రాజన్న ఆలయం మూసివేత | Vemulawada Rajanna Temple Closed For Corona Virus Amid In Karimnagar | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయం మూసివేత

Published Fri, Mar 20 2020 8:27 AM | Last Updated on Fri, Mar 20 2020 8:46 AM

Vemulawada Rajanna Temple Closed For Corona Virus Amid In Karimnagar - Sakshi

సాక్షి, వేములవాడ: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా వేములవాడ రాజన్న గుడిని ఆలయ అధికారులు గురువారం రాత్రి నుంచి మూసివేశారు. ఈ నెల 31 వరకు భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండబోవని ఈవో కృష్ణవేణి ప్రకటించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు. ఆలయం తెరచిన తర్వాతనే దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఎప్పుడు తెరిచేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అప్పటి వరకు భక్తులు ఆలయానికి రావద్దని కోరారు. 1980లో కలరా వ్యాపించడంతో ఆ సమయంలో 40 రోజులపాటు రాజన్నగుడిని మూసివేశారని, మళ్లీ కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పుడు మూసివేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.  

మూసివేయడంతో భక్తులు లేక వెలవెలబోతున్న కోనేరు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement