అరణియార్ చెరువులో మృతదేహం వెలికితీత
మృతుడు పొన్నుస్వామిరెడ్డిగా గుర్తింపు
ఆస్తి కోసం కొడుకులే చంపేశారని తల్లి ఫిర్యాదు
ప్రపంచమంతా ఫాదర్స్‌డే సంబరాల్లో ఉండగా.. కుమారులే తండ్రిని పొట్టనబెట్టుకున్న సంఘటన పిచ్చాటూరు మండలం కీళ్లపూడిలో ఆదివారం వెలుగు చూసింది. ఆస్తికోసం గుట్టుచప్పుడు కాకుండా అంతం చేశారంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఉదంతం బట్టబయలైంది. వారు తండ్రి కన్నా ఆస్తే ఎక్కువనుకు న్నారు. కాలయముళ్లుగా మారి ప్రాణం తీశారు. ఎవరికీ అనుమానం రాకుండా అరణియార్ చెరువులో పూడ్చిపెట్టారు. పశువుల కాపరులు గుర్తించి సమాచా రం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని వెలికితీశారు.
కీళపూడి(పిచ్చాటూరు): అరణియూర్‌లో శనివారం వెలుగు చూసిన గుర్తు తెలియుని వ్యక్తి వుృతదేహాన్ని ఆదివారం ఉదయుం అధికారుల సవుక్షంలో వెలికితీశారు. వుృతుడు ఫుల్ షర్ట్, తెల్ల పంచె ధరించి ఉండడాన్ని గుర్తించారు. షర్ట్ కాలర్‌పై ఉన్న బ్యాడ్జ్ ప్రకారం మృతుడు పుత్తూరు వుండలం తారుువూంబాపురానికి చెందిన ఇ.పొన్నుస్వామి రెడ్డి(82)గా గుర్తించారు. పిచ్చాటూరు తహసీల్దారు రమేష్‌బాబు, సీఐ సారుునాథ్, ఎస్‌ఐ వునోహర్ ఆధ్వర్యంలో సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరణియూర్‌లోనే పంచనావూ చేసి ఖననం చేశారు.
పొన్నుస్వామి అదృశ్యంపై మే 10న కేసు నమోదు
పొన్నుస్వామి రెడ్డి(82) మే నెల 7వ తేదీ నుంచి కని పించకుండా పోయాడని అతని భార్య కమలమ్మ మే నెల 10వ తేదీన ఫిర్యాదు చేశారని పుత్తూరు ఎస్‌ఐ హనువుంతప్ప తెలిపారు. పొన్నుస్వామి రెడ్డి, కవులవ్ము దంపతులకు చిన్నబ్బ, గణేష్ కొడుకులు, ఐదుగురు కువూర్తెలు ఉన్నారని పేర్కొన్నారు. తన భర్త అదృశ్యానికి తవు కొడుకులే కారణమని కవులవ్ము ఫిర్యాదులో తెలిపారని వివరించారు. ఆస్తి కోసం తండ్రి, కొడుకుల వుధ్య కోర్టులో కేసు కూడా నడుస్తోందని ఎస్‌ఐ చెప్పారు.
ఫాదర్స్‌డే రోజునే వెలుగులోకి..
ప్రపంచవుంతా ఫాదర్స్‌డే సంబరాలు జరుపుకుంటున్న రోజునే ఆస్తికోసం కొడుకులే తండ్రిని చంపేశారన్న విషయం కీళ్లపూడిలో వెలుగులోకి రావడం అందరినీ కలచివేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సారుునాథ్ తెలిపారు.