vijayalaxmi
-
గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ వరకు..
సాధించాలనే తపన, పట్టుదల ముందు ఏ వైకల్యమూ అడ్డుకారాదని.. ప్రతిభ ఉండాలే కానీ అవార్డులు.. రివార్డులు.. వాటంతట అవే వస్తాయని నిరూపించింది.. ఆ యువతి. దివ్యాంగురాలన్న భావన లేకుండా పట్టుదలతో కాన్వాస్‌పై చిత్రలేఖనం (Painting) నేర్చుకుని విమర్శకుల ప్రశంసలు పొందుతూ.. శభాష్ అనిపించుకుంటోంది.. ఆమే మేడ్చల్ జిల్లా శామీర్‌పేట (Shamirpet) మండలం తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి. చిత్రకళతో పాటు సంగీతంలోనూ రాణిస్తూ.. ప్రముఖుల ప్రశంసలు పొందుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి మూడేళ్ల వయసులో పోలియో వచ్చి రెండు కాళ్లు, కుడి చెయ్యి పనిచేయకుండా పోయాయి. తల్లిదండ్రులు నర్సింహులు, ప్రమీళ, అన్నా వదిన అనంద్, శ్రవంతి విజయలక్ష్మికి అండగా నిలిచారు. ఆమెలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. దివ్యాంగురాలనే భావన కలుగకుండా చిత్రలేఖనంపై పట్టుసాధించేలా ప్రోత్సహించారు. మొదట్లో దినపత్రికలు, ఆదివారం ప్రచురణలలోని బొమ్మలను చూసి చిత్రలేఖనం నేర్చుకుంది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పాఠశాల దశలోనే వివిధ చిత్రలేఖన పోటీల్లో బహుమతులు అందుకుంది. అవార్డులు.. ప్రశంసలు.. విజయలక్ష్మి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర వికలాంగుల సంఘం సహకారంతో రవీంద్ర భారతిలో పలుమార్లు చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకుంది. త్యాగరాయ గానసభలో ప్రతిభా పురస్కారాలను అందుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ చేపట్టిన ఆన్లైన్ కాంపిటేషన్‌లో వరుసగా మూడేళ్లు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్తో పాటు అవార్డులను గెలుచుకుంది. తెలంగాణ ఐకాన్ 2024, బుల్లితెర అవార్డు, తెలంగాణ సేవారత్న– 2025 వంటి అవార్డులనూ అందుకుంది. ఇప్పటివరకూ సుమారు వందకు పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. చిన్ననాటి నుండే.. చిత్రలేఖనం అంటే చిన్ననాటి నుండే ఇష్టం. మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నా ఎన్నడూ నిరాశపడకుండా కుటుంబ సభ్యుల పోత్సాహంతో ప్రాక్టీస్ చేశా. గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించడం ఆనందాన్నిచ్చింది. అనేక మంది ప్రముఖల ప్రశంసలు పొందాను. – విజయలక్ష్మి, తుర్కపల్లిమూడేళ్ల మోక్ష్ ప్రపంచ రికార్డు జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్స్ ఆత్మకూరి రామారావు స్కూల్లో నర్సరీ చదువుతున్న మోక్ష్ అయాన్ సేవల (Moksh Ayaan Sevala) ప్రపంచ రికార్డు సృష్టించాడు. మూడేళ్ల ఐదు నెలల వయసున్న ఈ చిన్నారి ఇటీవల జరిగిన వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిట్లో భాగంగా అత్యంత వేగంగా పజిల్ సాల్వింగ్‌తో పాటు కలర్ మ్యాచింగ్‌లో అందరి కంటే ముందు నిలిచాడు. 3–5 ఏళ్ల కేటగిరీలో పాల్గొన్న మోక్ష్ కేవలం 11 సెకన్లలోనే ఈ పజిల్‌ను సాల్వ్ చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు.పాఠశాలకు చెందిన ప్రీ ప్రైమరీ కో–ఆరినేటర్ విశాల్ అమిన్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం అద్భుతమన్నారు. విద్యార్థి ఘనతను స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతానాయర్ ప్రశంసించారు. ఈ ఘనత తమ స్కూలుకే గర్వకారణమని, భవిష్యత్తులో ఇలాంటి రికార్డులు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. బాలుడికి పాఠశాల నుంచి సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇలాంటి విద్యార్థులు మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. చదవండి: పక్షులపై ప్రేమతో వేల మైళ్ల ప్రయాణం -
నటిపై సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
కోలీవుడ్ నటి విజయలక్ష్మి పడుపు వృత్తిని కొనసాగిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్టు నామ్‌తమిళర్ కట్చి కన్వీనర్, నటుడు సీమాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వివరాలు..విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే సీమాన్ లైంగిక దాడికేసు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన వద్ద పోలీసులు తీవ్ర విచారణ జరిపి, కోర్టులోచార్జ్ షీట్ దాఖలకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఈకేసు నుంచి తన పేరును తప్పించాలని కోరుతూ సీమాన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ పరిస్థితులలో సీమాన్ మరోమారు విజయలక్ష్మిపై విరుచుకుపడ్డారు. తెన్కాశి పర్యటనకు వెళ్తూ చైన్నె విమానాశ్రయంలో మీడియాతో ఆయన మట్లాడుతూ, తమిళనాడులో రోజూ లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుల నమోదు లేని రోజంటూ లేదని వివరిస్తూ, వీటి మీద దృష్టి పెట్టకుండా తనను అవమాన పరచడమే లక్ష్యంగా పోలీసులు ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. తన మీద ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి పడుపు వృత్తిలో ఉన్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నట్టు ఆరోపించారు. నగరంలో ఒక ఖరీదైన భవనం తీసుకుని ఆమెతో పాటు మరికొందరు యువతులతో ఈ వృత్తిలో ఉన్నారంటూ తెలిపారు. ఎంజాయ్మెంట్ గురించి ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ చెప్పిన ఎంజాయ్మెంట్ వితవుట్ రెస్పాన్స్ బిలిటీ అన్న వ్యాఖ్యలను తాను అనుసరిస్తున్నానని వివరించారు. పెరియార్ మార్గంలోనే ఇప్పుడు తానుకూడా నడుస్తున్నానని, అలాంటప్పుడు తాను ఏ తప్పు చేసినట్టో అని ప్రశ్నించారు. ఇందుకు డీఎంకే ఎంపీ కనిమొళితో పాటూ ఆ పార్టీ వర్గాలే కాదు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయలక్ష్మి తన కన్నీరే భవిష్యత్‌లో సీమాన్‌కు శాపంగా మారుతుందని వ్యాఖ్యానించారు. -
జరివరం చీరల షాప్ ని మేయర్ విజయలక్ష్మి & శ్యామలా దేవి ప్రారంభించారు
-
‘త్వరలో ముషీరాబాద్ బీజేపీకి షాక్’
సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఒకటి రెండు రోజుల్లో గట్టి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నిర్వహించిన చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ్యానర్లలో బీజేపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ విజయలక్ష్మి ఫొటో ప్రత్యక్షం కావడంతో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశం బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సాక్షి ఆరా తీయగా అనేక విషయాలు తేటతెల్లమయ్యాయి. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, రాంనగర్ డివిజన్ అధ్యక్షురాలిగా, డెంటల్ డాక్టర్‌గా అందరికీ పరిచయమున్న డాక్టర్ విజయలక్ష్మి త్వరలోనే ఎమ్మెల్సీ కవిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఒకటి రెండు సార్లు సమావేశమై తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కేరళలో ఉన్న కవిత హైదరాబాద్ రాగానే ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. విజయలక్ష్మి పార్టీని వీడడానికి గల కారణాలపై ఆరా తీయగా.. రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శిగా బాధ్యతలు వీడి మూడు సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ పట్టించుకోవడం లేదనే.. తనకు ఏదైనా బాధ్యత అప్పగించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పలుమార్లు కలిసినప్పటికీ ఫలితం లేకపోవడమే ఆమె అలకకు కారణంగా తెలిసింది. దీంతో పాటు ఆమె ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి గుడి వద్ద బాదం పాలను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. దీనికి బీజేపీ నాయకుల నుంచి సహకారం అడిగినా స్పందన కరువైనట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలకు సైతం తనను పిలవడం లేదని, బతుకమ్మ సంబరాలు, బీజేపీ సంస్థాగత సమావేశాలకు సైతం ఆహ్వానం అందడంలేదని ఆమె ఆరోపిస్తున్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు అయిన తరువాత ముషీరాబాద్ బీజేపీలో ఎవరికి వారే అన్నట్లుగా ఉందని, కన్వీనర్‌గా రమేష్‌రాం రెండవసారి ఎన్నికైన తరువాత ఈ పరిస్థితి మారదని భావించే తాను బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఆమె సాక్షికి వివరించారు. తాను బీఆర్ఎస్లో చేరుతున్న విషయం బయటకు రావడంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు ఫోన్ చేసి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇస్తున్నారని, ఇప్పటి వరకు వారంతా ఎక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నిస్తున్నారు. చదవండి: ‘ఇది పార్టీ అధికారిక కార్యక్రమం.. అంతా రావాల్సిందే!’ రేవంత్ యాత్ర ప్రకటించాడా? -
ఒక కొమ్మకు పూచిన అనుబంధం
పుట్టినింటి ప్రేమ బంధం ఎన్నేళ్లయినా దారం పోగులతో మరింత పదిలంగా అల్లుకుంటూనే ఉంటుంది. అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఆండగా ఉండే ఆప్యాయతలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ మది నిండా సంతోషాలను నింపుతూనే ఉంటుంది. రక్షగా నేనున్నానంటూ జీవితమంతా భరోసాను చూపుతూనే ఉంటుంది. ఒక కొమ్మకు పూచిన పూలను కలిపే దారమైన రాఖీ తోబుట్టువుల ప్రేమను లోకాన చల్లని పున్నమి వెలుగులుగా పంచుతూనే ఉంటుంది. ‘‘బాగున్నావా అన్నా!’’ అంటూ ఆప్యాయతల మధ్య పుట్టినింటి గడపకు వచ్చి యోగక్షేమాలను కనుక్కునేలా చేసే రాఖీ పండగ అంటే అన్నకు అమితమైన ఆనందం. ‘అంతా సంతోషమేనా చెల్లీ’ అనే అన్న పలకరింపుతో గుండె బరువును దింపేసే రాఖీ అంటే తోబుట్టువుకు సంబరమే. హంగూ ఆర్బాటాలకు చోటు లేని, ధనిక–పేద తేడా చూపని రాఖీ తమ జీవితాల్లో నింపే ఆనందం గురించి కొందరు తోబుట్టువులు పండగపూట పంచుకున్న అనుభవాలు ఇవి. కేరింగ్.. షేరింగ్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. పీజీ వరకు చదువుకున్న. గవర్నమెంట్ టీచర్ అవ్వాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నాకు తోడబుట్టిన అన్నదమ్ములు లేరు. మా చిన్నమ్మ కొడుకు గోపాల్ నాకు తోడబుట్టినవాడికంటే ఎక్కువ. ఏ చిన్న అవసరమైనా ‘అక్కా’ అంటూ ముందుంటాడు. తోడబుట్టిన అన్నదమ్ములు లేరనే లోటు ఎప్పుడూ అనిపించలేదు. చిన్ననాటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. స్కూల్, కాలేజీ ప్రతి చిన్న విషయం తమ్ముడితో షేర్ చేసుకోకుండా ఏ రోజూ లేదు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాఖీ కట్టడం మిస్ అవలేదు. – విజయలక్ష్మి జీవితానికి మంచి దారి ఇప్పుడు నేను బీటెక్ చేస్తున్నానంటే అక్క ఇచ్చిన సజెషన్సే. చదువులో ఎప్పుడూ సాయంగా ఉంటుంది. టెన్త్, ఇంటర్, ఆ తర్వాత బీటెక్ చేసే విషయంలోనూ అక్క గైడెన్స్ ఉంది. నాకు అవసరమైనది అమ్మనాన్నలకు చెప్పి మరీ ఒప్పిస్తుంది. నేనే విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడంలో ఆందోళన పడుతున్నట్టుగా అనిపిస్తే చాలు వెంటనే పసిగట్టేస్తుంది. ట్యూషన్స్ చెప్పి, పార్ట్ టైమ్ వర్క్స్ చేస్తుంటుంది. చదువే జీవితాలను మార్చుతుంది అని ఎప్పుడూ చెబుతుంది. ఏదైనా అవసరం ఉంటుందని, నాకే డబ్బులు ఇస్తుంటుంది. – గోపాల్ నా బాధ్యత మా అమ్మ, నాయినలు కూలీనాలీ చేసుకుని బతుకుతుండిరి. నేను ఏడో తరగతి దాగా చదివిన. నలుగురు అక్కచెల్లెళ్ల తోడ నేను ఒక్కణ్ణే. ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు ముందుగల్లనే అయిపోయినయి. అమ్మ, నాయిన చనిపోతే చెల్లెలి బాధ్యత∙నాదే అనుకున్న. మంచిగ చదువుకుని మా ఇంటికి వెలుగైంది. ఇప్పుడు నా ఇద్దరు పిల్లల చదువుల సంగతి మా చెల్లెనే చూసుకుంటోంది. నా చెల్లెలిని చూస్తే గర్వంగా, సంతోషంగా ఉంటుంది. – సాయిలు మా అన్న త్యాగం గొప్పది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో ఉంటున్నాం. మా అమ్మనాన్నలు చనిపోతే అన్నీ తానై చూసుకున్నాడు మా అన్న. కూలి పనులకు వెళుతూ నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉన్నత చదువు చదవడానికి కారణం మా అన్నయ్యే. ఎం.ఎ. బీఈడీ చేశాను. ఇప్పుడు విద్యాశాఖలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్నాను. అన్నయ్య చేతుల మీదుగానే పెళ్లి జరిగింది. ఈ రోజు నేను ఆనందంగా ఉన్నానంటే మా అన్ననే కారణం. నా కోసం అన్న చేసిన త్యాగం చాలా గొప్పది. – సరోజ కలిస్తే పండగే! రాఖీ పండగ నాడు మా అన్న మా ఇంటికైనా రావాలి. లేదంటే నేనే మా అన్న ఇంటికి వెళ్లాలి. అన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తాడు. నేను ఇండ్లళ్ల పనులు చేస్త. నా పెళ్లయి పదిహేనేళ్లయినా ఏ ఒక్కసంవత్సరమూ రాఖీ కట్టుకోకుండా ఉన్నది లేదు. ఒకసారి అన్నకు ఆరోగ్యం బాగోలేకుండే. ఎంత తల్లడిల్లిననో. ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్ననో. అన్న ఉంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తది. మేం, మా అన్నపిల్లలు, మా పిల్లలు కలిస్తే చాలు ఆ రోజు మా ఇంట్ల పండగే. ఇక రాఖీ పండగ అయితే చాలు, ఆరోజు అందరం కలిసి సినిమాకు కూడా పోయేవాళ్లం. రాఖీ పండగ నాడు మాత్రం మా అన్న నాకు చీర తేకుండా రాడు. – సుమలత ఒకరికొకరం రక్ష మా సుమలత మనసు మంచిది. తన చేత్తో ఏది తీసుకున్నా నాకు మంచి జరుగుతుందని చిన్నప్పటి నుంచి నాకు నమ్మకం. మేం సదువుకున్నది లేదు. కానీ, ఒకరి కష్టంలో ఒకరం తోడుంటం. మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్‌ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నం. ఊరి నుంచి దూరంగా వచ్చి బతుకుతున్నవాళ్లం, మాకు మేమే రక్షగా ఉండాలనుకుంటాం. – సురేష్ మా మామయ్యకు మా అమ్మ రాఖీ కడుతుంది. నేను మా తమ్ముడు అజయ్‌కి రాఖీ కడతాను. పొద్దున్నే నేనూ, తమ్ముడు కొత్తబట్టలు వేసుకుంటాం. అమ్మ స్వీట్ చేస్తుంది. నాకు చాక్లెట్స్ ఇష్టం. అమ్మనడిగితే తిడుతుంది. కానీ, రాఖీ పండగ రోజు మాత్రం పెద్ద చాక్లెట్ కొని తమ్ముడితో నాకు ఇప్పిస్తుంది. ఒకటే చాక్లెట్ కదా అందుకని సగం చాక్లెట్‌ను తమ్ముడికి ఇస్తాను. ఈ పండగ చాలా బాగుంటుంది. – లాస్య ఎంత పని ఉన్నా ముందుంటాడు మాది తెలంగాణలోని చేవెళ్ల. ఆశావర్కర్‌గా పనిచేస్తున్నాను. రాఖీ పండగ వచ్చిందంటే చాలు మా తమ్ముడు ఇంటికి రాకుండా ఉండడు. ముగ్గురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు అన్నదమ్ములం. మా శేఖర్ చిన్నవాడు. అందుకే మా కందరికీ వాడంటే కొడుకులెక్క. నాకు ముగ్గురు బిడ్డలు. అందరి బాగోగులు తెలుసుకుంటూ, ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఎంత పని ఉన్నా ‘అక్కా’ అని వచ్చేస్తడు. – అమృత రాఖీ కడితేనే ఆ ఏడాది అంతా మంచి అమ్మనాన్నలు పనికిపోతే అక్కనే నన్ను ఎక్కువ చూసుకుంది. అమ్మలెక్కనే నా బాగోగులు చూసుకుంది. హైదరాబాద్ బాలానగర్‌లోని ఓ హాస్పిటల్లో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తా. మా అందరి పెళ్ళిళ్లు అయి ఎవరి కుటుంబాలు వారివి అయినా వారానికి ఒకసారైనా కలుసుకుంటం. రాఖీ పండగ వస్తే మాత్రం ఎక్కడున్నా అక్కల దగ్గరవాలిపోతా. వారి చేత రాఖీ కట్టించుకుంటేనే ఆ సంవత్సరం అంతా నాకు మంచిగ ఉంటుందని నమ్మకం. – శేఖర్ -
జీహెచ్ఎం'షీ టీమ్'
-
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్న టీఆర్ఎస్
-
‘బల్దియా’ రాణులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్‌గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీలో ఈసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశం లేకపోవడంతో టీఆర్ఎస్, బీజేపీలు బరిలో నిలవగా రెండు పదవులు కూడా గులాబీనే వరించాయి. బుధవారం ఎంఐఎం కూడా విప్‌ను నియమించడంతో పోటీలో ఉంటుందని భావించినా.. ఎంఐఎం నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు. మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులకూ ఎంఐఎం సభ్యులు టీఆర్ఎస్కే ఓట్లు వేశారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలైనందున ఎంఐఎం వైఖరి ఎలా ఉంటుందోనని పలువురు భావించినా.. ఎంఐఎం సైతం టీఆర్ఎస్కు మద్దతు పలకడంతో గత పాలకమండళ్ల తరహాలోనే ఈసారి కూడా టీఆర్ఎస్, ఎంఐఎం సఖ్యతతోనే పనిచేయగలవని భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనే వరిస్తుందనుకున్నా.. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తనయ అయిన విజయలక్ష్మిని గత ఎన్నికల్లోనే మేయర్ పదవి వరిస్తుందని భావించినా.. అప్పట్లో ఆమెకు టికెట్ లభించలేదు. విజయలక్ష్మి ఉన్నత విద్యావంతురాలు, విదేశాల్లో ఉండి వచ్చారు. కాగా, టీఆర్ఎస్ తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న మోతె శోభన్‌రెడ్డి సతీమణి మోతె శ్రీలతను మేయర్ పదవి వరించనుందని ప్రచారం జరిగినా.. ఆమెకు డిప్యూటీ మేయర్ అవకాశం కల్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ మహిళలే కావడం విశేషం. డిప్యూటీ మేయర్‌గా మైనార్టీ వర్గాలకు టీఆర్ఎస్ అవకాశం కల్పిస్తుందని తొలుత భావించినా అలా జరగలేదు. ఐదో మహిళా మేయర్.. గద్వాల విజయలక్ష్మి బల్దియాకు 26వ మేయర్ కాగా, ఐదో మహిళా మేయర్. చివరి వరకు పలు ఊహగానాలు, ఉత్కంఠ నెలకొన్నా.. ఎన్నికల ప్రక్రియ మొత్తం 20 నిమిషాల్లోనే ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియా పరిశీలకులుగా వ్యవహరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ముందు ఉదయం 11 గంటలకు కొత్తగా కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషల వారీగా గ్రూపులుగా విడదీసి అందరినీ ఒకేసారి ప్రమాణం చేయించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రక్రియ ఇలా సాగింది.. ఎన్నిక ప్రారంభం కాగానే ఎంఐఎం ఓటు వేస్తుందా లేదా తటస్థంగా ఉంటుందా అన్న ఉత్కంఠ సభలో నెలకొంది. అయితే ఎంఐఎం సభ్యులంతా టీఆర్ఎస్ సభ్యులతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేశారు. దీంతో బీజేపీ సభ్యులు సభలో కొద్దిసేపు గొడవ చేశారు. టీఆర్ఎస్ సభ్యులు, ఎక్స్అఫీషియో సభ్యులు సహ మొత్తం బలం 88 మంది ఉన్నా.. ఎన్నికయ్యేందుకు వారంతా అవసరం లేకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలందరూ హాజరు కాలేదు. వారి ఎక్స్అఫీషియో ఓట్లను ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున వాటిని ఇక్కడ వినియోగించుకోలేదని టీఆర్ఎస్ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు మహిళా కార్పొరేటర్లు మాత్రమే ఉండటంతో, వారు ఎవరికీ ఓట్లు వేయొద్దని నిర్ణయించుకుని ఎన్నిక ప్రక్రియలో పాలు పంచుకోలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్లిపోయారు. -
మేయర్ ఖరారు.. అందరి కళ్లు ఆమెపైనే
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం కాసేపట్లో జరగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు కూడా అనంతరం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అందరి దృష్టి బంజారాహిల్స్ కార్పొరేటర్‌పైనే నిలిచింది. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా రెండోసారి గెలిచిన గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ పదవి వరించనుందనే వార్తలు గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ దాదాపు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని ఎన్బీటీనగర్లో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. కార్యకర్తలు, నేతల రాకపోకలతో కొత్త వాతావరణం కనిపిస్తోంది. కార్పొరేటర్ తండ్రి టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే కూడా ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. దీంతో మేయర్ పదవి దాదాపుగా గద్వాల్ విజయలక్ష్మినే వరిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఉత్కంఠకు తెర వేయాలంటే ఇంకొద్ది సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో అందరి కళ్లు బంజారాహిల్స్‌పైనే కేంద్రీకృతమయ్యాయి. దాదాపుగా గద్వాల్ విజయలక్ష్మి పేరు సీల్డ్ కవర్లోకి ఎక్కిందని ప్రచారం జరుగుతుంది. ఆమె మేయర్‌గా ఎన్నికైతే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అవుతారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిను ఖరారు చేసినట్లు సమాచారం. -
వివాదంలో కేకే కుమార్తె విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమెపై షేక్‌పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయలక్ష్మి తనపై దాడి చేసిందంటూ బుధవారం నాటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెతో పాటు అనుచరులు షేక్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తనను దుర్భాషలాడడమే కాకుండా తన ఉద్యోగ విధుల రీత్యా హైకోర్టుకు వెళ్తుతుండగా అడ్డుకుని నెట్టివేశారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాను ఎంపీ కేశవరావు కూతుర్ని అంటూ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి ఓ వీడియోను సైతం విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్ పీఠం ఈసారి మహిళకు రిజర్వు కావడంతో ఆమె హైదరాబాద్ మేయర్ అయ్యే అవకాశం ఉందంటూ టీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ఈ క్రమంలో ఆమె వివాదంలో చిక్కుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే దీనిపై విజయలక్ష్మీ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. -
పుస్తకాల గూడు కావాలా?
కాలానికి ఒక శ్రేయోభిలాషి వస్తాడు. ఈ కాలంలో వినోద్ శ్రీధర్‌కు మించిన శ్రేయోభిలాషి లేడు. చెన్నైలో ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేస్తున్నారు. మరుసటి రోజుకు వాళ్ల ముంగిట్లోకి అతడొక లైబ్రరీయే తీసుకొస్తున్నాడు. రెండేళ్ల క్రితం శ్రీధర్ ప్రారంభించిన ‘ప్రీలవ్డ్ బుక్స్ లైబ్రరీ’ ఈ లాక్డౌన్ కాలంలో గొప్ప ఊరటనిస్తోంది. విజయలక్ష్మి అనే మహిళకు ఇద్దరు పిల్లలు. ఒకరు టెన్త్. ఒకరు ఇంటర్. ఇద్దరూ కాసేపు ఆన్లైన్ క్లాసులని కంప్యూటర్, ఫోన్ పట్టుకుంటున్నారు. అవి అయ్యాక వాళ్లు మళ్లీ గేమ్స్ కోసం వీడియోస్ కోసం మళ్లీ ఆ కంప్యూటర్, ఫోన్లో మునిగిపోతున్నారు. ‘ఇలా అయితే వీరు ఏం కాను?’ అని ఆమెకు బెంగ కలిగింది. మామూలు రోజుల్లో అయితే ఆటలో పాటలో ఫ్రెండ్స్‌తో బయట తిరగడమో ఏదో ఒకటి ఉంటుంది. ఈ లాక్డౌన్ వల్ల కదిలే పరిస్థితి లేదు. ఇంట్లో ఉంటే కుర్చీల్లో కూలబడి కంప్యూటర్‌కు అతుక్కుపోతే ఒళ్లు, బుర్ర రెండూ పాడైపోతాయి. ఆమెకు ఎవరో వినోద్ శ్రీధర్ గురించి చెప్పారు. అతడు చెన్నైలోని అశోక్ నగర్లో ‘ప్రీలవ్డ్ బుక్స్ లైబ్రరీ’ నడుపుతున్నాడు. అతనికి ఆమె ఫోన్ చేసింది. ఆమె: మీరు మాకు ఎలా సాయం చేస్తారు? వినోద్ శ్రీధర్: మీరు ఆరు వేల రూపాయలు కట్టి యాన్యువల్ మెంబర్షిప్ తీసుకోవాలి. మీకూ మీ పిల్లలకు ఏయే పుస్తకాలంటే ఆసక్తో, ఎటువంటి విషయాలంటే కుతూహలమో మేము తెలుసుకుంటాం. దానిని బట్టి మీ అభిరుచికి తగిన వంద పుస్తకాల ర్యాక్‌ను మీ హోమ్ లైబ్రరీగా మీ ఇంటికి తీసుకొచ్చి పెడతాం. మూడు నెలలలోపు మీరు ఆ పుస్తకాలను చదువుకోవచ్చు. మూడు నెలల తర్వాత కొత్త పుస్తకాలను పెడతాం. అలా సంవత్సరానికి నాలుగుసార్లు పెడతాం. ఆమె: మాకు అన్ని పుస్తకాలు అక్కర్లేదు. యాభై పుస్తకాల ర్యాక్ చాలు. ఇవ్వగలరా? వినోద్ శ్రీధర్: అలా ఇప్పటిదాకా చేయలేదు. కాని ఆలోచిస్తాను. వినోద్ శ్రీధర్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నాడు. అతడి తండ్రి ముప్పై ఏళ్లుగా పుస్తకాల స్టాల్ నడుపుతున్నాడు. కొడుకు ఆ వ్యాపారాన్ని అందుకుని ‘పుస్తకాలు కొనడానికి మన దగ్గరకు వచ్చే వారి కోసం ఎదురు చూసే కన్నా వారి ఇళ్లకే పుస్తకాలు చేరుద్దాం’ అని ‘ప్రీలవ్డ్ బుక్స్ లైబ్రరీ’ మొదలెట్టాడు. ఇందులో మన ఇంటికి తెచ్చి పెట్టే లైబ్రరీలో అన్ని కొత్త పుస్తకాలు ఉండవు. ఎవరో ఒకరు చదివినవి ఉంటాయి. మనం చదివాక మరో ఇంటికి వెళతాయి. ‘నాకు ఈ పని సంతృప్తిగా ఉంది’ అంటున్నాడు వినోద్. తన రోదసి విహారం కన్నా పాఠకులకు ఈ కాలంలో అవసరమైన కాల్పనిక విహారం అవసరమని భావిస్తున్నాడు. వినోద్ శ్రీధర్‌కు కాఫీషాపుల నుంచి, కార్పొరెట్ సెంటర్స్ నుంచి కూడా లైబ్రరీ ఏర్పాటుకు ఆహ్వానాలు అందుతున్నాయి. కస్టమర్లు కాసేపు పుస్తకాలు తిరగేసేలా చేయడం మంచి విషయమే అని ఆయా వ్యాపార స్థలాల యజమానులు భావిస్తున్నారు. చెన్నైకే కాదు ప్రతి ఊరికి ఒక శ్రీధర్ ఉంటే పిల్లలు పెద్దలు పుస్తకాల ప్రియులుగా మారవచ్చు. పుస్తకాలు మంచిని చెబుతాయి. ఇది కూడా కరోనాను ఎదుర్కొనేందుకు ఒక రకమైన ఇమ్యూనిటీయే. -
వేధింపులు తట్టుకోలేకపోయా: హీరోయిన్
రాయచూరు రూరల్(కర్ణాటక): సినీ నిర్మాత నుంచి డబ్బులు తీసుకొని పారిపోయిన ఆరోపణలు ఎదుర్కొంటున్న తుంగభద్ర కన్నడ సినిమా హీరోయిన్ విజయలక్ష్మి రాయచూరులో ప్రత్యక్షమయ్యారు. ఆమె భర్త ఆంజినేయతో కలిసి రాయచూరులో ప్రత్యక్షమైంది. గురువారం సిరవార తాలూకా హళ్లిహొసూరులో విలేకర్లతో ఆమె మాట్లాడారు. తుంగభద్ర సినిమా షూటింగ్ సమయంలో సహాయ డైరెక్టర్ ఆంజినేయను ప్రేమించానని తెలిపారు. ఆంజినేయ, తాను గంగావతిలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఇది నచ్చక తన అవ్వ, అమ్మ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారని వార్తలు వచ్చాయన్నారు. తన అవ్వ చని పోలేదని, తల్లి సవితా డ్రామాలాడుతోందని ఆమె మండిపడ్డారు. వారికి నా సంపాదనే ముఖ్యం తన తల్లిదండ్రులు విడిపోయి ఆరేళ్లు కావస్తోందన్నారు. తల్లి, పెంచిన తండ్రి పెడుతున్న బాధలు తట్టుకోలేకపోయానన్నారు. తన భర్తను చంపడానికి కూడా వారు కుట్ర చేశారని ఆమె ఆరోపించారు. తాను రాయచూరుకు వస్తున్న సమయంలో తాను ఎవరి వద్ద డబ్బు, బంగారు తీసుకోలేదని, తమ పెద్దలకు డబ్బు సంపాదించి పెట్టాలి తప్ప, తాను పెళ్లి చేసుకోరాదనని వారు కోరుకున్నారని ఆవేదన చెందారు. జిల్లా ఎస్పీ వేదమూర్తిని కలిసి తమకు రక్షణ కల్పించాలని విన్నవించినట్లు ఆమె తెలిపారు. దీంతో ఆమె అదృశ్యం మిస్టరీ వీడినట్లయింది. -
హీరో దంపతుల మధ్య వివాదం?
కర్ణాటక, యశవంతపుర : ఇటీవల ప్రముఖ నటుడు దర్శన్, అయన భార్య విజయలక్ష్మీ మధ్య మళ్లీ గొడవలు తలెత్తినట్లు పుకార్లు వచ్చాయి. సోమవారం ట్విట్టర్లో పరస్పరం అన్‌ఫాలో అయ్యారు. విజయలక్ష్మి దర్శన్ పేరుతో ఉన్న ట్విట్టర్లో ఖాతా నుంచి దర్శన్ పదాన్ని తొలగించటంతో ఈ వదంతులకు కారణమైంది. వదంతులను నమ్మవద్దని సోమవారం ఆమె ట్వీట్ చేశారు. అయితే ఇద్దరి మధ్య ఏదో వివాదం జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నారు. గతంలో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చడం తెలిసిందే. ఇటీవల విడుదలైన యజమాన సినిమా మేకింగ్ వీడియోలో దంపతులిద్దరూ కనిపించారు. దాంతో ఇద్దరూ సవ్యంగా ఉన్నారని అభిమానులు అనుకునేలోపే మళ్లీ ఏవో బిన్నాభిప్రాయాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య గొడవలను సరిదిద్దడానికి ఓ నటుడు, రాజకీయ నాయకుడు ఒకరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అన్నా వదిన సంసారం బాగుండాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. -
అర్ధరాత్రి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దౌర్జన్యం
విశాఖపట్నం , పాడేరు: మా స్థలానికి ఆక్రమించేందుకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దౌర్జన్యం చేస్తున్నారని, తరచూ అర్ధరాత్రిళ్లు మనుషులను పంపి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చింతలవీధి ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి సోమవారం పాడేరు సబ్ కలెక్టర్ డి.కె.బాలాజీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి మా ఇంటిపై రాళ్లు రువ్వారని, మా స్థలం ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేయడానికి పూనుకున్నారని తెలిపారు. ఈ సంఘటనపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ పాడేరు సీఐ, ఎస్ఐ సమక్షంలోనే ఆదివారం రాత్రి తమపై దౌర్జన్యానికి దిగారని చెప్పారు. రెండు జేసీబీలు, లారీలు తెచ్చి రోడ్డు వేయడానికి చిప్స్, ఇతర సామగ్రిని అక్కడవేసి, రోడ్డు వేయడం కోసం నాలుగు గంటలసేపు పనులు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే దౌర్జన్యంపై పోలీసు అధికారులకు రాత్రి ఫోన్లో సమాచారం ఇచ్చామని, దీంతో అక్కడకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి కూలీలను తీసుకువచ్చి దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణానికి ఉపక్రమించారని తెలిపారు. మా ఇరువర్గాల మధ్య ఈ స్థల వివాదంపై కోర్టులో కేసు నడుస్తోందని, అయినప్పటికీ ఎమ్మెల్యే మా హక్కులో ఉన్న పట్టా భూమిని ఆక్రమించాలనే దురుద్దేశంతో పదవిని అడ్డంపెట్టుకుని ఈ దురాగతానికి పాల్పడుతున్నారని ఆమె వాపోయారు. ఇలా అర్ధరాత్రి గతంలో నాలుగు సార్లు తమపై దౌర్జన్యం జరిపారని చెప్పారు. స్థల వివాదం కోర్టులో ఉన్నందున ఇరువర్గాల వారు ఎటువంటి పనులు చేయరాదని తహసీల్దార్ సూచించారని, అయినా ఎమ్మెల్యే రోడ్డుకోసం స్థలం ఆక్రమిస్తుండడంపై తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యంపై మంగళవారం ఏఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. వెంటనే గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపి తమ హక్కులో ఉన్న భూమిని అప్పగించి, సత్వర న్యాయం చేయాలని ఆమె సబ్ కలెక్టర్‌ను కోరారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందించి భూ వివాదంపై విచారణ జరిపినప్పుడు వీలునామా, పట్టా రికార్డులను తీసుకురావాలని సూచించారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
పాములపాడు: జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకుంటానని పెళ్లి సమయంలో చేసిన బాసలు మరిచిపోయాడు.. అగ్ని సాక్షిగా తన వెంట ఏడడుగులు నడిచిన భార్యను కనికరం లేకుండా కడతేర్చాడు. కన్న పిల్లలకు తల్లిని దూరం చేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో మంగళవారం భార్య విజయలక్ష్మి(24)ని ఇంట్లోనే గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఎర్రగూడూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నాయక్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా కేరళలో విధులు నిర్వహిస్తున్నాడు. బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె గ్రామానికి చెందిన స్వామినాయక్, స్వామిలీబాయి దంపతుల కుమార్తె విజయలక్ష్మిని ఏడేళ్ల కిత్రం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇందు(6), ధరణి(4), గౌతమి(2) అనే ముగ్గురు కూతుళ్లున్నారు. ప్రస్తుతం విజయలక్ష్మి గర్భిణీగా ఉంది. అయితే పెళ్లికి ముందునుంచే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వెంకటేశ్వర్లు తర్వాత కూడా కొనసాగించాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. మంగళవారం ఇద్దరి మధ్య మొదలైన గొడవ చివరకు విజయలక్ష్మి హత్యకు దారి తీసింది. మృతురాలి బంధువుల ఆందోళన.. విజయలక్ష్మి హత్యకు గురైనట్లు తెలుసుకున్న పుట్టినింటివారు, బంధువులు పెద్ద సంఖ్యలో ఎర్రగూడూరుకు చేరుకొని ఆందోళనకు దిగారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతోనే భార్యను చంపేశాడని ఆరోపించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఇంట్లోనే పూడ్చేం దుకు గొయ్యి తవ్వే ప్రయత్నం చేశారు. డీఎస్పీ మాధవరెడ్డి, ఆత్మకూరు, నందికొట్కూరు సీఐలు కృష్ణయ్య, వెంకరటరమణ, ఎస్ఐలు పవన్‌కుమార్, వెంకటసుబ్బయ్య, సుబ్బరామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, అశోక్ సిబ్బం దితో గ్రామానికి చేరుకుని ఉద్రిక్తత తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. చివరకు బాధిత కుటుంబీకులకు సర్ధి చెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వెంకటేశ్వర్లు, తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. పసితనంలోనే తల్లి దూరం.. విజయలక్ష్మి మరణం కారణంగా ఆమె ముగ్గురు చిన్నారులు తల్లిలేనివారయ్యారు. ఏమి జరిగిందో తెలియక తల్లి మృతదేహం వద్ద కూర్చుని అమాయకంగా చూస్తున్న చిన్నారులను చూసి బంధువులు, గ్రామస్తుల కళ్లు చెమ్మగిళ్లాయి. -
టీఎన్ శేషన్ సతీమణి కన్నుమూత
చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టీఎన్ శేషన్‌కు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న శేషన్ భార్య విజయలక్ష్మి శనివారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ప్రఖ్యాత మీడియా సంస్థ ‘మనోరమ’ తెలిపింది. చెన్నైలోని గురుకులం ఓల్డేజ్ హోంలో ఉంటున్న శేషన్ దంపతులకు సంతానం లేరు. విజయలక్ష్మి మరణవార్తను తెలుసుకున్న బంధువులు, అభిమానులు శేషన్‌ను ఓదార్చేయత్నం చేశారు. కేరళలోని పాలక్కాడ్‌లో వారికి ఇల్లు ఉన్నా పిల్లలు లేకపోవడంతో శేషన్ దంపతులు వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. వారి ఆదాయంలో నుంచి ఆశ్రమంలోని సహచరుల వైద్య సేవలు, ఇతర అవసరాలను తీరుస్తున్నారు. శేషన్ చనిపోయారంటూ..: కాగా, విజయలక్ష్మి మరణవార్తలపై పలు మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. ‘శేషన్ కన్నుమూత’ అంటూ బ్రేకింగ్‌లు ఇచ్చాయి. -
సాక్షి ఎఫెక్ట్: ఎమ్మార్వో సస్పెండ్
సాక్షి, వరంగల్ రూరల్: పర్వతగిరి తహసీల్దార్ తోట విజయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అమ్రపాలి కాట శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్వతగిరి మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో తహసీల్దారు విజయలక్ష్మి రైతుల నుంచి డబ్బులు తీసుకున్నట్టు సాక్షి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశం మేరకు వరంగల్ రూరల్ ఆర్డీఓ సీహెచ్.మహేందర్‌జీ విచారణ నిర్వహించి నివేదిక సమర్పిం చారు. నివేదక ఆధారంగా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు సీసీఎల్ఏ నుంచి సైతం రాటిఫికేషన్ తీసుకున్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి : మండలంలోని యర్రంపల్లిలో కుటుంబకలహాతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. మండలంలోని సోమందేపల్లికి చెందిన విజయలక్ష్మి(28)కి చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామానికి చెందిన నాగేంద్రతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 8 తులాల బంగారు. రూ. 2 లక్షల నగదు ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, గంగాప్రసాద్‌లు తెలిపారు. అయితే తరచూ తమ కుమార్తెను భర్తతో పాటు అత్తమామలు వేధింపులకు గురిచేసే వారన్నారు. తమ కుమార్తెను వారే చంపి ఉరివేసి ఉంటారని వారు ఆరోపించారు. తమకుమార్తె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రంపల్లిలో మరొకరు.. మండలంలోని యర్రంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, చిన్నవెంకట్రాముడు దంపతుల కుమార్తె నాగమణి( 22)ని ఇదే మండలంలోని ముష్టికోవెలకు చెందిన ఈశ్వరయ్యతో ఏడాది క్రితం వివాహం చేశారు. వారు సోమందేపల్లి మండలంలో మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే కొన్ని నెలలుగా భర్త వేధింపులు అధికం అయ్యాయని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇంటి ఎవరూ లేని సమయంలో లుంగీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ అని వారు తెలిపారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఐ మహమ్మద్‌రఫీ సంఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. -
తల్లిని హతమార్చి నృత్యకారిణి కిడ్నాప్
చెన్నై యువకుని కోసం గాలింపు టీనగర్: తల్లిని హతమార్చి నృత్యకారిణిని కిడ్నాప్ చేసిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సేలం తాదగాపట్టి గేట్ అంబాల్ చెరువు రోడ్డు, ఐదవ క్రాస్ ప్రాంతానికి చెందిన వేలుత్తాయి(65) కుమార్తె విజయలక్ష్మి(29). ఈమె ఆలయ ఉత్సవాలలో కరగాట్టం నృత్యాలు చేస్తుంది. కుటుంబ తగాదాలతో భర్త కార్తి నుంచి విడిపోయిన విజయలక్ష్మి, తల్లి వేలుత్తాయితో నివసిస్తోంది. భర్త నుంచి విడిపోయిన అనంతరం కరగాట్టం బృందం మాస్టర్ కెన్నడీతో పరిచయం ఏర్పడగా ఒక ఏడాది అతనితో కలిసి ఉంది. తర్వాత రెండు నెలల క్రితం కెన్నడీ నుంచి విడిపోయి చెన్నైకు చెందిన బంధువైన జీవానందం అనే యువకునితో వచ్చేసింది. అతనితో కూడా తగాదా ఏర్పడడంతో తాదగాపట్టిలోఉన్న తల్లి వేలుత్తాయితో నివసిస్తూ వచ్చింది. ఇలాఉండగా ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో సేలంకు వచ్చిన జీవానందం విజయలక్ష్మి ఇంటికి వెళ్లి తనతో చెన్నై రావాల్సిం దిగా కోరాడు. అందుకు విజయలక్ష్మి నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం ఏర్పడింది. అంతేకాకుండా.. కుమార్తెను విడవకుండా వేలుత్తాయి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన జీవానందం మంచానికి వేలుత్తాయిని కట్టివేశాడు. తర్వాత ఆమె నోటికి ప్లాస్టర్ వేసి విజయలక్ష్మిని కిడ్నాప్ చేశాడు. తరువాత కెన్నడీకి ఫోన్ చేసి కిడ్నాప్ చేపినట్టు తెలిపాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన అతను విజయలక్ష్మి ఇంటికి వెళ్లి చూడగా వేలుత్తాయి నిర్జీవంగా కనిపించింది. నోటికి ప్లాస్టర్ అతికించడంతో ఆమె ఊపిరాడక మృతి చెందినట్లు తెలిసింది. దీనిగురించి అన్నదానపట్టి పోలీసులు కేసు నమోదు చేసి జీవానందం కోసం గాలిస్తున్నారు. -
రిటైర్డ్ ఆర్జేడీ దారుణహత్య
-
రిటైర్డ్ ఆర్జేడీ దారుణహత్య
నెల్లూరు: నెల్లూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. పట్టణంలోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్జేడీ విజయలక్ష్మీ ఇంట్లోకి గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి.. ఆమెను దారుణంగా హతమార్చారు. ఇంట్లోని నగలు, నగదుతో ఉడాయించారు. శుక్రవారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. తెలిసిన వాళ్ల పనే అయిఉంటుందని అనుమానిస్తున్నారు. -
మహిళ మెడలో నగల చోరీ
మట్టెవాడ(వరంగల్): రైలు ప్రయాణికురాలి మెడలోని గొలుసును గుర్తుతెలియని దుండగులు దొంగలించారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లికి చెందిన తాళ్ళ విజయలక్ష్మి(50) తన కుటుంబ సభ్యులతో కలిసి సికంద్రాబాద్ నుంచి మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం రాత్రి ఖమ్మం జిల్లా భద్రాచలంకు బయలుదేరింది. రైలు వరంగల్ జిల్లా కేసముద్రం స్టేషన్లో అర్ధరాత్రి సుమారు 2.00 గంటల సమయంలో కాసేపు ఆగి తిరిగి బయలుదేరింది. ఇంతలో కిటికీ పక్కనే కూర్చున్న విజయలక్ష్మి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దొంగ గట్టిగా లాక్కొని పరారయ్యాడు. క్షణాల్లో జరిగిన ఈ సంఘటనతో అయోమయానికి గురైన విజయలక్ష్మి బోరున విలపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.