fathers
-
Father’s Day 2024: వ్యాపార సామ్రాజ్యంలో నాన్న తోడుగా.. (ఫొటోలు)
-
దర్శకురాలు కావాలనుకుంది..కానీ తండ్రి హఠాన్మరణం ఆమెను ..
ముంబైలో గణేశ్ నిమజ్జనం రోజున వేలాది విగ్రహాలు సముద్రం వైపు కదులుతాయి. వాటిలో భారీ విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ విగ్రహాల్లో దాదాపు సగం రేష్మ ఖాతు తయారు చేసినవే. తండ్రి మరణించాక గణేశుడి విగ్రహాల తయారీ పరంపరను భుజానికెత్తుకుంది రేష్మ. ఇవాళ ముంబైలో ఆమె నంబర్ 1 గణేశ శిల్పి. ‘మనల్నందరిని దేవుడు తయారు చేశాడు. కాని ఆ దేవుణ్ణి తయారు చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది’ అంటుంది రేష్మ ఖాతు. నలభై ఏళ్ల రేష్మ ఖాతును ముంబైలో ‘మూర్తికార్’ అని పిలుస్తారు. అంటే దేవుని మూర్తుల రూపశిల్పి అని అర్థం. ‘ఇవాళ మా నాన్న నన్ను చూస్తే చాలా ఆశ్చర్యపోయి ఉండేవాడు’ అంటుందామె తండ్రి విజయ్ ఖాతును తలుచుకుని. ఎందుకంటే తండ్రి జీవించి ఉండగా ఆమె ఎప్పుడూ ఆయన వర్క్‌షాప్‌లోకి పెద్దగా అడుగు పెట్టేది కాదు. ఇవాళ ఆ వర్క్‌షాప్‌కు ఆమే సర్వస్వం. ‘ముంబైలోనే కాదు దేశ విదేశాల్లోనే మా నాన్న విజయ్ ఖాతు చాలా ప్రఖ్యాతుడు. ఇవాళ మనం చూస్తున్న గణేశ్ విగ్రహాల భిన్న రూపాలకు ఆయనే ఆద్యుడు. గతంలో గణేశుడు విగ్రహం అంటే అందరూ కూర్చుని ఉన్న మూర్తే తయారు చేసేవారు. మా నాన్న గణేశుడి చేతులకు, కాళ్లకు కదలికలు తెచ్చాడు’ అంటుంది రేష్మ. 2017లో విజయ్ ఖాతు మరణించాక ఆయన శిల్ప సామ్రాజ్యాన్ని రేష్మ సమర్థంగా నిర్వహిస్తోంది. సినీ దర్శకురాలు అవుదామని రేష్మ ఖాతు కుటుంబం తాతల కాలం నుంచి గణేశ్ విగ్రహాల తయారీలో ఉంది. ఆ శిల్పాల తయారీ రేష్మకు సర్వం తెలిసినా తాను మాత్రం సినీ దర్శకురాలు కావాలని ఆ కోర్సులు చేసింది. అయితే తండ్రి హఠాత్ మరణంతో మొత్తం కార్ఖానా స్తంభించింది. ‘మా నాన్న చనిపోయాక ఆయన విలువ మరింత తెలిసింది. ఎందరో మండపాల నిర్వాహకులు నా దగ్గరకు వచ్చి ప్రతి ఏటా వినాయక చవితికి మీ దగ్గరే విగ్రహాలు తీసుకెళ్లేవాళ్లం... ఇక మీదట కూడా అలాగే చేస్తాం అని చెప్పేవారు. ముంబైలో ప్రఖ్యాతమైన లాల్బాగ్, ఖేత్వాడి, చందన్వాడి, తులసివాడి మంటపాల్లో ప్రతి ఏటా మేము తయారు చేసిన విగ్రహాలే పెడతారు. వీరందరినీ చిన్నబుచ్చడం నాకు నచ్చలేదు. మా మేనమామ నాతో– నువ్వు చేయగలవమ్మా అన్నాడు. ధైర్యంగా మా నాన్న సీట్లో కూచున్నాను’ అంటుంది రేష్మ. మగవాళ్లకు నచ్చలేదు గత ఐదారేళ్లుగా రేష్మ విజయవంతంగా గణేశ్ విగ్రహాల తయారీని కొనసాగిస్తున్నా ఇంకా ఆ సంగతి మింగుడుపడని మగవారు ఉన్నారు. ‘మా ఫ్యాక్టరీలో శిల్పులు, మౌల్డర్లు, మేనేజర్లు అందరూ నేను బాస్‌గా రావడం చూసి ఆశ్చర్యపోయారు. కొందరు చాలా ఏళ్లుగా మా నాన్న సీట్ మీద కన్నేసి ఉంచారు. వారంతా నేను రావడంతో సహాయ నిరాకరణ చేశారు. నేను శిల్పి కూతురిని. శిల్పం చేయడం నా జీన్స్‌లో ఉంది. నేనే రంగంలో దిగి కొత్త విగ్రహాలు ఎలా చేయాలో సూచనలు ఇస్తూ సరైన దారిలో కార్ఖానాను పెట్టేసరికి తల వొంచారు’ అంటుంది రేష్మ. పార్వతీదేవి చేతుల్లో గణేశుడు తయారైన చందాన ముంబైలో ఒక స్త్రీ చేతుల మీదుగా ప్రతి వినాయక చవితికి విగ్రహాలు తయారవుతాయి. పూజలు అందుకుంటాయి. గణేశుడి మూర్తుల తయారీలో ఒక స్త్రీ ఈ విధాన ముందుండటం తప్పక సంతోషపడాల్సిన విషయం. ---శభాష్ రేష్మ. (చదవండి: బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట!అందులో ప్రోటీన్, విటమిన్ బీ..) -
తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే!
తండ్రికీ కావాలి ప్రసూతి సెలవు తల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య ప్రసవ సమయంలో బాలింతను, నవజాత శిశువును చూసుకోవడానికి తండ్రికి సెలవు ఇవ్వకతప్పదని, ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనపరమైన చట్టాలు తేవాలని జస్టిస్ విక్టోరియా గౌరి సూచించారు. నిజమే. తండ్రికి సెలవు భార్యభర్తల మధ్య అనేక చికాకులను దూరం చేయగలదు. ఒక పరిశీలన. బిడ్డకు జన్మనివ్వడమంటే సమాజానికి కొత్త సభ్యుణ్ణి ఇవ్వడమే. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు సంతానం కావచ్చు కాని సమాజానికి ప్రతినిధే. బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఆ తల్లిదండ్రులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో సమాజానిదీ అంతే బాధ్యత. కనేందుకు ఆస్పత్రి, పెంచేందుకు తండ్రికి కనీస ఆదాయం లేకపోతే సమాజం తప్పవుతుంది. గతంలో స్త్రీ ఇంటి పట్టునే ఉండేది. ఉమ్మడి సంసారాల్లో కాన్పులకు సులువుగా సాయం దొరికేది. కాని ఇప్పుడు ఇలా తాళి కడితే అలా విడిగా కాపురం పెట్టే పరిస్థితులు వచ్చాయి. దానివల్ల పిల్లల్ని కనడం, పెంచడం చాలా పెద్ద బాధ్యతగా మారింది తల్లిదండ్రులకు. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ప్రసూతి సెలవులు మంజూరు అవుతున్నా ఆ స్త్రీలకు, పుట్టిన శిశువులకు కాన్పు సమయంలో తోడుగా ఉండాల్సిన పురుషులకు మాత్రం సెలవు గురించి ఇంకా ఆలోచన రావడం లేదు. సమాజం ఇంకా అంత‘నాగరికం’గా ఆలోచించడం లేదు. కాని తాజా ఘటన ఈ అంశాన్ని చర్చకు తెచ్చింది. కోర్టుకెక్కిన తండ్రి తమిళనాడులోని తెన్‌కాశీలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న బి.శరవణన్ తన భార్యకు కాన్పు సమయంలో తోడు ఉండేందుకు 90 రోజుల సెలవు అడిగాడు. దానికి కారణం అతని భార్య ఐ.వి.ఎఫ్. ద్వారా గర్భం దాల్చడమే. ఐ.వి.ఎఫ్.ద్వారా గర్భం దాల్చితే కాన్పు అయ్యేంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే సెలవు అడిగాడు. పరిస్థితి విన్న అధికారులు శాంక్షన్ చేశారు. కాని ఆ సెలవు ఉపయోగంలోకి రాక ముందే అతను విధుల్లో లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని సెలవు కేన్సిల్ చేశారు. దాంతో శరవణన్ కోర్టుకు వెళ్లాడు. డెలివరీ డేట్ మే 30 కనుక కోర్టు మే 1 నుంచి సెలవు ఇమ్మంది. అధికారులు 30 రోజులు సెలవు మంజూరు చేశారు. కాని డెలివరీ మే 31న జరిగింది. దాంతో మే 31న శరవణన్ విధులకు హాజరు కాలేకపోయాడు. అంతే కాదు సెలవు పొడగింపును కోరాడు. అధికారులు సెలవును పొడిగించకపోగా చెప్పాపెట్టకుండా విధులకు హాజరుకానందున ఎందుకు చర్య తీసుకోకూడదో జూన్ 22న వచ్చి వ్యక్తిగతంగా సంజాయిషీ ఇమ్మని ఆదేశించారు. ఆ ఆదేశాలను శరవణన్ హైకోర్టులో సవాలు చేశాడు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టేస్తూ మగవారికి కూడా ప్రసూతి సెలవలు అవసరమని అభిప్రాయపడింది. ఆందోళన లేకుండా కాన్పు సమయంలో భార్యకు ఎంత ఆందోళన ఉంటుందో భర్తకూ అంతే ఆందోళన ఉంటుంది. రెండు ప్రాణాలు పరీక్ష సమయాన్ని ఎదుర్కొనే వేళ సహజంగానే లేబర్ రూమ్ బయట పురుషుడు ఒత్తిడికి లోనవుతాడు. అదొక్కటే కాదు బిడ్డ పుట్టాక భార్యకు శక్తి వచ్చే వరకు, బిడ్డ కుదుట పడేవరకు ఇంట్లో పనులు ఎన్నో ఉంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుళ్లు ఉంటాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటి నుంచి ఫోన్ రాగానే కంగారు పడుతూ భర్తలు ఆ సమయంలో వేదన అనుభవిస్తారు. మరోవైపు తోడుండాల్సిన భర్త ఇంటి పట్టున లేకపోతే, డబ్బు సంపాదన ఎంత తప్పనిసరి అయినప్పటికీ, భార్యకు నిస్పృహ రావడం సహజం. రాత్రిళ్లు చంటి పిల్లల ఏడ్పు వల్ల ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాల్సిన భర్త నిద్ర చెడి చిరాకు పడితే ఆ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్లిన కేసులెన్నో. అందువల్ల భార్యతో పాటు భర్తకు సెలవులు ఇవ్వడం ఎంతో అవసరం. ‘కనేది ఆమె అయితే ఇతనికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టమైన రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాలంటే ఇలాంటి నాగరికమైన ఆలోచనలు తప్పక చేయాల్సిందే. సమయం వచ్చేసింది మద్రాసు హైకోర్టులో ఈ కేసును విన్న జస్టిస్ ఎల్.విక్టోరియా మేరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మగవారికి ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యకు స్పందించాల్సిన సమయం వచ్చేసిందని అన్నారు. ‘పిల్లల్ని కని, పెంచడంలో స్త్రీ, పురుషులిరువురికీ సమాన బాధ్యత ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రసూతి సమయంలో తల్లితోపాటు తండ్రికీ సెలవులు ఇస్తున్నాయి. అవి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు సరితూగకపోయినా ఏదో ఒక మేరకు ఇస్తున్నాయి. మన దేశంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో పురుషులకు లీవ్ పెట్టే వీలు ఉంది. కాని ఆ రూల్స్ చాలా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు’. –జస్టిస్ విక్టోరియా గౌరి, మద్రాసు హైకోర్టు (చదవండి: పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్‌లు, ఆభరణాలు) -
Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు
బ్రెజిల్లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏముందంటారా? చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!! పిల్లలకు 8 నెలలు వచ్చాక అసలు వారి తండ్రి ఎవరా అని ఆమెకు అనుమానం వచ్చింది. వారి తండ్రిగా తాను భావిస్తున్న యువకునికి పితృత్వ పరీక్ష చేయించగా కవలల్లో ఒకరి డీఎన్ఏతో మాత్రమే సరిపోయిందట. దాంతో ఆమెతో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపు ఆలోచించిన మీదట, తాను అదే రోజు మరో యువకునితో శారీరకంగా కలిసిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. డీఎన్ఏ పరీక్ష చేయించగా రెండో బాబుకు అతనే తండ్రి అని తేలింది! ‘‘ఇది అత్యంత అరుదైన సంగతి. 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారముంటుంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు. శాస్త్రీయంగా దీన్ని హెటరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ (బహుళ పిండోత్పత్తి)గా పిలుస్తారట. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసి, సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు వారి వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందట. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలూ వేర్వేరు మావి (ఉమ్మనీటి సంచి)లో పెరుగుతాయట. మనుషుల్లో అత్యంత అరుదే అయినా పలు జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
Viral: బిడ్డ చదువుకు తండ్రి గొడుగు
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బాలక్క గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆరుబయట వర్షంలో మొబైల్ఫోన్లో ఆన్లైన్ క్లాస్‌తో తంటాలు పడుతుండగా, ఆమె తడవకుండా తండ్రి గొడుగుతో నిలబడిన దృశ్యం వైరల్ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సుళ్య తాలూకాలో బాలక్క గ్రామంలో మాత్రమే నెట్ అందుబాటులో ఉండడం వల్ల పరిసర పల్లెల విద్యార్థులు ఇక్కడికే వచ్చి ఆన్లైన్ తరగతులు వింటున్నారు. అలాగే ఓ బాలిక సిగ్నల్ బాగా వచ్చేచోట కూర్చుని క్లాస్ వింటుండగా వర్షం రావడంతో ఆమె తండ్రి గొడుగు పట్టి కన్నప్రేమను చాటుకున్నాడు. చదవండి: Fathers Day: నాన్న ఎవ్రీడే వారియర్.. -
పెంచిన చేతులనే కాటేశారు
కడుపున పుట్టకపోయినా కన్నబిడ్డల్లా సాకిన ఆ తండ్రుల పాలిట వారు కాలయములయ్యారు. ఆస్తికోసం మమతానురాగాలకు సమాధి కట్టారు. ఏలూరులో ఓ దత్త పుత్రిక, నల్లజర్లలో ఓ పెంపుడు కొడుకు పెంచిన చేతులనే కాటేశారు. తండ్రులను కడతేర్చారు. దత్తపుత్రిక దారుణం ఏలూరు(సెంట్రల్) : ఆస్తికోసం తండ్రిని కడతేర్చిన దత్తపుత్రికతోపాటు ఆమెకు సహకరించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఏలూరు సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు శుక్రవారం విలేకరులకు వివరించారు. ఆయన కథనం ప్రకారం... బయ్యారపు వెంకయ్య(65) స్థానిక శనివారపుపేట ఇందిరా కాలనీలో ఉండేవాడు. వెంకయ్య 20 ఏళ్లక్రితం మాదేపల్లికి చెందిన తన మిత్రుడు నున్న లక్షీ్మనారాయణ కుమారై ఉషారాణిని దత్తత తీసుకున్నాడు. ఉషారాణికి 2008లో విజయ్ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు. వారికి ఇద్దరు సంతానం. ఉషారాణి నాలుగేళ్ల క్రితం భర్తకు దూరమై తండ్రి వద్దే ఉంటోంది. వట్లూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ షాజహాన్ అలియాస్ సల్మాన్ ఖాన్‌తో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి వెంకయ్య ఆస్తిపై కన్నేసింది. ప్రియుడు షాజహాన్తో కలిసి వెంకయ్యను కడతేర్చేందుకు పథకం పన్నింది. దీంతో ఉషారాణి, షాజహాన్ అతని మిత్రులైన దుగ్గిరాలకు చెందిన కానూరి ఏసు, పత్తేబాదకు చెందిన గరికిపాటి మణికంఠ కలిసి డిసెంబర్ 18న వెంకయ్య ఇంట్లో నిద్రిస్తుండగా ముఖంపై దిండుతో నొక్కి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆ తరువాత అనుమానం రాకుండా మృతదేహాన్ని తీసుకువెళ్లి పడమట లాకుల వద్ద రైలు పట్టాలపై పడవేశారు. దీనిపై రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. విచారణలో వెలుగు చూసిన నిజాలు రైలు పట్టాలపై దొరికిన వెంకయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో హత్యగా వైద్యులు నిర్ధారించారు. దీంతో రైల్వే పోలీసులు కేసును త్రీటౌన్ పోలీసులకు బదిలీ చేశారు. త్రీటౌన్ పోలీసులు వెంకయ్య కుటుంబ సభ్యులను విచారించారు. ఉషారాణి కుమారైలు తాతయ్యను తన తల్లి, మరి కొందరు కలిసి చంపారని చెప్పారు. దీంతో పోలీసులు అప్పట్లోనే ఉషారాణిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె హత్యకు సహకరించిన వారి పేర్లను పోలీసులకు వెల్లడించింది. దీంతో నలుగురినీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్, ఎస్సై సిబ్బందిని డీఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు. పెంచిన కొడుకు అమానుషం కొవ్వూరు రూరల్ /నల్లజర్ల : పెంచిన తండ్రిని ఓ కొడుకు తన భార్యతో కలిసి పాశవికంగా హత్యచేశాడు. ఈ నెల 11న రాత్రి నల్లజర్ల మండలం కొత్తగూడెంలో జరిగిన ఈ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలను కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం సీఐ జి. మధుబాబు శుక్రవారం వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన శిఖా కృష్ణమూర్తి(52)కి పిల్లలు లేరు. దీంతో తన అన్న లక్ష్మణరావు నాలుగో కుమారుడిని వెంకటదుర్గారావు దత్తత తీసుకున్నాడు. రెండేళ్ల క్రితం కృష్ణమూర్తి భార్య వెంకటరమణ మృతి చెందింది. దీంతో కృష్ణమూర్తి కొడుకు వద్దే ఉంటున్నాడు. కృష్ణమూర్తి పేరున ఉన్న ఎకరంన్నర పొలాన్ని తన పేర రాయాలని తరచూ దుర్గారావు ఒత్తిడి తెస్తున్నాడు. తన తదనంతరమే అది దుర్గారావుకు చెందుతుందని కృష్ణమూర్తి తేల్చిచెప్పాడు. దీంతో ఎలాగైనా కృష్ణమూర్తిని కడతేర్చాలని దుర్గారావు పన్నాగం పన్నాడు. ఈనెల 11న రాత్రి మద్యం సీసాలో నిద్రమాత్రలు కలిపి తండ్రికి ఇచ్చాడు. దానిని తాగి పడుకున్న కృష్ణమూర్తిని దుర్గారావు, అతని భార్య వెంకటలక్ష్మి గొంతునులిమి చంపేశారు. మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా గొనె సంచిలో కుక్కి బైక్‌పై మధ్యలో పెట్టుకుని విజ్జేశ్వరం సమీపంలోకి తీసుకెళ్ళి ముళ్ల పొదల్లో పడేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత తన తండ్రి కనపడటం లేదంటూ గ్రామంలోని బంధువుల ఇళ్లకు దుర్గారావు వెళ్లాడు. వారం తర్వాత మృతదేహం వాసన వస్తే తమ గుట్టు బయట పడుతుందని భావించి మళ్ళీ భార్యభర్తలిద్దరూ 18న రాత్రి కిరోసిన్ తీసుకెళ్ళి చీకట్లో మృతదేహాన్ని తగలబెట్టారు. అనంతరం 21న తండ్రి కనపడటం లేదంటూ దుర్గారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 26న ఈవిషయమై దుర్గారావుకు, లక్ష్మణరావు ముగ్గురు కుమారులకు మధ్య వివాదం జరిగింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో అతను శుక్రవారం గ్రామ వీఆర్వో వద్ద లొంగిపోయాడు. దీనిపై తాడేపల్లిగూడెం సీఐ జి.మధుబాబు, అనంతపల్లి ఎస్సై వి.వెంకటేశ్వరరావు మృతదేహం తగలబెట్టిన స్థలాన్ని పరిశీలించారు. సగం కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ముందే అనుమానం ఈ ఘటనపై పోలీసులకు ముందే అనుమానం వచ్చింది. దుర్గారావు ఫిర్యాదు చేసిన నాటి నుంచే దర్యాప్తు ప్రారంభించారు. దీంతో దుర్గారావు ఊరు వదిలిపోయాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్థానిక వీఆర్వో వద్ద తానే హత్య చేశానని వెంకట దుర్గారావు లొంగిపోయా డు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్న కొడుకులే కాలయముళ్లు
అరణియార్ చెరువులో మృతదేహం వెలికితీత మృతుడు పొన్నుస్వామిరెడ్డిగా గుర్తింపు ఆస్తి కోసం కొడుకులే చంపేశారని తల్లి ఫిర్యాదు ప్రపంచమంతా ఫాదర్స్‌డే సంబరాల్లో ఉండగా.. కుమారులే తండ్రిని పొట్టనబెట్టుకున్న సంఘటన పిచ్చాటూరు మండలం కీళ్లపూడిలో ఆదివారం వెలుగు చూసింది. ఆస్తికోసం గుట్టుచప్పుడు కాకుండా అంతం చేశారంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఉదంతం బట్టబయలైంది. వారు తండ్రి కన్నా ఆస్తే ఎక్కువనుకు న్నారు. కాలయముళ్లుగా మారి ప్రాణం తీశారు. ఎవరికీ అనుమానం రాకుండా అరణియార్ చెరువులో పూడ్చిపెట్టారు. పశువుల కాపరులు గుర్తించి సమాచా రం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని వెలికితీశారు. కీళపూడి(పిచ్చాటూరు): అరణియూర్‌లో శనివారం వెలుగు చూసిన గుర్తు తెలియుని వ్యక్తి వుృతదేహాన్ని ఆదివారం ఉదయుం అధికారుల సవుక్షంలో వెలికితీశారు. వుృతుడు ఫుల్ షర్ట్, తెల్ల పంచె ధరించి ఉండడాన్ని గుర్తించారు. షర్ట్ కాలర్‌పై ఉన్న బ్యాడ్జ్ ప్రకారం మృతుడు పుత్తూరు వుండలం తారుువూంబాపురానికి చెందిన ఇ.పొన్నుస్వామి రెడ్డి(82)గా గుర్తించారు. పిచ్చాటూరు తహసీల్దారు రమేష్‌బాబు, సీఐ సారుునాథ్, ఎస్ఐ వునోహర్ ఆధ్వర్యంలో సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరణియూర్లోనే పంచనావూ చేసి ఖననం చేశారు. పొన్నుస్వామి అదృశ్యంపై మే 10న కేసు నమోదు పొన్నుస్వామి రెడ్డి(82) మే నెల 7వ తేదీ నుంచి కని పించకుండా పోయాడని అతని భార్య కమలమ్మ మే నెల 10వ తేదీన ఫిర్యాదు చేశారని పుత్తూరు ఎస్ఐ హనువుంతప్ప తెలిపారు. పొన్నుస్వామి రెడ్డి, కవులవ్ము దంపతులకు చిన్నబ్బ, గణేష్ కొడుకులు, ఐదుగురు కువూర్తెలు ఉన్నారని పేర్కొన్నారు. తన భర్త అదృశ్యానికి తవు కొడుకులే కారణమని కవులవ్ము ఫిర్యాదులో తెలిపారని వివరించారు. ఆస్తి కోసం తండ్రి, కొడుకుల వుధ్య కోర్టులో కేసు కూడా నడుస్తోందని ఎస్ఐ చెప్పారు. ఫాదర్స్‌డే రోజునే వెలుగులోకి.. ప్రపంచవుంతా ఫాదర్స్‌డే సంబరాలు జరుపుకుంటున్న రోజునే ఆస్తికోసం కొడుకులే తండ్రిని చంపేశారన్న విషయం కీళ్లపూడిలో వెలుగులోకి రావడం అందరినీ కలచివేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సారుునాథ్ తెలిపారు. -
నాన్నలే.. నేపీలు మారుస్తున్నారు
లండన్: సాధారణంగా పిల్లల ఆలనాపాలనా అంతా తల్లే చూస్తుంది. చంటి పిల్లలు రాత్రిళ్లు ఏడ్చినా, నిద్రపోకుండా అల్లరి చేసినా లాలించో, ఆడించో జో కొట్టి నిద్ర పుచ్చడం, నేపీలు మార్చడం వంటి బాధ్యతలను తల్లులే నిర్వర్తిస్తారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పుడు గుర్రుపెట్టి నిద్రపోయే నాన్నలు.. ఇప్పుడు రాత్రిళ్లు పిల్లల నేపీలు మార్చే పనిలో పడి నిద్రను మరచిపోతున్నారట. బ్రిటన్‌లో అర్ధరాత్రి పూట చంటిబిడ్డల నేపీలు మార్చేందుకు తల్లుల కంటే తండ్రులే అధికంగా నిద్రలేస్తున్నారట. ప్రతి పది మంది తండ్రుల్లో ఏడుగురు.. పిల్లల ఆలనాపాలనా చూసేందుకు రాత్రిపూట నిద్ర లేస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అదే తల్లుల విషయానికి వస్తే ప్రతి ముగ్గురిలో ఇద్దరు మాత్రమే ఆ బాధ్యత తీసుకుంటున్నట్లు తేలింది. మొత్తం మీద నాన్నల పాత్ర క్రమేపీ పెరుగుతోందని తాజా సర్వే వెల్లడించింది. -
మీ సరదా కోసం మీ పిల్లల్ని బలి చేయకండి!
కొత్త పరిశోధన తండ్రులకు పొగతాగే అలవాటు ఉంటే, ఆ పొగ కుటుంబసభ్యులందరూ పీల్చడం (ప్యాసివ్ స్మోకింగ్)వల్ల అమాయకులైన వారి చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటుదన్న సంగతి తెలిసిందే. ఇది ఇటీవలి రెండు అధ్యయనాల్లో ఈ విషయం మరింత స్పష్టంగా తేలింది. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు దాదాపు 26 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా తేలిన విషయం ఏమిటంటే... తండ్రులకు పొగతాగే అలవాటు ఉంటే, వారి పిల్లలు పెద్దయ్యాక వారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని తేలింది. పొగతాగే తండ్రుల ఈ పిల్లలను పెద్దయ్యాక పరీక్షించి చూస్తే... గుండె నుంచి మెదడుకు రక్తాన్ని చేరవేసే ‘కెరోటిడ్’ రక్తనాళాలు బాగా సన్నబడిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఈ పిల్లలు పెద్దవారయ్యాక పొగతాగకపోయినా, ఈ పరిణామాలు సంభవించడం పరిశోధనవేత్తలను తీవ్రంగా ఆందోళన పరిచింది. దాంతో పొగతాగని తండ్రుల పిల్లలతో పోలిస్తే, పొగతాగే అలవాటున్న తండ్రుల పిల్లలకు గుండెజబ్బు, పక్షవాతం వచ్చే అవకాశాలు 1.7 రెట్లు ఎక్కువ. పిల్లలకు ఈ రిస్క్‌ను తప్పించాలంటే తండ్రులు పొగతాగడం పూర్తిగా మానేయాలని ఈ పరిశోధనవేత్తలు ‘ద సర్క్యులేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో సూచిస్తున్నారు.