
అలనాటి హాస్యనటుడు రమణారెడ్డి సతీమణి సుదర్శనమ్మ (93) అనారోగ్య కారణాలతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం టీనగర్‌లోని ఇంట్లో తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమ తొలినాళ్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రమణా రెడ్డి అలరించారు. ఆయన 1974లో మరణించిన సంగతి తెలిసిందే. రమణారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ రోజు (శనివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు.