
కోలీవుడ్ నటి విజయలక్ష్మి పడుపు వృత్తిని కొనసాగిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్టు నామ్‌తమిళర్ కట్చి కన్వీనర్, నటుడు సీమాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వివరాలు..విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే సీమాన్ లైంగిక దాడికేసు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన వద్ద పోలీసులు తీవ్ర విచారణ జరిపి, కోర్టులోచార్జ్ షీట్ దాఖలకు సిద్ధమవుతున్నారు.
అదే సమయంలో ఈకేసు నుంచి తన పేరును తప్పించాలని కోరుతూ సీమాన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ పరిస్థితులలో సీమాన్ మరోమారు విజయలక్ష్మిపై విరుచుకుపడ్డారు. తెన్‌కాశి పర్యటనకు వెళ్తూ చైన్నె విమానాశ్రయంలో మీడియాతో ఆయన మట్లాడుతూ, తమిళనాడులో రోజూ లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుల నమోదు లేని రోజంటూ లేదని వివరిస్తూ, వీటి మీద దృష్టి పెట్టకుండా తనను అవమాన పరచడమే లక్ష్యంగా పోలీసులు ముందుకెళ్తున్నారని మండిపడ్డారు.
తన మీద ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి పడుపు వృత్తిలో ఉన్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నట్టు ఆరోపించారు. నగరంలో ఒక ఖరీదైన భవనం తీసుకుని ఆమెతో పాటు మరికొందరు యువతులతో ఈ వృత్తిలో ఉన్నారంటూ తెలిపారు. ఎంజాయ్‌మెంట్ గురించి ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ చెప్పిన ఎంజాయ్‌మెంట్ వితవుట్ రెస్పాన్స్ బిలిటీ అన్న వ్యాఖ్యలను తాను అనుసరిస్తున్నానని వివరించారు. పెరియార్ మార్గంలోనే ఇప్పుడు తానుకూడా నడుస్తున్నానని, అలాంటప్పుడు తాను ఏ తప్పు చేసినట్టో అని ప్రశ్నించారు. ఇందుకు డీఎంకే ఎంపీ కనిమొళితో పాటూ ఆ పార్టీ వర్గాలే కాదు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయలక్ష్మి తన కన్నీరే భవిష్యత్‌లో సీమాన్‌కు శాపంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment