rajanna temple
-
గోశాలలో గోవుల గోస
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న గోశాలలో వసతులు కరువయ్యాయి. భక్తుల విశ్వాసంగా నిలిచే కోడెమొక్కుల కోడెలకు కనీస సౌకర్యాలు లేవు. వానకు తడుస్తూ.. ఎండకు ఇబ్బందిపడుతూ ఆరుబయటే ఉంటున్నాయి. చిన్నపాటి వర్షానికే బురదమయమవుతున్న నేలపైనే పడుకుంటున్నాయి. కనీస వసతులు లేక భక్తులు అందించే కోడెలు గోశాలలో ఇబ్బంది పడుతున్నాయి. కనీసం గోవులు నిల్చోలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కోడెమొక్కుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం వసతుల కల్పనపై ఆలయ అధికారులు దృష్టి పెట్టడం లేదు. రూ.కోట్లు వస్తున్నా..వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడెమొక్కులు చెల్లిస్తుంటారు. కోడె మొక్కు టికెట్ ధర రూ.200 ఉంది. అలాగే కోడెమొక్కుల ద్వారా స్వామికి వచ్చే ఆదాయం ఏడాదికి దాదాపు రూ.22 కోట్ల వరకు ఉంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం సౌకర్యాలు లేవు. గోశాలల్లోని కోడెల సంరక్షణకు ఏటా రూ.2 కోట్ల వరకు వెచ్చిస్తున్నా, ఈ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కలి్పంచలేకపోతున్నారు. వసతికి మించిన కోడెలు..రాజన్న ఆలయానికి రెండు గోశాలలు ఉన్నాయి. గుడి చెరువు కట్ట కింద ఉన్న గోశాలలో 150 కోడెలు, 20 ఆవులు ఉన్నాయి. రాజన్నకు మొక్కులు చెల్లించే కోడెలను, ఆవులను ఉంచుతారు. తిప్పాపూర్‌లో రెండో గోశాల ఉంది. ఇక్కడ 300 కోడెల కోసం రేకులòÙడ్డు వేశారు. కానీ ఆరు నెలల క్రితం కోడెలను రిజి్రస్టేషన్ ఉన్న గోశాలకు ఇవ్వకుండా..అధికారులను తప్పుదోవ పట్టించి తీసుకెళ్లడంతో అప్పటి నుంచి ఇతర గోశాలలకు రాజన్న కోడెలు, ఆవులను ఇవ్వడం లేదు. కోడెలను తిప్పాపూర్ గోశాలలోనే సంరక్షిస్తున్నా రు. ఇక్కడ 300 కోడెలకు వసతి ఉండగా..ప్రస్తుతం 1,600 కోడెలు ఉన్నా యి. దీంతో చిన్నపాటి వర్షానికే గోశాల బురదమయం కావడంతో కోడెలు కనీసం పడుకునే పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక చోట, రాత్రి నుంచి తెల్లారేవరకు మరో చోట కోడెలను ఉంచుతున్నారు.తడిస్తే వ్యాధుల బారినపడే అవకాశం ఉంది వర్షాకాలంలో పశువులు, ఆవులతో జాగ్రత్తగా ఉండాలి. వర్షంలో తడిస్తే బలహీనమై వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. కాళ్లు మెత్తబడి డెక్కల్లో పుండ్లు అవుతాయి. సరిగా తినలేకపోతాయి. ఎప్పటికప్పుడు పేడ తియ్యకపోతే ఏదైనా ఒక్క ఆవుకు రోగం వస్తే అన్ని ఆవులకు సంక్రమించే అవకాశం ఉంది. బురద ఎక్కువైతే కాలు జారి కిందపడే అవకాశాలు ఉన్నాయి. – ప్రశాంత్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి, వేములవాడ త్వరలోనే అందిస్తాంభక్తులు అందించిన కోడెలను తిప్పాపూర్ గోశాలలో సంరక్షిస్తున్నాము. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉన్నాయి. ఆలయ అధికారులతో కమిటీ నియామకానికి కలెక్టర్‌కు ఫైల్ పంపించాం. కమిటీ ఆదేశాలతో కోడెలను రైతులకు, రిజిస్ట్రేషన్ ఉన్న గోశాలలకు అందిస్తాం. వారం రోజుల్లోగా ఆదేశాలు వస్తాయని అనుకుంటున్నాం. – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో -
వేములవాడ రాజన్న సన్నిధిలో విషాదం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. రాజన్న దర్శనం కోసం వచ్చిన ఓ భక్తురాలు.. క్యూ లైన్ కుప్పకూలి కన్నుమూసింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ లింగాపూర్‌కు చెందిన లక్ష్మి తన కుటుంబంతో సోమవారమే రాజన్న ఆలయ సన్నిధికి చేరుకుంది. అయితే.. దర్శనం కోసం ఇవాళ వేకువఝామున ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చున్నారు. ఈ క్రమంలో తనకు అస్వస్థతగా ఉందని చెబుతూనే ఆమె కుప్పకూలిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. లక్ష్మిని పరిశీలించిన వైద్యులు.. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించారు. ఆలయ ప్రాంగంలోనే ఆమె కన్నుమూయడం, లక్ష్మి కూతురి రోదనలు చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. -
కోడెమొక్కు చెల్లించుకున్న ముస్లిం మహిళ
వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన అప్సర్ షాహిన అనే ముస్లిం మహిళ మంగళవారం కోడె మొక్కు చెల్లించుకున్నారు. రాజన్న క్షేత్రంలో హిందూ ఆలయాలతోపాటు దర్గా కూడా ఉంది. కులమతాలకు అతీతంగా ఇక్కడ దర్శనాలు జరుగుతాయి. రాజన్నను దర్శించుకున్న వారు దర్గాను, దర్గాను దర్శించుకున్న వారు రాజన్నను దర్శించుకుంటుంటారు. ఇందులో భాగంగానే అప్సర్ షాహిన కోడెమొక్కు చెల్లించుకుని మతసామరస్యాన్ని ప్రదర్శించారు. -
రాజన్న సన్నిధిలో కార్తీక సందడి
సాక్షి, వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. నెల రోజులపాటు స్వామివారు భక్తుల విశేష పూజలందుకుంటారు. ఆదివారం అమావాస్య అయినప్పటికీ రాజన్నను దర్శించుకునేందుకు 10 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. కార్తీకదీపాలు వెలిగించి, మొక్కు తీర్చుకున్నారు. కోవిడ్–19 నిబంధనల మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న సాయంత్రం 6.30 గంటలకు విఠలేశ్వర స్వామికి శ్రీకృష్ణతులసీ కల్యాణం జరిపిస్తున్నట్లు స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ తెలిపారు. 28న వైకుంఠ చతుర్ధశిని పురస్కరించుకుని శ్రీఅనంతపద్మనాభ స్వామి వారికి 12 మంది రుత్విజులతో మహాభిషేకం జరపనున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు రాత్రి 7.30 గంటలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి మహాపూజ, పొన్నసేవపై స్వామివార్లకు ఊరేగింపు, రాత్రి 8 గంటలకు జ్వాలాతోరణం, 10.30 గంటలకు స్వామివారి నిషిపూజ అనంతరం మహాపూజ ఉంటుందన్నారు. వేములవాడలో దీపావళి వేడుకలు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దీపావళి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు ఉదయం స్వామివారి సన్నిధిలో నిత్యపూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు గంటన్నరపాటు కల్యాణ మండపంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో ధనలక్ష్మీ పూజ ఘనంగా జరిపించారు. అనంతరం శ్రీపార్వతీరాజరాజేశ్వర స్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వార్ల ఉత్సవమూర్తులను గజ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. పూజలు చేస్తున్న అర్చకులు కార్తీకం.. సర్వపాప హరణం! కరీంనగర్ కల్చరల్/విద్యానగర్(కరీంనగర్): కార్తీకమాసం శివుడికి ప్రీతికర మాసం.. అందుకే దీన్ని పవిత్రమాసంగా భావిస్తారు.. సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది.. ఈ మాసంలో దీపారాధన చేయ డం ద్వారా సర్వపాపాలు హరించుకుపోతాయని ప్రజల నమ్మకం. తెల్లవారుజామునే నిద్రలేవడం.. కతికా నక్షత్రం అస్తమించేలోగా స్నానమాచరించడం, భోళాశంకురుడికి నిత్యం రుద్రాభిషేకం చేయడం, మెడలో రుద్రాక్షలు, తులసీ పూసల్ని ధరించడం, ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం వంటి సంప్రదాయాలను ఆచరిస్తారు. కతికా నక్షత్రానికి అధిపతి అగ్ని, అగ్నికి మారుపేరు రుద్రుడు. ప్రతీ ఆలయంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వారికి పుత్రులు, దరిద్రులకు ధనం, పురుషులకు గహస్తులు, భోగమోక్షాలు లభించడంతో పాటు వానప్రస్థ ఆశ్రమాలలో ఉండే వారికి జ్ఞాన వైరాగ్యత, స్త్రీలకు మోక్షం, మహాపుణ్యం కలుగుతాయి. కార్తీకమాసం నేపథ్యంలో దానాలు, పూజలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. శైవక్షేత్రాల్లో అర్చనలు, అభిషేకాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రాంతాల్లోని శివక్షేత్రాల్లో అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేక ఉంది. ఈ రోజు దీపదానాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. దానం.. శుభప్రదం కార్తీక మాసంలో ఉసిరికాయలు దానం చేయడం ద్వారా సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగుతుంది. శివపూజ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ జరుగుతుంది. గుమ్మడి కాయ దానం చేయడం వల్ల యమదూతలు దూరంగా ఉంటారు. ఆవు నెయ్యితో వత్తులు వెలిగించి, ఆకుడొప్పల్లో ఉంచి, నీటి ప్రవాహంలో వదలడం, కుమార్తెలకు వివాహాలు, కుటుంబ సభ్యులతో వనభోజనాలు, ఉసిరి, తులసి చెట్లకు పూజలు, విష్ణుమూర్తి కల్యాణం, నాగుపాములకు పూజలు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి పూజలు, దీపారాధన చేయడం మహా మహిమోపితమైనది. ఇంటి ఎదుట ముగ్గులు పెట్టి, తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి గౌరీ పూజలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. ధాత్రి అంటే ఉసిరి. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. లక్ష బిల్వార్చనలు, అభిషేకాలు, కాగడ హారతులు, కార్తీక స్నానాలు, మారేడు పత్రాలతో ఈశ్వరుడిని ఆరా ధిస్తే శుభాలు కలుగుతాయని వేదపండితులు చెబుతున్నారు. దీపం.. మోక్ష మార్గం దీపంలో ప్రమిద, వత్తి, నూనె, అగ్ని, వెలుగు.. వీటిలో దేనికదే ప్రత్యేకం. ప్రమిద మనసుకు, వత్తి దైవ స్మరణకై ఆసక్తి, నూనె జ్ఞానానికి, అగ్ని అజ్ఞానాన్ని తొలగించే నిప్పురవ్వకు, వెలుగు మనుషుల్లోని చెడు స్వభావాలను తొలగించి, మోక్ష మార్గానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా మహిళలు దేవాలయాల్లో దీపాలను సమర్పిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, దాస్యం, వందనం, పాద సేవనం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే తొమ్మిది భావనలతో పూజలు చేస్తారు. విష్ణు కథాశ్రవణంతో పరీక్షిత్తుడు, కీర్తనతో వ్యాసుని కుమారుడు శుఖుడు, నారదుడు, స్మరణతో ప్రహ్లాదుడు, అర్చనతో పథు చక్రవర్తి, దాస్యంతో హనుమంతుడు, గరుత్మంతుడు, వందనంతో అక్రూరుడు, పాదసేవతో లక్ష్మి, భార్గవి, సఖ్యంతో అర్జునుడు, ఆత్మనివేదనంతో బలి చక్రవర్తి పుణ్యలోకాలను చేరుకున్నారని వేద శాస్త్రాలు ప్రవచిస్తున్నాయి. ఈ కారణంగానే తొమ్మిది రకాల భక్తి భావనలతో పౌర్ణమి రోజు దీప ప్రదానంతో పుణ్యలోకాలను అందుకునేందుకు ప్రయత్నిస్తారు. మని షి పతనానికి హేతువులైన అరిష«ఢ్వర్గాలను జయించేందుకు గోధుమ పిండితో ఆరు దీపపు ప్రమిదలను చేసి, నెయ్యితో వెలిగిస్తారు. సకల శాంతి, సౌభాగ్యాల కోసం ధాత్రి నారాయణ, తులసీ కల్యాణం జరుపుతారు. కార్తీక మాసోత్సవం.. కీసర: ప్రఖ్యాత శైవ క్షేత్రమైన కీసరగుట్టలో సోమవారం నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. దాదాపు నెల రోజుల పాటు కీసరగుట్టలో కొనసాగనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలకు నగర నలుమూలల నుంచి కీసరగుట్ట శ్రీభవానీరామలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ, ఈఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మొదటిరోజు సోమవారం ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఆకాశదీపోత్సవంతో పూజలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశానుసారం గుట్టలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో గర్భాలయ అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వత్రాలు, అన్నదానం తదితర వాటిని రద్దు చేశామని వారు వివరించారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలన్నారు. -
రాజన్న ఆలయం మూసివేత
సాక్షి, వేములవాడ: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా వేములవాడ రాజన్న గుడిని ఆలయ అధికారులు గురువారం రాత్రి నుంచి మూసివేశారు. ఈ నెల 31 వరకు భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండబోవని ఈవో కృష్ణవేణి ప్రకటించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు. ఆలయం తెరచిన తర్వాతనే దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఎప్పుడు తెరిచేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అప్పటి వరకు భక్తులు ఆలయానికి రావద్దని కోరారు. 1980లో కలరా వ్యాపించడంతో ఆ సమయంలో 40 రోజులపాటు రాజన్నగుడిని మూసివేశారని, మళ్లీ కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పుడు మూసివేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మూసివేయడంతో భక్తులు లేక వెలవెలబోతున్న కోనేరు -
రాజన్న ఆలయంలో చోరీ!
వేములవాడ: వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించే కానుకల చోరీ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత నెల 23, ఈ నెల 6న హుండీ లెక్కించారు. కానుకలను లెక్కిస్తున్న క్రమంలో హుండీలోని వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఎంత మొత్తంలో ఆభరణాలు చోరీకి గురయ్యాయో తెలియరాలేదు. కాగా, వేములవాడలోని శాస్త్రీనగర్‌కి చెందిన ఫిరోజ్ నిత్యం రాజన్న గుడిలో భక్తులు ఆలయంలోని విగ్రహాలపై చల్లిన బియ్యం సేకరించి అమ్ముకుంటుంటాడు. కొద్ది రోజుల క్రితం క్యూలైన్ల వద్ద బియ్యం సేకరిస్తున్న క్రమంలో కార్పెట్ల కింద ఓ సంచిని చూశాడు. అందులో అభరణాలు ఉండటంతో వీటిని అమ్మేందుకు కరీంనగర్ వెళ్లాడు. అనుమానం వచ్చిన వ్యాపారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం సీసీఎస్ పోలీసులు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు గురువారం అప్పగించారు. ఆభరణాలు ఎలా బయటకు వచ్చాయి? అనే కోణంలో టౌన్ సీఐ వెంకటస్వామి దర్యాప్తు చేస్తున్నారు. -
వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీనివాసుడి కల్యాణం
-
‘రాజన్నా.. ఇదేం లెక్క!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల) : జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన దుబ్బరాజన్న ఆలయానికి ఈ ఏడాది భారీగా ఆదాయం సమకూరింది. అయితే అదేస్థాయిలో ఖర్చులూ పెరిగిపోయాయి. ఈ వ్యవహారం ఆలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆదాయం భారీగానే వచ్చినా.. ఎప్పుడూ చిల్లిగవ్వ మిగలేదికాదని, ఏయేడు ఖర్చును బాగా తగ్గించి స్వామివారి పేరున రూ.8 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేశామని ఆలయ అధికారులు చెబుతున్నా.. ఆలయ ఆదాయ, వ్యయాలపై వారం క్రితం జరిగిన సమావేశంలో విడుదల చేసిన కాపీలను భక్తులు జిరాక్స్తీసి.. ప్రజలకు పంచుతూ.. ఖర్చులు ఇలా ఉంటే.. ఆలయం ఎలా అభివృద్ధి సాధిస్తుందంటూ ప్రచారం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇదీ ఆలయ చరిత్ర జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో.. సారంగాపూర్ మండలం పెంబట్ల–కోనాపూర్ గ్రామ సరిహద్దుల్లో ఉంటుందీ ఆలయం. 1982లో ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి చేరింది. ఇసుకదిబ్బపై స్వయంభూగా వెలిసిన ఆలయం కావడంతో అనతికాలంలో ప్రసిద్ధి చెందింది. రూ.40 వేల ఆదాయంతో ప్రారంభమైన ఆలయ ప్రస్థానం.. ఇప్పుడు రూ.కోటికి చేరింది. 2017–18 ఆదాయ, వ్యయాలు స్వామివారికి భక్తుల ద్వారా మొత్తం ఆదాయం రూ. 84,87,887గా వచ్చింది. ఇందులో నికర ఆదాయం రూ.74,75,191. ప్రారంభ బ్యాంక్ నిలువ రూ.10,12,696. స్వామివారి హుండీ ద్వారా రూ.27,48,953, కోడెమొక్కు ద్వారా రూ. 11,47,650, అభిషేకం ద్వారా రూ.3,34,000, అన్నపూజ ద్వారా 84వేలు, కుంపటి 46,620, గజశూలం 13,860, గదుల కిరాయిద్వారా రూ.20,500 వచ్చింది. ప్రత్యేకాభిషేకం 80,800, కేశఖండనం ద్వారా రూ.35,010, పెద్ద వాహనపూజ రూ.17,800, ద్విచక్రవాహన పూజ రూ.27,100, వివాహాల ద్వారా రూ.8,848, ఆంజనేయ, నవగ్రహపూజల ద్వారా రూ.3 వేలు, గండదీపంతో రూ.98,740, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.3,40,350, శావతో రూ.10వేలు, లడ్డూప్రసాదంతో రూ.6,58,805, పులిహోరతో రూ.4,54,560, నిజకోడే మొక్కు రూ.2,232, స్వామివారి కల్యాణం రూ.1,37,500, కొబ్బరికాయలు, పూజసామగ్రి వేలం ద్వారా రూ.5.50లక్షలు, తలనీలాలు రూ.2,05,555, కొబ్బరిముక్క ల వేలం రూ.1.75లక్షలు, కోడెల వేలం రూ. 1,31,378, కల్యాణకట్నాలు రూ.33, 940, బ్యాం క్ వడ్డీలు రూ.55,637, విదేశీ కరెనీ రూ.12,150, ఇతర ఆదాయం రూ.41,203గా సమకూరింది. ఖర్చులు ఇలా.. స్వామివారి ఆదాయం నుంచి మొత్తం రూ. 84,87,887 ఖర్చు చేశారు. ఇందులో వ్యయం రూ.76,29,139, ముగింపు నగదు నిలువ రూ. 1,57,650, ముగింపు బ్యాంక్ నిలువ రూ. 7,01, 103గా పేర్కొన్నారు. పద్దుల వారీగా పరిశీలిస్తే .. అర్చక, సిబ్బంది వేతనాలు రూ.14,28,633, నివేదనకు రూ.98,870, ప్రింటింగ్, స్టేషనరీ, పోస్టేజీ రూ.79,727, కరెంటు బిల్లు, సామగ్రి, మరమ్మతు రూ.1,75,069, మహాశివరాత్రి జాతరకు రూ.9,46,198, ఇతరాలు రూ.11,09,868, కంట్రిబూషన్ కింద రూ.11,08,414, ఆరోగ్యం, పారిశుధ్యం రూ.87,385, మైనర్ రిపేర్స్ రూ. 1,80,542, ఫర్నిచర్ రూ.26,400, నాయీబ్రాహ్మణ వారి ప్రతిఫలం రూ.4,500, ప్రసాదం తయారీ రూ.6,90,180, రుద్రాభిషేకం రూ.12,055, ఏడా ది పండగల ఖర్చు రూ.2,24, 023, అధికారుల టీఏ, డిఏ రూ.12,410, రంగులకు రూ. 1,21,337, అన్నదానం రూ. 2,92,146, ప్రచార ఖర్చు రూ.1,66,679, వీఐపీలు రూ.29,710, ఎఫ్డీఆర్ రూ.8లక్షలు, కోర్టు ఖర్చులు రూ.10వేలు, కోనేరురిపేర్, నిర్వహణకు రూ.38,450, ధర్మకర్తల అలవెన్స్ రూ.1.10లక్షలు, లాకర్కిరాయి రూ.8,576, చౌల్ట్రీ రిపేర్స్ రూ.40వేలు, చలవ పందిళ్లు, టెంట్లు రూ.1,98,020, పూజ సామగ్రి రూ.79,738, కొడెల నిర్వహణ రూ.39,940, బ్యాంక్ చార్జీలు రూ.3,169, లేబర్ చార్జీలు రూ.56,230, ధార్మిక కార్యక్రమాలు రూ.29,275, గ్రాట్యూటీ రూ.2 లక్షలు ఖర్చు చేశారు. -
రాజన్న సన్నిధిలో అపరిశుభ్రత
సాక్షి, వేములవాడ : కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న వేములవాడ రాజన్న గుడి వద్ద అపరిశుభ్రం రాజ్యమేలుతోంది. ఏటా లక్షలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న ఈ క్షేత్రంలో పారిశుధ్యం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, భక్తులు పడేసిన విస్తర్లు, చెత్త, ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. రద్దీ సమయంలో ఇంకా చెత్త పెరిగిపోయి పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోందని భక్తులు మొత్తుకుంటున్నారు. చెత్త కుప్పలు.. మలినాలు రాజన్న ఆలయ ఆవరణతోపాటు క్యూలైన్ల వెంట చెత్తకుప్పలు, మలినాలు దర్శనమిస్తున్నాయి. ఇక క్యూలైన్లలోని మరుగుదొడ్ల వద్ద ముక్కులు మూసుకునే దుస్థితి నెలకొంది. ప్రధానాలయం ముందు భాగంలో చెత్త కుప్పలు అలాగే పడి ఉంటున్నాయి. రాజగోపురం వద్ద ప్లాస్టిక్ కవర్లు, చెత్త దర్శనమిస్తోంది. ధర్మగుండం వద్ద పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. ఏటా పారిశుధ్యం నిర్వహణకు ఆలయం నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తులకు మాత్రం స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ఆలయ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
శివయ్యా.. ఏదీ గంగమ్మ..!
వేములవాడ: ఎములాడ రాజన్నను దర్శించుకునే ముందుకు భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం, సుందరీకరణలో భాగంగా గుడిచెరువును మట్టితో నింపి చదును చేయడంతో పక్కనే ఉన్న రాజన్న ధర్మగుండంలో నీళ్లు అడుగంటాయి. ఉన్నకొద్దిపాటి కలుషిత నీటిలో కొందరు స్నానానాలు కానిచ్చేస్తుండగా, చాలామంది వెనుదిరుగుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ఆలయ అధికారులు చేష్టలుడిగి చూడడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. శివునికే నీటి కటకట.. గంగను ఒదిగిన గంగాధరుడు శివుడు.. అలాంటి శివయ్యకే నీటికటకట ఎదురైంది. తమ ఇలవేల్పు ఎములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకుని కోర్కెలు తీర్చుకోవాలని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ధర్మగుం డంలో స్నానాలు చేయడం గగనంగా మారింది. అడుగంటిపోయిన నీటితో అవస్థలు పడుతున్నారు. లోతైన ధర్మగుండంలోకి మెట్లపైనుంచి దిగి ఉన్నకొద్దిపాటి మురుగునీటిలోనే స్నానా లు చేసి పైకి రావడం చుక్కలను చూపిస్తోంది. గుండం స్నానాలు శ్రేష్ఠం.. ధర్మగుండంలో స్నానాలు చేయడాన్ని భక్తులు శ్రేష్ఠంగా భావిస్తారు. చలిని సైతం లెక్కచేయ తొలుత పుష్కరిణిలో స్నానాలు చేస్తారు. ఆ త ర్వాతే క్యూలైన్లలోకి వెళ్లి కోడెమొక్కు, ఇతర మొ క్కులు చెల్లించుకుంటారు. ధర్మగుండంలో ఇ ప్పుడు నీళ్లులేక స్నానాలు ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ధర్మగుండంలోకి దిగి మెట్ల ద్వారా పైకి ఎక్కేందుకు అవస్థలు పడుతున్నారు. కొందరు ధర్మగుండంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ కింద స్నానాలు చేస్తున్నారు. ముందుచూపు లేదు.. రాజన్నను దర్శించుకునేందుకు రెండు నెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కానీ, ధర్మగుండంలోని నీటికొరతను అధిగమించాలనే ఆలోచన రాజన్న ఆలయ అధికారులకు రాలేదు. ఓవైపు ఎల్ఎండీ, మధ్యలో మిడ్‌మానేరులో నీరున్నా ఇక్కడకు తరలించేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయడంలేదు. అధికారుల ముందుచూపు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి. తానం ఎట్ల జేసుడు? రాజన్నకు మొక్కు చెల్లించుకునేందుకు వచ్చినం. గుండంలో నీళ్లులేవు. తానం ఎట్ల జేసుడో అర్థమైతలేదు. ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా గుండంల నీళ్లు ఉంచకపోతే ఎట్లా..? అధికారులు గింత నిర్లక్ష్యం జేయొద్దు. – రాజేశ్వరి, భక్తురాలు, వరంగల్ నీళ్లు నింపుతాం మహాశివరాత్రి జాతర వరకు ధర్మగుండంలో నీళ్లు నింపుతాం. ఇందుకోసం ఎల్ఎండీ పైప్‌లైన్ వినియోగిస్తాం. మరికొన్ని బోర్లు కూడా ఏర్పాటు చేస్తాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాం. – దూస రాజేశ్వర్,రాజన్న ఆలయ ఈవో -
క్యాంటీన్లో కలెక్టర్ భోజనం
వేములవాడ: జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదివారం స్వామివారి క్యాంటీన్‌కు చేరుకుని సామాన్య భక్తుడిలా రూ. 25 చెల్లించి టోకెన్ తీసుకుని భోజనం చేశారు. జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చారు. అనంతరం స్వామి వారి క్యాంటీన్ భోజనం బాగుందంటూ ఆలయ ఈవో దూస రాజేశ్వర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్‌కు చెప్పారు. మెట్లపై కూర్చుండి షూ తొడుక్కుని తిరిగి వెళ్లిపోయారు. క్యాంటీన్‌కు చేరుకున్న కలెక్టర్‌ను చూసిన భక్తులు వావ్ కలెక్టర్ అంటా అని చెప్పుకున్నారు. రాజన్నను దర్శించుకున్న కలెక్టర్ వేములవాడ రాజన్నను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ క్యూలైన్లలో వచ్చి స్వామివారిని బయట నుంచే దర్శించుకున్నారు. అనంతరం అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. నగరపంచాయతీ కమిషనర్‌పై ఫైర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంకు చౌరస్తా, జాతరగ్రౌండ్ ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగిపోయాయి. అలాగే ప్రైవేట్ హౌస్‌లను లాడ్జ్‌లుగా నిర్వహిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారంటూ నగరపంచాయతీ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్‌పై జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఫైర్ అయ్యారు. వెంటనే ఆక్రమణలు తొలగించాలనీ, ప్రైవేట్ లాడ్జ్‌ల లిస్టును తమకు సమర్పించాలని ఆదేశించారు. తక్షణమే వాటిని తొలిగిస్తామని కమిషనర్, కలెక్టర్‌కు సమాధానమిచ్చారు. పోలింగ్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల హైస్కూల్లోని కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, అర్బన్ కాలనీ కేంద్రాన్ని డీఆర్వో తనిఖీ చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంపై ఆరా తీశారు. అంగన్వాడీ టీచర్లకు తగు సూచనలు చేశారు. వారి వెంట తహసీల్దారు నక్క శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వాటర్ బెడ్ పరిశీలన వేములవాడఅర్బన్: అర్బన్ మండలంలోని నాంపల్లిలో కరీంనగర్ డ్యామ్ నుంచి వేములవాడకు వచ్చే మంచినీటి వాటర్ బెడ్‌ను, నందికమాన్ నుంచి తిప్పాపూర్ వరకు రోడ్డును కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ విశ్వజిత్ అదివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి కోరత ఉండకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం నాంపల్లి గుడికట్ట మీద ఉన్న పైపులైన్‌ను పరిశీలించారు. ఆలయ ఈవో దూస రాజేశ్వర్, నగరపంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్, డీఎస్పీ అవధాని చంద్రశేఖర్, పట్టణ సీఐ వెంకటస్వామి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వాహన పూజలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం
సాక్షి, వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో వాహన పూజలో అపశృతి దొర్లింది. రాజన్న ఆలయం ముందు వాహన పూజ చేస్తుండగా నిలిపి ఉంచిన బొలెరో వాహనం ఒక్కసారిగా ముందుకు దూకి క్యూలైన్లోకి దూసుకెళ్లింది. దర్శనం కోసం వేచి ఉన్న ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. బాధితులను ఆసుపత్రికి తరలించారు. హైద్రాబాద్ మియాపూర్‌కు చెందిన లక్ష్మి, నరసింహస్వామి దంపతులు గాయపడగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని ఆలయ అధికారులు పరామర్శించారు. -
రాజన్న గుడిచెరువులో శివద్వీపం
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి గుడిచెరువులో శివద్వీపం నిర్మించేందుకు వీటీడీఏ నిర్ణయించింది. వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ(వీటీడీఏ) వైస్ చైర్మన్ ఎం.పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో నాలుగు గంటలపాటు సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ వేములవాడలో రెండు పర్యాయాలు పర్యటించి వెళ్లాక రాజన్న గుడి, నాంపల్లిగుట్ట, పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా వీటీడీఏ ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.400 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ఓ పర్యాయం శృంగేరి పీఠాధిపతి అనుమతి తీసుకున్నారు. వీటిపై రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కమిటీ పరిశీలించింది. రాజన్నగుడి అభివృద్ధి కోసం 35 ఎకరాల్లో పనులు చేపట్టాలని, గుడిచెరువులోని 9 ఎకరాల్లో శివద్వీపం ఏర్పాటు చేసి శివుని భారీ విగ్రహం నెలకొల్పాలని, కట్టకింద బస్టాండ్‌ను రైల్వేస్టేషన్‌తో అనుసంధానించాలని, అక్కడి నుంచి భక్తులు నేరుగా ఆలయంలోకి వచ్చేందుకు ర్యాంపు ఏర్పాటు చేయాలని, బద్ధిపోచమ్మ ఆలయంలో రూ.20 కోట్ల వ్యయంతో బోనాల మంటపం నిర్మించాలని, సంకెపల్లి వద్ద చెక్‌డ్యాం నిర్మించి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని తీర్మానించారు. గుడిచెరువులో ఏడాదిపొడవునా గోదావరి జలాలు అందుబాటులో ఉండేలా రూ.17 కోట్ల వ్యయంతో మిడ్‌మానేరు డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారు. తుది నివేదికను త్వరలో సీఎం కేసీఆర్‌కు సమర్పించాలని భావిస్తున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు, వీటీడీఏ సెక్రటరీ భుజంగరావు, ఈవో దూస రాజేశ్వర్, ఈఈ రాజయ్య, డీఈ రఘునందన్, ఆర్కిటెక్ నాగరాజు, ముక్తేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నిర్వాసితుల కోసం తొలివిడత పరిహారంగా ఆదివారం రూ.6.38 కోట్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే రమేశ్‌బాబు తెలిపారు. -
రాజన్న ఆలయ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడలోని రాజన్న దేవాలయం లడ్డూ విభాగం సూపరింటెండెంట్ నామాల రాజేందర్ ఇంట్లో గురువారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో రాజేందర్ ఇంట్లోనేగాక వేములవాడలోగల ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్ గౌడ్ తో పాటు 40 మంది సిబ్బంది ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాజేందర్ బంధువులైన వియ్యంకుడు కోళ్ల శ్రీనివాస్, బావ కపిల్ శ్రీనివాస్, సోదరుడు శ్రీనివాస్ ఇండ్లతో పాటు హైదరాబాద్ లోని వియ్యంకుడి ఇంటిలో కూడా దాడులు జరుగుతున్నాయి. డాక్టుమెంట్లు, బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తులు, బ్యాంక్ లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నారు. సాయంత్రం వరకు పూర్తి వివరాలు తెలియజేస్తామని సుదర్శన్‌గౌడ్ చెప్పారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో ఆలయ ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. మిగతా బంధువులు అప్రమత్తం అయినట్లు సమాచారం. -
రాజన్న లడ్డూ భోగం ధరలు మరింత ప్రియం
వేములవాడ: ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి(రాజన్న) లడ్డూ భోగం ప్రసాదాలు మరింత ప్రియం అయ్యాయి. వీటి ధరలను దేవాదాయ శాఖ భారీగా పెంచేసింది. లడ్డూ భోగం (40 లడ్డూలు) రూ.400లు ఉండగా దానిని రూ.700లకు పెంచింది. సిరా భోగం రూ.౩౦౦ నుంచి రూ.600 లకు, దధ్యోజనం రూ.150 నుంచి రూ.300 లకు పెంచింది. పెరిగిన ధరలు ఈ నెల 13వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఇ.ఒ. దూస రాజేశ్వర్ తెలిపారు. -
వెములవాడ రాజన్న ఆలయంలో జ్వాలతోరణం
-
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం ఈ రోజే ప్రారంభమైంది. -
రాజన్న గర్భగుడి ప్రవేశాలు నిలిపివేత
వేములవాడ : వేములవాడ రాజన్నను ఆదివారం 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు పూర్తి చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని గమనించిన ఆలయ అధికారులు గర్భగుడి ప్రవేశాలను నిలిపివేశారు. సోమవారం సైతం గర్భగుడి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం రూ.32 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాజన్న ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు మహారుద్రాభిషేకాన్ని వైభవంగా జరిపించారు. తొలుత పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వీయ పర్యవేక్షణలు ఇక్కడి అనువంశిక అర్చకస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్ఛారణలతో ఆలయం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో గౌరీనాథ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. గోవులకు ఎండు గడ్డి దానం రాజరాజేశ్వరస్వామి గోశాలలో ఉన్న కోడెలకు వరి గడ్డిని ఓ రైతు ఆలయ అధికారులకు ఆదివారం అందజేశారు. ఇల్లంతకుంట మండలం రైకనపేట గ్రామానికి చెందిన కె.అంజయ్య అనే రైతు 8 క్వింటాళ్ల ఎండు గడ్డిని తన సొంత ఖర్చుతో తిప్పాపురంలో ఉన్న గోశాలకు ట్రాక్టర్లో తెచ్చి అధికారులకు అప్పగించారు. ఆలయ అధికారులు వెంకటేశ్వరశర్మ, శంకర్లు రైతును అభినందించారు. -
రాజన్న జాతర షురూ.. పోటెత్తిన భక్తులు
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడలో కొలువుదీరిన రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ రోజు నుంచి శివరాత్రి జాతర ప్రారంభం అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. -
రాజన్న ఆదాయం రూ.29.67 లక్షలు
వేములవాడ :వేములవాడ రాజన్నకు 14 రోజుల్లో హుండీ ద్వారా రూ.29,67,925 నగదుతోపాటు 45 గ్రాముల బంగారం, 4 కిలోల 100 గ్రాముల వెండి సమకూరినట్లు ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. స్వామి వారి కళాభవన్‌లో బుధవారం ఆలయ సిబ్బంది, సత్యసాయి సేవాసమితి, శివరామకృష్ణ భజన మండలి సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
కాంట్రాక్టర్ చేతికి కోడెల టికెట్లు
కౌంటర్‌కు తాళం వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలోని కోడె టికెట్లను ప్రైవేట్ వ్యక్తులు విక్రయిస్తున్నారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు కోడి మెుక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో బుధవారం క్యూలైన్లో నుంచి టికెట్లు తీసుకునేందుకు వెళ్లిన భక్తులకు కౌంటర్‌కు తాళం వేసి కనిపించింది. పక్కనే కోడెలకు గట్టి కట్ట, అరటిపండు విక్రయించే కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వ్యక్తి వద్ద కోడెల టికెట్లు కనిపించాయి. కౌంటర్ అతను లేడని, కోడెల టికెట్లు తీసుకోండని సదరు వ్యక్తి టికెట్లు ఇచ్చాడు. టికెట్‌తోపాటు గడ్డి, అరటికాయ కూడా కొనాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో అక్కడికి చేరుకుని యామ తిరుపతి అనే భక్తుడు.. గడి ఎందుకు కొనాలి, కోడె టికెట్ ఇవ్వాలన్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయమై కౌంటర్ వద్ద విధులు నిర్వహించే ఉద్యోగిని వివరణ కోరగా, తనకు అత్యవసరం ఏర్పడడంతో కౌంటర్‌కు తాళం వేసి వెళ్లానని, భక్తులు ఎవరైనా వస్తే కోడెల టికెట్లు ఇవ్వాలని చెప్పినట్లు వివరించాడు. -
రాజన్న ట్రస్ట్‌బోర్డులో 14 మంది సభ్యులు
తాజాగా మంత్రి మండలిలో నిర్ణయం దరఖాస్తులకు వచ్చే నెల 8వరకు గడువు సెప్టెంబర్ రెండో వారంలో నియామకం వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ట్రస్ట్‌బోర్డులో సభ్యుల సంఖ్యను తొమ్మిది నుంచి 14కు పెంచుతూ ప్రభుత్వం సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమైక్య రాష్ట్రంలో ఆలయ కమిటీలో సభ్యుల సంఖ్య తొమ్మిది ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కొత్త కమిటీని నియమించలేదు. దానికి బదులు ప్రభుత్వం సీఎం కేసీఆర్ అధ్యక్షతన వేములవాడ ఆలయ అభివద్ధి అథారిటీ (వీటీడీఏ)ను ఏర్పాటు చేసింది. వైస్‌చైర్మన్‌గా జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తంరెడ్డిని నియమించింది. అప్పటినుంచి సభ్యుల నియామకంలో జాప్యం జరుగుతోంది. మహాశివరాత్రి జాతరకు రెనోవేషన్ కమిటీని నియమించి ఉత్సవాలను నిర్వహించింది. టీఆర్ఎస్ శ్రేణుల నుంచి నామినేటెడ్ పదవులపై ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. సభ్యుల సంఖ్యను పెంచి మరికొంత మందికి అవకాశాలు కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇప్పటికే రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులకు వచ్చేనెల 8వరకు గడువుంది. పలువురు ఆశావహులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబుతోపాటు ఇతర నాయకులను ప్రసన్నం చేసుకుని కమిటీలో చోటు దక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో రాజన్న ధర్మకర్తల మండలి ఏర్పాటు ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. నియోజకవర్గ నాయకులతోపాటు మంత్రులు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాలు, ఉత్తర తెలంగాణలోని అసెంబ్లీ స్థానాల నుంచి సైతం సభ్యులను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ఎమ్మెల్యే రమేశ్‌బాబుపై ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలతో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. -
రాజన్న సన్నిధిలో రద్దీ
వేములవాడ : శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు యాభై వేల మంది తరలివచ్చారు. రద్దీని గమనించిన ఆలయ అధికారులు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. ఉదయం భారీ వర్షం కురియడంతో భక్తులంతా వర్షంలో తడుస్తూనే రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.28 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, హరికిషన్, దేవేందర్ పర్యవేక్షించారు. -
రాజన్న సన్నిధిలో వరుణయాగం
7,8,9 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు వేములవాడ : వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ఆగస్టు 7,8,9 తేదీల్లో రుష్యశృంగ వరుణయాగం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శనివారం ఆలయ కార్యనిర్వహణాధికారి దూస రాజేశ్వర్ అర్చకులు, పూజల విభాగం సిబ్బందితో సమావేశం నిర్వహించి యాగం ఏర్పాట్లపై చర్చించారు. రుష్యశృంగ మహాముని విగ్రహ ప్రతిష్ట, వరుణజపం, స్వామివారికి సంతత ధారాభిషేకం, వరుణయాగహవనంతోపాటు అనుబంధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడు రోజులపాటు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో రాజేశ్వర్ తెలిపారు. భక్తులు రాజన్న దర్శనం, కోడె మొక్కులు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. గతంలో వరుణయాగం ధర్మగుండం పక్కన నిర్వహించేవారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలుగుతున్నట్లు భావించి ఈసారి ఆలయం ముందు భాగంలో యాగశాల ఏర్పాటు చేస్తున్నారు. -
రాజన్నను దర్శించుకున్న చందులాల్
కరీంనగర్: వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి చందులాల్ శనివారం దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజ ఏర్పాట్లను చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. త్వరలోనే ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చుదిద్దుతామని మంత్రి తెలిపారు.