సాక్షి, యశవంతపుర(కర్ణాటక): దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బాలక్క గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆరుబయట వర్షంలో మొబైల్‌ఫోన్లో ఆన్‌లైన్ క్లాస్‌తో తంటాలు పడుతుండగా, ఆమె తడవకుండా తండ్రి గొడుగుతో నిలబడిన దృశ్యం వైరల్ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
సుళ్య తాలూకాలో బాలక్క గ్రామంలో మాత్రమే నెట్ అందుబాటులో ఉండడం వల్ల పరిసర పల్లెల విద్యార్థులు ఇక్కడికే వచ్చి ఆన్‌లైన్ తరగతులు వింటున్నారు. అలాగే ఓ బాలిక సిగ్నల్ బాగా వచ్చేచోట కూర్చుని క్లాస్ వింటుండగా వర్షం రావడంతో ఆమె తండ్రి గొడుగు పట్టి కన్నప్రేమను చాటుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment