family attempts suicide
-
కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు..
సాక్షి, కోలారు (కర్ణాటక): ఒకే కుటుంబంలో ఐదు మంది ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కోలారు నగరంలోని కారంజికట్ట కాలనీ 4వ క్రాస్‌లో చోటుచేసుకుంది. మునేశప్ప (75), భార్య నారాయణమ్మ (70), కుమారుడు బాబు (45), కూతురు పుష్ప (33), మనవరాలు గంగోత్రి (17) ఆదివారం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోబోయారు. మునేశప్ప కుమార్తె పుష్ప వేరొకరికి మగబిడ్డని విక్రయించిందని ఆరోపణపై కోలారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పరువు పోయిందని కుంగిపోయిన కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగారు. స్థానికులు వీరిని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. నగర పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ప్రియునికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి.. -
కొత్తూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం
కొత్తూరు:చిత్తూరు జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. రామసముద్రం మండలం మూగవాడి కొత్తూరులో ఒకే కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. వీరిలో తల్లీ-కూతురు మృతి చెందగా, మరో కూతురు, కొడుకుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించి, మరో ఇద్దరు ప్రాణాలతో పోరాడుతుండటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబంలో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదమే ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. తనకు బైక్ కావాలని కొడుకు మంజునాథ్ కుటుంబ సభ్యుల్ని అడగటంతోనే గొడవ ఆరంభమైంది. అదికాస్తా పెద్దగిగా మారడంతో ఆ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.