తాడ్వాయి/దోమకొండ, న్యూస్‌లైన్: అప్పటి వరకూ ఆనందంతో గ డిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దేవుడిని దర్శిం చుకుని, మొక్కులు సమర్పించుకుని, ఎంతో ఉత్సాహంతో ఇంటికి తిరుగు పయనమైన వారిని రోడ్డు ప్రమాదం కకావికలం చేసింది. నవ్వుల స్థానంలో రోదనలు మిన్నంటాయి. కరీంనగర్ జిల్లా వేములవాడలో రాజన్నను దర్శించుకుని తిరిగి వస్తున్న జిల్లావాసులు నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం రెండు కుటుంబాలలో తీరని విషాదాన్ని మిగిల్చింది. తాడ్వాయి మండలం నందివాడకు చెందిన కమ్మరి రజిత (28), ఆమె కుమారుడు రాకేష్ (10), కూతురు అశ్విని ఈనెల 18న దోమకొండలో ఉండే తమ అమ్మమ్మ కంది సుగుణ (60) ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బంధువులతో కలిసి సోమవారం ఆ టోలో వేములవాడకు వెళ్లి, రాజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నా రు.
మంగళవారం ఉదయం దోమకొం డకు బయల్దేరారు. గంభీరావుపేట మండలం గజసింగవరం వద్ద వీరి ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సుగుణ, ఆటోడ్రైవర్ స్నేహితుడు అబ్రబోయిన ప్రవీణ్ (18) అక్కడికక్కడే మరణించారు. రజిత, రాకేష్ సిరి సిల్ల ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణిం చారు. సుగుణ కూతురు విజయ, రజి త కూతురు అశ్విని, ఆటో డ్రైవర్ రాజుతీవ్రంగా గాయపడ్డారు. ఒకేసారి నలుగురు మరణించడంతో నందివాడ, దోమకొండలలో విషాదం నెలకొంది. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. దేవుడిని చూసి వస్తూ దేవుడి దగ్గరికే వెళ్లిపోయారని గ్రామస్తులు కంటతడి పెట్టారు. మృతుల ఇళ్ల వద్దకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు.
స్నేహితుడి కోసం వెళ్లి
ప్రవీణ్ డ్రైవర్ రాజు గౌడ్‌కు మిత్రుడు. తనతో రావాలని రాజు కోరడంతో ప్రవీణ్ ఆటోలో వెళ్లాడని తెలిసింది. ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందడంతో అతడి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను సిరి సిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు.
ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది
Published Wed, May 21 2014 2:22 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement