ఇద్దరు కుమారుల అఘాయిత్యం
నార్కట్‌పల్లి: అతిగా మద్యం సేవించవద్దని వారించిన తల్లిని కుమారులు మట్టుబెట్టారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గద్దగోటిబావి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోగిని సైదులు, పిచ్చమ్మ(48) దంపతులకు వెంకన్న, నరేష్ కుమారులు. గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న చిన్నకర్మకు తల్లితో పాటు ఇద్దరు కుమారులు వెళ్లారు. అక్కడ కుమారులు మద్యం సేవిస్తుండగా తల్లి వారించింది.
దీంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు కుమారులు తల్లిని కొట్టుకుంటూ ఇంటికి తీసుకువచ్చారు. సొమ్మసిల్లిన పిచ్చమ్మను స్పృహలోకి తీసుకువచ్చి ఆపై బలవంతంగా పురుగుల మందు తాగించి గదిలో బంధించి వెళ్లిపోయారు. కాసేపటికి ఇరుగుపొరుగు వారు చూడడంతో అప్పటికే పిచ్చమ్మ మృతి చెందింది.
తాగొద్దన్నందుకు తల్లినే చంపారు
Published Fri, Jul 29 2016 6:15 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM
Advertisement
Advertisement