
భర్త టీఎన్ శేషన్‌తో విజయలక్ష్మి(పాత ఫొటో)
చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టీఎన్ శేషన్‌కు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న శేషన్ భార్య విజయలక్ష్మి శనివారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ప్రఖ్యాత మీడియా సంస్థ ‘మనోరమ’ తెలిపింది. చెన్నైలోని గురుకులం ఓల్డేజ్ హోంలో ఉంటున్న శేషన్ దంపతులకు సంతానం లేరు.
విజయలక్ష్మి మరణవార్తను తెలుసుకున్న బంధువులు, అభిమానులు శేషన్‌ను ఓదార్చేయత్నం చేశారు. కేరళలోని పాలక్కాడ్‌లో వారికి ఇల్లు ఉన్నా పిల్లలు లేకపోవడంతో శేషన్ దంపతులు వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. వారి ఆదాయంలో నుంచి ఆశ్రమంలోని సహచరుల వైద్య సేవలు, ఇతర అవసరాలను తీరుస్తున్నారు.
శేషన్ చనిపోయారంటూ..: కాగా, విజయలక్ష్మి మరణవార్తలపై పలు మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. ‘శేషన్ కన్నుమూత’ అంటూ బ్రేకింగ్‌లు ఇచ్చాయి.