
సాక్షి, వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో వాహన పూజలో అపశృతి దొర్లింది. రాజన్న ఆలయం ముందు వాహన పూజ చేస్తుండగా నిలిపి ఉంచిన బొలెరో వాహనం ఒక్కసారిగా ముందుకు దూకి క్యూలైన్‌లోకి దూసుకెళ్లింది. దర్శనం కోసం వేచి ఉన్న ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. బాధితులను ఆసుపత్రికి తరలించారు. హైద్రాబాద్ మియాపూర్‌కు చెందిన లక్ష్మి, నరసింహస్వామి దంపతులు గాయపడగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని ఆలయ అధికారులు పరామర్శించారు.