
మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూరులో ఇద్దరు కొడుకులతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతులను వంగర లక్ష్మి, ఆమె కుమారులు వెంకటరమణ, శ్రీనివాస్ గా గుర్తించారు. వెంకటరమణకు వివాహం కాగా భార్య అందుబాటులో లేదు. గోల్డ్ స్మిత్ కుటుంబానికి చెందిన ముగ్గురూ పన్నెండేళ్లుగా ఊటూరులో ఎవ్వరితో సంబంధాలు లేకుండా శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నారని స్థానికులు తెలిపారు. మృతదేహాలు కుళ్లిపోయి, దుర్వాసన వస్తుండడంతో వీరు నాలుగైదు రోజుల క్రితమే మృతిచెందినట్లు భావిస్తున్నారు. లక్ష్మికి ఒక కూతురు ఉందని, ఆమె వస్తే కానీ పూర్తి వివరాలు తెలియవని స్థానికులు అంటున్నారు. వీరి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్.
Comments
Please login to add a commentAdd a comment