vemulavada
-
వేములవాడలో బీజేపీ, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ధర్నా
-
పింక్ చొక్కాలు కాజేసిన భూములను పేదలకు పంచుతాం: మంత్రి పొంగులేటి
సాక్షి,కరీంనగర్జిల్లా: ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం(నవంబర్ 20)వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు.‘నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశాం.రాబోయే నాలుగు ఏళ్ళలో 20 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తాం.ఇందిరమ్మ ఇళ్ళు నిరంతర ప్రక్రియ..ప్రతి పేదవాడికి పక్కా ఇళ్ళు ఉండాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ రెవెన్యూ చట్టం 2024 రాబోతోంది.ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారు.ఆ భూములను ప్రజా ప్రభుత్వం తీసుకుని పేదలకు పంచి పెడుతాం’అని పొంగులేటి తెలిపారు. -
Shivaratri: వేములవాడలో శివరాత్రి శోభ (ఫొటోలు)
-
'ఈ లొల్లి మనకొద్దు బిడ్డో..' జర ఆలోచించు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీల నాయకులు ఎదురుపడితే దాదాపు గొడవకు దిగే పరిస్థితులు ఉంటున్నాయి. పల్లెల్లో వీటన్నింటిని గమనిస్తున్న ఓ తల్లి తన ఆవేదనను కొడుకుతో ఇలా పంచుకుంటుంది.' తల్లి : ఏరా బిడ్డ పొద్దున్నే తయారయ్యావు ఎక్కడికి పోతున్నావు? కొడుకు : ఇంకెక్కడికి అమ్మా ఎన్నికల ప్రచారానికి. ఈసారి అన్న గెలవాలి. తల్లి : మనకెందుకు రాజకీయాలు బిడ్డా. కష్టం చేస్తే కానీ ఇల్లు గడువదు. కొడుకు : అన్న గెలిస్తే మన కష్టాలన్నీ తీరుతాయమ్మా. తల్లి : చేండ్ల పత్తికి నీళ్లు పెట్టాలని, కల్లంలో వడ్లు ఉన్నాయని.. అయ్యా రోజు లొల్లి పెడుతుండ్రా. కొడుకు : పని ఎప్పుడూ ఉండేదేనే అవ్వ. ఓట్లు ఐదోళ్లకోసారి వస్తాయి. మనను నమ్ముకున్నోళ్ల కోసం మనం పనిచేయకపోతే అన్న ఎట్లా గెలుస్తాడే. తల్లి : యాబై ఏళ్లుగా చూస్తున్నాం. మన బతుకుల కన్న వారి బాగోగులే చూసుకుంటున్నారు. నీకు ఇంట్లో చెల్లె ఉంది. బాగా చదివించి పెళ్లి చేయాలే. ఒక్కగానొక్క కొడుకువి. నీకేమైన అయితే మా బతుకులు ఏమి కావాలి బిడ్డా. కొడుకు : ఏ.. ఎందుకు భయపడుతావు అవ్వా. తల్లి : బాగా ఆలోచించు కొడుకా.. మనవి చిన్న బతుకులు. ఆవేశంలో పోయి గొడవల్లో తలదూర్చితే మనకే నష్టం. నీవు గొడవలు పెట్టుకునేది కూడా ఎవరితోనే కాదు మన ఊరోళ్లతోనే. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత మనం చచ్చే వరకు ఊళ్లోనే ఉండాలే బిడ్డా..! మనకు ఏమైనా అవసరం ఉన్న ఈల్లే ముందుండాలే కదరా.. ఈ లొల్లి మనకెందుకు బిడ్డా. కొడుకు : అమ్మా.. నువ్వు చేప్పేది నిజమే. నేను ఎందుకు గొడవకు పోతానే. ఊళ్లో ఎవరూ కనిసించిన అత్తా.. మామ.. బాబాయ్.. పిన్ని.. అన్న.. అని పలకరిస్తా. వాళ్లతో నాకెందుకు గొడవ. తల్లి : నువ్వు చిన్నపిల్లగాడివి బిడ్డా. ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో.. గుర్తించి ఓట్లేద్దాం. డబ్బుకు, మద్యానికి లొంగకు, ఒక్కరోజు బిర్యానీ పెడితే ఐదేళ్లు కడుపు నిండదు. ఐదేళ్లపాటు మనకు కష్టాలు రాకుండా చూసుకుంటూ, మన కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకున్ని గెలిపించుకుందాం బిడ్డా. కొడుకు : అలాగే అమ్మా.. ఈ గొడవలు నాకొద్దు. మంచి చేసే వారికే ఓటేస్తాను. ఏ పార్టీ నాకొద్దు. ఇవ్వాల్లి నుంచి ఏ పార్టీ వాళ్లతోని తిరుగను. చేండ్లకు పోతున్న. నువ్వు చెప్పిట్లే మంచి నాయకునికే ఓటేద్దాం. ఇవి చదవండి: అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే.. -
వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్ రావు
-
వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్ రావు
-
గెలిపిస్తేనే వస్తా.. లేకుంటే మళ్లీ ఇక్కడికి రాను: కేటీఆర్
సాక్షి, వేములవాడ: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే మళ్లీ వేములవాడ వస్తానని, లేదంటే ఇక్కడికి రానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. సోమవారం వేములవాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావు తరపున కేటీఆర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘కేసీఆర్ ఎంత ఉంటడు గింతంత ఉంటడు, ఆయనను కొట్టడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సింహం సింగిల్‌గానే వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి. గిట్ల అన్నందుకు కేసు పెడితే బోయినపల్లి వినోద్ కుమార్‌పై పెట్టండి. ఇప్పుడు జరుగుతున్న పోరాటం వ్యక్తుల మధ్య కాదు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే. కర్ణాటక డిప్యూ టీ సీఎం డీకే శివకుమార్ మన నెత్తిన పాలుపోసి పోయిండు. అక్కడ 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పినందుకు ఇక్కడి కాంగ్రెస్సోళ్లు అతన్ని మళ్లీ ప్రచారానికి పిలవట్లేదు. రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. అవును ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమే. డిసెంబర్3న చూద్దాం ఎవరు గెలుస్తరో. ఢిల్లీ, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్లతో ఏమీ కాదు. తెలంగాణ భవిష్యత్ ఇక్కడి గల్లీలోనే డిసైడ్ కావాలె. కేసీఆర్ అంటే తెలంగాణ భరోసా. సెంటిమెంట్లకు ఆయింట్ మెంట్లకు లొంగవద్దు. రేవంత్ రెడ్డి గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్నాడు’ అని కేటీఆర్ గుర్తు చేశారు. -
వేములవాడలో బీజీపీ నేతల మధ్య టికెట్ ఫైట్
సిరిసిల్ల జిల్లా: తెలంగాణాలో అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో అన్ని పార్టీలు గేరు మార్చి స్పీడును పెంచేశాయి. ఇదిలా ఉండగా వేములవాడలో బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థుల మధ్య టికెట్ కోసం కోల్డ్ వార్ జరుగుతోంది. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ మధ్య టికెట్ వార్ తారాస్థాయికి చేరుకుంది. వివాదాస్పద పోస్టర్లు.. ఇప్పటికే బీజేపీ కార్యాలయంలో టికెట్య్ కోసం దరఖాస్తు చేసుకున్న తుల ఉమ వేములవాడలో పాగా వేసే క్రమంలో 'సాలు దొర - సెలవు దొర' అంటూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ అభివృద్ధికి తనతో కలిసి రావాలని పోస్టర్స్ ద్వారా అభ్యర్ధించారు. బీజేపీ ఆశావహ అభ్యర్థిగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న తుల ఉమ ప్రచార కార్యక్రమానికి పోస్టర్లతో శ్రీకారం చుట్టారు. సాలు దొర - సెలవు దొర పోస్టర్ల పేరిట తుల ఉమ ఓవైపు కేసీఆర్ పాలనను లక్ష్యం చేసుకుని మరోవైపు వేములవాడలో చెన్నమనేని వంశీయుల పాలనపైన కూడా విమర్శనాస్త్రాలను సంధించారు. దీంతో వేములవాడలో బీజేపీ రెండు గ్రూపులుగా చీలిపోయినట్లయింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలో అర్ధంకాక బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. టికెట్ వార్.. వేములవాడలో బీజేపీ టికెట్ బీసీలకే కేటాయిస్తారని ఆ ప్రకారం చూస్తే తమకే టికెట్ దక్కుతుందని తుల ఉమ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఎర్రం మహేష్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కూడా టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా చెన్నమనేని వికాస్ ఎంట్రీతో వేములవాడ బీజేపీలో రసాభాస మొదలైంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
TS Election 2023: ‘ఆది’ నుంచి అదే పోరు!
రాజన్న: వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును ‘ఆది’ నుంచి పౌరసత్వం సమస్య వెంటాడుతూనే ఉంది. కోర్టుల్లో పోరాడుతూనే 2009 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్లు కేటాయించే అంశంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆరసైతం మొట్టమొదటగా రమేశ్‌బాబు పౌరసత్వం అంశాన్ని మాట్లాడుతూ టికెట్టు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. పౌరసత్వం కేసు కోర్టులో ఉన్నందునే వేములవాడలో అభ్యర్థిని మార్చాల్సి వస్తోందని ప్రకటించారు. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తుండగా.. రమేశ్‌బాబు అనుచరులు మాత్రం ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 జూన్‌లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంపాటు దేశంలో లేడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీని విచారణకు ఆదేశించింది. రమేశ్‌బాబు 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నట్లు నివేదికను సమర్పించారు. 2010 ఉపఎన్నికల తర్వాత రమేశ్‌బాబు ఎన్నికను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆది శ్రీనివాస్ ఆశ్రయించారు. దీంతో 2013 ఆగస్టు 14న రమేశ్‌బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటర్ జాబితాలో పేరు తొలగించాలని తీర్పినిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ రమేశ్‌బాబు 2013లో సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా.. కోర్టు స్టే ఇచ్చింది. రమేశ్‌బాబుకు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదనలు కొనసాగుతున్న క్రమంలో ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ తేల్చాలని రమేశ్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ఈ అంశం కేంద్ర హోంశాఖకు వెళ్లింది. రమేశ్‌బాబు విజ్ఞప్తితో కేంద్రహోంశాఖ త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. త్రీమెన్ కమిటీ సైతం రమేశ్‌బాబు మోసపూరితంగా పౌరసత్వం పొందారని తేల్చి చెబుతూ.. ఆగస్టు 31, 2017న పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశాన్ని రివ్యూ చేయాలని మరోసారి కేంద్రహోంశాఖకు రమేశ్‌బాబు విజ్ఞప్తి చేయగా.. జర్మనీ పౌరసత్వం ఉందంటూ డిసెంబర్ 17, 2017న భారతదేశ పౌరసత్వం రద్దు చేసింది. దీనిపై రమేశ్‌బాబు జనవరి 5, 2018న హైకోర్టును ఆశ్రయించగా.. స్టే లభించింది. స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈక్రమంలో హైకోర్టు జూలై 10, 2019న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని కేంద్రహోంశాఖ మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది. కేంద్రహోంశాఖ రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కేసు కొనసాగుతోంది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు, మూడు నెలల్లో తీర్పు వస్తుందన్న అంచనాతో బీఆర్ఎస్ పార్టీ అధినేత టికెట్ చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించినట్లు ప్రకటించారు. నాలుగుసార్లు గెలుపు.. రమేశ్‌బాబు 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 ఉపఎన్నికల సందర్బంగా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి ఆపార్టీ టికెట్‌పై గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. భావోద్వేగ ప్రకటన.. టిక్కెట్టు రాలేదని తెలిసిన తర్వాత ఎమ్మెల్యే రమేశ్‌బాబు భావోద్వేగ ప్రకటన చేశారు. ‘సవాళ్లు వచ్చినప్పుడే ధీటుగా నిలబడాలి. ఎన్నికల కోసం అభ్యర్ధులు వెనువెంటనే పుట్టరు. ప్రజాసేవ ద్వారా ఈ అర్హతలు సంపాదించుకోవాలి. పౌరసత్వంపై అక్టోబర్‌లో మనకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ సమస్య తీరితే మనకు ఆటంకాలు ఉండవు. ఉత్తమంగా పనిచేశానన్న సీఎం గారి వ్యాఖ్యలే మన దశాబ్దకాలం నిస్వార్థ ప్రజాసేవకు నిదర్శనం.’ అంటూ భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు. -
వేములవాడలో భక్తుల రద్దీ
-
వేములవాడలో శివరాత్రి ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం: బండి సంజయ్
-
వేములవాడ: సాంఘిక డిగ్రీ కాలేజీ ఘటనపై కలెక్టర్ ఆగ్రహం
-
ప్రజా గోస బీజేపీ భరోసా.. ప్రజల మద్దతు కోరుతూ మిస్డ్‌కాల్ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ పేరిట నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని గురువారం సిద్దిపేటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభిస్తారు. అనంతరం వేములవాడలో నిర్వహించే బైక్‌ర్యాలీ లోనూ సంజయ్ పాల్గొంటారు. తొలివిడతలో రాష్ట్రంలోని 6 ఎంపీ స్థానాల్లోని, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలను సమాంతరంగా మొదలుపెడతారు. ఈ ర్యాలీలకు తాండూరులో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సిద్దిపేటలో పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్‌రావు, జుక్కల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.వివేక్ వెంకటస్వామి, బోధన్‌లో బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్, నర్సంపేటలో పార్టీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, వేములవాడలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నేతృత్వం వహిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, బైక్ ర్యాలీ ఇంచార్జి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. టీఆర్ఎస్ సర్కార్ అప్రజాస్వామిక, నియంత, కుటుంబపాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు కోరుతూ 6359199199 మొబైల్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకున్న వారు ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. ఫసల్ బీమా, డబుల్ బెడ్రూమ్లు, నిరుద్యోగం, ఇతర అంశాలపై ఇబ్బందులను తెలుసుకుని ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరో 7 నియోజకవర్గాల్లో... త్వరలోనే మరో 7 నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు ప్రారంభమవుతాయని ప్రేమేందర్‌రెడ్డి చెప్పారు. దేవరకద్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఆదిలాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్, వైరాలో ఎంపీ సోయం బాపూరావు, మేడ్చల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి, దేవరకొండలో జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, ఇబ్రహీంపట్నంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కల్వకుర్తిలో బాబూమోహన్ పాల్గొనను న్నారు. ‘100 టీఎంసీలు ఎత్తిపోయనోడివి లక్ష కోట్లకు పైగా డబ్బులు పెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టినట్టు? వరద లతో 1,200 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి’ అని ఆయన సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
ఊరు మునిగింది.. ఉపాధి పోయింది!
ఈ చిత్రంలో ఆటోలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వారు. రుద్రవరం మధ్యమానేరు నిర్వాసిత గ్రామం. ఈ ఊరిలో ఉపాధిహామీ పనులు చూపకపోవడంతో వీరంత ఇతర గ్రామాలకు పనులకు వెళ్తున్నారు. మగవాళ్లయితే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అడ్డకూలీలుగా మారారు. ఉన్న ఊరిలోనే ఉపాధిహామీ పని చూపెట్టాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. సాక్షి,వేములవాడఅర్బన్: మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామస్తులకు ఉపాధిహామీ పని కరువైంది. గతంలో వంద రోజుల పనులు పూర్తి చేసిన వారు సైతం మధ్యమానేరు నిర్వాసిత గ్రామాలలో ఉన్నారు. అయితే వారంతా ఇప్పుడు ఇతర గ్రామాల్లో పనుల కోసం ఆటోలలో వెళ్తున్నారు. మగవారైతే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అడ్డాకూలీలుగా మారిపోయారు. మరికొందరు వాచ్మెన్స్, సెక్యూరిటీగార్డులుగా పనులు చూసుకుంటున్నారు. పని కరువైన నిర్వాసిత కాలనీలు మిడ్‌మానేరు ముంపునకు గురైన సంకెపల్లి, ఆరెపల్లి, రుద్రవరం, అనుపురం, కొడుముంజ, శాభాష్‌పల్లి, చింతాల్‌ఠాణా, చీర్లవంచ, గుర్రవానిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీలుగా ఏర్పాటు చేశారు. ఆయా కాలనీవాసులకు ఉపాధిహామీ పనులు పెట్టడం లేదు. ఒకప్పుడు ఐదు, ఆరు ఎకరాలలో పంటలు పండిస్తూ ధర్జాగా బతికిన వీరంతా ఇప్పుడు కుటుంబ పోషణకు ఇతర గ్రామాలకు కూలీలుగా పనులకు వెళ్తున్నారు. పని కల్పించాలని వేడుకోలు ►మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లోని ఉపాధిహా మీ కూలీలకు జిల్లా అధికారులు స్పందించి పనులు చూపెట్టాలని కోరుతున్నారు. ►బ్యాక్ వాటర్ పక్కన చెరువులు, కుంటలు ఏర్పాటు చేస్తే పని దొరుకుతుందని వారు పేర్కొంటున్నారు. ►జిల్లా అధికారులు స్పందించాలని నిర్వాసిత గ్రామాల్లోని ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉన్న వారు కోరుతున్నారు. గతంలో పనిచేసినం మేము పాత గ్రామం ఉన్నప్పుడు రోజు ఉపాధి హామీ పనికి పోయినం. పునరావాస కాలనీకి వచ్చినప్పటి నుంచి ఉపాధిహామీ పనులు లేవు. ప్రభుత్వం మాకు ఉపాధి కల్పించాలి. – అంగూరి స్వప్న, రుద్రవరం పని చూపెట్టాలి పునరావాస కాలనీకి వచ్చినప్పటి నుంచి పనులు లేక కుటుంబపోషణ ఇబ్బందిగా మారింది. ఉపాధిహామీ పనులు లేవు, కూలి పని లేక ఇంటి వద్దనే ఉంటున్నాం. అధికారులు స్పందించి పని చూపెట్టాలి. – పాముల కనకవ్వ, రుద్రవరం పనులకు వస్తలేరు పునరావాసకాలనీల్లోని కూలీలు ఉపాధిహామీ పనులకు ఇతర గ్రామాలకు రమ్మంటే వస్తలేరు. మారుపాక, చంద్రగిరి గ్రామాలకు ఉపాధి పనులకు తీసుకెళ్తామంటే వస్తలేరు. ఇప్పటికైనా వాళ్లు వస్తే ఉపాధిహామీ పనులు కల్పిస్తాం. – నరేశ్ ఆనంద్, ఎంపీడీవో, వేములవాడ చదవండి: Hyderabad: యువతిపై ప్రేమ.. అప్పటికే పెళ్లి నిశ్చయమైందని తెలిసి.. -
గత జ్ఞాపకాలతో బరువెక్కుతున్న గుండెలు
బోయినపల్లి (చొప్పదండి): కూలిన గోడలు.. శిథిల రోడ్లు.. మోడువారిన చెట్లు.. పాడుబడిన గుడిని చూసి వారి గుండెలు బరువెక్కుతున్నాయి. తాము పుట్టి, పెరిగిన గ్రామాలు జ్ఞాపకాలుగా మిగలడాన్ని చూసి కళ్లు చెమర్చుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్యమానేరులో ముంపునకు గురైన గ్రామాలు ఇప్పుడు తేలడంతో వాటిని చూసిన నిర్వాసితులు ఉద్వేగానికి గురవుతున్నారు. ‘ఇది మా ఇల్లు.. ఇది మా బడి.. అరే అదిగదిగో అంజన్న గుడి’అంటూ పాత జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. మొండి గోడలు, మోడువారిన చెట్లను చూసి చలించిపోతున్నారు. ఈ దృశ్యాలు మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపు నకు గురైన గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మిడ్‌మానేరులో నీటిమట్టం తగ్గడంతో మునిగిన గ్రామాలు తేలాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు నిత్యం వెళ్లి వస్తున్నారు. రోజంతా అక్కడే గడిపి బరువెక్కిన హృదయాలతో తిరిగి వస్తున్నారు. 2019లో మునిగిన గ్రామాలు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టుతో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులో 2018 నుంచి నీరు చేరడంతో ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కాలనీలకు తరలిపోయారు. 2019లో 25 టీఎంసీల నీరు చేరడంతో బ్యాక్‌వాటర్‌లో ముంపు గ్రామాలు మొత్తం మునిగిపోయాయి. రెండేళ్లుగా ప్రాజెక్టులో నీరు నిండుగా ఉండటంతో ఆ గ్రామాల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. నెల రోజులుగా 8 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పది కి.మీ. తగ్గిన బ్యాక్‌వాటర్ మిడ్‌మానేరు ప్రాజెక్టులో 26 టీఎంసీల నీరు చేరితే తంగళ్లపల్లి బ్రిడ్జి, సిరిసిల్ల బతుకమ్మ ఘాట్, సాయినగర్ వరకు 18 కి.మీ. మేర బ్యాక్‌వాటర్ చేరుతుంది. ఇటీవల ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్, ఎల్ఎండీలకు నీరు విడుదల చేయడంతో ఇప్పుడు 8.33 టీఎంసీల జలాలున్నాయి. దీంతో బ్యాక్‌వాటర్ పది కిలోమీటర్లలోపే ఉంది. మిడ్‌మానేరు ప్రాజెక్టు స్వరూపం నీటి సామర్థ్యం 27.55 టీఎంసీలు ప్రస్తుత నిల్వ 8.33 టీఎంసీలు బ్యాక్ వాటర్ 18 కి.మీ. ప్రస్తుత బ్యాక్‌వాటర్ 10 కి.మీ. ముంపు గ్రామాలు 11 ప్రాజెక్టులో సేకరించిన భూమి 20వేల ఎకరాలు ముంపునకు గురైన ఇళ్లు సుమారు 8,500 నిర్వాసిత కుటుంబాలు 11,731 గుండెలు బరువెక్కుతున్నాయి ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గ డంతో నీలోజిపల్లి పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూసేందుకు వెళ్తే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కూలిన గోడలు.. దర్వాజలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – సింగిరెడ్డి బాలమల్లు, నీలోజిపల్లి, బోయినపల్లి తెలియని అనుభూతి ముంపులో మునిగిన ఊరు మళ్లీ కనిపిస్తుందంటే చూసేందుకు వెళ్తున్నారు. మళ్లీ ఆ ఆనవాళ్లు కనిపిస్తాయో.. లేదోనని చాలామంది పాత ఊళ్లు చూసేందుకు వెళ్తున్నారు. పాత గ్రామాలను చూస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అదోరకమైన సంతోషం.. బాధ రెండూ కలుగుతున్నాయి. – ఆడెపు రాజు, వరదవెల్లి, బోయినపల్లి తేలిన గ్రామాలివీ వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభాష్‌పల్లి, రుద్రవరం, బోయినపల్లి మండలం, కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి -
వేములవాడలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
-
‘తాళిబొట్టు’ ఘటనపై విచారణ
ద్రంగి (వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ కార్యాలయ గు మ్మానికి ఓ మహిళ తాళిబొట్టు వేలాడదీసిన ఘటనను కలెక్టర్ కృష్ణభాస్కర్ సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని ఆర్డీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు. దీంతో ఆర్డీవో గురువారం రుద్రంగి మండ లం మానాల గ్రామంలోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఇరువర్గాలు, గ్రామ పెద్దల నుంచి వివరాలు సేకరించారు. పట్టా పాసుపుస్తకాలు, పలు పత్రాలను పరిశీలించారు. తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ, పట్టా మార్పిడికి రుద్రంగి రెవెన్యూ సిబ్బందికి సంబంధం లేదని చెప్పారు. మానాల గ్రామం పాతకమ్మర్‌పెల్లి మండలం నిజామాబాద్ జిల్లాలో ఉన్న సమయంలోనే 2011–12లో సర్వేనంబర్ 130/14లోని రెండెకరాల వ్యవసాయ భూమి పొలాస రాజలింగం పేరు నుంచి పొలాస రాజం పేరిట పట్టా మార్పు జరిగిందని తెలిపారు. తర్వాత రాజం కోడలు పొలాస జల పట్టా చేసుకుందని చెప్పారు. పొలాస జల ఒక్కరే పట్టా చేసుకోవడంతో సమస్య తలెత్తిందని, పొలాసమంగకు రెండెకరాలలో రావాల్సిన వాటా కుటుంబ సమస్య కాబట్టి గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించినట్లు తెలిపారు. తన తాళిబొట్టు తీసుకుని అయినా భూమిపట్టా మార్చాలంటూ తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి మంగ తాళిబొట్టు వేలాడదీసిన విషయం విదితమే. -
బామ్మకు బజారే దిక్కయింది..
వేములవాడ : రక్తం సంబంధం కుదరదు పొమ్మంటే.. ఆ వృద్ధురాలికి బజారు దిక్కయింది. మానవత్వంలేని మనవరాలి పనితో శతాధిక వయసులో రోడ్డుపైనే గడిపేస్తోంది. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణానికి చెందిన వెంకట స్వామికి నలుగురు కూతుళ్లు. ఇందులో ఇద్దరు కూతుర్లు చనిపోయారు. పెద్ద కూతురికి తానే స్వయంగా ఇల్లు నిర్మించి ఇచ్చాడు. తన తల్లి (బామ్మ) చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తాను కిరాయికి ఉంటున్న ఇంటివారు వెళ్లి పొమ్మన్నారు. దీంతో గత్యంతరం లేక వెంకటస్వామి తన తల్లిని తీసుకొని తన కూతురు సునీత ఇంటికి చేరాడు. అయితే, మనవరాలు శతాధిక వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వెంకటస్వామి కూతురి ఇంటి ముందు టెంట్ వేసుకుని బజార్లోనే తల్లిని పడుకోబెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. మాతృ దినోత్సవం రోజున బామ్మకు జరిగిన ఇబ్బందిపై కాలనీవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రమేష్ కుమార్ పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోర్టును కోరారు. మరోవైపు మరోవైపు కేంద్ర హోంశాఖ పౌరసత్వం రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని చెన్నమనేని రమేష్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం జూన్ 16న మరోసారి పూర్తి వాదనలు వింటామని తెలుపుతూ.. తదుపరి విచారణను జూన్ 16 కు వాయిదా వేసింది. లాక్డౌన్ కారణంగా ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టింది. కాగా వేములవాడ శాసన సభ్యుడైన చెన్నమనేని రమేష్‌కు జర్మని దేశంలో పౌరసత్వం ఉందంటూ ఆయన సమీప అభ్యర్థి ఆది శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
ఓడించాడని చంపేశారు!
వేములవాడ: రాజకీయ కక్షలకు ఓ రౌడీ షీటర్ బలయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే వెంటాడి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం చోటుచేసుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో తమను ఓడించాడని కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో వేములవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీఐ సీహెచ్ శ్రీధర్ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణానికి చెందిన ముద్రకోల వెంకటేశ్ కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. స్థానికంగా వాటర్ ప్లాంటులో డ్రైవర్‌గా పని చేస్తున్న శివ తనకు మద్దతు ఇవ్వకుండా ప్రత్యర్థి గెలుపునకు సహకరించాడని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తన ఓటమికి కారణమైన అతడిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించాడు. కక్షతో రగిలిపోతున్న వెంకటేశ్.. అదను చూసి దెబ్బ కొట్టాలని పథకం రచించాడు. ఈ నేపథ్యంలో ఉదయం బైక్‌పై వెళ్తున్న శివను తన సన్నిహితుడు శ్రీనివాస్‌తో కలసి వెంటాడారు. నడిరోడ్డుపై అటకాయించి కత్తులతో పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న శివను చూసిన స్థానికులు.. పోలీసులకు, 108కు సమాచారం అందించారు. వారు శివను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శివ చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా శివపై మూడేళ్ల క్రితం రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రకాంత్ పరిశీలించారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు ముద్రకోల వెంకటేశ్, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది. -
కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మెదక్ జిల్లా జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడను నూతన రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి వచి్చన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని డివిజన్లు, మండలాలకు లైన్‌క్లియర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా చౌట్కూరు మండలం ప్రతిపాదిత జోగిపేట రెవెన్యూ డివిజన్లో నాలుగు మండలాలను ప్రభుత్వం చేర్చింది. ప్రస్తుతం సంగారెడ్డి డివిజన్లో కొనసాగుతున్న అందోల్, పుల్కల్, వట్పల్లి మండలాలతోపాటు కొత్తగా చౌట్కూరు మండలాన్ని ఏర్పాటు చేసింది. పుల్కల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను తొలగించి చౌట్కూరు మండలంలో కలిపింది. దీంతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 586కు చేరింది. వేములవాడ డివిజన్ ఇలా.. ప్రస్తుతం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో ఉన్న 6 మండలాలతో వేములవాడ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇందులో వేములవాడ, వేములవాడ (గ్రామీణ), చందూర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రండి మండలాలున్నాయి. ఇదిలావుండగా డివిజన్లు, మండలం ఏర్పాటుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఏసీబీకి చిక్కిన వీటీడీఏ సీపీవో
వేములవాడ/సుల్తాన్‌బజార్: వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ (వీటీడీఏ) చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్‌గౌడ్ సోమవారం ఏసీబీకి చిక్కారు. లే అవుట్ అనుమతి కోసం రూ.6.50 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆయన్ను పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న జవ్వాజి సంపత్, వినికంటి సందీప్‌లు త్రిశూల్ డెవలపర్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల వేములవాడ రుద్రవరంలో కొనుగోలు చేసిన ఓ స్థలం లే అవుట్ కోసం వీటీడీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్‌గౌడ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారి నుంచి రూ.8 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.6.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అనంతరం సంపత్, సందీప్‌లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ వీరభద్ర, ఇన్స్పెక్టర్ సంజీవ్‌లను ఆశ్రయించారు. వారు ఇచ్చిన సూచనల మేరకు ఫోన్ ద్వారా లక్ష్మణ్‌గౌడ్‌తో మాట్లాడి డబ్బులు సిద్ధం చేశామని, ఎక్కడ ఇవ్వాలని అడగగా.. హైదరాబాద్ కోఠి గుజరాతిగల్లీలోని తన నివాసం వద్దకు రావాలని సూచించారు. వారు వచ్చాక తన కుమారుడు రోహిత్‌ను పంపిస్తున్నానని, అతనికి నగదు ఇవ్వాలని లక్ష్మణ్‌గౌడ్ చెప్పాడు. నగదును తీసుకుని బ్యాగ్‌లో పెట్టుకున్న రోహిత్‌ను అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లక్ష్మణ్‌గౌడ్ నుంచి వాగ్మూలం తీసుకుని అతనితో పాటు కుమారుడు రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
పోలింగ్‌పై పోలీసుల నిఘా
సాక్షి, వేములవాడ: పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ప్రతీ ఓటరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, ప్రతీ గ్రామంలో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారుల సూచనల మేరకు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృందాలు గ్రామగ్రామాన కవాతులు నిర్వహిస్తూ పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉన్నారన్న సంకేతాలు అందజేస్తున్నారు. ఎవరి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలీసులు ప్రజలకు రక్షణగా ఉంటారన్న భరోసాను ఇస్తున్నారు. ప్రత్యేక పోలీసుల బలగాలతో కవాతులు నిర్వహించి ప్రజలకు మరింత ధైర్యాన్ని ఇస్తున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ప్రత్యేక బలగాల రాక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ ప్రాంతానికి ప్రత్యేక బలగాలు వచ్చేశాయి. వీరితో నిత్యం కూడళ్ల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడ్ అమల్లో ఉండటంతో అందుకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ తనిఖీలు నిర్వహిస్తూ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వాహనాల తనిఖీలు, బస్సులు తనిఖీలు, ముల్లెమూటల తనిఖీలు, నగదు తరలింపు అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల వేములవాడ శివారులో రూ.4 లక్షలు తరలిస్తున్న ఓ వ్యక్తిని సోదా చేసి పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు తరలించవద్దన్న ఎన్నికల సంఘం నిబంధనలను ఇక్కడి పోలీసులు పాటిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు మరింత ముమ్మరం చేస్తున్నారు. మద్యం పట్టివేత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేరచరిత గల వ్యక్తులను పట్టుకుని తహసీల్దారు ముందు బైండోవర్ చేయడంతోపాటు ఎలాంటి చర్యలకు దిగినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన మ ద్యాన్ని పట్టుకుని సీజ్ చేస్తున్నారు. ఎన్నికల నియమావళికి లోబడి డబ్బుల తరలింపు అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బులను సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తున్నారు. 103 మందిని బైండోవర్ చేశారు. 58 లీటర్ల మద్యం పట్టుకున్నారు. 96 పోలింగ్ స్టేషన్లలో 70 నార్మల్ పోలింగ్ స్టేషన్లు, 26 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. 141 లొకేషన్లలో 255 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, 1 స్టాటిస్టిక్స్ అసెస్మెంట్ టీం గస్తీ తిరుగుతున్నారు. -
జిల్లాలో సగం కన్నా ఎక్కువ యూతే..
సాక్షి, సిరిసిల్ల: జిల్లా నిండా యువోత్సాహం కనిపిస్తోంది. మొత్తం ఓటర్లలో 51.54 శాతం 39 ఏళ్లలోపు వయసు వారే ఉన్నారు. రాష్ట్రఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాను పరిశీలిస్తే.. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండగా.. జిల్లా జనాభాలో 73.20 శాతం ఓటర్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల నాటి వివరాలను పరిశీలిస్తే.. పార్లమెంట్ ఎన్నికల నాటికి చాలామార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా 27,896 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ‘యువ’ ఓటర్లే అధికం జిల్లా ఓటర్ల సంఖ్య 4,33,902 కాగా ఇందులో 18 – 39 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల సంఖ్య 2,23,638 ఉంది. అంటే జిల్లా ఓటర్లలో 51.54 శాతంగా నమోదైంది. సగానికి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండడం విశేషం. ఎన్నికల సంఘం ఇటీవల కల్పించిన ఓటర్ల నమోదులో కొత్తగా 27,896 నమోదు ఓటర్లుగా తమ పేర్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఫాం–6 ద్వారా అనేకమంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడం విశేషం. మహిళా ఓటర్లు అధికం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో పురుషుల ఓటర్ల సంఖ్య 2,11,324 కాగా.. మహిళలు ఓటర్లు 2,22,572 మంది ఉన్నారు. పురుషుల కంటే 1,1248 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో గెలుపోటముల్లో మహిళల పాత్ర కీలకంగా మారనుంది. మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉండటానికి గల్ఫ్ వలసలు కారణాలుగా భావిస్తున్నారు. జిల్లా ఓటర్ల వివరాలు నియోజకవర్గాల వారీగా.. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం సిరిసిల్ల 1,11,926 1,15,994 3 2,27,923 వేములవాడ 99,398 1,06,578 3 2,05,979 -
అభిషేక్‌కు అభినందనలు!
సాక్షి, హైదరాబాద్: ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చలించి 9వ తరగతి విద్యార్థి చేసిన ఓ అద్భుత ఆవిష్కరణ జాతీయ స్థాయి బహుమతి సాధించింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అభిషేక్ ఈ ఆవిష్కరణ చేశాడు. అభిషేక్ తయారు చేసిన యంత్రానికి రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్‌లో ప్రథమ బహుమతి వచ్చింది. జాతీయ స్థాయిలో మూడో బహుమతి సాధించింది. అభిషేక్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. సోమవారం అభిషేక్ తన ఉపాధ్యాయులతో పాటు కేటీఆర్‌ను కలిశారు. చిన్న వయసులో ధాన్యం ఎత్తే యంత్రాన్ని తయారు చేయాలన్న ఆకాంక్ష ఎలా మొదలైందని కేటీఆర్ ఆ బాలుడిని అడిగి తెలుసుకున్నారు. తనది వ్యవసాయ కుటుంబమని తల్లిదండ్రులు ధాన్యాన్ని ఎత్తేందుకు మరో నలుగురితో కలసి పడుతున్న కష్టం తనకు ఈ పరికరాన్ని తయారు చేసేందుకు స్ఫూర్తి కలిగించిందని అభిషేక్ తెలిపాడు. జాతీయ స్థాయిలో బహుమతి అందుకున్నందుకు అభిషేక్‌ను కేటీఆర్ అభినందించారు. భవిష్యత్తులో ఏమవుతావని కేటీఆర్ అడగగా.. ఐఏఎస్ కావాలన్న ఆకాంక్ష తనకుందని అభిషేక్ చెప్పాడు. ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అభిషేక్ తన యంత్రానికి పేటెంట్ పొందేందుకు, భవిష్యత్తులో మరిన్ని అవిష్కరణలు చేసేందుకు, తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సెల్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్ తెలిపారు. తన తరఫున ప్రోత్సాహకంగా రూ.1.16 లక్షల చెక్కును అభిషేక్‌కు అందించారు.