aligations
-
క్యూబాలో చైనా గూఢచారులు
వాషింగ్టన్: కమ్యూనిస్ట్ చైనా తమ పొరుగు దేశం క్యూబాలో 2019 నుంచి గూఢచార స్థావరాన్ని నడుపుతోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా నిఘా సమాచార సేకరణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్న ప్రయత్నాల్లో ఇదో భాగమని పేర్కొంది. పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ అధికారి ఈ మేరకు డ్రాగన్ దేశంపై ఆరోపణలు గుప్పించారు. క్యూబాలోని చైనా నిఘా కేంద్రంపై అమెరికా నిఘా సంస్థలు ఓ కన్నేసి ఉంచాయని ఆయన తెలిపారు. చైనా నిఘా కార్యకలాపాల విస్తరణ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నాలను బైడెన్ ప్రభుత్వం ముమ్మరం చేసిందన్నారు. దౌత్యపరమైన, ఇతర మార్గాల్లో చేపట్టిన ఈ ప్రయత్నాలు కొంత సఫలీకృతమయ్యాయని ఆయన అన్నారు. అమెరికాకు అత్యంత సమీపంలో ఉన్న క్యూబా గడ్డపై నుంచి చైనా గూఢచర్యం కొత్త విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని తమ నిఘా వర్గాలు అంటున్నాయని ఆ అధికారి ఉటంకించారు. అట్లాంటిక్ సముద్రం, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా, ఇండో–పసిఫిక్ ప్రాంతాల్లో నిఘా కేంద్రాల ఏర్పాటుకు చైనా యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే క్యూబాలోని నిఘా కేంద్రాన్ని 2019లో చైనా అప్‌గ్రేడ్ చేసిందని ఆ అధికారి వివరించారు. క్యూబాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరణ వ్యవస్థ ఏర్పాటుపై రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్లు గురువారం వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో కథనం వచ్చింది. బదులుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్యూబాకు భారీగా ముట్టజెప్పేందుకు చైనా సిద్ధమైందని కూడా అందులో పేర్కొంది. అయితే, వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని క్యూబా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఖండించారు. -
‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’
చండీగఢ్: పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె అమెరికా నుంచి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సిద్ధూ, డబ్బుల కోసం తల్లినే విడిచిపెట్టాడని, అతను డబ్బు కోసం ఏదైనా చేస్తాడంటూ ఆరోపించారు. ‘ మేము చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం.. మా తల్లి నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో ఉంది. సిద్ధూ అసలు పట్టించుకోలేదు. ఇది అసత్య ఆరోపణలు కావు.. దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. కేవలం ఆస్తుల కోసం తమతో సంబంధాలను తెంచుకున్న క్రూరమైన వ్యక్తిగా సిద్ధూ’ అని ఆమె పేర్కొంది. 1986 సంవత్సరంలో తమ తండ్రి చనిపోయిన తర్వాత.. తల్లిని దిక్కులేని స్థితిలో వదిలేశారని వాపోయింది. ఆ తర్వాత మా తల్లి 1989లో ఒక అనాథ మహిళగా ఢిల్లీ రైల్వేస్టేషన్లో చనిపోయిందని యూఎస్ నుంచి సుమన్ తూర్ ఆవేదన వ్యక్తం చేసింది. అదే విధంగా 1987 ఇండియాటుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సిద్ధూ.. తల్లిదండ్రుల గురించి అసత్యాలే చెప్పాడని ఆరోపించింది. అదే విధంగా గత జనవరి 20న సిద్దూని కలవడానికి పంజాబ్ వెళ్లానని కనీసం తలుపులు తీయలేదని.. సుమన్ తూర్ తెలిపారు. తనను చాలా సేపు ఇంటి బయటే నిలబెట్టి అవమానర్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న నాకు .. నా సోదరుడు ఫోన్లో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడని వాపోయింది. చనిపోయిన నా తల్లికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని సుమన్ తూర్ అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ సోదరి చేసిన ఆరోపణలు పంజాబ్ కాంగ్రెస్‌లో హీట్‌ను పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలతో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. #WATCH | Chandigarh: Punjab Congress chief Navjot Singh Sidhu's sister from the US, Suman Toor alleges that he abandoned their old-aged mother after the death of their father in 1986 & she later died as a destitute woman at Delhi railway station in 1989. (Source: Suman Toor) pic.twitter.com/SveEP9YrsD — ANI (@ANI) January 28, 2022 -
ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు దిక్కులు
సాక్షి, ముంబై(మహరాష్ట్ర): బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు దిక్కుల వంటివని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. శనివారం తిరంగా యాత్ర బహిరంగ సభ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత నసీమ్ ఖాన్ ఆదివారం ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం కోటా గురించి ఎంఐఎం ఎందుకు నోరు విప్పలేదని ఆయన ప్రశ్నించారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్ కోటా గురించి బాంబే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అప్పటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదన్నారు. అప్పుడు తాము కోటా గురించి పోరాడుతుంటే ఎంఐఎం చడీ చప్పుడు లేకుండా ఉందన్నారు. తమ పార్టీ నాయకులు శాసన సభలో తమ గళాన్ని వినిపించినప్పుడు ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు. అప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ ప్రభుత్వానికి సహకరించారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ ఎప్పుడు బీజేపీకి మద్దతుగా ఉండేందుకే పనిచేస్తుందని ఆరోపించిన నసీమ్ ఖాన్.. అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలకు ఎన్నికల సమయంలో మాత్రమే ముస్లిం రిజర్వేషన్ల అంశం గుర్తుకు వస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరికి వచ్చినందునే వారికి ఈ అంశం గుర్తుకు వచ్చిందన్నారు. ముస్లింలకు కోటా కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎం నిజ స్వరూపమేంటో ముస్లింలు అందరికీ తెలుసని పేర్కొన్న నసీమ్ ఖాన్.. ముస్లింల కోసం ఒవైసీ, ఎంఐఎం పార్టీ ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: మిస్ యూనివర్స్‌గా భారత యువతి -
బెళగావిలో ఇక సెగలే
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): భిన్న సంస్కృతులకు వేదికైన బెళగావిలోని రెండో అసెంబ్లీ భవనం సువర్ణసౌధ శీతాకాల శాసనసభ సమావేశాలకు ముస్తాబైంది. సోమవారం ఉదయం నుంచి పదిరోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎం, విపక్ష నేతలు, మంత్రులు సహా ఉన్నతాధికారులు బెళగావికి చేరుకున్నారు. బొమ్మై సీఎం అయ్యాక జరుగుతున్న రెండో అసెంబ్లీ సమావేశాలు కాగా, అనేక ముఖ్య అంశాలతో సర్కారుపై దాడికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. కరోనా సమస్య, మేకెదాటు ఆనకట్ట, బిట్కాయిన్ల స్కాం, వరదల్లో జనం నష్టపోవడం, నిత్యావసర ధరల పెంపు ఇలా అనేక వైఫల్యాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ధీమాగా ఉన్నారు. కమీషన్ల ఆరోపణలు.. రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో 40 శాతం కమీషన్ నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సంబంధిత మంత్రులు సమాధానం ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రజాపనులు, జలవనరుల శాఖలపై ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు వరదమయం అయ్యాయి. అక్కడి ప్రజలకు పరిహారం అందజేయడంతో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తనున్నారు. రాష్ట్రంలో సుమారు 35 వేల ఇళ్లు దెబ్బ తిన్నాయి. ఇప్పటికి రూ.204 కోట్ల పరిహారం విడుదల చేశారు. మత మార్పిడి చట్టం రగడ.. రాష్ట్రంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టం తెస్తామని సీఎం ప్రకటించడం వివాదాస్పదమైంది. పలు మత సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రధాన ప్రతిపక్షం కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. సీఎం బొమ్మై మాత్రం కచ్చితంగా చట్టం చేస్తామని చెబుతున్నారు. తొలిరోజు నుంచే రభస జరిగేలా ఉంది. బెంగళూరు సమీపంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నమేకెదాటు ప్రాజెక్టును ఎందుకు నిర్మించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఎందుకు అనుమతులను తెచ్చుకోవడం లేదనేది చర్చకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు మంగళవారం విడుదల కానున్న 25 ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ఈ సమావేశాలపై ప్రభావం చూపవచ్చు. చదవండి: ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి.. -
హడావుడి చేసి.. హ్యాండిచ్చారు!
సాక్షి, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు రానున్నాయి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. ఈ ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్, బీజేపీల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ పార్టీలు స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణికే మద్దతు ఇచ్చినట్లు వ్యవహరించినా.. ఓటు వేయకుండా పరోక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించారా అన్న చర్చసాగుతోంది. రాష్ట్రంలో జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదైంది. 77 మంది ఓటు వేయకపోగా, అందులో ఐదారుగురు మినహా మిగతా అందరూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులే ఉన్నారు. కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేయాలని తీర్మానించారు. కానీ ఇరు పార్టీల ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండి అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తీరే వేరు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న సంఖ్యలో రెండో స్థానంలో ఆదిలాబాద్ డివిజన్ ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఓల్డ్ సమావేశ మందిరంలో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణికి పోలింగ్ ఏజెంట్‌గా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డి వ్యవహరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తనయుడు పాయల శరత్ శుక్రవారం పోలింగ్ కేంద్రం వద్ద పుష్పరాణి మద్దతుదారులైన తుడుందెబ్బ నాయకులతో చర్చిస్తూ బిజీబిజీగా కనిపించారు. పోలింగ్ మొదలైన తర్వాత ఉదయం నుంచి బీజేపీ సభ్యులను తీసుకువచ్చి పుష్పరాణికి ఓటు వేయించడంలో తోడ్పాటు అందించినట్లు ప్రత్యక్షంగా చూస్తున్నవారికి అనిపించింది. తీరా పోలింగ్ ముగిసిన తర్వాత ఈ కేంద్రంలో 20 మంది ఓటు వేయలేదని, అందులో 13 మంది బీజేపీ సభ్యులు ఉన్నారని తేలడంతో అందరు ముక్కున వేలేసుకున్నారు. మున్సిపాలిటీలో ఏడుగురు బీజేపీ కౌన్సిలర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం చర్చనీయంగా మారింది. వారు అలకబూనడంతోనే ఓటు వేయలేదనే ప్రచారం సాగుతోంది. ఒకరోజు ముందు జిల్లా నాయకత్వం ఓటు ఎవరికి వేయాలనే అంశంపై చర్చించేందుకు పిలవగా వారు అందులో పాల్గొనలేదని అంటున్నారు. ప్రధానంగా ఒక ముఖ్య నేత ఈ ఎన్నికల పరంగా వ్యవహరించిన తీరుతోనే వారు అసంతృప్తికి లోనయ్యారని చెప్పుకుంటున్నారు. ఇది బీజేపీలో లుకలుకలకు దారితీస్తోంది. కాంగ్రెస్‌ది వైరి వర్గం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వైరి వర్గం మరోసారి స్పష్టమైంది. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని పెందూర్ పుష్పరాణికి పార్టీ మద్దతు ఇస్తుందని నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థితో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. పోలింగ్ కేంద్రం వద్ద శుక్రవారం సాజిద్‌ఖాన్ పెందూర్ పుష్పరాణికి మద్దతుగా పార్టీ సభ్యులను ఓటు వేయాలని చెబుతూ కనిపించారు. అయితే కొన్ని మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యులు అధికార టీఆర్ఎస్ సభ్యులతో కలిసి రావడం చర్చనీయమైంది. మరోపక్క మంచిర్యాల, బెల్లంపల్లి పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ సభ్యులు 45 మంది ఓటు వేయకపోవడం గమనార్హం. అక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఆదేశాలతోనే వారు ఓటు వేయలేదనే ప్రచారం జరుగుతోంది. అయితే బెల్లంపల్లిలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలిచిందా.. లేదా అనే అయోమయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. -
పోలీసుల వేధింపుల వల్లనే కుటుంబం ఆత్మహత్య.. యువతి డెత్‌నోట్
సాక్షి, కోలారు(కర్ణాటక): శిశువు కిడ్నాప్ కేసు కేసులో తమను మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది వేధించారనే అవమానంతో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నగర మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని వివిధ సంఘాలు డిమాండ్ చేశాయి. కోలారు నగరంలో తల్లితండ్రులు, కొడుకు, ఆరోపణలు వచ్చిన కూతురు, మనవరాలు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఆరోపి పుష్ప రాసిన నాలుగు పేజీల డెత్‌నోట్‌లో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, కుటుంబమంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్ఐతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువ అవుతోంది. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సంఘాల కార్యకర్తలు కోరారు. -
పోలీసుల టార్చర్.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి..
సాక్షి, కోలారు(కర్ణాటక): సంబంధం లేకపోయినా పోలీసులు కేసు పెడతామని బెదిరించారనే ఆవేదనతో కుటుంబంలోని 5 మంది ఆదివారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వారిలో అందరూ కన్నుమూశారు. మునియప్ప (75), భార్య నారాయణమ్మ(70), కుమారుడు బాబు (45), మనవరాలు గంగోత్రి (17) కోలారులోని జాలప్ప ఆస్పత్రిలో సోమవారం వేకువన చనిపోయారు. కుమార్తె పుష్ప రాత్రికి కన్నుమూసింది. కేసుతో సంబంధం లేదన్నా.. వివరాలు.. నగరంలోని గల్‌పేట పరిధిలోని కారంజికట్టలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 18వ తేదీన తాలూకాలోని హొన్నేహళ్లి గ్రామానికి చెందిన సత్య, సుమిత్ర దంపతుల ఆడ శిశువును వారికి తెలిసిన మహిళ ఎత్తుకెళ్లింది. ఇందులో పుష్ప కూడా నిందితురాలని కోలారు నగర మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసులు.. గీతా, పుష్పలను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా ఏ సంబంధం లేదని పుష్ప తెలిపింది. నేరం ఒప్పుకోక పోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు ఆమెను ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో పుష్ప, ఆమె కుటుంబీకులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబం పరువు పోతుందనే ఆవేదనతో ఆదివారం ఐదుగురూ కలిసి పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక మృతి చెందారు. చదవండి: పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేస్తున్నాడు! -
కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు..
సాక్షి, కోలారు (కర్ణాటక): ఒకే కుటుంబంలో ఐదు మంది ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కోలారు నగరంలోని కారంజికట్ట కాలనీ 4వ క్రాస్‌లో చోటుచేసుకుంది. మునేశప్ప (75), భార్య నారాయణమ్మ (70), కుమారుడు బాబు (45), కూతురు పుష్ప (33), మనవరాలు గంగోత్రి (17) ఆదివారం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోబోయారు. మునేశప్ప కుమార్తె పుష్ప వేరొకరికి మగబిడ్డని విక్రయించిందని ఆరోపణపై కోలారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పరువు పోయిందని కుంగిపోయిన కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగారు. స్థానికులు వీరిని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. నగర పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ప్రియునికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి.. -
పదవి కోసమే ఆదినారాయణరెడ్డి ఆరోపణలు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు కేవలం కేంద్రంలో పదవి కోసమే.. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ భిక్ష పెట్టినవారిపై ఆరోపణలు చేయడం తగదు. స్వప్రయోజనాల కోసం సంస్కారం మరిచిపోవద్దు అని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత. కేంద్రంలో అధికారం ఉన్నామన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితం అయ్యింది. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి బీజేపీది’’ అని విమర్శించారు. ‘‘బీజేపీ నేతలు మంది మార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదు. నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. విభజన చట్టంలో హామీలు నేరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. ప్రత్యేక హోదా, దుర్గరాజపట్నం, స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేస్తాం. వ్యక్తిగతంగా దూషణలు, ఆరోపణలు చేయడం సంస్కారం కాదు. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పారు’’ అని తెలిపారు. ‘‘సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తాం. ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ది. సోమశిల విషయంలో పెండింగ్‌లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి ఒన్ టైం సెటిల్ మెంట్ చేశాం అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ‘‘మా ప్రభుత్వంపై చంద్రబాబు కావాలని బురద జల్లుతున్నారు. చంద్రబాబు లాగా.. మేము అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ప్రజాబలం ఉన్నప్పుడు మాకు ఇంకో బలం అవసరంలేదు. టీడీపీ ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడ్డం అనవసరం. మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత వంగి వంగి దండాలు పెట్టారు.. ఏదోరకంగా ప్రచారం కావాలని టీడీపీ కోరుకుంటున్నారు.. చంద్రబాబు గురించి అందరికి తెలుసు’’ అన్నారు. చదవండి: ఏపీలో చంద్రబాబు కొత్తగా బూతు రాజకీయాలు తెచ్చారు: ఎంపీ భరత్ -
HMDA: స్వీపర్లకు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేధింపులు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ సర్కిల్ పరిధిలోని శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ)ల ఆగడాలు రోజు రోజుకు తారా స్థాయికి చేరుతున్నాయి. చివరకు డబ్బులిస్తేనే ఉద్యోగం చేయాలని అన్నట్లు వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు నిత్యం వెల్లువెత్తుతున్నాయి. నెల జీతం వచ్చిందంటే చాలు అప్పులోల్ల వలే ఇచ్చేదాక వెంటపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వని వారిని నయాన్నో, భయాన్నో దారిన తెచ్చుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే వేధింపులు గురిచేస్తూ స్వీపర్లను నానా హింసలు పెడుతున్నట్లు బాధితులు బాహాటంగానే ఫిర్యాదులు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారికి అత్యవసర సమయాల్లో సెలవులు ఇవ్వరు. మెడ తిప్పనీయకుండా పనులు చెబుతూ ఆజమాయిషి చేలాయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా బయోమెట్రిక్ వారి చేతులోనే ఉంటుంది కావునా ఆడిందే ఆటగా ఎస్ఎఫ్ఎలు చలామని అవుతున్నారు. ఇదే విషయం ఉన్నతాధికారులకు తెలిసినా సున్నితంగా మందలించి వదిలేస్తూ పట్టీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఒక్కో స్వీపరు వద్ద ప్రతినెలా రూ. 500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. లేకపోతే వేధింపులు తప్పవని బాధితులు కిమ్మనకుండా అడిగినంతా ఇచ్చుకుంటున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్ సర్కిల్లో ఎస్ఎఫ్ఎలు 22 మంది, జవాన్లు 11 మంది, 476 మంది స్వీపర్లు నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శానిటరీ సూపర్ వైజర్ ఆధీనంలో ఉంటూ పనిచేస్తున్నారు. ప్రస్తుతం డీఈ స్థానంలో గతంలో ఏఎంఓహెచ్ ఉండే వారు. గత సంవత్సర కాలంగా ఉప్పల్ సర్కిల్లో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. అదే స్థానంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ డీఈని అపాయింట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. ఎస్ఎఫ్ఐల వేధింపులు మా దృష్టికి రాలేదు. వేధింపులకు పాల్పడే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవ్వరైన ఉంటే నేరుగా సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – చందన, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ డీఈ చదవండి: West Godavari: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి -
టీఎంసీ నన్ను చంపాలని చూస్తోంది: బీజేపీ ఎంపీ
సాక్షి, కోల్‌కతా: టీఎంసీ నేతలు తనను చంపాలని చూస్తున్నారంటూ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపణలు చేశారు. ఆయన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 9.10 గంటలకు బాంబు పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8న కూడా బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్‌లో ఉన్న ఆయన ఇంటి వెలుపల ఓ పేలుడు సంభవించింది. కొందరు వ్యక్తులు ఆయన ఇంటి గేటుపై బాంబులు విసిరారు.ఈ కేసు విచారణను ప్రస్తుతం ఎన్ఐఏ చూస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది. పేలుడు అనంతరం ఆయ మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ దాడులు వెనుక ఉందని ఆరోపించారు. తనను, తన సన్నిహితులను చంపేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బెంగాల్లో ప్రస్తుతం గూండారాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను నార్త్ 24 పరగణాస్ అధ్యక్షుడు పార్థ భౌమిక్ ఖండించారు. ఆయా పేలుళ్లకు బీజేపీ ఎంపీనే ఏదో ఒక రకంగా కారణమైఉంటారని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, అధికారులు ఘటనా స్థలంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. చదవండి: బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ -
రాసలీలల సీడీ కేసు: ఆ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు..!
సాక్షి బెంగళూరు(కర్ణాటక): ఎటువంటి ఆరోపణలు లేనివారికే మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయంతో పలువురు ఎమ్మెల్యేలకు గుబులు పట్టుకుంది. వీరిలో వీడియోల సీడీల నాయకులూ ఉన్నారు. రమేశ్ జార్కిహొళి సీడీలు బయటపడినప్పుడు తమ సీడీలు ఏవైనా ఉంటే ప్రసారం చేయరాదంటూ అప్పటి మంత్రులు కొందరు కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకోవడం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అలాగే బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా వేరే వేరే కారణాలతో తమ పరువుకు నష్టం కలిగించే వార్తలు ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. పదవి ఇచ్చాక విడుదలైతే సమస్య.. సీడీతో పాటు ఇతరత్రా ఆరోపణలుంటే మంత్రిమండలిలోకి తీసుకోరాదని అధిష్టానం, ఆర్ఎస్ఎస్ పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. సదరు ఎమ్మెల్యేలను మంత్రులుగా చేస్తే ఆ తర్వాత వారి సీడీలు ఏవైనా విడుదలయితే అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హైకమాండ్ భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే సీడీ భయంతో కోర్టును ఆశ్రయించిన వలస ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే అది సర్కారు మనుగడకు ఇబ్బందికరమేనని చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వలస ఎమ్మెల్యేలు, సీడీల ఆరోపణలున్నవారి భవిత ఉత్కంఠగా తయారైంది. -
వివాదాల్లో ఖాకీలు: ఏడాదిలో 17 మంది ఎస్సైలపై వేటు..
పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నా.. తీరు మారడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో ఒక ఏసీపీ, ఓ సీఐ, 17 మంది ఎస్సైలు, 10 మంది వరకు కానిస్టేబుళ్లపై చర్యలు చేపట్టినా వ్యవస్థలో మార్పు రావడం లేదు. సాక్షి, నల్లగొండ: శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీస్ అధికారులు పక్కదారి పడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో భూవివాదాలు, సెటిల్మెంట్లు, ఇసుక మాఫియాతో బేరసారాలు సాగించి శాఖకే మచ్చ తీసుకువస్తున్నారు. కేసులను నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో పలువురు పోలీసులు సస్పెన్షన్‌కు గురికాగా, అత్యాచారం, హత్య, లాకప్‌డెత్ వంటి కేసుల్లో చిక్కుకుని మరికొందరు సిబ్బంది ఉద్యోగాలే పోగొట్టుకున్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 11 మంది పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలోనే 9మందిపై చర్యలు చేపట్టగా.. భూవివాదాల్లో జోక్యం చేసుకున్నందుకు సోమవారం డిండి, పెద్దవూర ఎస్సైలపై చర్యలు చేపట్టారు. సూర్యాపేట జిల్లాలో ముగ్గురు ఎస్సైలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఐతో సహా మరో ఇద్దరు ఎస్సైలపై ఇటీవలికాలంలో వేటు పడింది. అత్యాశ.. అత్యుత్సాహం.. నిర్లక్ష్య వైఖరి వివిధ కేసుల్లో పక్కాగా వ్యవహరించాల్సిన పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. ఇదే వారిని చిక్కుల్లో పడేస్తోంది. ఆర్థికంగా త్వరగా సెటిల్ కావాలన్న అత్యాశ, రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉంటే బాగుంటుందన్న ఆలోచనలు, తద్వారా వారి ఒత్తిడితో వివిధ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఏకంగా ఉద్యోగాలకే ఎసరు వస్తోంది. కొంతమంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోగా.. మరికొంత మందిని ఉన్నతాధికారులు ఆ పోస్టుల నుంచి తొలగించి వెకెన్సీ రిజర్వులో (వీఆర్) పెట్టారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలులో బాలిక మరణానికి సంబంధించిన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని దళిత సంఘాలు ఆందోళన చేయడంతో అక్కడి ఎస్సైని ఎస్పీ రంగనాథ్ విధుల నుంచి తప్పించారు. పీఏపల్లి మండలం గుడిపల్లి ఎస్సైని భూవివాదం వ్యవహారంలో సస్పెండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మరియమ్మ లాకప్‌డెత్ కేసులో అడ్డగూడూరు ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సర్వీసు నుంచి తొలగించారు. సివిల్ వివాదాల్లో జోక్యం వద్దంటున్నా.. సివిల్ వివాదాల్లో మితిమీరిన జోక్యమే ఎస్సైలను ఇబ్బందుల్లో పడేస్తోంది. ల్యాండ్ సెటిల్మెంట్లలో పోలీసుల జోక్యంపై బాధితులు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి చర్యలు చేపడుతున్నారు. దీనికి తోడు ఇసుక దందాలోనూ రాజకీయ నాయకులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు. మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, మునుగోడు, ఆలేరు, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లోనే ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ► నల్లగొండ జిల్లాలోని నేరెడుగొమ్ము, గుర్రంపోడు, మర్రిగూడ, చండూరు, నాంపల్లి, నిడమనూరు, డిండి, పెద్దవూర ఎస్సైలను భూవివాదాలు, ఇతర ఆరోపణలతో వీఆర్‌లో పెట్టారు. ► యాదాద్రి భువనగిరి జిల్లాలో అవినీతి, ఆర్థిక లావాదేవీలు, సెటిల్మెంట్ల ఆరోపణలతో నాలుగు నెలల కిందట ఆలేరు ఎస్సై, రామన్నపేట సీఐ, ఎస్సైలను వీఆర్‌లో పెట్టారు. మరియమ్మ లాకప్‌డెత్ కేసులో అడ్డగూడూరు ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించగా చౌటుప్పల్ ఏసీపీని అటాచ్ చేశారు. ► సూర్యాపేట జిల్లాలో గడిచిన ఆరు నెలల కాలంలో వివిధ ఆరోపణలతో నేరేడుచర్ల, మఠంపల్లి, ఆత్మకూర్ ఎస్ఐలను జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్ చేశారు. మరో 9 మంది కానిస్టేబుళ్లను అటాచ్ చేయగా, సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. -
ఆయన గతమంతా బెదిరింపులు, వేధింపులే..!
నేరాలే ఆయన చరిత్ర.. దౌర్జన్యాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లే దినచర్య.. రౌడీ మూకలను వెంటేసుకొని కనిపించిన స్థలాలు, భూములను కబ్జా చేసే అతగాడు ఖద్దరు ముసుగేసుకొని రాజకీయ నేతగా చెలామణీ అయిపోతున్నాడు. ఒకప్పడు ఖాకీలను చూస్తే వణికిపోయే.. ఈ ఖద్దరు ముసుగు నేత ఇప్పుడు పచ్చ కండువా వేసుకొని పెచ్చరిల్లిపోతున్నాడు. నగరంలో జరిగిన ఒకానొక ఉప ఎన్నికల్లో రివాల్వర్‌తో వీరంగం చేయడం.. సాక్షాత్తు మహిళా పోలీసు అధికారిని వేధింపులకు గురి చేయడం, భూకబ్జాలకు తెగబడటం వంటి కేసులతోపాటు హత్య కేసులోనూ ప్రమేయముందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు నేతను.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నెత్తికెక్కించుకోవడమే కాకుండా.. తాజాగా అతన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఎటువంటి నేరచరిత్ర, వివాదాలు లేని వ్యక్తులుగా ఎన్నికల్లో పోటీ చేయించాలన్న నిబంధనలు, నైతిక విలువలకు వలువలూడ్చే రీతిలో తెలుగుదేశం ప్రవర్తిస్తోంది. ఎప్పుడో ఎందుకు.. రెండు రోజుల క్రితమే ఓ భూకబ్జా కేసు కూడా నమోదైన సదరు నేత.. గండి బాబ్జీని ప్రస్తుత జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా.. గెలిస్తే తమ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగానూ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదిస్తున్న సదరు గండి బాబ్జీ.. కేసుల చిట్టా దండిగానే ఉంది. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగరంలో రౌడీయిజం, నేరాలు, దౌర్జన్యాలతో రాజకీయాన్ని కలుషితం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే. వంగవీటి రంగా హత్య కేసులో మూడో ముద్దాయిగా ఉండి.. విజయవాడ నుంచి విశాఖకు పారిపోయి వచ్చి తలదాచుకున్న వెలగపూడి రామకృష్ణకు రాజకీయ ఆశ్రయం కల్పించి.. ఎమ్మెల్యేగా ప్రజలపై రుద్దిన చరిత్ర ఆ పార్టీదే. అలా ఎదిగిన ఆయనగారు కోడి పందాలు, లిక్కర్ సిండికేట్, రౌడీ గ్యాంగులు సెటిల్మెంట్ దందాలతో చెలరేగిపోతున్న వెలగపూడికి తోడు పెందుర్తి నియోజకవర్గానికి చెందిన గండి బాబ్జీని ప్రజాప్రతినిధిగా నగర ప్రజలపై రుద్దేందుకు తెలుగుదేశం నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు జీవీఎంసీ పాలకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో 95వ వార్డు నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గండి బాబ్జీ నామినేషన్ వేశారు. తెలుగుదేశం అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించకపోయినా.. వార్డు అభ్యర్థిగా బాబ్జీ పేరును ఖరారు చేయడమే కాకుండా.. తమ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగానూ ఆయన్ను తెరపైకి తెస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు బాబ్జీగారి నేరచరిత్రను నగర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చదవండి: 'నా టైమ్ వస్తే మిమ్మల్ని కాలితో తొక్కేస్తా' రివాల్వర్‌తో వీరంగం 2006 ఫిబ్రవరి 19న విశాఖ–1 నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో పాతపోస్టాఫీస్ వద్ద గండి బాబ్జీ రివాల్వర్‌తో బెదిరింపులకు పాల్పడటం పెద్ద సంచలనం రేపింది. దీనిపై క్రైమ్ నంబర్ 47తో కేసు నమోదైంది. అదే ఏడాది మార్చి 2వ తేదీన సిటీ కోర్టులో బాబ్జీ లొంగిపోయారు. రెండేళ్ల క్రితం ఈ కేసు క్లోజ్ అయ్యింది. 2019లో నగరానికి చెందిన మహిళ పోలీస్ అధికారి గండి బాబ్జీపై వేధింపులు, మోసం కేసు పెట్టడం సంచలనంగా మారింది. కబ్జాల బాబ్జీ పెందుర్తిలో సుమారు ఏడున్నర ఎకరాల చెరువును తప్పుడు పత్రాలతో గండి బాబ్జీ చెరబట్టారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. మొగలిపురం రెవెన్యూ పరిధిలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారు. దేవిపురం సమీపంలో దాదాపు 40 ఎకరాల డీ ఫారం, ఇనాం భూముల కబ్జా వ్యవహారంలో గండి బాబ్జీ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. స్వార్థ రాజకీయ బంధం 2017లో చంద్రబాబు సమక్షంలో గండి బాబ్జీ టీడీపీలో చేరారు. అయితే తన చిరకాల ప్రత్యర్థి అయిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తితో ఇమడలేక చాలాకాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అనూహ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బండారు–బాబ్జీ జతకట్టారు. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఒకే పార్టీలో ఉంటూ చాలాకాలం పాటు కత్తులు దూసుకున్న ఈ ఇద్దరూ స్వార్థం కోసం ఏకమయ్యారని ప్రజలు బహిరంగంగానే దుమ్మెత్తి పోశారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఎమ్మెల్యే బండారు కొడుకు అప్పలనాయుడు, బాబ్జీ తమ్ముడు రవి ఇద్దరూ ఒకే కోవకు చెందిన వ్యక్తులు. సెటిల్మెంట్లు, దౌర్జన్యాలకు పెట్టింది పేరు. రెండు రోజుల క్రితం గండిపై కబ్జా కేసు.. గండి బాబ్జీపై తాజాగా మరో కబ్జా కేసు నమోదైంది. నరసింహనగర్‌కు చెందిన లివింగ్‌స్టోన్ అనే వ్యక్తి ఈనెల 13న బాబ్జీపై ఫిర్యాదు చేశారు. లివింగ్‌స్టోన్ క్రిష్టియన్ ఫెలో షిప్ సొసైటీ అనే సంస్థను నడిపిస్తున్నారు. 1990లో బాలయ్యశాస్త్రి లేఅవుట్లో తాము కొనుగోలు చేసిన 200 చదరపు అడుగుల స్థలాన్ని గండిబాబ్జీ కబ్జా చేశారని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బాబ్జీపై ఈ నెల 13న క్రైమ్ నంబర్ 82/20తో సెక్షన్ 447, 427లతో కేసు నమోదు చేశారు. వెంట నలుగురు రౌడీషీటర్లు.. బాబ్జీ వెంట నిరంతరం నలుగురైదుగురు రౌడీ షీటర్లు ఉంటారు. బాబ్జీ ఎక్కడికి వెళ్లినా నీడలా అనుసరిస్తుంటారు. అలాంటి వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించడంతో నగర ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రౌడీ రాజకీయాలు చేసే వ్యక్తులకు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టాలనుకోవడం సరికాదంటున్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న బాబ్జీ నేరాల చిట్టా ఇదీ.. •మొత్తం కేసులు– 04 •సీరియస్ ఐపీసీ సెక్షన్లు– 03 •ఇతర ఐపీసీ సెక్షన్లు– 07 కేసులు.. సెక్షన్లు.. •ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు పంపిణీ చేస్తున్నందుకు ఐపీసీ సెక్షన్ 171 హెచ్ •సాక్ష్యాలను మాయం చేయడం, తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో ఐపీసీ సెక్షన్ 201 • క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 506 • విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో సెక్షన్ 186 • ప్రభుత్వ ఉద్యోగి వి«ధులకు ఆటంకం కలిగించిన కేసులో సెక్షన్ 188 •ఉద్దేశ పూర్వకంగా విధులకు ఆటంకం కలిగించిన కేసులో సెక్షన్ 34 • ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఎర వేసిన కేసులో సెక్షన్ 171 •మహిళ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన కేసులో సెక్షన్ 509 అప్పట్లోనే ఆరోపణలు గండి బాబ్జీ స్వగ్రామం సబ్బవరం మండలం మొగలిపురం. బీఎల్ చదివారు. అయితే స్కాలర్ షిప్ కోసం కళాశాలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చారన్న ఆరోపణలతో అప్పట్లో కేసు నమోదైంది. నాడు పెద్దలు జోక్యం చేసుకుని ఆ కేసును మాఫీ చేసినట్లు చెప్పుకుంటారు. కొన్నాళ్లు లాయర్‌గా ప్రాక్టీస్ చేసిన ఆయన కాంగ్రెస్ పంచన చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009లో హైదరాబాద్‌కు చెందిన మంజులారెడ్డి అనే మహిళ హత్య వెనుక బాబ్జీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2004 వరకు కాంగ్రెస్‌లో సాధారణ నాయకుడిగా ఉన్న బాబ్జీ.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి పరవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 63వ వార్డు టీడీపీ అభ్యర్థిదీ అదే దారి 63వ వార్డులో నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్ది గల్లా పోలిపల్లి (గల్లా చిన్నా)దీ నేరచరిత్రే. ఈయనపై 2015 డిసెంబర్ 4న కేసు నమోదైంది. డాబాగార్డెన్స్‌కు చెందిన గూడెల బాలజీ అనే వ్యక్తి నుంచి కొంత నగదును గల్లా చిన్నా అప్పుగా తీసుకున్నాడు. తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన బాలాజీపై గల్లా చిన్నా, అతని అనుచరులు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. దీనిపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గల్లా చిన్నాపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
అధికార‘పంచాయితీ’
–టీడీపీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న జిల్లా కీలక ఉన్నతాధికారి –పార్టీ పంచాయతీలకు వేదికైన కార్యాలయం –అసమ్మతి నేతలకు బుజ్జగింపూ అక్కడే –సర్వత్రా విమర్శల పాలవుతున్న తీరు ప్రజా సేవ చేయాల్సిన ఉన్నతాధికారి అధికారపార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. రాజకీయపరంగా పాలకపక్షానికి తమ వంతు సాయమందిస్తున్నారు. ఆఖరుకు పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి కూడా వెనుకాడని పరిస్థితి ఏర్పడిందని జిల్లాలో చర్చించుకుంటున్నారు. అధికార టీడీపీ చేతుల్లో పావులుగా మారిన తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజాసేవకు అంకితమవుతామని ప్రమాణం చేసి వచ్చి అధికారపక్ష సేవలో తరించడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, చిత్తూరు: రాజకీయాలకు అతీతంగా పని చేస్తూ..ప్రజల మన్ననలు పొందాల్సిన అధికారులు అధికారంలో ఉండేపార్టీలకు కొమ్ము కాస్తున్నారు. తుదకు అధికార పార్టీ నాయకుల్లో విభేదాలు తలెత్తినా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లోనే అధికారులు చక్కబెడుతున్నారు. అధికార పెద్దలకు నివేదికలు పంపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బుజ్జగింపుల పర్వం కేవలం మండలస్థాయిలో అనుకుంటే పొరబడినట్లే. జిల్లా పాలనలో కీలక భూమిక వహించే ఉన్నత స్థాయి అధికారి నేతృత్వాన జరగడం విశేషం. ఇవికో మచ్చుకు కొన్ని – కుప్పం పంచాయితీలో ఇటీవల టీడీపీలో కొందరు వార్డు సభ్యులు రాజీనామా చేసి సంక్షోభం సృష్టించారు. అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. వీరిని బుజ్జగించి దారికి తెచ్చే బాధ్యతను జిల్లా కీలక ఉన్నతాధికారి భుజాన వేసుకున్నారు. ఈ పంచాయతీని సమర్ధంగా నిర్వహించి వారిలో అసమ్మతిని చల్లార్చారు. పంచాయతీ అభివృద్ధి నామమాత్రంగా ఉందంటూ గోడు చెప్పుకొందామని కార్యాలయానికి వచ్చిన వార్డు సభ్యులకు సదరు అధికారి క్లాసు పీకారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చొద్దంటూ సలహా ఇచ్చారు. – జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ,అటవీ శాఖ మంత్రి బోజ్జల, హౌసింగ్ చైర్మన్ వర్ల రామయ్యలు ఏకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలను నేరుగా జిల్లా కీలక ఉన్నతాధికారి కార్యాలయానికి తీసుకొచ్చారు. మంతనాలు జరిపారు. టీడీపీ నాయకులకు అధికారులు అనుగుణంగా నడచుకోవాలని హుకుం జారీ చేశారు. ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరగాలని అనధికార ఆదేశాలు జారీ చేశారు. ఈ తతంగం ఆ పాలనాధికారి సమక్షంలోనే జరగడం గమనార్హం. – మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు ఎమ్మెల్సీ అయిన వెంటనే మంత్రి బొజ్జల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు, ఎంపీ శివప్రసాద్ తదితరులు రాజకీయ సమావేశం సదరు కీలక ఉన్నత అధికారి చాంబరులోనే నిర్వహించారు. ఇది ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటైన సమావేశం అనుకుంటే పొరపాటు. నీరు–చెట్టు, ఇతర నామినేషన్ పనులను టీడీపీ కార్యకర్తలకే ఇవ్వాలని అ ఉన్నతాధికారికి చెప్పారు. వారి ఆదేశాల ప్రకారం చాలా వరకు పనులు అధికార పార్టీ కార్యకర్తలకే పనులు కేటాయిస్తున్నారు. – కొన్ని రోజుల క్రితం చిత్తూరు మేయర్ కుర్చీపై టీడీపీ నాయకులతో అర్ధరాత్రివరకు సమావేశం నిర్వహించారు. టీడీపీలో ఉన్న రెండు వర్గాలను పిలిపించుకొని అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నించారు. కుమ్ములాడుకుంటుంటే పార్టీ పరువు పోతుందని సదరు ఉన్నతాధికారి స్వయంగా వ్యాఖ్యానించారని సమాచారం.