sons
-
Veer Bal Diwas: మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా..
భారతదేశవ్యాప్తంగా ఈరోజు(డిసెంబర్ 26)న వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నారు. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌ల ధైర్యసాహసాలు, త్యాగానికి గుర్తుగా ప్రతీయేటా డిసెంబర్ 6న వీర్ బాల్దివస్ నిర్వహిస్తుంటారు.మతం, మానవత్వాలను రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన సమయంలో సాహిబ్జాదా జోరావర్ సింగ్ వయసు తొమ్మిదేళ్లు, సాహిబ్జాదా ఫతే సింగ్ వయసు ఆరేళ్లు కావడం విశేషం. 2022లో జనవరి 9న గురుగోవింద్ సింగ్(Guru Gobind Singh) ప్రకాష్ పర్వ్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ బాలవీరుల త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా వీర్‌బాల్ దివస్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.మొఘలుల పాలనలో..సిక్కుల పదవ గురువు గోవింద్ సింగ్‌కు అజిత్ సింగ్, జుజార్ సింగ్, జోరావర్ సింగ్, ఫతే సింగ్ అనే నలుగురు కుమారులున్నారు. 1699లో గోవింద్ సింగ్ ఖాల్సా పంత్‌ను స్థాపించారు. 1705లో పంజాబ్ మొఘలుల పాలనలో ఉంది. ఆ సమయంలో గురుగోవింద్ సింగ్‌ను పట్టుకునేందుకు మొఘలులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. అయితే గురు గోవింద్ వారికి చిక్కలేదు. అతని భార్య మాతా గుజ్రీతో పాటు వారి కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లో ఒక రహస్య ప్రదేశం(Secret place)లో దాక్కున్నారు. అయితే వారింటిలోని వంటవాడు గంగు వారి గురించి సిర్హింద్ నవాబ్ వజీర్ ఖాన్‌కు తెలియజేశాడు. అప్పటికే గురుగోవింద్ సింగ్ కుమారులు బాబా అజిత్ సింగ్, బాబా జుజార్ సింగ్ మొఘలులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు.చిన్నారుల బలిదానంనవాబ్ వజీర్ ఖాన్ గురుగోవింద్ సింగ్ భార్య గుజ్రీని, కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌లను హింసించాడు. మతం మారాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. తరువాత వజీర్ ఖాన్ సాహిబ్జాదాస్ చిన్నారులిద్దరినీ గోడలో పూడ్చిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లి గుజ్రీ ప్రాణత్యాగం చేశారు. ఆ చిన్నారుల బలిదానాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 2022లో ప్రతీయేటా డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్(Veer Bal Diwas)గా జరుపుకుంటున్నట్లు ప్రకటించింది. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లు 1705, డిసెంబర్ 26న అమరులయ్యారు. వీర్ బాల్ దివస్ భారతదేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుందని, రాబోయే తరాలకు సత్యధర్మాలకున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుందని ప్రదాని మోదీ గతంలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్.. -
కొడుకు పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సానియా మీర్జా.. వారం తర్వాత ఇలా (ఫొటోలు)
-
కొడుకు, కోడలు కలిసి తండ్రిపై దాడి
-
పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులెందుకు?
శాయంపేట: ఆస్తులు సంపాదించి ముగ్గురు కుమారులకు ఇచ్చాం. ఇళ్లు కట్టి ఇచ్చాం. వృద్ధాప్యంలో పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులు ఎందుకు? మా ఆస్తులు మాకు ఇప్పించండి.. అంటూ ఓ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం శాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో విలేకర్ల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన చెక్క చంద్రయ్య సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చంద్రయ్య హమాలీ పనిచేసి గ్రామంలో 10 ఎకరాల భూమి, పరకాల పట్టణంలో మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ముగ్గురు కుమారులకు 2002లో మూడు ఎకరాల చొప్పున భూమిని పంచి ఇచ్చాడు. పరకాలలో మూడు గుంటల్లో కట్టిన ఇంటిని 2012లో సమానంగా పంచాడు. వృద్ధ దంపతులిద్దరు గ్రామంలో ఓ షెడ్డు వేసుకొని అందులో ఉంటున్నారు. వృద్ధాప్యం మీద పడడంతో తమ ఆరోగ్యాలు సరిగ్గా లేవని, ఏ కుమారుడు కూడా పట్టించుకోవడం లేదని చెక్క చంద్రయ్య, సారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారులు పట్టించుకోకపోవడంతో జూలై 7న పోలీస్‌స్టేషన్‌లో, 8న పరకాల ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చంద్రయ్య తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
కొడుకులు బువ్వ పెడ్తలేరు
నెన్నెల: నవ మాసాలు మోసి ముగ్గురు కుమారులకు ఆ తల్లి జన్మనిచ్చింది. కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వారిని చేసింది. కానీ వృద్ధాప్యంలో ఆ మాతృమూర్తి కన్న పేగులకే బరువైంది. 13 ఎకరాల భూమి పంచుకున్న కుమారులు తల్లికి తిండి కూడా పెట్టకుండా ఒంటరిని చేసి ఓ గుడిసెలో వదిలేశారు. దీంతో కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని మంగళవారం పోలీసుస్టేషన్ మెట్లెక్కింది.ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన చిన్నక్క, రాజయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. చీటికి మాటికి కొడుకులు కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని వేధిస్తుండడంతో విసిగి వేసారి ఆ తల్లి న్యాయం చేయాలని నెన్నెల ఎస్సై ప్రసాద్ ఎదుట కన్నీటి పర్యంతమైంది.పోలీసులు స్పందించి తనకు న్యాయం చేసి దారి చూపించాలని వేడుకుంది. ఎస్సై స్పందించి ఆమె ముగ్గురు కొడుకులతో ఫోన్లో మాట్లాడి బుధవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలికి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై చెప్పారు. కాగా, కుమారుల్లో ఒకరు సింగరేణి రిటైర్డు ఉద్యోగి కాగా, మరో ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారు. -
Father’s Day 2024: వ్యాపార సామ్రాజ్యంలో నాన్న తోడుగా.. (ఫొటోలు)
-
భార్యాపిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..కారణమిదే..
లక్నో: కుటుంబ తగాదాల కారణంగా ఓ వ్యక్తి తన భార్య ఇద్దరు కొడుకులను దారుణంగా చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగింది.‘భార్యతో గొడవలతో మనస్తాపం చెందిన శ్రవణ్‌రామ్(35) అనే వ్యక్తి తనభార్య శశికల(30) ఇద్దరు కొడుకులు సూర్యారావ్(7),మిట్టు(4)లను పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశాడు. ‘శ్రవణ్రామ్కు ఆయన భార్యకు మధ్య ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. ఆదివారం కూడా వారిరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత శ్రవణ్‌రామ్ తన భార్యా పిల్లలను చంపి ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ తగాదాల వల్లే భార్యాపిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖ శ్రవణ్‌రామ్ జేబులో దొరికింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు. ఇదీచదవండి..జార్ఖండ్ సీఎం సోరేన్‌కు ఆరోసారి ఈడీ సమన్లు.. -
ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి.. ‘పాపమంతా ఫేస్‌బుక్‌దే’
అమెరికాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపింది. కానీ తాను కావాలని చంపలేదని, తనను ఫేస్బుక్ ప్రభావితం చేసిందని వింత కారణం చెబుతోంది. ‘న్యూస్‌వీక్’ కథనం ప్రకారం.. ఈ ఘోరం చేసిన మహిళను 32 ఏళ్ల టిఫానీ యాన్ కేథరీన్ లూకాస్గా గుర్తించారు. ఆమె తన ఇద్దరు కొడుకులు ఆరేళ్ల మారిస్ బేకర్ జూనియర్, తొమ్మిదేళ్ల జేడెన్ హోవార్డ్లను నవంబరు 8న కెంటకీలోని తమ నివాసంలో తుపాకీతో కాల్చింది. రక్తపు మడుగులో పడివున్న పిల్లలను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. ఇంతటి ఘోరం చేసిన ఆమె ఇతరులకూ ప్రమాదకరమని పేర్కొన్న న్యాయమూర్తి.. విచారణ ముగిసే వరకూ 2 మిలియన్ డాలర్ల (రూ.16.6 కోట్లు) పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. నవంబర్ 14న కోర్టు విచారణ సందర్భంగా బుల్లిట్ కౌంటీ షెరీఫ్ అనే దర్యాప్తు సంస్థకు చెందిన డిటెక్టివ్ రిచర్డ్ బీల్.. తాను విచారించినప్పుడు నిందితురాలు లూకాస్ తనతో ఏం చెప్పిందో కోర్టుకు తెలియజేసింది. ‘న్యూస్‌వీక్’ కథనం ప్రకారం.. ఇద్దరు పిల్లలను తలపై దాదాపు 30 సెకన్లలో నాలుగు షాట్లు కాల్చారని బీల్ వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని, తనను ఎవరో ఫేస్బుక్ ద్వారా "మానిప్యులేట్" చేశారని లూకాస్ చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే లూకాస్ వాదనను మారిస్ బేకర్ జూనియర్ సవతి తల్లి మిచెల్ రైస్ ఖండించారు. ఆమె కావాలనే పిల్లలను చంపేసిందని, ఇంత క్రూరమైన పని చేసేలా ఎవరూ ప్రభావితం చేయరని రైస్ తెలిపినట్లు ఫాక్స్ అనుబంధ డబ్ల్యూడీఆర్బీ కథనం పేర్కొంది. -
కన్నబిడ్డలను కాల్చి చంపిన కసాయి తండ్రి
అమెరికా: అమెరికాలో ఓ కసాయి తండ్రి ముక్కుపచ్చలారని తన ముగ్గురు కుమారులపై కనికరం లేకుండా కాల్పులు జరిపి కడతేర్చాడు. అంతకంటే ముందు అతని దురుద్దేశాన్ని గ్రహించిన ఆ పిల్లల తల్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె పైన కూడా కాల్పులు జరిపాడు. అతని కుమార్తె మాత్రం ఎలాగోలా అక్కడి నుండి బయటపడిన ప్రాణాలు దక్కించుకుంది. విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ ఒకేచోట.. ఓహియో ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల చాడ్ డోర్ మాన్ తన ముగ్గురు మగ పిల్లలను నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి చంపాడు. వారి వయసులు 3, 4, 7 సంవత్సరాలు. మొదట ఇద్దరిని కాల్చి చంపగా మూడో కుమారుడు భయంతో పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగులు తీశాడు. అయినా కూడా ఆ తండ్రి అతడిని విడిచిపెట్టలేదు. పొలాల్లోకి వెళ్లి కుమారుడిని వెంటాడి మరీ పట్టుకుని తీసుకొచ్చి అదే ఇంట్లో కాల్చి చంపాడు. అంతకుముందే పిల్లల తల్లి వారిని చంపవద్దని వారించినందుకు ఆమె పైన కూడా కాల్పులు జరిపాడు. ఆమె అక్కడే కుప్పకూలింది. ప్లాన్ ప్రకారమే.. ఇంతటి ఘోర మారణకాండను కళ్లారా చూసిన కుమార్తె మాత్రం బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది. మా నాన్న అందరినీ చంపేస్తున్నాడని చుట్టుపక్కలవారికి సమాచారం అందించింది. దీంతో స్థానికులు పోలీసులకు కబురు పెట్టగా వారు వచ్చి అక్కడే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని ఆసుపత్రికి తరలించారు. విచారణలో డోర్ మాన్ ఎప్పటినుంచో పిల్లలను చంపాలనుకుంటున్నట్లు, ప్రణాళిక ప్రకారమే వారిని చంపినట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి -
కోట్ల ఖర్చుతో పెళ్లి.. ఆడంబరమే అయినా ఆదర్శమూ ఉంది..
భారత దేశంలో పెళ్లి అనేది చాలా పెద్ద వేడుక. సామాన్య మధ్య తరగతి వారి నుంచి సంపన్నుల వరకూ వారి వారి స్థాయిలో వివాహ వేడుకను జరిపిస్తుంటారు. ఇక బడా వ్యాపారవేత్తల సంగతి చెప్పనక్కర లేదు. అత్యంత ఆడంబరంగా జరిగిన చాలా పెళ్లిళ్ల గురించి మనకు తెలుసు. అయితే ఆడంబరంతో పాటు ఆదర్శం కూడా ఉన్న ఓ ప్రఖ్యాత వ్యాపారవేత్త కొడుకుల జంట వివాహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (అమెజాన్ నుంచి 100 మంది అవుట్!) సహారా ఇండియా పరివార్ చైర్మన్ సుబ్రతా రాయ్ కుమారులు సుశాంతో, సీమంతో రాయ్‌ల వివాహాలు 2004లో ఒకే వేదికలో జరిగాయి. రూ. 550 కోట్లతో అంగరంగ వైభవంగా వారి వివాహాలు జరిపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో నాలుగు రోజుల పాటు జరిగిన వివాహానికి అతిథులను ప్రైవేట్ జెట్లలో తరలించినట్లు వార్తలు వార్తలు వచ్చాయి. అయితే ఆ విలాసవంతమైన వివాహాలకు సంబంధించి ఆదర్శవంతమైన మరో కోణం ఉంది కుమారుల వివాహం సందర్భంగా సుబ్రతా రాయ్ కుటుంబం వివిధ మతాలు, కులాలకు చెందిన 101 మంది నిరుపేద యువతులకు పెళ్లిళ్లు చేసి సుమారు 15000 మంది పేదలకు భోజనం అందించారు. కాగా సుశాంతో, సీమాంతోల వివాహ వేడుకలకు దాదాపు 11,000 మంది అతిథులు హాజరయ్యారు. (వామ్మో.. పసిడి పరుగు, వెండి హై జంప్!) వివాహ వేడుకలో 100కి పైగా వివిధ రకాల వంటకాలను వడ్డించారు. సుశాంతో రాయ్ రిచా అహుజాను, సీమంతో రాయ్ చాందిని తూర్ను వివాహం చేసుకున్నారు. వివాహ వేదికను ఖరీదైన పూలు, పాలిష్ లైట్లు, ప్రిజం గ్లాసులు, దీపాలతో అద్భుతంగా అలంకరించారు. అతిథులలో పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఉన్నారు. -
షాకింగ్ ఘటన.. భార్య శీలాన్ని శంకించి..
రాయచూరు రూరల్(కర్ణాటక): భార్య శీలాన్ని శంకించి ఇద్దరు పిల్లలను హత్య చేసిన కిరాతక భర్త ఉదంతం రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... దేవదుర్గ తాలూకా జక్లేర్ దొడ్డిలో నింగప్ప (35), ప్రభావతి (30) దంపతులకు రాఘవేంద్ర (5), శివరాజ్ (3) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు కూలిపనులు చేసుకుంటూ జీవించేవారు. నింగప్ప భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో రోజూ ఆమెతో గొడవపడేవాడు. శనివారం రాత్రి కూడా అలాగే రగడపడ్డాడు. పిల్లలిద్దరూ అక్రమ సంబంధంతో పుట్టినవారేనని మండిపడ్డాడు. తరువాత కె.ఇరబగేరలో అవ్వ ఇంట్లో పిల్లలను జక్లేర్ దొడ్డి శివార్లకు బైక్ మీద తీసుకొని వచ్చాడు. వారిద్దరినీ గొంతు నలిపి హత్య చేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం ఈ ఘోరం గురించి తెలిసి తల్లి, బంధువులు గుండెలవిసేలా విలపించారు. పసిబిడ్డలను పొట్టనబెట్టుకున్నాడని రోదించారు. తల్లి దేవదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నింగప్పను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. -
హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్న వారసులు
-
వివాహేతర సంబంధం..తండ్రిని చంపిన కొడుకులు..ఏమీ తెలియనట్లు..
ముంబై: మహారాష్ట్ర పుణెలోని ఖేడ్ తాలూకాలో డిసెంబర్ 15న అదృష్యమైన వ్యాపారవేత్త దనంజయ నవ్‌నాథ్ బాన్సోడ్(47) దారుణ హత్యకు గరుయ్యాడు. సొంత కుమారులే ఆయను హతమార్చారు. అనంతరం శవాన్ని తీసుకెళ్లి తమ ఫ్యాక్టరీలోని బట్టీలో కాల్చారు. ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అయితే దనంజయకు నాగ్‌పూర్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయం ఇంట్లో తెలిసి ఆయన భార్య, కుమారులు తరచూ గొడవ పడేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 15న సుజిత్, అభిజిత్‌లు తమ తండ్రిని హతమార్చారని వెల్లడించారు. ఇద్దరు కుమారులు డిసెంబర్ 15న తండ్రిని హత్య చేసి డిసెంబర్ 16న శవాన్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్లి కాల్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు డిసెంబర్ 19న తమ తండ్రి కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోని దిగిన వారు విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. చదవండి: దారుణం.. ప్రియుడితో కలిసి కూతుర్ని కడతేర్చిన తల్లి -
మాజీ దంపతులు ఐశ్వర్య-ధనుష్ తనయులతో సరదాగా రజనీ, ఫొటో వైరల్
సూపర్‌స్టార్ రజనీకాంత్ 72వ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన సతీమణి లత రజనీకాంత్ కూడా అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అయితే రజనీకాంత్ మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. అనేకమంది అభిమానులు రజనీకాంత్‌ను చూడడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే గంటలపాటు పడిగాపులు కాసినా రజనీకాంత్ కనిపించకపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరైతే ఎంతో ఆశతో వచ్చినా తమ అభిమాన నటుడిని చూడలేకపోయామంటూ కంటతడి పెట్టుకున్నారు. చదవండి: బిగ్‌బాస్ 6: బయటకు రాగానే సూర్యను కలిసిన ఇనయా, ఫొటో వైరల్ కాగా రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందించిన విషయం తెలిసిందే. దీంతో వారందరికీ పేరుపేరునా రజనీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ రవి, మిత్రుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అదే విధంగా మరో ప్రకటనలో ఎడపాడి పళనిసామి, ఓ.పన్నీర్ సెల్వం, అన్నామలై, టీకే.రంగరాజన్, వైగో, అన్బుమణి రామదాస్, జీకే వాసన్, తిరుమావళన్.. చదవండి: విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్ ఏసీ షణ్ముగం, తిరువుక్కరసు, సీమాన్ తదితర నాయకులకు, నటుడు కమలహాసన్, సంగీత దర్శకుడు ఇళయరాజా, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మమ్ముట్టి, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ఉదయనిధి స్టాలిన్, ధను, వైరముత్తు తదితర సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ప్రజలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా రజనీకాంత్ తన మనవళ్ల (నటుడు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ కొడుకులు)తో ఉత్సాహంగా గడుపుతున్న ఫొటోను ఆమె పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ మీడియాకు విడుదల చేశారు. అందులో పుట్టినరోజు వేడుక తరువాత అని పేర్కొనడం గమనార్హం. Cannot capture something more beautiful.. Cannot caption some such bonds .. My birthday boy with my boys ! #grandfatherlove❤️ #grandsonsrock💙 pic.twitter.com/iCWLZ6b6n7 — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) December 12, 2022 -
అమ్మకు గుడి
ముషీరాబాద్: అమ్మంటే ప్రత్యక్ష దైవంగా భావించారు. కన్నతల్లి కన్నుమూసి ఏడేళ్లయిపోయింది. ఇన్నాళ్లు గుండెల్లో కొలువైన అమ్మకు ఇంట్లోనే గుడి కట్టారు. అమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని.. కళ్లముందు విగ్రహ రూపంలో కని పిస్తుండాలని.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టారు ముషీరాబాద్ గంగపుత్ర కాలనీకి చెందిన బాదం గణేష్, శ్రీనివాస్, వేణు, శివప్రసాద్‌లు. అమ్మ విగ్రహ ఆవిష్కరణోత్సవానికి బంధుమిత్రులను ఆహ్వానించారు. పండుగలా కార్యక్రమం నిర్వహించి అతిథ్యం ఇచ్చి తల్లిపై ప్రేమను చాటుకున్నారు. గణేష్, శ్రీనివాస్, వేణు, శివప్రసాద్‌ల తల్లి బాదం వెంకటసూర్యకుమారి ఏడేళ్ల క్రితం మరణించా రు. కొంతకాలంగా తల్లి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేయాలని నలుగురు కొడుకులు ప్ర యత్నిస్తున్నారు. ఇటీవల విగ్రహ ఏర్పాటు కోసం ఇంట్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. అందులో తల్లి సూర్యకుమారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. -
యాదాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన.. కన్న తండ్రినే దారుణంగా..
ఆలేరు రూరల్ (యాదాద్రి జిల్లా): మద్యం తాగి హింసిస్తున్నాడని తండ్రిని ఇద్దరు కొడుకులు కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేసిన అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా,, ఆలేరు మండలంలోని తూర్పుగూడెం గ్రామానికి చెందిన తిప్పాబత్తిని భాస్కర్ (45), కరుణారాణి దంపతులకు తరుణ్, బాలతేజ సంతానం. కొడుకులిద్దరూ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. కొంతకాలంగా భాస్కర్ మద్యానికి బానిసగా మారి భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. కాగా, హైదరాబాద్‌లో ఉంటున్న కుమారులిద్దరూ మినీ క్రిస్మస్ జరుపుకునేందుకు శనివారం స్వగ్రామానికి వచ్చారు. శనివారం రాత్రి భాస్కర్ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడగా అడ్డొచ్చిన ఇద్దరు కుమారులను సైతం కర్రతో బాదాడు. ఆదివారం ఉదయం కూడా ఇదే మాదిరి గొడవ జరగడంతో కుమారుల ఆగహ్రం కట్టలు తెచ్చుకుంది. దీంతో ఇద్దరు కొడుకుల్లో ఒకరు తండ్రిని గట్టిగా పట్టుకోగా మరొకరు ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని గొంతులో పొడిచాడు. అనంతరం ఛాతిలో బలంగా మరోమారు పొడవడంతో భాస్కర్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. సమాచారం మేరకు ఎస్ఐలు ఇద్రిస్ అలీ, వెంకటశ్రీను ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇద్దరు నిందితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. చదవండి: ఇన్‌స్టాలో పరిచయం.. పెళ్లైన మహిళతో ఎఫైర్.. వీడియో కాల్స్ అడ్డం పెట్టుకొని.. -
ఇంజినీర్ చిన్నాలమ్మ!.. చదువు లేకపోయినా సంకల్ప బలంతో..
ఆ వృద్ధురాలికి చదువు లేదు.. సంకల్ప బలం ఉంది ఇంజినీర్లు సైతం సాధ్యం కాదన్నారు.. చిన్నాలమ్మ మాత్రం సాధ్యం కానిదేదీ లేదని నిరూపించింది. అధికారులు సాంకేతిక కారణాలతో చెక్ డ్యాం నిర్మించలేమన్నారు.. ఆ కారణాలకు ‘చెక్’పెడుతూ ‘డ్యాం’ నిర్మించారు.. చేయాలన్న తపన ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించారు. తన ఇద్దరు కుమారులతో కలిసి పంట పొలాలకు నీరందించే భగీరథులయ్యారు. చదవండి: లోకేష్‌తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి.. భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి.. సాక్షి, పాడేరు: పెదబయలు మండలంలోని మారుమూల కిముడుపల్లి పంచాయతీకి చెందిన కోడా చిన్నాలమ్మ అనే మహిళా రైతు తోటి గిరిజన రైతులకు ఉపకారిగా నిలిచారు. తనతో పాటు మరికొంత మంది గిరిజన రైతుల సాగు భూములకు నిత్యం అన్ని కాలాల పాటు సాగు నీరు అందే లక్ష్యంగా కంబాలబయలు సమీపంలోని గేదెగెడ్డ వాటర్‌ఫాల్ ప్రాంతంలో మినీ చెక్‌డ్యాంను నిర్మించారు. పూర్వం నుంచి ఈ గెడ్డ వద్ద వృథాగా పోతున్న నీటిని పంట కాలువల ద్వారా దిగువ భూములకు సాగు నీటిని అందించాలని గిరిజనులు కోరుతున్నారు. అయితే వాటర్‌ఫాల్ ప్రాంతం ఎత్తుగా ఉండడంతో పాటు అక్కడ చెక్‌డ్యాం నిర్మించడం కష్టమని గతంలోనే ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. పలుమార్లు ఇక్కడ చెక్‌డ్యాం మంజూరైనప్పటికి సాంకేతిక కారణాలతో పనులు జరగలేదు. గేదెగెడ్డ వాటర్పాల్కు ఆనుకుని నిర్మించిన మిని చెక్‌డ్యాం అయితే కోడా చిన్నాలమ్మ, ఆమె ఇద్దరు కుమారులు కోడా సింహాద్రి, కోడా వరహనందంలు ఇక్కడ మినీ చెక్‌డ్యాం నిర్మాణానికి గత ఏడాది శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3లక్షలకు పైగానే సొంత నిధులు ఖర్చుపెట్టి వాటర్ఫాల్కు ఆనుకుని మినీ చెక్‌డ్యాంను నిర్మించారు. వాటర్‌ఫాల్ నుంచి దిగువుకు పోయే నీటిలో కొంత ఈ చెక్‌డ్యాం చానల్లోకి వస్తుంది. అక్కడ నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట భూములకు కాలువ ద్వారా నీటిని మళ్లించారు. మట్టి కాలువ తవ్వడంతో పాటు కొంత భాగంలో సిమెంట్ కాంక్రీట్‌తో ప్రధాన కాలువను కూడా నిర్మించారు. ఆ సిమెంట్ కాలువ దిగువున చిన్నపాటి వంతెన కూడా నిర్మించడంతో ఈ మొత్తం నిర్మాణమంతా అద్భుతంగానే ఉందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణదారులైన కోడా చిన్నాలమ్మకు చెందిన భూములకు కూడా సాగు నీరు అందుతోంది. అలాగే సమీపంలోని మిగిలిన గిరిజనుల భూములకు కూడా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ పంట కాలువను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే చేదుపుట్టు సమీపంలోని పంట భూములకు వేసవిలో కూడా సాగునీరు అందించవచ్చని గిరిజనులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్మించిన చెక్‌డ్యాం, కాలువ ద్వారా 60 ఎకరాల భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుందని, వర్షాలు కురవకపోయిన పంటలు పండించవచ్చని స్థానిక గిరిజనులు పేర్కొంటున్నారు. దశాబ్దాల కల నెరవేరింది : కంబాల బయలు శివారున తమతో పాటు అనేక మంది గిరిజనులకు వ్యవసాయ భూములున్నాయి. పూర్వం నుంచి అక్కడ భూములకు గేదెగెడ్డ నుంచి సాగు నీరును అందించేందుకు చెక్‌డ్యాం నిర్మించాలని అధికారులను అనేకసార్లు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. తన కుమారుల సహాయంతో సొంతంగానే మిరీ చెక్‌డ్యాం, పంట కాలువలు నిర్మించడం సంతోషంగా ఉంది. చెక్‌డ్యాం నిర్మించాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరింది. ప్రధాన పంట కాలువ ద్వారా అందరి అవసరాలకు సాగునీరును మళ్లిస్తాం. –కోడా చిన్నాలమ్మ, నిర్మాణ దాత, కిముడుపల్లి -
ఎంగిలి పేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా
గూడూరు (తిరుపతి జిల్లా): ఎంగిలిపేట్లు కడిగి ఆస్తులు సంపాదించాం. పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచి ప్రయోజకుల్ని చేశాం. ఆస్తులన్నీ రాసిచ్చాం. వృద్ధాప్యంలో ఆదుకుంటారనుకుంటే చిత్రహింసలు పెడుతున్నారు. పదమూడేళ్లుగా జీవచ్ఛవాళ్లా జీవిస్తున్నాం. బతకడానికి దారి చూపండయ్యా’ అంటూ వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చదవండి: చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో.. ఎక్కడో తెలుసా! బాధితుల కథనం మేరకు.. గూడూరు రెండో పట్టణంలోని జానకిరాంపేట ప్రాంతానికి చెందిన కోనేరు సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ, పిల్లలను ప్రయోజకుల్ని చేశారు. కాయకష్టం చేసి ఆస్తులు కూడబెట్టారు. అందరికీ వివాహాలయ్యాయి. ఉన్న ఆస్తులన్నింటినీ పిల్లల పేర రాసిచ్చేశారు. ఉన్న నగదుతోపాటు, బంగారం కూడా వారికే ఇచ్చేశారు. ఇంతచేసినా ఇంకా ఇవ్వాలంటూ తరచూ తల్లిదండ్రులను కొట్టడంతోపాటు, హింసించడం మొదలు పెట్టారు. ఈ మేరకు వృద్ధదంపతులు నాలుగేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకూడా అప్పట్లో తల్లిదండ్రులకే అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ పిల్లల్లో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోతున్న సుబ్బయ్యకు పక్షవాతం వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే కొడుకులు కొడుతున్నారని వాపోతున్నారు. తమకు బతకడానికి దారి చూపాలని వేడుకుంటున్నారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ తిరుపతయ్యను వివరణ కోరగా దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పట్టుబడగానే... మావాడు మంచోడే!
సాక్షి, బంజారాహిల్స్: నాకేం తెలియదు.. మా పిల్లలు చాలా మంచి వారు.. అందులో మా పిల్లలు లేరు.. మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది.. ఇలా ఏదైనా ఘటనలో తమ పిల్లలు పట్టుబడగానే ప్రముఖులు నీతి సూక్తులు వల్లె వేస్తుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము వరకు పిల్లలు ఇంటికి రాకపోతే ఎక్కడున్నారనే విషయం కూడా కొంత మంది తెలుసుకోవడంలేదు. తీరా ఏదైనా పబ్‌లోనో, రేవ్ పార్టీలోనో, రిసార్ట్స్‌లోనో మద్యం తాగి, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే మాత్రం ఆ ఘటనతో తమకేమీ సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పబ్‌లో రేవ్ పార్టీలో పాల్గొని టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినవారి కుటుంబ సభ్యులందరు డ్రగ్స్‌తో సంబంధం లేదంటూ ఒకేతీరుగా సమాధానాలు చెప్పారు. ఇక ఓ రాజకీయనేత కుమారుడు పట్టుబడ్డాడంటూ మీడియాలో ప్రసారం కాగానే ఆ కుటుంబం వెంటనే స్పందించి తమవాడు అక్కడ లేడంటూ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే మీడియాలో వచ్చిన పేరుతో ఉన్న కొడుకు లేడు కానీ ఆ రాజకీయ నాయకుడి ఇంకో కొడుకు మాత్రం పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఎక్కడ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డా ఇలాగే బుకాయించేస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపు తప్పిన వేగంతో దూసుకొచ్చి ఓ రాజకీయ నాయకుడి తనయుడు ఓ చంటి బిడ్డ ప్రాణాన్ని బలిగొన్న ఘటనలో కూడా ఆ నేత ఆ కారులో తన కొడుకే లేడంటూ గట్టిగా వాదించాడు. తీరా చూస్తే కారులో వెనుక సీటులో ఆ నేత కొడుకు దర్జాగా కూర్చొని ఉన్నాడు. ఇక శివార్లలో రిసార్ట్‌లకు వెళ్తే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇలాంటి గానా బజానాలు, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు కోకొల్లలు. దొరికిన సందర్భాల్లో ప్రముఖులు తమ పిల్లలను ఇలాగే వెనుకేసుకొస్తున్నారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా నాగేశ్వర్రావు బంజారాహిల్స్ నూతన ఇన్స్పెక్టర్గా 2004 బ్యాచ్‌కు చెందిన కె. నాగేశ్వర్రావును నియమిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. గతంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డీఎస్ఐగా పని చేశారు. బంజారాహిల్స్ సీఐగా పని చేసిన పూసపాటి శివచంద్రను విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన కారణంగా సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో నాగేశ్వర్రావును నియమించారు. -
ఆస్తి హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఆస్తి హక్కుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణిస్తే.. అతని స్వార్జితం, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్లో.. అతని కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మరణించిన వ్యక్తి సోదరుని పిల్లలకు కాకుండా సొంత కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని కీలక తీర్పు ఇచ్చింది గురువారం. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. హిందూ మహిళ, భర్త చనిపోయిన వాళ్ల ఆస్తి హక్కుకు సంబంధించి గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి వీలురాయకుండా చనిపోతే అతని ఆస్తిలో కూతుళ్లకు హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై.. తండ్రి వారసులు అందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే.. భర్త వారసులకు హక్కులు లభిస్తాయి అని ధర్మాసనం పేర్కొంది. ప్రతీకాత్మక చిత్రం మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే.. సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా? లేదంటే అతని సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరిస్తూ పై తీర్పును వెలువరించింది. తమిళనాడుకు చెందిన ఈ కేసుకు సంబంధించి మార్చి 1, 1994లో ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వగా.. ఈ తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. ఇక ఆర్డర్ డేట్ 21, 2009న జారీ చేసింది హైకోర్టు. ఇప్పుడు ఆ తీర్పును పక్కనపెడుతూ సుప్రీంకోర్టు తీర్పు కీలక వెలువరించింది. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణ మురారి ఆధ్వర్యంలోని బెంచ్.. ఈ తీర్పు కోసం 51 పేజీల తీర్పు కాపీని సిద్ధం చేయడం విశేషం. చదవండి: ఎన్నికల్లో సమోసా-చాయ్ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. -
చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు
వాషింగ్టన్: టెక్సాస్‌లో ఓ తల్లి తన నలుగురి పిల్లల్ని హ్యస్టన్ అపార్ట్మెంట్లో వదిలేసి తన భాగస్వామితో కలిసి ఉంటోంది. పైగా ఆమె తన భాగస్వామితో కలిసి ఒక కొడుకుని హత్య చేసి చంపేసిందనే అనుమానంతో ఆమెను అరెస్టు చేసినట్లు టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె కొడుకులు ముగ్గురు హ్యుస్టన్ అపార్ట్మెంట్లో చనిపోయిన తమ సోదరుడి అస్థిపంజర అవశేషాలతో కలిసి ఉంటున్నట్లు వెల్లడించారు. (చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!) ఈ క్రమంలో ఆ పిల్లలు తల్లి 35 ఏళ్ల గ్లోరియా విలియమ్స్ సాక్ష్యాలను తారుమారు చేసే నిమిత్తం ఆ పిల్లలను గాయపరిచినట్లు తెలిపారు. అంతేకాదు ఆ పిల్లలు ముగ్గురే ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నారని, చాలా కాలంగా తలితండ్రులిద్దరూ అక్కడ నివశించటం లేదని పేర్కొన్నారు. అయితే ఆ పిల్లలు చాలా భయంకరమైన దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారన్నారు. అంతేకాదు ఆ ముగ్గురి పిల్లల్లో ఇరుగు పొరుగు వారి నుంచి ఆహారం తెచ్చుకుని జీవించేవారిని చెబుతున్నారని పోలీసులు అన్నారు. (చదవండి: చూడటానికి పంది రూపు... కానీ అది దూడ) -
భర్త చనిపోవడం, ఇద్దరు కొడుకులు జైలుకెళ్లడంతో.. తల్లి ఆత్మహత్య
సాక్షి, మీర్‌పేట: పక్కింటి వారితో జరిగిన గొడవలో ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లడంతో మనస్తాపం చెందిన ఓ తల్లి వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మొగుళ్లవంపు గ్రామానికి చెందిన బిట్టు జంగమ్మ(52) భర్త కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో తన ఇద్దరు కుమారులు, కుమార్తెను తీసుకుని బతుకుదెరువు కోసం 7 ఏళ్ల క్రితం మీర్‌పేట లెనిన్‌నగర్ మురళీకృష్ణనగర్లో ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తుండగా, పెద్ద కుమారుడు మహేష్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, చిన్న కుమారుడు మధు మెకానిక్ పనిచేస్తున్నాడు. చదవండి: ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి ఆత్మహత్య జంగమ్మ ఇంటిని నిర్మిస్తున్నప్పటి నుంచి పక్కింటికి చెందిన సంగం సుజాతతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 18న ఇంటి ఆవరణలోకి నీరు వచ్చాయనే కారణంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో జంగమ్మ కుమారులు మహేష్, మధు సుజాతపై దాడి చేశారు. తనను అవమానపరిచేలా దుస్తులను చించివేశారని ఆరోపిస్తూ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ గొడవలో జంగమ్మ చెవికి కూడా రక్తగాయాలు అయ్యాయి. ఎస్ఐ బద్యానాయక్ విచారణ జరిపి మహేష్, మధును అరెస్ట్ చేసి 20న తేదీ రిమాండ్‌కు తరలించారు. చదవండి: తమతో పాటు ఆశ్లీల చిత్రాలు చూడలేదని.. బాలికను కిరాతకంగా రాళ్లతో కొట్టి.. భర్త చనిపోవడం, ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లడంతో జంగమ్మ తీవ్ర మనోవేదనకు గురైందని స్థానికులు చెప్పారు. కుమారులను రిమాండ్‌కు తరలిస్తుండగా బెయిలు ఇప్పించాలని లాయర్‌ను తీసుకుని ఠాణాకు వెళ్లి పోలీసులను బతిమాలినా ఫలితం లేకపోవడంతో నిరాశకు గురైంది. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున మీర్‌పేట రైతుబజార్ సమీపంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గొడవకు సంబంధించి సంగం సుజాత బంధువులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎన్నాళ్లైనా ఆస్తిలో వాటా దక్కదని .. కొడుకులతో కలిసి
సాక్షి, తొగుట(దుబ్బాక): కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులకు విషం తాగించి, తానూ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం తొగుట మండలం తుక్కాపురంలో జరిగింది. స్థాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముడికె కొమురయ్య, ఎల్లవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు కిష్టయ్య, దేవరాజు ఉన్నారు. కొమురయ్య వ్యవసాయ భూమి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో 4 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. దీంతో ప్రభుత్వం అందించిన నష్టపరిహారంతో మిరుదొడ్డి మండలంలోని ధర్మారంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఎకరం తన పేరున, ఎకరం చిన్న కొడుకు దేవరాజు పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే సిద్దిపేట పట్టణంలోని ప్లాటు కూడా చిన్న కుమారునికి అప్పగించాడు. ఇద్దరు కుమారులకు ఆస్తి సమానంగా పంపకాలు చేయకుండా ఒక్కడికే ఇవ్వడం ఏంటని పెద్ద కుమారుడు కిష్టయ్య, అతని భార్య అనిత అత్తమామలను నిలదీశారు. ఈ విషయమై కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. కాగా ఆస్తి విషయాన్ని గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇద్దరు కుమారులకు సమానంగా పంపిణీ చేయాలంటూ గ్రామ పెద్దలు తీర్మానించారు. అయినా తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రాలేదు. సాగు భూమి కోల్పోవడం తనకు రావాల్సిన వాటా ఇవ్వకపోవడంతో కిష్టయ్య అప్పు చేసి ఆటో కొనుక్కుని కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అత్తాకోడళ్లు మళ్లీ తగాదా పెట్టుకున్నారు. ఎన్నాళ్లైనా ఆస్తిలో వాటా దక్కదన్న మనోవేదనకు గురైన అనిత(28) భర్త ఆటో తీసుకుని ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఇద్దరు కుమారులను ఇంట్లోకి తీసుకెళ్లి గడ్డిమందు దీక్షిత్ (06)కు తాగించింది. చిన్న కుమారుడు ఆర్చి(03)కి తాగించే ప్రయత్నం చేయగా బయపడి బయటకు పరుగెత్తగా తాను తాగి అపస్మారక పరిస్థితిలో పడిపోయింది. గమనించిన ఇరుగు పొరుగు వారు చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనిత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీక్షిత్ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాబుకు ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. కాగా అనిత పరిస్థితి విషమంగానే ఉన్నట్లు బంధవులు తెలిపారు. -
దారుణం: కొడుకులపై తండ్రి కాల్పులు.. ఒకరి మృతి
ముంబై: ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన ఇద్దరు కొడుకులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కొడుకు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. పాటిల్ ఐరోలి సెక్టార్ 2 ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపారు. అయితే తండ్రితో గొడవల కారణంగా కొడుకులు విజయ్, సుజయ్ వేరుగా నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సోమవారం సాయంత్రం పాటిల్ తన కుమారులను ఓ విషయంపై మాట్లాడటానికి తన ఇంటికి పిలిచినట్లు తెలిపారు. అయితే తండ్రీ, కొడుకుల మధ్య కారు భీమాపై పెద్ద గొడవ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పాటిల్ తన పిస్టల్ తీసుకొని తన ఇద్దరు కొడుకులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక చికిత్స కోసం ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్క్నన్నారు. అయితే విజయ్‌కి తీవ్రగాయాలు కావడంతో మరణించినట్లు తెలిపారు. కాగా అతని సోదరుడు జయ్‌కు స్వల్ప గాయాల కావడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఈ రూ. 2 నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చా? -
ఏంటి సార్ ! మా నాన్నకి అంత్యక్రియలు చేయడం కూడా తప్పేనా
లక్నో: కరోనా దెబ్బకు అయిన వారు, ఆప్తులు దూరం అవుతున్నారు. చిన్నబోయిన అనురాగాలు నిస్సహాయతను వ్యక్తం చేస్తుంటే..మానవత్వం తల ఎత్తుకోలేక…ఊరు విడిచి వెళ్లిపోతోంది. వీటన్నిటినీ దూరం చేసిన కరోనా మహమ్మారి చితి మంటల వికటాట్ట హాసం చేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన రామ్ లలిత్ (62) అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతని కుమారులు అత్యవసర చికిత్స కోసం గోరఖ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాధితుడికి కరోనా సోకినట్లు తేలింది. అయినప్పటికీ తండ్రిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు కుమారులు. అలా ఇంటికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే రామ్ లలిత్ మరణించాడు. మరణించిన తండ్రిని, తండ్రి పడుకున్న మంచాన్ని జేసీబీ సాయంతో స్థానికంగా ఉన్న పొలాల్లోకి తరలించారు. అక్కడే ఖననం చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సంత్ కబీర్ నగర్ ఎస్పీ కౌస్తుబ్ విచారణకు ఆదేశించారు. వైరల్ అవుతన్న వీడియోలో బాధితుడి డెడ్ బాడీని ఖననం చేసేందుకు అతని కుమారులు జేసీబీతో పూడిక తీయిస్తున్నారు. ఇది చట్టరిత్యా నేరం. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించారు. అయితే పోలీసుల తీరుపై కుమారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది అనాథశవం కాదని, తన తండ్రిదేనని వాపోయారు. అంత్యక్రియలు ఇలా చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. చదవండి : కొడుకు మందుల కోసం 300 కి.మీ.సైకిల్ తొక్కిన తండ్రి -
హృదయవిదారకం: తోపుడు బండిపై ఓ అమ్మ అంతిమయాత్ర
జైపూర్: కరోనా కారణంగా మాతృదినోత్సవం రోజే ఓ తల్లికి అవమానకర రీతిలో అంతిమయాత్రను ఆమె కొడుకులే నిర్వహించాల్సి వచ్చింది. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని నావల్‌పురా చౌక్‌కు చెందిన దినేష్ కుమార్ తల్లికి ఇటీవల కరోనా సోకడంతో అక్కడి స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే శనివారం ఆమె అస్పత్రిలో వద్దంటూ ఇంటికి తీసుకెళ్లమని తన ఇద్దరి కొడుకులను కోరింది. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లగా, అక్కడ ఆమె శనివారం మరణించింది. తన తల్లి మృతదేహాన్ని శశ్మానవాటికి తీసుకెళ్లడానికి ఆంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను, పోలీసులను కోరగా వారు నిరాకరించారు. మృతురాలి ఇద్దరు కొడుకులు ఎంత వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు కరోనా మరణం అని తెలిసే సరికి అక్కడి గ్రామస్తులు కూడా ఆ కుటుంబానికి సహకరించలేదు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొడుకులిద్దరే ఓ తోపుడు బండిపై తల్లి శవాన్ని పెట్టుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. కరోనా నివారణ జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు గానీ కరోనాతో మరణించిన వారి విషయంలో మాత్రం దగ్గరకు రాకూడదనే నిబంధనలను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ( చదవండి: 103 ఏళ్ల పెద్దాయన మనోధైర్యానికి తలవంచిన కోవిడ్ ) -
రూ.కోట్ల ఆస్తులు ఉన్నా.. అనాథే..!
ఎనిమిది మంది సంతానం.. ఒకరికి మించి ఒకరిపై ప్రేమను పొంగించాడు. అందరినీ గుండెలపై పెట్టుకుని పెంచాడు... వృద్ధాప్యంలో ఎవరో ఒకరు తమ గుండె గుడిసెలో కాస్త చోటిస్తారనుకున్నాడు. చదువులు, పెళ్లిళ్ల బాధ్యతల బరువులను ఆనందంగా మోశాడు. ఇంటి దీపాలైన ఆరుగురు ఆడ బిడ్డలు వివాహమై వెళ్తుంటే కళ్ల నిండా నీటి ఒత్తులు వెలిగించుకున్నాడు. కొన్నాళ్లకు తన తోడు తనను ఒంటరిని చేసి వెళ్లిపోతే.. ఆయనిప్పుడు నీడ లేని వాడయ్యాడు. ఎనిమిది మంది సంతానానికి ఎక్కువై చివరకు అనాథాశ్రమంలో అన్నీ ఉన్నా అనాథగా మారాడు. కరోనా రక్కసి వికటాట్టాహాసానికి అనాథాశ్రమమూ ముఖం చాటేయడంతో ఏ దిక్కూలేక నడిరోడ్డుపై నీరింకిన కళ్లతో బేలగా చూస్తున్నాడు. దయ గల మారాజులెవరైనా ఆదరిస్తారేమోనని.. సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన గోపవరపు సత్యనారాయణ వయసు ఎనిమిది పదులు పైనే. ఆయనకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. భార్య కొన్ని సంవత్సరాల క్రితం ఆయనను ఒంటరి వాడిని చేసి అనంతలోకాలకు వెళ్లింది. ఉండటానికి, తినడానికీ లోటు లేకపోయినా కన్నపేగు బంధమే కాదు పొమ్మంది. ఎనిమిది మంది సంతానంలో ఒక కుమార్తె మరణించింది. మిగిలిన వారిలో ఇద్దరు విజయవాడలో, ఒకరు గుంటూరులో, ఒకరు తిరుపతిలో, మరొకరు సత్తెనపల్లిలో ఉంటున్నారు. కుమారులు మల్లేశ్వరరావు, ప్రసాద్ విజయవాడలో స్థిరపడ్డారు. వారెవరూ తండ్రిని చూసేందుకు ముందుకు రావడం లేదు. కాలే కడుపుకి పిడికెడు అన్నం పెట్టడానికి వీరికి మనసు రావడం లేదు. రూ.కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఒంటరిగా జీవించలేక సత్యనారాయణ ఏడాదిన్నర క్రితం పేరేచర్లలోని కొండప్రోలు బసవ పున్నయ్య అనాథా ఆశ్రమంలో చేరాడు. అక్కడే కాలం వెళ్లదీస్తున్న ఆయనకు కరోనా మళ్లీ పరీక్ష పెట్టింది. కరోనాతో మళ్లీ రోడ్డుపైకి... ఎనిమిది మంది సంతానం ఉండి కూడా అనాథగా మారాననే దిగులు నిత్యం వెంటాడుతుండే సత్యనారాయణకి ఆశ్రమంలో చేరాక కాస్త మనసు కుదుట పడింది. ఇంతలో కరోనా రూపంలో ఆయనకు జీవితం మరోసారి పరీక్ష పెట్టింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆశ్రమాన్ని నిర్వాహకులు మూసేశారు. దీంతో సత్యనారాయణ మళ్లీ రోడ్డున పడ్డాడు. శుక్రవారం సత్తెనపల్లి వచ్చిన ఆయన ఓ లాడ్జి వద్దకు వచ్చి దీనంగా కూర్చొని ఉన్నాడు. తన వారెవరూ ఆదరించడం లేదని, ఆస్తులు ఉన్నా ఒంటరిని చేశారని వాపోయాడు. సత్తెనపల్లిలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ అద్దెకు చేరిన వ్యాపారవర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిని ఖాళీ చేయడం లేదు. కడుపున పుట్టిన బిడ్డలు పట్టించుకోవడం లేదు. లాడ్జిలోనైనా తలదాచుకుందామంటే కరోనాకు భయపడి నిర్వాహకులు రూములు ఇవ్వడం లేదని ఆయన కన్నీటి పర్యంత మవుతున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో తన ఇంటిని ఖాళీ చేయించి కాస్తంత నీడ చూపించాలని వేడుకుంటున్నాడు. చదవండి: బద్వేలులో దారుణం: పెళ్లయిన నాలుగు నెలలకే.. మెడి‘కిల్స్’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం -
ఇద్దరు మహిళల పెళ్లి.. సైకోలుగా ప్రవర్తిస్తూ దారుణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యాబుద్ధులు నేర్పించి సంతానాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన తల్లిదండ్రులే పెడమార్గం పట్టారు. వైవాహిక జీవితంలో ప్రకృతికి విరుద్ధమైన చేష్టలకు దిగడంతోపాటు పిల్లలను నరబలి ఇచ్చేందుకు సిద్ధపడడంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. బాధిత చిన్నారుల ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోడ్ జిల్లా పుంజైపులియంపట్టికి చెందిన రామలింగం (42) అనే వస్త్రవ్యాపారికి భార్య రంజిత (36), 15, 6 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం రామలింగం అదే ప్రాంతానికి చెందిన ఇందుమతి (32) అనే మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడు. తరువాత సదరు వ్యాపారి తన ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి ఈరోడ్ రంగపాళయం రైల్‌నగర్‌లో కాపురం పెట్టారు. కొన్ని రోజులకు ఇందుమతి స్నేహితురాలైన శశి (38) అనే మహిళను రంజిత పెళ్లి చేసుకుంది. అంతేగాక శశిని నాన్నా అని, తండ్రైన రామలింగంను మామ అని పిలవాలని అమ్మ వేధింపులకు గురిచేయడం ప్రారంభించింది. నలుగురూ ఒకే ఇంటిలో ఉంటూ పిల్లలను పాఠశాలకు పంపకుండా ఇంటి పనులు చేయించేది. నాన్న చనిపోయాడని అబద్ధమాడి స్కూలు నుంచి టీసీలు కూడా తెచ్చింది. ఇంటి పనులు చేయించుకోవడం, చిన్న పొరపాటు చేసినా మిరప్పొడి ఒళ్లంతాపూసి బాధలకు గురిచేసింది. కొన్నిసార్లు క్రిమినాశిని ద్రావకాన్ని తాగమని ఒత్తిడి చేసింది. ఇద్దరూ కలిసి తమను శివుడు, శక్తి అని పిలుస్తూ నరబలి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయడంతో పిల్లలిద్దరూ ఫ్రిబవరి 23న తాత, అవ్వ ఇంటికి చేరుకున్నారు. వారిని కూడా బెదిరింపులకు గురిచేయడంతో తాత, అవ్వతో కలిసి జిల్లా ఎస్పీ తంగదురైకి మంగళవారం ఫిర్యాదు చేశారు. వారి వేధింపుల నుంచి తమను రక్షించి, భద్రత కల్పించాలని, తల్లిదండ్రులపై తగిన చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కిరాతకం: అందరూ చూస్తుండగానే.. ఎనిమిదో భార్యను చంపి జైలుకు, రెండో భార్య కొడుకు చేతిలో.. -
ఇంటి పేరు క్లిక్.. ఇళ్లు తళుక్కు
సాక్షి, బెంగళూరు : కొందరికి రేడియో వినడం అంటే ఇష్టం..మరికొందరికి పాటలంటే ఇష్టం..ఇంకొకరికి వంటల పిచ్చి....ఇంకా సంగీతం, నృత్యం ఇలా రకరకాల కళల్లో ఎవరి అభిరుచి వారికి ఉంటుంది. ఆ ప్రతిభతో ఆయా రంగాల్లో రాణించిన పేరు ప్రఖ్యాతులు గడించిన వారు చాలామందే ఉన్నారు. అయితే ఆ ప్రేమ కాస్త పిచ్చిగా మారి, దాన్ని చాలా భిన్నంగా, హృద్యంగా మల్చుకోవడం దాదాపు అరుదు అనే చెప్పాలి. కర్ణాటకలోని బెల్గాంకు చెందిన రవి హోంగల్ (49) ఇదే కోవకు చెందుతారు. చిన్నప్పటి నుంచీ ఆయనకు ఫోటోగ్రఫీపై మక్కువ ఎక్కువ. అలా ‘పెంటాక్స్’ కెమెరాతో కనిపించిన దృశ్యాలను క్లిక్ చేస్తూ ఎదిగారు. చివరికి దాన్నే వృత్తిగా ఎంచుకుని తన భార్య రాణితో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. అంతేకాదు ప్రముఖ డిజిటల్ కెమెరాలు ఎప్సన్, కానన్, నికాన్ పేర్లను తన ముగ్గురు కుమారులకు పెట్టారు. ఇక్కడితో అయన అభిమానం ఆగిపోలేదు. కెమెరా ఆకారంలో బెల్గావ్లో మూడంతస్థుల భవనాన్ని నిర్మించుకోవడం విశేషం. సుమారు 71 లక్షల రూపాయలతో ప్రేమగా నిర్మించుకున్న తన కలల సౌధానికి ‘క్లిక్’ అని పేరు పెట్టుకోవడం మరో విశేషం. -
నన్ను పదకొండో కొడుకుగా చూసుకో...
సనాతన ధర్మంలో దంపతుల వైశిష్ఠ్యం, ముఖ్యంగా స్త్రీ వైశిష్ట్యం ఎంత గొప్పగా ఉంటుందంటే... వివాహం అయిపోయిన తరువాత అగ్నికార్యం చేసేటప్పుడు పురుషుడు భార్యను ఉద్దేశించి కొన్ని విషయాలు అడుగుతాడు... వాటిలో ఒకటి–‘‘నీవు పది మంది పిల్లల్ని కని నన్ను పదకొండవ కొడుకుగా చూడు’’–అని. అంటే దానర్థం?భార్య పురుషునికి శాంతి స్థానం. పురుషుడు ఎన్ని ఆటుపోట్లకు గురయినా పురుషుడి శాంతి అంతిమంగా స్త్రీ చేతిలో ఉంటుంది. నేనీ మాట ఉబుసుపోక చెప్పట్లేదు... అగ్ని సాక్షిగా అడుగుతాడు ఇలా... ఆయనకు పదిమంది కొడుకులు పుట్టారు. ఆయన సహస్ర చంద్ర దర్శనోత్సవాలకు అందరూ వచ్చారు. ఏదో పని అలా కాదు ఇలా చేయమని తండ్రి చెబితే ఒక కొడుకు ‘నాన్నగారూ, ఇంకా మీ కెందుకివన్నీ, మేం పెద్దవారమయ్యాం. మేం చూసుకుంటాం. మీరు ఇన్నాళ్ళూ మమ్మల్ని పెంచి పెద్దచేయడంలో మీకు తీరిక దొరకక రామాయణ భారతాలు చదవలేకపోయారు. ఇప్పుడు హాయిగా అవి చదువుకోండి’..అనడంతో తన మాటకు పిల్లలు గౌరవం ఈయడం లేదని అలిగి ఆయన అన్నం తినకుండా ఓ మూలన కూర్చుంటే... ఆయన మనసెరిగిన ఇల్లాలు ఆయనను పిల్లల్ని బుజ్జగించినట్లు బుజ్జగించి, కాస్తచనువుతో గదమాయిస్తూ ఆయనను చేయిపట్టి తీసుకొచ్చి విస్తరి దగ్గర కూర్చోబెడుతుంది. తర్వాత కొద్ది సెకన్లలోనే ఆ కారుమేఘాలన్నీ మాయమయి పరిస్థితి మామూలు స్థాయికి చేరిపోతుంది.రామాయణాన్ని పరిశీలించండి. సీతమ్మ తల్లి పక్కన ఉన్నంత కాలం ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు తట్టుకున్నాడు. రాజ్యం పోయింది. బెంగ పెట్టుకోలేదు, తండ్రి మరణించాడు, దిగులుపడలేదు. అరణ్యవాసం చేసాడు, రాక్షసులు మీద పడ్డారు, ఎన్నో కష్టాలొచ్చాయి. కించిత్ మథనపడలేదు. సీతమ్మ కనబడలేదు. అంతే! రాముడు ఉగ్రుడయిపోయాడు. అప్పటివరకు చేయనివాడు రావణ సంహారం చేసాడు. రాక్షసులను తుదముట్టించాడు. అంటే అసలు నిజానికి రాముడు శ్రీరాముడిగా సీతమ్మ కారణంగా అంత శాంతిని పొందాడు.అందుకే సుమంతుడు తిరిగి వచ్చిన తరువాత ‘సీతారాములెలా ఉన్నారు?’ అని దశరథ మహారాజు, కౌసల్యాదేవి అడిగితే ముందు సీతమ్మ గురించి చెప్పాడు. పక్కన నా భర్త రాముడు ఉన్నాడని చిన్నపిల్ల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంటోంది, అంత సంతోషంగా ఉంది’ అన్నాడు. భార్య అంత సంతోషంగా ఉంటే రాముడూ అంత సంతోషంగా ఉన్నాడు. స్త్రీ పురుషుడి శాంతికి కారణమవుతుంది. ఆమె పరిమితి, ఆమె ఉపాసన ఈ దేశంలో, ఈ ధర్మంలో ఒక అద్భుతం. -
అమ్మా! నీకు వందనం
అమ్మను మించి దైవమున్నదా? అని ప్రశ్నిస్తాం. దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు అని ప్రవచిస్తాం. కాని అమ్మ అంటే ఇంట్లో మనకు అన్ని పనులు చేసిపెట్టే ఒక బొమ్మ మాత్రమే అనుకునేలా మారిపోయిన పరిస్థితుల్లో.. మనకు జన్మనిచ్చిన, దైవంతో సమానమైన అమ్మను మనసారా పూజించడం అనే మాటే వినడానికి వింతగా ఉంటే... పూజించడానికి ఒక విధానం కూడా ఉందని చెబితే మరింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా.. అలాంటి ఆశ్చర్యానందాలను మించిన అద్భుతమైన తృప్తిని కలిగిస్తుంది అమ్మను పూజిస్తే అని నిరూపించింది జన్మనిచ్చిన జననికి జయంత్యుత్సవం కార్యక్రమం. కదిలే దైవం.. కొలుచుకో నిత్యం...తల్లిని ఎలా పూజించాలి? కనుల ముందు కదిలే దైవంలా ఎలా కొలుచుకోవాలి. ఇలాంటివి తెలియజెప్పేందుకు హైదరాబాద్‌లోని శిల్పారామం సంప్రదాయ వేదికలో సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘జన్మనిచ్చిన జననికి జయంత్యుత్సవం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వందలాదిగా కొడుకులు, కూతుళ్లు తల్లులతో సహా తరలి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆత్మానందమయి మాతాజీ ముఖ్య అతిథిగా హాజరై... మాతృమూర్తులను పూజించే విధానాన్ని బోధించారు. తల్లిని పూజించేటప్పుడు కొందరు బిడ్డల్లో కళ్లు చెమరించడం, పూజానంతరం వారి కళ్లలో కనిపించిన తృప్తి... మాతృమూర్తి పట్ల తరాలు మారినా తరగని ప్రేమాభిమానాలకు నిదర్శనంగా నిలిచాయి. కార్యక్రమం విజయవంతం కావడం స్ఫూర్తిని ఇచ్చిందని, ఇకపై ఏటేటా ఈ తరహాలో నిర్వహించాలని అనుకుంటున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. – సత్యబాబు -
డాడీ లాంటి గర్ల్‌ఫ్రెండ్
డాడీని ప్రేమించినంతగా అమ్మాయిని ప్రేమించొచ్చు!ఇది అతిశయోక్తే! అమ్మాయిని ప్రేమించినంతగాడాడీని ప్రేమించొచ్చేమో!విదిలించుకుపోయిన కొడుకును.. వీధిపాలైన ప్రేమనుమళ్లీ గెలుచుకోవాలనినెట్‌లో ఓనమాలు తెలియనిఓ తండ్రి విసిరిన వలే ఈ కథ!కాని అబద్ధం దాగదుగా!అబద్ధం కొన్ని రోజులు అందంగా అనిపించినా..చివరకు డాడీలా కనపడితే! ఏమౌతుంది?! ‘‘నేనేం తప్పు చేశాను? మీ అమ్మ నాతో అబద్ధం ఆడితే నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తున్నావ్. అవును.. మీ అమ్మకు పెద్ద యాక్సిడెంటే అయింది. కానీ అప్పుడు నువ్వు ఫైనలియర్ ఎగ్జామ్స్ రాస్తున్నావ్. నిజం తెలిస్తే డిస్టర్బ్ అయిపోయి నీ చదువు పాడుచేసుకుంటావని.. మీ అమ్మ నాకు అబద్ధం చెప్పి అదే అబద్ధాన్ని నాతోనూ ఆడించింది. మీ అమ్మ సడెన్ డెత్తో నా గుండె పగిలింది. బిజినెస్‌లో లాస్.. ఇల్లు అమ్మక తప్పని పరిస్థితి.. ఒరేయ్.. ఓటమిని కొడుకుతో పంచుకునేంత ధైర్యం లేని తండ్రినిరా.. అందుకే నీకు చెప్పకుండా ఇల్లు అమ్మేశా. తారా విషయంలో కూడా నేను చేసింది తప్పు కాదు. నీతో మాట్లాడేందుకు ట్రై..’’ అని అంటూండగానే ఆ తండ్రిని వాటేసుకున్నాడు కొడుకు ‘‘సారీ పాపా (నాన్న).. నన్ను క్షమించు’’ అంటూ. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘రాజ్మా చావల్’ అనే సినిమాలోని దృశ్యం. ఓల్డ్ ఢిల్లీలో ప్రాణం దాచుకున్న తండ్రికి, న్యూఢిల్లీలో ప్రాణం పోసుకున్న కొడుక్కి మధ్య భావోద్వేగాల ఘర్షణ, అభిప్రాయభేదాల సంఘర్షణ ఈ సినిమా. ఇంకా చెప్పాలంటే ఫాస్ట్‌ఫుడ్‌కి, సంప్రదాయ భోజనానికి, ఎదురెదురు సంభాషణకు, మెస్సెంజర్‌లో చాటింగ్కున్న వ్యత్యాసమే రాజ్మాచావల్. పైన చెప్పిన సీన్‌కి ముందూ, వెనక కథ.. తండ్రి పేరు రాజ్ మాథుర్(రిషీకపూర్). ఓల్డ్ ఢిల్లీలోని చాంద్నీచౌక్లోనే పుట్టి పెరుగుతాడు. ఆ ప్రాంతం.. బాల్య స్నేహితులంటే రాజ్మాథుర్కి చచ్చేంత ఇష్టం. ‘‘మన పిల్లలకు ఈ గజిబిజి వాతావరణం వద్దు. ప్రశాంతంగా ఉన్న లొకాలిటీకి మారుదాం’’ అని భార్య కోరితే కొత్త ఢిల్లీకి షిఫ్ట్ అవుతాడు. అక్కడే పుడ్తాడు కబీర్ మాథుర్ (అనిరు«ద్ తన్వార్). అమ్మ కూచీ. ఆధునిక తరానికి ప్రతినిధి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సంగీతం అంటే చెవికోసుకుంటాడు. గిటార్ ప్లేయర్. ఓ బ్యాండ్ పెట్టి మ్యూజిక్ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వాలనుకుంటాడు. కబీర్ సీరియస్‌గా ఆ ట్రయల్స్‌లో ఉన్నప్పుడే అతని తండ్రి హఠాత్తుగా మకాంను చాంద్నీ చౌక్‌కి మార్చేస్తాడు. కనీసం కొడుకుతో మాటైనా చెప్పకుండా. అది కబీర్‌కు కోపం తెప్పిస్తుంది. అమ్మకు జరిగింది చిన్న యాక్సిడెంటే అని అబద్ధమాడి సరిగ్గా ట్రీట్మెంట్ ఇప్పించలేదని, ఇప్పుడు ఆమె తిరిగిన ఆ ఇంటినీ అమ్మేసి అమ్మ జ్ఞాపకాలకు దూరంగా చాంద్‌నీచౌక్ తీసుకెళ్తున్నాడనీ.. డబ్బు తప్ప తండ్రికేదీ ముఖ్యం కాదనే అపార్థంతో తండ్రిని బాధపెడుతూ ఉంటాడు.. అతనితో మాట్లాడకుండా. చాంద్నీ చౌక్.. ఫేస్బుక్ తార తండ్రీకొడుకుల మధ్య మాటలు పెంచడానికి రాజ్‌మాథుర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక ఉపాయం ఆలోచిస్తారు. రాజ్ మాథుర్ చేత ఓ స్మార్ట్ ఫోన్ కొనిపిస్తారు. అతనిపేరుతో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయించి కబీర్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపిస్తారు. కొడుకు రిజెక్ట్ చేయడమే కాక.. తండ్రిని బ్లాక్‌లిస్ట్‌లో పెడ్తాడు. చిన్నబుచ్చుకుంటాడు రాజ్‌మాథుర్. అప్పుడు రాజ్‌మాథుర్ స్నేహితుడి తల్లి... టెక్నోసావి అన్నమాట. ఆమె తన ఫెబీ అకౌంట్లోని ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్.. వాళ్ల ఫ్రెండ్స్ లిస్ట్నంతా జల్లెడ పట్టి.. ఒకమ్మాయి ఫోటో తీస్తుంది. దాన్ని ప్రొఫైల్‌పిక్‌గా పెట్టి తార (అమైరా దస్తూర్) అనే పేరుతో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తుంది. రాజ్‌మాథుర్ కొడుకు కబీర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది. వెంటనే ఓకే చేస్తాడు కబీర్. ఆ అకౌంట్ నుంచి అమ్మాయిలాగే కొడుకుతో చాట్ చేయమని సలహా ఇస్తుంది ఆమె. తామిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ పోవాలంటే ఇదొక్కటే మార్గమనుకొని చాటింగ్ మొదలుపెడ్తాడు తండ్రి. కబీరూ ఆసక్తిగా తన ఇష్టాయిష్టాలు పంచుకుంటూంటాడు. సందర్భం వచ్చినప్పుడల్లా తారగా చాట్ చేస్తున్న రాజ్‌మాథుర్ జీవితంలో తండ్రి రోల్ గురించి చెప్తుంటాడు. నిర్మొహమాటంగానే ఖండిస్తుంటాడు కబీర్. ఎదురెదురుగా కూర్చోని కూడా ఇద్దరూ సెల్‌ఫోన్ కీ బోర్డ్ ద్వారే మాటలు కదుపుతుంటారు. కబీర్‌కు తెలియదు అవతల చాట్ చేస్తోంది తండ్రేనని. మొత్తానికి పట్టువీడని రాజ్‌మాథుర్ చాటింగ్ ద్వారా తన కొడుకులో కొంత మార్పు తేగలుగుతాడు. తనతో ప్రత్యక్షంగా కొడుకు మాట్లాడేలా చేసుకోగలుగుతాడు. ఓ పబ్‌లో తను ఇస్తున్న మ్యూజిక్ షోకీ తన తండ్రిని ఆహ్వానించేంత దగ్గరవుతాడు కబీర్. ఆ రోజు.. ఆ పబ్‌కి తారగా ఎఫ్బీ ప్రొఫైల్ పిక్ ఉన్న అమ్మాయి కూడా వస్తుంది. స్టేజ్ మీదున్న కబీర్ ఆమెను చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతాడు. అది ఆమె తనకిచ్చిన సర్ప్రైజ్ అనుకుంటాడు. ఆ షోకి వచ్చిన రాజ్ మాథుర్ అండ్ ఫ్రెండ్స్ కంటా పడ్తుంది ఆ అమ్మాయి. అవాక్కవుతారంతా. ఈలోపే ఆ అమ్మాయి వెంట ఇంకో అబ్బాయి పడ్తుంటాడు. తప్పించుకుని వెళ్లబోతుంటే కబీర్ ఎదురొస్తాడు... తారా.. తారా.. అంటూ! బిత్తరపోతుంది అమ్మాయి. పొరపాటు పడ్తున్నాడేమో.. తన పేరు తార కాదని చెప్పబోయి ఆగిపోతుంది. వెంటపడ్తున్నవాడిని తప్పించుకోవడానికి తన ముందున్న వ్యక్తితో తారగానే నటించాలనుకుంటుంది. అతనితో అంతకుముందే పరిచయమున్నట్టు ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా చూస్తున్న రాజ్‌మాథుర్ అండ్ ఫ్రెండ్స్ అయోమయంలో పడిపోతారు. ఈ సంఘటన తర్వాత ఒకట్రెండుసార్లు కబీర్‌కు బయట తారసపడ్తుంది తార. కాని పట్టించుకోదు. ఎఫ్బీలో మాత్రం ఏమీ తెలియనట్టే చాట్చేస్తుంటే చిర్రెత్తుకొస్తుంది అతనికి. ఆ చిరాకులోనే తండ్రితో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోతాడు కబీర్. తర్వాత.. ఇదంతా తార మూలంగానేమో అని సందేహపడ్తాడు రాజ్‌మాథుర్. కొడుకుకి నిజం తెలిసేకంటే ముందే ఆ అమ్మాయిని పట్టుకొని అసలు విషయం చెప్పేయాలనుకుంటాడు. ఎఫ్బీ ప్రొఫైల్ పిక్‌ని జూమ్ చేస్తే ఆ ఫొటో వెనకాల మీరట్ అని కనిపిస్తుంది. మీరట్ వెళ్తాడు. ఆ అమ్మాయి తండ్రి హెడ్మాస్టర్. కూతురి మీద కోపంతో ‘‘ఆమె గురించి మాకేమీ తెలియదు.. దయచేసి వెళ్లిపోండి’’ అంటూ వీళ్ల మొహమ్మీదే తలుపేస్తాడు. ఆ అమ్మాయి తమ్ముడు చాటుగా వాళ్లక్క ఫోన్‌నంబర్ ఇస్తాడు. ఢిల్లీ తిరిగొచ్చి ఆ నంబర్‌కి ఫోన్ చేస్తాడు. కలుస్తాడు. విషయం చెప్తాడు. తన ఫోటోని వాడుకుంటున్నందుకు పోలీస్ కంప్లయింట్ ఇస్తానని బెదిరిస్తుంది తార. అలా వాడుకోవాల్సిన గత్యంతరాన్ని వివరించి, ఎలాగైనా సరే కబీర్‌తో స్నేహం, ప్రేమ నటించి మళ్లీ అతను తన ఇంటికి వచ్చేలా చేయమని ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తాడు రాజ్ మాథుర్. చీట్ చేయలేనంటుంది. డబ్బు తీసి ముందు పెడ్తాడు రాజ్‌మాథుర్. అప్పుల్లో కూరుకుపోయిన ఆ అమ్మాయికి అదొక మంచి అవకాశంగా తోస్తుంది. ఆ టాస్క్‌కి ఓకే అంటుంది. కబీర్‌తో స్నేహం చేస్తుంది. కబీర్ ఆ అమ్మాయితో ప్రేమలో పడ్తాడు. అతను చూపే కన్సర్న్కి ఆమే అతణ్ణి ప్రేమిస్తూంటుంది. ఆ క్రమంలోనే తన గతం గురించి షేర్ చేసుకుంటుంది కబీర్‌తో. మీరట్‌లో ఒక అబ్బాయిని ప్రేమించానని, ప్రెగ్నెంట్ కూడా అయ్యానని, వాడు మొహం చాటేశాడని, అబార్షన్ చేయించుకున్నానని, పరువు నెపంతో తల్లిదండ్రులు ఇంటికిరానివ్వలేదని.. ఢిల్లీకి వచ్చి బ్యుటీషియన్‌గా ఉద్యోగం చేసుకుంటున్నానని చెప్తుంది. దాంతో ఆ అమ్మాయంటే మరింత ప్రేమకలుగుతుంది కబీర్‌కు. డ్రామా ఆపేయ్.. తార నిజంగానే తన కొడుకుతో ప్రేమలో పడిందని గ్రహించిన రాజ్‌మాథుర్ ఆమెను పిలిచి ఆ డ్రామా ఆపేయ్మంటాడు. ప్రేమ నిజమని.. డ్రామా కాదని చెప్తుంది తార తడి కళ్లతో. ‘‘సరే, ఆపడానికి ఎంత తీసుకుంటావ్?’’ అంటూ మళ్లీ డబ్బు తీస్తాడు రాజ్‌మాథుర్. ఆ చర్యతో హర్ట్ అయిన తార కబీర్‌ను దూరం పెడ్తూ్తంటుంది. దానికి కొనసాగింపుగా తారగా చాట్ చేస్తున్న రాజ్‌మాథుర్ కబీర్‌ను బ్లాక్ చేస్తాడు. తార ప్రవర్తన అర్థంకాక తల్లడిల్లిపోతాడు కబీర్. తండ్రితో సహా అందరూ తనను మోసం చేస్తున్నారని బాధపడ్తూంటాడు. తండ్రికి మరింత దూరమవుతాడు. కొడుకును తన దరికి రప్పించుకోవడానికి హార్ట్ ఎటాక్ డ్రామా ఆడ్తాడు రాజ్‌మాథుర్. ఆ సమయంలోనే రాజ్‌మాథుర్ తనకు ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించడానికి వస్తుంది తార. ఆ సంగతి తెలిసీ... కూపీ లాగుతాడు కబీర్. తార పేరుతో తండ్రి ఆడిన నాటకమే కాదు హార్ట్ఎటాక్ కూడా డ్రామా బయటపడుతుంది. తార అసలు పేరు సెహెర్ అనీ తేలుతుంది. ఇన్ని అబద్ధాలా? తట్టుకోలేను అని తండ్రిని చీదరించుకుని మళ్లీ వెళ్లిపోతాడు కబీర్. ఆ గండం గట్టెక్కించేది తార ఉరఫ్ సెహెర్ అని, ఆమె మాటే కొడుకు వింటాడనీ ఆమె దగ్గరకు వెళ్లి బతిమాలి, ఒప్పించి కొడుకును వెదికే పనిలో పడ్తాడు రాజ్‌మాథుర్ అండ్ బృందం.ఎట్టకేలకు ఢిల్లీలోని ద్వారకా మెట్రోస్టేషన్లో కొడుకు కనిపిస్తాడు. అప్పటిదే ఆ పైన సీన్. కొడుకు అపార్థం తొలగిపోతుంది. తండ్రితో కలుస్తాడు. సెహెర్ మనసును రాజ్‌మాథుర్ అర్థం చేసుకుంటాడు. కొడుకుతో జత కలుపుతాడు. సెహెర్ను ఆమె తండ్రీ క్షమించి అక్కున చేర్చుకుంటాడు. ఇదీ లీనా యాదవ్ దర్వకత్వం వహించిన రాజ్మాచావల్ మూవీ. – సరస్వతి రమ -
మీ ఇంటి స్త్రీని ధ్వంసం చేయకముందే..!
మామూలుగా అయితే అతడు భర్త అవుతాడు.కడుపున జన్మించినవాడు కొడుకు అవుతాడు.కానీ భర్త, కొడుకు ఒకరితో ఒకరు ఘర్షణ పడితే వారు ఆమెకు శత్రువులౌతారు. వారు పెట్టే ఒత్తిడి ఆమెను శిధిలం చేస్తుందని ఎప్పటికి గ్రహిస్తారు? సూపర్ మార్కెట్లో కొన్న సరుకులను డ్రైవర్ తీసుకుని కారులో పెడుతుంటే ఫ్రెండ్ కనిపించింది.‘హాయ్ రుక్కూ’ సంతోషంగా చేతులు పట్టుకుంది.‘ఊ... లగ్జరీ కారు... డ్రైవరు... బాగుందోయ్ నీ సంగతి’ అంది మెచ్చుకుంటూ.రుక్కు అనబడే రుక్మిణికి కూడా స్నేహితురాలు కనిపించడం బాగనిపించింది.‘ఇంటికి రారాదూ ఒకసారి’ అని పిలిచింది.‘వస్తాను.. వస్తాను.. నీ భవంతిని తప్పక సందర్శిస్తాను. ఎలా ఉన్నారు మీ ఆయన నీ పిల్లలు’ ఫ్రెండ్ అడిగింది.‘వాళ్లకేం. మా ఫ్యాక్టరీ మెల్లగా లాభాల్లో పడింది. పెద్దాడు ఎంబిఏ చేసి ఫ్యాక్టరీ పనులు చూసుకోవడం రెండు నెలలుగా మొదలెట్టాడు. చిన్నాడి చదువు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. లైఫ్ హ్యాపీగా ఉంది’....చెప్తున్న రుక్మిణి వైపు స్నేహితురాలు సాలోచనగా చూసింది.ఇద్దరిదీ దాదాపు ఇరవై ఏళ్ల స్నేహం. చిన్నప్పటి నుంచి కాలేజీ వరకూ కలిసి చదువుకున్నారు. అందుకే అంది–‘కాని నువ్వు సంతోషంగా లేవు రుక్కూ. ఎందుకో సంతోషంగా లేవు. చెక్ చేసుకో. మళ్లీ కాల్ చేస్తాను’ అంటూ సూపర్ మార్కెట్లోకి వెళ్లిపోయింది.రుక్మిణికి కలవరంగా అనిపించింది ఆ మాటలకు.‘ఎలా కనిపెట్టింది?’ అనుకుంది.ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు దాటింది. అన్నం తినాలనిపించలేదు. ఈ మధ్య ఇలాగే ఉంటోంది. ఏదో ఆందోళన.ఫ్యాక్టరీలోని రిసెప్షనిస్ట్‌కి ఫోన్ చేసింది.‘సార్ ఎక్కడున్నారు?’‘ఆయన కేబిన్‌లో ఉన్నారమ్మా’‘చిన్న సారు’‘చిన్నసారు తన కేబిన్‌లో ఉన్నారు’‘ఇద్దరూ కలిసి భోజనం చేశారా?’‘లేదు... ఎవరికి వారు చేసినట్టున్నారు’‘ఏం టెన్షన్ లేదు కదా’‘ఏం టెన్షన్ లేదమ్మా’ఆ అమ్మాయి అంటోంది కాని నమ్మకం కలగడం లేదు. టెన్షన్ ఉంది. ఫ్యాక్టరీలో ఉంది. ఇంట్లో కూడా ఉంది.వారం క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.తండ్రీ కొడుకులు ఇద్దరూ కోపంగా ఇంటికొచ్చారు. కొడుకు విసురుగా తన గదిలోకి వెళ్లిపోయాడు. తండ్రి బుసలు కొడుతూ డ్రాయింగ్ రూమ్‌లో కూలబడ్డాడు. వాళ్లను అలా చూడటం ఆమెకు అదే మొదలు.‘ఏమైందండీ’‘ఫ్యాక్టరీలో నా పరువు తీశాడు’‘అదేంటి?’‘మన దగ్గర ఇరవై ఏళ్లుగా పని చేస్తున్న సీనియర్ వర్కర్‌ను పనిలో నుంచి తీసేశాడు. వాడొచ్చి నా దగ్గర మొరపెట్టుకున్నాడు. అలా తీయడం కరెక్ట్ కాదని చెప్పాను. అందరి ముందు నా మాట లెక్క చేయకుండా తీసేయాల్సిందే అని అకౌంట్ సెటిల్ చేసి పంపించాడు. ఏంటిది?’కొడుకు లోపలి నుంచి వచ్చాడు.‘మీ నిర్ణయమే చెల్లుబాటయ్యేటట్టుంటే నాకెందుకు ఫ్యాక్టరీ అప్పజెప్పినట్టు. రెండు నెలలుగా చూస్తున్నాను. నా ప్రతి మాటను మీరు తీసిపడేస్తున్నారు. వర్కర్లు బాగా లెక్కలేనితనానికి అలవాటు పడి ఉన్నారు. ఒక్కరూ సరిగ్గా పని చేయడం లేదు. చాలా అవకతవకలు ఉన్నాయి. సరిచేద్దామంటే చేయనిస్తేగా’‘నోర్మూయ్. నీకేం తెలుసని. నిన్నగాక మొన్నొచ్చావ్. ఏ నిర్ణయానికైనా అనుభవం ఉండాలి’కొడుకు తల్లివైపు చూశాడు.‘ఇదమ్మా వరుస. ఇలాగైతే నాకు ఫ్యాక్టరీ వద్దూ ఇల్లూ వద్దు. వెళ్లిపోతాను’‘పోరా... పోతే పో. బెదిరిస్తున్నావా’ఆమెకు మెల్లగా తలనొప్పి మొదలైంది. గుండె దడ మొదలైంది. ఆ రాత్రి డిన్నర్ చేయడానికి అనువైన ఆకలీ చచ్చిపోయింది.పెద్దకొడుకును ఎం.బి.ఏ చదివించింది ఫ్యాక్టరీ కోసమే. చదువైపోయాక ఫ్యాక్టరీ అజమాయిషీని చూసుకోవాలన్నది కూడా కుటుంబ నిర్ణయమే. కొడుక్కి ఆ పని ఇంట్రెస్ట్ కూడా. కాని ఈ అధికార బదిలీ స్మూత్‌గా జరగడం లేదు. కొడుకు దూకుడుకి తండ్రి అడ్డం పడుతున్నాడు. అవరోధం అవుతున్నాడు. కంగారు పడుతున్నారు. దీనివల్ల ఒకరినొకరు అవమానించుకుంటున్నారు. శత్రువులుగా మారుతున్నారు.ఇందుకు వొత్తిడి వారికి ఉండాలి. కాని నలిగిపోతోంది తను. రాత్రి భర్తకు సర్దిచెప్పబోయింది.‘చూడు... రూపాయికి గతిలేని రోజుల నుంచి రక్తమాంసాలు కరిగించి ఫ్యాక్టరీని ఈ స్థాయికి తెచ్చాను. వీడిలాగే పిచ్చివేషాలేస్తే దానిని అమ్మిపారేస్తాను’ అన్నాడు భర్త.కొడుక్కు సర్ది చెప్పబోయింది.‘అమ్మా... ఆయన నన్ను ఉద్యోగిగా అనుకుంటున్నాడా యజమానిగా అనుకుంటున్నాడా అది తేల్చు ముందు’ అన్నాడు.అప్పటి నుంచి తనకు ఏమిటోగా ఉంటోంది. మనసులో ఏమిటోగా. మెదడులో ఏమిటోగా. తృప్తిగా భోం చేసి చాలా రోజులు. అసలు ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసి చాలా రోజులు. ఈ మధ్యాహ్నం కూడా తన పొట్ట ఖాళీయేనా?ఇంతలో రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.‘అమ్మా.. పెద్దసారు చిన్నసారు కేబిన్‌లోకి వెళ్లారు. ఇద్దరూ అరుచుకుంటున్నారు’అంతే. అప్రయత్నంగా ఆమె చేయి నుదురును తాకింది. తల కొట్టుకుంటూనే ఉంది. కొట్టుకుంటూనే ఉంది. కొట్టుకుంటూ కొట్టుకుంటూ అలానే పడిపోయింది.‘ఈమెను తెచ్చారేమిటి... రావాల్సింది మీ ఇద్దరు కదా’ అంది లేడీ సైకియాట్రిస్ట్ రుక్మిణి భర్తను, కొడుకును చూస్తూ.వాళ్లు అర్థం కానట్టు చూశారు.‘నేను ఆమెతో మాట్లాడాను. ఇక మాట్లడాల్సింది మీతోనే. మీ మగవాళ్లు ఎప్పటికి మారతారు? మీరు ఆడవాళ్లతో గొడవపడితే వొత్తిడికి లోనయ్యేది ఆడవాళ్లే. మీరూ మీరూ గొడవపడినా ఒత్తిడి చెందేది ఆడవాళ్లే. భర్త హోదాలో మీరూ కొడుకు హోదా ఇతనూ చెరోవైపు ఆమెను గట్టిగా లాగేసరికి రెక్కలు తెగి పడిందామె. రామ్మోహన్రావుగారూ... కొందరు ఉన్నతోద్యోగులు రిటైరైనా తాము ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటారు. అలా ఉంది మీ మానసికస్థితి. మీరు ఫ్యాక్టరీ నుంచి తప్పుకునే సమయం వచ్చిందని మీరు అంగీకరించడం లేదు. మీ కొడుకును ఒక సమర్థుడుగా గుర్తించడం లేదు. అతడు కూడా తప్పులు ఒప్పులు చేసి మీలాగే నేర్చుకుంటాడన్న సంగతి మర్చిపోయి అవమానిస్తున్నారు. మీరు సలహాదారుగా ఉండగలరు తప్ప అజమాయిషీదారుగా ఉండకూడదని ఇప్పటికైనా గ్రహించి మీ కుమారుడికి విలువ ఇవ్వండి. అలాగే నువ్వుకూడా చూడు బాబు.. తండ్రితో ఫ్యాక్టరీలో గొడవపడి తండ్రి మర్యాద పోగొట్టడం పెద్ద హీరోయిజం అని ఫీలవుతున్నావు. ఆయన వల్లే నువ్వు. నీ వల్ల ఆయన కాదు. మీరిద్దరు కొట్లాడుకుంటున్నారన్న సంగతి బయటకు పొక్కితే కుటుంబగౌరవం పోతుంది. ఫ్యాక్టరీ ప్రమాదంలో పడుతుంది. అధికారం నువ్వు పొందలేదు. వారసత్వంగా దక్కించుకున్నావు. దానికి తగ్గ యోగ్యత ప్రదర్శించి నమ్మకాన్ని పొందేవరకు మీ నాన్నగారి సలహాలు పాటించు. ఏ అనుభవమూ వృథాపోదు. అన్నింటికంటే ముఖ్యం... కోపతాపాలు మిషన్లకు తెలియవు. నడుస్తాయి. కాని మనిషికి తెలుస్తాయి. మీ కోపతాపాలు మీ ఇంటి స్త్రీని ధ్వంసం చేయకముందే మేల్కొనండి’....తండ్రీ కొడుకులు ముఖాముఖాలు చూసుకున్నారు.నెల రోజులు గడిచాయి.సూపర్ మార్కెట్లో రుక్మిణికి మళ్లీ స్నేహితురాలు కనిపించింది.హుషారుగా కనిపిస్తున్న రుక్మిణిని చూసి ‘అమ్మయ్య... నా పాత రుక్కూలానే ఉన్నావ్’ అంది దగ్గరకు తీసుకుని కావలించుకుంటూ.ఆడవాళ్లు సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉన్నట్టే. – కథనం: సాక్షి ఫ్యామిలీ -
ఒక పక్షి పూసింది
ఎక్కడైనా ఏ ఆడపిల్లయినా పక్షిలా ముక్కున గోల్డ్ మెడల్ కరుచుకొచ్చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదెలా సాధ్యం అయిందని! ఎందుకవదూ.. ఎదుగుదల సృష్టి సహజగుణం అయినప్పుడు? ఎదుగుదలను పైకి కనిపించేలా చెయ్యడం కూడా ప్రకృతి గుణమే. పైకి కనబడుతోందే దేవుడా, పాడుకళ్లను పడనివ్వకూడదని రెక్కల్ని దాచేస్తే ఎలా?! ఎదుగుతున్న ఆడపిల్ల ఉన్న ఇల్లు ధైర్యంగా ఉండొద్దూ! మాధవ్ శింగరాజు ఆడపిల్ల ఎదిగితే పువ్వు పూసినట్లుగా ఉంటుంది. మగపిల్లాడు ఎదిగితే పక్షి ఎగిరినట్లుగా ఉంటుంది. పువ్వు పూసినట్లుగా ఉండాలని ఆడపిల్ల, పక్షి ఎగిరినట్లుగా ఉండాలని మగపిల్లాడు నైటవుట్స్ చేసేమీ ఎదగరు. వాళ్ల మానాన వాళ్లు మెల్లిగా ఎదుగుతారు. ఇంట్లో పెట్టిందేదో ఇంత తిని, రోజూ స్కూల్‌కి వెళ్లొస్తూ, బాగా చదివి పరీక్షలు రాస్తూ, ఉద్యోగాలకు ప్రిపేర్ అయి ఇంటర్వ్యూలు నెగ్గుకొస్తూ.. ఓ రోజెప్పుడో దీపాలు పెట్టే వేళకు అకస్మాత్తుగా మన ఇంట్లోకి స్వీట్ బాక్సుతో వచ్చేస్తారు.. ‘ఆంటీ, నాకు యు.ఎస్.ఫర్మ్‌లో ఓవర్సీస్ ఎగ్జిక్యూటివ్‌గా జాబ్ వచ్చింది. నెలలో సగం రోజులు ఫ్లయిట్ జర్నీలే.. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ..’ అని అమ్మాయి చెబుతుంది! ‘అంకుల్, ఇక్కడే సిటీ బ్రాంచ్‌లో నాకు ప్రొబేషనరీ ఆఫీసర్‌గా పోస్టింగ్ వచ్చింది. నాన్న కోరుకున్నట్లే టెన్ టు ఫైవ్ బ్యాంక్ జాబ్’ అని అబ్బాయి చెబుతాడు. అప్పుడు కూడా ఆ ఎదిగిన అమ్మాయి ‘ఒక పువ్వు పూసినట్లుగా’నే, ఆ ఎదిగిన అబ్బాయి ‘ఒక పక్షి ఎగరబోతున్నట్లుగా’నే అనిపిస్తారు తప్ప.. అమ్మాయి చేయబోయేది జర్నీల జాబ్ కనుక ఆమెను ‘ఎదిగిన పక్షి’లా, అబ్బాయికి వచ్చింది ఎటూ కదలకుండా కూర్చొని చేసే ఉద్యోగం కనుక అతడిని ‘ఒదిగిన పువ్వు’లా చూడలేం. ఆడపిల్లకు అంత పెద్ద బలమైన, మెరిసే అందమైన, చక్కటి డిజైన్లు ఉన్న ఖండాంతర రెక్కలు ఉన్నప్పటికీ ఆమె పక్షి కాలేదు, పువ్వే! ఎందుకు పువ్వంటే, పువ్వులా పెంచుకుంటాం కనుక. మగపిల్లాడు గాలికి ఎదిగితే, ఆడపిల్ల గాలిలోకి పరిమళాలు వెదజల్లుతూ ఎదుగుతుంది. అక్కడొస్తుంది భయం. పువ్వులా పెంచడం ఆ భయానికే. మనమ్మాయి ఎదగాలి. కానీ ఇంట్లోనే ఉండి ఎదగాలి! బయటి వాటర్ బాటిల్స్ తాగకూడదు. బయటి గాలి పీల్చకూడదు. బయటి సూర్యరశ్మి తగలకూడదు. కుండీలోని పువ్వు ఎంతవరకు ఎదుగుతుంది? మహా అయితే మెట్టినింటి గోడ మీది వరకు. అక్కడా మళ్లీ ఆ కుండీలోనే. అందుకే ఎక్కడో ఏ మానుకో పుట్టి, స్వేచ్ఛగా ఎదిగి, పక్షిలా ఎగిరిన పువ్వును చూస్తే ప్రపంచానికింత విడ్డూరం! సైకిల్ ఎవరైనా నడపగలిగిందే. ఆడపిల్ల నడిపితే సర్ప్రైజింగ్. ర్యాంక్ ఎవరికైనా వచ్చేదే. ఆడపిల్లకు వస్తే అమేజింగ్. ఎవరెస్టు ఎత్తు ఎవరికైనా ఒకటే. ఆడపిల్ల ఎక్కితే ఎస్టానిషింగ్. ఆడపిల్ల సాధించిన ప్రతి విజయంలోనూ మనమిలా ఎందుకు ‘ఆ’ అని నోరు తెరుస్తామంటే.. నడిచే దారిలో నడవనివ్వకుండా, పరుగెత్తే దారిలో పరుగెత్తనివ్వకుండా, పడిలేచే దారిలో పడిలేవనివ్వకుండా ఆడపిల్లల్ని అరచేతుల్లో పెట్టుకుని మనమే నడుస్తూ, మనమే పరుగులు తీస్తూ, మనమే పడిలేస్తూ ఉంటాం కదా. అందుకు. ఎక్కడైనా ఏ ఆడపిల్లయినా పక్షిలా ముక్కున గోల్డ్‌మెడల్ కరుచుకొచ్చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదెలా సాధ్యం అయిందని! ఎందుకవదూ.. ఎదుగుదల సృష్టి సహజగుణం అయినప్పుడు? ఎదుగుదలను పైకి కనిపించేలా చెయ్యడం కూడా ప్రకృతి గుణమే. ఆడపిల్ల అచీవ్మెంట్స్ మార్కుల్లో, న్యూయార్కుల్లో మాత్రమే పైకి కనిపించి, ఆమె ఫిజికల్ గ్రోత్ ఎప్పుడూ ఆ పన్నెండేళ్ల లోపు స్కర్ట్ లోపలే కనిపించకుండా ఉండిపోవాలని కోరుకుంటే.. ‘ఓకే పేరెంట్స్.. అలాగే చేద్దాం.. మీ అమ్మాయికొక మంచి వరుడు దొరికే వరకు’ అంటుందా ప్రకృతి మన వాకిట్లోకి వచ్చి. అనదు. అనకపోగా, మన అనుమతి లేకుండా ఇంటి లోపలకి వచ్చి.. బెడ్ మీద చుట్టూ బుక్స్‌తో బోర్లా పడుకుని కాళ్లు పైకీ కిందికీ ఆడిస్తూ హోమ్‌వర్క్ చేసుకుంటున్న మన అమ్మాయి బుగ్గలు పుణికి, ఆమె పసి పాదాలకు, అమాయకపు చుబుకానికి ఇంత పసుపు, గంధం రాసి వెళ్తుంది! ఏం చేస్తాం? ‘హనీ, సరిగ్గా కూర్చో నాన్నా’ అంటాం. పిల్ల వినకపోతుంటే వెళ్లి, సరిచేసి కూర్చోబెడతాం. ‘ఇలా ఉంటేనే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది మమ్మీ’ అంటున్నా వినకుండా! హింస ఇది ఆడపిల్లకు. హింసే! ఒంటిని టచ్ చెయ్యడం కన్న పెద్ద హింస ఒంటిని స్వేచ్ఛగా ఎదగనివ్వకపోవడం. ఇంట్లో ఆడపిల్ల ఎదుగుతుంటే భయం ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. లండన్‌లోని ‘గార్డియన్’ పత్రికా కార్యాలయానికి ఇటీవల కొంతకాలంగా ఫోన్లు వస్తున్నాయి. ‘మా చుట్టు పక్కల ఇళ్లలో బ్రెస్ట్ ఐరనింగ్ (గుండ్రాయిని వెచ్చబరిచి ఛాతీని అదమడం) జరుగుతోంది, ఎవరికి కంప్లైంట్ చెయ్యాలి? అని! ఆఫ్రికా దేశాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో.. ఎదిగే ఆడపిల్లలపై మగపిల్లల దృష్టి పడకుండా ఉండేందుకు అమ్మలు, అమ్మమ్మలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు బ్రెస్ట్ ఐరనింగ్ చేస్తారట. లండన్‌లోని ఆఫ్రికన్ వలస కుటుంబాల్లో అలా జరుగుతోందన్న విషయం ‘గార్డియన్’ పత్రిక వార్తా కథనంతో తెలుసుకున్న యూఎన్ఓ గతవారం బ్రిటన్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ‘ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు మేము నిబద్ధతతో ఉన్నాము’ అని బ్రిటన్ కూడా వెంటనే సంజాయిషీ ఇచ్చింది. పెద్ద విషయం ఇది. ఎదిగిన దేశాలకు మాత్రమే తల్లిదండ్రుల భయాందోళనల వల్ల బాలికల హక్కులకు భంగం కలగడాన్ని పెద్ద విషయంగా తీసుకోగల శక్తి ఉంటుంది. ‘అగ్రదేశం’ కన్నా పెద్దది ‘ఎదిగిన దేశం’. కొన్ని ఆయుధాలు, కొంత అహంకారం ఉంటే చాలు అగ్రదేశం అయిపోవచ్చు. ఆడపిల్లల్ని హాయిగా ఎదగనివ్వడానికి, స్వేచ్ఛగా ఎగరనివ్వడానికి రోజుకు పదిసార్లు దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకొచ్చే తల్లిదండ్రులకు ధైర్యాన్నిచ్చి, ‘మీ అమ్మాయిని నిశ్చింతగా బయటికి పంపండి, క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత మాది’ అని భరోసా ఇవ్వగలిగిన దేశం మాత్రమే ‘ఎదిగిన దేశం’ అవుతుంది. ‘బ్రెస్ట్ ఐరనింగ్’ అనే విపరీతం గురించి మీకివాళే మొదటిసారిగా తెలిసి, మీరింకా తేరుకోలేకపోతుంటే.. కాసేపటి తర్వాతనైనా.. అధునాతన తెగల్లోని మనం రోజూ చేస్తున్న ఆడపిల్లల ఆశల ఐరనింగ్, ఆశయాల ఐరనింగ్, వారి కలల ఐరనింగ్.. ఇవన్నీ ‘బ్రెస్ట్ ఐరనింగ్’ కంటే ఏం తక్కువ అని మీకు అనిపిస్తే కనుక మీరొక ఎదుగుతున్న పేరెంట్ అనే. మీ వల్ల ఈ దేశం ఎదగబోతున్నదనే. ఎదుగుతున్న ఇంట్లో, ఎదుగుతున్న దేశంలో ఆడపిల్ల ఎదిగితే పువ్వు పూసినట్లుగా మాత్రమే ఉండదు. పక్షి ఎగిరినట్లుగా కూడా ఉంటుంది. పువ్వు తక్కువ, పక్షి ఎక్కువ అని కాదు. పక్షిలా ఎగరాలని ఉన్నప్పుడు పువ్వులా ఎందుకు ఉండిపోవాలీ అని! ∙ -
కొడుకులు బువ్వ పెట్టడం లేదని..
వెల్గటూరు (ధర్మపురి): కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడంలేదని, న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధ దంపతులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో బుధవారం జరిగింది. ఎస్ఐ మహేందర్ కథనం ప్రకారం.. మండలంలోని రాజారాంపల్లికి చెందిన బండ వెంకయ్య, రాజమ్మ దంపతులకు నలుగురు కుమారులు సంతానం. అందరికీ పెళ్లిళ్లు చేశారు. తమకున్న ఆస్తిని సమానంగా పంచి ఇచ్చారు. ఈ క్రమంలో వృద్ధాప్యం దరి చేరడంతో తల్లిదండ్రులను కొడుకులు నెలనెలా ఒకరు సాదాలని నిర్ణయించుకున్నారు. కొన్నిరోజులుగా వీరిని ఏ కొడుకూ పట్టించుకోవడం లేదు. కనీసం బువ్వ కూడా పెట్టడంలేదని పేర్కొంటూ వెంకయ్య (75) బుధవారం ఠాణాకు చేరాడు. తమ చేతిలో చిల్లి గవ్వలేదని, తనకు వచ్చే పింఛన్‌పైనే ఇద్దరం కాలం వెళ్లదీస్తున్నామని వాపోయాడు. వృద్ధుడి బాధ విన్న ఎస్ఐ అతడి నలుగురు కుమారులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తండ్రి పేరిట ఉన్న 18గుంటల భూమిని ఎవరూ పంచుకోవద్దని హెచ్చరించారు. చేతనైనన్ని రోజులు ఇద్దరూ కలిసే ఉంటారని, ఆ తర్వాత కొడుకులందరూ తల్లిదండ్రులను తలా కొన్ని రోజులు సాకాలని సూచించారు. అనంతరం వృద్ధ దంపతులను ఓదార్చి ఇంటికి పంపించారు. -
కన్నతండ్రిని కత్తులతో నరికిన కొడుకులు
సాక్షి, కర్నూలు(డోన్): తల్లిని కొట్టారన్న కోపంతో తండ్రిని కుమారులే హతమార్చారు. ఈ సంఘటన సోమవారం రాత్రి డోన్ పట్టణంలోని గుత్తి రోడ్డులో గల అమ్మా హోటల్ ఎదుట చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చిగురుమాను పేట ప్రాంతానికి చెందిన కృపానందం (45)కు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండేవి. అలాగే భార్యను తరచూ వేధించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం భార్యను కొట్టాడు. ఇందుకు అతని కుమారులైన రౌడీషీటర్లు చిన్నకాంతు, పెద్దకాంతు, నాగన్న ఆగ్రహించారు. అమ్మా హోటల్ ఎదుట ఉన్న కృపానందంను చుర కత్తులతో విచక్షణారహితంగా నరికారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆటోడ్రైవర్లు చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ఘటన గురించి కృపానందంను అడిగి తెలుసుకొన్నారు. తన భార్యను కొట్టినందుకు కుమారులే కత్తులతో దాడిచేశారని అతను ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని మెరుగైన వైద్యచికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. హత్యకు గురైన కృపానందం -
కొడుకులే కాడెడ్లుగా..
చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతు చీర వెంకటయ్యకు గ్రామంలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. అందులో ఈ ఏడాది పత్తి వేయాలని నిర్ణయించుకున్నాడు. వర్షాల కోసం ఎదురు చూస్తుండగా శుక్రవారం రాత్రి విత్తనాలు వేసేందుకు సరిపడా వర్షం పడటంతో వెంకటయ్య సంతోష పడ్డాడు. శనివారం ఉదయం విత్తనాలు వేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే వెంకటయ్య ఇటీవలే కొనుగోలు చేసిన రెండు ఎడ్లలో ఒక ఎద్దు కాలుకు ఏమి జరిగిందో తెలియదు గానీ కాలు కిందపెట్టలేకపోతోంది. మూడు కాళ్లపైనే నిలబడుతుంది. ఎద్దు నడవలేని స్థితిలో ఉంటే అరక ఎలా కట్టాలని ఆలోచనలో పడ్డాడు. ఆలస్యం చేస్తే భూమిలో మళ్లీ పదను పోతుందని భావించి.. తన కొడుకు, తన తమ్ముని కొడుకు ఇద్దరినీ పత్తి విత్తనాలు వేసే అడ్డకు (అరకకు) కాడెద్దులుగా మార్చాడు. రెండునర్న ఎకరాల భూమిలో ఇద్దరు కొడుకులతో అడ్డకొట్టి విత్తనాలు వేశాడు. రైతు పడే కష్టం మాటల్లో చెప్పలేనిది అంటే ఇదే. – చేవెళ్ల: -
కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు
-
నాన్న దొంగ.. కొడుకులు డాక్టర్, ఇంజనీర్!
ముంబై: తండ్రి దొంగ.. కొడుకులు మాత్రం డాక్టర్, ఇంజనీర్! ఇది ఏదో సినిమా స్టోరిలా ఉంది కదా! కానీ ఇది నిజం. ఈ వింత కేసును ముంబై పోలీసులు ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. అతనో దొంగ. పేరు రవిచంద్రన్ ముదలియార్. కార్లలో విలువైన వస్తువులు, మొబైల్స్, నగదు అపహరించే టక్-టక్ దొంగల ముఠాకు అతడు నాయకుడు. ఓ దొంగతనం కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులకు ముదలియార్ చుక్కలు చూపించాడు. తనకు హిందీ రాదని, తమిళం మాత్రమే వచ్చని నమ్మబలికాడు. దీంతో పోలీసులు తమదైన రీతిలో విచారించడం మొదలుపెట్టారు. అతడి నేపథ్యం గురించి ఆరా తీశారు. అసలు విషయం తెలుసుకొని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ముదలియార్‌కు ఓ భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురిలో మొదటి వ్యక్తి నవీ ముంబైలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్. ఎమ్మెస్ చేస్తున్నాడు. రెండో కొడుకు ఓ ఇంజినీర్ కాగా.. మూడో కొడుకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. వాళ్లంతా నవీ ముంబైలో నివాసముంటున్నారు. ఇక టక్-టక్ దొంగల ముఠా కూడా వెరైటీగా దొంగతనాలు చేస్తుంది. రోడ్డుపై వెళ్లే వాహనాలే వీరి టార్గెట్. రోడ్డు మీద ప్రయాణిస్తున్న కార్లను ఆపి, ఇంధనం లీక్ అవుతుందని లేదా ఏదైనా ప్రమాదం జరిగిందని నమ్మబలుకుతారు. దీంతో వాహనంలో ఉన్నవారు దాన్ని నిలిపివేసి బయటకు వచ్చి పరిశీలించే సమయంలో అందులో విలువైన వస్తువులు, నగలు తీసుకొని పారిపోతారు. ఇటీవల దక్షిణ ముంబైకి చెందిన ఓ మహిళ కారులో ప్రయాణిస్తుండగా ఆపి, వాహనం నుంచి ఇంధనం కారుతుందని చెప్పి, అందులోని నగలు దొంగిలించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముదిలియార్‌తో పాటు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. -
కన్నతల్లికి కూడుపెట్టని కొడుకులు
ఇల్లందకుంట(హుజూరాబాద్): నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు.. బుక్కెడు అన్నం పెట్టేందుకు నిరాకరించడంతో ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో చర్చనీయాంశమైంది. జమ్మికుంట సీఐ నారాయణ కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన ముద్రకోల నర్సమ్మ, రాజయ్య దంపతులకు ఐదుగురు కుమారులు సంతానం. అందరికీ పెళ్లి అయ్యింది. రాజయ్య 15 ఏళ్లక్రితం చనిపోయారు. కుమారుల్లో ఇద్దరు మూడేళ్ల క్రితం చనిపోయారు. మిగిలిన ముగ్గురు కుమారులు వేర్వేరుగా ఉంటున్నారు. సంచార వృత్తి చేసుకుంటూ జీవిస్తుండడంతో నర్సమ్మను పట్టించుకునేవారు కాదు. ప్రస్తుతం నర్సమ్మ కుమారుల వద్ద వంతులవారీగా ఉంటోంది. అయితే ఏ కొడుకు వద్ద ఉన్నా.. ఆ కొడుకు పింఛన్ డబ్బులు తీసుకునేవారు. ఇటీవల నర్సమ్మ అనారోగ్యం బారిన పడినా.. ఏ కొడుకూ స్పందించలేదు. చివరకు ఆరోగ్యశ్రీలోనే ఆమె ఆపరేషన్ చేయించుకుంది. ఈ క్రమంలో కొడుకులు పట్టించుకోవడం లేదని, తనకు అన్నం పెట్టడం లేదని పేర్కొంటూ ఆ తల్లి మంగళవారం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. స్పందించిన సీఐ ఆమె ముగ్గురు కుమారులకు సమాచారమిచ్చి.. స్టేషన్‌కు పిలిపించారు. వారిలో ఇద్దరు కుమారులు రాజయ్య, సంపత్ రావడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మను సరిగా చూసుకోవాలని, లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో కొడుకుల మనసు కరిగింది. తల్లిని వెంటబెట్టుకుని వెళ్లారు. బాగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. -
అందరు ఉన్నా..తాగేందుకు నీళ్లు పోయలేదు...
శాలిగౌరారం (తుంగతుర్తి) : నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కొడుకులు..తొలిదైవంగా భావిస్తారు. ఆ తల్లిని..ఈలోకం విడిచే వరకు ఏలోటు రాకుండా చూసుకోవాల్సిన వారు కనీస మానవ విలువలను మరిచి తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండికూడా పెట్టకుండా మాడుస్తూ ఇంటినుండి బయటకు తరిమేశారు. ఈ హృదయవిదారక ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మాధారంకలాన్ గ్రామానికి చెందిన తీగల యాదమ్మ(80)కు ప్రస్తుతం వివాహితులైన ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. యాదమ్మ భర్త వెంకయ్య 15 సంవత్సరాల క్రితమే మృతిచెందాడు. దీంతో యాదమ్మ తన ఇద్దరు కొడుకుల వద్దనే ఉంటూ జీవించింది. అన్నదమ్ముల మధ్య తల్లి పోషణ విషయంలో తగాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి యాదమ్మకు రెండవ కుమారుడి ఇంటిఆవరణలో ప్రత్యేకంగా ఒక రేకులగదిని నిర్మించారు. కానీ కోతుల వీరంగాలతో ఆ గది రేకులు మొత్తం ధ్వంసమయ్యాయి. ఇదిలాఉండగా పెద్దకుమారుడు కుటుంబీకులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. పెయింటింగ్ పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండవ కుమారుడు మాత్రం గ్రామంలోనే కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లికి నిర్మించిన గదికి తిరిగి పైకప్పు వేసేందుకు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడంతో పట్టించుకోలేదు. ఆమె పైకప్పులేని ఇంట్లో ఉండలేక పలుమార్లు గ్రామపెద్దలను, చివరకు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. గ్రామపెద్దల మాటలను కూడా తన కుమారులు పట్టించుకోకపోవడంతో మూడేళ్ల క్రితం ఇళ్లు వదిలి వెళ్లింది. అప్పటినుంచి రెండు సంవత్సరాలు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు దేవాలయం వద్ద ఉంటూ యాచకవృత్తిపై ఆధారపడి జీవించింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అక్కడివారు నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న యాదమ్మ కుమార్తెలు తమవద్దనే ఉండేందుకు రమ్మని తల్లిని కోరారు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఐదు నెలల క్రితం యాదమ్మ నకిరేకల్ వచ్చి అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకొని ఆసరా పింఛన్ సాయంతో జీవించింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా మర్రూరుకు చెందిన ఆమె రెండవ కుమార్తె తన ఇంటికి తీసుకెళ్లి సాకుతోంది. విషయం తెలుసుకున్న యాదమ్మ పెద్ద కుమారుడు దశరథ తన చెల్లెలుకు పలుమార్లు ఫోన్‌చేసి దుర్భాషలాడాడు. దీంతో యాదమ్మ ముగ్గురు కుమార్తెలు శుక్రవారం తమ తల్లిని తీసుకొని మాధారంకలాన్ వచ్చారు. తల్లిని అన్నల ఇంట్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా వారు తమ ఇంట్లోకి తీసుకురావద్దంటూ అడ్డుకున్నారు. దీంతో వారు చేసేదేమీలేక పెద్దకుమారుడు దశరథ ఇంటిముందు ఉన్న కానుగుచెట్టకింద తల్లిని వదిలి వెళ్లిపోయారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచానికి పరిమితమైన ఆ వృద్ధతల్లి శుక్రవారం నుంచి వీధిలోని చెట్టుకిందనే జీవచ్ఛవంలా పడిఉంది. చుట్టుపక్కలవారు వృద్ధురాలు పడే నరకయాతనను చూడలేక మంచీళ్లు ఇవ్వడంతోపాటు బుక్కెడన్నం పెట్టి ప్రాణం కాపాడారు. కానీ ఆమె కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాల్లు అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడం శోచనీయం. -
కన్న తండ్రిని వదిలించుకున్నారు.!
సాక్షి, తిరుపతి: నడక నేర్పించి, విద్యాబుద్ధులు చెప్పించి, ప్రయోజకులను చేసిన తండ్రి వారికి భారమయ్యాడు. ముదిమి వయసులో కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రిని దిక్కులేని వాడిగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. నెల రోజులుగా నానా అవస్థలు పడుతున్న ఆ వృద్ధున్ని ‘అమ్మ ఒడి’ నిర్వాహకులు అక్కున చేర్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి తాలూక గాలివీడుకు చెందిన రొడ్డ చెన్నయ్య(70)కి ఐదుగురు పిల్లలు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భార్య అంజనమ్మ చనిపోవడంతో వారిని పోషించి, పెళ్లిళ్లు చేశాడు. 10 ఎకరాల పొలం ఉన్నా వచ్చే ఆదాయం బిడ్డలే తీసుకుంటూ వచ్చారు. వయస్సు మీదపడి నడవలేని స్థితిలో ఇంటికే పరిమితమైన చెన్నయ్యను కోడళ్లు నిర్లక్ష్యం చేశారు. ఆయన ఉంటే తాము కాపురాలు చేయలేమని తెగేసి చెప్పడంతో భార్యల మాటకు విలువనిచ్చిన కుమారులు నెల రోజుల క్రింద అర్ధరాత్రి వేళ తండ్రిని ఒక వాహనంలో తీసుకొచ్చి స్థానిక మల్లికార్జున సర్కిల్ సమీపంలోని వారపుసంత గోడకింద వదిలేసి వెళ్లిపోయారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడు స్థానికులు పెట్టే మెతుకులతో ప్రాణాలు నిలబెట్టుకుంటూ వచ్చాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అమ్మ ఒడి ఆశ్రమ నిర్వాహకులు ఆయన్ను అక్కున చేర్చుకున్నాడు. -
అమ్మను అనాథను చేశారు
ఆకు చాటు పిందె ముద్దు..తల్లి చాటు బిడ్డ ముద్దు..బిడ్డ ఎదిగి గడ్డమొస్తె..కన్న తల్లే అడ్డు అడ్డు..అని సినీగేయ రచయిత రాసి అక్షరాలను నిజం చేశారు ఈ పుత్రరత్నాలు. నలుగురు కొడుకులు..ఒకరికి మించి ఒకరిపై ప్రేమ కురిపించింది. కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందోనని తన గుండెలపై పెట్టుకుని లాలించింది..రెక్కలొచ్చాక బిడ్డలకు ఆ రెక్కలిచ్చిన తల్లి భారమైంది. గుట్టుచప్పుడు కాకుండా నడిరోడ్డుపై అనాథలా వదిలిపడేశారు. ఇదేందయ్యా అని అడిగే శక్తి లేక..నడిచే ఓపిక లేక జీవచ్ఛవంలా ఆ పండుటాకు కూలబడిపోయింది. అవస్థాన దశలో పడి ఉన్న ఈ అమ్మను చూసి చలించిపోయిన ఓ ఇద్దరు ఆమెకు ఆయువు పోయడంతోపాటు మానవత్వాన్నీ బతికించారు. మంగళవారం గుంటూరులోని కాకానిరోడ్డులో జరిగిన ఈ సంఘటన నేటి సమాజంలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మానవీయ బంధాలను కళ్లకు కట్టింది. గుంటూరు(పట్నంబజారు): రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామానికి చెందిన పుసులూరి ఉమామణికి 70 ఏళ్లు. భర్త ఆనందయ్య మూడేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి శ్రీనివాసరావు, రమేష్, బాలకృష్ణ, కృష్ణార్జున కుమారులు. ఆనందయ్య చనిపోకముందే రెండు ఎకరాల పొలాన్ని అమ్మి వచ్చిన రెండున్నర కోట్లు కుమారులతోపాటు భార్యకు పంచారు. ఇటీవల మూడో కుమారుడు బాలకృష్ణ మృతి చెందాడు. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక వాహనంలో ఉమామణిని ఎవరో తీసుకొచ్చి కాకానిరోడ్డులోని వాసవి క్లాత్ మార్కెట్ ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో పడుకోబెట్టి వెళ్లిపోయారు. ఎండిన డొక్కలతో ఆ వృద్ధురాలు అక్కడే పడి ఉంది. గమనించిన స్థానికుడు శ్రీవారి సేన రాష్ట్ర అధ్యక్షుడు టి. మణికంఠ వృద్ధురాలి ఆచూకీ కోసం ప్రయత్నించారు. శాఖమూరు గ్రామానికి చెందిన సుభాని అనే వ్యక్తి కారు రిపేరు నిమిత్తం వచ్చి వృద్ధురాలిని గుర్తించి బంధువులకు సమాచారాన్ని అందించారు. మాతృమూర్తిని మరిచారు... వృద్ధురాలి మూడో కుమారుడు బాలకృష్ణ భార్య వీరమ్మ, ఆమె కుమార్తెలు పద్మ, శిరీషలకు విషయాన్ని తెలియపరిచారు. మనమరాళ్లు పద్మ, శిరీషలు బస్‌స్టాప్ వద్దకు చేరుకుని తల్లికి విషయాన్ని చెప్పారు. అయితే పెద్ద కుమారుడు శ్రీనివాసరావు, రెండో కుమారుడు రమేష్‌లకు తెలియజేసినా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం గమనార్హం. రెండో కుమారుడి భార్య వీరమ్మ వృద్ధురాలి బాధ్యతను తాను చూసుకుంటానని శాఖమూరు తీసుకెళ్లింది. -
విధి ఆడిన వింతనాటకం
సాక్షి, చెన్నై : విధి ఆడిన నాటకంలో ఇద్దరు బాలురు అనాథలయ్యారు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి హఠాన్మరణం ఓ వైపు, తల్లిని వెంటాడుతున్న కేన్సర్ మహమ్మారి మరో వైపు వెరసి పుస్తకాలను పక్కనపెట్టి ముక్కుపచ్చలారని పసి వయస్సులోనే కూలీలుగా మారారు. జన్మనిచ్చిన తల్లిని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం. చివరకు తల్లి తనువు చాలించడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు కూడా చేయించలేని ఆర్థిక దుస్థితితో తల్లడిల్లారు. బంధువులు, ఆప్తులు ముఖంచాటేయడంతో గత్యంతరం లేక ఆ ఇద్దరు భిక్షాటనకు దిగారు. తల్లి అంత్యక్రియలకు సాయం చేయండంటూ కన్నీటి పర్యంతంతో అభ్యర్థించారు. చివరకు మంచి హృదయాలు స్పందించడంతో తల్లికి ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు. గురువారం దిండుగల్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారకర ఘటన వివరాలు... దిండుగల్ జిల్లా ఎరియోడు సమీపంలోని మేట్టుపట్టికి చెందిన కాళియప్పన్ , విజయ దంపతులకు మోహన్ (14), వేల్ మురుగన్(13) అనే ఇద్దరు కుమారులు, కాళీశ్వరి కుమార్తె ఉన్నారు. బంధువులు, ఆప్తులతో ఆనందకరంగా సాగిన ఈ కుటుంబంలో తొమ్మిదేళ్ల క్రితం విషాదకర çఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో హఠాత్తుగా కాళియప్పన్ మరణించడంతో కుటుంబ భారం విజయకు బరువైంది. కుటుంబ పెద్ద దూరమైనా, ఆప్తులు ముఖం చాటేసినా, రెక్కల కష్టంతో పిల్లల్ని చదివించాలని తపన పడింది. తన స్తోమత మేరకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినా, కాల క్రమేనా విధి ఆడిన నాటకం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. పుస్తకాలు చేతబట్టాల్సిన కుమారుల్ని కూలి పనికి, రక్తం పంచుకుని పుట్టిన కుమార్తె అనాథ ఆశ్రమానికి పరిమితం చేయాల్సిన పరిస్థితి విజయకు ఏర్పడింది. కేన్సర్ మహమ్మారి : విజయను కేన్సర్ మహమ్మారి తాకింది. బ్రెస్ట్ కేన్సర్‌తో తల్లి బాధ పడుతుండడంతో ఆ ఇద్దరు బాలుర కష్టాలు మరింత జఠిలమయ్యాయి. ఇద్దరు మగ పిల్లలు ఎలాగైనా బతక గలరని భావించిన విజయ, తన కుమార్తెను మాత్రం రక్షించాలని ఆ దేవుడ్ని వేడుకుంది. ఇందుకు తగ్గట్టు ఒట్టన్ చత్రంలోని ఓ ఆశ్రమ వర్గాలు కాళీశ్వరి ఆలనాపాలన చూసుకునేందుకు సిద్ధమయ్యారు. క్రమంగా కేన్సర్ తీవ్రత పెరగడంతో ఆస్పత్రికి వెళ్ల లేనంతగా , మంచానికే పరిమితం అయ్యే స్థాయికి విజయ పరిస్థితి చేరింది. తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్ల లేని పరిస్థితుల్లో బంధువులు, ఆప్తుల్ని కలిసి వేడుకున్నారు. వారిలో మాన వత్వం కొరవడింది. ఇక, చేసేది లేక ఇరుగు పొరుగున ఉన్న మానవతావాదుల సాయంతో దిండుగల్ ఆస్పత్రిలో చేర్పించారు. అమ్మకు వెన్నంటి ఉంటూ ఆ ఇద్దరు పిల్లలు సాయం అందించారు. వైద్యులు సైతం విజయకు వైద్య పరీక్షలు అందించారు. అయితే, ఫలితం శూన్యం. భిక్షాటనతో : చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండా, సర్కారు వారి వైద్యంతో కాలం నెట్టుకు వచ్చిన ఆ ఇద్దరు పిల్లల్లో గురువారం ఉదయం పిడుగు పడ్డట్టు పరిస్థితి మారింది. విజయ ఇక, లేదన్న సమాచారంతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆస్పత్రిలోని వార్డులో మంచం మీద విగతజీవిగా పడి ఉన్న తల్లి మృతదేహం వద్ద బోరున విలపించారు. వీరి వేదనను చూసిన పక్కనే మరో మంచం మీదున్న మరో రోగి కుటుంబీకులు, ఆ పిల్లల బంధువులకు సమాచారం అందించారు. కనీసం ఆ ఇద్దరు పిల్లల్ని ఓదార్చేందుకు సైతం బంధువులు, ఆప్తులు రాలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని స్థితిలో తమ తల్లికి ఎలా అంత్యక్రియలు చేయగలమన్న వేదనతో ఆ మంచం వద్దే కన్నీటి పర్యంతంతో నిలుచుండి పోయారు. చివరకు ఆ ఇద్దరు తమ తల్లికి అంత్యక్రియలు జరిపించేందుకు సహకరించాలని ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగుల కుటుంబీకుల వద్ద చేతులు చాపక తప్పలేదు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ భిక్షాటనకు దిగారు. మానవతావాదులు, అనేక మంది రోగులు తమ వద్ద ఉన్న తలా పదో, ఇరవయ్యే ఇచ్చి సాయం అందించే పనిలో పడ్డారు. ఈ ఇద్దరు పిల్లలు బిక్షాటన చేస్తుండడాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. తాము సైతం అంటూ సాయం అందించడమే కాదు, ఆస్పత్రి అధికారి మాలతి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ఆమె అంత్యక్రియలకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆ తదుపరి స్పత్రి వర్గాలు మృతదేహాన్ని దిండుగల్ ప్రభుత్వ ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. తల్లిని, తండ్రిని కోల్పోయి, చెల్లిని ఆశ్రమంలో వదలి పెట్టిన ఈ ఇద్దరు బాలురు అనాథలుగా గమ్యం ఎటో అన్న ట్టు ఆస్పత్రి ఆవరణలో కూర్చుని ఉండడం మనస్సున్న హృదయాల్ని కలచివేసింది. -
తండ్రీ కొడుకులు
తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక, దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పొంగిపోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు. ‘‘నాన్నా.. దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా’’ అన్నాడు. తండ్రి నవ్వాడు. ‘‘దారాన్ని తెంపేద్దామా మరి?’’ అని అడిగాడు. ‘‘లె ంపేద్దాం నాన్నా..’’ అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా. ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేశారు. ‘టప్’మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది. ‘‘ఇలా జరిగింది ఏంటి నాన్నా’’ అన్నాడు కొడుకు విచారంగా. దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆ పిల్లాyì కి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొహం వేసుకుని చూశాడు. కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. ‘‘గాలిపటానికి దారం ఉండేది, దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా, తక్కువైనా గాలిపటం తట్టుకుని నిలబడి, ఇంకా ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకే’’ అని చెప్పాడు. మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి కొడుకు చేతికి దారం అందించాడు. జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్లం అని! నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి. కుటుంబం మనల్ని పట్టుకుని లేదు. పట్టుకుని ఉందనుకుని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టుతప్పిపోతాం. తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం. -
మాయమైపోతున్నడమ్మా.. కొడుకన్నవాడు..!
కని పెంచిన కొడుకులే.. కాల యముళ్లుగా మారుతున్నారని ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమను పున్నామ నరకం నుంచి తప్పించేందుకు ఒక్క కొడుకైనా ఉండాలని ఏ దంపతులైనా ఆశపడతారు. వీరు కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నారు. ఇప్పుడు మాత్రం.. ‘‘చనిపోయిన తరువాత నరకం తప్పించడం సంగతి దేవుడెరుగు..! బతికుండగానే నరకం చూపిస్తున్నాడు..!!’’ అంటూ వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కన్నబిడ్డలుగా చూసుకోవాల్సిన ఆ కొడుకుల నిర్వాకాన్ని చూసిన వారంతా.. ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...‘మాయమైపోతున్నడమ్మా.. కొడుకన్న వాడు’ సాక్షి, పాల్వంచ: అప్పుడు.. అక్కడ అలా... ఆయన.. పమ్మి సుదర్శనాచారి. ఆమె.. పమ్మి స్వరాజ్యలక్ష్మి. కేటీపీఎస్ ఫోర్‌మెన్‌గా 2009లో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. తన కష్టార్జితంతో పాల్వంచలోని గట్టాయిగూడెం ఆదర్శనగర్‌లో ఇల్లు నిర్మించుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు (సతీష్ కుమార్), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. పట్టణంలోని శాస్త్రి రోడ్డులో ‘జానకీరామ జ్యూయలరీ షాపు’ను సతీష్ కుమార్‌తో పెట్టించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన కామేశ్వరిని ఇతడు కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి సతీష్ కుమార్ తల్లిదండ్రులు అయిష్టంగానే అంగీకరించారు. కొన్నాళ్లపాటు బయటనే ఉన్నారు. ఆ తరువాత తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. నలుగురూ కలిసే ఉంటున్నారు. సుదర్శనాచారి–స్వరాజ్యలక్ష్మి దంపతులను కొన్నాళ్ల నుంచి కొడుకు–కోడలు వేధిస్తున్నారు. తమ పేరిట ఇల్లు రాయాలని పట్టుబడుతున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని మానసికంగా వేధిస్తున్నారు. ‘బయటకు వెళ్లకపోతే.. కట్నం తేవాలంటూ వేధిస్తున్నారని మీపై కోడలితో కేసు పెట్టిస్తా, జైలుకు పంపిస్తా’నని కొడుకు బెదిరిస్తున్నాడు. సుదర్శనాచారికి రెండుసార్లు, స్వరాజ్యలక్ష్మికి ఒకసారి గుండె ఆపరేషన్ జరిగింది. తమను సరిగ్గా చూసుకోకపోవడంతోపాటు తరచూ ఘర్షణ పడుతుండడంతో ఆ దంపతులు మనోవేదనతో కుమిలిపోతున్నారు. ‘‘గుండె ఆపరేషన్ చేయించుకున్న మీకు.. మానసిక ప్రశాంతత అవసరం’’ అని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దంపతులు గడిచిన రెండేళ్లపాటు తమ బంధువుల ఇళ్లలో ఉన్నారు. గురువారమే తమ ఇంటికి వచ్చారు. వీరిని ఆ కొడుకు లోపలికి రానివ్వలేదు. తలుపుకు తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. ఆ దంపతులు గేటు ముందు మెట్లపై కూర్చున్నారు. ఈ విషయం తెలిసి, అక్కడకు వచ్చిన చుట్టుపక్కల వారిని చూసి.. ‘‘సాయం చేయండి’’ అంటూ, దీనవదనంతో రెండు చేతులెత్తి వేడుకున్నారు. మీడియా ప్రతినిధులు వచ్చారన్న సమాచారంతో అక్కడకు సతీష్ కుమార్ వచ్చాడు. ‘‘ఈ ఇంటిని త్వరలో మేమే ఖాళీ చేసి వెళ్లిపోతాం’’ అని చెప్పి వెళ్లిపోయాడు. తాళం మాత్రం తీయలేదు. ఆ వృద్ధ దంపతులు రాత్రి 11 గంటల వరకు అలా అక్కడే కూర్చున్నారు. ఆ దంపతుల వద్దకు కుల పెద్దలు వచ్చారు. అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సతీష్‌కుమార్‌ను సీఐ పిలిపించి మందలించారు. తన తల్లిదండ్రులకు ఇంటిని ఈ నెల 18వ తేదీన అప్పగిస్తానని ఆ ‘సుపుత్రుడు’ చెప్పాడు. 19వ తేదీ నుంచి ఆ ఇంటితో తనకు సంబంధం లేదన్నాడు. దీంతో, ఆ దంపతులు తమ బంధువుల ఇంటికి తిరిగి వెళ్లారు. చెప్పిన తేదీ నాటికి ఇంటిని అప్పగించకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఇప్పుడు.. ఇక్కడ ఇలా... దమ్మపేట: ఆయన పేరు.. అంకత నాగయ్య, ఆమె పేరు.. అంకత గంగమ్మ. దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన ఈ దంపతులకు ఇద్దరు కుమారులు (బ్రహ్మయ్య, వెంకటేశ్వరరావు), ఇద్దరు కుమార్తెలు (సరోజని, కుమారి) ఉన్నారు. నాగయ్యకు ఒకప్పుడు మొత్తం 37 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం 13 ఎకరాల చొప్పున 26 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు. మిగిలిన 11 ఎకరాలను తన వద్దనే ఉంచుకున్నాడు. అప్పడే, పెద్ద కుమారుడు బ్రహ్మయ్య వేరుబడి, మల్కారం గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు. అక్కడే ఉంటున్నాడు. నాగయ్య దంపతులు, తమ ఇంట్లోని నాలుగు గదుల్లో రెండింటిని చిన్న కుమారుడు వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. మిగిలిన రెండు గదుల్లో తమ చిన్న కుమార్తె కుమారితో కలిసి ఉంటున్నారు. తమకు మిగిలిన భూమిని కౌలుకు ఇచ్చారు. ఆ ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నారు. భూముల పంపకం పూర్తయినప్పటి నుంచి ఆ దంపతుల బాగోగులను కొడుకులిద్దరూ పట్టించుకోవడం లేదు. తమ బాగోగులు చూడాలని, అందుకుగాను తన పేరిట ఉన్న 11 ఎకరాల భూమిని రాసిస్తానని చిన్న కుమారుడు వెంకటేశ్వరరావుతో నాగయ్య చెప్పాడు. అందుకు కొడుకు అంగీకరించాడు. దీంతో అతడి పేరిట వీలునామాను నాగయ్య రాశాడు. చిన్న కుమారుడి పేరిట భూమిని వీలునామా రాయడం సరికాదని నాగయ్యకు బంధువులు చెప్పారు. దీంతో, ఆయన వెంటనే ఆ వీలునామాను రద్దు చేసుకున్నారు. ఇది చిన్న కుమారుడు వెంకటేశ్వరరావుకు కోపం తెప్పించింది. గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో, నాగయ్య దంపతులు గత ఆరు నెలలుగా తమ పెద్ద కుమార్తె సరోజని (అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం) ఇంటి వద్ద ఉంటున్నారు. ఆ దంపతులు, తమ చిన్న కుమార్తెతో కలిసి శుక్రవారం సాయంత్రం మల్కారంలోని తమ ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం గంగమ్మ, కుమారి కలిసి గిన్నెలు తోముతున్నారు. నాగయ్య బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటికి వెంకటేశ్వరరావు తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ రాలేదు. ఆ దంపతులు ఈ విషయాన్ని గ్రామ పెద్దలతో చెప్పారు. వారు వెంకటేశ్వరరావును వివరణ అడిగారు. తాను ఎవ్వరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. మరో మార్గం లేకపోవడంతో, ఆ వృద్ధ దంపతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ, ఎస్ఐ కౌన్సిలింగ్ ఇస్తారని ఏఎస్ఐ సుబ్బారావు చెప్పారు. ఆ దంపతులు, వినాయకపురంలోని తమ పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లారు. -
మరణించిన అమ్మను మళ్లీ చూసుకున్నాడు
మాతృమూర్తి భౌతికంగా దూరమై సరిగ్గా ఏడాది కాలం..చిత్రపటాలు, అమ్మ పంచిన అమృతమంటి ప్రేమ మాత్రమే ఆమె జ్ఞాపకాలు.. అప్పుడప్పుడు అమ్మ పంచిన ఆప్యాయతలే తలపులు..ఇవీ ఆ కుమారుడికి మిగిలింది. అయితే ఉన్నట్టుండి ఆయనకో తియ్యని కబురు వచ్చింది తమ తల్లి భౌతికకాయం కాటూరు వైద్య కళాశాల్లో కనిపించిందని. ఆ మాట చెప్పిన వెంటనే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే కళాశాలకు వెళ్లి మాతృమూర్తి భౌతికకాయాన్ని మనసారా చూసుకున్నాడు ఆమె పంచిన ప్రేమ మదిలో మెదలగా చెమర్చిన కళ్లు తుడుచుకుంటూ. యడ్లపాడు(చిలకలూరిపేట): తల్లి మృతి చెందిన ఏడాది తర్వాత ఆమె భౌతికకాయాన్ని కుమారులు తిరిగి చూసుకోగలిగారు. యడ్లపాడు ఎర్రచెరువులో ఉంటున్న కేతు వెంకాయమ్మ (85) అనారోగ్యంతో గతేడాది డిసెంబర్ 20న మృతి చెందింది. ఆమె మరణానంతరం కుమారుడు రామబ్రహ్మం మృతదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం కాటూరి మెడికల్ కళాశాలకు అప్పగించారు. ప్రదర్శనల వల్ల తల్లిని చూడగలిగారు... కాటూరి వైద్యశాలలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అక్కడకు వెళ్లిన అనేక మంది రామబ్రహ్మం తల్లి భౌతికకాయాన్ని చూసి గుర్తు పట్టారు. వెంటనే కొడుకు రామబ్రహ్మంకు చెప్పడంతో మంగళవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి తల్లి భౌతికకాయాన్ని చూసుకున్నారు. ఆనందంతో తల్లి ప్రేమను మరొక్కసారి గుర్తు చేసుకున్నారు. -
ఇద్దరు కుమారులతో తల్లి ఆత్మహత్య
మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూరులో ఇద్దరు కొడుకులతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతులను వంగర లక్ష్మి, ఆమె కుమారులు వెంకటరమణ, శ్రీనివాస్ గా గుర్తించారు. వెంకటరమణకు వివాహం కాగా భార్య అందుబాటులో లేదు. గోల్డ్ స్మిత్ కుటుంబానికి చెందిన ముగ్గురూ పన్నెండేళ్లుగా ఊటూరులో ఎవ్వరితో సంబంధాలు లేకుండా శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నారని స్థానికులు తెలిపారు. మృతదేహాలు కుళ్లిపోయి, దుర్వాసన వస్తుండడంతో వీరు నాలుగైదు రోజుల క్రితమే మృతిచెందినట్లు భావిస్తున్నారు. లక్ష్మికి ఒక కూతురు ఉందని, ఆమె వస్తే కానీ పూర్తి వివరాలు తెలియవని స్థానికులు అంటున్నారు. వీరి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్. -
సాకలేమని తండ్రిని గెంటేసిన కొడుకులు
-
నాన్నా.. నీకో దండం!
సూర్యాపేట క్రైం: కొడుకుల కోసం సర్వస్వం ధారపోసిన ఓ తండ్రికి ఇప్పుడు పట్టెడన్నం కరువైంది. చివరకు అతను దేహీ అంటూ యాచకుడిగా మారాడు. సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డకు చెందిన కంబాలపల్లి లింగయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు తన వద్ద ఉన్న యావదాస్తిని వారికి రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే.. ఆ ఆస్తి మొత్తాన్ని కుమారులు విక్రయించి వారి పేరిట ఓ ఇల్లును కొనుగోలు చేసుకున్నారు. కొంత కాలంగా లింగయ్య అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. నెలకు ఒకరు చొప్పున చూసుకుంటున్న కుమారులు.. ఇకపై సాకడం తమ వల్ల కాదని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో లింగయ్య చేసేదేమి లేక అదే వార్డులో నివాసం ఉంటున్న పెద్ద కుమార్తె వద్ద మూడు నెలలుగా ఉంటున్నాడు. అయితే తన భర్తకు పక్షవాతం రావడంతో అటు భర్తను.. ఇటు కనిపెంచిన తండ్రిని సాకడం ఆమెకు కష్టతరంగా మారింది. ఎలాగైనా సోదరులకు నచ్చజెప్పి తండ్రిని వారి ఇళ్లకు పంపించాలని శుక్రవారం వచ్చింది. కానీ.. వారు తగువులాటకు దిగి చేతులెత్తేశారు. యాచకుడిగా మారిన వృద్ధ తండ్రి కుమార్తె కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో లింగయ్య అదే ప్రాంతంలో అడుక్కొని పొట్ట పోసుకుంటున్నాడు. కాగా, తనకు న్యాయం చేయాలని లింగయ్య శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కుమారులు తనను చూడటం లేదని విలపించాడు. -
అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటాం
మునుగోడు: తల్లిదండ్రులకు ఇక నుంచి ఎలాంటిలోటు రాకుండా చూసుకుంటామని నలుగురు కుమారులు అధికారుల ముందు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని బట్టకాల్వకు చెందిన నారగోలు ముత్యాలు, మంగమ్మ దంపతులను కుమారులు ఇంట్లో నుంచి గెంటివేసిన వైనంపై ‘సాక్షి’ మెయిన్‌లో శుక్ర వారం ‘‘కొడుకులా.. కర్కోటకులా’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ హెచ్.ప్రమీల ఉదయమే ఆ దంపతుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నలుగురు కుమా రులను కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను పోషించలేకుంటే వారి ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని ఆదేశిం చారు. వారిని సక్రమంగా చూసుకుంటామని రాసి ఇవ్వాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో కుమారులు తమ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటామని, తాము చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. వారి ని ఒక అద్దె ఇంట్లో ఉంచి సరిపడా సరుకులను అందిస్తామని, త్వరలో అందరం కలసి కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని రాసిచ్చారు. దీంతో ఆ వృద్ధ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ పత్రికకు కృతజ్జతలు తెలిపారు. -
కన్న కొడుకుల కర్కశత్వం
► తల్లిని చేరదీయని తనయులు ► ఆరెకరాల భూమున్నా అనాథలా ‘అవ్వ’ ► ఆర్నెల్లుగా నరకయాతన పెద్దపల్లిరూరల్: పున్నాగనరకం నుంచి తప్పించేవాడు కొడుకు.. కానీ.. ఈ అవ్వకు మాత్రం బతికుండగానే నరకం చూపిస్తున్నారు ఆమె కొడుకులు. నవమాసాలు మోసి.. కని.. అల్లారుముద్దుగా పెంచినా.. మలిదశలో ఆమెపై కనికరం చూపడం లేదు. కన్నతల్లి భారమైందో..? ఏమో..? గానీ.. ఆ తల్లిని అనాథను చేసి బస్టాండ్‌లో వదిలేశారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాకేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటకు చెందిన ఈదునూరి హన్మమ్మ, రాజపోచయ్యకు ఐదుగురూ కుమారులే. వీరిలో అంజయ్య, బాలయ్య, మల్లేశ్ చనిపోయారు. మిగిలినవారిలో పెద్దకుమారుడు రవి చొప్పదండిలో ఉంటూ.. కూలీ చేసుకుంటున్నాడు. మరో కుమారుడు కిష్టయ్య హైదరాబాద్‌లో విద్యుత్‌శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. హన్మమ్మ పేరిట తుర్కలమద్దికుంటలో సొంత ఇంటితోపాటు ఆరెకరాల భూమి ఉంది. ఆమె మనవలు రమేశ్, అంకూస్, రంజిత్, సాగర్ కొత్తగా ఇంటిని నిర్మిస్తామంటూ ఉన్నదాన్ని కూల్చివేశారు. అప్పటినుంచి ఆమెను కష్టాలు వెంటాడుతున్నాయి. పెద్దపల్లిలో ఉండే మనవలు, బంధువుల వద్దకు వచ్చినా.. ఆదరించలేదు. పైగా ఆమెకు వస్తున్న పింఛన్‌ను మాత్రం నెలనెలా తీసుకునేవారు. కొన్నిరోజులు పట్టణంలోనే యాచిస్తూ పొట్టపోసుకున్న ఈ అవ్వ.. అనారోగ్యంబారిన పడడంతో మనవడు సాగర్ రెండునెలలు పోషించి.. రెండురోజుల క్రితమే హైదరాబాద్‌లోని కిష్టయ్య ఇంటివద్ద వదిలివచ్చాడు. ఆ మరుసటిరోజు ఉదయమే.. హన్మమ్మను తుర్కలమద్దికుంటలోని పోచమ్మ గుడివద్ద దించి వెళ్లారని గ్రామస్తులు అంటున్నారు. ఇదే విషయాన్ని పెద్దపల్లిలో ఉంటున్న మనవలు, బంధువులకు సమాచారం అందించినా వారు స్పందించలేదు. గ్రామ పోలీస్ «అధికారికి చెప్పి ఆశ్రయం కల్పించాలని కోరినా నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఓ వైపు వర్షం.. మరోవైపు చలితో గజగజ వణుకుతున్న అవ్వ.. చేసేదేమీ లేక ఆమెను స్థానికులు శనివారం రాత్రి పెద్దపల్లి బస్టాండ్‌కు తీసుకొచ్చారు. ‘సాక్షి’కి సమాచారం అందించగా.. స్థానికులతో కలిసి ఓ దుప్పటి అందించి.. ఆమెకు భోజనాన్ని సమకూర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. కన్నతల్లిని కాదనుకుని.. ఇంత నిర్లక్ష్యంగా వదిలేసినా.. ఆ కొడుకులపై మాత్రం ఎలాంటి ద్వేషం చూపకుండా ఆ అవ్వ మాట్లాడడం అక్కడున్న వారిని కలచివేసింది. -
బతుకునిచ్చినవాడు భారమయ్యాడు
ఉపయోగం లేదని భావించి తండ్రిని వదిలించుకున్న తనయులు మురుగుగుంట వద్ద వదలివెళ్లిన వైనం అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్న సోదరుడు తాళ్లరేవు (ముమ్మిడివరం) : కన్నతండ్రి బిడ్డలకు బరువయ్యాడు. తండ్రి వల్ల పైసా ఉపయోగం లేదనుకున్న ఆ కుమారులు ఆయనను రోడ్డున పడేసారు. ప్రమాదంలో కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధ తండ్రిని ఏ మాత్రం కనికరంలేకుండా ఒక మురికిగుంట వద్ద పడవేసిన ఘటన స్థానికులను కలిచివేస్తుంది. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామానికి చెందిన కొల్లాటి తాతారావు చేపల వేట ఆధారంగా జీవించేవాడు. అతనికి భార్య ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లై వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో చాలా ఏళ్ల క్రితమే అతని భార్య ధవళేశ్వరంలోని కుమారుడి వద్దకు వెళ్లిపోయింది. గ్రామంలో ఒంటరిగా ఉండలేక కాకినాడలో ఉంటున్న మరో కుమారుడి వద్దకు గతంలో వెళ్లిపోయినట్లు తాతారావు చెపుతున్నాడు. ఇలా ఉండగా ఇటీవల డ్రెయినేజీలో పడిపోవడంతో కాలు విరిగిపోయింది. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ కాలు పనిచేయకపోవడంతో లేవలేని స్థితిలో ఉన్న అతన్ని నీలపల్లి తీసుకువచ్చి వదిలి వెళ్లారు. తాతారావుకు చెందిన స్థలంలో ఉన్న మురికిగుంట పక్కనే కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసి అక్కడ వదిలి చేతులు దులుపుకొన్నారు. తాతారావు సోదరుడు నూకరాజు అక్కడే నివసిస్తుండడంతో సమయానికి తిండి పెడుతుండడంతో ఎలాగోలా జీవితం సాగిస్తున్నాడు. గతంలో దర్జాగా బ్రతికిన తాతారావు ప్రస్తుత పరిస్థితి చూసి స్థానికులు చలించిపోతున్నారు. స్థానిక సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకురాలు రేవు మల్లేశ్వరి, వైఎస్సార్సీపీ నీలపల్లి గ్రామ కమిటీ కన్వీనర్ కట్టా దుర్గారావులు అతన్ని పరామర్శించి వివరాలు తెలుసుకుని ఆర్థిక సాయం అందజేశారు. పురుగులమందు తాగి చచ్చిపోవాలని ఉంది.. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలూ పట్టించుకోకపోవడంతో ఏదైనా పురుగుల మందు తాగి చచ్చిపోవాలని ఉందని తాతారావు విలపిస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకుందామన్నా కాలు సహకరించడంలేదని, తనకుగల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అన్నీ అగ్నిప్రమాదంలో కాలిబూడిదయ్యాయని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలి అవసాన దశలో కష్టాలు పడుతున్న తాతారావును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక సర్పంచ్ రేవు మల్లేశ్వరి డిమాండ్ చేశారు. ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్న అతనికి ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. అతని పరిస్థితి చూసి చలించిన ఒక దాత షెడ్డు నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. -
అమ్మకు అండగా నిలవండి..
-
అమ్మకు అండగా నిలవండి..
- కేటీఆర్‌ను కదిలించిన కమలమ్మ దీనగాథ - మంత్రి ట్విట్టర్లో ‘సాక్షి’ కథనం సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన సామల కమలమ్మ(85) దీన గాథపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కమలమ్మకు ఐదుగురు కుమారులు.. ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. నిలువ నీడలేక.. కుమారుల నిర్లక్ష్యానికి గురైంది. ఈ సంఘటనపై ‘అమ్మను గెంటేశారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి కె. తారక రామారావు స్పందించారు. ‘సాక్షి’ కథనాన్ని తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆమెకు అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఫోన్ చేసి ఆదేశించారు. డీఆర్వో జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ వెంటనే కమలమ్మతో మాట్లాడి ఆమెతో ఫిర్యాదు స్వీకరించారు. అమ్మను గెంటేశారు.. ఆమె కుమారులు ఐదుగురికీ సోమవారం నోటీసులు జారీ చేశారు. కమలమ్మతో జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) సరస్వతి మాట్లాడారు. మూడో కుమారుడు శ్రీనివాస్ వద్ద కమలమ్మ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్ఐ రాజేంద్రప్రసాద్ కమలమ్మ ఇంటికి వెళ్లి పండ్లు అందించారు. భీవండిలో ఉండే కుమారుడు రమేశ్‌తో రెవెన్యూ అధికారులు ఫోన్లో మాట్లాడా రు. బుధవారం సిరిసిల్లకు వచ్చేందుకు రమేశ్ అంగీకరించాడు. జిల్లా అధికారుల సమక్షంలో కమలమ్మ కొడుకులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. ఆమెకు నీడ కల్పించేలా చర్యలు తీసుకుంటామని డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్ తెలిపారు. కన్నతల్లిని పోషించకుంటే కొడుకులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా, ఐదుగురు కొడుకులతోపాటు తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని, ఎవరూ సాదకున్నా సచ్చేంత వరకు తానే వండుకుని తింటానని కమలమ్మ తెలిపింది. -
అమ్మను గెంటేశారు..
సిరిసిల్ల: ‘నా వాటాలో ఏన్నాళ్లుంటావ్’ అంటూ ఓ కొడుకు కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేసి.. తాళం వేసుకొని వెళ్లిపోయాడు. నాలుగు రోజులుగా చెట్టు కింద బతికిన 86 ఏళ్ల ఆ తల్లిని మరో కొడుకు చేర దీసినా.. ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. కుల పెద్దలను ఆశ్రయించినా.. ఆ కొడుకులు వినకపోవడంతో ప్రస్తుతం ఆరుబయట జీవనం సాగిస్తోందా తల్లి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన సామల కమలమ్మ, సిద్ధిరాములు దంపతులు. వీరికి కుమారులు మీనయ్య, శ్రీనివాస్, రమేశ్, సురేశ్, లక్ష్మీనారాయణ, కూతుళ్లు వసంత, వశ్చల ఉన్నారు. నేత కార్మికుడైన సిద్ధిరాములు మంచి ఇల్లు కట్టుకుని.. పిల్లల పెళ్లిళ్లు చేశాడు. 12 ఏళ్ల కిందట ఆయన అనారోగ్యంతో మరణిం చాడు. అప్పట్నుంచి కమలమ్మ కొడుకులు, కూతుళ్లు ఉన్నా వాళ్ల వద్ద ఉండలేక ఒంటరిగా జీవిస్తుంది. చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ ఆసరా పింఛన్, రేషన్ బియ్యంతో బతుకు సాగిస్తోంది. కాగా, తల్లిదండ్రులు సంపాదించిన సుమారు రూ.30 లక్షల విలువైన ఇంటిని కొడుకులు పంచుకున్నారు. మూడో కుమారుడు రమేశ్ భివండిలో ఉంటున్నాడు. అతడి వాటాగా వచ్చిన ఇంట్లోనే కమలమ్మ ఉంటోంది. నాలుగు రోజుల క్రితం రమేశ్ వచ్చి కమలమ్మ సామగ్రి బయట పడేసి, ఇంటికి తాళం వేసి భివండి వెళ్లిపోయాడు. కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. మిగతా కొడుకుల వద్దకు వెళ్లి.. ‘నేను ఎక్కడ ఉండాలే.. నాకు ఇంత నీడ చూపుండ్రి’ అని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కుల పెద్దలు జోక్యం చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. తలదాచుకునేందుకు నీడలేక రోడ్డు పక్కన వంట చేసుకుంటూ కనిపించగా.. స్థానికులు జోక్యం చేసుకోవడంతో రెండో కుమారుడు శ్రీనివాస్ వచ్చి తల్లిని తీసుకెళ్లినా.. ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. దీంతో ఆరుబయటనే ఆమె ఉంటోంది. ‘నా కొడుకులు యాడుంటవని అంటున్నరు.. కాళ్లు కాలుతున్నయి.. గాలి వత్తలేదు.. నాలుగు రోజులు బతికే ముసలిదాన్ని.. ఎవరూ పట్టించుకుంటలేరు.. ఇప్పుడు వాళ్లకు తల్లి వద్దు.. పెళ్లాలే కావాలే.. ఆ దేవునింట్ల మన్నువొయ్య.. నన్ను తీసుకపోతలేడు.. సావన్నా వత్తలేదు.. ఒంటరిగా వంట చేసుకుంటూ బతుక బుద్ధిగావట్లేదు’అని కమలమ్మ రోదించడం కలచివేసింది. -
నాన్నను ‘చంపేశారు’
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): కన్న కొడుకులు ఆదరించడంలేదని మనస్తాపం చెందిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలో ఆదివారం జరిగింది. వెన్నంపల్లి గ్రామానికి చెందిన మేడి లింగయ్య(80), లస్మమ్మలకు నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆరెకరాల భూమిని కుమారులు పంచుకున్నారు. వృద్ధాప్యంలోకి చేరిన తల్లిదండ్రులు లింగయ్య, లస్మమ్మ పోషణను పట్టించుకోలేదు. వారిని లింగయ్య సోదరుడు చేరదీయగా.. కుమారులు వారించారు. మూడో కుమారుడు వీరి పోషణకు ముందుకు రాగా మిగతా ముగ్గురు దుర్భాషలాడారు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. అయినా తీరుమారని కుమారులు తండ్రికి తిండిపెట్టడం లేదు. ఈ క్రమంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసిన లింగయ్య సోమవారం దూలానికి ఉరి వేసుకున్నాడు. దీంతో పోలీసులు నలుగురు కొడుకులపై కేసు నమోదు చేశారు. -
ఓ తండ్రి ఆక్రందన!
► తనను బతకనివ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యక్తి నిరాహార దీక్ష ► పోలీసులు, తహసీల్దార్ పట్టించుకోలేదని ఆవేదన ► కన్నకొడుకులే ఈ దుస్థితికి కారణమంటూ కన్నీటిపర్యాంతం కన్న కొడుకులు పొమ్మన్నారు.. ఇంటికి వెళ్తే తాళం వేశారు.. భార్య విడిచిపెట్టింది. అందరూ ఉండి, అనాథై రోడ్డుపాలైన ఓ వ్యక్తి జీవితమిది. అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నానని, తనను బతికించండంటూ ప్రాధేయపడుతూ అందరి కంటా కన్నీళ్లు తెప్పించాడు. ఈ సంఘటన సోమవారం పలాసలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గ : పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన తెప్పల ధర్మారావు డిప్లమో చదివి హిందుస్తాన్ మోటార్ కంపెనీ(కోల్కత్తా)లో ఉద్యోగం చేసేవాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులిద్దరినీ బాగాచ దివించి, ప్రయోజకులను చేశాడు. కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారుల కుమార్తె, సొంత మేనమామ కూతురైన భార్య.. పిల్లలు చదువుతున్న సమయంలోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయింది. ప్రస్తుతం కుమారులిద్దరూ పెళ్లిళ్లు జరిగి స్థిరపడ్డారు. వారిలో పెద్ద కుమారుడు దేవేంద్రవర్మ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. పూణేలో ఉద్యోగం చేస్తూ, హైదరాబాదులో చేస్తున్నట్లు చిరునామా ఇచ్చి తప్పించుకుంటున్నాడు. ధర్మారావు పేరున ఉన్నటువంటి 30 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో రాయించుకొని తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. చిన్నకొడుకు సురేంద్రవర్మ బ్రాహ్మణతర్లా గ్రామంలో మెడికల్ ప్రాక్టిషనర్(ఆర్ఎంపీ)గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులు తండ్రి వద్ద డబ్బును, భూమిని తీసుకొని రోడ్డున వదిలేశారు. ఆకలేస్తుందని ఇంటికి వెళ్లిన ప్రతిసారీ.. కోడళ్లు తలుపులకు తాళాలు వేసి బయటకు పొమ్మంటున్నారని ధర్మారావు కన్నీటిపర్యాంతమయ్యాడు. విషపదార్థాలు కలిపిన భోజనం ఇచ్చి తనను చంపాలని చూశారని ఆవేదన చెందాడు. ఏడాది నుంచి బ్రాహ్మణతర్లా బస్టాండ్‌లో పడుకుంటున్నానని, చుట్టుపక్కల వారంతా గంజి పోస్తే తాగుతున్నానని వాపోయాడు. తాను చావుకు దగ్గరగా ఉన్నానని, ఈ నిరసన ద్వారా తన బాధను వ్యక్తం చేస్తున్నానని సోమవారం పలాస తహసీల్దార్ ముందు కన్నీరుపెడుతూ అందరి హృదయాలనూ కదిలించాడు. ఫోర్జరీ సంతకాలంతో భూములను రాయించుకున్నారని కలెక్టర్ లక్ష్మీనరసింహంతోపాటు.. టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, పలాస తహసీల్దార్, కాశీబుగ్గ పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేశానని తెలిపాడు. వారెవరూ పట్టించుకోలేదని అధికారుల తీరును ఎండగట్టాడు. చివరికి తన వద్ద ఉన్న నగదును ఖర్చు పెట్టి.. ఫోర్జరీ సంతకాలు చేసిన వైనంపై పలాస తహసీల్దార్‌కు కోర్టు నోటీసును సైతం పంపించాడు. ఈ నిరసనకు స్పందించిన పలాస తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి.. ఆయనతో మాట్లాడారు. నెలరోజుల్లో న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. -
లాలూకి కొడుకుల బెడద ఉందా?
తండ్రి ములాయంకు చెక్ పెడుతూ కొడుకు అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తున్న వైఖరి ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌కు 'సన్' స్ట్రోక్ కు సంకేతాలుగా మారుతున్నాయట. ఆయన కొడుకులు కూడా ఇదే మాదిరి రాజకీయ సంక్షోభం లేవనెత్తుతారేమోనని లాలూ ఆందోళన చెందాల్సినవసరం ఉందని బీజేపి సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ ఇద్దరు కొడుకులు తేజస్వి ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. మరో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నారు. సమాజ్‌వాద్ పార్టీలో నెలకొన్న వివాదంతో లాలూకు కూడా కొడుకుల బెడద ఉందని తనకు అనిపిస్తున్నట్టు సుశీల్ కుమార్ మోదీ తన నివాసంలో నిర్వహించిన జనతా దర్బార్‌లో వ్యక్తంచేశారు. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో సమాజ్‌వాద్ పార్టీలో ముదురుతున్న రాజకీయ సంక్షోభంపై లాలూ ఇప్పటికే మధ్యవర్తిత్వంగా బంధువుడి హోదాలో ములాయం సింగ్‌కు, అఖిలేష్‌కు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. సఖ్యతగా ఉండకపోతే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందే అవకాశముందని లాలూ హెచ్చరించారు. కానీ ఆయనకు కూడా మంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు కొడుకులతో ముప్పు పొంచి ఉందని బీజేపీ సీనియర్ నేత అన్నారు. అఖిలేష్ వ్యవహరించిన తీరే దీనికి సంకేతమన్నారు. పార్టీ నాయకత్వం తీసుకోవడానికి ఆర్జేడీ సుప్రీం కొడుకులు కూడా తండ్రి ఛాయల నుంచి బయటికి రావాల్సి ఉందని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. -
‘తల్లిదండ్రుల ఇంట్లో ఉండే హక్కు లేదు’
న్యూఢిల్లీ: తల్లిదండ్రుల ఇంట్లో ఉండేందుకు కుమారులకు ఎలాంటి చట్టపరమైన హక్కూ లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అమ్మానాన్నల దయతో మాత్రమే వారింట్లో ఉండవచ్చని, అలాగని కొడుకును అతడి జీవితాంతం భరించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘తల్లిదండ్రుల కష్టార్జితంతో సంపాదించిన ఇల్లయితే... కుమారుడు అవివాహితుడా, వివాహితుడా అన్న మీమాంస లేదు. అతడికి ఆ ఇంట్లో నివసించే హక్కులేదు’ అని పేర్కొంది. తల్లిదండ్రులకు అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ జంట వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాము కష్టపడి సంపాదించిన ఇళ్లలో ఉంటున్న ఇద్దరు కొడుకులు, కోడళ్లను ఖాళీ చేరుుంచాలని, వారు తమను హింసిస్తున్నారంటూ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రరుుంచారు. -
బాలిరెడ్డికి పోలీసుల పరామర్శ
సాక్షి ఎఫెక్ట్... కుమారుల వద్ద ఉండటానికి నిరాకరించిన వృద్ధుడు నంద్యాల: కుమారుల ప్రేమాభిమానాలకు, ఆప్యాయతకు దూరమై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిరెడ్డిని మంగళవారం పోలీసులు పరామర్శించారు. ‘ ఈ బతుకు నాకొద్దు’ అనే శీర్షికపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా ఎస్పీ రవికృష్ణ స్పందించారు. ఈ కథనం క్లిపింగ్‌ను వాట్సాప్‌లో ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ రామయ్యకు పంపి.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఐ రామయ్య, బాలిరెడ్డి కుమారులు లక్ష్మిరెడ్డి, హుసేన్‌రెడ్డితో కలిసి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా తన ఆవేదనను బాలిరెడ్డి రోదిస్తూ ఎస్ఐ రామయ్యకు వివరించారు. తనకు పొలాన్ని ఇప్పించాలని.. దానిపై వచ్చే కౌలుతో జీవనం సాగిస్తానని చెప్పాడు. దీంతో పొలం ఇవ్వడానికి కుమారులు ఇద్దరు అంగీకరించారు. అయితే తాను కొడుకుల వద్ద ఉండనని, శ్రీశైలానికి వెళ్లి రెడ్ల సత్రంలో ఉంటానని చెప్పారు. వృద్ధుడు కావడంతో మూత్రకోశ వ్యాధులకు ఆపరేషన్ చేసే అవకాశం లేదని.. ఆయన మాత్రలతోనే గడపాల్సి ఉందని వైద్యులు చెప్పారు. -
ఈ బతకు నాకొద్దు !
- ఆస్తిని రాయించికుని తండ్రిని గెంటేసిన కొడుకులు - ఆసుపత్రిలో అనాథగా చికిత్స - సమాచారం అందినా పలుకరించని కుటుంబీకులు - ఆస్తిని ఇప్పించి వైద్యం చేయించాలని వేడుకోలు తాతాల ఆస్తి లేదు.. రెక్కల కష్టంతోనే మూడెకరాలు సంపాదించాడు. ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెల పెళ్లిల్లు చేశాడు. తోడుగా ఉన్న భార్య కాలం చేసింది. శేష జీవితాన్ని కొడుకుల పంచన ఉండి గడుపొచ్చని కలగన్నాడు. తానొకటి తలిస్తే.. కొడుకులు మరొకటి తలిచారు. ఆస్తినంతా తమ పేరు మీద రాయించుకుని ఇంటి నుంచి గెట్టేశారు. ఊపిరి ఉన్నంత వరకు ఏదో ఒక చోట బతుకుతామని అనాథగా బయలుదేరగా అనారోగ్యం ఆసుపత్రికి చేర్చింది. ఆపరేషన్‌కు డబ్బు అవసరమై కొడుకులకు కబురు అందిస్తే నాన్న.. నీ ఆస్తే మాకు మిన్న.. నువ్వొద్దు ఇంకా.. అంటూ కొడుకులు కన్నెత్తి చూడలేదు. అందరూ ఉన్నా నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడి కన్నీటి గాథ ఇది. - నంద్యాల ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామానికి చెందిన బాలిరెడ్డి చిన్నప్పటి నుంచి వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగించాడు. భార్య చౌడమ్మ తోడుగా కష్టపడి పని చేసేవారు. పెద్దల ఆస్తి లేకపోయినా ఇద్దరు వ్యవసాయం చేస్తూ బర్రెలు మేపుకుంటూ ముగ్గురు కుమార్తెలకు, ఇద్దరు కుమారులకు వివాహం చేశారు. కుమారులు లక్ష్మీరెడ్డి, సుబ్బారెడ్డిలకు ఉపాధిని కూడా కల్పించారు. రెండేళ్ల క్రితం చౌడమ్మ మృతి చెందింది. అప్పటి నుంచి బాలిరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. వయోభారం వల్ల ఆరోగ్యం క్షీణించింది. తండ్రిని కాపాడుకోవాల్సిన ఇద్దరు కుమారులు ముందుగా మూడు ఎకరాల పొలాన్ని రాయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఆయన బాగోగులు చూసుకోలేదు. బాలిరెడ్డికి భగవద్గీత, భాగవతాన్ని పారాయణం చేయగలడు. దీంతో ఆయనకు ఆశ్రమాల్లో గుర్తింపు ఉంది. కొడుకులు ఇద్దరు ఆదరించకపోవడంతో ఆయన నయనాలప్ప క్షేత్రానికి వెళ్లాడు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అతనికి ఆపరేషన్ చేయాలంటే కుటుంబ సభ్యుల అంగీకారం అవసరం. పైగా సపర్యలు చేయడానికి కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి. కాని అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథగా ఉండిపోయారు. కన్నకొడుకులు ఆస్తిని బలవంతంగా లాక్కున్నారని, కాని పోషించడానికి మాత్రం ముందుకు రాకుండా భారాన్ని ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారని బాలిరెడ్డి రోదిస్తూ చెప్పాడు. వృద్ధాప్యంలో ఆదరించకపోయినా ఆపరేషన్ చేయించడానికి కూడా ముందుకు రాకపోవడంతో బాధపడుతున్నాడు. తన ఆస్తిని ఇప్పించి, వైద్యం చేయించాలని ఆయన ప్రాధేయపడుతున్నాడు. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఆయన కుమారులకు ఫోన్లలో సమాచారం ఇవ్వగా తాము వచ్చే ప్రసక్తే లేదని వారు చెప్పారు. దీంతో బాలిరెడ్డి పరిస్థితి దయనీయంగా మారింది. -
మేరీ మమ్మీ
ఫస్ట్ పర్సన్ హిందీలో మేరీ అంటే ‘నా’.. మమ్మీ అంటే అమ్మ.. మేరీ మమ్మీ అంటే నా అమ్మ! ప్రతి కొడుకుకి ఉండాల్సిన మమ్మీ మేరీ కోమ్!! తన కొడుకులకు రాసుకున్న ఉత్తరం అనువాదమిది! మన ఇళ్లల్లో కూడా ‘వాడికేం.. మగాడు’ అన్న మాట తరచూ వింటూంటాం.. అంటే తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి మగపిల్లలకు ఏం చేసినా చెల్లుతుంది అని చెప్తున్నారన్నమాట! చెల్లదు .. అని చెప్తుంది మేరీ! ‘నో ’ అంటే ‘నో’!! డియర్ సన్స్.. ఎందుకో ఈ రోజు మీకు ఈ ఉత్తరం రాయాలనిపించింది. మన దగ్గర అమ్మాయిలకు గౌరవం లేదు. అబ్బాయిలుగా మీకూ ఒక ముక్కు, రెండు కళ్లు, రెండు చెవులు, మెదడు ఉన్నట్టే అమ్మాయిలుగా మాకూ ఉంటాయి. శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే మీ నుంచి మమ్మల్ని వేరు చేస్తున్నాయి. అంతమాత్రాన మేం సెకండ్ సిటిజన్స్ కాము కదా! మీలాగే మేమూ మెదడుతో ఆలోచిస్తాం... మనుసుతో ఫీలవుతాం! ఇలాంటి పెద్ద విషయాలను పదేళ్లయినా నిండని మీతో ఎందుకు చెప్తున్నానంటే.. కనీసం ఈ వయసు నుంచయినా అమ్మాయిలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారని.. అమ్మాయిల విషయంలో సున్నితంగా ప్రవర్తించడం అలవడుతుందని! నాకూ తప్పలేదు.. మన దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు ఈవ్‌టీజింగ్‌కి, సెక్సువల్ అబ్యూజ్కి, లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. ఎవరో ఆడపిల్లల దాకా ఎందుకు కన్నలూ.. మీ అమ్మనైన నేనూ లైంగిక దాడికి గురయ్యాను. అప్పుడు నాకు పదిహేడేళ్లు.. ఉదయం ఎనిమిదన్నరకు రిక్షాలో బాక్సింగ్ ట్రైనింగ్‌కి వెళ్తున్నా.. పక్కనుంచి సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా నా మీదకు వంగి నా యెదను తడుతూ వెళ్లిపోయాడు. ఒక్క క్షణం షాక్ అయ్యాను. కోపంతో రగిలిపోయాను. వెంటనే రిక్షాలోంచి దూకి, చెప్పుల్ని తీసి చేత్తో పట్టుకొని వాడిని వెంబడించాను. కాని వాడు తప్పించుకొని పారిపోయాడు. అరే వాడిని పట్టుకోలేకపోయానే అనే బాధ ఇప్పటికీ వెంటాడుతుంది. వాడు దొరికి ఉంటే అప్పటికే నేను నేర్చుకున్న కరాటేను వాడి మీద ప్రాక్టిస్ చేసేదాన్ని. ఇంకోసారి.. ఢిల్లీ, హిస్సార్‌లో కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది నాకు, నా ఫ్రెండ్స్‌కి. ట్రైనింగ్ క్యాంప్‌లో ఓ సాయంకాలం.. వాకింగ్ చేస్తుంటే! ఎందుకు విషయం అవుతోంది? ఆ సంఘటనల తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలి.. మమ్మల్నే మాటలన్నారు. అమ్మాయిలను చూస్తే చాలు.. వాళ్ల వక్షస్థలాన్ని తాకాలని, పిరుదుల మీద తట్టాలని ఎందుకనుకుంటారు ఈ మగవాళ్లు? అమ్మాయిలున్నది అలాంటి వెకిలి ఆనందాలను పంచడానికి కాదు. అమ్మాయిలను బలవంతంగా తాకి అబ్బాయిలు పొందే సంతోషమేంటో నాకిప్పటికీ అర్థంకాదు! అమ్మాయిల మీద లైంగిక దాడి జరిగిందంటే చాలు.. వాళ్లు వేసుకున్న బట్టలు ఎందుకు చర్చకొస్తాయి? వాళ్లు ఆ టైమ్‌లో బయటకు ఎందుకు వెళ్లారనేది ఎందుకంత ఇంపార్టెంట్ అవుతుంది? ఒరేయ్.. ఈ ప్రపంచం మీకెంత సొంతమో.. మాకూ అంతే కదా? మరి మాకెందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్? స్వేచ్ఛగా బయటకు వెళ్లడానికి అమ్మాయిలెందుకు వెనకాముందు ఆలోచించాలి? మీకు అర్థం కావాలి.. మీరు పెరుగుతున్నారు. అందులోనూ అబ్బాయిలు.. అందుకే మీకు అర్థంకావాలని చెప్తున్నానురా.. రేప్, అబ్యూజ్, ఈవ్ టీజింగ్, సెక్సువల్ హెరాస్మెంట్.. ఇవన్నీ నేరాలే. వీటికి తీవ్రమైన శిక్షలుంటాయి.. ఉన్నాయి.. ఉండాలి కూడా! కన్నలూ.. ఎప్పుడైనా ఎవరైనా ఆడపిల్లలను ఏడిపించడం మీరు చూస్తే వెంటనే వెళ్లి ఆ అమ్మాయిలకు సాయం చేయండి.. ధైర్యం చెప్పండి.. వాళ్లకు అండగా నిలబడండి.. మీ అమ్మగా మీ నుంచి నేను కోరుతున్నదిదే! రెస్పెక్ట్ విమెన్! అత్యంత విషాదమేంటంటే.. ఈ సమాజంలో సమంగా గౌరవం పొందాల్సిన మేము నిర్లక్ష్యానికి గురికావడం! మన దేశ రాజధాని ఢిల్లీలో.. కొన్ని వందల మంది అమ్మాయిలు రేప్‌కి గురయ్యారు. గురవుతూనే ఉన్నారు. ఎవ్వరూ ఆ అన్యాయాలను ఆపట్లేదు సరికదా కనీసం ప్రశ్నించడం లేదు. మీరు అలా కాదు.. మనిల్లు వేరు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమనే వాతావరణంలో మీరు పెరుగుతున్నారు. దీనికి సరైన ఉదాహరణ మీ నాన్నే. ఆయన మీ ఫ్రెండ్స్ అందరి నాన్నల్లాగా నైన్ టు ఫైవ్ జాబ్ చేయరు. బాక్సర్‌గా నా ట్రైనింగ్, జాబ్, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా... ఇంటిపట్టునే ఉండడం నాకు కుదరదు. కాని మా ఇద్దరిలో ఎవరో ఒకరి అటెన్షన్ మీకు తప్పకుండా కావాలి. అందుకే ఆ బాధ్యతను మీ నాన్న తీసుకున్నారు. ఈ విషయంలో మీ నాన్నంటే నాకెంత గౌరవమో మాటల్లో చెప్పలేను. నా కోసం, మీ కోసం, ఈ ఇంటి కోసం ఆయన టైమ్‌ని, కెరీర్‌ని డెడికేట్ చేశారు. నా బలం మీ నాన్నే. ఆయన తోడులేందే నా ప్రయాణంలో ఒక్క అడుగూ ముందుకు సాగలేదు! అయితే త్వరలోనే మీరు బయటవాళ్ల నుంచి నాన్న మీద హౌజ్ హజ్బెండ్ అనే మాటలు వింటారు. ఒక్కటి గుర్తుంచుకోండి.. అలాంటి మాటలను అవమానంగా, అగౌరవంగా భావించాల్సిన పనిలేదు. ఇంటిని చూసుకునే బాధ్యత అమ్మకు మాత్రమే కాదు నాన్నకూ ఉంటుందని గ్రహించండి. రేపొద్దున మీరిలాంటి బాధ్యతను పంచుకోవాల్సి వస్తే నామోషీగా, అమర్యాదగా ఫీలవ్వకూడదు. అది అవమానం.. అది హేళన.. మీరు నా పక్కనుంచి నడుస్తుంటే కొంతమంది మీ అమ్మను ‘చింకీ’ (చట్టి ముక్కు, చిన్న కళ్లున్న చైనీస్ అనే అర్థంలో) అంటూ కామెంట్ చేయడం వింటారు. ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన చాలామంది అమ్మాయిలు వాళ్ల రూపురేఖలు, వాళ్ల వస్త్రధారణతో చింకీస్గా టార్గెట్ అవుతున్నారు. అది అవమానం. అది హేళన. అది జాత్యాహంకారం. నేను భారతీయురాలినే. మిమ్మల్నీ భారతీయులుగానే పెంచుతున్నా! భారతీయులమైనందుకు గర్వపడేలా తీర్చిదిద్దుతున్నా. తిరుబాటుదారులున్న రాష్ట్రానికి చెందినవాళ్లం. ఆ హింస నుంచి మిమ్మల్ని కాపాడుకుంటున్నా... రక్షించుకుంటున్నా. ఆ భయాలనుంచి బయటపడే ధైర్యాన్ని మీకు నూరిపోస్తున్నా. ఈ దేశ పౌరులుగా మిగిలిన అందరితో సమానమైన గౌరవమర్యాదలు పొందే హక్కు మీకెలా ఉందో మహిళలకూ పురుషులతో సమానమైన గౌరవమర్యాదలు పొందే హక్కుంది. మీరు ఈ దేశ భవిష్యత్ పౌరులు. ఈ దేశ పరువు, ప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు మీ చేతుల్లో ఉన్నాయి. మహిళలను మీరు గౌరవిస్తేనే ఈ దేశ పరువు, ప్రతిష్ఠలు నిలబడుతాయి. అదే నిజమైతే.. నా దేశం నాకు ఎంతో పేరు, ప్రతిష్ఠలను ఇచ్చింది. కాని ఎమ్మెస్ ధోని, విరాట్ కొహ్లీలను గుర్తుపట్టినట్టుగా నన్ను గుర్తించరు. అలాగని ‘చింకీ’ అనే కామెంట్‌కీ నేను అర్హురాలిని కాదు కదా..! రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి నన్ను గౌరవించారు. చాలా సంతోషం. స్త్రీ సమస్యలను చర్చించే ఈ అవకాశాన్ని వదులుకోను. మహిళల మీద సాగుతున్న హింస గురించి పార్లమెంట్లో ప్రశ్నిస్తాను. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. అయితే సెక్సువల్ అబ్యూజ్, హెరాస్మెంట్స్ నేరాలే కావనే ముద్ర పడిపోయింది మనలో. అవి నేరాలే అనే విషయం మీకు చెప్పకపోతే.. వాటి గురించి మీకు అవగాహన పెంచకపోతే అమ్మగా నేను ఫెయిల్ అయినట్టే. అందుకే.. ఇవన్నీ చెప్పాలనే ఈ ఉత్తరం రాస్తున్నా.. శరీరాల మీద హక్కు కేవలం మగవాళ్లకే కాదు.. వాళ్ల శరీరాల మీద హక్కు స్త్రీలకూ ఉంటుంది. వాళ్లు ఒకసారి నో అని చెప్పారంటే ఆ ‘నో’ గౌరవించండి. బలవంతం చేసి వాళ్ల చావులను చూడకండి. రేప్ అనేది సెక్స్ కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ మిస్ప్లేస్డ్ సెన్స్ ఆఫ్ పవర్ అండ్ రివెంజ్! నన్ను ఇబ్బంది పెట్టినవాడిని చాచి ఒక్కటి ఇవ్వగలను. అది నా బాక్సింగ్ ప్రాక్టిస్నూ పెంచుతుంది. కాని కొట్టేదాకా తెచ్చుకోవడం ఎందుకని? కోరిక చాలా అందమైంది పరస్పర అంగీకారం, ఇష్టం ఉంటే! ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మన ఇళ్లలో చాలా సార్లు వింటాం.. వాళ్లు మగ పిల్లలు.. మగ పిల్లలు మగపిల్లలే అని. అదే నిజం అయితే మగపిల్లలుగా ఈ దేశంలో అమ్మాయి భద్రంగా, గౌరవంగా మసిలే వాతావరణాన్ని కల్పించండి! ఇట్లు మీ అమ్మ మేరీ కోమ్ -
కొడుకులు కొట్టారని.. కోర్టుకెక్కిన తండ్రి!
- రక్తం కారుతున్న బట్టలతోనే.. కోర్టు మెట్లెక్కిన వైనం - కేసు నమోదు చేయాలని ఆదేశించిన జడ్జి కాశిబుగ్గ (వరంగల్): ఆ తండ్రి తనకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. కొంత తనవద్దే ఉంచుకున్నాడు. అరుుతే ఆ ఆస్తిని కూడా తమకే ఇవ్వాలంటూ కొడుకులు వేధిస్తుండగా.. భరించలేక కోర్టు మెట్లెక్కాడు. వరంగల్ 11వ డివిజన్ లేబర్‌కాలనీలో నివాసం ఉం టున్న పోశాల రమేష్‌కు రాజేశ్, రాజేంద్ర ఇద్దరు కుమారులు. వీరికి రమేశ్ నాలుగు భవనాలు, ఇతర ప్లాట్లను సమానంగా పంచి ఇచ్చాడు. జీవన భృతి కోసం ఓ టెంట్‌హౌస్‌ను నడిపించుకుంటున్నాడు. అరుుతే ఆ టెంట్‌హౌస్‌ను కూడా తమకే ఇవ్వాలంటూ కుమారులు ఇబ్బంది పెడుతున్నారు. దీనికి రమేశ్ నిరాకరించడంతో మూడు రోజులుగా విపరీతంగా కొడుతున్నారు. దీంతో రమే్‌శ్ రెండు రోజుల క్రితం మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పం దించలేదు. పోలీస్‌స్టేషన్ కు ఎందుకు వెళ్లావంటూ సోమవారం మళ్లీ కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక రక్తం కారుతున్న బట్టలతోనే ఐదవ మున్సిఫ్ కోర్టును ఆశ్రరుుంచాడు. దీంతో స్పందించిన జడ్జి బాధితుడిని వైద్యపరీక్షల కోసం ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. తన ఆస్తి ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చానని, ఇద్దరూ ఫైనాన్ ్స వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారని, అరుునా తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆస్తి కోసం ఇబ్బంది పెడుతున్నారని రమేశ్ వాపోయాడు. కొడుకులు కొట్టిన దెబ్బలతో తనకు చెవులు వినిపించడం లేదని జడ్జి దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే స్పందించిన జడ్జి దీనిపై కేసు నమోదు చేయూల్సిందిగా పోలీసులను ఆదేశించారు. -
కొడుకులు పలకరించడం లేదని..
రాజాపేట(నల్లగొండ): కని.. పెంచి.. ప్రయోజకులను చేసిన కొడుకులు.. ముదిమి వయసులో కనీసం పలకరించడం లేదని మనస్తాపానికి గురైన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శివుడు(75) బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులు ఉన్నా వారు సరిగ్గా చూసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన శివుడు బలవంతంగా తనువు చాలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటి నుంచి గెంటేశారు
కడప అర్బన్: అతను జిల్లా పోలీసు యంత్రాంగంలో పోలీస్ కానిస్టేబుల్‌గా దాదాపు పదేళ్లు పనిచేశాడు. తెలిసీ తెలియక చేసిన తప్పిదానికి ఉద్యోగాన్ని కోల్పోయాడు. కుటుంబ పోషణ కోసం విధిలేని పరిస్థితుల్లో 25 సంవత్సరాల పాటు రిక్షా తొక్కాడు. నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దాడు. ఇప్పుడు అతని వయస్సు 85 సంవత్సరాలు. ఇంతకాలం తమ భవిష్యత్తు కోసం పరిశ్రమించిన కన్న తండ్రిని బిడ్డలు కాలదన్నారు. బయటకు వెళ్లి అడుక్కుతినుపో అంటూ నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో కడప ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండగా సమాచారం అందుకున్న పరమాత్మ సేవా సంస్థ చైర్మన్, ఏఎస్ఐ మలిశెట్టి వెంకటరమణ అక్కడికి చేరుకుని ఆ వృద్ధుడిని అక్కున చేర్చుకుని పరమాత్మ తపోవనం ఆశ్రమానికి తీసుకెళ్లారు. అతడిని కదిలిస్తే కన్నీరు ఉబికి వస్తోంది. తన పేరు నల్లబల్లె రాజారత్నం అని, కడప నగరంలోని అక్కాయపల్లెలో నివాసముండేవాడినని, ఇప్పుడు కన్నబిడ్డలు వద్దని నెట్టేశారని తన దయనీయ గాథను వివరించాడు. -
తాగొద్దన్నందుకు తల్లినే చంపారు
ఇద్దరు కుమారుల అఘాయిత్యం నార్కట్‌పల్లి: అతిగా మద్యం సేవించవద్దని వారించిన తల్లిని కుమారులు మట్టుబెట్టారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గద్దగోటిబావి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోగిని సైదులు, పిచ్చమ్మ(48) దంపతులకు వెంకన్న, నరేష్ కుమారులు. గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న చిన్నకర్మకు తల్లితో పాటు ఇద్దరు కుమారులు వెళ్లారు. అక్కడ కుమారులు మద్యం సేవిస్తుండగా తల్లి వారించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు కుమారులు తల్లిని కొట్టుకుంటూ ఇంటికి తీసుకువచ్చారు. సొమ్మసిల్లిన పిచ్చమ్మను స్పృహలోకి తీసుకువచ్చి ఆపై బలవంతంగా పురుగుల మందు తాగించి గదిలో బంధించి వెళ్లిపోయారు. కాసేపటికి ఇరుగుపొరుగు వారు చూడడంతో అప్పటికే పిచ్చమ్మ మృతి చెందింది. -
కన్న కొడుకులే కాలయముళ్లు
అరణియార్ చెరువులో మృతదేహం వెలికితీత మృతుడు పొన్నుస్వామిరెడ్డిగా గుర్తింపు ఆస్తి కోసం కొడుకులే చంపేశారని తల్లి ఫిర్యాదు ప్రపంచమంతా ఫాదర్స్‌డే సంబరాల్లో ఉండగా.. కుమారులే తండ్రిని పొట్టనబెట్టుకున్న సంఘటన పిచ్చాటూరు మండలం కీళ్లపూడిలో ఆదివారం వెలుగు చూసింది. ఆస్తికోసం గుట్టుచప్పుడు కాకుండా అంతం చేశారంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఉదంతం బట్టబయలైంది. వారు తండ్రి కన్నా ఆస్తే ఎక్కువనుకు న్నారు. కాలయముళ్లుగా మారి ప్రాణం తీశారు. ఎవరికీ అనుమానం రాకుండా అరణియార్ చెరువులో పూడ్చిపెట్టారు. పశువుల కాపరులు గుర్తించి సమాచా రం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని వెలికితీశారు. కీళపూడి(పిచ్చాటూరు): అరణియూర్‌లో శనివారం వెలుగు చూసిన గుర్తు తెలియుని వ్యక్తి వుృతదేహాన్ని ఆదివారం ఉదయుం అధికారుల సవుక్షంలో వెలికితీశారు. వుృతుడు ఫుల్ షర్ట్, తెల్ల పంచె ధరించి ఉండడాన్ని గుర్తించారు. షర్ట్ కాలర్‌పై ఉన్న బ్యాడ్జ్ ప్రకారం మృతుడు పుత్తూరు వుండలం తారుువూంబాపురానికి చెందిన ఇ.పొన్నుస్వామి రెడ్డి(82)గా గుర్తించారు. పిచ్చాటూరు తహసీల్దారు రమేష్‌బాబు, సీఐ సారుునాథ్, ఎస్ఐ వునోహర్ ఆధ్వర్యంలో సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరణియూర్లోనే పంచనావూ చేసి ఖననం చేశారు. పొన్నుస్వామి అదృశ్యంపై మే 10న కేసు నమోదు పొన్నుస్వామి రెడ్డి(82) మే నెల 7వ తేదీ నుంచి కని పించకుండా పోయాడని అతని భార్య కమలమ్మ మే నెల 10వ తేదీన ఫిర్యాదు చేశారని పుత్తూరు ఎస్ఐ హనువుంతప్ప తెలిపారు. పొన్నుస్వామి రెడ్డి, కవులవ్ము దంపతులకు చిన్నబ్బ, గణేష్ కొడుకులు, ఐదుగురు కువూర్తెలు ఉన్నారని పేర్కొన్నారు. తన భర్త అదృశ్యానికి తవు కొడుకులే కారణమని కవులవ్ము ఫిర్యాదులో తెలిపారని వివరించారు. ఆస్తి కోసం తండ్రి, కొడుకుల వుధ్య కోర్టులో కేసు కూడా నడుస్తోందని ఎస్ఐ చెప్పారు. ఫాదర్స్‌డే రోజునే వెలుగులోకి.. ప్రపంచవుంతా ఫాదర్స్‌డే సంబరాలు జరుపుకుంటున్న రోజునే ఆస్తికోసం కొడుకులే తండ్రిని చంపేశారన్న విషయం కీళ్లపూడిలో వెలుగులోకి రావడం అందరినీ కలచివేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సారుునాథ్ తెలిపారు. -
నలుగురు కుమారులున్నా అంతిమయాత్రలో అనాథే
వేములపల్లి (నల్లగొండ): ఆమెకు నలుగురు కుమారులు... రెక్కలు ముక్కలు చేసుకుని విద్యాబుద్ధులు చెప్పించింది. అందరికీ పెళ్లిళ్లు చేసి.. తన బాధ్యతను నెరవేర్చింది. కానీ అవసాన దశలో ఆ తల్లిని కుమారులు పట్టించుకోలేదు సరి కదా... ఆఖరికి కాటికి సాగనంపేందుకు కూడా ముందుకు రాలేదు. చివరకు గ్రామస్తులే ఆ తంతును పూర్తి చేశారు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంటలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... సోమ మట్టమ్మ (80)కు నలుగురు కుమారులు. వీరిలో ఇద్దరు కుమారులు సూర్యాపేటలో, ఓ కుమారుడు తిప్పర్తిలో, మరో కుమారుడు రావులపెంటలోనే ఉంటున్నారు. కుమారులు ఎవరు పట్టించుకోకపోవడంతో మట్టమ్మ గ్రామంలో దొరికిన పనిచేసుకుంటూ ప్రతి నెలా వచ్చే వృద్ధాప్య పింఛనుతోనే జీవనం సాగించేది. రాత్రివేళ గ్రామశివారులోని చర్చిలో ఉంటుంది. ఇటీవల మట్టమ్మ నకిరేకల్ మండలం బొప్పారం గ్రామంలో ఉంటున్న తన చెల్లి అచ్చమ్మ వద్దకు వెళ్లింది. గురువారం రాత్రి మట్టమ్మ అక్కడే మరణించింది. విషయాన్ని బంధువులు మట్టమ్మ కుమారులకు తెలియజేశారు. శుక్రవారం మృతదేహాన్ని రావులపెంట గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలోనే ఉంటున్న చిన్న కుమారుడు మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకురావద్దని చెప్పాడు. దీంతో చర్చి వద్దకు తరలించారు. బంధువులు, గ్రామస్తులు మట్టమ్మ కుమారులకు ఫోన్లో ఒత్తిడిచేయడంతో గ్రామానికి చేరుకున్నారు. అయినప్పటికీ తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. దీంతో చర్చి నిర్వాహకురాలు రూసమ్మ, మృతురాలి బంధువుల సహకారంతో క్రైస్తవ మతాచారం ప్రకారం మట్టమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. -
తల్లి ఆత్మహత్య కేసులో కొడుకుల అరెస్టు
వినుకొండ టౌన్ : కన్నతల్లిని భారంగా భావించటంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న మాతృమూర్తి కేసులో కొడుకులు, కోడళ్లను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ జి.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కుందుర్తి బజార్‌కు చెందిన షేక్ బషీరూన్ భర్త వలి దశాబ్దం క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి తన ఇద్దరు బిడ్డలను కూలి పనులు చేసి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. భార్యలు వచ్చిన తర్వాత ఇద్దరు కుమారులు తల్లి ఆలనాపాలన చూడకపోవటంతో బషీరూన్ అదే వీధిలో ఒక గది అద్దెకు తీసుకుని కూలి పని చేసుకుంటూ జీవించింది. ఇటీవల బషీరూన్కు చూపు మందగించటంతో పాటు అనారోగ్య కారణాలతో తప్పనిసరి అయి కొడుకుల పంచన చేరింది. అయితే ఇద్దరు కుమారులు వంతులు వేసుకుని నెలకొకరు చొప్పున చూస్తున్నారు. అయితే కోడళ్ల వేధింపులు, చీత్కారాలు, చేయి చేసుకోవడాలతో మానసికంగా బషీరూన్ విసిగిపోయింది. ఈ నెల 25వ తేదీ కొడుకులిద్దరూ తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నీ వల్ల ఇళ్లలో తగాదాలు అవుతున్నాయి చస్తే పీడా పోతుంది’ అనటంతో బషీరూన్కి విరక్తి కలిగి ఎదురింటి మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కాంట్రాక్ట్ గౌస్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు బషీరూన్ కొడుకులు, కోడళ్లు కొండ్రముట్ల షేక్ కరిముల్లా, కాలేషా, హసీనా, మహబూబ్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎస్సైలు లక్ష్మీనారాయణ రెడ్డి, నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
సవతి తల్లికీ మనోవర్తి చెల్లించవలసిందే!
కేస్ స్టడీ భారతమ్మకు 60 సంవత్సరాలు. భర్త చనిపోయి మూడేళ్లయింది. చనిపోయేముందు ఆస్తిపంపకాలు చేసి, భార్య బాధ్యతను కొడుకులకు అప్పగించి వెళ్లాడామె భర్త. కొడుకులు భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆయన ప్రగాఢ నమ్మకం. అందుకే ఆమెకు చిల్లుగవ్వ కూడా ఇవ్వలేదు. దినవారాలు అయిన తర్వాత ముగ్గురు కొడుకులూ మూటాముల్లే సర్దుకుని ఎవరి ఊర్లకు వాళ్లు వెళ్లిపోయారు. పనిలో పనిగా వారికి తండ్రి రాసిచ్చిన పొలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు తల్లి కోర్టుకు వెళుతుందనే భయంతో. ఇంటిగలాయన రెండు నెలలు చూసీ చూడనట్లుండి, అద్దె బకాయి పడగానే, ఇల్లు ఖాళీ చేయమని గొడవ ప్రారంభించాడు. పాపం భారతమ్మ పరిస్థితి ఘోరమైంది. కొడుకులపై మెయిన్టెనెన్స్ కేసు వేయమని ఎవరో సలహా ఇచ్చారు. అది కొడుకుల చెవిన పడింది. అసలు భారతమ్మ తమ కన్నతల్లి కాదని, సవతి తల్లి అనీ అందుకని ఆమెకు ఆ ఆస్తిలో భాగం రాదని ఆమెను హెచ్చరించారు. కళ్లనీళ్ల పర్యంతమైంది భారతమ్మ. నిజమే, తాను వారి సవతి తల్లి. కానీ, వారి తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ల నాన్న రెండోపెళ్లి చేసుకున్నాడు తనను. అప్పటినుంచి వాళ్లే తమ బిడ్డలని కళ్లల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసింది. తనకు పిల్లలు వద్దని కూడా నిర్ణయించుకుంది. మరి స్వార్థపరుడైన భర్తవల్ల, ఆమె అమాయకత్వం వల్ల ఈనాడు ఆమెకు ఈ గతి పట్టింది. అసలు చట్టం ఏమి చెబుతుందో అని ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన న్యాయవాదిని అడిగింది. ఆమె చెప్పిన విషయాలేమిటంటే... సవతి తల్లి కూడా సెక్షన్ 125 సిఆర్పీసీని అనుసరించి మనోవర్తి పొందవచ్చు. తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న స్త్రీలకు పిల్లలకు, తలిదండ్రులకు న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో ఈ నిబంధన ఏర్పరచడం జరిగింది. దీనిప్రకారం సవతి తల్లి కూడా అనాథగా మారకుండా చూడవలసిన బాధ్యత కొడుకుపై ఉంటుంది. అయితే సవతి తల్లి సవతి కొడుకు నుండి మనోవర్తి కోరేటప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. 1. ఆమెకు వీరుగాక ఇతరత్రా ఎటువంటి సంతానం ఉండకూడదు. ఆమె విధవరాలు అయి ఉండాలి. భర్త జీవించి ఉంటే, అతడు పోషించలేని పరిస్థితుల్లో ఉండాలి. భారతమ్మకు ముగ్గురూ సవతి కొడుకులే. ముగ్గురినీ మనోవర్తి కేసులో పార్టీలుగా చేయవచ్చని తెలుసుకుని కేసు వేయడానికి సహాయపడమని ఆ న్యాయవాదిని వేడుకుంది భారతమ్మ. తప్పకుండా కేసు వేస్తామని, ఆమెను ఆదుకుంటామరని మాటిచ్చారు వాళ్లు. -
కొడుకులు కాదు.. కర్కోటకులు
► కన్నతల్లిని గెంటేసిన ప్రబుద్ధులు ► కాలు విరిగి అచేతనంగా ఉన్నా కనికరం చూపని వైనం ► స్థానికుల జోక్యంతో తిరిగి తీసుకెళ్లిన వైనం సిరిసిల్ల టౌన్ : జీవనమలి సంధ్యలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే కర్కశత్వం చూపించారు. కాలు విరిగి అచేతనంగా ఉన్నా కనికరం చూపకుండా ఇంట్లోంచి గెంటేయగా స్థానికులు బుద్ధి చెప్పారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగ ర్కు చెందిన భారతం గంగవ్వ(75) భర్త పోచయ్య చాలా ఏళ్ల క్రితమే చనిపోగా.. ఇద్దరు కొడుకుల వద్ద ఉంటోంది. నెలరోజుల క్రితం ఇంట్లో జారిపడగా కాలు విరిగింది. అప్పటి నుంచి ఆమెకు సేవలు చేయాల్సి వస్తుందన్న భావనతో 15 రోజుల క్రితం ఇంట్లోంచి బయటకు పంపి, ఎదురుగా ఉన్న పాడుబడిన తోపుడుబండిపై ఉంచారు. ఇది గమనించిన స్థానికులు ఆమెకు అన్నం పెడుతూ వచ్చారు. విషయం మీడియాకు శనివారం తెలిసి అక్కడికి వెళ్లగా... స్థానికులు కొడుకులకు బుద్ధి చెప్పారు. వెంటనే కొడుకులు తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లారు. -
భర్త అంత్యక్రియల కోసం పిల్లల్ని తాకట్టు పెట్టింది
చంపువా: పేదరికం ముందు తల్లిప్రేమ చిన్నబోయింది. కుటుంబానికి అండగా ఉన్న పెద్ద దిక్కు అనుకోకుండా మృతి చెందడంతో అతని అంత్యక్రియలకు అయిన అప్పులు చెల్లించడానికి వేరే దారి లేక తన ఇద్దరు పిల్లలను ఓ తల్లి తాకట్టుపెట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒడీషాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చంపువా ప్రాంతంలోని గందూలి గ్రామానికి చెందిన రోజు కూలి రైబా.. అనారోగ్యంతో రిపబ్లిక్ డే రోజున మృతి చెందాడు. అప్పటి వరకు కూడబెట్టిన కొద్దిపాటి డబ్బు కూడా రైబా ఆసుపత్రి ఖర్చులకే కరిగిపోవడంతో భార్య సావిత్రికి అతని అంత్యక్రియలను నిర్వహించడానికి చేతిలో చిల్లిగవ్వ మిగలలేదు. తెలిసిన వారిని సహాయం కోసం అర్ధించినా అందరూ మొహం చాటేశారు. దీంతో తన ఇద్దరు పిల్లలు ముఖేశ్(13), సుఖేష్(11) లను పొరుగువారి వద్ద రూ. 5000 లకు తాకట్టుపెట్టిన సావిత్రి భర్త అంత్య క్రియలు నిర్వహించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రాంతీయ అభివృద్ధి అధికారి ఎస్ నాయక్ బుధవారం ఆ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఇద్దరు పిల్లలను తాకట్టు నుండి విడిపించారు. వారికి విద్యా సౌకర్యాలను అందించనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. కాగా సావిత్రికి మరో ముగ్గురు పిల్లలు ఆకాశ్(9), చిల్లరి(8), బర్షా(4) ఉన్నారు. -
క్షమించు అమ్మా..
అమ్మ... స్వచ్ఛమైన ప్రేమకు ప్రతి రూపం.. నిస్వార్థతకు నిలువెత్తు నిదర్శనం.. తాను దహించుకుపోతూ.. తన సంతానానికి వెలుగునిస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు.. స్వార్థించడం.. సాధించడం.. సాగనంపడం తప్పితే.. అలాంటి హృదయ విదారకర సంఘటన ఇది.. కాటికి కాలు చాపిన కన్నతల్లిని నిర్ధాక్షిణ్యంగా వీధి పాలు చేసిన సంతానం వైనమిది. ఈ సంఘటన చూసిన వారికి చెమ్మ గిల్లాయే తప్పితే.. పెంచి పెద్ద చేసిన ఆమె సంతానానికి మాత్రం ఈమె మా అమ్మ అని గుర్తుకురాలేదు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆటోలో మారేడుపూడి కూడలి వద్దకు వచ్చారు. అందులో 85 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలిని రోడ్డు పక్కనే పడేశారు. ఇది గమనించిన స్థానికులు ఆటో డ్రైవర్‌ను పిలుస్తుండగానే క్షణంలో ఆటో వెళ్లిపోయింది. వృద్ధురాలు దుస్థితి ప్రత్యక్షంగా చూసిన వారిని కలచి వేసింది. వెంటనే ఆమెకు సపర్యలు చేసి, వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. స్థానికులు కుటుంబ సభ్యులను తిట్టిపోస్తూ.. వారికీ ఇటువంటి దుస్థితి ఏర్పడాలని శాపనార్థాలు పెట్టారు. మార్కెట్ కమిటీ మాజీ డెరైక్టర్ సాలాపు మోహన్ పరవాడ పోలీసులకు సమాచారం అందించి, అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. - అనకాపల్లి రూరల్ -
కన్నకొడుకులే తండ్రిని కడతేర్చారు
అదిలాబాద్: కన్న కొడుకులే తండ్రిని చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన చంద భీమయ్య(74) మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో వాస్తవాలు బయటకు వచ్చాయి. భీమయ్య కొడుకులు చిన్నయ్య, మల్లయ్య ఇద్దరు కలిసి అతన్ని నవారుతో ఉరివేసి హత్యచేశారని దర్యాప్తులో తేలడంతో బుధవారం వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
కొడుకులను కడతేర్చిన కసాయి తల్లి
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్, చంద్రపురి కాలనీలో ఓ మహిళ అమ్మతనాన్ని మరచి కన్న కొడుకులను కిరాతకంగా కడతేర్చింది. చిన్నారులిద్దరినీ నీటి సంపులో తోసేసి ప్రాణాలు తీసింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు... మంగళవారం సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత చంద్రపురి కాలనీలోని ఓ ఇంటి నీటి సంపులో ఇద్దరు చిన్నారుల మృత దేహాలు ఉన్నట్లు సమాచారం బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారులిద్దరినీ ఆరు నెలల అక్షర్, మూడేళ్ల సహస్రగా గుర్తించారు. వీరి తల్లిదండ్రులు నిర్మల, మల్లేశ్. తల్లి నిర్మలకు మతిస్థితిమితం లేదని తెలుస్తోంది. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం, తల్లి మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. గోదావరి ఖని మండలం జనగామ పోతన కాలనీలో ఇద్దరు కుమారులు సహా ఓ తల్లి పురుగుల మందు తాగింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కుటుంబ కలహాల కారణంగానే గృహిణి ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
ఆస్తి కోసం.. భార్యను హత్య చేసిన భర్త
-
అమ్మ ఇక్కడ.. బిడ్డలు అక్కడ..
అమలాపురం టౌన్ : అమ్మ.. నాన్న.. ఇద్దరు చిన్నారి పిల్లలు.. ఓ పండంటి కాపురం వాళ్లది. ఓ చిరువ్యాపారం చేసుకుంటూ ఉన్నంతలో ఆ కుటుంబం సంతోషంగా ఉంది. నగరం గ్యాస్ పైప్‌లైన్ పేలుడు అగ్నికీలల్లో తల్లి వానరాసి దుర్గాదేవి, ఇద్దరు కుమారులు ఎనిమిదేళ్ల మధుసూదన్, ఐదేళ్ల మోహన వెంకట కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. భర్త నరసింహమూర్తి మాత్రం అగ్నికీలల నుంచి తప్పించుకున్నారు. గాయపడ్డ తల్లీబిడ్డలను ఆ రోజు హుటాహుటిన అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పిల్లల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లికి మాత్రం అమలాపురంలోని కిమ్స్‌లోనే వైద్యం అందిస్తున్నారు. రోజూ తనను అంటిపెట్టుకుని నిద్రించే.. ముస్తాబు చేసి స్కూలుకు పంపించే బిడ్డలు అగ్నికీలలకు కళ్లెదుటే గిలగిలలాడి తీవ్రగాయాలపాలవడం చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తాను గాయపడినప్పటికీ వాటిని లెక్కచేయకుండా పిల్లలకోసమే గగ్గోలు పెట్టింది. తీరా ఆస్పత్రికి తరలించాక పిల్లలను మాత్రం తనకు దూరంగా కాకినాడకు పంపేయడంతో ఆమె మనసంతా వారిపైనే ఉంది. ఎవరు వచ్చినా ‘నన్ను నా పిల్లల దగ్గరకు పంపేయండి.. మా ముగ్గురికీ ఒకేచోట వైద్యం చేయండి’ అంటూ ప్రాధేయపడడం చూపరులను కలిచివేస్తోంది. ‘పిల్లలకు దూరంగా ఎప్పుడూ లేను.. వాళ్లను ఈ స్థితిలో వదిలి ఉండలేను.. ఇలాంటప్పుడు వాళ్లకి దగ్గర ఉంటేనే వారికి గమ్మున తగ్గుతుంది’ అని రోదిస్తోంది. శనివారం సాయంత్రం ఆమెను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి పరామర్శించి ఓదార్చారు. -
ఆ హక్కు మాకులేదా!
వేదిక ‘ఇద్దరూ ఆడపిల్లలే.... రేపొద్దున మిమ్మల్ని ఎవరు చూస్తారు?’ అని అడిగినవారికి అమ్మ చెప్పిన సమాధానం...‘ఆడపిల్లలయితే ఏంటి, మగ పిల్లలయితే ఏంటి? మూడో బిడ్డని పోషించే స్థోమత లేదు మాకు’ అని చెప్పేదట. ఏడాది కిందటే మా అమ్మ చనిపోయింది. నాన్న ఒంటరి అయిపోయారు. నాకు పెళ్లయి పదేళ్లయింది. నా పెళ్లయిన రెండేళ్లకు చెల్లి పెళ్లయింది. చెల్లి గుజరాత్లో ఉంటోంది. నేను విజయవాడలో ఉంటున్నాను. నాన్న హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నారు. నాన్న ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే! మొన్నామధ్య చూడ్డానికి వెళ్లినపుడు చాలా నీరసంగా ఉన్నారు. అమ్మానాన్నలకు పెద్ద వయసు కాదు. గుండెపోటు వల్ల యాభై ఏళ్లు కూడా నిండకుండా కన్నుమూసింది అమ్మ. నాన్న పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బెంగగా ఉంది. ఇక లాభం లేదని...మావారితో నా మనసులోని మాట చెప్పాను. ‘‘ఇద్దరం ఆడపిల్లలం అవడం వల్ల ఈ రోజు నాన్న ఒంటరిగా బతకాల్సి వస్తోంది కదండీ! అమ్మను అందరూ మగపిల్లాడి కోసం చూడమని చెబితే ‘ఎవరైతే ఏంటి?’ అనేదట. కానీ నేను ఆడపిల్లను కావడం వల్లే కదా! నాన్న పరిస్థితి చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాను. అదే మగపిల్లాడినైతే నా ఇంట్లో పెట్టుకుని కూర్చోబెట్టి పోషించుకునేదాన్ని’’ అన్నాను. ‘‘ఇప్పుడు మాత్రం ఎవరు కాదన్నారు. నీ జీతంలో కొంత డబ్బు మీ నాన్నగారికి పంపు’’ అన్నారు. ‘‘డబ్బు ఆయన దగ్గర కూడా ఉంది కదండీ!’’ అన్నాను. ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. నాకు మా నాన్నగారిని మా ఇంటికి తీసుకురావాలని ఉంది. మా వారికి పెద్ద అభ్యంతరం ఏమీ లేదు. కానీ మా అత్తమామలు ఏమనుకుంటారోనని సందేహిస్తున్నారు. ఆయనకిష్టం లేకుండా నాన్నని తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులొస్తాయోనని నా భయం. మగపిల్లలు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటే...జేజేలు కొట్టే ఈ సమాజం ఆ హక్కునూ, బాధ్యతనూ ఆడపిల్లలకు ఎందుకు ఇవ్వదో నాకు అర్థం కావడం లేదు. - అనుపమ, విజయవాడ