
బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
సాక్షి, కోలారు (కర్ణాటక): ఒకే కుటుంబంలో ఐదు మంది ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కోలారు నగరంలోని కారంజికట్ట కాలనీ 4వ క్రాస్‌లో చోటుచేసుకుంది. మునేశప్ప (75), భార్య నారాయణమ్మ (70), కుమారుడు బాబు (45), కూతురు పుష్ప (33), మనవరాలు గంగోత్రి (17) ఆదివారం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోబోయారు. మునేశప్ప కుమార్తె పుష్ప వేరొకరికి మగబిడ్డని విక్రయించిందని ఆరోపణపై కోలారు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
దీంతో పరువు పోయిందని కుంగిపోయిన కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగారు. స్థానికులు వీరిని ఎస్‌ఎన్‌ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. నగర పోలీసులు కేసు నమోదు చేశారు.