
చెక్క వెంకవ్వ(ఫైల్)
వేములవాడరూరల్: ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యా దు చేసుకున్నారు. ఈ విషయం ఓ యువకుడి తల్లికి తెలియడంతో తన కొడుకును కొడుతున్నారని ఆ తల్లి గుండె ఆగిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రూరల్ ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ మండలంలోని చెక్కపల్లి గ్రామానికి చెందిన చేపూరి తిరుపతి, వెంకటేష్, కరుణాకర్ ఇంకొంతమంది, నూకలమర్రి గ్రామానికి చెందిన చెక్క రాహుల్, వనపర్తి నగేష్‌తో పాటు మరికొంత మంది ఆదివారం ఓ పెళ్లి భరాత్‌లోఘర్షణ పడ్డారు.
ఈ విషయంపై ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా రాత్రి ఇచ్చుకున్నారు. నూకలమర్రి గ్రామానికి చెందిన చెక్క వెంకవ్వ(35)కు ‘మీ కొడుకు చెక్క రాహుల్‌ను కొడుతున్నారంటూ’ కొందరు ఫోన్ చేశారు. తన కొడుకును కొడుతున్నారా అంటూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే వేములవాడ ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్లు బంధువు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
దుబాయిలో మృతిరాలి భర్త..
వెంకవ్వ భర్త సత్యనారాయణ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటాడు. విషయం తెలుసుకుని స్వదేశానికి వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వెంకవ్వకు కూతురు, కొడుకు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment