network problem
-
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జియో సేవలు!
ప్రముఖ టెలికం దిగ్గజం జియోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇన్ కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్లడం లేదని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని జియోను కోరుతూ ట్వీట్లు పెడుతున్నారు. ఈ తరుణంలో ఆన్లైన్ సర్వీసుల్లోని లోపాల్ని గుర్తించే డౌన్ డిటెక్టర్ సంస్థ..ఇప్పటి వరకు, 600కు పైగా ఫిర్యాదుల్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, నెట్వర్క్ సమస్యల్ని ఎదుర్కొంటున్న వినియోగదారులు తక్కువ మంది ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. డౌన్డిటెక్టర్లోని అవుట్‌టేజ్ మ్యాప్ మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్‌లలో ఈ సమస్య ఎక్కువగా ఉందని సమాచారం. కాగా, అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకునే సదుపాయం లేని ఈ సమయంలో.. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు ఇంటర్నెట్ బాగా పనిచేస్తోందని యూజర్లు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తలెత్తిన ఈ లోపాన్ని సరి చేసేందుకు జియో ప్రతినిధులు నిమగ్నమయ్యారు. Jio network down? Unable to make calls.#Jiodown — Mukul Sharma (@stufflistings) November 29, 2022 No volte sign since morning & so unable to make any calls. Is this how you are planning to provide 5g services when normal calls are having issues? @reliancejio @JioCare #Jiodown — Pratik Malviya (@Pratikmalviya36) November 29, 2022 What is the problem with JIO network. Unable to make calls #Jiodown #Jiodown #sanjiv070 @JioCare @reliancejio — sanjiv 070 (@SanjivV070) November 29, 2022 -
ఈ సమస్యలు మీకూ ఉన్నాయా? షాకింగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశం వేగవంతమైన 5 జీ నెట్వర్క్ సేవలకు పరుగులు తీస్తున్నక్రమంలో నెట్వర్క్ సమస్యలపై షాకింగ్ సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. వినియోగదారులకు కాల్‌డ్రాప్, కాల్ కనెక్ట్ కాకపోవడం అనేది ఎంత చికాకు కలిగిస్తుందో అందరికి అనుభవమే. తాజాగా దేశంలో 339 జిల్లాల పరిధిలోని సర్వేలో పాల్గొన్న 56 శాతం మంది యూజర్లు తమ నెట్వర్క్ బాధలను వెల్లడించారు. తీవ్రమైన కాల్ డ్రాప్, కాల్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటున్నా మన్నారు. అంతేకాదు 82 శాతం మంది ప్రజలు ఈ నెట్వర్క్ సమస్యలను అధిగమించడానికి డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ సోమవారం ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. సర్వే ప్రకారం గత 3 నెలల్లో వారి మొబైల్ ఫోన్ కాల్లలో ఎంత శాతం చెడ్డ కనెక్షన్ లేదా కాల్ డ్రాప్ సమస్యలను కలిగి ఉన్నాయనే ప్రశ్నకు సమాధానంగా, 37 శాతం మంది 20-50 శాతం సమస్యను ఎదుర్కొన్నారు. కాల్ కనెక్షన్ డ్రాప్‌పై ఇచ్చిన ప్రశ్నకు 8,364 ప్రత్యుత్తరాలు వచ్చాయి. మొత్తంగా 91 శాతం మంది తాము సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పగా, 56 శాతం మంది తమ విషయంలో సమస్య మరింత తీవ్రంగా ఉందని చెప్పారు. కాల్ నాణ్యతపై దృష్టి సారించిన సర్వే 31వేల మందిపై లోకల్ సర్కిల్స్ సర్వే చేసింది. ఇందులో టైర్ 1 నగరాల్లోని 42 శాతం మంది, టైర్ 2 నుండి 31 శాతం , టైర్ 3, 4 గ్రామీణ జిల్లాల నుండి 27 శాతం ఉన్నట్టు నివేదిక పేర్కొంది. 78 శాతం పౌరులు తప్పు కనెక్షన్ ఉన్నప్పటికీ 30 సెకన్లలోపు ఆటోమేటిక్ కాల్ డ్రాప్ సమస్య రాలేదని సర్వే తేల్చింది. డేటా లేదా వైఫై కనెక్షన్ ఉన్న 82 శాతం మంది పౌరులు తరచుగా డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఎందుకంటే వారు సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌ను పొందడం లేదా కనెక్ట్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది -
నిర్వహణలో లోపాలతోనే ఫేస్బుక్ డౌన్
లండన్: ఫేస్బుక్ దానికి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు కొన్ని గంటలు పని చెయ్యకపోవడానికి నిర్వహణ సమస్యలే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ పని చెయ్యకపోవడానికి కారణం సంస్థలో జరిగే తప్పిదాలేనని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సంతోష్ జనార్ధన్ తన బ్లాగ్ స్పాట్లో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌కి చెందిన కంప్యూటర్లు, రౌటర్లు, డేటా సెంటర్లు, కనెక్టింగ్ కేబుల్స్‌ని ఇంజనీర్లు ప్రతి నిత్యం పర్యవేక్షిస్తుంటారని ఆ సమయంలో జరిగిన తప్పిదం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏడుగంటల సేపు సేవలు నిలిచిపోయాయని వెల్లడించారు. ‘‘ప్రతీ రోజూ ఇంజనీర్లు చేసే నిర్వహణలో భాగంగానే ఒక కమాండ్ ఇచ్చారు. అయితే ఎవరూ ఊహిం చని విధంగా దాని వల్ల నెట్వర్క్ మొత్తం డౌన్ అయింది’’ అని ఆయన తెలిపారు. -
Viral: బిడ్డ చదువుకు తండ్రి గొడుగు
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బాలక్క గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆరుబయట వర్షంలో మొబైల్ఫోన్లో ఆన్లైన్ క్లాస్‌తో తంటాలు పడుతుండగా, ఆమె తడవకుండా తండ్రి గొడుగుతో నిలబడిన దృశ్యం వైరల్ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సుళ్య తాలూకాలో బాలక్క గ్రామంలో మాత్రమే నెట్ అందుబాటులో ఉండడం వల్ల పరిసర పల్లెల విద్యార్థులు ఇక్కడికే వచ్చి ఆన్లైన్ తరగతులు వింటున్నారు. అలాగే ఓ బాలిక సిగ్నల్ బాగా వచ్చేచోట కూర్చుని క్లాస్ వింటుండగా వర్షం రావడంతో ఆమె తండ్రి గొడుగు పట్టి కన్నప్రేమను చాటుకున్నాడు. చదవండి: Fathers Day: నాన్న ఎవ్రీడే వారియర్.. -
Google Meet : పూర్ కనెక్షన్‌కి సొల్యూషన్
వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం మొదలయ్యాక జనాలు ప్రత్యక్షంగా కలవడం ఆల్మోస్ట్ నేరంగానే మారింది. ఎవరికి వారు సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన పరిస్థితే ప్రస్తుతం నెలకొని ఉంది. కానీ ఆఫీసుల్లో పని చేసే వాళ్లకు, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు తరచుగా సమావేశం అవక తప్పదు. ఏడాదిన్నరగా నూటికి తొంభైశాతం సమావేశాలు వర్చువల్‌గా జరుగుతున్నాయి. అకాడమిక్ వింగ్‌లోనూ వర్చువల్ క్లాసులే రాజ్యమేలుతున్నాయి. పూర్ కనెక్షన్ వర్చువల్ మీటింగ్‌లో పాల్గొనేందుకు జూమ్, గూగుల్ మీట్ వంటి అప్లికేషన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వర్చువల్ మీటింగ్‌లో ఉన్నప్పుడు అందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి నెట్వర్క్ కనెక్షన్. మీటింగ్ మధ్యలో ఉండగా చాలా సార్లు పూర్ కనెక్షన్ నోటిఫికేషన్ రావడమనేది వర్చువల్ మీటింగుల్లో పాల్గొనే వాళ్లలో చాలా మందికి అనుభవమే. పూర్ కనెక్షన్ నోటిఫికేషన్ రావడం ఆలస్యం వర్చువల్ మీటింగ్‌కి మనం ఉపయోగించే ఫోన్, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్ తదితర డివైజ్‌ని పట్టుకుని అటు ఇటు పరిగెత్తుతూ అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పుడీ సమస్యకు చెక్ పెట్టామని చెబుతోంది టెక్ దిగ్గజం గూగుల్. ట్రబుల్ షూట్ గూగుల్ మీట్ యాప్ ద్వారా ఒకేసారి 250 మంది వర్చువల్‌గా సమావేశం అయ్యే అవకాశం ఉంది. దీంతో చాలా మంది వర్చువల్ సమావేశాలకు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో కొత్త ఫీచర్ యాడ్ చేయడం ద్వారా పూర్ కనెక్షన్ సమస్యకు సొల్యూషన్ అందిస్తోంది గూగుల్. వర్చువల్ మీటింగ్ మధ్యలో పూర్ కనెక్షన్ నోటిఫికేషన్‌తో పాటు ఆటోమేటిక్‌గా మోర్ ఆప్షన్ మెనూ బబుల్ కూడా వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ట్రబుల్షూట్, హెల్ప్ ఆప్షన్ వస్తుంది. దీన్ని ఎంచుకోగానే పూర్ కనెక్షన్ సమస్యను పరిష్కరించే రికమండేషన్స్ అక్కడ కనిపిస్తాయి. వాటిని ఫాలో అవడం ద్వారా పూర్ కనెక్షన్ సమస్యను ఎదుర్కొవచ్చని గూగుల్ చెబుతోంది. జూన్ 1 నుంచి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. డివైస్ మోడల్, ర్యామ్ కెపాసిటీ, యూసేజీ, నెట్వర్క్ కనెక్షన్లను ఆధారంగా చేసుకుని టైలర్‌మేడ్‌గా ఈ ట్రబుల్ షూట్ సజేషన్స్ ఉంటాయని గూగుల్ అంటోంది. ఈ సజెన్స్ పాటించడం ద్వారా డివైజ్ ర్యామ్, బ్యాటరీలపై ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతోంది -
మంచె ఎక్కిన ‘ఆన్లైన్’ చదువులు
సాక్షి, ఆదిలాబాద్: పచ్చని పొలంలో చక్కని మంచె... దానిపై ఇద్దరమ్మాయిలు.. ఒకరిచేతిలో ల్యాప్‌టాప్. మరొకరి చేతిలో పుస్తకం. రైతన్న ఉండాల్సిన మంచెపై వీరికి పనేంటా అనేదేగా మీ డౌట్.. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం చదువులన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి కదా. పట్టణాల్లో అయితే నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉండదు. కానీ పల్లెల్లో అలా కాదు కదా.. సెల్ సిగ్నల్స్ కోసం చెట్లు, పుట్టలు పట్టుకుని పోవాల్సిందే. పొలంలో ఎత్తుగా ఉండే మంచె ఎక్కితే సిగ్నల్స్ బాగా వస్తున్నాయని వీరిద్దరూ ఇలా సెటిలై ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సాక్షి ఫోటో జర్నలిస్ట్ దశరథ్ రజువా ఈ దృశ్యాన్ని తన కెమరాలో బంధించారు. ఇక వీరిద్దరితో పాటు మరో విద్యార్థిని ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (చదవండి: ఆన్లైన్ చదువులు సాగేనా ! ) ( మంచెపైకి ఎక్కి చదువుకొంటున్న జరీన్ ) నిర్మల్ జిల్లాలోని రాజారా గ్రామంలో నివసిస్తున్న జరీన్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ (టీఎంఆర్ఎస్) లో చదువుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ క్లాస్‌లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి చాలా గ్రామాల్లో సిగ్నల్ ప్రాబ్లమ్. ఫోన్ మాట్లాడాలంటే డాబా పైకి చేరాల్సిందే. అలాంటిది ఇక ఆన్లైన్ క్లాస్‌లు వినాలంటే ఇదిగో ఇలా మంచెలు ఎక్కాలి. జరీన్ కూడా అదే పని చేస్తోంది. చదువు కోవడం కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని పొలానికి వెళ్లి మంచె పైకి చేరి.. చేతిలో మొబైల్ పట్టుకుని ఆన్లైన్లో చేప్తోన్న పాఠాలను శ్రద్ధగా వింటూ నోట్స్ రాసుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. -
ఎయిర్‌టెల్‌కు థ్యాంక్స్ చెప్పిన పూజా
హీరోయిన్ పూజ హెగ్డే ఎయిర్‌టెల్‌కు థ్యాంక్స్ చెప్పారు. వివరాల్లోకి వెళితే.. పూజా ఇటీవల ఎయిర్టెల్ సర్వీస్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్టెల్ సర్వీస్ చాలా చెత్తగా ఉందన్న పూజా.. రాంగ్ బిల్లింగ్ చేస్తున్నారని, కస్టమర్ సర్వీస్ బాగోలేదని విమర్శించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. అయితే దీనికి ఎయిర్టెల్ స్పందిస్తూ.. పూజాకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. అలాగే సమస్యను పరిష్కరించామని రిప్లై ఇచ్చింది. దీనికి బదులిచ్చిన పూజా.. ‘అవును.. చివరకు సమస్య పరిష్కారమైంది. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. నా ఫిర్యాదు మిగతా ఎయిర్టెల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందడానికి తోడ్పడిందని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ఇటీవల ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంతో హిట్ అందుకున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. Yes.The issue has finally been sorted.Thank you for your prompt help and service Anshuman @airtelindia 🙂👍🏼 Hoping that my complaints about the 198/121 number service will help in improving the overall service for all Airtel users since the connectivity etc is already fantastic🙂 https://t.co/v028Qvh8I8 — Pooja Hegde (@hegdepooja) February 3, 2020 -
సారూ.. చెట్టులెక్కగలవా?
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఏదో అద్దంలో చూస్తూ మురిసిపోతున్నట్లుగా ఉంది కదూ. ఈయన మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సంజీవరాయుడు అనే ఉపాధ్యాయుడు. బయోమెట్రిక్ హాజరు వేసేందుకు తరగతి గదిలోనుంచి బయటికి వచ్చి ఇలా అగచాట్లు పడుతున్నాడు. సాక్షి, ఆళ్లగడ్డ రూరల్ : ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు చెట్లు, పుట్టలు ఎక్కాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం వీరిని మానసిక ఆందోళనలకు గురిచేస్తోంది. పాఠశాలకు హాజరైన వెంటనే, అలాగే వెళ్లే సమయంలో అందులో వేలి ముద్రలు నమోదు చేయాలి. అప్పుడే వారికి హాజరు నమోదవుతుంది. ఏ మాత్రం ఆలస్యమైనా, లేదా వేలి ముద్రలు నమోదు కాకపోయినా ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరి వారు రెడ్‌జోన్ పరిధిలోకి చేరి చర్యలకు గురవుతారు. ఉపాధ్యాయుల హాజరు మెరుగుపర్చడానికే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టినా..అమలులో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. సిగ్నల్ అందక రోడ్లమధ్యలో, మిద్దెలపై, చెట్లపై ఎక్కుతూ అష్టకష్టాలు పడే పరిస్థితి దాపురించింది. అందని సిగ్నల్స్.. జిల్లాలో జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలు 2,404, ఏపీ మోడల్ స్కూల్స్ 35, కస్తూర్బా విద్యాలయాలు 53, మున్సిపల్ స్కూళ్లు 141, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 78 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 3.84 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు 14,398 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు కచ్చితంగా సమయపాలన పాటించేలా 2015–16 విద్యాసంవత్సరం చివర్లోనే విద్యాశాఖ బయోమెట్రిక్ పరికరాలను పాఠశాలలకు అందజేసింది. గతేడాది నుంచి బయోమెట్రిక్ హాజరు కచ్చితంగా అమలు చేస్తున్నారు. అయితే మారుమూల పల్లెల్లోని పాఠశాలల్లో నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సిగ్నల్స్ సమస్యలు అధికంగా ఉన్నాయి. పట్టించుకునేవారేరీ? ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు, ఓబుళంపల్లి, ఆర్.కృష్ణాపురం, అహోబిలం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉయ్యాలవాడ మండలంలోని హరివరం, తుడుములదిన్నె, రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురం, కోటకొండ గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 2జి సిగ్నల్ మాత్రమే వస్తోంది. 3జి, 4జి సిగ్నల్స్ వచ్చినప్పుడే యంత్రాలు బాగా పనిచేస్తాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదుకు అందించిన యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. ప్రతి రోజూ ఇబ్బందులే. పల్లె ప్రాంతం కావడంతో సిగ్నల్స్ సరిగ్గా అందడం లేదు. ఒక్కోసారి 11గంటల సమయంలో పనిచేస్తాయి. పాఠశాల పనివేళల్లో పనిచేయడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –రమణయ్య, పేరాయిపల్లె, హెచ్ఎం మానసిక ఒత్తిడికి గురవుతున్నాం బయోమెట్రిక్ విధానం బాగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒత్తిడికి గురికావాల్సి వస్తోంది. ఈ విధానంలో ఎల్లో, గ్రీన్, రెడ్ జోన్లను కేటాయించారు. పాఠశాల సమయం దాటి 20 నిమిషాలు ఆలస్యమైనా రెడ్‌జోన్‌లో పడితే సెలవు కింద తీసుకుంటుంది. 10 నిమిషాలు ఆలస్యం అయితే గ్రీన్ జోన్‌కింద పడి ఇలా ఐదు రోజులు జరిగితే ఉపాధ్యాయులకు మెమోలు వస్తున్నాయి. సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాకే ఈ విధానం ప్రవేశపెట్టింటే బాగుండేది. –రామనందకిశోర్, ఉపాధ్యాయుడు -
ఈ–పాస్ కష్టాలు ఇంతింత కాదయా..
రామాయంపేట(మెదక్): రేషన్ దుకాణాల్లో అమర్చిన ఈ–పాస్ మిషన్లతో లబ్ధిదారులు నానా కష్టాలు పడుతున్నారు. ఓ వైపు వేలి ముద్రలు గుర్తించక ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు సిగ్నల్ కష్టాలూ వెంటాడుతున్నాయి. మండల పరిధిలోని దంతేపల్లి గ్రామంలో సిగ్నల్ రాకపోవడంతో ఆ రేషన్ డీలర్ ఈ–పాస్ మిషన్‌ను పొలాల వద్దకు తీసుకెళ్లి లబ్ధిదారులతో వేలి ముద్రలు వేయిస్తున్నాడు. దీంతో లబ్ధిదారులు రేషన్‌షాపుకు బదులుగా పొలాల వద్దకూ వెళ్లక తప్పని దుస్థితి నెలకొంది. -
రేషన్‌కు నెట్వర్క్ తిప్పలు
చౌటుప్పల్ : రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలు లబ్ధిదారులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. నెట్వర్క్ ఆధారంగా నడిచే ఈ–పాస్ యంత్రాలు సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అయినా ఒక్కోసారి ఫలితం లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలంలోని జైకేసారంలో ఆదివారం రేషన్‌డీలర్, లబ్ధిదారులు ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంపైకి ఎక్కారు. డీలర్ తూర్పింటి భూపాల్ ఇంట్లో సరిగ్గా నెట్వర్క్ రావడం లేదు. దీంతో ఆయన భార్య భాగ్య ఈ–పాస్ యంత్రాన్ని తీసుకుని గ్రామ పంచాయతీ భవనంపైకి వెళ్లింది. లబ్ధిదారులు సైతం ఆమె వెంట వెళ్లారు. అక్కడ యంత్రానికి సిగ్నల్స్ అందడంతో వారికి టోకెన్ జారీ చేశారు. టోకెన్ల ఆధారంగా డీలర్ ఇంట్లో సరుకులు తీసుకెళ్లారు. వేలిముద్రలు వేసేందుకు వృద్ధులు గ్రామ పంచాయతీ భవనంపైకి ఎక్కి కిందికి దిగేం దుకు అవస్థలు పడ్డారు. సరైన సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపా«ధ్యక్షుడు పల్లె మధుకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కస్టమర్లకు ఐడియా షాక్!
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఐడియా నెట్ వర్క్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్స్ ప్రాబ్లమ్ తో సతమవుతున్నారు. ఒక్కో సమయంలో కనీసం బీప్ కూడా అవకుండానే ఫోన్ కాల్స్ తొలి డయల్ కే కట్ అయిపోతున్నాయి. దీంతో తమ ఫోన్లకు సమస్యలు ఏర్పడ్డాయా.. లేక నెట్ వర్క్కా అని తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. మొత్తం నగరమంతటా కూడా శనివారం ఉదయం ఇదే సమస్య తలెత్తింది. ఇప్పటికే పలువురు అసలు తమ ఐడియా నెట్ వర్క్ పనిచేయడం లేదని, సిగ్నల్స్ రావడం లేదని చెబుతున్నారు. దీనిపై సదరు నెట్ వర్క్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. కొంతమంది వినియోగదారులు మాత్రం సిగ్నల్స్ వచ్చి వెంటనే పోతున్నాయని, కాల్స్ కూడా వెంటవెంటనే కట్ అయిపోతున్నాయని చెబుతున్నారు.