్లోంచి ఎగిరి బయట పడ్డారు. వీరిపైనే వ్యాన్ కూడా పడింది. దీంతో పదో తరగతి విద్యార్థిని కాసరవేణి మణిచందనారాణి (15), రెండో తరగతి విద్యార్థిని గుగులోతు దీక్షిత (6) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. మూడో తరగతి విద్యార్థి రిషి (7) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఠాకూర్ రాకేశ్(15), గుమ్మడి సాయి నిఖిల్ (15), వేర్పుల అజయ్‌కుమార్ (15) మారుపాక రోహిత్ (9), గుండెకర్ల రేవంత్ (7) సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్పందించిన యువత ప్రమాదం సమయంలో అటుగా వెళ్తున్న తిప్పాపూర్ గ్రామానికి చెందిన గణేశ్ మంటప నిర్వాహకులు బోల్తాపడిన స్కూలు వ్యాన్‌ను పైకి లేపారు. తద్వారా కొందరి ప్రాణాలు కాపాడిన వారయ్యారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం కావడంతో ఆగ్రహానికి లోనై.. వ్యాన్ డ్రైవర్ రఫీక్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి మంత్రి, ఎంపీ విద్యార్థుల మృతి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వేర్వేరుగా సంఘటన స్థలాన్ని సందర్శించారు. మంత్రి బస్ డిపో ప్రాంతానికి చేరుకుని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఎంపీ బండి సంజయ్ కూడా.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎంపీపీ మల్లేశంతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ, జేసీ యాస్మిన్ బాషా, జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే, డీఆర్వో ఖీమ్యానాయక్, డీఈవో రాధాకిషన్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఎస్పీ వెంకటరమణ, సీఐ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, రంగు వెంకటేశ్‌గౌడ్ బాసటగా నిలిచారు. కాగా, ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్లో ఆరా తీశారు. కాగా, బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తక్షణ సాయంగా రూ.2లక్షల చెక్కులను అందజేసింది. వ్యాన్‌కు ఫిట్నెస్ లేదు ! వేములవాడలో నిర్వహిస్తున్న వాగేశ్వరి (శ్రీచైతన్య) స్కూల్ వ్యాన్ (ఏపీ 15 టీబీ 7800)కు ఎలాంటి ఫిట్నెస్ లేదని పోలీసులు వెల్లడించారు. 15 సీట్ల సామర్థ్యం కలిగిన వ్యాన్‌లో సామర్థ్యానికి 27 మంది తీసుకెళ్తున్నారు. ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. స్కూల్ హాస్టల్‌కు కూడా ఎలాంటి అనుమతుల్లేకుండానే నిర్వహిస్తున్నారని డీఈవో రాధాకిషన్ పేర్కొన్నారు. రోజూ చింతల్‌ఠాణా నుంచి వేములవాడకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విద్యార్థులను తరలిస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రమాదం ముగ్గురి మృతికి కారణమైంది. కాగా, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన చిన్నారులు ఇంకా షాక్‌నుంచి కోలుకోలేదు. కళ్లముందే జరిగిన ప్రమాదాన్ని తలచుకుని వారు వణికిపోతున్నారు. బస్‌డిపోలో బాధిత కుటుంబాలతో చర్చలు ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఈటల రాజేందర్ బస్‌డిపో ఆవరణలో జిల్లా అధికారులు, బాధిత కుటుంబాలతో సమాలోచనలు చేశా>రు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున అందజేయాలని సూచించినట్లు తెలిసింది. కాగా, వాగేశ్వరి (శ్రీచైతన్య) స్కూల్ అనుమతులను రద్దు చేస్తామని డీఈవో రాధాకిషన్ ప్రకటించారు. హాస్టల్ నిర్వహణకు ఎలాంటి అనుమతులూ లేనప్పటికీ.. యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘించినందుకు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. భద్రతపై పోలీసులను అప్రమత్తం చేస్తాం వేములవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటనపై ఎస్పీ రాహుల్ హెగ్డే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో బాధితుల కుటుంబీకులు, అక్కడ గుమిగూడిన యువకులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఎస్పీ చొరవతీసుకుని వారిని శాంతింపజేశారు. ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖను సైతం అప్రమత్తం చేసి విద్యార్థుల భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. - ఎస్పీ రాహుల్ హెగ్డే -
స్కూల్ వ్యాన్ బోల్తా, ముగ్గురు మృతి
-
స్కూల్ వ్యాన్ బోల్తా, ముగ్గురు మృతి
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ మండలం తిప్పాపూర్ శివారులో వాగేశ్వరి స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఐదుగురు విద్యార్థులు సిరిసిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాగేశ్వరి స్కూల్ కు చెందిన విద్యార్థులు 27 మంది మధ్యాహ్నం భోజనానికి స్కూల్ నుంచి వ్యాన్‌లో చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్న హాస్టల్ కు వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో డివైడర్ ఎక్కి వ్యాన్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మానాల కు చెందిన 2వతరగతి విద్యార్థిని దీక్షిత, వట్టెంలకు చెందిన పదోతరగతి విద్యార్థిని మనస్విని అక్కడికక్కడే మృతి చెందగా, మానాల కు చెందిన రిషి సిరిసిల్ల ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు వేములవాడ, సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వ్యాన్ డ్రైవర్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ రాహుల్ హెగ్డే సందర్శించి ప్రమాదంపై కేసు నమోదు చేస్తామని, డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. స్కూల్‌పై చర్యలు తీసుకొని మృతి చెందిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో పాటు స్థానికులు ఆందోళనకు దిగారు. వేములవాడ ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన ప్రమాద స్థలాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ విద్యార్థులు చినపోవటం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం ద్వారా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
మంత్రాలు చేస్తుందని చంపేశారు
సాక్షి, వేములవాడ : మంత్రాల నెపంతో హత్యకు గురైన వృద్ధురాలు లచ్చవ్వ కేసు ఎట్టకేలకు వీడింది. మంత్రాలు చేయడం వల్లనే తమ కుటుంబం మొత్తం అనారోగ్యం బారినపడుతున్నారని, తమ తమ తల్లిదండ్రులు చనిపోయారని భావించి పండుగ లచ్చవ్వ(75)ను గత డిసెంబర్ 26న అర్ధరాత్రి గడ్డపారతో అతి కిరాతకంగా హత్య చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంకెపల్లి గ్రామంలో గత డిసెంబర్ 26న జరిగిన హత్య కేసు వివరాలను మంగళవారం వేములవాడ రూరల్ సీఐ కార్యాలయంలో వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ లచ్చవ్వను హత్య చేసిన బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు అనే సోదరులను మంగళవారం పట్టుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. హత్యకు సహకరించిన ఎండీ షబ్బీర్, పండుగ నర్సయ్య, జింక అంజయ్య, జింక రాజు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. పండుగ లచ్చవ్వ అనే వృద్ధురాలు మంత్రాలు చేయడం వల్లే కుటుంబం మొత్తం అనారోగ్యంబారిన పడుతుందని భావించిన బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు మరో నలుగురి సాయంతో లచ్చవ్వను హత్య చేయాలని పథకం రూపొందించారన్నారు. ఇందుకు వీరంతా కలిసి గడ్డపార, ఇసుపరాడ్డు, కత్తితో అతికిరాతకంగా లచ్చవ్వను చంపేశారని, జరిగిన హత్యపై సమాచారం అందకపోవడంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారిందన్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని, పరిస్థితులను బేరీజు వేసుకున్న వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, టౌన్ సీఐ ఎన్.వెంకటస్వామి బృందం టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకునేందుకు కృషి చేశారన్నారు. మొబైల్ కాల్‌డాటా ఆధారంగా నిందితులను పట్టుకున్నారన్నారు. వీరిని పట్టుకు నేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని చాలాప్రాంతాలను వెతకాల్సి వచ్చిందన్నారు. హత్య కేసుతోపాటు బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు, ఎండీ షబ్బీర్‌పై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. హత్య కేసును ఛేదించిన టౌన్ సీఐ వెంకటస్వామి బృందాన్ని ఎస్పీ అభినందించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి రివార్డులు అందిస్తామన్నారు. సమావేశంలో రూరల్ సీఐ రఘుచందర్, పోలీసులు పాల్గొన్నారు. ముఢనమ్మకాలను నమ్మొద్దు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయినప్పటికీ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయని, ఇలాంటి వాటి ఉచ్చులో పడి మోసపోవద్దని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నేరాలకు పాల్పడితే వారి జీవితాలు, కుటుంబాలు వీధిన పడతాయని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణప్రాంతాల్లో మూఢనమ్మకాలపై తమ పోలీసు బృందాలు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నాయన్నారు. విద్యావంతులు, మేధావులు, యువతరం ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. -
దుబాయిలో గంభీర్పూర్ వాసి మృతి
సాక్షి, వేములవాడ: కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన లంకదాసరి గణేశ్(46) అనే వ్యక్తి దుబాయిలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు మంగళవారం సమాచారం అందింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకదాసరి గణేశ్ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లి అక్కడ అబుదాబి ఏరియాలో డెన్లామ్‌యామ్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. గత నెల 28న గణేశ్ పని నిమిత్తం నడిచి వెళ్తుండగా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు అక్కడివారు కుటుంబసభ్యులకు మంగళవారం సమాచారమిచ్చారు. గణేశ్ రెండున్నర ఏళ్ల కిత్రమే ఇంటికి వచ్చి దుబాయి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య అంజమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతదేహం స్వగ్రామానికి పంపించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాధిత కుటుంబానికి పరామర్శ లంక దాసరి గణేశ్ దుబాయిలో మృతిచెందగా.. మంగళవారం గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిధి బసంత్‌రెడ్డి గంభీర్పూర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. మృతదేహం స్వగ్రామానికి పంపించేందుకు సహకరిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. -
వేములవాడలో బాలికపై దారుణం
సాక్షి, వేములవాడ : అతను ఆ బాలికకు వరుసకు బావ.. చనువుగా ఉండడాన్ని చూసి బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాలరామన్నపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం. శాలరామన్నపల్లి గ్రామానికి చెందిన లచ్చయ్య–సారవ్వ దంపతుల కూతురు(15) గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌లోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. వరుసకు బావ అయిన సాయి బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు. బంధువుల ద్వారా కుటుంబసభ్యులకు విషయం తెలిసింది. దీంతో ఇటీవల కులపెద్దల సమక్షంలో పంచాయితీ జరి గింది. ఈక్రమంలోనే యువకుడికి మరో యువతితో వరపూజ జరిగింది. సమస్య జటిలమైంది. బాలిక అంశం పంచాయితీకి రావడవంతో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆ తర్వాత అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నారు. సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్‌కు సంబంధించి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాలిక ను తీసుకుని వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా.. బాలి కకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమెను ఠాణా ఎదుట గల సులభ్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారు. అక్కడే బాలికకు గర్భస్రావమైంది. బాధితురాలిని తక్షణమే స్థానకంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తల్లి సారవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
సాక్షి, వేములవాడ : కంటికి రెప్పలా కాపాడే కన్న తండ్రిని విధి గుండె సంబంధిత వ్యాధి రూపంలో బలి తీసుకుంది. పుట్టెడు దుఃఖంతో తండ్రికి చిన్నకూతురు తలకొరివి పెట్టింది. ఈ హృదయ విదారకర ఘటనతో గ్రామస్తులు కంటతడిపెట్టారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చందుర్తి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి బాబు ఆర్నెళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు చేసి గుండె వీక్‌గా ఉందని చెప్పారు. కూలీ పని చేస్తేనే పూటగడిచే ఆ కుటుంబానికి వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లి గవ్వ లేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం బాబు అస్వస్థతకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కూతుళ్లు స్రవంతి, స్యౌమ ఉన్నారు. పెద్ద కూతురు స్రవంతికి వివాహం కాగా, చిన్న కూతరు సౌమ్య పుట్టెడు దుఃఖంతో తండ్రి చితికి నిప్పు పెట్టింది. కాగా నిరుపేద కుటుంబానికి గ్రామస్తులు రూ.30 వేలు, రెండు క్వింటాళ్ల బియ్యం విరాళంగా అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా కృషి చేసి ఆదుకుంటామని ఎంపీటీసీ సభ్యుడు పులి రేణుకాసత్యం హామీ ఇచ్చారు. -
వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీనివాసుడి కల్యాణం
-
కోడెగడుతా రాజన్నా; బ్లాక్ దందాతో ఎలాగన్నా?
సాక్షి, వేములవాడ : కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు ఎములాడ రాజన్నను మొక్కుకుని కొడుకు పుడితే కోడెగడుతా రాజన్నా అంటూ నిత్యం వేలాది మంది భక్తులు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తరలివస్తుంటారు. రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయంగా పేరుండి, ఆదాయంలోనూ మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో శ్రీస్వామి వారికి వచ్చే ఆదాయంలో సింహ భాగం కోడె మొక్కుల ద్వారానే సంక్రమిస్తుంది. వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో అధిక శాతం భక్తులు కోడె మొక్కు చెల్లించుకున్న అనంతరమే ఇతర మొక్కులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కోడె మొక్కు అనేది ఇతర దేవాలయాల్లో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న గుడిలో కొనసాగుతుంది. దీంతో రాజన్న గుడిలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకునేందుకు లేబర్లు, కాంట్రాక్టు లేబర్లు, బినామీలు, పైరవీకారులు ముందుంటున్నారన్న అంశం ఆలయ ఉద్యోగులే చర్చించుకోవడం గమనార్హం. రద్దీ సమయంలో దందా షురూ.. పంటలు బాగా పండాలని రైతులు, కుటుంబాలు బాగుండాలని భక్తులు, తమ సమస్యలు తీరాలని మరికొందరు కుల, మతాలకు అతీతంగా ఎములాడ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకుంటుంటారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుంటున్న సదరు బ్లాక్ టికెట్ దందా చేస్తున్న వ్యక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడలేక ఎక్కువ డబ్బులు చెల్లించి కోడె టికెట్లు కొనుక్కునేందుకు సరే అంటుంటారు. దీంతో వీరికి ఆదాయ వనరులు తెచ్చిపెడుతుంది. కౌంటర్లలో విధులు నిర్వహించే వారితో కుమ్మక్కై కోడె మొక్కుల టికెట్లు ముందస్తుగానే కొనుగోలు చేసి దగ్గర పెట్టుకుని భక్తులకు ఎక్కువ ధరలకు అందిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. దీనికితోడుగా కొంత మంది చెక్పోస్టులపై పని చేస్తున్న సిబ్బంది కోడెల టికెట్లను వేకువజామునుంచే పోగు చేసుకుని ఇలాంటి వ్యక్తుల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా వీరి దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోందన్న వాదన వినవస్తోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా భీంగల్‌కు చెందిన నర్సాగౌడ్ అనే భక్తుడికి నర్సయ్య అనే లేబర్ బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటూ ఎస్పీపీఎఫ్ సిబ్బందికి చిక్కడంతో ఇక్కడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చాన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో అధికారులు, సిబ్బంది పాత్ర ఉండొచ్చన్న భావనను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న బినామీలు వేములవాడ రాజన్న ఆలయంలో బినామీల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొంత మంది కొన్ని రకాల పేర్లతో (పార్టీల పేర్లు, శాఖల పేర్లు, వీఐపీల పేర్లు) ఆలయ అధికారులు, సిబ్బందికి బురిడీ కొట్టించి తమ పబ్బం గడుపుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. భక్తులను తమ బంధువులుగా, అధికారుల బంధువులుగా చెప్పుకుంటూ అధిక ధరలకు టికెట్లు, దర్శనాలు అందిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు ఆధికారుల విచారణలో తేలింది. గతంలో పలువురు ఉద్యోగులు సైతం ఈ వ్యవహారంలో భాగస్వాములైతే ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వారిపై చర్యలు తీసుకున్నారు. నిఘా తీవ్రతరం చేస్తే మరిన్ని ఇలాంటి బాగోతాలు బయట పడతాయని భక్తులు పేర్కొంటున్నారు. -
వేములవాడలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు
సాక్షి, సిరిసిల్ల : కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ శుక్రవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ చేరుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్డీఏ తరఫున 351 మంది సభ్యులు అధికారంలోకి రావడంతో.. 351 కోడెలను కట్టి రాజన్న మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు బండి సంజయ్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేద ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. రాజన్న ఆశీస్సులతోనే తాను గెలిచానని తెలిపిన ఆయన.. ఆలయ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భాగస్వామ్యం అవుతానని.. అందరితో కలిసి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని తెలిపారు. బీజేపీ ఎటువంటి అవకాశం ఇచ్చినా పని చేస్తానని పేర్కొన్నారు. -
పబ్జీకి మరొకరు బలి!
వేములవాడ: పాపులర్ ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ పబ్ జీకి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ గేమ్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్న దుర్ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. యువతే కాదు..చిన్నారులు సైతం ఈ గేమ్ బారిన పడుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పబ్జీ గేమ్ ఆడుతూ బాలుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలో బంధువులందరూ వివాహ సంబురాల్లో ఉండగా చరణ్ అనే తొమ్మిదేళ్ల బాలుడు పబ్జీ గేమ్ ఆడుతూ కారులో ఉండిపోయాడు. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. బాలుని కోసం వెతికిన తల్లిదండ్రులు చివరకు బాలుణ్ని కారులో గుర్తించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిన చరణ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పబ్జీగేమ్ ప్రాణాలు తీసిందని గుండెలవిసేలా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
వేములవాడ రూరల్‌లో ఎన్నికలకు బ్రేక్
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలోని ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. వేములవాడ రూరల్‌లో రిజర్వేషన్ల ప్రక్రియ పున:పరిశీలించిన తర్వాతనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని తీగల రాంప్రసాద్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా ప్రాతిపదికన జరగటం లేదని వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్ తాను వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే వేములవాడ రూరల్ మండలానికి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ ద్వారా కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు, వేములవాడ రూరల్ మండల ఎంపీటీసీ ఎన్నికలపై స్టే విధించింది. -
త్రిశూలమే భర్త,రుద్రాక్షమాలే మంగళసూత్రం
-
ప్రశ్నించే వారికి కాదు.. పరిష్కరించే వారికి మద్దతు
సాక్షి, కథలాపూర్(వేములవాడ): ఎన్నో ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, వచ్చే ఎన్నికల్లో ప్రశ్నించే నేతలను కాదు.. పరిష్కరించే నేతలకు ఓటర్లు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి కోరారు. శనివారం కథలాపూర్ మండలకేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆదివారం కరీంనగర్లో జరిగే సీఎం కేసీఆర్ సభకు వేములవాడ నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానానికి చంద్రశేఖర్‌గౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సుధాకర్‌రెడ్డికి ఓటర్లు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎం. జీ రెడ్డి, నాయకులు నాగేశ్వర్రావు, ధర్మపురి జలేందర్, జెల్ల వేణు, కల్లెడ శంకర్, దొప్పల జలేందర్, ఆకుల రాజేశ్, కిరణ్‌రావు, మహేందర్, గోపు శ్రీనివాస్, ఎం.డీ రఫీక్, సంబ నవీన్, శీలం మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సీతరామ్‌నాయక్ పాల్గొన్నారు. -
ఆపద వాహనానికి నీటి కష్టాలు
సాక్షి, వేములవాడరూరల్: ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే గుర్తుకు వచ్చేది అగ్నిమాపక వాహనం. అదే వాహనానికి నీరు లేకపోతే ఇక ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పనక్కర్లేదు. వేములవాడ మండల కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రంలో నీరు లేక అక్కడ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది అక్షరాలా సత్యం. గత కొన్ని నెలల క్రితం ప్రారంభించిన ఈ అగ్నిమాపక కేంద్రంలో మంచినీటి కొరకు బోరు వేయగా ప్రస్తుతం ఆ బోరు నీరు లేక అడుగంటుకుపోయింది. ఇక వాహనంలో నీరు నింపడానికి చెరువులు, బావుల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి అక్కడ సిబ్బందికి ఏర్పడుతోంది. అసలే వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ప్రతీరోజు ఎక్కడో ఒక్కచోట అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఈ వాహనంలో 24 గంటలు నీరు ఉండాల్సి ఉండగా నీటి సమస్య ఉండడం వల్ల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి చెరువు లేక మల్లారం వెళ్లే బావి వద్ద నీరు తప్పా వారికి ఎలాంటి నీటి సౌకర్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం కల్పించాలంటూ మున్సిపాలిటీ అధికారులను కోరినప్పటికీ వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ సమయంలో ఇలాంటి కష్టం ఉంటే మరికొన్ని రోజుల్లో ఎండలు తీవ్రత పెరిగిన తరువాత ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు ఇప్పటి నుండి ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకొని ఆకాశగంగ పైప్ లైన్ సౌకర్యం అగ్నిమాపక కేంద్రానికి కల్పించాలని వారు కోరుతున్నారు. 6 మండలాలకు ఇదే ఆధారం వేములవాడ ఫైర్ స్టేషన్ వాహనం 6 మండలాలకు ఆధారంగా ఉన్నది. వేములవాడ, వేములవాడ రూరల్, బోయినపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా వేములవాడ నుండే వాహనం వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వాహనంలో నీరు అందుబాటులో ఉండాలి. రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో సంఘటన జరిగినా వేములవాడ నుండి వెళ్లాల్సిందే. ఇక్కడ నీరు అందుబాటులో 24 గంటలు ఉండాలి కానీ నీరు లేకపోవడంతో వారు ఉన్న 10 మంది మంది సిబ్బంది కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫైర్‌స్టేషన్ ఇన్చార్జి సతీష్‌కుమార్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడంతో అదే కార్యాలయంలో పని చేస్తున్న పవన్‌కుమార్ నీటి సమస్య మాత్రం తీవ్రంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడేళ్లయినా తీరని దాహం
సాక్షి, కోనరావుపేట: గ్రామస్తుల దాహార్తి తీర్చి, తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు చర్యల మూలంగా నిరుపయోగంగా మారుతున్నాయి. పనులు చేసినా.. అవి ఫలితాలు ఇవ్వడంలేదు. ఫలితంగా లక్షలాది రూపాయల నిధులు ఎందుకూ పనికి రాకుండా పోయాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్యాంకుతోపాటు నిధులు వృథా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మరిమడ్లలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి ఐఏపీ పథకంలో 2012లో రూ.19.60 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో వట్టిమల్లలోని అజ్మీరాతండాలోని మూలవాగులో ఉన్న మంచినీటి బావినుంచి మరిమడ్ల వరకు పైప్‌లైన్ నిర్మించారు. పైప్‌లైన్ నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క చుక్క నీరు కూడా మరిమడ్లకు చేరలేదు. దీంతో మూలవాగు నుంచి మరిమడ్ల వరకు నీరు రావడంలేదు. పైపుల గుండా నీరెందుకు రావడంలేదో ఇంజనీరింగ్ అధికారులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అసలు కారణం తెలు సుకోకపోగా పైప్‌లైన్ మధ్యలో రూ.11 లక్షలతో సంప్ నిర్మించాలంటూ ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఇవే నిధులు మరో రూ.13 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. వాటర్ ట్యాంక్ పనులు పూర్తయినా ఇంతవరకు చుక్క నీరు అందులోకి ఎక్కలేదు. ట్యాంకుతో పాటు నిధులు కూడా వృథా అయ్యాయి. నిధులన్నీ పైపుల పాలు మండలంలోని మరిమడ్లలో నిర్మించిన పనులన్నీ వృథాగా మారాయి. పైప్లైన్లు నిర్మించినా పనిచేయడం లేదు. మంచినీటి బావినుంచి మరిమడ్లలో నిర్మించిన వాటర్ ట్యాంక్ సుమారు వంద మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న ట్యాంకులోకి నీరు ఎక్కాలంటే నాలుగు ఇంచుల పైపులతో లైన్లు వేయాలి. కాంట్రాక్టర్లు వేసిన పైపులు మూడు ఇంచులే ఉండడం, అవి కూడా నాణ్యత లేనివి వేయడంతో నీరు పారకముందే అవి పగిలిపోతున్నాయి. బావి నుంచి ట్యాంకు వరకు వేసిన పైపుల్లో నాణ్యత లేక అనేక చోట్ల పైపులు పగిలిపోయాయి. ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత నిర్ణయం, నిర్లక్ష్యం మూలంగా అవన్నీ వృథాగా మారాయి. దీంతో గ్రామస్తులకు తిప్పలు తప్పడంలేదు. మరుగున పడుతున్న పథకం మరిమడ్లలో కొన్నేళ్ల క్రితం పైపులు వేసి వాటిని మర్చిపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. అప్పటినుంచి దీన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. కాంట్రాక్టర్ల కోసం అంచనాలనే మార్చారని, ఇందువల్ల నిర్మాణం పూర్తయినా ఫలితం కలగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిధులన్నీ వృథా గ్రామంలో లక్షల వ్యయం తో నిర్వహించ తలపెట్టిన పైప్‌లైన్ ప్రాజెక్ట్ మధ్యలో నే వదిలేశారు. గ్రామంలో తాగునీటి కోసం అనేక ఇ బ్బంది పడుతున్నాం. దూ రప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి నిధులు సద్వినియో గం అయ్యే లా చూడాలి. – సింగం రాములు అధికారులు స్పందించాలి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్వహించతలపెట్టిన పైప్‌లైన్ పనులు పూర్తి చేస్తే బాగుండేది. పైప్‌లైన్ వేసినా ఇంతవరకు ఒక్క చుక్క నీరు రా లేదు. నిర్మించిన వాటర్ ట్యాంకులోకి నీరు చే రలేదు. ఈ పథకం ప్రారంభిస్తే గ్రామస్తుల నీ టి సమస్య తీరేది. అధికారులు స్పందించి నీ టి సమస్యను తొలగించాలని కోరుతున్నాం. – మాట్ల అశోక్, సర్పంచ్, మరిమడ్ల -
‘మహా’ జాతరకు రాజన్న ప్రసాదం
వేములవాడ: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలువబడుతున్న ఎములాడ రాజన్నను దర్శించుకునే భక్తులు రాజన్న ప్రసాదాలపై అంతే మక్కువ చూపుతారు. మార్చి 3 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారన్న అంచనాలో అధికార యంత్రాంగం ఉంది. భక్తులకు రాజన్న లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ప్రసాదాల గోదాం ఇన్చార్జీలు రెండురోజులుగా పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం ఉన్న లేబర్‌కు తోడు మరింత మందిని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గోదాంలోని ఓ గది నిండా ట్రేలలో తయారు చేసిన లడ్డూలు సిద్ధం చేశారు. వచ్చేనెల 2 వరకు నాలుగు లక్షల లడ్డూలు సిద్ధం చేసి ఉంచుతామని, 3, 4, 5 తేదీల్లోనూ భక్తుల రద్దీని బట్టి మరో లక్ష లడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత శివరాత్రి జాతరలో 3.23 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. జాతరకు ప్రత్యేక కౌంటర్లు రాజన్న లడ్డూ ప్రసాదం రుచిగా ఉండేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ అందుకు అనుగుణంగా దిక్టం (ప్రసాదాల్లో వాడే వస్తువుల కొలతలు) రూపొందించింది. దీని ప్రకారం స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన శనగపప్పు, కాజు, మిష్రి, కిస్మిస్, బాదాం, యాలకులతో పాటు సుగంధ ద్రవ్యాలను సైతం ఇందులో పొందుపరుస్తుండటంతో రాజన్న లడ్డూ తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మార్కెట్లో చక్కెర ధర అధికంగా ఉన్నా భక్తులకు తక్కువ ధరకే లడ్డూ ప్రసాదం అందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర దేవాదాయశాఖ రూ.15కు ఒక లడ్డూ చొప్పున విక్రయించాలని ఆదేశించింది. ఆమేరకు స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో ప్రసాదాల విక్రయాల కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదం అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటి వరకు కొనసాగిన ఆంధ్రాబ్యాంకు భవనంలో ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో రాజన్నను దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్లే భక్తులు నేరుగా ప్రసాదాల కౌంటర్‌కు చేరుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. రాజన్న హుండీ ఆదాయం రూ. కోటిన్నర వేములవాడ రాజన్నను దర్శించుకునే భక్తులు హుండీలలో వేసిన కానుకలను ఆలయ అధికారులు బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో లెక్కించారు. 22 రోజుల్లో రాజన్నకు రూ. 1,50,29,406 నగదు, 652 గ్రాముల బంగారం, 13 కిలోల 900 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. నాలుగేళ్లుగా వస్తున్న ఆదాయం ఇలా.. 2014–15 రూ. 7.30 కోట్లు 2015–16 రూ. 8.89 కోట్లు 2016–17 రూ. 8.38 కోట్లు 2017–18 (అక్టోబర్ వరకు) రూ. 5.63 కోట్లు 2017–18 నవంబర్‌లో –రూ. 90 లక్షలు 2017–18 డిసెంబర్లో– రూ. 1.35 కోట్లు 2018–19 జనవరిలో – రూ.1.40 కోట్లు మూడులక్షల లడ్డూలు సిద్ధం చేస్తాం జాతరకు వచ్చే భక్తులకు రాజన్న ప్రసాదం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఈసారి 5 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచాలని ఈవో ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బందిని రప్పించి లడ్డూ ప్రసాదాలు త యారు చేయిస్తున్నాం. ఇప్పటికే 2 లక్షల లడ్డులు సిద్ధం చేశాం. జాతర సందర్భంగా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న భక్తులకు ప్రసాదాలను అందుబాటులో ఉంచేం దుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. – వరి నర్సయ్య, గోదాం ఇన్చార్జి -
మార్చికి గజ్వేల్‌కు ట్రయల్ రైలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తపల్లి– మనోహరాబాద్ రైలు మార్గం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మార్చి ఆఖరు నాటికి గజ్వేల్‌కు ట్రయల్ రన్ పూర్తి చేసి తీరుతామన్న పట్టుదలతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పనిచేస్తున్నారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికపుడు రైల్వే అధికారులు, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుండటంతో పనులు ఊపందుకున్నాయి. ఈ మార్గం పూర్తయితే.. దశాబ్దకాలంగా రైలు కూత వినాలన్న కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్‌వాసుల కల నెరవేరనుంది. నేపథ్యమేంటి? 2006–07లో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నపుడే ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ, అప్పటి నుంచి ఈ పనుల్లో పురోగతి పెద్దగా లేకపోయింది. 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 151 కిలోమీటర్ల దూరంతో వేసే ఈ మార్గం అంచనా వ్యయం రూ.1,160 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం, భారతీయ రైల్వే బాగా సహకరిస్తున్నాయి. ‘ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్’విభాగం ద్వారా ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండటం విశేషం. 2017–18లో రూ.350 కోట్లు, 2018–19లో రూ.250 కోట్లు కేటాయించడం గమనార్హం. ఈ ప్రాజెక్టును 4 దశలుగా విడగొట్టి పనులు చేస్తుండటంతో అవి పరుగులు పెడుతున్నాయి. పెరగనున్న ఉపాధి అవకాశాలు ఈ రైల్వేలైను సాకారమైతే ఉత్తర తెలంగాణను హైదరాబాద్‌తో అనుసంధానం చేయడం సుగమమవుతుంది. ముఖ్యంగా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్వాసులకు రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉన్న ఆయా ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. ముఖ్యంగా కరీంనగర్ నుంచి గ్రానైట్, పత్తి, మొక్కజొన్న, వరి తదితర ఎగుమతులు, సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు వచ్చి, ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఆర్థికాభివృద్ధి జరుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. పైగా ఈ మార్గంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఈ రైల్వేమార్గం 5 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయావకాశాలను మెరుగుపరిచింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది. -
వేములవాడలో నత్తనడకన వసతి గదుల నిర్మాణం
రాజన్న భక్తులకు ఎములాడలో వసతి గదులు లభించడం లేదు. పాతకాలపు వసతి గదులు మినహా ఇప్పటివరకు కొత్తగా వసతి గదుల సౌకర్యం కల్పించలేకపోతున్నారు. భీమేశ్వరాలయం చెంతనే రూ.11 కోట్ల వ్యయంతో చేపట్టిన వంద గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గతేడాది మహాశివరాత్రికే అందుబాటులోకి తేవాల్సిన గదులు.. ఈఏడాది పండుగకు సైతం నిర్మాణం పూర్తిచేసుకోలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి, వేములవాడ: రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో గల ఖాళీ స్థలంలో వంద వసతి గదులు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు రెండేళ్లక్రితం రూ.11 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. పనులు నత్తనడకన సాగడంతో నేటికీ గదుల నిర్మాణం పూర్తికాలేదు. మహాశివరాత్రి వరకైనా అందేనా..? వచ్చే ఉడాది మహాశివరాత్రి జాతర వరకైనా కొత్త వసతి గదులు భక్తులకు అందుబాటులో వస్తాయా? రావా? అనే సందేహాలు నెలకొన్నాయి. వచ్చే మార్చి మొదటివారంలోనే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలోగా వసతి గదుల నిర్మాణం పూర్తికావడం సందేహాస్సదమేనని భక్తులు అంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడితే తప్ప పనుల్లో వేగం పెరగదని పేర్కొంటున్నారు. గదులు లేవట కుటుంబసభ్యులతో కలిసి ఎములాడ రాజ న్న దర్శనం కోసం వచ్చినం. ఆలయ వస తి గదులు లేవట. ప్రైవేటు లాడ్జి తీసుకున్నం. పైసలు ఎక్కువైనయి. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయంలో వసతి గదులు ఏకపోవడం శోచనీయం.– రాజేందర్, భక్తుడు, వరంగల్ ఎప్పుడైనా తిప్పలే.. దర్శనం కోసం పిల్లలతో కలిసి వచ్చినం. ఉండేతందుకు గదులు లేవు. అనేక ఏండ్ల నుంచి ఏటా ఇక్కడ గివే తిప్పలు. గిన్నేండ్ల నుంచి రూముల తిప్పలు తొలగించలేరా? భక్తులకు కనీసం వసతి గదులు ఇవ్వకుంటే ఎట్లా చెప్పుండ్రి. భక్తులకు రాగానే గదులు ఇవ్వాలి.– సులోచన, భక్తురాలు పూర్తిచేస్తాం రాజన్న భ క్తులకు వసతి కల్పిం చేందుకు భీమేశ్వర ఆలయం సమీపంలోని ఖాళీస్థలంలో వంద గదులు నిర్మిస్తున్నాం. పనుల్లో జాప్యం జరుగుతోంది. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌ను హెచ్చరించాం. మహాశివరాత్రి జాతర వరకు వీటిని అందుబాటులోకి తెస్తాం. – రాజేశ్, ఈఈ -
‘అవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలే’
సాక్షి, సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కేసీఆర్ అడ్డుకుంటున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మంగళవారం సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రైవేటు లిమిటెడ్ పార్టీలని విమర్శించారు. బీజేపీ హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని, కానీ కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన తెలంగాణ మాత్రం వెనకబడి ఉందని అన్నారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కుటుంబపాలనే ఎజెండాగా పాలనగా సాగుతోందని మండిపడ్డారు. దేవుడికి ఇచ్చిన హామీలను కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. 1947 ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ, మరాట్వాడా ప్రాంతాలకు మాత్రం రాలేదని, నిజాం పాలన అంతంతోనే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చారని ఆయన గుర్తుచేశారు. సెప్టెంబర్ 17న టీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ విస్మరించిన హామీలను తాము అమలుచేసి తీరుతామని తెలిపారు. మహాకూటమి, టీఆర్ఎస్ పార్టీలు కేవలం అధికారం కోసమే పనిచేస్తున్నాయని, పేదల కొరకు పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమేని అన్నారు. -
కొత్త ఓటర్లకు కార్డులను అందిస్తాం
వేములవాడఅర్బన్: వేములవాడ నియోజకవర్గంలో కొత్త ఓటర్లుకు ఎన్నికల కమిషన్ ద్వారా త్వరలోనే గుర్తింపు కార్డులను అందిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ తెలిపారు. వేములవాడ తహసీల్ధార్ కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 235 పోలింగ్ కేంద్రాలలోని ప్రతీ ఓటరుకు పోలింగ్ రశీదును అందిస్తామన్నారు. ఈ రశీదులో ఓటరు పేరు, క్రమ సంఖ్య, పోలింగ్ స్టేషన్ సంఖ్య, పోలింగ్ జరిగే ప్రాంతం, పోలింగ్ భవన చిత్రం ఉంటుందన్నారు. అందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఈనెల 9 నాటికి 4,745 మంది నూతనంగా ఓట హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో 4,161 మందికి ఓటు హక్కు కల్పించామని, 121 దరకాస్తులను తిరస్కరించామన్నారు. మిగతా వాటిని కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి ఓటు హక్కును కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికి జాబితా ఏర్పాటు చేసినందున నూతనంగా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల కోసం ఈ నెల 18న మరో జాబితాను విడుదల చేసి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో 20 వేలకు పైగా ఓటర్లు పెరిగారని, వారందరికి గుర్తింపు కార్డులను కూడా త్వరలోనే వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లోని బీఎల్వోల వద్ద ఉంచుతామన్నారు. తహసీల్దార్ నక్క శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా మిషన్ భగీరథ గుంతలు
వేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలంలోని గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నల్లా ఏర్పాటు చేసేందుకు పైప్ లైన్ కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. గుంతలు తీసి రోజులు గడుస్తున్నా, పూడ్చకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తిప్పాపూర్ గ్రామంలోని వేములవాడ కరీంనగర్ రహదారిలోని సౌరల కాలనీ వద్ద రోడ్డు పక్కన గుంతలు తీసి సరిగా పూడ్చకపోవడంతో రాత్రిపూట ప్రమాదకరంగా ఉందని వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వారం రోజుల క్రితం రహదారి వెంట వెళ్తున్న లోడ్‌తో ఉన్న లారీ రాత్రివేళ ఆ గుంతలో దిగబడి ఎటు వెళ్లకుండా అక్కడే నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే క్రేన్ సహాయంతో బయటికి తీశారు. అధికారులు స్పందించి వెంటనే రహదారుల వెంట ఉన్న మిషన్ భగీరథ గుంతలను పూర్తిగా పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఎన్నికల సిబ్బందికి రెండు రోజుల శిక్షణ
వేములవాడ: ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈనెల 13, 14 రెండు రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు 600 నుంచి 700 మంది వరకు ఉంటారని, వీరందరికీ అగ్రహారం కాలేజ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వీరికి శిక్షణ ఇచ్చే వారికి జిల్లా కేంద్రంలో శుక్రవారం మాస్టర్ లెవల్ ట్రైనింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రతీ ఉద్యోగి తప్పకుండా ఈ శిక్షణలో పాల్గొనాలని ఆదేశించారు. సెలవులైనా ఆదేశాలు జారీ చేయాలి... రెండవ శనివారం సెలవుదినం అంటూ ఎన్నికల విధులనకు దూరం ఉండొద్దని, రెండవ శనివారం అయినా ఉపాధ్యాయులందరికీ ఈనెల 13, 14 తేదీల్లో ఎన్నికల శిక్షణలో పాల్గొనేందుకు ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖ, ఎంపీడీవో, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సెలవుల పేరుతో ఎన్నికల విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 12న విడుదల అవుతుందని, ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌కు లోబడి అభ్యర్థులు తమతమ నామినేషన్ పత్రాలు అందజేయాలన్నారు. అభ్యర్థులకు సరైన సలహాలు, సూచనల కోసం తహసీల్దారు కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోటీ చేసే వారు ఎలాంటి సలహాలు, సందేహాలైనా ఈ డెస్క్ నుంచి పొందవచ్చన్నారు. మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ -
బీజేపీకో, కాంగ్రెస్‌కో ఓటేసుకోండి: చెన్నమనేని
వేములవాడ(రాజన్న సిరిసిల్ల జిల్లా) : మేడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్లిన టీఆర్ఎస్ వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబును ఆ గ్రామానికి చెందిన యువకులు నిలదీశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉద్యోగాలు కల్పించలేదని, కనీసం గ్రామంలోని సూల్ కోసం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని యువకులు ప్రశ్నించారు. రమేశ్‌బాబు ప్రసంగానికి వారు అడ్డుతగలడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. నిరసనకారులు ఎంతకీ వినకపోవడంతో ఆవేశానికి లోనైన రమేష్ బాబు.. ఇష్టం లేకుంటే కాంగ్రెస్‌కో, బీజేపీకో ఓటు వేసుకోవాలని, తమ పార్టీ ప్రచారానికి అడ్డు తగలవద్దని చిటపటలాడారు. యువకులను సముదాయించేందుకు స్థానిక మార్కెట్‌యార్డు చైర్మన్ లోక బాపురెడ్డి చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. ఒకవైపు యువకులు అడ్డుతగులుతున్నా రమేశ్ బాబు తన ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. అయితే, స్వయంగా టీఆర్ఎస్ అభ్యర్థే.. నచ్చకపోతే ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేయమని చెప్పడం పలువురిని ఆశ్చర్యపరిచింది. -
బీజేపీకో, కాంగ్రెస్‌కో ఓటేసుకోండి
-
‘చెన్నమనేని’కి అసమ్మతి చిచ్చు!
మేడిపల్లి (వేములవాడ): వేములవాడ టీఆర్ఎస్లో విభేదాలు భగ్గుమన్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మేడిపల్లిలో అసమ్మతివాదులు భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 2,500 మంది పాల్గొన్నారు. టికెట్ రమేశ్‌బాబుకు తప్ప ఎవరికిచ్చినా గెలిపించుకుంటామని, లేకపోతే పార్టీ ఓడిపోవడం ఖాయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఎంపీపీ వెంకటేశ్ మాట్లాడుతూ పార్టీలో సీని యర్లపట్ల అణచివేసే ధోరణి అవలంబిస్తున్నారన్నారు. రమేశ్‌బాబుకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని మేడిపల్లి మాజీ సర్పంచ్ రాజాగౌడ్ హెచ్చరించారు. సీనియర్ నేతలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య అన్నారు. టికెట్ రమేశ్‌బాబుకు ఇవ్వొద్దని మేడిపల్లి నుంచి వేములవాడ వరకు పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకున్నారు. -
చదువుకోవటం ఇష్టం లేక.. బాలుడి అతి తెలివి
సాక్షి, వేములవాడ : చదువుకోవటం ఇష్టంలేని ఏడేళ్ల బాలుడు అతి తెలివిగా ఆలోచించి కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఈ సంఘటన గురువారం రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేములవాడ పట్టణానికి చెందిన వరుణ్ 7వ తరగతి చదువుతున్నాడు. చదువుకోవటం ఇష్టం లేని వరుణ్ ఇంటినుంచి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. గురువారం తమ్ముడు శుశాంత్‌తో కలిసి పాఠశాలకు బయలుదేరాడు. మార్గం మధ్యలో.. తనను కిడ్నాప్ చేసినట్లు అమ్మకు చెప్పాలని తమ్ముడితో ఒట్టు వేయించుకున్న వరుణ్ అక్కడినుంచి పారిపోయి వరంగల్ బస్సెక్కాడు. అతడి తమ్ముడు ఇంటికి చేరుకుని.. అన్నయ్యను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లారని తల్లికి చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిగా నిజాలు తేటతెల్లమయ్యాయి. చదువుకోవటం ఇష్టంలేక ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని పట్టుకోవాలని అతడు ప్రయాణిస్తున్న బస్ నెంబర్‌ను హుజురాబాద్ పోలీసులకు ఇచ్చారు. త్వరలో బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
కలిసే ‘పోయారు’
కోనరావుపేట(వేములవాడ) : ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కూతురు, కుమారుని వివాహం, బార్య అనారోగ్యంతో అప్పులు పెరిగిపోయాయి. దీనికితోడు వ్యాపారం నడవకపోవడంతో ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏడడుగువేసి ఒక్కటై.. చావులోనూ కలిసే‘పోయారు’ పోలీసుల వివరాల ప్రకారం... కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన యెల్లెంకి శ్రీనివాస్(45) గ్రామంలోనే పత్తి, కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి భార్య పద్మ(40), కుమారుడు కార్తీక్, కూతురు సృజన ఉన్నారు. మూడేళ్ల క్రితం కూతురు, కుమారుడి వివాహాలు చేశాడు. దీంతో పెద్ద ఎత్తున అప్పులయ్యాయి. దీనికితోడు భార్య పద్మ అనారోగ్యానికి గురయ్యింది. ఆస్పత్రుల్లో చికిత్స, ఆపరేషన్లకు రూ.లక్షల్లో ఖర్చు అయ్యింది. అన్ని అప్పులు కలిసి రూ. కోటి 20లక్షలకు చేరుకున్నాయి. ఇల్లు అమ్మినా.. అప్పుల బాధలకు తాళలేక సిరిసిల్లలో ఉన్న ఇంటికి రూ. 70 లక్షలకు విక్రయించాడు. అయినా ఇంకా అప్పులు రూ. 50 లక్షల వరకు ఉన్నాయి. గత రెండు, మూడేళ్లుగా వ్యాపారం సాగడంలేదు. అప్పులెలా తీర్చాలన్న బెంగతో గత కొన్ని రోజులుగా మథనపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మంగళవారం వేకువజామున క్రిమిసంహారకమందు సేవించి దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. సింగిల్‌విండో చైర్మన్ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్ రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. కోనరావుపేట ఏఎస్సై ప్రమీల వివరాలు సేకరించారు. -
బినామీల బాగోతం
సాక్షి, కథలాపూర్(వేములవాడ) : పరిహారం డబ్బుల కోసం ప్రభుత్వ భూముల్లోనే పాగా వేశారు. ఎక్కడైన ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఆ ప్రాంతంలోని భూనిర్వాసితులకు పరిహారం దక్కడం న్యాయం. కానీ కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూ రమ్మ రిజర్వాయర్ పరిహారం కోసం స్థానికేతరు లు సైతం రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికేతరుల పేర్లు కనిపించడంపై కలిగోట గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న స్థానికులకు మాత్రమే పరిహారం ఇవ్వాలని.. అక్రమార్కులను అడ్డుకోవాలని కోరుతున్నారు. ఇదీ రిజర్వాయర్ ప్రణాళిక కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూరమ్మ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని 2006లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపెల్లి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రిజర్వాయర్‌ను నీటితో నింపి కథలాపూర్, మేడిపెల్లి మండలాలకు సాగు, తాగునీరందించడం లక్ష్యం. రిజర్వాయర్ నిర్మాణానికి అంబారిపేట పరిధిలోని 39.26 ఎకరాలు పట్టా భూమి, 114.33 ఎకరాలు ప్రభుత్వ భూమి అవసరం. కలిగోట పరిధిలో 117.11 ఎకరాలు పట్టాభూమి, 80.36 ఎకరాలు ప్రభుత్వ భూమి కోల్పోతున్నట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. పట్టాభూముల రైతులకు అప్పట్లోనే ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎకరానికి రూ.6.75లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించింది. బినామీల కన్ను కలిగోట పరిధిలోని ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉన్నట్లుగా కలిగోట గ్రామస్తులు కాకుండా ఇతరులు ఏడుగురి పేర్లు చేర్చారు. వీరి పేరిట సుమారు 15 ఎకరాలు పహణీల్లో చేర్చారు. మండలంలోని ఓ నాయకుడి చొరవతోనే బినామీలు పేర్లు చేర్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పహణీల్లో పేర్లున్న బినామీల వద్ద భూమికి సంబంధించి ఆధారాలు లేకపోగా.. వారికి ఆ భూమి ఎక్కడ ఉందో గుర్తించలేని పరిస్థితి ఉందని కలిగోట గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ.6.75 లక్షలు పరిహారం వస్తుందని తెలిసి మండలంలోని సదరు నాయకుడు 15 ఎకరాల్లో బినామీల పేర్లు రాయించారని, కోటి రూపాయల పరిహారం కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హక్కులున్న వారికే పరిహారం సూరమ్మ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇస్తాం. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి సాగుచేసుకుంటున్న రైతుల్లో భూమి హక్కులున్న వారికే పరిహారం అందజేస్తాం. బినామీలకు పరిహారం ఇవ్వబోం. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. – మధు, తహసీల్దార్, కథలాపూర్ -
రాజన్న సన్నిధిలో అపరిశుభ్రత
సాక్షి, వేములవాడ : కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న వేములవాడ రాజన్న గుడి వద్ద అపరిశుభ్రం రాజ్యమేలుతోంది. ఏటా లక్షలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న ఈ క్షేత్రంలో పారిశుధ్యం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, భక్తులు పడేసిన విస్తర్లు, చెత్త, ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. రద్దీ సమయంలో ఇంకా చెత్త పెరిగిపోయి పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోందని భక్తులు మొత్తుకుంటున్నారు. చెత్త కుప్పలు.. మలినాలు రాజన్న ఆలయ ఆవరణతోపాటు క్యూలైన్ల వెంట చెత్తకుప్పలు, మలినాలు దర్శనమిస్తున్నాయి. ఇక క్యూలైన్లలోని మరుగుదొడ్ల వద్ద ముక్కులు మూసుకునే దుస్థితి నెలకొంది. ప్రధానాలయం ముందు భాగంలో చెత్త కుప్పలు అలాగే పడి ఉంటున్నాయి. రాజగోపురం వద్ద ప్లాస్టిక్ కవర్లు, చెత్త దర్శనమిస్తోంది. ధర్మగుండం వద్ద పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. ఏటా పారిశుధ్యం నిర్వహణకు ఆలయం నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తులకు మాత్రం స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ఆలయ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
కడుపునొప్పితో వెళ్తే.. కంటిచూపు పోగొట్టారు
వేములవాడ : తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. వచ్చీరాని వైద్యంతో ఓ వ్యక్తి కంటిచూపు పోగొట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన నేరెళ్ల సాయిలుకు భార్య జలజ, కూతుళ్లు అక్షయ, అర్షిత ఉన్నారు. ఏప్రిల్ 21న జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ వైద్యంకోసం వేములవాడలోని డాక్టర్ మనోహర్ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు రక్తకణాలు తగ్గాయని అడ్మిట్ చేసుకున్నారు. ఐదురోజులు వైద్యం చేసి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన సాయిలుకు కంటిచూపు పోయింది. వెంటనే అదే ఆస్పత్రిలోని డాక్టర్ దిలీప్‌ను సంప్రదించారు. ఆయన సూచనతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సంప్రదించాడు. వైద్యం తీసుకున్నా.. కుడి కన్ను చూపు పోయింది. నోటికి తిమ్మిర్లు వచ్చాయి. నాలుక రుచి గుర్తించడంలేదు. ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపించిన సాయిలు సోమవారం మనోహర్ ఆస్పత్రికి చేరుకున్నాడు. తనకు మెరుగైన వైద్యం చేయించి ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. తనకు న్యాయం చేసేవరకు ఇక్కడే ఉంటానని కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రి ఎదుట బైఠాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రివద్దకు చేరుకుని బందోబస్తు చేపట్టారు. కాగా బాధితుడి బంధువులు, కుటుంబసభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు వైద్యులతో సంప్రదింపులు జరిపారు. వైద్యం చేయడంలో తమ తప్పిదమేమీ లేదని వైద్యులు చెప్పారని ఎంపీపీ వెంకటేశ్‌గౌడ్ తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ్నుంచి బాధితులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డాక్టర్ మనోహర్, డాక్టర్ దిలీప్‌పై ఫిర్యాదుచేశారు. ఈమేరకు ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేశారు. నేరెళ్ల సాయిలును వైద్యపరీక్షల కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు టౌన్ సీఐ వెంకటస్వామి తెలిపారు. ఈవిషయంపై డాక్టర్ మనోహర్‌ను వివరణ కోరగా, సాయిలుకు ప్లేట్లేట్స్ సంఖ్య 8 వేలకు పడిపోయిందని, ఆ తర్వాతే ఆస్పత్రికి వచ్చాడన్నారు. ప్లేట్లెట్స్ పెంపుకోసం వైద్యం చేశామే తప్ప కంటిచూపునకు సంబంధించి వైద్యం తాము చేయలేదని వివరించారు. -
‘పెట్టుబడి సాయం’ రైతునిధికే ఇస్తా
వేములవాడ: తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయభూములపై అందే పెట్టుబడి సాయం రూ.1.20 లక్షలను రైతునిధికి విరాళంగా అందజేస్తానని వేములవాడ శాసనసభ్యుడు సీహెచ్ రమేశ్‌బాబు ప్రకటించారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, రైతుబంధు పథకం ద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం ప్రారంభం కాబోతుందన్నారు. రాష్ట్రంలోని భూస్వాములు పెద్ద మనసు చేసుకుని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు వారికి వచ్చే పెట్టుబడి సాయాన్ని రైతునిధికి అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ నామాల ఉమ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
చాలీచాలని నీటి సరఫరా
చందుర్తి(వేములవాడ) : చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నా.. ఎటూ సరిపోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు ట్యాంకర్ల ద్వారా ఇంటికి 200 లీటర్లను సరఫరా చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ముఖం కడుక్కునేందుకు కూడా ఈ నీరు సరిపోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి రోజుకు 400 లీటర్లు అందజేస్తే నీటికష్టాలు తప్పుతాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలో ఇప్పటికే మూడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంపై అలసత్వం మల్యాలలో పదేళ్లుగా మంచినీటి గోస ఉంది. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు, పాలకులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. రెండు మంచినీటి ట్యాంకులు నిర్మించినా వాటిని నింపేందుకు నీళ్లు లేక వృథాగా ఉంటున్నాయి. ఏటా ట్యాంకులను నింపేందుకు అద్దె బావులతోనే కాలాన్ని గడిపారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లేదు. డ్రమ్ము నీళ్లతోనే.. రోజంతా ఒక్క డ్రంబు నీళ్లతోనే సరిపెట్టుకోవాలి. నీళ్లు సరిపోవడం లేదన్న ఎవరూ పట్టించుకోవడం లేదు. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్తే రైతులు కోపానికి వస్తున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. – గుంటిపెల్లి రాజవ్వ, ఎస్సీకాలనీ పట్టించుకునేటోళ్లు లేరు ఓట్లు వస్తే ఇంటికి పది సార్లు వచ్చి ఓటు ఎయ్యిమని బతిలాడుతరు. నీళ్లు లేక కరువు వచ్చి చచ్చి పోతున్నామంటే ఊల్లె ఉన్నోడు రాడు. ఊరవుతలోడు రాడు. నీళ్లు లేక సచ్చిన సరే పట్టించుకుంట లేరు. పది బిందెల నీళ్లతో ఇంట్లో పది మంది ఉంటే ఎట్లా గడుపుతాము. – గుంటిపెల్లి మల్లవ్వ, మల్యాల -
వేములవాడలోని రాజన్న ఆలయంలో విషాదం
-
సమగ్రాభివృద్ధి దిశగా వేములవాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. శనివారం శాసనసభలో వేములవాడ పట్టణం, ఆలయ అభివృద్ధిపై కేటీఆర్ సమీక్షించారు. పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా వేములవాడ సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అథారిటీ పరిధిలోకి పట్టణ పరిసర ప్రాంతాలను, ముంపు గ్రామాలను తీసుకొచ్చి.. వాటన్నింటినీ వేములవాడ పట్టణ అభివృద్ధితో అనుసంధానం చేయాలని సూచించారు. పట్టణ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో రానున్న ఐదు, పది, 25 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. పట్టణ జనాభా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశారు. చారిత్రక వైభవాన్ని తలపించేలా.. దేవాలయ అభివృద్ధి డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని కేటీఆర్ చెప్పారు. పట్టణంలో చేపట్టే సివిల్ పనుల (భవనాలు, బ్రిడ్జీలు, రోడ్లు)లో చోళ–చాళుక్య శిల్ప కళా వైభవం ఉట్టిపడేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేములవాడ పట్టణ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. పట్టణంలో ప్రవేశించగానే ఒక ఆలయ ప్రాంతానికి వచ్చామనే భావన కలిగేలా.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా విస్తరించనున్న రోడ్లు, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. గుడి చెరువులోకి మురికినీరు రాకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న బస్టాండ్ నుంచి దేవాలయం వరకు కేబుల్ కారు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేటీఆర్ ఆదేశించారు. పట్టణంలో భక్తుల సౌకర్యార్థం ఉచితంగా బస్సులు, అందులోనూ వీలైతే ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. త్వరలో వేములవాడలో పర్యటించి.. పనులను క్షేత్రస్థాయితో పరిశీలిస్తామన్నారు. -
శివయ్యా.. ఏదీ గంగమ్మ..!
వేములవాడ: ఎములాడ రాజన్నను దర్శించుకునే ముందుకు భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం, సుందరీకరణలో భాగంగా గుడిచెరువును మట్టితో నింపి చదును చేయడంతో పక్కనే ఉన్న రాజన్న ధర్మగుండంలో నీళ్లు అడుగంటాయి. ఉన్నకొద్దిపాటి కలుషిత నీటిలో కొందరు స్నానానాలు కానిచ్చేస్తుండగా, చాలామంది వెనుదిరుగుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ఆలయ అధికారులు చేష్టలుడిగి చూడడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. శివునికే నీటి కటకట.. గంగను ఒదిగిన గంగాధరుడు శివుడు.. అలాంటి శివయ్యకే నీటికటకట ఎదురైంది. తమ ఇలవేల్పు ఎములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకుని కోర్కెలు తీర్చుకోవాలని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ధర్మగుం డంలో స్నానాలు చేయడం గగనంగా మారింది. అడుగంటిపోయిన నీటితో అవస్థలు పడుతున్నారు. లోతైన ధర్మగుండంలోకి మెట్లపైనుంచి దిగి ఉన్నకొద్దిపాటి మురుగునీటిలోనే స్నానా లు చేసి పైకి రావడం చుక్కలను చూపిస్తోంది. గుండం స్నానాలు శ్రేష్ఠం.. ధర్మగుండంలో స్నానాలు చేయడాన్ని భక్తులు శ్రేష్ఠంగా భావిస్తారు. చలిని సైతం లెక్కచేయ తొలుత పుష్కరిణిలో స్నానాలు చేస్తారు. ఆ త ర్వాతే క్యూలైన్లలోకి వెళ్లి కోడెమొక్కు, ఇతర మొ క్కులు చెల్లించుకుంటారు. ధర్మగుండంలో ఇ ప్పుడు నీళ్లులేక స్నానాలు ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ధర్మగుండంలోకి దిగి మెట్ల ద్వారా పైకి ఎక్కేందుకు అవస్థలు పడుతున్నారు. కొందరు ధర్మగుండంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ కింద స్నానాలు చేస్తున్నారు. ముందుచూపు లేదు.. రాజన్నను దర్శించుకునేందుకు రెండు నెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కానీ, ధర్మగుండంలోని నీటికొరతను అధిగమించాలనే ఆలోచన రాజన్న ఆలయ అధికారులకు రాలేదు. ఓవైపు ఎల్ఎండీ, మధ్యలో మిడ్‌మానేరులో నీరున్నా ఇక్కడకు తరలించేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయడంలేదు. అధికారుల ముందుచూపు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి. తానం ఎట్ల జేసుడు? రాజన్నకు మొక్కు చెల్లించుకునేందుకు వచ్చినం. గుండంలో నీళ్లులేవు. తానం ఎట్ల జేసుడో అర్థమైతలేదు. ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా గుండంల నీళ్లు ఉంచకపోతే ఎట్లా..? అధికారులు గింత నిర్లక్ష్యం జేయొద్దు. – రాజేశ్వరి, భక్తురాలు, వరంగల్ నీళ్లు నింపుతాం మహాశివరాత్రి జాతర వరకు ధర్మగుండంలో నీళ్లు నింపుతాం. ఇందుకోసం ఎల్ఎండీ పైప్‌లైన్ వినియోగిస్తాం. మరికొన్ని బోర్లు కూడా ఏర్పాటు చేస్తాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాం. – దూస రాజేశ్వర్,రాజన్న ఆలయ ఈవో -
వేములవాడ ఆలయ ఈవోకు నోటీసులు
సాక్షి, రాజన్నసిరసిల్ల: రాజన్న సిరిసల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయ ఈవోకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఆలయ ఈవో రాజేశ్వర్ అక్రమంగా పదోన్నతులు పొందారన్న అభియోగాలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ ఆయనకు నోటీసులు జారీ చేశారు. -
భర్త పీక కోసి చంపేసింది..
నంగునూరు(సిద్దిపేట): దుబాయి నుంచి వచ్చి నెల రోజులు తిరగక ముందే వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం నంగునూరు మండలం ఘణపూర్‌లో కలకల సృష్టించింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు కారణమని ఆరోపిస్తూ మృతదేహాన్ని అతడి ఇంటి ఎదుట ఉంచి నిరసన తెలపడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నంగునూరు మండలం ఘణపూర్ గ్రామానికి చెందిన బండి బాలయ్య (40) ఆరేళ్ల క్రితం దుబాయికి వలస వెళ్లాడు. 20 రోజుల క్రితం ఇక్కడకు తిరిగి వచ్చిన బాలయ్య ఆదివారం భార్య నర్సవ్వతో కలిసి వేములవాడకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున అక్కడ బాలయ్య దారుణ హత్యకు గురి కావడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. భార్య నర్సవ్వ అతడిని హత్య చేయించి పోలీసులకు లొంగిపోయిందని గ్రామంలో ప్రచారం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సైదులు, రాజగోపాల్‌పేట, చేర్యాల, బెజ్జంకి మండలాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. అనుమానితుడి ఇంటి ఎదుట నిరసన పోస్టుమార్టం అనంతరం బాలయ్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన బంధువులు అతడి హత్యకు గ్రామాని చెందిన కారెడ్ల వెంకట్‌రెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. నిందుతుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వెంకట్‌రెడ్డి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. న్యాయం చేస్తామని పోలీసులు నచ్చ చెప్పినా వినకుండా రాత్రి వరకు నిరసన కొనసాగించారు. కూతుళ్ల భవిష్యత్ అగమ్యగోచరం బాలయ్య, నర్సవ్వ దంపతుల ఇద్దరు కూతుళ్ల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి పోలీసులకు లొంగిపోవడంతో వారి ఆలనాపాలనా చూసే దిక్కు లేకుండా పోయింది. పెద్ద కూతురు శైలజ ఇంటర్ చదువుతుండగా చిన్న కూతరు అంజలి నాలుగవ తరగతి చదువుతోంది. దైవ దర్శనానికి తాము వస్తామని చెప్పినా తీసుకెళ్లలేదని, నాన్న వెంట వేములవాడకు వెళ్తే బతికేవాడని ఆ కూతుళ్లు బోరున విలపించారు. బాలయ్య మృతి చెందడంతోపాటు నర్సవ్వ పోలీసులకు లొంగిపోవడంతో వారు తల్లిదండ్రులు లేనివారిలా తయారయ్యారు. -
ఎమ్మెల్యే చెన్నమనేనికి ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు ఆరు వారాలపాటు సస్పెండ్ చేసింది. దీనిపై మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు స్పష్టంచేసింది. రమేష్ జర్మన్ దేశ పౌరుడని, ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలో విచారించింది. -
వెములవాడ రాజన్న ఆలయంలో జ్వాలతోరణం
-
కౌలు రైతు ఆత్మహత్య
సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాకలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తుమ్మల శ్రీనివాస్ (46) అనే కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలుపుతున్నారు. రైతు ఆత్మహత్యతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతన్నారు. -
వేములవాడలో దారుణం..
-
వేములవాడలో దారుణం..
సాక్షి, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డు మీద గొంతు కోసి హతమార్చాడు. అనంతరం తాను కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బాలరాజు(30), వసంత(25) భార్యాభర్తలు. వసంత పుట్టినిల్లు వేములవాడ. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వేములవాడలో మంగళవారం బాలరాజు హఠాత్తుగా భార్యపై దాడి చేశాడు. ఆమె గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం బాలరాజు సైతం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని పోలీసులు జీపులో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉంటాయని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరదాగా షాపింగ్‌కెళ్తే..!
► చెట్టును ఢీకొన్న కారు.. యువకుడి మృతి సాక్షి, వేములవాడఅర్బన్, చందుర్తి, కోరుట్ల: అంతా బీటెక్ స్టూడెంట్స్.. తమలో ఓ స్నేహితుడి ఎంగేజ్మెంట్ అయింది.. త్వరలో పెళ్లి.. సరదాగా షాపింగ్ కోసం అంతా కలిసి రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు. తుళ్లింతలు.. కేరింతల నడుమ హైదరాబాద్‌లోని ఫ్రెండ్స్‌తో కలిసి షాపింగ్ చేశారు. గురువారం రాత్రి కోరుట్లకు తిరుగుముఖం పట్టారు. తక్కువ దూరం.. త్వరగా ఇంటికి చేరొచ్చని సిద్దిపేట–సిరిసిల్ల–వేములవాడ–కోరుట్ల రూట్‌ను ఎంచుకున్నారు. మధ్యలో అర్ధరాత్రి భోజనాలు ముగించుకుని తెల్లవారు 4.30 గంటల ప్రాంతంలో వేములవాడ శివారులోని మరిపల్లి దగ్గరకు చేరుకున్నారు. తెల్లవారుజాము కావడంతో అంతా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. కారు నడుపుతున్న యువకున్ని నిద్రమత్తు ఆవరించిందో.. టైరు పేలిందో తెలియదు గానీ.. ఒక్క క్షణంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అంతా కోరుట్లవాసులే.. కారు ప్రమాదంలో మృతిచెందిన గట్ల రాజేష్‌తోపాటు గాయాలపాలైన యువకులంతా కోరుట్ల పట్టణంలోని రథాల పంపు ఏరియాకు చెందినవారు. రాజ్‌కుమార్(23), పసుల కిషోర్(22), శ్రీకాంత్(23), వంశీ(22), రాజేష్ వీరంతా హైదరాబాద్‌లో వేర్వేరు కళాశాలల్లో బీటెక్ చదువుతున్నారు. రాజ్‌కుమార్‌కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయింది. త్వరలో పెళ్లి నిశ్చయించినట్లు సమాచారం. ఆ షాపింగ్‌తోపాటు దసరా షాపింగ్ కలిసి వస్తుందని అంతా కలిసి హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుని గురువారం షాపింగ్ చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఉండే స్నేహితులకు షాపింగ్ చేసిన బట్టలు అప్పగించి కోరుట్లకు పంపమని చెప్పి తిరుగుపయనమైన క్రమంలో వేములవాడ వద్ద కారు ప్రమాదానికి గురైంది. కొడుకును చూడకముందే మృతుడు గట్ల రాజేష్ తండ్రి గణేష్ దుబాయ్‌లో ఉంటున్నాడు. సుమారు పది రోజుల క్రితమే గణేష్ దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. ముంబాయిలో ఉండే పెద్ద కొడుకు అరుణ్ ఇంటి వద్ద ఆగి ముంబాయిలో గణేష్ నిమజ్జనం పూర్తయ్యాక కోరుట్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో చిన్న కొడుకు రాజేష్ కారు ప్రమాదంలో మృతిచెందిన సమాచారమందింది. దుబాయ్ నుంచి వచ్చి కొడుకు రాజేష్‌ను కళ్లారా చూడకపోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. శుక్రవారం రాత్రి వరకు రాజేష్ తండ్రి గణేష్ కోరుట్లకు చేరకోలేదని సమాచారం. బంధువులు ప్రమాదస్థలికి వెళ్లినట్లు తెలిసింది. కోరుట్లలో విషాదం రాజేష్ మృతిచెందడంతోపాటు కోరుట్లకు చెందిన రాజ్‌కుమార్ నడుముకు గాయమైంది. పసుల కిషోర్‌కు కాలు, చేయి విరిగింది. శ్రీకాంత్ తలకు గాయాలయ్యాయి. వంశీకి స్వల్ప గాయాలయ్యాయి. తమ పిల్లలు ప్రమాదం బారిన పడ్డారని ఉదయాన్నే సమాచారం రావడంతో కుటుంబసభ్యులు వేములవాడ వెళ్లారు. కేసు నమోదులో జాప్యం రెండు మండలాల సరిహద్దు గ్రామాల మధ్య ప్రమాదం జరగడంతో కేసు నమోదు చేయడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేశారు. ప్రమాదం జరిగిన స్థలానికి అర కిలోమీటరు పొడవు వరకు చందుర్తి పోలీస్‌స్టేసన్ బోర్డు ఉందంటూ వేములవాడ రూరల్ పోలీసులు, రెవెన్యూ పరిధిని చూసుకుంటే మర్రిపల్లి గ్రామంలో ఉంటుందన్న కిరికిరితో పోలీసులు వివరాలు, కేసు నమోదు చేయడంతో ఆలస్యం చేశారు. చివరకు వేములవాడ రూరల్ పోలీస్‌స్టేసన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
మాతృత్వానికి అర్థం చెప్పిన సీఐ
వేములవాడ: ఖాకీ వెనుక కన్న తల్లి ప్రేమ కూడా దాగుంటుందని చాటారు వేములవాడ సీఐ మాధవి. వేములవాడ దేవస్థానం మెట్ల దగ్గర గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు 20 రోజుల పసికందును వదిలి వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ మాధవి హుటాహుటిన అక్కడికి చేరుకుని చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయారు. బాబును అక్కున చేర్చుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. బాబుకు స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి పాలు పట్టించారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడున్న కొందరు సీఐ మాధవిని తమ జిల్లాకు పోలీసు అమ్మగా ఆమెను పేర్కొనడంతో అక్కడున్న వారందరి కళ్లు చెమర్చాయి. ఇదే కాదు, ఇంతకు మునుపు కూడా పలుమార్లు సీఐ మాధవి ఇటువంటి ఎన్నో ఘటనలకు అమ్మవలే స్పందించి మంచి తనాన్ని చాటుకున్నారు.