సాక్షి, ఆదిలాబాద్: పచ్చని పొలంలో చక్కని మంచె... దానిపై ఇద్దరమ్మాయిలు.. ఒకరిచేతిలో ల్యాప్‌టాప్. మరొకరి చేతిలో పుస‍్తకం. రైతన్న ఉండాల్సిన మంచెపై వీరికి పనేంటా అనేదేగా మీ డౌట్.. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం చదువులన్నీ ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి కదా. పట్టణాల్లో అయితే నెట్‌వర్క్ ప్రాబ్లమ్ ఉండదు. కానీ పల్లెల్లో అలా కాదు కదా.. సెల్ సిగ్నల్స్ కోసం చెట్లు, పుట్టలు పట్టుకుని పోవాల్సిందే. పొలంలో ఎత్తుగా ఉండే మంచె ఎక్కితే సిగ్నల్స్ బాగా వస్తున్నాయని వీరిద్దరూ ఇలా సెటిలై ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సాక్షి ఫోటో జర్నలిస్ట్ దశరథ్ రజువా ఈ దృశ్యాన్ని తన కెమరాలో బంధించారు. ఇక వీరిద్దరితో పాటు మరో విద్యార్థిని ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (చదవండి: ఆన్‌లైన్ చదువులు సాగేనా ! )
( మంచెపైకి ఎక్కి చదువుకొంటున్న జరీన్ )
నిర్మల్ జిల్లాలోని రాజారా గ్రామంలో నివసిస్తున్న జరీన్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ (టీఎంఆర్ఎస్) లో చదువుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాస్‌లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి చాలా గ్రామాల్లో సిగ్నల్ ప్రాబ్లమ్. ఫోన్ మాట్లాడాలంటే డాబా పైకి చేరాల్సిందే. అలాంటిది ఇక ఆన్‌లైన్ క్లాస్‌లు వినాలంటే ఇదిగో ఇలా మంచెలు ఎక్కాలి. జరీన్ కూడా అదే పని చేస్తోంది. చదువు కోవడం కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని పొలానికి వెళ్లి మంచె పైకి చేరి.. చేతిలో మొబైల్ పట్టుకుని ఆన్‌లైన్‌లో చేప్తోన్న పాఠాలను శ్రద్ధగా వింటూ నోట్స్ రాసుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment