
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పెళ్లింట భోజనం చేసిన 190 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన సంఘటన దావణగెరె జిల్లా హోన్నాళి తాలూకా హోసదేవర హొన్నాళి గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేసిన వారికి అర్థరాత్రి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో వారందరినీ సమీప ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.
10 మందికి ఆరోగ్యం విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేసారు. వివాహ వేడుకలో చేసిన ఆహారాన్ని పరీక్షల కోసం దావణగెరెకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment