యావత్ ప్రపంచాన్ని తన నటనతో కట్టిపడేసిన హాస్యనటుడు చార్లీ చాప్లిన్ తెలియని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. తన కూతురు నటి జోసెఫిన్ చాప్లిన్ మరణించారని వారి కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆమె వయస్సు 74. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం.. జూలై 13న పారిస్‌లో మరణించారని పేర్కొన్నారు. ఆమె మృతి వెనుక కారణం ఇంకా వారు వెల్లడించలేదు. సుమారు 10రోజులు క్రితమే ఆమె చనిపోతే ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచారని తెలియాల్సి ఉంది.
ఆమె హాలీవుడ్‌లో ది కాంటర్‌బరీ టేల్స్ , డౌన్ టౌన్,ది బే బాయ్ వంటి పదికి పైగా చిత్రాల్లో నటించారు. జోసెఫిన్ చాప్లిన్ మార్చి 28, 1949న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో చార్లీ చాప్లిన్, ఊనా ఓ'నీల్‌లకు జన్మించిన ఎనిమిది మంది సంతానంలో మూడవ వ్యక్తి.
(ఇదీ చదవండి: అక్కా పిల్లల్ని ఎప్పుడు కంటారంటూ శివ జ్యోతి భర్తపై దారుణమైన కామెంట్లు)
ఆమె తన తండ్రి చార్లీ చాప్లిన్ 1952 లైమ్‌లైట్‌లో కొనసాగుతున్న సమయంలోనే సినీరంగ ప్రవేశం చేసింది. 1969లో నికోలస్‌ను పెళ్లి చేసుకుని 1977లో అతని నుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత తను పలు సినిమాలతో బిజీగా ఉంటూ.. సుమారు పదేళ్ల తర్వాత 1989లో జీన్ క్లూడ్ గార్డెన్‌ను వివాహం చేసుకుంది. అతను 2013లో అనారోగ్యంతో మరణించారు. ఆమెకు ముగ్గురు కుమారులు చార్లీ, ఆర్థర్, జూలియన్ రోనెట్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment