karimnagar disrtrict
-
పాలనలో ఆమె సంతకం
ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు మహిళా అధికారులు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉంటున్నారు. పురుష అధికారులతో సమానంగా విధులు నిర్వహిన్నారు. కిందిస్థాయి నుంచి మొదలుకొని జిల్లాస్థాయి అధికారిగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్, న్యాయ, రెవెన్యూ, విద్య, వైద్యం, మెప్మా, వ్యవసాయశాఖ తదితర శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. – సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్ అర్బన్కీలక స్థానాల్లో వారే..ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు శాఖల్లోని కీలకమైన స్థానాల్లో మహిళా అధికారులే ఉన్నారు. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ, జగిత్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నీలిమ, కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి, పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా అరుణశ్రీ, పెద్దపల్లి డీసీపీగా డాక్టర్ చేతన, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రినిరెడ్డి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పేయ్, కరీంనగర్ డీఎంహెచ్‌వోగా సుజాత, డీఏవోగా భాగ్యలక్ష్మి, జగిత్యాల డీఏవోగా వాణి, కరీంనగర్ సంక్షేమ అధికారిగా సరస్వతి, ఆర్టీసీ ఆర్ఎంగా సుచరిత, రామగుండం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా హిమబిందు సింగ్, పెద్దపల్లి సహకార శాఖ అధికారి శ్రీమాల, పెద్దపల్లి డీఈవోగా మాధవి, ఇంటరీ్మడియట్ నోడల్ అధికారిగా కల్పన, ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌గా నాయిని సుప్రియ.. ఇలా.. వివిధ శాఖల్లో మహిళా అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఆలోచనా విధానం మారాలిజీవితంలో అనేక పాత్రలు పోషిస్తున్నా.. మహిళలపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. ఈ అనాగరిక ధోరణి నుంచి మనిషి ఆలోచనా విధానం మారాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజకీయ రంగంలోనూ మహిళలు దూసుకెళ్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో వారి ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఏ సంస్థలోనైనా, ఏ రంగంలోనైనా తగిన శిక్షణ, సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే వారు అనూహ్య ఫలితాలు సాధిస్తారు.మహిళల ప్రాతినిధ్యం పెరిగిందిఅటెండర్ నుంచి అంతరిక్షం వరకు ప్రతీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. నాకు అదనపు కలెక్టర్‌గా సేవలందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మహిళలు రాజకీయాల్లో వెనకబడి ఉన్నారు. సివిల్ సర్వీసులోకి వచ్చేవారు 7 శాతమే. విజయానికి ఆడ, మగ అనే తేడా లేదు. లక్ష్యాలను నిర్దేశించుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆడపిల్లలను ప్రోత్సహించేవారి సంఖ్య పెరుగుతోంది. అది వంద శాతానికి చేరాలి. – లక్ష్మీకిరణ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), కరీంనగర్యువతుల్లో చైతన్యం కనిపిస్తోందిపరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. జిల్లాలో చైతన్యం ఎక్కువ. ఆడపిల్లలంటే ఒకప్పుడు వివక్ష ఉండేది. ఇప్పుడు మార్పు వచ్చింది. వ్యవసాయశాఖకు జిల్లా అధికారిగా పని చే యడం సంతోషంగా ఉంది. పల్లెల్లో సమావేశాల్లో పాల్గొన్నప్పుడు యువతుల్లో చైతన్యం కనిపిస్తోంది. స్వయం ఉపాధి పొందేవారు, ఉన్నత విద్యనభ్యసిస్తున్నవారిని చూస్తే గర్వంగా అనిపిస్తోంది.– భాగ్యలక్ష్మి, డీఏవో, కరీంనగర్చదువుతోనే సాధికారతచదువుతోనే మహిళా సాధికారిత సాధ్యమవుతుంది. ఎంచుకున్న రంగంలో ప్రతిభ చాటేందుకు ఇష్టంగా ముందుకుసాగాలి. ఎవరి జీవితం అనతికాలంలో ఉన్నతస్థానానికి చేరదు. కఠోర శ్రమ అవసరం. లక్ష్య సాధనకు నిర్విరామ కృషి ఉండాలి. ఆడవాళ్లు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు పోటీపడాలి. ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో పరిపూర్ణత సాధించాలి. – అరుణశ్రీ, అదనపు కలెక్టర్, పెద్దపల్లిచట్టాలపై అవగాహన ఉండాలిమహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆత్మనిర్భరత, నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉండాలి. విద్య, వృత్తి, వివాహం, కుటుంబ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వాలు మహిళల కోసం చేసిన చట్టాలు, న్యాయ సేవలపై ప్రతీ ఒక్కరికి అవగా హన ఉండాలి. పోలీస్‌శాఖలో గతంతో పోలిస్తే మహిళా సిబ్బంది ప్రాతినిధ్యం పెరిగింది.– డాక్టర్ చేతన, డీసీపీ, పెద్దపల్లిఆడపిల్లలను ప్రోత్సహించాలిఆడపిల్లలకు వయసు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. అలా కాకుండా, వారు ఎంచుకున్న లక్ష్యాలు సాధించేవరకు ప్రోత్సహించాలి. లక్ష్యసాధనకు తోడ్పాటునందించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆడవారిని ఎలా గౌరవించాలో నేర్పించాలి. మగ, ఆడ అనే తేడా లేకుండా అందరూ సమానమేనన్న భావన కలిగించాలి.– మాధవి, డీఈవో, పెద్దపల్లిచాలెంజ్గా తీసుకుంటాకోల్సిటీ(రామగుండం): కొన్ని రంగాల్లో మహిళలు చిన్నచూపునకు గురవుతున్నారు. వాటిని పట్టించుకోకుండా ప్రతీ పనిని చాలెంజ్‌గా తీసుకోవాలి. నేను చాలెంజ్‌తో ముందుకు సాగుతున్నా. పురుషుల కన్నా మహిళకు ఇల్లు, ఫ్యామిలీ, ఉద్యోగం, అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ విషయంలో సపోర్ట్ దొరకదు. నిలోఫర్ ఆస్పత్రిలో హెచ్వోడీగా చేస్తున్న నన్ను, ప్రభుత్వం అడిషనల్ డీఎంఈ క్యాడర్ హోదా కల్పిస్తూ ప్రమోషన్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన రామగుండంలోని సిమ్స్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా రెండున్నరేళ్ల క్రితం బాధ్యతలు అప్పగించారు. తొలి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన కొంతకాలం ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రొఫెషనల్ ఒత్తిళ్లతో బిజీగా ఉన్నా కుటుంబానికీ సమయం కేటాయిస్తా. – డాక్టర్ హిమబిందు సింగ్, ప్రిన్సిపాల్, సిమ్స్, గోదావరిఖని -
వరినారుతో మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్!
కరీంనగర్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు ఆదివారం పాలకుర్తి జెడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన స్వగ్రామమైన లింగాపూర్‌లో ఇండ్ల నరేష్, స్వప్న పొలంలో వరినారుతో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ విషెస్ చెప్పి, కూలీలకు మిఠాయిలు పంచిపెట్టారు. -
Karimnagar: టీటీడీ ఆలయ నిర్మాణ పనులు పరిశీలన..మే 31న భూమి పూజ..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని పద్మానగర్‌లో పది ఎకరాలో స్థలంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి తరహాలో ఆలయం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి భూమి పనులను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, స్తపతులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..ఆలయ నిర్మాణ పనుల విషయమై టీటీడీ ఈవో, చైర్మన్ సుబ్బారెడ్డితో సమావేశమయ్యాం. మే 22న ఆలయ ప్రధానార్చకులు ఇక్కడకు వచ్చి భూమి పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మే 31న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తోపాటు టీటీడీ అధికారుల సమక్షంలో భూమి పూజ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఏ రాష్ట్రంలోనైనా ఒకటే ఆలయం నిర్మిస్తుంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇప్పటికే హైదరాబాద్ హిమయత్ నగర్, జూబ్లీహిల్స్‌లో ఉన్నపటికీ, కరీంనగర్లోనూ తిరుపతి ఆలయం నిర్మించడానికి టీటీడీ కూడా ముందుకు రావడం విశేషం. కాగా పది ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని పూర్తి రాతితో తిరుమల తిరుపతి తరహాలో నిర్మిచనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. (చదవండి: మా పాప.. కాదు మా పాప!) -
Balagam Success Meet: కరీంనగర్ లో 'బలగం' మూవీ విజయోత్సవ వేడుక ( ఫొటోలు)
-
Telangana: ఎమ్మెస్సార్ మనవడొచ్చాడు.!
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో MSR పేరు తెలియనివారు లేరు. తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఎమ్మెస్సార్ మనవడు కరీంనగర్లో అరంగేట్రం చేయబోతున్నారు. కరీంనగర్‌ను డల్లాస్‌గా మారుస్తానని చెప్పిన కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ సిటీ నాదే అంటున్న MSR మనవడి పోరాటం ఎలా ఉండబోతోందో చూద్దాం.. రోహిత్ పొలిటికల్ ఎంట్రీ కరీంనగర్ జిల్లాలో ఎం. సత్యనారాయణరావు పేరు తెలియనవారు ఉండరు. గాంధీల కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న ఎంఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. మంత్రి పదవులు అనుభవించారు. జిల్లాలో చాలా కాలం తర్వాత ఆయన వారసుడు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావ్ తాజాగా కరీంనగర్ సిటీ సమస్యలపై గళం ఎత్తుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఓ స్టింగ్ ఆపరేషన్ చేశారు. రెండు గంటల పాటు 15 బృందాలు డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై వీడియోలు, ఫోటోలు తీశారు. రోహిత్ రావ్ ప్రెస్ మీట్ పెట్టి తన స్టింగ్ ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. రెండు గంటల్లోనే నగరంలో 300 సమస్యలు గుర్తించామని వెల్లడించారు. స్మార్ట్ సిటీ లక్ష్యం, ఉద్దేశం నెరవేరడం లేదని విమర్శించారు. నగరపాలక సంస్థ విఫలం అయ్యిందని వేలెత్తి చూపుతూ.. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌లు దీనికి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేయబోతున్నట్లు తన కార్యక్రమాల ద్వారా రోహి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా నుంచి కరీంనగర్ ఆస్ట్రేలియాలో చదువుకున్న ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావ్ 2007 లోనే ఆస్ట్రేలియన్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ అనుబంధ సంస్థను స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం కూడా తీసుకున్నారు. తర్వాతికాలంలో ఎమ్మెస్సార్ మరణంతో మనవడు రాజకీయ అరంగేట్రం కొంతకాలం ఆగింది. ప్రస్తుతం ఆయన కరీంనగర్లో ఎంట్రీ ఇచ్చి సీరియస్ రాజకీయాల్లోకి వచ్చేశారు. రాహుల్ గాంధీ వరంగల్ సభకు కేడర్ తో తరలివెళ్లారు. రాహుల్ జోడో యాత్రకు మద్దతుగా అవగాహన కల్పించేందుకు కరీంనగర్ నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. వరదల సమయంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెస్సార్ మనవడిగా రోహిత్ రావ్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నా.. టికెట్ రావడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద విషయమే. కాని గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు కాంగ్రెస్ పోటీ చేసిన లక్ష్మీకాంతారావు టీఆర్ఎస్లో చేరడం.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం లోక్‌సభ సీటుపై ఆసక్తిగా ఉండటంతో.. ఈసారి కరీంనగర్ అసెంబ్లీ సీటు రోహిత్‌రావుకు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు వెలమ.. ఇటు పద్మశాలి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి రోహిత్ రావ్ కు దాదాపు లైన్ క్లియర్ అయినట్టేనని భావిస్తున్నారు. ఎమ్మెస్సార్‌కు పార్టీలో ఉన్న పేరు ప్రతిష్టల కారణంగా ఆయన మనవడికి కాంగ్రెస్ టికెట్ కేటాయించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల టైంకి టికెట్ ఆశించే వారు మరికొంత మంది ప్రత్యక్షం అవుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. రోహిత్ రావ్ భార్య పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ వర్గం ఓట్లు కూడా కరీంనగర్ లో ఎక్కువే. అందువల్ల పద్మశాలి వర్గం ఓట్లు తనకే పడతాయని రోహిత్ రావ్ భావిస్తున్నారు. ఒకవైపు తన వెలమ సామాజిక వర్గం...మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఎమ్మెస్సార్ రాజకీయ వారసుడి భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Telangana: రోడ్లకు రోగం.. పరిస్థితి అధ్వానం!
ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి నుంచి ఆత్మకూర్ (ఎం) మండలం రాయిపల్లికి వెళ్లే రోడ్డు దుస్థితి. సుమారు 5కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు ఎక్కితే చాలు అంతా దుమ్మే. కొంత దూరంలో ఏముందో కూడా కనబడని పరిస్థితి. ప్రయాణికులతో పాటు రోడ్డుకు సమీ పంలోని ఇళ్లలో ఉంటున్నవారు దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నారు. వానలకు రోడ్డు గుంతలు పడటంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు, వాహనాలు దెబ్బతింటున్నాయి. రెండేళ్ల కిందే రోడ్డు పనులను మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తిచేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇటీవల కాటే పల్లికి చెందిన రాంరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి వెళితే వైద్యులు పరీక్షించి దుమ్ము వల్లే సమస్య అని చెప్పారు. రాంరెడ్డి ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. ఇప్పుడాయన కుటుంబం రాత్రిపగలు ఇంటి తలుపులు, కిటికీలు పెట్టుకునే ఉంటోంది. ఇక వాహనాల నుంచి వస్తున్న దుమ్ముతో పిల్లలు తరచూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని, మాస్కులు పెట్టుకుని ఉంటున్నామని కాటేపల్లికి చెందిన పచ్చిమట్ల ప్రమీల వాపోయారు. పిల్లలను బయట ఆడు కోనిచ్చే పరిస్థితి లేదన్నారు. – సాక్షి, యాదాద్రి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇటీవలి వర్షాల కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో స్థానిక రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. పలుచోట్ల రాష్ట్ర రహదారులు కూడా దెబ్బతి న్నాయి. దీంతో ఓ వైపు ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడు తుంటే.. మరోవైపు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,245 కి.మీల రహదారులు రోడ్లు–భవనాల శాఖ పరిధిలో ఉన్నాయి. ఇందులో 3,152 కి.మీ. రాష్ట్ర రహదారులు, 12,079 కి.మీ ప్రధాన జిల్లాలను కలిపే రహదారులు కాగా.. 9,014 కి.మీ ఇతర జిల్లాలను, పట్టణాలను కలిపే రోడ్లు. ఇటీవలి వర్షాల నష్టం నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితిని ఆర్అండ్బీ అధికారులు పరిశీలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో సగటున ప్రతీ నియోజకవర్గంలో 25 కిలోమీటర్ల మేర రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. మొత్తంగా 2,975కి.మీ.ల మేర రహదారులకు మరమ్మతులు అవ సరమని అంచనా వేశారు. అన్ని వివరాల మదింపునకు మరో పదిరోజులు పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి చాలాచోట్ల కల్వర్టులు, కాజ్‌వేలు దెబ్బతి న్నాయి. వాటికి మరమ్మ తులు చేయ డం, కొత్తగా నిర్మించడం, అవస రమైన చోట బ్రిడ్జీల నిర్మా ణం చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు. రూ.714 కోట్లు అవసరం! సగటున ప్రతి నియోజకవర్గంలో రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం కనీసం రూ.6 కోట్లు కావాలని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా కలిపి రూ.714 కోట్లకుపైగా నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. వీటికి పరిపాలనా పరమైన అనుమతులు రాగానే ప్రభుత్వం జీవో విడుదల చేసి, నిధులు విడుదల చేస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇక కుంగిన, కూలిన బ్రిడ్జీ లు, కల్వర్టుల కోసం ప్రత్యేకంగా నిధులు అవసరమని అంటున్నారు. చాలాచోట్ల ఇదే దుస్థితి.. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండా పూర్ వద్ద కాజ్వే వరదలకు కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మట్టిరోడ్డు వేసి రాకపోకలు ప్రారంభించారు. వంతెన నిర్మాణం కోసం రూ.5.1 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల వల్ల ఆర్అండ్ బీ రోడ్లు 109.3కి.మీ. మేర దెబ్బతిన్నాయని, రూ.123 కోట్లకుపైగా నష్టం జరిగిందని అధికారు లు గుర్తించారు. తక్షణ మరమ్మతుల కోసం రూ.22 కోట్లు విడుదల చేసి పనులు చేపట్టినట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలో 54 పెద్ద రోడ్లు, వందకుపైగా చిన్నరోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు.ఆర్మూర్, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్, అర్బన్ సబ్ డివి జన్ల పరిధిలో రూ.22 కోట్ల అంచనాలతో మర మ్మతుల ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఖమ్మం–భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు వద్ద ప్రధాన రహదారి దుస్థితి ఇది. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం అక్కినాపురంతండా వద్ద తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోభానగర్–కొమ్ముగూడెం రోడ్డు కూడా దెబ్బతిని గుంతలు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్దవాగు బ్రిడ్జిలో ప్రజల ఇబ్బందులు ఆదిలాబాద్ జిల్లాలో కుప్పకూలిన అందెవెల్లి పెద్ద వాగు బ్రిడ్జి, దీనివల్ల రాకపోకల కోసం వాగులో తిప్పలుపడుతున్న ప్రజల చిత్రాలివి. భారీ వర్షా లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలాచోట్ల రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వెంకేపల్లి– చర్లగూడెం మధ్య ప్రధాన రహదారిపై కుంగిపోయిన కల్వర్టు ఇది. అధికారులు ఎన్నికల నేపథ్యంలో కంటి తుడుపు చర్యగా మట్టి పోసి చేతులు దులుపుకొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వాగుపై ఉన్న బ్రిడ్జి దుస్థితి ఇది. నల్లగొండ జిల్లాలోని చందంపేట, దేవరకొండ మండలాలకు వెళ్లే రోడ్డుపై ఉన్న ఈ బ్రిడ్జి వరదల వల్ల బాగా దెబ్బతిన్నది. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రానికి, వేచరేణి గ్రామానికి మధ్య రోడ్డు ఇది. భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా తెగిపోయింది. వేచరేణి గ్రామస్తులు చుట్టూ తిరిగి చేర్యాలకు వెళ్లాల్సి వస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహము త్తారం మండలం యత్నారం– సింగంపల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న కల్వర్టు ఇది. ఫలితంగా సింగంపల్లి, మోదేడు, కొత్తపల్లి గ్రామాల ప్రజలు కాలినడకనే మండల కేంద్రానికి రావాలి. వాహనాల్లో వెళ్లాలంటే చుట్టూ 40 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. -
మీరు బయట తాగే వాటర్ ప్యూరిఫైడ్‌గా భావిస్తున్నారా.?
కరీంనగర్ అర్బన్: మీరు బయట తాగే వాటర్ ప్యూరిఫైడ్‌గా భావిస్తున్నారా.? మీ భావన తప్పు. మీరు అనారోగ్యానికి దగ్గర పడుతున్నారనేదే వాస్తవం. ఆరోగ్యం కోసం శుద్ధి చేసిన నీళ్లు తాగుతుంటే అవి అనారోగ్యానికి కేరాఫ్ అని చెబుతున్నారని అనుకుంటున్నారా.? అదే నిజం. ఒకసారి సరఫరా చేసే శుద్ధ జల కేంద్రానికి వెళితే అర్థం అవుతుంది. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి, తిమ్మాపూర్, మానకొండూరు, గంగాధర, రామడుగు, శంకరపట్నం, తదితర ప్రాంతాల్లో సుమారు 800 వరకు శుద్ధ జల సరఫరా కేంద్రాలున్నాయి. పట్టణాల నుంచి పల్లెల దాకా విస్తరించాయి. వీటిలో బీఎస్ఐ అనుమతి ఉన్న కేంద్రాలు కేవలం నాలుగే ఉన్నాయి. మిగతావన్నీ నామమాత్రపు అనుమతితో నడుస్తున్నవే. నాణ్యత ప్రమాణాలు అటకెక్కగా తనిఖీల ఊసే లేదు. దీంఓ నీటి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లా అధికారులుండే కరీంనగరంలోనే వందల సంఖ్యలో కేంద్రాలు నడుస్తుండడం గమనార్హం. విచ్చలవిడిగా కేంద్రాలు.. లక్షల్లో వ్యాపారం జిల్లావ్యాప్తంగా అనధికారికంగా నిర్వహిస్తున్న వా టర్ ప్లాంట్లలో కరీంనగర్ నగర పరిధిలో 300 వర కు ఉన్నాయి. కూల్‌వాటర్, మినరల్ వాటర్ పేరుతో దందా నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమ తి లేకుండా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై ప్రభుత్వ నియంత్రణ కొరవడింది. నీటిని శుద్ధి చేసేందుకు వినియోగిస్తున్న యంత్రాలకు ప్రభుత్వపరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. గంటకు 2 వేల లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్లు నివాస ప్రాంతాల్లో చిన్న చిన్న గదుల్లో నిర్వహిస్తున్నారు. ∙వాటర్ ప్లాంట్లలో వినియోగించే పైపులు, నిల్వ చేసే ట్యాంకులు స్టీలువి వినియోగించాల్సి ఉండగా ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్రతిరోజూ సరఫరా అయ్యే నీటిని తనిఖీలు చేయాల్సి ఉన్నా ఏ ఒక్కచోటా అది జరగడం లేదు. నీటి కోసం మున్సిపల్ శాఖ అనుమతి లేకుండానే బోర్లు వేస్తున్నారు. అక్కడ వచ్చిన నీటిని పరీక్షించి దానికనుగుణంగా యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. ∙నీటి నిల్వకు కనీసం ఏడు సెంట్ల స్థలం కావాల్సి ఉండగా 200 అడుగుల గదుల్లోనే ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. నామమాత్రంగా శుద్ధి చేసి క్యానుల్లో నింపుతున్నారు. క్యాన్లను వేడి నీటిని ఉపయోగించి ప్రెజర్ బ్రష్‌లతో చేయాల్సి ఉండగా దానిని పూర్తిగా విస్మరించారు. మున్సిపల్ కుళాయిల్లో వస్తున్న నీటినే క్యాన్లలో నింపి మినరల్ వాటర్ పేరుతో విక్రయించి సొమ్ముచేసుకునే వారూ ఉన్నారు. కేంద్రంలో ఇవి తప్పనిసరి సాధారణంగా వాటర్ ప్లాంట్‌ను నెలకొల్పాలంటే అందుకు మున్సిపాలిటీల్లో కమిషనర్, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి ముందస్తుగా నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ విధిగా పొందాలి. ఎన్వోసీ ఆధారంగా ప్లాంటు స్థాపించేందుకు విద్యుత్ శాఖ నుంచి కనెక్షన్ కోసం అనుమతి పొందాలి. శుద్ధజల కేంద్రాన్ని నిర్వహించాలంటే భారత ప్రమాణాల సంస్థ నిర్ణయించిన నిబంధనల ప్రకారం మైక్రో బయోలజిస్టు, కెమిస్టులు ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్ 7.5శాతం కంటే తగ్గితే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా నీటి «శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులుండాలి. ఫిల్లింగ్ సెక్షన్, ఆర్వో సిస్టంలో మూడు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రమ్ములు ఏర్పాటు చేయాలి. శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసేందుకు 304 గ్రేడ్ స్టెయిలెస్ స్టీలు డ్రమ్ములు వాడాలి. ఈ నీటికి తప్పకుండా ఓజోనైజేషన్ చేయాలి. మినరల్ వాటర్‌ను బబుల్స్(క్యాన్)లోకి పట్టే ముందు అల్ట్రావయోలెట్ కిరణాలతో శుద్ధి చేయాలి. క్యాన్లను ప్రతీసారి పొటాషియం పర్మాంగనేట్ లేదా హైపో సొల్యూషన్‌తో శుభ్రం చేయాలి. వీటిని శుద్ధి చేసిన తేదీ బ్యాచ్ నంబర్‌ను సీలుపై ముద్రించాలి. శానిటరీ అధికారులతో ప్రతినెలా నీటిని పరీక్షింపజేసి బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)కు పంపించాలి. నాణ్యత ప్రమాణాలను ఫుడ్ కంట్రోల్ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు వాటర్ ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాణాలు పాటించకుంటే రుగ్మతలకు అవకాశం ఆల్కలైన్ తగిన మోతాదులో వాడకపోతే ఎముకల పటుత్వంలో సమస్యలు ఏర్పడుతాయి. సరైన శుద్ధి చేయకుండా నీరు తాగడం వలన గొంతు సంబంధ సమస్యలు, ఒంటినొప్పులు, వివిధ రకాల రుగ్మతలు వస్తాయి. ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు, క్యాన్లలో ఎక్కువ కాలం నిలువ ఉంచిన నీరు తాగడం వలన క్యాన్సర్లు వచ్చే ప్రమాదముంది. వాటర్ ప్లాంట్లు పరిశుభ్రత విషయంలో నిబంధనలు పాటించకున్నా వ్యాధులు వస్తాయి. – డా.సాయిని నరేందర్, ఎండీ చెస్ట్ క్రిటికల్ కేర్ -
ఎదురేమొచ్చినా తగ్గేదేలే! రాంగ్ రూట్లో రయ్.. రయ్!
‘కరీంనగర్ పట్టణంలో నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ లెక్చరర్ పాపారావు దంపతులు ఈనెల 12న పనినిమిత్తం హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. సిద్దిపేట జిల్లా మల్లారం వద్ద రాంగ్రూట్లో వస్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. పాపారావు దంపతులతో పాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసింది.’ ‘కరీంనగర్‌లోని ఓ కార్ల షోరూంలో పనిచేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం భోజనం చేసేందుకు బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. కోతిరాంపూర్ సమీపంలో రాంగ్రూట్లో వస్తున్న మరో బైక్ ఇతడిని ఢీకొట్టింది. లక్ష్మణ్ తలకు తీవ్రగాయం కాగా.. సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది.’ కరీంనగర్‌క్రైం: నిబంధనలు పాటించండి.. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండంటూ ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పురావడం లేదు. రాంగ్రూట్లో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుండడంతో ఎదురుగా వచ్చేవారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన దుస్థితి. రద్దీగా ఉండే కరీంనగర్ సిటీతో పాటు వేగంగా వాహనాలు దూసుకొచ్చే హైవేల పైనసైతం రాంగ్రూట్లలో వెళ్తూ ప్రాణాలు తీస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు జీవితాన్ని చీకటిమయం చేస్తుండగా పోలీసులు, రవా ణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పురావడం లేదు. కరీంనగర్ పట్టణంలో రాంగ్‌రూట్ ప్రాంతాలు ► కల్పన హోటల్ నుంచి ఎస్బీఐ కమాన్ బ్రాంచ్ వైపు ► పోచమ్మవాడ నుంచి కమాన్ వైపు ► కోతిరాంపూర్ చౌరస్తా వద్ద ► విద్యుత్ కార్యాలయం, జిల్లా కోర్టు సమీపంలో ఎస్సారార్ కళాశాల సమీపంలో ► బైపాస్ ఎన్టీఆర్ చౌరస్తా ► ఆదర్శనగర్ బోర్డు నుంచి మంచిర్యాల చౌరస్తా వైపు ► రాంనగర్ చౌరస్తా.. మంకమ్మతోట ► తెలంగాణ చౌక్ ప్రాంతం (పోలీసులు మొత్తం 12 రాంగ్‌రూట్ ప్రాంతాలను గుర్తించారు) నగరంలో యథేచ్ఛగా.. కొన్నాళ్లక్రితం వరకు నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటుచేసి పలు కూడళ్లవద్ద రాంగ్రూట్లలో వెళ్లేవారిపై నిఘాపెట్టేవారు. రాంగ్రూట్లలో వెళ్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించేవారికి ఈ– చలాన్లు విధించేవారు. ఇప్పటికీ పలుచోట్ల ఈ పద్ధతి అమలు చేస్తున్నా.. చాలా వరకు కూడళ్ల వద్ద పోలీసు నిఘా కనిపించని పరిస్థితి నెలకొంది. 12 కూడళ్ల వద్ద రాంగ్‌రూట్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంటోంది. రాజామెస్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు, కోతిరాంపూర్‌లో, పోచమ్మవాడ నుంచి కమాన్‌వైపు, కల్పన హోటల్ నుంచి కమాన్ ఎస్బీఐ బ్యాంకు వైపు రాంగ్రూట్లో ఎక్కువగా వెళ్తున్నారు. అదే విధంగా మంకమ్మతోట, గీతాభవన్, విద్యుత్‌శాఖ కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రాంగ్రూట్లలో వెళ్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతుండగా.. సిటీలో మరణాలు తక్కువే. ఇక మెయిన్రోడ్లపై కూడా రాంగ్‌రూట్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ జాతీయరహదారిపై రాంగ్రూట్లో ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. కాకతీయ కాలువ, ఇంజినీరింగ్ కళాశాలలు, తిమ్మాపూర్ నుంచి మొదలుకుని నుస్తులాపూర్ వరకు కూడా పలు ప్రాంతాల్లో రాంగ్రూట్లలో వెళ్తు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రూట్లో రాంగ్‌రూట్ మరణాలు సైతం ఎక్కువే. నగరంలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన డివైడర్లను రాకపోకలకు అనుగుణంగా మార్చాలని, తద్వారా రాంగ్‌రూట్ ఇబ్బంది ఉండదని సిటీ ప్రజలు అంటుండగా.. రాంగ్రూట్లో వెళ్లే వాహనాలపై నిఘా పెడుతున్నామని, నిత్యం జరిమానా విధిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. రాంగ్‌రూట్.. వెరీ డేంజర్ రాంగ్రూట్లో వెళ్లకుండా పోలీసులు, రవాణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా తీరుమారడం లేదు. రోజురోజుకు రాంగ్రూట్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ రెండు,మూడు నెలల్లోనే రాంగ్‌రూట్ ప్రమాదాలు జిల్లాలో 20కి పైగా చోటుచేసుకున్నాయి. జరిమానాలు విధించినా తీరు మార్చుకోవడం లేదని పోలీసులు చెబుతున్నారు. యువత మద్యం మత్తులో రాంగ్రూట్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కరీంనగర్ సిటీతో పాట జిల్లావ్యాప్తంగా రాంగ్రూట్లో వెళ్లేప్రాంతాలను పోలీసులు, రవాణా అధికారులు గుర్తించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కరీంనగర్లో దంచికొట్టిన వాన..కుప్పకూలిన 70 అడుగుల లైటింగ్ కటౌట్
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టింది. కొన్నిచోట్ల ఈదురుగాళ్లతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో కరీంనగర్ పట్టణంలోని గీతా భవన్ సెంటర్లో ఉన్న 70 అడుగుల ఎత్తైన శ్రీ రాముడి పట్టాభిషేక లైటింగ్ కటౌట్ కూలిపోయింది. ఫిబ్రవరిలో జరగబోయే బ్రహ్మోత్సవాల్లో రాముడి పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా ఆలయ కమిటీ అధికారులు సుమారు రూ. 45 లక్షలు ఖర్చు చేసి ఈ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి రాత్రి వేళల్లో కటౌట్ ఆకట్టుకుంటోంది. అయితే సర్కిల్లోనే కట్టెలు కూలడంతో ప్రమాదం తప్పింది. చదవండి: గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్ గాలుల ధాటికి విద్యుత్ దీపాల అలంకరణ లుమినార్ నేలకొరిగింది. జిల్లాలోని చొప్పదండి, రామడుగు, మానుకొండూరు, పెద్దపల్లి, శంకరపట్నం, జమ్మికుంట మండలలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిలఆలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ స్థాయిలో గాలులు వీడయంతో సిరిసిల్ల విద్యానగర్‌లో విద్యుత్ స్తంబాలు, చెట్లు విరిగిపోయాయి. #Karimnagar, Heavy rains and gales recently installed mark of Sri Venkateshwara Swamy anual fete Rama Pattabhi shekam scaffold illumination structure collapsed, luckily no one injured. few days back installed at Telangana chowk. pic.twitter.com/LT3RzuTmtX — naveenkumar (@naveen_TNIE) January 11, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రారంభం పదుల్లోనే...!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు ఉపాధి యూనిట్ల ప్రారంభం నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేసింది. దళిత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుని స్థిరపడాలనే లక్ష్యంతో యు ద్ధప్రాతిపదికన అమలుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రితోపాటు హుజూరాబాద్‌లో 20వేల దళిత కుటుంబాలకు సాయం అందించేలా నిర్ణయించగా, ఇప్పటివరకు 18,064 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమచేసింది. ఒక్కో లబ్ధిదారు నుంచి దళిత రక్షణ నిధి కింద రూ.10వేల చొప్పున వెనక్కు తీసుకోవడంతో ఒక్కొక్కరి ఖాతాలో రూ.9.90 లక్షలు నిల్వ ఉన్నాయి. లబ్ధిదారు ఏర్పాటుచేసే యూనిట్‌కు కలెక్టర్ అనుమతితో నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల్లో ఇప్పటివరకు యాభైలోపు యూనిట్లు మాత్రమే ప్రారంభమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎంపికలో జాప్యం... ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భారీగా ఆర్థిక లబ్ధి కలిగే కేటగిరీలో దళితబంధు రెండోది. ఓవర్సీ స్ విద్యానిధి పథకం కింద ఎంపికైన విద్యార్థికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం చేస్తుండగా... దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నారు. అయితే దళితబంధు లబ్ధిదారుల సంఖ్య విద్యానిధి లబ్ధిదారుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దళితబంధు లబ్ధిదారుడు ఆర్థిక వనరుల అభివృద్ధిలో భాగంగా ఒక ఉపాధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎస్సీ కార్పొరేషన్ 120 రకాల ఆలోచనలతో లబ్ధిదారులకు అవగాహన కల్పించింది. అయినా చాలామంది ఇప్పటికీ ఉపాధి యూనిట్‌ను ఖరారు చేసుకోలేదు. కేవలం 6 వేల మంది మాత్రమే కార్లు, ట్రాక్టర్లు, డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లను ఎంచుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను సైతం అధికారులకు ఇవ్వలేదు. ఆయా యూనిట్లు, వాటి నిర్వహణ తదితరాలపై స్పష్టత ఉన్నప్పుడే కలెక్టర్ ఆమోదంతో ఖాతాలోని నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో... హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు రావడంతో దాదాపు రెండున్నర నెలలు ఎన్నికల కోడ్ అమలైంది. అందువల్ల దళితబంధు యూనిట్ల ఏర్పాటులో జాప్యం జరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో నెలాఖరులోగా యూనిట్లను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తామని అంటున్నాయి. అయితే, మెజార్టీ లబ్ధిదారులు ఇంకా యూనిట్లను ఎంపిక చేసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రౌండింగ్ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. -
పాడెపై తల్లి.. తనయుల ఆస్తి లొల్లి
జమ్మికుంట: అనారోగ్యంతో తల్లి చనిపోతే అంత్యక్రియలు పూర్తిచేయాల్సిన తనయులు శవాన్ని ఇంటిముందే ఉంచుకుని పంపకాల పంచాయితీ మొదలుపెట్టారు. కన్నతల్లి శవాన్ని కాటికి పంపక ముందే ఖర్చుల విషయంలో గొడవపడ్డారు. ఈ అమానవీయ ఘటనను చూడలేకపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నివసించే సూదం అనసూర్య (85)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన భర్త రాజవీరు గతంలోనే చనిపోయారు. అప్పటినుంచి డిపెండెంట్ పింఛన్ అధారంగా అనసూర్య జీవనం సాగిస్తోంది. కొన్నినెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో జమ్మికుంటలోని చిన్నకొడుకు వద్ద ఉంటూ.. బుధవారం సాయంత్రం చనిపోయింది. వీణవంక మండలం గన్ముకులలో స్థిరపడిన మిగతా ముగ్గురు కొడుకులు జమ్మికుంటకు చేరుకున్నారు. తల్లి అంత్యక్రియలు, కర్మకాండలకు అయ్యే ఖర్చు, తల్లికి వస్తున్న పింఛన్, నివాసం ఉంటున్న ఇల్లు, ఇతర ఆస్తుల విషయం గురువారం నలుగురు కొడుకుల మధ్య గొడవకు దారితీసింది. చిన్నకొడుకు మిగతా ముగ్గురిని అంత్యక్రియల తరువాత వెళ్లిపోవాలని సూచించడంతో నలుగురి మధ్య పంచాయితీ ఏర్పడింది. తల్లి మృతదేహాన్ని ఇంటిముందు ఉంచుకుని గొడవలేంటని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సతీశ్ అక్కడకు చేరుకుని మృతురాలి కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చి కార్యక్రమం పూర్తిచేసేలా చూశారు. -
‘చల్మెడ’లో మరో ఐదుగురికి కరోనా
కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన చల్మెడ ఆనందరావు వైద్య కాలేజీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం మరో 50 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడిన మొత్తం వైద్య విద్యార్థుల సంఖ్య 50కి చేరింది. శనివారం కరోనా లక్షణాలతో ఉన్న వైద్య విద్యార్థులకు ఆదివారం పరీక్షలు నిర్వహించగా.. 45 మందికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్ జునేరియా మెడికల్ కాలేజీని సందర్శించి యాజమాన్యంతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 500 మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కరోనా బాధితులందర్నీ హోంక్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
ధాన్యం తూకం వేయరా
చిగురుమామిడి: ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కొందరు రైతులు పురుగు మందు డబ్బాతో మంచినీటి ట్యాంకు ఎక్కి నిరసనకు దిగారు. గురువారం ఉదయం కొనుగోలు కేంద్రంలో కాటాలు నిలిచిపోవడంతో ఆగ్రహించిన మరికొందరు రైతులు సెంటర్లోనే ధర్నాకు దిగారు. ఓ వైపు ట్యాంకు ఎక్కిన రైతులు, మరోవైపు కింద రైతుల ధర్నాతో ఏం చేయాలో పాలుపోక కేంద్రం నిర్వాహకులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల రాక ఆలస్యం కావడంతో రైతులు ఆగ్రహించారు. తమ ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూకం వేయడం లేదని, రైసు మిల్లు యజమానులు నూక పేరుతో బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు. నూకలవుతున్నాయనే సాకుతో 43 నుంచి 44 కిలోలు తూకం వేస్తూ రైతులను ముంచుతున్నారని వాపోయారు. రైతు సంఘం మండల కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బందెల శ్రీనివాస్, గట్టు జనార్దన్, మురళి, అందె రాయమల్లు, కుట్ల శ్రీనివాస్, గుమ్మడి బాలయ్య, మరో ఇద్దరు రైతులు ట్యాంకు పైనే ఉండగా.. అధికారులు స్పందించకుంటే పురు గు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని పలుమార్లు హెచ్చరించారు. సమాచారం అందుకున్న చిగురుమామిడి తహసీల్దార్ ముబీన్‌అహ్మద్, నయాబ్ తహసీల్దార్ చంద్రశేఖర్, చిగురుమామిడి ఎస్ఐ దాస సుధాకర్, ఐకేపీ సీసీ వెంకటేశ్వర్లు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. ఎలాంటి కొర్రీలు లేకుండా మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ట్యాంకు ఎక్కిన రైతులు కిందకు దిగారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అందె స్వామి తదితరులు పాల్గొన్నారు. -
రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్
కరీంనగర్ అర్బన్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో మొత్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గురువారం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల క్రమంలో కోడ్ పక్కాగా అమలవుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని కోరారు. -
రూ. 5 వేల కోట్లు తెచ్చి ఓట్లు అడగండి
హుజూరాబాద్: బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి హుజూరాబాద్ అభివృద్ధికి రూ.5 వేల కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని, అప్పుడే ఓట్లు అడగాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తోంది టీఆర్ఎస్ సర్కారేనని తెలిపారు. అందుకే తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్, వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన పలువురు యువకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లు అయిందని, వీణవంకలో రూ.10 లక్షల పనైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే లాభం ఏంటో చెప్పాలని, ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు, బీజేపీకి లాభమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం సాధిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభమని అన్నారు. ఇదిలా ఉండగా జమ్మికుంటలో కూడా మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి దాదాపు 500 మంది నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరకముందే హుజూరాబాద్ ప్రాంతం గులాబీ అడ్డాగా ఉండేదని అన్నారు. టీఆర్ఎస్లోకి ఆయన ఒక్కరే వచ్చారని, ఇప్పుడు కూడా ఒక్కరే బయటకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. -
ఏడాదిలో ఆదాయం రెట్టింపవ్వాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా ఏడాదిలోగా రెట్టింపు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని దళితబంధు లబ్ధిదారులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. హుజూరాబాద్‌లో దళితబంధు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఆర్థిక సాయం పొందిన 15 మంది లబ్ధిదారులకు మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో కర్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు కింద యూనిట్ల ఎంపికకు తొందరపడొద్దని, వారంపాటు సమయం ఇస్తామని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు కొత్తగా దళితబంధు ఖాతాలు తెరవాలని సూచించారు. యూనిట్ స్థాపించుకునేందుకు కుటుంబ సభ్యులతో చర్చించి ఎంపిక చేసుకోవాలన్నారు. యూనిట్ల ఎంపికపై జిల్లా అధికారులతో పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల నిర్వాహణకు 10–15 రోజులు పూర్తి స్థాయిలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా వృత్తి నైపుణ్యత శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. అవగాహన సమావేశానికి హాజరైన 15 మంది లబ్ధిదారుల్లో కొందరు పాడి గేదెలు (డెయిరీ యూనిట్లు), గూడ్స్ ట్రెయిలర్, ట్రాక్టర్ ట్రెయిలర్, కారు, సూపర్ బజార్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేడీస్ ఎంపోరియం యూనిట్ ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. వాహనాలు ఎంపిక చేసుకున్న వారికి బుధవారం లెర్నింగ్ లైసెన్సు జారీ చేయాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి నేతనియల్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నరేందర్, ఎల్డీఎం లక్ష్మణ్, ఆర్సెటీ మేనేజర్ దత్తాత్రేయ, నాబార్డు ఏజీఎం అనంత్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులను కరీంనగర్‌లోని విజయపాల డెయిరీకి తీసుకెళ్లారు. పాల శీతలీకరణ, పెరుగు, నెయ్యి తయారీ, మజ్జిగ, బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ తయారీలు, దాణా, గడ్డి పెంపకం, శిలీంద్ర మొక్కలు పెంపకం, గడ్డి కత్తిరించే యంత్రాలు ఆవుల షెడ్ వాటి నిర్వహణ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. -
Huzurabad: ఈటలను దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ రోడ్‌మ్యాప్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాషాయ తీర్థం పుచ్చుకునే తేదీ ఖరారైంది. ఈనెల 14న ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు శామీర్‌పేటలోని నివాస గృహానికి బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులంతా వచ్చి ఈటలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతోపాటు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ కూడా బీజేపీలో చేరనున్నారు. ఇదంతా ఊహించినదే అయినా.. ఈటల బీజేపీలో చేరిన తరువాత చోటు చేసుకునే పరిణామాలపై ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. బీజేపీలో చేరడానికి ముందే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుండడంతో ఉప ఎన్నికకు శంఖారావం ఊదినట్టే. ఈ పరిస్థితుల్లో గెలుపు కోసం ఈటల తరఫున బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రణరంగంలోకి దిగబోతున్నాయి. ఈటలను హుజూరాబాద్‌లో ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఇప్పటికే పక్కా ప్రణాళికతో రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. బీజేపీ కూడా అందుకు రెడీ అయింది. టీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో హరీశ్‌రావు నేతృత్వంలోని కమిటీ ఉప ఎన్నికను పర్యవేక్షించనుంది. బీజేపీ తరఫున హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఇన్‌చార్జీలుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను నియమించారు. ఈ నెల 15 నుంచి వీరంతా కార్యరంగంలోకి దిగనున్నారు. పర్యవేక్షకులుగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. సీఎం కేసీఆర్‌తో గంగుల భేటీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖాయమని తేలిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. హుజూరాబాద్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, టీఆర్ఎస్ ముఖ్య నేతలు మండలాల వారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, టీఆర్ఎస్ శ్రేణుల వైఖరి తదితర అంశాలను సీఎంకు వివరించినట్లు సమాచారం. మండలాల వారీగా సమావేశాలు జరుపుతున్నప్పుడు ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల కనిపిస్తున్న అభిమానం, ఈటలపై వ్యతిరేకతను కూడా ఆయన వివరించినట్లు తెలిసింది. హుజూరాబాద్‌లో విజయమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో పనిచేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. కాగా.. 13, 14 తేదీల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో మండలాల వారీగా చేపట్టబోయే కార్యక్రమాల రోడ్ మ్యాప్‌ను ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు సిద్ధం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు వి.సతీశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, రమేశ్, చల్లా ధర్మారెడ్డి ఐదు మండలాల్లో పర్యటిస్తూ ప్రజలను, కార్యకర్తలను టీఆర్ఎస్కు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. బీజేపీ ఇన్చార్జీల నియామకం ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయం కావడంతో ఆ పార్టీ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. 14న ఈటల ఢిల్లీలో బీజేపీలో చేరిన వెంటనే హుజూరాబాద్‌లో కార్యరంగంలోకి దిగాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. శుక్రవారం రాత్రి నియోజకవర్గంలో మండలాల వారీగా బీజేపీ ఇన్చార్జీలను నియమించారు. కమలాపూర్‌కు ధర్మపురి అర్వింద్, హుజూరాబాద్‌కు ఎమ్మెల్యే రఘునందన్ రావు, వీణవంకకు సోయం బాపూరావు, జమ్మికుంట, ఇల్లంతకుంటలకు ఎమ్మెల్యే రాజాసింగ్‌లను నియమించారు. పర్యవేక్షకులుగా బండి సంజయ్, కిషన్‌రెడ్డి వ్యవహరిస్తారు. చదవండి: ఈటలపై బరిలోకి కౌశిక్‌రెడ్డి?! -
కొత్త జోన్లు: మన ఉద్యోగాలు ఇక మనకే!
కరీంనగర్ అర్బన్: రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాజముద్ర పడింది. ఇక నియామకాల్లో నూతన అధ్యాయం మొదలు కానుంది. ఏ స్థాయి పోస్టులైనా 95 శాతం స్థానికులకే అవకాశం దక్కనుంది. ఈ క్రమంలో శాఖల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. నూతన జోన్ల ప్రకారమే పోస్టుల భర్తీ ఉండనుందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న విధానానికి మంగళం పాడుతూ నూతన విధానాన్ని ప్రవేశపెట్టగా గత లోపభూయిష్ట విధానాలకు చరమగీతం పాడుతూ అటెండర్ నుంచి గెజిటెడ్ అధికారి వరకు అన్ని శాఖల్లో ఒకే విధానముండేలా సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల్లో ఉన్న భయాందోళనలను తొలగిస్తూ పాత ఉద్యోగులు అలాగే ఉండనుండగా జారీ అయ్యే ఉద్యోగ ప్రకటనల దరిమిలా నూతన విధానం కొనసాగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో స్థానికేతర పోస్టుల్లో గల మూస ధోరణికి అడ్డుకట్ట వేయగా.. ఇక స్థానికులను ఉద్యోగాలు వరించనున్నాయి. మొత్తానికి ఏళ్లుగా ఊరిస్తున్న జోనల్ వ్యవస్థకు పచ్చజెండా ఊపడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు, బదిలీలకు సముచిత స్థానమిస్తూ జిల్లాలను విభజించి జోన్లుగా ఖరారు చేయగా, కరీంనగర్‌ను రాజన్న జోన్‌గా ఖరారు చేశారు. మల్టీజోన్లుగా రాజన్న, కాళేశ్వరం, బాసర, భద్రాద్రిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా మూడు ముక్కలు జిల్లాల విభజనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలుగా విభజింపబడిన విషయం విదితమే. ఇక హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కలవగా మంథని డివిజన్లోని పలు మండలాలు భూపాలపల్లి జిల్లాకు, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు వరంగల్ అర్బన్ జిల్లాలో కలిశాయి. ఈ క్రమంలో మళ్లీ జోనల్ వ్యవస్థ తెరపైకి రావడంతో వివిధ జోన్లలో కలిశాయి. జిల్లాలు విభజింపబడగా బదిలీలు, పదోన్నతులు పాతజిల్లా ప్రకారం ఉండనుండగా కొత్తగా నియామకమైన వారికి నూతన వి«ధానం అమలుకానుంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్లో చేర్చగా పెద్దపల్లి జిల్లాను కాళేశ్వరం జోన్లో, జగిత్యాల జిల్లాను బాసర జోన్లో చేర్చారు. నూతన విధానంతో ప్రయోజనాలు.. ఇప్పటివరకు కొనసాగుతున్న నియామక ప్రక్రియలో జిల్లాస్థాయి పోస్టులకు సంబంధించి 80 శాతం స్థానికత, 20 శాతం ఓపెన్ కేటగిరీ ఉండేది. జోనల్ స్థాయిలో 70 శాతం స్థానికత, 30 శాతం ఓపెన్ కేటగిరీ, రాష్ట్రస్థాయిలో 60 శాతం స్థానికత, 40 శాతం ఓపెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేసేవారు. దీంతో స్థానికత విషయంలో బాగానే ఉన్నా ఓపెన్ కేటగిరీలో మాత్రం అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులన్నీ 95 శాతం స్థానికత 5 శాతం స్థానికేతరులకు కేటాయించడంతో మన ఉద్యోగాలు మనకేనని స్పష్టమవుతోంది. ఏ స్థాయి పోస్టులైనా ఇదే విధానం అమలు కానుండటంతో వేల పోస్టులు తెలంగాణ యువతకు దక్కనున్నాయి. రాజన్న జోన్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల నూతన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్లో చేరనుండగా 43.09 లక్షల జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు కలిపి రాజన్న జోన్‌గా ఉండనుండగా జోనల్ పోస్టులన్నింటినీ ఈ పరిధిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. ఇక అన్ని శాఖలకు ఒకే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు జిల్లాస్థాయిలో బదిలీలు, పదోన్నతులు నిర్వహించనుండగా సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్లను జోన్ పరిధిలో, గెజిటెడ్ అధికారులు, డీటీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏటీవో, ఎస్టీవో ఇలా వివిధ రకాల హోదా గల అధికారులకు మల్టీజోన్ వారీగా బదిలీ, పదోన్నతులు ఉండనున్నాయి. ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులకు రాష్ట్రస్థాయిలో బదిలీలుండనున్నాయి. రాజన్న జోన్ మల్టిజోన్–1లో ఉండనుంది. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్ -
‘పిల్లగాడు గెలుస్తడా అన్నరు. కానీ గెలిపించిండ్రు’
సాక్షి, హుజూరాబాద్: ‘‘ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ అంతిమ విజయం వాటిదే. కులం, డబ్బు, పార్టీ, జెండాలను కాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు నేను ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ గాయపడినా నా మనసు మార్చుకోను. నాలాంటి వాడు మీముందుకు వచ్చి దేహీ అనే పరిస్థితి మంచిది కాదు..’’అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల భావోద్వేగంగా మాట్లాడారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘నేను చేసిన పనులు చెప్పుకునే అక్కర్లేదు. నేను కొత్తగా వచ్చిననాడు ఈ పిల్లగాడు గెలుస్తడా అన్నరు. కానీ మీరు ఆశీర్వదించి గెలిపించారు. 20 ఏళ్లుగా నా చరిత్ర మీ కాళ్ల దగ్గర పెట్టిన. మళ్లీ ఇప్పుడు వచ్చి పని చేస్తానో లేదో చెప్పుకునే దుస్థితి ఉంటుందా? నేను ఎలాంటి వాడినో, ఎవరి కోసం తపన పడతానో మీకు తెలుసు’’అని ఈటల అన్నారు. పథకాలు పేదరికానికి పరిష్కారం కాదన్నారు. ‘పరిగె ఏరుకుంటే రాదు.. పంట పండితే వస్తుంది’అనే సామెత ఉందని.. అలాగే కల్యాణలక్ష్మి, పెన్షన్లు, రేషన్ కార్డులు పేదరికానికి పరిష్కారం కాని వ్యాఖ్యానించారు. అందరూ తమ కాళ్లమీద తాము నిలబడే సత్తా తీసుకురావాలని.. పని చేయగలమనే కాన్ఫిడెన్స్ రావాలని చెప్పారు. ఊరంతా ఒక దారైతే.. ఊరంతా ఒకదారైతే ఊసరవెల్లిది ఇంకోదారి అన్నట్టు కొందరు ఉంటారని.. బంగారు గొలుసులు, ఉంగరాలు పెట్టుకుంటే గొప్పతనం కాదని, దానం చేసే గుణం ఉండాలని ఈటల పేర్కొన్నారు. మహాభారతంలో కౌరవులు, దుర్యోధనుడు వంటివారు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చిందని.. సమాజంలో అందరూ ఒకే విధంగా ఉండరని చెప్పారు. నాయకులంటే భారీ ఆకారంతో, ఆభరణాలతో, కులంతో పని ఉండదని.. ప్రజల కన్నీళ్లు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి అని పేర్కొన్నారు. రైతు బాగుంటే ఊరంతా బాగుంటుందని, అలాంటి రైతుకు ఆసరాగా ఉండేందుకే రైతు వేదిక వచ్చిందని చెప్పారు. తాను ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు మచ్చ తీసుకురానని, రుణం తీర్చుకుంటానని ఈటల అన్నారు. చదవండి: కరోనా కేసులతో తెలంగాణ సర్కార్ అలర్ట్ -
ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్వేర్ యువ జంట
ఏడేళ్ళ క్రితం ఈ యువ దంపతులు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మంచి జీతం, మహానగరంలో నివాసం.. ఇవేమీ వారికి తృప్తిని ఇవ్వలేదు. సహోద్యోగి కుమార్తె సహా బంధు మిత్రులలో కొందరు కేన్సర్ మహమ్మారి బారిన పడ్డారు. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే అందుకు మూల కారణమని గ్రహింపు కలిగింది. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి స్ఫూర్తినిచ్చి దారిచూపింది. అలా.. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఆరోగ్యవంతమైన జీవనాన్ని వెతుక్కుంటూ స్వగ్రామానికి మకాం మార్చారు. సమీకృత ప్రకృతి వ్యవసాయం చేపెట్టి విజయపథంలో ముందడుగు వేస్తూ జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకూర్మపల్లి గ్రామం ఓ మారుమూల పల్లెటూరు. అయిదు వందల జనాభా కూడా లేని ఈ పల్లెటూరు పేరు ఇటీవల జాతీయ స్థాయిలో వినిపించింది. గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మావురం లక్షా్మరెడ్డి కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు మల్లికార్జున్ రెడ్డి బీటెక్ చదివి హైదరాబాద్‌లో స్టాప్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేశారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన సంధ్యతో 2010లో వివాహం జరిగింది. ఎంబీఏ పూర్తి చేసిన సంధ్య కూడా మూడేళ్ళు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్‌రెడ్డి సహోద్యోగి కుమార్తెకు కేన్సర్ జబ్బుపాలైంది. అదేవిధంగా తమ గ్రామానికి చెందిన వారు ముగ్గురికి కేన్సర్ వచ్చింది. ఇతరత్రా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారెందరో. తమ సహాయం కోసం ఊరి నుంచి వచ్చిన వారితో పాటు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు.. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే ఈ జబ్బులకు మూల కారణం అన్న నిశ్చితాభిప్రాయం కలిగింది. అదే కాలంలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం కూడా మల్లికార్జున్‌రెడ్డి, సంధ్య దంపతులను ప్రభావితం చేసింది. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి స్వగ్రామంలో ప్రకృతి సేద్యం చేపట్టారు. విద్యార్థినులతో మల్లికార్జునరెడ్డి తినేవన్నీ సేంద్రియంగా పండించుకున్నవే.. మల్లిఖార్జున్ రెడ్డి, సంధ్యారెడ్డి సొంత భూమి 14 ఎకరాల్లో సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించారు. ఇంటికి అవసరమైన ఆహార పదార్థాలన్నిటినీ రసాయనాలు లేకుండా పండించుకుంటున్నారు. ధాన్యంతో పాటు, నూనెల కోసం పల్లీలు, నువ్వులు, పెసర, కంది పప్పులు, మిర్చి, ఉల్లి, ఎల్లి గడ్డలు, కొత్తిమీర, ఆవాలు, అల్లం వంటి పంటలను తగిన మోతాదులో సాగు చేసుకుంటున్నారు. రసాయనాలు లేని అమృతాహారాన్ని స్వీకరిస్తూ ఇంటిల్లపాదీ పిల్లా పాపలతో పాటు ఆనందంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు యువన (7), ఆద్విక (5). వీరి ఆలనా పాలనా చూస్తూనే, ఇంటి పనితో పాటు వ్యవసాయ పనులు కూడా చేస్తున్నారు సంధ్య. ఎకరానికి రూ. లక్ష నికరాదాయం మల్లికార్జునరెడ్డి నిత్యం స్వయంగా పొలం పనిలో నిమగ్నమై ఉంటారు. వరి నాట్ల కాలంలో రోజుకు 23 కి.మీ. మేర నడుస్తూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇతర కాలాల్లో రోజుకు 7 కి.మీ. మేర నడుస్తూ పొలం పనులు చేస్తుంటారు. వెద పద్ధతిలో వరి విత్తనాన్ని తానే స్వయంగా రోజుకు 3 ఎకరాల్లో విత్తటం, ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయటం ద్వారా ఖర్చును ఎకరానికి రూ. 25 వేలకు తగ్గిస్తున్నానని మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. ఇతరులకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతోందన్నారు. ప్రస్తుతం 18 ఎకరాల్లో విత్తన కంపెనీలతో ఒప్పందం (క్వింటా రూ. 2 వేలు) చేసుకొని వరి విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పశువుల ఎరువు, మాగబెట్టిన కోళ్ల ఎరువు, జీవామృతం, జీవన ఎరువులు వాడుతున్నారు. తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని ఏడేళ్లలో 0.5 నుంచి 1.5కి పెంచుకున్నారు. ఎకరానికి ఏటా (2 పంటలు) 60 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నారు. ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతున్నారు. వర్షపు నీటిని నేల బావిలోకి ఇంకింపజేస్తూ నీటి భద్రతను సాధించారు. పొలంలో మల్లికార్జునరెడ్డి, పశువులకు మేత వేస్తూ.. ఎకరంన్నరలో వస పంట సాగు ఎరంన్నరలో వస కొమ్ములను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. నల్ల నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు కూడా దీని సాగుకు అనుకూలం. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఔషధ మొక్కల విభాగంతో (క్వింటా రూ. 9 వేలు) కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. మరో నెల రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ఎకరానికి కనీసం 20 క్వింటాళ్లు రావచ్చని ఆశిస్తున్నారాయన. పంటలతో పాటు 3 ఆవులు, 10 పొట్టేళ్లు, 54 నల్ల మేకలు, 50 వనరాజా కోళ్లను సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు ఈ యువ దంపతులు. వ్యవసాయ విద్యార్థులకు 6 నెలలు సాగు పనులు నేర్పిస్తున్నారు. మల్లికార్జునరెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ–ఢిల్లీ) బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ జాతీయ అవార్డును ఇటీవలఅందుకున్న తర్వాత రైతు సందర్శకుల తాకిడి పెరగటం విశేషం. – వెల్మ విజేందర్ రెడ్డి, సాక్షి, చొప్పదండి వద్దన్న వారే అభినందిస్తున్నారు ఏడేళ్ళ క్రితం గ్రామంలో ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని వచ్చాం. పట్టణంలో సాఫ్ట్వేర్ జాబ్ వదిలి పల్లెటూరుకు ఏం పోతారు అని చాలా మంది అన్నారు. సమీకృత వ్యవసాయంతో పంటల సాగును లాభాల బాట పట్టించాం. మా ఆయన ఉదయం నుండి రాత్రి వరకు పంటల సాగుతో పాటు ఆవులు, గొర్రెలు, మేకలు, చేపల పెంపకం, నాటు కోళ్ళ పెంపకం పనుల్లో తలమునకలై ఉంటారు. ఇంటికి కావల్సిన పంటలను పండించడం చేస్తున్నాను. జాతీయ స్థాయిలో మాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. అప్పుడు పల్లెటూరుకు వద్దన్న వారే ఇప్పుడు అభినందిస్తున్నారు. – మావురం సంధ్యారెడ్డి, పెద్దకూర్మపల్లి వరి విస్తీర్ణం తగ్గిస్తా సాగు ఖర్చులు సగానికి సగం తగ్గించుకోవచ్చని నేను రుజువు చేశాను. వెద వరి, నీటి ఆదా తదితర పద్ధతులతోపాటు విత్తన వరి ఒప్పంద సేద్యం ద్వారా ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయం పొందుతున్నాను. వరి విస్తీర్ణాన్ని సగం తగ్గించి, ఆరుతడి పంటలు సాగు చేస్తా. పంటలతోపాటు పశువులు, కోళ్లు, చేపలను పెంచితేనే రైతుకు రసాయన రహిత ఆహార భద్రత, ఆదాయ భద్రత ఉంటుంది. నా అనుభవాలతో ఆహార–వ్యవసాయ సంస్థ కోసం పుస్తకం రాస్తున్నా. ఎఫ్.పి.ఓ. ఏర్పాటు చేసి రైతులకు బాసటగా నిలవాలన్నది లక్ష్యం. – మావురం మల్లికార్జునరెడ్డి (97040 90613), ఐఎఆర్ఐ ఉత్తమ ఇన్నోవేటివ్ రైతు అవార్డు గ్రహీత, పెద్దకూర్మపల్లి, చొప్పదండి మం, కరీంనగర్ జిల్లా -
ఒకప్పుడు భయపడేవారు.. ఇప్పుడు ప్రశంసలు!
రామగుండం క్రైం: రోడ్డుపై వంద రూపాయలు దొరికితే.. ఎవరూ చూడకుండా టక్కున జేబులో పెట్టుకునే ఈ రోజుల్లో రామగుండం పారిశ్రామిక ప్రాంత ఆటోడ్రైవర్లు నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్నారు. ప్రయాణికులు హడావుడిలో తమ వాహనాల్లో మరిచిపోయిన సొమ్మును తిరిగి వారికి అప్పగిస్తున్నారు. నగదు, ఆభరణాలు కళ్ల ముందే ఉన్నా కాజేయాలనే ఆలోచన చేయకుండా వాటిని పోగొట్టుకునేవారు పడే బాధను పెద్ద మనసుతో అర్థం చేసుకుంటున్నారు. ఆటో యూనియన్ నాయకులు, పోలీసుల సహకారంతో సొత్తును అప్పగిస్తూ అటు బాధితుల ప్రశంసలు.. ఇటు పోలీసుల అభినందనలు అందుకుంటున్నారు. గతంలో ఈ ప్రాంత ఆటోడ్రైవర్లు అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడేవారనే అపఖ్యాతి ఉండేది. ఇప్పుడు అది చెరిగిపోయింది. క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం చాటుకుంటూ హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారు. 12 తులాల బంగారు ఆభరణాలు.. గోదావరిఖని తిలక్‌నగర్ డౌన్‌కు చెందిన హలీమా శుక్రవారం పనిమీద బస్టాండ్ కాలనీకి వెళ్లింది. అక్కడ 12 తులాల బంగారు ఆభరణాలు బ్యాగులో వేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు మున్సి పల్ ఆఫీస్ వద్ద ఆటో ఎక్కింది. తర్వాత బ్యాగును ఆటోలోనే మరిచిపోయి ఇంటికి వెళ్లింది. కాసేపటికి గుర్తించిన ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే తన ఆటోలో బ్యాగు ఉన్న విషయం గుర్తించిన రమేశ్‌నగర్ ఆటో అడ్డాకు చెందిన ఆటోడ్రైవర్ మహమ్మద్ అజ్గర్ ఉరఫ్ అజ్జు అడ్డా వద్దకు చేరుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన క్రైమ్ పార్టీ పోలీసుల సాయంతో బ్యాగును పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. పోలీసులు దాన్ని శనివారం ఆటోడ్రైవర్ చేతుల మీదుగా బాధిత మహిళకు అందించారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్‌ను సీఐ రమేశ్‌బాబు, ఆటో యూనియన్ నాయకులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నరసరావు పేటకు చెందిన బంగారం వ్యాపారులు తమ వ్యాపారం నిమిత్తం గత నెల 23న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి కారులో బయలుదేరారు. రామగుండం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్యాలపల్లి రైల్వే బ్రిడ్జి కింద మూలమలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. 108 సిబ్బంది వారిని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది తోట రాజేందర్, ఎండీ.చాంద్పాషాలు క్షతగాత్రుల వద్ద లభించిన సుమారు కేజీ బంగారాన్ని పోలీసులకు అందించారు. వారిని సీఐ కరుణాకర్, ఎస్సై మామిడి శైలజ అభినందించారు. పెళ్లికి వస్తూ నగలు మరిచిపోయి.. 2020 డిసెంబర్ 3న కొత్తగూడెం గౌతమీపూర్కు చెందిన కల్లేపల్లి లింగయ్య గోదావరిఖనిలో ఉంటున్న సోదరుడి కూతురు పెళ్లి కోసం వచ్చాడు. తన వెంట బంగారు ఆభరణాలు, నగదు తీసుకొచ్చాడు. ఉదయం గోదావరిఖని బస్టాండ్‌లో బస్ దిగి గాంధీనగర్‌కు ఆటోలో వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగ్ ఆటోలో మరిచిపోయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు బస్టాండ్‌కు వెళ్లి, సీసీ పుటేజీ ఆధారంగా గొల్ల శ్రీనివాస్ ఆటోగా గుర్తించారు. అతడిని ఫోన్లో సంప్రదించగా, బ్యాగ్ గురించి తనకు తెలియదని.. తన తమ్ముడి ఆరోగ్యం బాగా లేక కరీంనగర్ వచ్చానని తెలిపాడు. ఎందుకైనా మంచిది ఆటోలో సీటు వెనక ఒకసారి చెక్ చేయాలని పోలీసులు సూచించాడు. వారు సీటు వెనక చూడగా 35 గ్రాముల బంగారం, రూ.54 వేలు ఉన్న బ్యాగు దొరికింది. దీంతో బాధితులు కరీంనగర్ వెళ్లి బ్యాగు తీసుకున్నారు. నిజాయితీగా సొత్తు అప్పగించిన ఆటోడ్రైవర్ శ్రీనివాస్‌ను అభినందించారు. బంధువుల ఇంటికి వస్తూ.. హైదరాబాద్‌కి చెందిన ఆవుల అజయ్ ఫ్యావిులీతో గోదావరిఖనిలో బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు 2018 ఫిబ్రవరి 23న సికింద్రాబాద్–కాగజ్‌నగర్ రైలులో వచ్చారు. రాత్రి రామగుండం రైల్వేస్టేషన్లో దిగి, ఎండీ.తహరొదీ్దన్ ఆటో ఎక్కి గోదావరిఖని బస్టాండ్‌లో దిగారు. ఈ క్రమంలో బ్యాగును అందులోనే మరిచిపోయినట్లు ఇంటికెళ్లాక గుర్తించారు. అందులో 6 తులాల బంగారు ఆభరణాలు, ఖరీదైన దుస్తులు ఉండటంతో వెంటనే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నీలారపు రవికి సమాచారం ఇచ్చారు. అయితే ఆటోడ్రైవర్ తహరొద్దీన్ మరునాడు ఉదయం ఆటోలో బ్యాగును గుర్తించి, యూనియన్ ప్రెసిడెంట్‌కు తెలిపాడు. వెంటనే ఇద్దరూ ఆటోడ్రైవర్లతో కలిసి బ్యాగుతో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు అప్పగించారు. బ్యాగును తనిఖీ చేసిన బాధితులు అన్నీ సరిగా ఉన్నాయని చెప్పడంతో ఆటోడ్రైవర్‌ను పోలీసులు అభినందించారు. ఊరికి వెళ్లే తొందరలో.. గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన కాసర్ల భారతి 2020 జూలై 8న కరీంనగర్ వెళ్లేందుకు గోదావరి ఖని బస్టాండ్‌కు రావడం కోసం గాంధీ చౌరస్తాలో ఆటో ఎక్కింది. బస్టాండ్‌లో పాయింట్ వద్ద బస్సు సిద్ధంగా ఉండటంతో ఊరికి వెళ్లాలనే తొందరలో ఆటో దిగుతుండగా ఆమె పర్సు అందులోనే పడిపోయింది. బస్సు ఎక్కిన తర్వాత పర్సు కనిపించకపోవడంతో వెంటనే దిగి ఆటో డ్రైవర్ కోసం గాలి ంచింది. అతను కనిపించకపోవడంతో ట్రాఫిక్ పో లీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాసేపటికి ఆటోడ్రైవర్ బస్టాండ్ ఆటో అడ్డా యూనియన్ ప్రెసిడెంట్ కనుకుంట్ల నారాయణకు తనకు పర్సు దొరికిందని తీసుకెళ్లి ఇచ్చాడు. ఇద్దరూ దాన్ని ఓపెన్ చేయకుండానే పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు అప్పగించా రు. ప్రయాణికురాలి ముందు పర్సు ఓపెన్ చేయగా అందులో తులం బంగారం, రూ.5 వేలు ఉన్నా యి. భారతి అవి తనవే అని చెప్పడంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్ల సమక్షంలో బాధితురాలికి అందజేశారు. నారాయణను పోలీసులు, బాధితురాలు అభినందించారు. మహిళ ప్రాణాలు కాపాడి... గోదావరిఖని శివారులోని గోదావరి వంతెన పైనుంచి మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఓ మహిళ నదిలో దూకింది. ఆ సమయంలో గోదావరిఖని నుంచి ప్రయాణికులను తీసుకొని ఆటోడ్రైవర్ రహ్మత్‌బేగ్ మంచిర్యాల వైపు వెళ్తున్నాడు. వంతెన వద్ద జనం గుమిగూడి ఉండటంతో ఏం జరిగిందని అక్కడి వారిని ఆరా తీయగా.. మహిళ నదిలో దూ కిందని చెప్పారు. వెంటనే ఆటో దిగి, నదిలో మహిళ కొట్టుకోవడం గమనించాడు. ఆలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి దూకేశాడు. వెంటనే పైన ఉన్నవారు వేసిన తాడు సాయంతో ఈదుకుంటూ మహి ళ దగ్గరకు వెళ్లి కాపాడాడు. తర్వాత పడవ ఎక్కించాడు. అయితే అంతలోతు నీటిలో ఆమెను కాపాడటంతో తాను కూడా అలసిపోయానని బేగ్ తెలి పాడు. చివకు బాధితురాలిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఒకప్పుడు భయపడేవారు.. రామగుండం పారిశ్రామిక ప్రాంత ఆటోడ్రైవర్లు అంటే ప్రయాణికులు ఒకప్పుడు భయపడేవారు. కానీ ఇప్పుడు నిజాయితీకి మారుపేరుగా నిలవడం సంతోషంగా ఉంది. పోలీసులు మాకు కౌన్సెలింగ్ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, సూచనలు ఇస్తున్నారు. డ్రైవర్లు మా యూనియన్ నాయకులకు, యూనియన్‌కు మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉంది. – నీలారపు రవి, ఆటో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అంతా గప్‌చుప్!
సాక్షి, కరీంనగర్ : రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన స్పష్టమైన ప్రకటన ప్రభావం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో స్పష్టంగా కనిపించింది. ‘కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం అవుతారు. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సీఎం అయితే తప్పేముంది?’ అని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో వ్యాఖ్యానించి చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. ఈ మాటలు సోషల్ మీడియాలో, వార్తా పత్రికల్లో రావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ‘సీఎంగా కేటీఆర్ సమర్థుడు’ అనే వాదనను తెరపైకి తెచ్చారు. జిల్లాకు చెందిన మరో మంత్రి గంగుల కమలాకర్ కూడా హైదరాబాద్‌కు చెందిన పశుసంవర్థక శాఖ మంత్రితో కలిసి గత నెలాఖరులో మీడియాతో మాట్లాడుతూ ‘కేటీఆర్ ఎప్పుడు సీఎం అవుతారనే విషయాన్ని పెద్దసారు నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో సైతం ‘కేటీఆర్ సీఎం అవుతారు అనే మాటకు కట్టుబడి ఉన్నా’ అని పునరుద్ఘాటించారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ‘మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా...’ అని స్పష్టం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. సోమవారం ఉమ్మడి జిల్లాలో మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా గంభీర వాతావరణంలో కార్యక్రమాలు సాగాయి. చదవండి: కేటీఆర్ సీఎం ప్రచారంపై కేసీఆర్ క్లారిటీ ఏక్ బార్.. అమ్మకముందే భారీ ఆదాయం..! కేంద్ర చట్టాలపై ఆచితూచి మాట్లాడిన ‘ఈటల’ గత వారం హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన ‘రైతువేదిక’ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల్లో ఉత్సాహం నింపారు. నాలుగు రోజులపాటు సాగిన ఆయన పర్యటనల్లో మాట్లాడుతూ రైతు తాను పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో 70 రోజులుగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అయితే కేంద్రం ప్రతి పాదించిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఒకరోజు బంద్ నిర్వహించిన టీఆర్ఎస్ తరువాత దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. మంత్రి ఈటల మాత్రమే తన గొంతును బలంగా వినిపించగా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఈటల ను ప్రశంసిస్తూ బహిరంగ ప్రకటన చేశారు. కాగా సోమవారం మంథనిలో రైతువేదిక ప్రారంభోత్సవంతోపాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఈటల ఆచితూచి మాట్లాడారు. వ్యవసాయ చట్టాల అమలులో కేంద్రం రైతుల సంక్షేమ బాధ్యత నుంచి తప్పుకోవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. ఢిల్లీలో రైతుల ఆందోళన, సంఘీభావం విషయాలను ఎక్క డా ప్రస్తావించలేదు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం చేసిన కృషిని, కాళేశ్వరం ప్రాజెక్టు, తీరిన విద్యుత్ కొరత వంటి అంశాలపై ప్రసంగంలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు పాలనలో రైతులు పడ్డ బాధల గురించి తనదైన ధోరణిలో విమర్శలు చేశారు. ఎంఎస్పీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని సుతిమెత్తగా డిమాండ్లు చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశం ప్రభావం మంత్రి ఈటల ప్రసంగంపై పడిందనే అభిప్రాయం వ్యక్తమైంది. సిరిసిల్లలో ఉత్సాహంగా మంత్రి కేటీఆర్ పర్యటన సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటన సోమవారం సాగింది. గంభీర్రావు పేట మండలంలోని పలు కార్యక్రమాల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయనతోపాటు హాజరైన ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు వంటి వారు కూడా మంత్రి వెంట ఆహ్లాదంగా గడిపారు. ప్రసంగాల్లో ఎక్కడా రాజకీయ అంశాలు చోటు చేసుకోలేదు. కేవలం అభివృద్ధి, ముఖ్యమంత్రి చేస్తున్న కృషి గురించి మాత్రమే కేటీఆర్‌తోపాటు ఇతర నేతలు తమ ప్రసంగాల్లో వివరించారు. కార్యక్రమాలకు హాజరైన నాయకులు, పార్టీ శ్రేణులు కూడా ‘రాజకీయ’ వాతావరణం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ సభ్యత్వంపైనే అందరి దృష్టి సీఎం మార్పుపై ఊహాగానాలకు తెరపడడంతో పార్టీ ప్రజాప్రతినిధులు సభ్యత్వ నమోదుపైనే దృష్టి సారించారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 నుంచి నియోజకవర్గాల వారీగా సభత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాల వారీగా సభ్యత్వ నమోదుకు ఇన్‌చారి్జలను నియమించారు. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌కు కోలేటి దామోదర్ గుప్త, పెద్దపల్లికి లోక బాపురెడ్డి, రాజన్న సిరిసిల్లకు కర్ర శ్రీహరి, జగిత్యాలకు ఎమ్మెల్సీ భానుప్రసాద రావును నియమించారు. సీఎం మార్పు ఉండబోదని, తానే మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఎవరూ నోరు మెదపకూడదని కూడా పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లాయి. -
తండ్రి మరణించిన అరగంటకే కుమారుడు..
ఓదెల (పెద్దపల్లి): తండ్రి మరణించిన అరగంటకే కొడుకు మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం, ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ మాజీ చైర్మన్, పెద్దపల్లి జిల్లా పెద్దకొమిర గ్రామానికి చెందిన పల్కల బస్వారెడ్డి (78)కి భార్య సత్యవతి, కుమారులు వాసుదేవరెడ్డి, రమేశ్‌రెడ్డి, కూతురు ఉన్నారు. కొద్దిరోజులుగా బస్వారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని పెద్ద కొడుకు వాసుదేవరెడ్డి వద్ద ఉంటూ చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం వాసుదేవరెడ్డి కూడా తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న బస్వారెడ్డి ఆదివారం మరణించారు. తండ్రి మరణ వార్త విన్న వాసుదేవరెడ్డి (44) ఆసుపత్రిలోనే మృతిచెందాడు. ఒకేరోజు తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. రాత్రి స్వగ్రామంలో ఇద్దరి అంత్యక్రియలు జరిగాయి. వాసుదేవరెడ్డికి భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. -
కాషాయ క్రమ‘శిక్ష’ణ షురూ!
సాక్షి, కరీంనగర్: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర రథ సారథి బండి సంజయ్ సొంత జిల్లా నుంచే పార్టీని గాడిలో పెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఉంటూనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్ద బాధ్యతలు మోస్తున్న సంజయ్ కరీంనగర్ కమలదళం నుంచే కొరడా ఝులిపించే పనిలో పడ్డారు. పార్టీ జిల్లా బాస్‌గా కీలక బాధ్యతల్లో ఉన్న నాయకుడు పార్టీలోకి కొత్తగా వచ్చిన ఓ మహిళ ట్రాప్‌లో చిక్కుకున్న వీడియో, ఆడియో గురువారం రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వచ్చే నెలలో దుబ్బాక ఉప ఎన్నికకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా స్థానిక ఛానెల్ ద్వారా సోషల్ మీడియాలో వీడియో ప్రసారం కావడంపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం హుటాహుటిన పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్లో చర్చించి, ప్రస్తుత పార్టీ అధ్యక్ష పదవి నుంచి బాస సత్యనారాయణను తొలగించారు. ఆ వెంటనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన గంగాడి కృష్ణారెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. ఒక్కరోజులో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో నాయకులు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. ఉమ్మడి జిల్లాపైనే తొలి దృష్టి పార్టీ జిల్లా అధ్యక్షున్ని తొలగించి వేరొకరికి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త స్థాయి నుంచి ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీలలో వివిధ స్థాయిల్లో పనిచేసిన సంజయ్‌కు ఉమ్మడి కరీంనగర్లో పార్టీ నాయకుల జాతకాలన్నీ తెలుసు. కరీంనగర్ నుంచి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కొందరు నాయకులు వ్యవహరించిన తీరుపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. సంజయ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇతర జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నించారు. సొంత జిల్లా అంతర్గత వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించలేదు. కానీ ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తొలుత సొంత జిల్లాను ప్రక్షాళన చేసే విషయమై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడే బాస్ బీజేపీలో పార్టీ అధ్యక్షుడే సుప్రీం. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మండల, గ్రామ అధ్యక్షుడి వరకు ఆయా స్థాయిలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఇటీవల ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్లు, ముఖ్య నాయకులు అని చెప్పుకునే వారు పార్టీ అధ్యక్షులతో సంబంధం లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కరీంనగర్ జిల్లాతోపాటు పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దీనిపై అంతర్గత సమావేశాల్లో సంజయ్ అన్యపదేశంగా హెచ్చరికలు చేసినా, ఎవరికి వారే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సంజయ్ కన్నా వయసులో పెద్దవాళ్లు, గతంలో పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన వారు గ్రూపులు కడుతున్న వ్యవహారాలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో సొంత జిల్లా(ఉమ్మడి కరీంనగర్) నుంచే క్రమశిక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కరీంనగర్‌కు చేరుకొని పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దే పనికి ఉపక్రమించనున్నట్లు తెలిసింది. బీజేపీ నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన న్యాయవాది గంగాడి కృష్ణారెడ్డి నియామకం అయ్యారు. వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని బీజేవైఎం, బీజేపీలలో వివిధ హోదాల్లో పనిచేశారు. కమలాపూర్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌గా, జిల్లా కార్యదర్శిగా, మూడు సార్లు జిల్లా ఉపాధ్యక్షునిగా, బీజేపీ జిల్లా సంస్థాగత శిక్షణ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కృషి : గంగాడి కృష్ణారెడ్డి బీజేపీలో సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందనేది మరోసారి రుజువైంది. నాపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహి స్తా. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.కింది స్థాయి కార్యకర్తలు కూడా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే తగిన గుర్తింపు లభిస్తుందని నాతో రుజువైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు. -
పులి పయనం ఎందాక?
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పక్షం రోజులుగా జిల్లాలో తిరుగుతున్న పులి అనువైన ఆవాసం దొరకక ప్రయాణం కొనసాగిస్తోంది. జిల్లాలో రోజుకో ప్రాంతంలో అడుగులు దర్శనమిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో అడుగులు కనిపించిన ప్రాంతానికి అటవీశాఖ అధికారులు చేరుకుని పులివే అని నిర్ధారించి వదిలేస్తున్నారు. పులిని పట్టుకుని తరలించే ప్రయత్నంకానీ, అనువైన ఆవాసం కల్పించే ప్రయత్నంకానీ, జిల్లా దాటించే ప్రయత్నం కానీ చేయడం లేదు. దీంతో ప్రజలు ఏరోజు ఎక్కడ పులిని చూడాల్సి వస్తుందో.. ఎవరిపై దాడిచేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఆరు మండలాల్లో సంచారం.. ఈనెల 7వ తేదీన ముత్తారం మండలం ఓడేడు శివారులో భూపాల పల్లి జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రయాణం నిరంతరం కొనసాగిస్తోంది. ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, పెద్దపల్లి, పాలకుర్తి మండలాల మీదుగా, రామగుండం మండలం ఎన్టీపీసీ రిజర్వాయర్ వరకు సాగింది. అయితే ముత్తారం మండలం మచ్చుపేట శివారులోని బగుళ్ల గుట్ట అడవుల్లో ఆవుల మందపై దాడిచేసిన సమయంలో మాత్రమే పెద్దపులి పశువుల యజమానికి కనిపించింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మంథని–పెద్దపల్లి రహదారి మీదుగా కారులో వెళ్తున్న యువకులు పులి రోడ్డు దాటుతుండగా చూశామని చెబుతున్నారు. ఈరెండేసార్లు మినహా ఎక్కడా ఎవరికీ పులి కనిపించలేదు. బగుళ్ల గుట్టవద్ద మినహా ఎక్కడా పశువులకు, మనుశులకు ఎలాంటి హాని తలపెట్టకుండా తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీపంలో పాద ముద్రలు ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు రిజర్వాయర్ సమీపప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. పుట్నూరు ప్రాంతంలో నుంచి పులి శనివారం తెల్లవారుజామున బుగ్గ గుట్ట మీదుగా భామ్లా నాయక్ తండా గుండా ఎన్టీపీసీ రిజర్వాయర్ అటవి ప్రాంతానికి చేరుకుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి మళ్లీ ఇంధన నిల్వల కేంద్రం, గాడిదల గండి వైపు వెళ్లిందని అడుగుల ఆధారంగా గుర్తించామని అటవీ శాఖ సెక్షన్ అధికారి రహ్మతుల్లా, బీట్ అధికారులు నరేశ్, రమేశ్ వివరించారు. వీరితోపాటు భీమ్లా నాయక్ తండా సర్పంచ్ రాజు నాయక్ కూడా ఉన్నారు. రాజీవ్ రహదారి ఎలా దాటింది..? పులి పుట్నూరు నుంచి బుగ్గ గుట్ట మీదుగా ఎన్టీపీసీ రిజర్వాయర్‌కు చేరుకునే క్రమంలో నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిని దాటాలి. రోడ్డు దాటే క్రమంలో ఎవరికీ కనిపించకపోవడం ప్రశ్నగా మారింది. పులి సంచరించినట్లు తెలు పుతున్న అధికారులు పులి ఏ వైపుకు వెళుతుందో.. అటవీ ప్రాంతం వివరాలు అధికారులకు తెలిసినా రాత్రి సమయంలో కాపు కాయకపోవడంతోనే పులి సంచారాన్ని కనుక్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పులి బుగ్గ గుట్ట నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వెళ్లిందా అనే విషయాలపై కూడా పూర్తి స్పష్టత కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం కూడా పులి సంచారం.. ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలోకి 2018, జూన్‌లో రెండు పులులు సంచిరించినట్లు అధికారులు ధ్రువీకరించారు. రెండు పులులలో ఒకటి చిన్నది, మరొకటి పెద్దదిగా ఉన్నాయని పాద ముద్రల ఆధారంగా నిర్ధారించారు. ఆ తర్వాత పులులు ఎటు వెళ్లాయో కూడా పూర్తి సమాచారం లేదు. రెండేళ్ల వచ్చిన చిన్న పులి పెరిగి పెద్ద అయి మళ్లీ ఈ ప్రాంతంలో సంచరిస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతం పూర్తి రక్షిత ప్రాంతం అందులోకి అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించరు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనువుగా ఉంటే పులి ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలో.. పాలకుర్తి(రామగుండం): మండల పరిధిలో శుక్రవారం పుట్నూర్ గ్రామంలోని అల్లం రవి పొలంలో పెద్దపులు పాదముద్రలు కనిపించగా, శనివారం ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలోని ముత్యాల లింగయ్య పొలం వద్ద పాద ముద్రలను బోడగుట్టపల్లి గ్రామస్తులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా రామగుండం సెక్షన్ అధికారి రహ్మతుల్లా వచ్చి పరిశీలించి పెద్దపులివే అని నిర్ధారించారు. నాగులగుట్ట సమీపంలోని పత్తి చేలల్లో కూడా పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. బుధవారం కన్నాల గ్రామ శివారులోని నాగుల గుట్ట నుంచి రాఘావాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని గుప్తా కోల్వాషరీష్ మీదుగా ఎస్సారెస్పీ డి–83 కాలువ వెంబడి పయనించి బుగ్గగుట్టకు చే రుకుని అక్కడి నుంచి ఈసాలతక్కళ్లపల్లి మీదుగా పుట్నూర్ గ్రామ శివారుకు గురువారం రాత్రి చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం బుగ్గగుట్ట నుంచి కుందనపల్లి ఐవోసీ ఇంధన నిల్వల కేంద్రాల సమీపం నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతానికి వచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు.