అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి | Suriya Kanguva Movie Editor Nishad Yusuf Found Dead At His Apartment, Check Out Details | Sakshi
Sakshi News home page

Nishad Yusuf: మరికొన్నిరోజుల్లో సినిమా రిలీజ్.. ఇంతలోనే ఇలా

Published Wed, Oct 30 2024 10:00 AM | Last Updated on Wed, Oct 30 2024 11:28 AM

Kanguva Movie Editor Nishad Yusuf Death His Apartment

సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రాన్ని నవంబర్ 14న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇంతలో విషాదం జరిగిపోయింది. ఈ సినిమాకు పనిచేసిన ఎడిటర్ నిషాద్ యూసఫ్ (43).. అనుమానాస్పద రీతిలో చనిపోయి కనిపించాడు. ఇప్పుడీ వార్త అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.

(ఇదీ చదవండి: నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్‌బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో)

కేరళకు చెందిన నిషాద్ యూసఫ్.. ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తల్లుమలా, ఉండా, వన్, సౌదీ వెళ్లక్క, అడియోస్ అమిగోస్ తదితర చిత్రాలకు పనిచేశాడు. ఇవన్నీ గత రెండు మూడేళ్లలోనే రిలీజయ్యాయి. నిషాద్ పనిచేసిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. ఇంతలో ఇలా మృతి చెందడంపై తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

బుధవారం వేకువజామున 2 గంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లోని తన అపార్ట్‌మెంట్ శవమై కనిపించాడు. మృతికి కారణాలు ఇంకా తెలిసిరాలేదు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా మరో 15 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని.. ఇలా ఎడిటర్ చనిపోవడం 'కంగువ' టీమ్‌కి కూడా షాకే.

(ఇదీ చదవండి: టాలీవుడ్ సీనియర్ నిర్మాత కన్నుమూత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement