wife passes away
-
ఏబీఎన్ రాధాకృష్ణ భార్య మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కనకదుర్గ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఈ కష్ట సమయంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
నాయిని సతీమణి అహల్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి నాయిని అహల్య (64) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. భర్త చనిపోయి 4 రోజులు గడవక ముందే ఆమె కూడా తుది శ్వాస విడిచారు. తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకోక ముందే తల్లి కూడా మరణించడంతో వారి కుమారుడు, కూతురు కన్నీరు మున్నీరవుతున్నారు. గత నెల 28న నాయినికి, ఆ తర్వాత ఆయన భార్య అహల్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 10న పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. అదే సమయంలో ఇద్దరికీ ఈ నెల 13న న్యుమోనియా సోకింది. ఆరోగ్యం క్షీణించడంతో నాయిని ఈ నెల 22న ఆస్పత్రి లో కన్నుమూశారు. భర్తను కడసారి చూసేందుకు అహల్యను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లోనే తీసుకొచ్చి చూపించి మళ్లీ తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది. నీతోపాటే నేనూ.. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ గ్రామం నాయిని నర్సింహారెడ్డిది కాగా, దానికి 5 కి.మీ. దూరంలోని పెద్ద మునిగాల గ్రామం అహల్యది. మేనమామ కూతురు అయిన అహల్యను నాయిని పెళ్లి చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రగతి శీల ఉద్యమాలకు అండగా నిలిచిన నాయినిపై ఎన్నో కేసులు పోలీసులు పెట్టినా ఆమె ఎన్నడూ కుంగిపోలేదు. ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. నాయిని ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వెళ్లే సమయంలో భార్యకు ఫోన్ చేసి ఆమెకు కావాల్సినవి తీసుకెళ్లేవారు. అహల్య పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లోని ఆమె నివాసానికి తీసుకు రానున్నారు. అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు.. సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: నాయిని అహల్య మృతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతిచెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. -
హాస్య నటుడు రమణా రెడ్డి భార్య మృతి
అలనాటి హాస్యనటుడు రమణారెడ్డి సతీమణి సుదర్శనమ్మ (93) అనారోగ్య కారణాలతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం టీనగర్‌లోని ఇంట్లో తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమ తొలినాళ్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రమణా రెడ్డి అలరించారు. ఆయన 1974లో మరణించిన సంగతి తెలిసిందే. రమణారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ రోజు (శనివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
టీఎన్ శేషన్ సతీమణి కన్నుమూత
చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టీఎన్ శేషన్‌కు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న శేషన్ భార్య విజయలక్ష్మి శనివారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ప్రఖ్యాత మీడియా సంస్థ ‘మనోరమ’ తెలిపింది. చెన్నైలోని గురుకులం ఓల్డేజ్ హోంలో ఉంటున్న శేషన్ దంపతులకు సంతానం లేరు. విజయలక్ష్మి మరణవార్తను తెలుసుకున్న బంధువులు, అభిమానులు శేషన్‌ను ఓదార్చేయత్నం చేశారు. కేరళలోని పాలక్కాడ్‌లో వారికి ఇల్లు ఉన్నా పిల్లలు లేకపోవడంతో శేషన్ దంపతులు వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. వారి ఆదాయంలో నుంచి ఆశ్రమంలోని సహచరుల వైద్య సేవలు, ఇతర అవసరాలను తీరుస్తున్నారు. శేషన్ చనిపోయారంటూ..: కాగా, విజయలక్ష్మి మరణవార్తలపై పలు మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. ‘శేషన్ కన్నుమూత’ అంటూ బ్రేకింగ్‌లు ఇచ్చాయి. -
ముత్యాల సుబ్బయ్యకు సతీ వియోగం
ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సతీ వియోగానికి గురయ్యారు. ఆయన ధర్మపత్ని పార్వతమ్మ(60) ఆదివారం తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాలకు స్వర్గస్థురాలయ్యారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. ముత్యాల సుబ్బయ్య దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి సంతానం. పార్వతమ్మ మృతి ముత్యాల సుబ్బయ్య కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సానుభూతిని వెలిబుచ్చింది.