doughter
-
చార్లీ చాప్లిన్ కూతురు మృతి.. ప్రకటనపై పలు అనుమానాలు
యావత్ ప్రపంచాన్ని తన నటనతో కట్టిపడేసిన హాస్యనటుడు చార్లీ చాప్లిన్ తెలియని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. తన కూతురు నటి జోసెఫిన్ చాప్లిన్ మరణించారని వారి కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆమె వయస్సు 74. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం.. జూలై 13న పారిస్‌లో మరణించారని పేర్కొన్నారు. ఆమె మృతి వెనుక కారణం ఇంకా వారు వెల్లడించలేదు. సుమారు 10రోజులు క్రితమే ఆమె చనిపోతే ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచారని తెలియాల్సి ఉంది. ఆమె హాలీవుడ్లో ది కాంటర్బరీ టేల్స్ , డౌన్ టౌన్,ది బే బాయ్ వంటి పదికి పైగా చిత్రాల్లో నటించారు. జోసెఫిన్ చాప్లిన్ మార్చి 28, 1949న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో చార్లీ చాప్లిన్, ఊనా ఓ'నీల్లకు జన్మించిన ఎనిమిది మంది సంతానంలో మూడవ వ్యక్తి. (ఇదీ చదవండి: అక్కా పిల్లల్ని ఎప్పుడు కంటారంటూ శివ జ్యోతి భర్తపై దారుణమైన కామెంట్లు) ఆమె తన తండ్రి చార్లీ చాప్లిన్ 1952 లైమ్‌లైట్‌లో కొనసాగుతున్న సమయంలోనే సినీరంగ ప్రవేశం చేసింది. 1969లో నికోలస్‌ను పెళ్లి చేసుకుని 1977లో అతని నుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత తను పలు సినిమాలతో బిజీగా ఉంటూ.. సుమారు పదేళ్ల తర్వాత 1989లో జీన్ క్లూడ్ గార్డెన్‌ను వివాహం చేసుకుంది. అతను 2013లో అనారోగ్యంతో మరణించారు. ఆమెకు ముగ్గురు కుమారులు చార్లీ, ఆర్థర్, జూలియన్ రోనెట్లు ఉన్నారు. -
రామ్ చరణ్-ఉపాసన కూతురి పేరు ఫైనల్ చేసేశారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయినరోజు నుంచి మెగాఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొణిదెల వారి ఇంట ఈనెల 20న మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దీంతో మెగా ఇంట నేటివరకు కూడా సంబురాలు జరుగుతూనే ఉన్నాయి. పాప పుట్టినరోజు నుంచి ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే చర్చ నడుస్తూనే ఉంది. (ఇదీ చదవండి: కెమెరాల ముందు 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. బుర్ర పనిచేస్తుందా?) తాజాగా ఇదే విషయంపై ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది. నేడు (జూన్ 30)న తన డార్లింగ్‌కు పేరు పెట్టబోతున్నట్లు తెలిపింది. దీంతో మెగా వారసురాలి బారసాల కార్యక్రమం నేడు ఘనంగా జరగనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న వీడియోను ఆమె షేర్ చేసింది. మెగా ప్రిన్సెస్ బారసాల కార్యక్రమంలో మెగా కుటుంబంతో పాటు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. అంతే కాకుండా మెగా కుటుంబంతో దగ్గరి సాన్నిహిత్యం ఉన్నవారికి కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే మెగా ప్రిన్సెస్ పేరును ఇప్పటికే ఖరారు చేశారు. కానీ పూజా కార్యక్రమంలో మాత్రమే పేరు రివీల్ చేయాలని చిరు సూచించారట. (ఇదీ చదవండి: బ్రహ్మానందం కోసం మహేష్ బాబు ఏం చేశారంటే..?) -
అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే
యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కూతురు నటి ఐశ్వర్య పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ వార్త నిజమేనని వరుడి తండ్రి ప్రకటన చేశారు. దీంతో త్వరలో అర్జున్ ఇంట శుభకార్యం జరగనుంది. కొలీవుడ్లో ప్రముఖ కమెడియన్, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యువ నటుడు ఉమాపతితో వివాహం జరగనుంది. పెళ్లిపై తంబి రామయ్య ఏమన్నారంటే.. సోషల్‌మీడియాలో వస్తున్న వార్త నిజమే.. ఐశ్వర్య, ఉమాపతిల పెళ్లి త్వరలో జరగనుందని తంబి రామయ్య ప్రకటించారు. ఐశ్వర్యను ప్రేమిస్తున్నానని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని మొదట తమ అబ్బాయి చెప్పాడంతో... ఇరు కుటుంబాల పెద్దలు కలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నాం అన్నారు. నవంబర్ 8న ఉమాపతి పుట్టినరోజన పెళ్లి తేదీని ప్రకటిస్తామన్నారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరి పెళ్లి జరుపుతామని తంబి రామయ్య తెలిపారు. ఉమాపతి- ఐశ్వర్య పరిచయం ఎక్కడంటే.. ఇద్దరు సినిమా రంగంలో ఉన్నా.. కలిసి నటించింది లేదు. మరి వీరిద్దరి మధ్య ఎక్కడ ప్రేమ చిగురించిందని పలువురు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. ఆర్జున్ హోస్ట్‌గా ZEE తమిళ్లో ఓ రియాలిటీ షో ‘సర్వైవర్’ చేశారు. అక్కడ షూటింగ్లో ఉమాపతి స్టార్ కంటెస్టెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఈ జంట ఒకరినొకరు కలుసుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి మొదలైన వారి స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది. (ఇదీ చదవండి: హీరోలందరికి ఎఫైర్లున్నాయి.. నా భర్తను మాత్రమే ఎందుకంటారు?) ఆ తర్వాత అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభోత్సవంలో తంబి రామయ్య కుటుంబం పాల్గొన్నారు. ఆ సమయంలోనే వారిద్దరి లవ్‌స్టోరీ ఇరు కుటుంబాలకు తెలిసిందట. ఆపై కుటుంబ పెద్దలు కూడా ఆశీస్సులు అందించారని తెలుస్తోంది. ఏదేమైనా వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగనుంది. అర్జున్, తంబి రామయ్య ఇద్దరూ కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరున్నవారే కావడంతో వారి కుటుంబంలో జరిగే పెళ్లికి భారీగానే స్టార్స్ హాజరవుతారు. (ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!) -
ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్‌కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్యను ఇది వరకే తమిళ్, కన్నడలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్లో మాత్రం తన ఎంట్రీ ప్రకటనతోనే సినిమా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యకు సంబంధించి ఓ వార్త కోలీవుడ్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) అదేమిటంటే..ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ అనే వార్త వైరల్ అవుతుంది. అబ్బాయి కూడా కోలీవుడ్‌లో ప్రముఖ హాస్య నటుడు అయినటువంటి తంబి రామయ్య కుమారుడు ఉమాపతి అని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వారిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని కూడా తెలుపుతున్నారు. దీంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో వీరి పెళ్లి ఘనంగా జరగబోతోందని సమాచారం. కానీ ఈ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వారి కుటుంబాల నుంచి రాలేదు. కానీ జరిగేది ఇదేనని బలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!) కోలీవుడ్‌లో 'అదగపాతుతు మగజనంగలే' అనే సినిమాతో 2017లో ఉమాపతి రామయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన పలు టీవి షోలతో పాటు నాలుగు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'దేవ్‌దాస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఐశ్వర్య విషయానికొస్తే తెలుగులో హీరోయిన్గా లాంచ్ చేయాలని అర్జున్ చాలా కసరత్తు చేశాడు. అందుకు కోసం హీరోగా విష్వక్సేన్ పేరును కూడా ప్రకటించాడు. అయితే, ఈ మూవీ నుంచి విష్వక్ తప్పుకోవడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని త్వరలో మరో హీరో పేరును ప్రకటిస్తామని ఆయన గతంలో తెలిపాడు. Umapathy Ramaiah (Thambi Ramaiah Son) & Aishwarya Arjun (Arjun’s Daughter) to tie the knot soon! pic.twitter.com/r0dRY3i6js — Christopher Kanagaraj (@Chrissuccess) June 25, 2023 -
మెగా ప్రిన్సెస్ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసనల దంపతులకు జూన్ 20న పండంటి పాప పుట్టింది. చిరంజీవికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజే చిన్నారి జన్మించడంతో సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులైన చరణ్ దంపతులకు బంధుమిత్రులు, సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: కీర్తి సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్?) మెగా ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబానికి బాగా కలిసి వస్తుందని పలు జ్యోతిష్యులు చెప్పారని చిరు తెలిపారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని ఇండస్ట్రీలోని తన స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు వారందరికీ ఒక మెగాపార్టీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సెలెబ్రేషన్స్ ఒక రేంజ్లో ఉండబోతున్నట్లు సమాచారం. మరో వైపు మెగా ప్రిన్సెస్‌కు ఎలాంటి పేరు సెలక్ట్ చేస్తారని సోషల్‌మీడియాలో ఆరాతీస్తున్నారు. మెగాస్టార్‌కు ఇద్దరు కూతుళ్ళకు చెరో ఇద్దరు అమ్మాయిలు ఉండగా ఇప్పుడు రామ్ చరణ్‌కు కూడా కుమార్తె జన్మించింది. ప్రస్తుతం చిరుకి ఐదుగురు మనవరాళ్లు అయ్యారు. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్పిక్ మార్చేసిందిగా!) -
నా బిగ్గెస్ట్ చీర్లీడర్ అంటూ ఫోటో షేర్ చేసిన సితార
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని పరిచయమే. కానీ తనకంటూ సొంతగుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అందుకేనేమో సోషల్‌మీడియాలో తనకు ఫ్యాన్స్ ఎక్కువే. తాజాగా మహేష్‌బాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా షేర్ చేసింది. (ఇదీ చదవండి: Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?) 'మా సూపర్ డాడ్, నా బిగ్గెస్ట్ చీర్లీడర్కి హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా... లవ్ యూ టు ది మూన్ ' అంటూ తెలిపింది. సితార షేర్ చేసిన ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మహేష్ బాబు తన పిల్లల కోసం ఎక్కువగానే సమయం కేటాయిస్తాడు. అందుకే ఆయనకు పిల్లలతో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది. దీంతో టాలీవుడ్లో మహేష్‌కు ఫ్యామిలీ మ్యాన్‌గా గుర్తింపు ఉంది. సినిమా విషయానికి వస్తే గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా గ్లామర్ క్లిక్ అవుతుందా?) -
మళ్లీ వార్తల్లోకి వచ్చిన రజనీకాంత్ రెండవ కూతురు
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య ఆరేళ్ల తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ వారసురాళ్లు ఐశ్వర్య, సౌందర్య ఇద్దరు దర్శకులుగా కొనసాగుతున్నారన్నది తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య నటుడు విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా లాల్ సలాం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) కాగా రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య ఇంతకుముందు తన తండ్రి కథానాయకుడిగా కొచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదేవిధంగా రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన పలు చిత్రాలకు ఈమె గ్రాఫిక్స్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ధనుష్ కథానాయకుడిగా నటించిన వేలైయిల్లా పట్టాదారి చిత్రానికి ఈమెనే దర్శకురాలు. కాగా ఆరేళ్ల తరువాత సౌందర్య రజనీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈసారి ఆమెజాన్ ప్రైమ్ టైం కోసం రూపొందించబోతున్నారని, ఇందులో నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు) -
ఈ విషయంలో మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా 'సితారా పాప'కు గుర్తింపు
ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తనయ సితార సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఫొటోషూట్, విహార యాత్రలు, వేడుకలు.. ఇలా తాను ఎంజాయ్ చేసిన వాటన్నింటి వివరాలను ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించింది. ఇక తరచూ తండ్రి మహేశ్ నటించిన లేదా ఇతర సినిమాల్లోని పాటలకు తను డాన్స్ చేసిన వీడియోలను ఇన్‌స్టాలో అప్లోడ్ చేస్తుంటోంది. కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ వద్ద సీతార కొద్ది రోజులుగా డ్యాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్‌లో ఫ్యాన్స్) తాజాగా సాయిపల్లవి నటించిన లవ్స్టోరీలోని సారంగదరియా సాంగ్‌కు అద్భుతంగా డాన్స్ చేసింది సితార. ఈ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. తన పెర్ఫార్మెన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సితార డాన్స్ వీడియోకు కేవలం గంట సమయంలోనే దాదాపు లక్షకు పైగా లైక్స్ రావడం విశేషం. టాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో సితార చాలా డిఫరెంట్.. ఇప్పటికే తను జ్యూయెలరీ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసింది. దీంతో యాడ్ కోసం అతి పెద్ద సంస్థకు సైన్ చేసిన మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా నిలిచింది. అందుకు గాను సితార భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి అయినట్లు సమాచారం. దీంతో మా సితార పాప మల్టీ టాలెంటేడ్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. Sitara Papa New Dance Video She is really a Rock Star💫 pic.twitter.com/xQlay0b07B — Srinadh (@Srinadhdhfm) June 15, 2023 (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో ఇద్దరు స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్?) -
కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య
సాక్షి, దుండిగల్(హైదరాబాద్): కూతురు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్మకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీ రాజీవ్‌గృహకల్పకు చెందిన మిరాజ్(40)కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కాగా ఇతడి పెద్ద కుమార్తె జవేరియా తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని వేరే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తాగుడుకు బానిసైన మిరాజ్ మనస్తాపానికి గురవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ రాత్రి మిరాజ్ ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు జావేద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘భార్యలను మార్చుకునే’ రాకెట్ గుట్టురట్టు! -
ఒకే వేదికపై ఇద్దరు ఎంపీలు.. హుషారైన స్టెప్పులతో రచ్చ..
సాక్షి, ముంబై(మహారాష్ట్ర): ప్రతి ఒక్కరు తమ జీవితంలో వివాహ వేడుకను గొప్పగా జరుపుకోవాలనుకుంటారు. దీనిలో భాగంగా.. మెహందీ,సంగీత్ వంటి అనేక కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలకు బంధువులు, స్నేహితులు హజరై డ్యాన్స్‌లు చేస్తుంటారు. పెళ్లివేడుకలలో చేసిన డ్యాన్స్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, పెళ్లి వేడుక డ్యాన్స్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుమార్తె పూర్వాన్షి వివాహం సోమవారం ముంబైలోని ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు హజరయ్యారు. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సులే కూడా తమ కుటుంబంతో కలిసి వివాహ వేడుకకు హజరయ్యారు. పెళ్లి వేడుకలో భాగంగా.. సంగీత్ కార్యక్రమం జరిగింది. దీనిలో ఎంపీ సంజయ్‌రౌత్.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయాతో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరు కలిసి చక్కగా స్టెప్పులు వేసి.. వివాహ వేడుకకు హజరైన అతిథులను ఉల్లాసపరిచారు. దీంతో అక్కడ ఉన్నవారు కూడా వీరితో పాటు కలిసి హుషారైన స్టెప్పులు వేశారు. ఎంపీ సుప్రీయా సులే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె . పూర్వాన్షి రౌత్‌కు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మల్హార్ నర్వేకర్‌తో వైభవంగా వివాహం జరిగింది. ఈయన తండ్రి రాజేష్ నర్వేకర్ ఒక సివిల్ సర్వీసెస్ అధికారి. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
కూతురి సాక్ష్యం, తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, మైసూరు(కర్ణాటక): తల్లిని తండ్రే హత్య చేయడం తాను చూశానని చిన్నారి కూతురు చెప్పిన సాక్ష్యంతో తండ్రికి శిక్ష పడింది. వివరాలు.. చామరాజనగర జిల్లా కోళిపాళ్య గ్రామానికి చెందిన తొళచనాయక్కు, పుష్పబాయికి పెళ్లి సమయంలో 20 గ్రాముల బంగారు నెక్లెస్‌ను ఇచ్చారు. వీరికి 8 ఏళ్ల కూతురు ఉంది. తొళచనాయక్ తమ్మునికి సమస్య వస్తే డబ్బుల కోసం బంగారు నెక్లెస్‌ను కుదువ పెట్టాడు. నెక్లెస్‌ను విడిపించుకురావాలని భార్య ఒత్తిడి చేసేది. 2017 మార్చి 27న ఇదే విషయమై గొడవ జరగ్గా తొళచనాయక్ వేటకొడవలితో భార్యను నరికి చంపాడు. ఈ కేసులో తుది విచారణ చామరాజనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. తండ్రి దాష్టీకంపై కూతురు సాక్ష్యం చెప్పడంతో నేర నిరూపణ అయ్యింది. దోషికి జీవితఖైదును విధించారు. -
పోలీసుల టార్చర్.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి..
సాక్షి, కోలారు(కర్ణాటక): సంబంధం లేకపోయినా పోలీసులు కేసు పెడతామని బెదిరించారనే ఆవేదనతో కుటుంబంలోని 5 మంది ఆదివారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వారిలో అందరూ కన్నుమూశారు. మునియప్ప (75), భార్య నారాయణమ్మ(70), కుమారుడు బాబు (45), మనవరాలు గంగోత్రి (17) కోలారులోని జాలప్ప ఆస్పత్రిలో సోమవారం వేకువన చనిపోయారు. కుమార్తె పుష్ప రాత్రికి కన్నుమూసింది. కేసుతో సంబంధం లేదన్నా.. వివరాలు.. నగరంలోని గల్‌పేట పరిధిలోని కారంజికట్టలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 18వ తేదీన తాలూకాలోని హొన్నేహళ్లి గ్రామానికి చెందిన సత్య, సుమిత్ర దంపతుల ఆడ శిశువును వారికి తెలిసిన మహిళ ఎత్తుకెళ్లింది. ఇందులో పుష్ప కూడా నిందితురాలని కోలారు నగర మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసులు.. గీతా, పుష్పలను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా ఏ సంబంధం లేదని పుష్ప తెలిపింది. నేరం ఒప్పుకోక పోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు ఆమెను ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో పుష్ప, ఆమె కుటుంబీకులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబం పరువు పోతుందనే ఆవేదనతో ఆదివారం ఐదుగురూ కలిసి పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక మృతి చెందారు. చదవండి: పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేస్తున్నాడు! -
కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు..
సాక్షి, కోలారు (కర్ణాటక): ఒకే కుటుంబంలో ఐదు మంది ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కోలారు నగరంలోని కారంజికట్ట కాలనీ 4వ క్రాస్‌లో చోటుచేసుకుంది. మునేశప్ప (75), భార్య నారాయణమ్మ (70), కుమారుడు బాబు (45), కూతురు పుష్ప (33), మనవరాలు గంగోత్రి (17) ఆదివారం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోబోయారు. మునేశప్ప కుమార్తె పుష్ప వేరొకరికి మగబిడ్డని విక్రయించిందని ఆరోపణపై కోలారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పరువు పోయిందని కుంగిపోయిన కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగారు. స్థానికులు వీరిని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. నగర పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ప్రియునికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి.. -
తల్లిని చంపిన కూతురు కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, రాజేంద్రనగర్(హైదరాబాద్): తల్లిని హత్య చేసిన కుమార్తెతోపాటు ప్రియుడిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... చింతల్మెట్ ప్రాంతానికి చెందిన యాదమ్మ(45), యాదయ్య భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. మొదటి కూతురుకు వివాహం చేయగా రెండవ కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. చిన్న కూతురుతో కలిసి చింతల్మెట్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూలి పని చేస్తుంటారు. చిన్న కూతురు నందిని(19) ఇంటి వద్దే ఉంటుంది. ఇంటి పక్కనే గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్న రామ్‌కుమార్(19)తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లగానే నందిని ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకునేది. స్థానికులు ఈ విషయాన్ని తల్లికి తెలపడంతో మందలించింది. సెల్ఫోన్లో సైతం తరచు మాట్లాడుతుండటంతో వద్దని హెచ్చరించింది. సోమవారం పని కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఫోన్ చేసి నందిని ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. పని దొరకకపోవడంతో తల్లి ఇరువురిని చూసి మందలించింది. ఇదే విషయమై తల్లి, కూతురు మధ్య గొడవ జరిగింది. ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు కలిసి తల్లిపై దాడి చేసి చున్నీతో ఉరి వేశారు. అనంతరం తమకే ఏమీ తెలియనట్లు రామ్‌కుమార్ గ్యాస్ ఏజెన్సీలో పనికి వెళ్లగా ఇంట్లో కూతురు ఉంది. స్థానికులు గొడవ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మొదట ఇద్దరు మైనర్లు అని 17 సంవత్సరాలు ఉన్నామని పోలీసులకు తప్పుదోవ పట్టించారు. ఆధార్, ఇతర సర్టిఫికెట్ల ఆధారంగా వారు మేజర్లని పోలీసులు నిర్ధారించారు. చదవండి: భార్యపై కోపంతో మ్యాట్రిమెునిలో వివరాలు -
Hyderabad: బాలికపై సవతి తండ్రి అత్యాచారం
సాక్షి, చాంద్రాయణగుట్ట: వావి వరుసలు మరిచి మూడేళ్లుగా కూతురుపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ కేఎన్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం....బండ్లగూడ గౌస్‌నగర్‌కు చెందిన మహిళకు 14 ఏళ్ల కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు సంతానం. కాగా ఆమె భర్తతో విడాకులు తీసుకొని 2017లో అంబర్‌పేటకు చెందిన వ్యాపారి సయ్యద్ షరీఫ్ యూసుఫ్(45)ను వివాహం చేసుకుంది. అంబర్‌పేటలోని మొదటి భార్యతో నివాసం ఉండే యూసుఫ్ అప్పుడప్పుడు గౌస్‌నగర్‌కు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల బాలిక బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. రెండు రోజుల క్రితం విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వదినపై ఆత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు.. డబీర్‌పురా: వదినపై ఆత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని మీర్‌చౌక్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పురానీహవేలి ప్రాంతానికి చెందిన ఏసీ మెకానిక్ మీర్ ఇర్ఫాన్ అలీ (28) అన్న, వదినతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఈ నెల 14న మీర్ ఇర్ఫాన్ అలీ అన్న ఇంట్లో లేని సమయంలో వదినపై బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు ఇర్ఫాన్ అలీని బుధవారం అరెస్టు చేశారు. చదవండి: Banjara Hills: భర్తను చున్నీతో హత్యచేసి.. ఆ తర్వాత -
తండ్రి హత్య కేసులో కుమారుడు, కుమార్తె అరెస్ట్
సాక్షి, భూపాలపల్లి(వరంగల్): ఇటీవల సింగరేణి కార్మికుడిని హత్య చేసిన కేసులో అతని కుమారుడు, కుమార్తెను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు భూపాలపల్లి సీఐ ఎస్ వాసుదేవరావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని టీ2 క్వార్టర్స్‌లోని టీ2– 658 క్వార్టర్లో నివాసం ఉండే గొడ్డె నాగభూషణం(44) తన ఇంట్లో ఈ నెల 22న రాత్రి హత్యకు గురయ్యాడు. మృతుడి రెండో భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఎస్ వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన రోజు నుంచి నాగభూషణం కుమారుడు జగదీష్, కుమార్తె ఉమామహేశ్వరిలు పరారీలో ఉన్నారు. శుక్రవారం ఉదయం వారి దుస్తులు, డబ్బులు తీసుకెళ్తేందుకని భూపాలపల్లికి వచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి వారిని పట్టుకుని విచారించారు. పోలీసుల విచారణలో తామే హత్య చేసినట్లుగా నిందితులు అంగీకరించారు. తమ తండ్రి ఆగడాలు తట్టుకోలేకనే హత్యకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. నాగభూషణం కుటుంబాన్ని పట్టించుకోకపోవడమే కాక భార్యను వేధించేవాడు. అతడి వేధింపులు కారణంగానే అనారోగ్యానికి గురైన భార్య సుజాత మృతి చెందింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరొకరిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం పిల్లలిద్దరూ తమకు ఆస్తులు, డబ్బులు పంచి ఇవ్వాలని కోరారు. దీంతో గొడవలు ప్రారంభమయ్యాయి. చేసేది లేక తండ్రిని హత్య చేయాలని వారు భావించారు. ఈ మేరకు జగదీష్, ఉమామహేశ్వరి, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మంథని ముత్తారం మండలం దర్యాపూర్‌కు చెందిన యువకుడు గాదం రామకృష్ణలు కలిసి పట్టణంలోని చైనా బజార్లో రెండు కత్తులు కొనుగోలు చేశారు. పినతల్లి శారద లేని సమయం చూసి ఈ నెల 22 రాత్రి జగదీష్, ఉమామహేశ్వరి, రామకృష్ణలు కలిసి నాగభూషణంను హత్య చేశారు.నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. చదవండి: పెళ్లి అయిన మూడు రోజులకే.. ‘నవ వరుడి’ ఆత్మహత్యాయత్నం.. -
తల్లిదండ్రుల మధ్య గొడవ.. పురుగుల మందు తాగిన కుమార్తె..
సాక్షి, మద్దిరాల(నల్లగొండ): పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధి లోని జి.కొత్తపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన నిమ్మ సుధాకర్ మేరమ్మ దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. దీంతో వారి కుమార్తె నిమ్మ రూప(18)మనస్థాపానికి గురై బుధవారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. తల్లి మేరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నాగయ్య తెలిపారు. -
తల్లిదండ్రులే కూతురిని చంపారంటూ పుకార్లు..
సాక్షి, మల్యాల(కరీంనగర్): తమ కూతురు చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భార్యాభర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుట భైఠాయించిన సంఘటన మల్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మల్యాల మండలకేంద్రానికి చెందిన సంగ శ్రీనివాస్–మంజుల కుమార్తె తేజస్విని గతేడాది సెప్టెంబర్ 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా స్థానికుల సమాచారం మేరకు అప్పటి సీఐ కిశోర్ శవయాత్రను మధ్యలో నిలిపివేసి పోస్టుమార్టంకు తరలించారు. తల్లిదండ్రులే కూతురిని చంపారంటూ పుకార్లు పుట్టాయి. తమ కూతురు చావుకు తాము కారణం కాదని నిరూపించుకునేందుకు తేజస్విని మృతికి కారణాలు కనుగొనాలని పోలీసుల చుట్టూ తిరుగుతున్నామని శ్రీనివాస్ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంధువుల అబ్బాయి ప్రేమపేరుతో వంచించడంతోనే కూతురు మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ రమణమూర్తి బాధితులతో మాట్లాడి కేసు విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
పాక్‌లో దారుణం: మాజీ దౌత్యవేత్త కుమార్తె హత్య..
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. అక్కడ సామాన్యులకే కాదూ.. వీవీఐపీలకు అక్కడ రక్షణ లేకుండా పోయింది. తాజాగా, పాక్ మాజీ దౌత్యవేత్తగా కుమార్తెను కొంత మంది దుండగులు అతికిరాతకంగా హతమార్చారు. ప్రస్తుతం ఈ వార్త దేశంలో సంచలనంగా మారింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన శౌకత్ ముకద్దమ్ గతంలో దక్షిణ కొరియా, కజికిస్తాన్‌లకు దౌత్యావేత్తగా పనిచేశారు. ఈ క్రమంలో కొంత మంది దుండగులు.. ఆయన కుమార్తె నూర్ ముకద్దమ్‌ను కిడ్నాప్‌చేసి అతి దారుణంగా చంపేశారు. ఆమె మృతదేహన్ని ఇస్లామాబాద్‌లోని ఎఫ్ 4 సెక్టార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీంతో, పాక్ పోలీసులు ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, కుటుంబ సభ్యులు ఈ హత్య కేసులో ఆమె మిత్రుడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జహీర్ జఫ్పర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటనతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొన్ని రోజుల క్రితమే.. పాక్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్తగా పనిచేసిన నజిబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్సిలా అలిఖిల్‌ను ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైనా సిల్సిలా.. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటుంది. ఈ చర్యలను పలుదేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే దీనివెనుక ఉన్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. పాక్ మద్దతుతోననే తాలిబన్లు దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని పలుదేశాలు ఆరోపిస్తున్నాయి. -
Viral: బిడ్డ చదువుకు తండ్రి గొడుగు
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బాలక్క గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆరుబయట వర్షంలో మొబైల్ఫోన్లో ఆన్లైన్ క్లాస్‌తో తంటాలు పడుతుండగా, ఆమె తడవకుండా తండ్రి గొడుగుతో నిలబడిన దృశ్యం వైరల్ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సుళ్య తాలూకాలో బాలక్క గ్రామంలో మాత్రమే నెట్ అందుబాటులో ఉండడం వల్ల పరిసర పల్లెల విద్యార్థులు ఇక్కడికే వచ్చి ఆన్లైన్ తరగతులు వింటున్నారు. అలాగే ఓ బాలిక సిగ్నల్ బాగా వచ్చేచోట కూర్చుని క్లాస్ వింటుండగా వర్షం రావడంతో ఆమె తండ్రి గొడుగు పట్టి కన్నప్రేమను చాటుకున్నాడు. చదవండి: Fathers Day: నాన్న ఎవ్రీడే వారియర్.. -
ఘనంగా కాకాని గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్
-
నీకు కొత్త డాడీని తెస్తాను.. ఓకేనా?
కొత్త సంబంధాలు ఉన్న అనుబంధాల్ని వెక్కిరిస్తాయి. ఒక కొత్త మనిషి ఒక కుటుంబంలోకి వచ్చినప్పుడు ఎన్నో తుపానులు చెలరేగుతాయి. అవి పైకి కనిపించకపోవచ్చు.. ఎప్పుడో అగ్నిపర్వతంలా బద్ధలౌతాయి. ఇలా ఓ కొత్త సంబంధం.. ఉన్న అనుబంధాన్ని వెక్కిరించిన వాస్తవగాథ ఇది. ఇంట్లో డ్రాయింగ్ రూమ్‌లో ఒక సోఫా సీట్‌కూ మరో సోఫా సీట్‌కూ మధ్య ఉన్న దూరం ఎంత? ఆప్యాయత, అవగాహన ఉంటే ఆరు అడుగులు. లేకుంటే? ఆరువందల కిలోమీటర్లు. ‘మా అమ్మాయి పారిపోయింది డాక్టర్’అయితే నా దగ్గరికి ఎందుకొచ్చారు? పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కదా కంప్లయింట్ చేయాలి’‘మా అమ్మాయి పిచ్చి వల్ల పారిపోయి ఉంటుందనుకుంటున్నాం డాక్టర్’‘మీరు విషయం చెప్పండి. పిచ్చి ఎవరికో తర్వాత తేలుద్దాం’ ‘నాకొక కూతురు డాక్టర్. అది పుట్టినప్పటి నుంచి నాకు సుఖం లేదు. ఇంకో బాబునో పాపనో కని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఇద్దరం సాఫ్ట్వేర్ రంగంలో ఉండటం వల్ల వద్దనుకున్నాం. ఒక్కత్తే పాప. ఒక్కతే కనుక గారాలు. గారాలు చేసినంత మాత్రాన పిల్లలు పెడసరంగా ప్రవర్తిస్తారని అనుకోను. కాని మా పాప చాలా మొండిది. హ్యాండిల్ చేయడం కష్టంగా ఉండేది’ ఆగింది. ‘చెప్తూ వెళ్లండి’‘క్లాస్‌లో చాలా అల్లరి చేసేదట. స్కూల్ డైరీ తెరవాలంటే నా గుండె గడగడలాడేది. టీచర్ అన్ని కంప్లయింట్లు రాసేది. క్లాసు సరిగా వినదని.. ఫ్రెండ్స్‌తో కబుర్లు ఎక్కువ చెప్తుందని.. ఆర్డర్స్ ఒబే చేయదని.. పన్నెండేళ్లు వచ్చేసరికి ఇంట్లో స్కూలుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి కాఫీ షాప్‌లో కూచోవడం, షాపింగ్ మాల్స్‌లో తిరగడం. ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేది. ఇది పిచ్చే కదా డాక్టర్?’‘బిహేవియర్ డిజార్డర్’ ‘ఏదో ఒకటి. కాని ఈ బిహేవియర్‌తో నేను విసిగిపోయినా మావారు అస్సలు కోప్పడేవారు కాదు. ప్రపంచంలోని శాంతం మొత్తాన్ని ఒక సముద్రం చేస్తే ఆ సముద్రాన్ని పుక్కిట పట్టిన మహాముని ఆయన. కూతురంటే చాలా ఓర్పు. పదే పదే నచ్చజెప్పి తనను కరెక్ట్ చేయడానికి ఎఫెర్ట్ పెట్టేవాడు. విన్నట్టే కనిపించేది కానీ మళ్లీ సేమ్ బిహేవియర్ చూపించేది. ఈ ఇష్యూ ఇలా ఉండగా ఇంకో బిగ్ లాస్ మాకు వచ్చి పడింది. రెండేళ్ల క్రితం నా హజ్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు’...డాక్టర్ ఆమెనూ, ఆమె పక్కన ఉన్న వ్యక్తినీ చూశాడు.‘ఈయన నా రెండో భర్త’‘చెప్పండి’‘నా హజ్బెండ్ చనిపోయాక నాకు చాలా కష్టంగా అనిపించింది. భర్త లేని ఇల్లు. మాట వినని కూతురు. కాని తనలో సడన్ ఛేంజ్. చాలా మారిపోయింది. కొంచెం కంట్రోల్ అయ్యింది. ఫోన్ ఎడిక్షన్లాంటిది వదిలేసింది. స్కూలుకు బుద్ధిగా వెళ్లడం మొదలెట్టింది. మార్కులు కూడా తెచ్చుకుంటోంది. బహుశా తండ్రి లాస్‌ను ఫీలవుతూ ఆయన పట్ల రెస్పెక్ట్ చూపించాలని అలా మారిపోయిందేమో. లేదా నన్ను సఫర్ చేయడం ఎందుకు అనుకుందేమో. కారణం ఏదైనా ఇష్యూ సెటిల్ అయ్యిందని అనిపించింది. అయితే’... అని పక్కనున్న భర్త వైపు చూసింది. ‘అయితే?’‘నా వయసు ఎంతని? నలభై కూడా లేవు. నాక్కూడా ఒక మనిషి తోడు ఉండాలి కదా. ఈయన మా ఆఫీసులోనే కొలీగ్. సమ్ రీజన్స్ వల్ల ఎందుకో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. నా భర్త చనిపోయాక తనే నా పట్ల ఇంట్రెస్ట్ చూపించారు. పెళ్లి చేసుకుందాం అన్నారు. నో అనడానికి నాకేం రీజన్స్ కనిపించలేదు. మా అమ్మాయిని అడిగాను ఒకరోజు– నీకు కొత్త డాడీని తెస్తాను.. ఓకేనా అని. తను ఓకే అంది. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం’ ఆగింది.ఒక నిమిషం ఊపిరి తీసుకొని మళ్లీ చెప్పింది.‘పెళ్లి చేసుకున్నానే కాని ఆ పని ఎందుకు చేశానా అని బాధ పడని క్షణం లేదు. పెళ్లయిన కొత్తలో సహజంగానే మా అమ్మాయి మీద అటెన్షన్ తగ్గింది. ఈయనతో స్పెండ్ చేసే టైమ్ పెరిగింది. దానికి తను హర్ట్ అయింది. రెండోదేమంటే తను వాళ్ల నాన్నను చూసింది. అలాంటి నాన్నే వస్తాడనుకుంది. వచ్చేశాడనుకుని తిరిగి పూర్వపు బిహేవియర్లోకి వెళ్లిపోయింది. బాగా అల్లరి చేసి ఈయన నుంచి అలాంటి బుజ్జగింపును ఎదురు చూసింది. అయితే ఆ నాన్నకు ఈ నాన్నకు పోలిక లేదని గ్రహించింది. ఈయన చెడ్డవాడు కాదు కానీ పిల్లల పెంపకం పట్ల కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. వాటి అనుసారం కటువుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అరవడం, తిట్టడం, ఒకటి రెండుసార్లు చేయి చేసుకున్నారు. దాంతో తను హర్ట్ అయ్యింది. అక్కడి నుంచి ఇంకా ప్రవర్తన మారింది. అటు అమ్మాయికి చెప్పలేక ఇటు ఇతణ్ని సర్దలేక నరకం అనుభవిస్తున్నాను. ఆ నరకాన్ని ఇంకాస్త పెంచడానికి రెండు వారాల క్రితం నా కూతురు...’... ఏడుపు బిగపట్టింది.ఒక్క క్షణం తర్వాత– ‘నా కూతురు పారిపోయింది. ముంబైలో ట్రేస్ చేశామని చెప్పి పోలీసులు అక్కడకు వెళ్లారు. ఇవాళో రేపో తీసుకు వస్తారు. వచ్చాక మేము ఏం చేయాలి?’డాక్టర్ అంతవరకూ నోట్ చేస్తున్నది ఆపాడు. ప్యాడ్ మీద నుంచి పెన్సిల్ తీసి చూపుడు వేలు, బొటనవేలు మధ్యన ఆడించడం మొదలుపెట్టారు. ఒక్క క్షణం ఆగి అతనితో మాట్లాడాడు–‘మీరు ఈమెను మాత్రమే ఇష్టపడ్డారా? ఈమె కూతురితో పాటు ఇష్టపడ్డారా?’‘కూతురు ఉన్నట్టు నాకు తెలుసు. ఆ అమ్మాయిని బాగా చూసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకున్నాను’‘మరి ఆ అమ్మాయి పట్ల ఇష్టం చూపించారా? ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడేలా చేశారా? ఇష్టం కంటే ముందు అధికారం చూపించినట్టున్నారు. ఇవాళ రేపు పిల్లలు తాము అంగీకరించిన వ్యక్తుల అధికారాన్నే భరించడం లేదు. మీరు అంగీకారం పొందకుండానే అధికారం చూపించారు. ఆ అమ్మాయి ఎందుకుంటుంది? మీరు ఒక రిలేషన్లోకి వస్తున్నప్పుడు దాని చుట్టూ ఉన్న అనేక విషయాల గురించి ఆలోచించాలి. కౌన్సెలింగ్ తీసుకోవాలి. మీరలా చేయలేదు. అన్నీ తెలుసనుకున్నారు’...ఆమెవైపు తిరిగాడు.‘మీరు మీకు ఇష్టమైన పెళ్లి చేసుకున్నారు కానీ మీ కుటుంబానికి ఇష్టమైన పెళ్లి చేసుకోలేదు. ఒక అనుబంధం విచ్ఛిత్తి అయ్యాక మరో అనుబంధంలోకి వెళ్లొచ్చు. వెళ్లాల్సిందే. కాని మీకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి అతణ్ణి పరిచయం చేసి కొంతకాలం వారిద్దరినీ గమనించాలని మీరు అనుకోలేదు. అంత ఓపిక పట్టలేకపోయారు. అరె... పాలలో చక్కెర కలవడానికే స్పూన్‌తో తిప్పాల్సి వచ్చినప్పుడు రెండు వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన మనుషులను కలపడానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలి? వీరిద్దరి రిలేషన్ ఇలాగే ఉంటే విక్టిమ్ మీ అమ్మాయి అవదు. మీరు అవుతారు. సొంత బిడ్డను ఏమనలేక కొత్త రిలేషన్‌ను స్ట్రయిన్ చేయలేక మొత్తం బాధంతా మీరు పడతారు. ముందు మీ ముగ్గురు ఒక కుటుంబంగా మారండి. నేను చేయాల్సిన సహాయం చేస్తాను. అమ్మాయి రావడంతోటే ఆమెను ప్రేమించే తల్లిదండ్రులుగా వ్యవహరించి ముగ్గురూ నా దగ్గరకు రండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ వాళ్లిద్దరూ కొంచెం కుదుట పడ్డ మనసులతో లేచారు. ఆ కుటుంబం కూడా కుదుట పడగలదన్న నమ్మకం డాక్టర్‌కు ఉంది. – ఫ్యామిలీ డెస్క్ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి సైకియాట్రిస్ట్ -
కుటుంబం అంతా చూడదగ్గ సీరియల్..
వెబ్ ఫ్లిక్స్ సిరీస్‌లో భాగంగా ఈవారం ఇస్తున్న సిరీస్ ‘మేరే పాపా హీరో హీరాలాల్’. మొదట ఇది డిస్కవరీ జీత్‌లో ప్రసారం అయింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులో ఉంది. జబ్బు పడిన బిడ్డను కాపాడుకోడానికి తండ్రి పడే ఆరాటమే ఈ కథ. ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్. అభిమానం మంచిదే.. విలువలూ ఉండాలి.సచ్ఛీలత మన సంస్కృతి.. సంస్కారం.. మన శ్వాస!ఒకచోట అభిమానం అడ్డొస్తుంది.. విలువలు కాళ్లకు అడ్డంపడ్తాయి.అయితే సచ్ఛీలత అవసరాన్నితీర్చలేదు.సంస్కారం చేయి చాచనివ్వదు!అభిమానాన్ని, విలువలను, సచ్ఛీలతను, సంస్కారాన్నీ వదులుకోకుండాగెలిచిన ఒక జీవితం.. మేరే పాపా.. హీరో హీరాలాల్!!‘‘గుడ్ ఈవినింగ్ లక్నో.. నా పేరు గున్‌గున్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న కథ మర్చిపోయా. కాని అంతకన్నా మంచి కథ చెప్తా. మా నాన్న కథ. నాన్నకు నేల మీద పరిగెత్తే మూడు చక్రాల వాయుదూత్ ఉంది. అదే ఆటో. మా నాన్నను అందరూ ఆటో హీరాలాల్ అని పిలుస్తుంటారు. కాని ఆయన పేరు నాన్న. నేను నవ్వితే నవ్వుతాడు. నేను ఏడిస్తే ఏడుస్తాడు. ఆకాశంలో ఉన్న చందమామను నా కళ్లల్లో చూసి మురిసిపోతాడు. చుక్కల్లో దాక్కున్న అమ్మతో మాట్లాడిస్తాడు. నేను డాక్టర్ కావాలని ఆశపడ్తాడు. నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్తాడు. నేను ఆయనకు యువరాణిని. యుద్ధం చేసిన రాణుల కథలు చెప్తాడు నాకు ఆ శక్తి రావాలని. అందుకే మా నాన్న నాకు హీరో.. హీరో హీరాలాల్. ఇదీ మా నాన్న కథ.. మీకు నచ్చిందనుకుంటా.. ఇక సెలవ్.. గుడ్ బై లక్నో... ’’ మేరే పాపా.. హీరో హీరాలాల్ అనే వెబ్‌సిరీస్‌లో గున్‌గున్ మాటలు అవి. ఇప్పుడు గున్‌గున్ కథ గున్‌గున్.. పదకొండేళ్ల అమ్మాయి. మెరుపు, మెరికకు పర్యాయపదం ఆ పిల్ల. అమ్మాయికి మూడేళ్ల వయసున్నప్పుడే యాక్సిడెంట్లో తల్లి చనిపోతుంది. అప్పటి నుంచీ గున్గున్కు అన్నీ తండ్రి హీరాలాలే. తనుండే వీధిలో పోలీస్ స్టేషన్‌లోని మీనా అనే ఇన్స్పెక్టర్ సహాయంతో లక్నోలోని ది బెస్ట్ స్కూల్లో చేర్పిస్తాడు. మీనా కొడుకు సుమీత్ కూడా గున్‌గున్ వయసువాడే. క్లాస్మేట్స్ కూడా. ఇద్దరు మంచి స్నేహితులవుతారు. మీనా భర్త మిలిటరీలో ఉండేవాడు. చనిపోతాడు. సుమీత్కు పైలట్ కావాలని కోరిక.స్కూల్ అథ్లెటిక్స్‌లో ఫస్ట్ ఉండాలనుకుంటాడు. మంచి డ్రాయింగ్ వేస్తాడు. గున్‌గున్ కూడా మంచి చిత్రకారిణి. అథ్లెటిక్స్‌లో సుమీత్‌ను గెలిపించడం కోసం అతని జట్టులో చేరుతుంది. రేస్‌లో పరిగెడుతూ పరిగెడుతూ పడిపోతుంది. ఆ అమ్మాయి అలా కళ్లు తిరిగిపడిపోవడం ఇది రెండోసారి. ఆసుపత్రి, వైద్యపరీక్షల తర్వాత.. గున్‌గున్ గుండెకు ప్రాబ్లం ఉంది, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారమని చెప్తారు డాక్టర్లు. దానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందనీ తేలుస్తారు. ఆటో నడిపే తండ్రి... అంత డబ్బు ఎక్కడినుంచి తేగలడు? రేకుల కప్పుతో ఉన్న చిన్న గది తప్ప ఇంకే ఆధారమూ లేదు అమ్మడానికైనా, తాకట్టు పెట్టడానికైనా! అతనుండే వాడకట్టులోని సన్నిహితులు శంకర్ (మెకానిక్), శాంతి (బడ్డీ కొట్టు యజమాని) అంతోఇంతో ఆర్థిక అండ ఇవ్వాలని చూస్తే అభిమానం అడ్డొచ్చి వద్దని చెప్తాడు.శంకర్ దగ్గర డబ్బు తీసుకోకపోవడానికి ఇంకో కారణం.. అతను జూదరి. జూదంలో గెలిచిన సొమ్మును తన కూతురి కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడడు హీరాలాల్. ఆ విషయం శంకర్‌తోనూ చెప్తాడు. ఇక శాంతి.. మహిళ.. పైగా ఒంటరి. అవసరమైతే తను ఆమెకి హెల్ప్‌గా ఉండాలి తప్ప నిస్సహాయురాలైన ఆమె సహాయం తీసుకోవడమేంటని అతని దృఢాభిప్రాయం. ఇంకో ముఖ్యమైన విషయం.. గున్‌గున్ హీరాలాల్ సొంత కూతురు కాదు. ఆ అమ్మాయి అనాథ. ఏడాది వయసున్నప్పుడే దత్తత తీసుకుంటారు హీరాలాల్ దంపతులు. ఇదీ అతని వ్యక్తిత్వం. నిజాయితీకి పరీక్ష డబ్బును కూడబెట్టే దారులను హీరాలాల్ సీరియస్‌గా వెదుకుతున్నప్పుడే రేడియో జాకీ సైరా అతని ఆటో ఎక్కుతుంది. గమ్యం వచ్చాక దిగిపోతూ ఆటోలో బ్యాగ్ మరిచిపోతుంది. వెంటనే చూసిన హీరాలాల్ ఆ వీ«ధంతా ఆమె కోసం వెదుకుతాడు బ్యాగ్ ఇవ్వడానికి. కాని ఆమె కనిపించదు. అలాగే ఇంటికివెళ్లిపోయి.. బ్యాగ్ తెరుస్తాడు. అందులో డబ్బుల కట్టలు ఉంటాయి. ఆశ పుడుతుంది. అప్పుడే కూతురు.. కట్టెలు కొట్టేవాడి నీతికి మెచ్చిన లక్ష్మీదేవి బంగారు, వెండి గొడ్డళ్లను బçహూకరించే కథ చదువుతుంటుంది. అది చెవినపడ్డ హీరాలాల్ చప్పున దార్లోకి వస్తాడు. బ్యాగ్‌లో ఉన్న సైరా ఐడెంటిటీ కార్డ్ ద్వారా ఆమె ఆఫీస్ అడ్రస్ తెలుసుకొని వెళ్లి బ్యాగ్ ఇచ్చేస్తాడు. అతని నిజాయితీకి కదిలిపోతుంది సైరా.హీరాలాల్ వివరాలను ఆరా తీస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఆమెకు గున్‌గున్ జబ్బు గురించి. రేడియో క్యాంపెయిన్ ద్వారా విరాళాలు సేకరించి గున్‌గున్ ఆపరేషన్‌కు ఇతోధిక సహాయం చేయాలనుకుంటుంది. ఆ క్రమంలోనే సైరా అలా గున్గున్ను రేడియో స్టేషన్‌కు పిలిచి.. లిటిల్ ఆర్జేగా పరిచయం చేస్తుంది. గున్‌గున్ చెప్పిన కథ తర్వాత ఆర్జే సైరా ఆ అమ్మాయికున్న జబ్బు గురించి చెప్పి, స్పందించిన వాళ్లు ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కోరుతుంది. గుండె కోత మొత్తమ్మీద సైరా ప్లాన్ వర్కవుట్ అయి దాదాపు 18 లక్షల రూపాయలు విరాళంగా వస్తాయి. మిగిలిన రెండు లక్షలను ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ తన ఫీజ్ కింద మాఫీ చేసేస్తాడు. గున్గున్కు హార్ట్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ అవుతుంది. ఆపరేషన్ అయి కోలుకున్నాక మొట్టమొదట సుమీత్‌ను చూడాలనుకుంటుంది. కాని రాడు. వాళ్లమ్మ మీనా కూడా రాదు. ఫోన్లో గున్‌గున్ యోగక్షేమాలు అడుగుతుంటుంది అంతే. గున్‌గున్ చిన్నబుచ్చుకుంటుంది. సుమీత్ అన్నను చూడాలి.. తీసుకెళ్లమని తండ్రిని అడుగుతుంది. వాళ్లింటికి తీసుకెళ్తాడు. అక్కడ గోడ మీద సుమీత్ ఫొటోకి దండవేసి ఉండటం చూసి హతాశుడవుతాడు హీరాలాల్. అప్పుడు నిజం తెలుస్తుంది మీనా ద్వారా. గున్‌గున్ ఆపరేషన్ కోసమని ఆసుపత్రికి వెళ్లినప్పుడే కార్ యాక్సిడెంట్లో సుమీత్ ప్రాణాలు కోల్పోతాడు. ఆ గుండెనే గున్గున్కి అమరుస్తారు. కుప్పకూలి పోతాడు హీరాలాల్. తన అమ్మలాగా, సుమీత్వాళ్ల నాన్నలాగా సుమీత్కూడా నక్షత్రాల దగ్గరకు వెళ్లిపోయాడని గున్గున్కు అర్థమవుతుంది. అప్పటి నుంచి సుమీత్ ఆశయాలను తను నెరవేర్చాలని అనుకుంటుంది. ఇంకా ఉంది తన ఆటో ద్వారా స్మగ్లింగ్ చేయాలనుకున్న దందాబాజ్లను ఎదిరించి తన నీతి, నిజాయితీ, ధైర్యాన్ని ఇంకోసారి నిరూపించుకుని హీరాలాల్ నిజంగానే హీరో అవుతాడు. ప్రజల సంక్షేమ పనుల్లో మునిగిపోతాడు. ముగింపు ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అప్లోడ్ అయిన లేటెస్ట్ సీరీస్. కథనం చాలా స్లో. పాత థీమ్‌తోనే సాగినా చుట్టూ ఉన్న చాలా విషయాలు పెద్దవాళ్లను ఆలోచింపచేస్తాయి. స్నేహం విలువను చెప్తుంది. పిల్లల్లో డబ్బు, కుల, మత భేదాలను నాటొద్దని, సహనం, సహాయం చేసే నైజం నేర్పాలని.. ఆడపిల్లకు బేలతనాన్ని అలంకరించొద్దని, మగపిల్లాడికి అహంకారాన్ని ఫీడ్ చేయొద్దని ... పేరెంట్స్ అంటే పిల్లలకు గురువులు, స్నేహితులు అనీ చూపిస్తుంది ‘మేరే పాపా.. హీరో హీరాలాల్’ కథ. కుటుంబం అంతా చూడదగ్గ సీరియల్. – సరస్వతి రమ -
కుమార్తె ప్రేమ వ్యవహారం.. తల్లి ఆత్మహత్య
మర్లపాలెం(గన్నవరం): కుమార్తె ప్రేమ వ్యవహారం విషయమై మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మర్లపాలెం గ్రామానికి చెందిన చెరుకు జయబాబు ప్రైవేట్ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీదేవి (35) ఇంటి వద్ద టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరి కుమారై లావణ్య ఇంటర్మీడియట్ చదువుతోంది. శ్రీదేవి మేనల్లుడైన తెనాలికి చెందిన ధర్మసాయికి, లావణ్యకు మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహరం నడుస్తోంది. రెండు వారాల క్రితం జయబాబు డ్యూటీ నిమిత్తం వెళ్లగా ఇంటి వద్ద శ్రీదేవి, కుమారై మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం లావణ్య పుట్టిన రోజు కావడంతో ఆమెను తెనాలి తీసుకువెళ్లేందుకు ధర్మసాయి ఇంటికి వచ్చాడు. దీనికి శ్రీదేవి నిరాకరించింది. ధర్మసాయి ఆమెతో గొడవపడి బలవంతంగా లావణ్యను తీసుకువెళ్లాడు. అయితే మేనల్లుడితో కుమారై ప్రేమ వ్యవహారాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న భర్త జయబాబుకు ఈ విషయం తెలిస్తే మందలిస్తాడనే భయాందోళనకు శ్రీదేవి గురైంది. దీనికితోడు కుమారైకు చెప్పినప్పటికి వినకుండా మేనల్లుడితో వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంటిలో సీలింగ్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి మనుమరాలు జన్మదినం కోసం వీరపనేనిగూడెం వచ్చిన శ్రీదేవి తల్లి ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి నిశ్చేష్టురాలైంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సీఐ కె. శ్రీధర్‌కుమార్ నేతృత్వంలో సిబ్బంది విచారణ చేపట్టారు. మృతురాలు చేతిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కూతురిని చంపిన తల్లికి జీవితఖైదు
ఆదిలాబాద్: కూతురును అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిందిపోయి.. ఆ కన్నతల్లి కర్కశత్వానికి ఒడిగట్టింది. 9 నెలల పసికందు అని కూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా చిదిమేసింది. ఈ సంఘటనలో తల్లికి జీవితఖైదు విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉదయగౌరి శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించారు. ముథోల్ మండలంలోని వడ్తాల్ గ్రామానికి చెందిన అల్మోల్ల రాణి 2015 అక్టోబర్ 15న తన 9 నెలల కూతురు శివానిని గొంతు నులిమి హత్య చేసింది. అయితే తాను ఇంట్లో లేని సమయంలో భర్తే చంపాడంటూ ముథోల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ముథోల్ సీఐ గణపతిజాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తానే కూతురును చంపి కేసును భర్త లక్ష్మణ్‌పైకి నెట్టినట్లు దర్యాప్తులో ఒప్పుకుంది. దీంతో రాణిని అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 13 మంది సాక్షులను ప్రవేశపెట్టి విచారించారు. నేరం రుజువు కావడంతో రాణికి జీవితఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు వెల్లడించినట్లు కోర్టు లైజన్ అధికారి వెంకట్రావ్ తెలిపారు.