ramana reddy
-
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ప్రత్యేకత ఏంటంటే..: శిల్పి రమణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి నూతన శిల్పం తెలంగాణ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని చెప్పుకొచ్చారు విగ్రహ శిల్పి రమణా రెడ్డి. ఇదే సమయంలో తెలంగాణ చరిత్ర.. అరుదైన పోరాటాల చరిత్ర అన్నారు. నూతన తెలంగాణ తల్లి.. సాంప్రదాయపు స్త్రీ మూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్పూర్తిగా, భరతమాత ముద్దు బిడ్డగా తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తిగా, అందరిని ఆకట్టుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదున్నారు.తెలంగాణ తల్లి శిల్పి రమణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల అస్థిత్వం. తెలంగాణ ప్రజల మాతృమూర్తి. తెలంగాణ చరిత్ర.. అరుదైన పోరాటాల చరిత్ర. దశాబ్దాల పోరు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో వేలాది అమరుల త్యాగాలతో, సోనియమ్మ ఆశీర్వచనాలతో సాధించింది ప్రత్యేక రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు సకల బహుజనులు సాధించిన విజయం. నూతన తెలంగాణ తల్లి రూపకల్పన తెలంగాణ సాంప్రదాయాన్ని, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని వ్యక్తపరుస్తుంది.పూర్వ తెలంగాణ తల్లి రాచరికపు హావభావాలు, వాస్తవ ప్రజానీక సంస్కృతికి భిన్నంగా, ధనిక స్త్రీగా చిత్రీకరించడం జరిగింది. ఈ కారణంగా చాలామంది ప్రజల మన్ననలు పొందలేక పోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక దేవతామూర్తికి, మాతృమూర్తికి ఎంత వ్యత్యాసం ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ తల్లి. బోనాలు, బతుకమ్మ, సమక్క సారలమ్మ, సదర్ పండుగలతో, విశిష్ట శిల్ప సంపదలతో, చేతివృత్తులు, చేనేత ప్రతిభలతో విరజిమ్ము తన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.నూతన తెలంగాణ తల్లి సాంప్రదాయపు స్త్రీ మూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్పూర్తిగా, భరతమాత ముద్దు బిడ్డగా తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తిగా, అందరిని ఆకట్టుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. మొదటి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసింది కూడా ఫ్రొఫెసర్ గంగాధర్. నాటి ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకే అప్పటి తెలంగాణ తల్లి రూపకల్పన జరిగింది’ అని కామెంట్స్ చేశారు. -
రమణారెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది: కుటుంబ సభ్యులు
-
వారమైనా ఆచూకీ లేదు.. రమణారెడ్డి ఎక్కడ?
సాక్షి, విశాఖపట్నం: వారం రోజుల క్రితం సోషల్ మీడియా కార్యకర్త రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ వచ్చి రమణారెడ్డిని ప్రకాశం జిల్లా పోలీసులు తీసుకెళ్లారని.. రోజుకోక పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమణారెడ్డి వివరాలు అడిగినా పోలీసులు చెప్పడం లేదంటున్నారు. అర్ధరాత్రి వేళ తీసుకెళ్తూ.. ఇంటి సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు డీలీట్ చేశారు.ఇంటికి వచ్చిన వెంటనే రమణారెడ్డి నుంచి మొబైల్‌ను పోలీసులు తీసేసుకున్నారు. బెయిల్ ఇస్తామంటూ ప్రకాశం జిల్లాలోని స్టేషన్లను పోలీసులు తిప్పుతున్నారు. మామ ఆచూకీ కోసం పోలీస్స్టేషన్ల చుట్టూ రమణారెడ్డి అల్లుళ్లు తిరుగుతున్నారు. రమణారెడ్డి ఆచూకీ తెలియక తల్లి,భార్య, కుమార్తెలు తల్లడిల్లిపోతున్నారు. రమణారెడ్డి ఫోన్‌ను పోలీసులు తీసేసుకున్నా ఆయన ఫోన్ నుంచి ఎక్స్‌లో పోస్టులు పెట్టినట్లుగా కనిపిస్తున్నాయని ఆయనకు కుమార్తె తెలిపింది. రమణారెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆయన కుటుంబసభ్యులు అంటున్నారు. కాగా, కూటమి సర్కార్ తప్పిదాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి అక్రమ కేసులు బనాయిస్తోంది. నిన్నటివరకు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారని నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశ్నించడంతో సరికొత్త పన్నాగం పన్నింది. ప్రభుత్వ పరంగా నేరుగా కేసులు పెట్టకుండా పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దించింది. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోనే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు (24 గంటల్లో) 29 కేసులు నమోదు చేయించారు. -
‘పునరుత్పాదక విద్యుత్’.. రెండో స్థానంలో ఏపీ
సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యం (రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్ (ఆర్పీవో))లో 2021–22 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నెడ్‌క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ రమణారెడ్డి తెలిపారు. కర్ణాటక 41.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 28.5 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021–22 నాటికి ఆర్పీవో లక్ష్యాన్ని 21.18 శాతంగా నిర్దేశించగా ఏపీ దాన్ని అధిగవిుంచిందని వివరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), నెడ్‌క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్ గ్రోత్ డ్రైవింగ్ పోర్ట్, ఎనర్జీ ఇంటెన్సివ్లో క్లీన్ ఇన్వెస్ట్మెంట్, కర్బన ఉద్గారాల నియంత్రణలో పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై శనివారం విశాఖలో సదస్సు జరిగింది. ఇందులో రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 9,008.78 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఈ రంగంలో దేశంలో ఐదో స్థానంలో నిలిచామని వివరించారు. ఇందులో సోలార్ పవర్ 38.50 గిగావాట్లు కాగా విండ్ పవర్ 44 గిగావాట్లు ఉందని తెలిపారు. దీంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ కింద 36.15 మెగావాట్లు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.97 మెగావాట్లు, చిన్న హైడ్రో ప్రాజెక్టుల నుంచి 106.80 మెగావాట్లు ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ దేశానికే ఆదర్శం.. 2020లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన పునరుత్పాదక విద్యుత్ ఎగుమతుల పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమణారెడ్డి తెలిపారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్రం 37 శాతంతో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 4,745.60 మెగావాట్ల సామర్థ్యంతో 8 ప్రాజెక్టులు నడుస్తున్నాయని చెప్పారు. మరో 3,260 మెగావాట్ల సామర్థ్యంతో 4 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అలాగే 2,350 మెగావాట్లతో 2 ప్రాజెక్టులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో, 59,357 మెగావాట్లతో 47 ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని వివరించారు. ఈ మొత్తం 61 ప్రాజెక్టుల్లో 26,050 మెగావాట్ల సామర్థ్యంతో 23 ప్రాజెక్టులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని తెలిపారు. పంప్డ్ హైడ్రో ఎలక్ట్రికల్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. 21 ప్రాంతాల్లో 16.18 గిగావాట్ల ఉత్పత్తికి, 37 ప్రాంతాల్లో 42.02 గిగావాట్ల ఉత్పత్తికి పీఎస్పీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులకు పూర్తి అనుకూలంగా ఉందన్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుం బిగించింది.. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.యువరాజ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్ కార్యక్రమం ద్వారా విద్యుత్ రంగంలో 51.3 శాతం, రవాణా రంగంలో 13.2 శాతం కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుంబిగించిందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా ఈ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకోగలమని ఆకాంక్షించారు. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. అదే ఏడాది నాటికి భారత్‌లో హైడ్రోజన్ డిమాండ్ 13 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు. ఇది 2050 నాటికి 28 ఎంఎంటీ దాటుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. దానికనుగుణంగా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ప్రదీప్ జె తారకన్, సీఐఐ చైర్మన్ డా.లక్ష్మీప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
‘పునరుత్పాదక విద్యుత్’.. రెండో స్థానంలో ఏపీ
సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యం (రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్ (ఆర్పీవో))లో 2021–22 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నెడ్‌క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ రమణారెడ్డి తెలిపారు. కర్ణాటక 41.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 28.5 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021–22 నాటికి ఆర్పీవో లక్ష్యాన్ని 21.18 శాతంగా నిర్దేశించగా ఏపీ దాన్ని అధిగవిుంచిందని వివరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), నెడ్‌క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్ గ్రోత్ డ్రైవింగ్ పోర్ట్, ఎనర్జీ ఇంటెన్సివ్లో క్లీన్ ఇన్వెస్ట్మెంట్, కర్బన ఉద్గారాల నియంత్రణలో పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై శనివారం విశాఖలో సదస్సు జరిగింది. ఇందులో రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 9,008.78 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఈ రంగంలో దేశంలో ఐదో స్థానంలో నిలిచామని వివరించారు. ఇందులో సోలార్ పవర్ 38.50 గిగావాట్లు కాగా విండ్ పవర్ 44 గిగావాట్లు ఉందని తెలిపారు. దీంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ కింద 36.15 మెగావాట్లు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.97 మెగావాట్లు, చిన్న హైడ్రో ప్రాజెక్టుల నుంచి 106.80 మెగావాట్లు ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ దేశానికే ఆదర్శం.. 2020లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పునరుత్పాదక విద్యుత్ ఎగుమతుల పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమణారెడ్డి తెలిపారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్రం 37 శాతంతో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 4,745.60 మెగావాట్ల సామర్థ్యంతో 8 ప్రాజెక్టులు నడుస్తున్నాయని చెప్పారు. మరో 3,260 మెగావాట్ల సామర్థ్యంతో 4 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అలాగే 2,350 మెగావాట్లతో 2 ప్రాజెక్టులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో, 59,357 మెగావాట్లతో 47 ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని వివరించారు. ఈ మొత్తం 61 ప్రాజెక్టుల్లో 26,050 మెగావాట్ల సామర్థ్యంతో 23 ప్రాజెక్టులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని తెలిపారు. పంప్డ్ హైడ్రో ఎలక్ట్రికల్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. 21 ప్రాంతాల్లో 16.18 గిగావాట్ల ఉత్పత్తికి, 37 ప్రాంతాల్లో 42.02 గిగావాట్ల ఉత్పత్తికి పీఎస్పీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులకు పూర్తి అనుకూలంగా ఉందన్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుం బిగించింది.. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.యువరాజ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్ కార్యక్రమం ద్వారా విద్యుత్ రంగంలో 51.3 శాతం, రవాణా రంగంలో 13.2 శాతం కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుంబిగించిందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా ఈ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకోగలమని ఆకాంక్షించారు. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. అదే ఏడాది నాటికి భారత్‌లో హైడ్రోజన్ డిమాండ్ 13 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు. ఇది 2050 నాటికి 28 ఎంఎంటీ దాటుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. దానికనుగుణంగా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ప్రదీప్ జె తారకన్, సీఐఐ చైర్మన్ డా.లక్ష్మీప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
సీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘ఎంవీఆర్’ పేరు
సాక్షి, అమరావతి/ఎర్రగుంట్ల( వైఎస్సార్ జిల్లా): రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ) పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రచయితగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి(ఎంవీఆర్) సేవలకు గుర్తింపుగా, రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి ఆమోదంతో వైఎస్సార్ జిల్లా కలమళ్లలోని 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పేరు మార్పు తక్షణమే అమల్లోకొస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు థర్మల్ ప్లాంట్లకు ముగ్గురు ప్రముఖుల పేర్లు రాష్ట్రంలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లుండగా, వేర్వేరు రంగాలకు చెందిన వారి పేర్లు వాటికి సార్థక నామధేయాలుగా మారాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్లాంట్‌కు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రమని పేరు పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని పవర్ ప్లాంటుకు విద్యుత్ రంగ పితామహుడుగా పేరు పొందిన డాక్టర్ నార్ల తాతారావు పేరు పెట్టారు. తాజాగా ఆర్టీపీపీని కార్మిక నేత ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా ప్రభుత్వం మార్చింది. ఎంవీఆర్ కృషితో సీమలో థర్మల్ ప్లాంట్ వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం థర్మల్ విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయాలని మొట్టమొదట డిమాండ్ చేసిన నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి. 1985లో ‘రాయలసీమ కన్నీటి గాథ’ అనే పుస్తకం ద్వారా ఆయన రాయలసీమ సమస్యలను, గణాంకాలు, సహేతుకమైన ఆధారాలతో రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చారు. కరువుతో అల్లాడుతున్న సీమకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని గళమెత్తారు. ఎంవీఆర్ చేసిన డిమాండ్.. ఆర్టీపీపీ స్థాపనకు బాట వేసిందని, ఆ నేతకు నివాళిగా ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుగా మార్చాలని రాయలసీమ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ విమోచన సమితి పేరుతో రమణారెడ్డి, రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి పేరుతో వైఎస్సార్, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, టీటీడీ చైర్మన్ కరుణాకరెడ్డి తదితర నేతలంతా అప్పట్లో ఉద్యమం చేపట్టారని సాహితీవేత్త భూమన్ తెలిపారు. ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చడం దివంగత నేతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యలు ప్రశంసించారు. ఆర్టీపీపీకి డాక్టర్ ఎంవీఆర్ పేరు పెట్టినందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు నేతలు ముఖ్యమంత్రికి, ఇంధన శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీపీపీకి ఎంవీఆర్ పేరు చేర్చడాన్ని రాయలసీమ వాసులు స్వాగతిస్తున్నారు. -
కథ: తూరుపు పొద్దు... బీఎస్ నడక మారలేదు, నడత మారలేదు! తనంతే!
ఆకాశంలో చిక్కటి మేఘం ముద్ద పాల నురుగులా పొంగి వుంది. భూమ్మీద నుంచి మానవ ఆకారాలు పొడవాటి గోర్లున్న చేతి వేళ్లను గుచ్చి ఆ ముద్దను పీక్కొని జుర్రుకుంటున్నాయి. మనుషులు మరీ పొడుగ్గాలేరు, అట్టాని పొట్టిగానూ లేరు. ఒంటిమీద ఏ ఆచ్ఛాదనా లేనట్టు నల్లని నీడల్లా కదులుతున్నారు. దివి నుంచి కొన్ని అస్థిపంజరాలను పోలిన ఆకారాలు ఎర్ర మందారాలను పోలిన పూల బుట్టలను భూమ్మీద గుమ్మరిస్తున్నాయి. అవి నేల మీద పడగానే నిప్పు కణికల్లా మారి పొగలు ఎగజిమ్ముతున్నాయి. ఓ రెండడుగుల బుడతడు ఆ అగ్నిపూలను ఒక్కొక్కటిగా ఏరి భుజాన వేలాడుతున్న జోలెలో వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. జోలెలో పడ్డ నిప్పు కణికలు మంచు ముద్దలుగా మారి, నీటి బిందువులుగా జారుతున్నాయి. నేల మీదపడి పిల్లకాలువలుగా ప్రవహిస్తున్నాయి. ‘ఊరికి బోవాలన్జెప్పి తెల్లారిందాంకా పడుకున్నెవేంది?’ మా ఆవిడ అరుపులతో నా వింత కల చెదిరింది. రవ్వంతసేపు ఆ అనుభూతితో మంచం మీదనే కూర్చొని వెళ్లాల్సిన పని గుర్తుకు తెచ్చుకొని నిద్దుర మత్తును విదిలించికొట్టి గబిల్లున మంచం దిగాను. బీఎస్‌ను కలవాలన్న తొందరలో ఆదర బాదరగా అన్ని పనులూ ముగించుకున్నాను. తొమ్మిది గంటల ప్రాంతంలో బస్టాండుకొచ్చి, అప్పుడే కదులుతున్న విజయవాడ బస్సెక్కాను. టికెట్ తంతు ముగించి ఓ పనైపోయిందనుకొని రిలాక్స్ అయ్యాను. బ్యాగులో నుంచి తిలక్ కథల పుస్తకం బయటకు తీసి చదివే ప్రయత్నం చేశాను. మనసు కుదురుకోలేదు. గజిబిజిగా ఎటెటో తిరుగుతోంది. రెండు రోజుల నుంచి బీఎస్ తలపులు వెంటాడుతున్నాయి. తనను కలవాలి, మాట్లాడాలి అన్న కాంక్ష నన్ను కుదురుగా ఉండనీయలేదు, ఒకచోట నిలువ నీయడంలేదు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన గుర్తుకొచ్చింది. ‘అబ్బీ నువ్వు పలానా గదా’ అంటూ కడప ఆర్టీసీ బస్టాండు టీకొట్టు దగ్గర పంచెకట్టు మనిషి పలకరించాడు. అతనివైపు పరిశీలనగా చూశాను, ఎక్కడో చూసినట్లుంది గానీ గుర్తుకు రావడంలేదు. ‘అవును’ అంటూనే ‘మీ దేవూరు’ అన్నాను. ‘మిద్దెల’ అన్నాడు. బీఎస్ అన్ననని చెప్పాడు. బీఎస్ పూర్తిపేరు బి. శివనారాయణ. అందరూ బీఎస్ అనే పిలిచేవాళ్లు. ‘అవునా!’ అంటూనే ‘బీఎస్ ఎలా ఉన్నాడ’ని అడిగాను. ‘ఈ మధ్య కరోనా వచ్చిందబ్బీ.. చావుదాంక వెళ్లాడు. భూమ్మీద నూకలుండి బతికి బయట పడ్డాడు. డాక్టర్లు కొద్ది రోజులు ఇంటిపట్టునుండి రెస్ట్ దీసుకోమని చెప్పినా విన్లేదు. ఊర్లు బట్టుకొని తిరుగుతానే ఉండాడు. యాలకు తిండా పాడా.. ఏందో వాని జీవితం..? తాడూ బొంగరం లేకుండా అయింది’ అంటూ ఏకరువు పెట్టాడు. మనసంతా అలజడి. ఆ తరువాత బీఎస్ కోసం ఆరా తీశాను. ఎలా ఉన్నాడో తెలియడం లేదని. ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో పెద్దగా కనిపించడం లేదని మిత్రులు చెప్పారు. తనను కలవాలని నిర్ణయించుకుని బయలుదేరాను. వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సుతోపాటు నా ఆలోచనలకు సడన్ బ్రేక్ పడింది. ‘ఏందా?’ అని చూశాను. చెకింగ్. బస్సెక్కి అందరి దగ్గర టికెట్లు పరిశీలిస్తున్నారు. రెండు సీట్ల అవతలికి పొయ్యేసరికి చెకింగ్ అతనికి, ప్రయాణికుడికి మధ్య గొడవ. పిల్లోడికి హాఫ్ టికెట్ తీసుకోలేదంటూ వాదన. మా వాడికి అయిదేండ్ల లోపే అంటాడు తండ్రి. తనకూ అదే చెప్పడంవల్ల టికెట్ కొట్టలేదంటాడు కండక్టర్. మాటామాటా పెరిగింది. గొడవ పెనుగాలి అయ్యింది. అసలే వేసవి ఎండ.. బొక్కెనలో నీళ్లలా గుబుళ్లున బయటకు దూకిన స్వేదం ఒంటి మీదనే బట్టలు నాన బెట్టింది. బస్సు దిగి వేడి గాలులతో చెమట నార్పుకొన్నాను. ప్రయాణికులు తలోమాటా వేయడంతో కొద్దిసేపటికి రభస సద్దుమణిగి చెకింగ్ తంతు ముగిసింది. బస్సెక్కి అన్యమనస్కంగానే ‘నల్లజెర్ల రోడ్డు’ కథ చదువుదామని పుస్తకం తెరిచాను. అహా..అక్షరాల మీద చూపులు నిలవడంలేదు. బలవంత పెట్టినా ససేమిరా అంటూ చెదిరి పోతున్నాయి. నేను కలవాల్సిన మనిషి ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ పరంపరలోనే బస్సు పోరుమామిళ్ల చేరింది. మధ్నాహ్నమైంది. బీఎస్ కోసం విచారించాను. నిన్న ‘మిద్దెల’లో ఉన్నాడన్నారు. మిద్దెల బీఎస్ సొంతగ్రామం. అతన్ని కలిసిన తరువాతనే ఊరికెళ్దామని నిర్ణయించుకొని బస్టాండుకొచ్చి వరికుంట్ల బస్సెక్కాను. సర్కార్‌కు నిధుల కొరతేమో? గతుకుల రోడ్డు. బస్సు ఓ గంట తరువాత మిద్దెలలో దింపింది. ఊరిగమిల్లోనే బీఎస్ ఇల్లు. వెళ్లి విచారించాను. నిన్న ఉదయమే గిద్దలూరు వెళ్లాడన్నారు. ఎక్కడున్నా వెళ్లాల్సిందే! తనను కలవాల్సిందే! గిద్దలూరు వెళ్దామని ఆటో ఎక్కాను. కిక్కిరిసిన షేర్ ఆటో నిండు గర్భిణిలా ఆపసోపాలు పడుతూ ఓబుళాపురం చేర్చింది. వేసవి ఎండ.. నాలిక పీకుతోంది. దప్పిక తీర్చుకునేందుకు అక్కడున్న అంగట్లో నీళ్ల బాటిల్ కొన్నాను. అంగడతను తెలిసిన వ్యక్తే. బీఎస్ కోసం ఆరా తీశాను, ‘నిన్న పొద్దున్నే రోడ్లో పడిపోయిన ఒకతన్ని పోరుమామిళ్ల ఆసుపత్రికి తీసుకెళ్లాడ’ని చెప్పాడు. అక్కడి నుంచి తిరిగి బస్సెక్కి పోరుమామిళ్లకు చేరుకున్నాను. బీఎస్ వాళ్ల గ్రామానికే చెందిన వ్యక్తి మెడిసిన్ చదివి ఆసుపత్రి పెట్టాడు. అక్కడికే తీసుకెళ్లి ఉంటాడని వెళ్లాను. ‘ఓ పేషెంటును తెచ్చి చేర్పించి పొద్దున వెళ్లినట్లున్నాడ’ని డాక్టర్ చెప్పాడు. పేషెంటు బెడ్ చూపించాడు. బీఎస్ అక్కడ లేడు. బెడ్ మీదున్న పెద్దాయన్ను అడిగాను. తనది తాడిపత్రి అనిచెప్పాడు. కాశిరెడ్డి నాయన ఆశ్రమం చూసేందుకు వచ్చి రెండు రోజులు అక్కడే ఉన్నాడట. ఈ లోపు మోషన్స్ కావడంతో చూపించుకుందామని ఆటోలో ఓబుళాపురం వచ్చాడట. అప్పటికే విరోచనాలు ఎక్కువై నీరసంతో రోడ్డుమీదనే పడిపోయాడట. తాగి పడిపోయి ఉంటాడని ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడే అక్కడికొచ్చిన బీఎస్ ఆయనను చూసి బట్టలు నీళ్లతో కడిగి ఆటోలో పోరుమామిళ్ల ఆసుపత్రికి తీసుకు వచ్చి వైద్యం చేయించాడట. రాత్రంతా కాపలా ఉండి పొద్దునకి ప్రాణాపాయం లేదని డాక్టర్ చెప్పడంతో పెద్దాయన కొడుకుకు ఫోన్ చేసి మధ్నాహ్నం తరువాత గిద్దలూరు పోతున్నానని చెప్పి వెళ్లి పోయాడట. అరగంట క్రితమే వెళ్లాడని చెప్పాడు. ‘తన పాలిట దేవుడ’ని చేతులు జోడించాడు. అప్పటికే పొద్దు పడమటి కొండల మీదకు దిగుతోంది. ఇప్పుడు బయలు దేరినా రాత్రికిగాని గిద్దలూరు చేరుకోలేను. పక్కన ఆరు కిలోమీటర్ల దూరంలో మావూరు. అమ్మ అక్కడే వుంది. ఊరుకెళ్లి అమ్మను చూసి పొద్దున్నే బీఎస్ కోసం గిద్దలూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. బీఎస్ జ్ఞాపకాలను పదిలంగా పట్టుకొని ఆటోలో ఊరికి బయలు దేరాను. దారిలో చెన్నవరం ముందు సగిలేరు పలకరించింది. ఆటో ఆపాను. ఏటిగుండాల నిండా తెలుగు గంగ నీళ్లు. ఏపుగా పెరిగిన జంబు నీళ్లతో జతకట్టింది.« పచ్చిక మేసి వచ్చిన పశువులు నీటిలో మునకలేస్తూ సేద దీరుతున్నాయి. పోరుమామిళ్ల నుంచి వచ్చిన కొందరు గాలాలతో చేపల వేట సాగిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఎండిపోయిన ఏరు ఇప్పుడు నీళ్లలో జలకాలాడుతోంది. ఏట్లోకి దిగి రెండు దోసిళ్లతో కడుపారా నీళ్లు తాగి ఆటో ఎక్కి బయలు దేరాను. నల్లని జెర్రిపోతు మాదిరి మెలికలు తిరిగిన తారురోడ్డు. చెన్నవరం, మాలోనిగట్టు, పెసలొంక, కళ్లమందçపట్టలు, గుజ్జాలోల్లకుంట, జ్యోతివాగు అన్నీ చూస్తూ వాటి జ్ఞాపకాలతో ఊరికి చేరుకున్నాను. ∙∙ ఈ రోజు ఎలాగైనా బీఎస్‌ను పట్టుకోవాలి. పొద్దున్నే నడక దారిలో ఓబుళాపురం బయలుదేరాను. నిండు ఎండలకాలం. దారిపొడవునా వేపచెట్లు సరికొత్త ఇగురుతో పండగనాడు కొత్త సొక్కా వేసుకున్న చిన్న పిల్లోడి మాదిరి మురిసి పోతున్నాయి. వాటి పొత్తిళ్లలో సేదదీరుతూ పక్షులు కిలకిలారావాలు. వాటిని ఆస్వాదిస్తూ గంటలో ఓబుళాపురం చేరుకున్నాను. కొద్ది సేపటికి వచ్చిన గిద్దలూరు బస్సెక్కాను. బీఎస్ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అతని తాలూకు తలపుల పరంపర వీడని నీడలా వెంటాడుతోంది. రెండేళ్ల నాటికి ముందు అనుకుంటా... మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్నాను. బస్టాండు పక్కనే ఆఫీసు. బస్టాండు అవుట్ గేటు దాటుతూంటే తెల్లప్యాంటు, తెల్లషర్టు, ఆరడుగుల విగ్రహంతో నిటారుగా నడుచుకుంటూ బస్టాండులోకి వెళుతూ కనిపించాడు బీఎస్. అప్పటికే బస్టాండు ఆవరణలోకి ప్రవేశించాడు. బండి ఆపి ‘బీఎస్..’ అంటూ గట్టిగా కేక పెట్టాను. వెనుదిరిగి చూశాడు. నేను కనిపించేసరికి ముఖాన వెలుగు.. దాంతోపాటు చిరునవ్వు. నేను బండిని టీ కొట్టువద్ద పార్కు చేసేలోపు వచ్చాడు. చాలా రోజుల తరువాత కలిశాం. రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ‘ఎలా ఉన్నావు?’ అడిగాను. ‘మామూలే.. పాత దారే, అలాగే ముందుకు’ అంటూ నవ్వాడు. తన మాటలు నా మనసును ద్రవింప జేశాయి. కళ్లలో ఆరాధనా భావం. ‘సడెన్ గా కడపలో ఏంటి?’ అన్నాను. ఎవరికో కాలు ఆపరేషన్ అట, డబ్బుల్లేని పేదోడట. రిమ్స్‌కు పిల్చుకవచ్చి ఆపరేషన్ చేయించి వెళుతున్నానన్నాడు. ‘ఇంటికెళ్లి భోజనంచేసి వెళుదు పా’ అన్నాను. ‘ఇప్పుడు కాదులే! ఉప్పులూరు ఎస్సీ కాలనీ అమ్మాయి ఉద్యోగ విషయమై రాత్రికి హైదరాబాదు వెళ్లి సార్‌ను కలవాలి’ అన్నాడు. ‘ఈ బస్సుపోతే సాయంత్రం వరకూ బస్సులేదు. ఇంకొకసారి వస్తా! ఇంట్లో అందర్నీ అడిగానని చెప్పు’ అంటూ హడావుడిగా వెళ్లిపోయాడు. ఆతరువాత బీఎస్ నాకు కనిపించలేదు. రోడ్డు. కాస్త తారు, కంకర కలగలిపి గుంతల్లో గుమ్మరించినట్లుంది. నా ఆలోచనలకు తెరదించుతూ త్వరగానే బస్సు గిద్దలూరు చేరింది. తెలిసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బీఎస్ ఉంటున్న రూము వద్దకెళ్లి విచారించాను. రైల్వేస్టేషన్ సమీపంలోని పాఠశాల గదిలో పిల్లలకు క్లాసు చెప్పడానికి వెళ్లాడన్నారు. ఆటో ఎక్కి అక్కడికెళ్లాను. పది నుంచి పదకొండు గంటలవరకూ క్లాసట. అందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి, ముప్పై ఏళ్ల లోపే ఉన్నారు. అప్పటికే కొందరు వెళ్లిపోగా మరికొందరు ఇంటిదారి పట్టారు. ‘ఏం క్లాసులు?’ అని ఆరా తీశాను. ‘వ్యక్తిత్వ వికాసం మీద అట. నాలెడ్జి పెంచుకోవడం.. నాయకత్వ లక్షణాలు పెంపొందించు కోవడం.. ఆరోగ్యం, మానసిక దృఢత్వం, శక్తి,యుక్తి, ముక్తి, సమాజశ్రేయస్సు లాంటి అంశాల మీదట! ఒక్కో బ్యాచ్‌కు ఎనిమిది రోజుల శిక్షణ ఉంటుందట.. అదికూడా ఉచితంగానే ఇస్తారట’ చెప్పారు. సరికొత్త సమాజసేవకులను అందించే ఆలయంలా కనిపించింది. ‘సార్ ఇప్పుడే రూముకెళ్లాడ’న్నారు. నేను తనని వెతుక్కుంటూ వెళుతుంటే.. యాభై ఏళ్ల పైబడిన వయస్సులో కూడా బీఎస్ అలుపెరగని సేవా కార్యక్రమాలతో నాకందనంతగా ముందుకు పరుగెడుతున్నాడు. తిరిగి ఆటో ఎక్కాను. బీఎస్ నేను పదో తరగతి వరకూ కలసి చదువుకున్నాం. సేవాభావం నింపుకొని పుట్టాడేమో..! చిన్ననాటి నుంచే ఎక్కడ ఎవరికి ఆపదొచ్చినా అక్కడ వాలేవాడు. తనతో కలసి సేవా కార్యక్రమాలలో నేనూ పాల్గొనేవాన్ని. అలా మా ఇద్దరి స్నేహం బలపడింది. కాలగమనంలో మా దారులు వేరయ్యాయి. పెళ్లి చేసుకొని బంధాలు, బాధ్యతల బరువునెత్తుకొని నేను ఊరు వదలిపెట్టాను. బీఎస్ మాత్రం ఇల్లు, వాకిలి మరచాడు. జీవితంలో ప్రధాన ఘట్టమైన పెళ్లికి దూరమయ్యాడు. పదెకరాలున్న సేద్యగాడికే పిల్లనివ్వని రోజులు.. అన్నీ వదిలి ప్రజాసేవలో మునిగి తేలేవాడికి పిల్లనిస్తారా? అయినా అదేమీ పట్టించుకోక సేవాయుధంతో సమాజంపై అలుపెరగని యుద్ధం సాగిస్తున్నాడు. తనతో కలసి నడవలేక పోయానన్న వెలితి నన్ను వెంటాడి వేధిస్తోంది. ‘సర్.. మీరు చెప్పిన అడ్రస్ ఇదే’ అటోవాడి పిలుపుతో మిత్రుడి జ్ఞాపకాల నుంచి బయటపడి ఆటో దిగి రూములో చూశాను. అక్కడ లేడు. కిందున్న బడ్డీకొట్టతన్ని అడిగాను. ‘ఇప్పుడే వెళ్లాడు. అయిదు రూపాయల అన్నం క్యాంటీన్ దగ్గరుంటాడ’న్నాడు. ఫోన్ చేస్తే రింగ్ కావడంలేదు. అడ్రసు పట్టుకొని వెళ్లాను. అప్పటికే అన్నం తిని చేయి కడుక్కుంటున్నాడు. ఎప్పుడూ తెల్లని షర్ట్, ప్యాంటు, నలగని బట్టలతో ఉండే బీఎస్ మాసిన బట్టలతో కనిపించాడు. బాధనిపించింది. నన్ను చూసి ఒకింత ఆశ్చర్యం.. ఆనందం.. నవ్వుతూ వచ్చాడు. ‘అప్పుడే తిన్నావేంది? కలసి భోంచేద్దామని వచ్చాను’ అన్నాను. ‘అయిదు రూపాయల భోజనానికి బాగా డిమాండబ్బీ! రోజూ వందమందికే పెడతారు. అరగంట లేటయితే ఉండదు’ అన్నాడు. ‘ఇక్కడ అయిపోతే బయట వంద రూపాయలు పెడితే గానీ అన్నం దొరకదు. నా దగ్గర ముప్పై అయిదు రూపాయలే ఉన్నాయి. అయిదు అన్నానికి పోతే మిగిలిన ముప్పైకి రాత్రి రెండు చపాతీలు తినొచ్చు’ చెప్పాడు. మనస్సు చివుక్కుమంది. నన్నూ తినమన్నాడు. బీఎస్ చిన్నబుచ్చుకోకూడదని తిన్నాను. సాంబారు అన్నం, చివర్లో మజ్జిగ వేశారు. బాగానే వుంది. ఎవరో పుణ్యాత్ముడు చేతనైన మటుకు పేదల కడుపు నింపుతున్నాడు. పక్కనున్న కానుగ చెట్టు కింద అరుగుమీద కూర్చున్నాం. ‘ఏంటి పరిస్థితి?’ అడిగాను. ‘ఆర్థిక పరిస్థితి ఏం బాగా లేదబ్బీ! ఇక్కడ అయిదు రూపాయల భోజనంతో.. తక్కువ ఖర్చుతో ముప్పూటలా కడుపు నింపుకోవచ్చు. ఒక సర్వేయర్ రూములో ఫ్రీగానే తల దాచుకుంటున్నాను’ చెప్పాడు. తన సోదరులు, మేనమామలు మంచి స్థితి మంతులే. తిరగడం చాలించి ఇంటిపట్టునే ఉండమని ఎన్నిసార్లు చెప్పినా బీఎస్ వినడంలేదట. ‘అంత ఇబ్బందిగా ఉంటే ఇంటికి వెళ్లొచ్చుగా’ అన్నాను. ‘ఇప్పుడు కాదులే. ఓపికున్నన్నాళ్లూ చేద్దాం. తరువాత చూద్దాంలే’ అంటూ దాట వేశాడు. ‘ఊరికెళ్దాం రా’ అన్నాను. ‘ఏముందబ్బీ ఊర్లో..? వారంనాడే అమ్మానాయన్ను చూసొచ్చినా. ఇప్పుడు నిన్ను చూసినా.. సంతోషంగా ఉంది’ అన్నాడు. నా బ్యాగులో దాచిన డబ్బుకవరు తీసి జేబులో పెట్టి ఖర్చులకు ఉంచు అన్నాను. కొంతమాత్రమే తీసుకొని మిగిలిందంతా వెనక్కు ఇచ్చి ‘ఇది చాల్లేబ్బీ ఈ వారం పని జరుగుద్ది’ అన్నాడు. ‘నీకోసమే తెచ్చాను’ అన్నాను. ‘ఒంటరి బతుకు.. నాకెందుకబ్బీ.. ! సంసారం ఈదేటోడివి నీకే ఖర్చులుంటాయిలే తీసుకెళ్లు’ అన్నాడు. ఇంతలో మోటార్ బైకుపై రైతులా ఉన్న ఓ వ్యక్తి బీఎస్‌ను వెతుక్కుంటూ వచ్చాడు. ‘వెళ్లొస్తా బ్బీ.. అంబవరం వెళ్లి ప్రకృతి సేద్యంలో ఈయనకు చీనీచెట్లు నాటించాలి’ అంటూ నాకు చెయ్యి ఊపి రైతు మోటారు బైకు ఎక్కి వెళ్లిపోయాడు. సేవకు అవకాశం వచ్చేసరికి అన్ని కష్టాల్ని పక్కనబెట్టి మిత్రుడికి వీడ్కోలును కూడా పట్టించుకోక ఎంతో ఆనందంగా వెళ్లిపోయాడు. ఏపూటకాపూట గడిస్తే చాలు.. సేవ దొరికితే అదే పదివేలు. బీఎస్ నడక మారలేదు, నడత మారలేదు. తను వెళ్లిన దారివైపు చాలాసేపు చూస్తూండి పోయాను. నిలువెత్తు రూపంలో మానవత్వం నింపుకున్న మాధవుడిలా కనిపించాడు. ముఖం మీద ఏదో పారాడినట్లనిపించింది. చేయిపెట్టి చూశాను, చేతికి తడి తగిలింది. బరువెక్కిన హృదయంతో బస్టాండు వైపు అడుగులు వేశాను. -
Prakasam: టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా రమణారెడ్డి
సాక్షి, ప్రకాశం(బేస్తవారిపేట): జిల్లా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా మండలంలోని రెడ్డినగర్‌కు చెందిన యన్నం వెంకట రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఒంగోలులో శుక్రవారం అందుకున్నారు. అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించిన ఎంపీ మాగుంటకు రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ మాగుంట నుంచి నియామక పత్రం అందుకుంటున్న పులి వెంకట కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కూడా.. తాళ్లూరు: టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా బొద్దికూరపాడు మాజీ సర్పంచి పులి వెంకట కృష్ణారెడ్డిని నియమిస్తూ ఆ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డి గతంలో గ్రామ సర్పంచిగా పని చేశారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో కీలక నాయకుడిగా పనిచేస్తున్నారు. తనను అడ్వైజరి కమిటీ సభ్యుడిగా నియమించేందుకు సహకరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్‌కు పీవీ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. -
ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఏవీ రమణారెడ్డి.. ఆ కమిషన్‌కు ఇన్చార్జి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తరఫున సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సోమవారం జీవో 148ను విడుదల చేశారు. దీంతో రమణారెడ్డి సోమవారం కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా వ్యవహరించిన పిన్నమనేని ఉదయభాస్కర్ ఇటీవలే పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు) -
Anantapur: ఒక్కడే.. ఆ నలుగురై!
కరోనా.. మనషులను కర్కశంగా మార్చేసింది. సాటి మనిషి ప్రాణంపోయే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా.. సాయం చేసే ధైర్యం ఎవరికీ ఉండటం లేదు. ఇక కరోనాతో మృతి చెందిన వారి అంతిమ సంస్కారాలకూ కుటుంబీకులే ముందుకురాని దుస్థితి. ఇలాంటి వారి కోసమే తానున్నానంటూ రమణారెడ్డి ముందుకొచ్చారు. వైరస్ సోకి మృత్యువాత పడిన వారికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. సంజీవని సంస్థ ద్వారా ఆపదలో ఉన్న వారికి తనవంతు సాయం చేస్తున్నాడు. ఇటీవల పాతూరులో 63 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృత్యువాత పడ్డాడు. ఆయన భార్య కుటుంబీకులు, బంధువులందరికీ సమాచారమిచ్చినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. పోలీసులు వెంటనే ‘సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్’ను సంప్రదించగా.. రమణారెడ్డి అతని మిత్ర బృందం కదిలివచ్చారు. శాస్త్రోక్తంగా ఆ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో మృత్యువాత పడి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాని ఎందరినో సంజీవిని సంస్థ సగౌరవంగా సాగనంపుతోంది. సాక్షి, అనంతపురం: అనంతపురానికి చెందిన రమణారెడ్డికి మొదటి నుంచీ సేవాభావం ఎక్కువ. వృద్ధులు, అనాథలపై అవ్యాజమైన ప్రేమ చూపుతుంటాడు. 2005లో రక్తదానంపై విస్తృత అవగాహన కల్పించడానికి ‘సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్’ పేరిట సేవా ప్రస్థానం ప్రారంభమైంది. తలసీమియా వ్యాధి బాధిత చిన్నారులకు స్వచ్ఛంద రక్త దాతల సహకారంతో అతను అందించిన సేవలు ఎందరికో స్ఫూర్తి. ఆర్థిక స్థోమత లేక నిస్సహాయంగా ఉండేపోయే వారికి నిత్యం ఖరీదైన మందులను అందించడం, ఆకలి దప్పులతో అలమటించే వారి కోసం నిత్యాన్నదానం చేయడం, వేసవి వచ్చిందంటే వృద్ధులకు పాదరక్షలందివ్వడం వంటివి ఆయన నిత్యం చేస్తున్న సేవా కార్యక్రమాలలో కొన్ని మాత్రమే. అన్నార్థుల కడుపు నింపుతూ.. నగరంలో రోజూ ఎక్కడోచోట కదల్లేని స్థితిలో వృద్ధులు కనిపిస్తుంటారు. వీరంతా ఆ దారి వెంట వెళ్లే వారి దయపై బతుకుతుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో జనం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడం లేదు. ఒకవేళ బయటకు వచ్చిన ప్రక్కన ఉన్న మనిషిని తాకే ధైర్యం ఎవరికీ ఉండటం లేదు. దీంతో అనాథల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి వారెందరికో రమణారెడ్డి ఆకలిదప్పులు తీరుస్తున్నారు. దాతల సాయంతో భోజనం సమకూర్చుకుని నగరమంతా తిరుగుతూ అనాథల కడుపునింపుతున్నాడు. చదవండి: ‘ఆ నలుగురూ’.. స్నేహితులే అన్నీ తానై అంత్యక్రియలు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండగా.. ఎందరో ఈ వైరస్ బారిన పడుతున్నారు. కొందరు కనీసం మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటున్నారు. ఇలాంటి వారి గురించి తెలిసిన వెంటనే.. రమణారెడ్డి మందులు తీసుకెళ్లి బాధితులకు అందజేస్తున్నారు. ఇక కరోనాతో కొందరు మృత్యువాత పడి బంధువులెవరూ ముందుకురాక అంతిమసంస్కారాలకు నోచుకోని వారిని రమణారెడ్డి అన్నీ తానై సాగనంపుతున్నాడు. వారివారి మతానుసారం సంజీవని సంస్థ ద్వారా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 20మందికి పైగా అనాథలకు అంతిమ వీడ్కోలు పలికారు. ఏ జన్మలోనో ఉండే రుణాన్ని తీర్చుకుంటున్నారు. అతనితో పాటు రామాంజనేయులు, జగదీశ్వరరెడ్డి, శ్రవణ్, సోహెల్, ఆది తదితరులతో కలిసి కరోనా సమయంలో సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేస్తున్న సేవలు ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్నాయి. నా బాధ్యత అనుకున్నా.. వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందితే అంతిమ సంస్కారాలకు చాలా మంది ముందుకు రాని పరిస్థితి. సమాచారం తెలిసిన వెంటనే వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. ఇందుకు కొంత ఖర్చు అవుతున్నప్పటికీ.. నా స్నేహితులు, తెలిసిన వారు సాయం చేస్తున్నారు. అలాగే చాలా మంది ఇళ్లలో ఆహార పదార్థాలను వృథాగా పారవేస్తుంటారు. 94404 76651 నంబర్‌కు సమాచారం ఇస్తే ఎక్కడికైనా వచ్చి ఆహారాన్ని తీసుకువెళ్లి అవసరం ఉన్నవారికి అందిస్తాం. – రమణారెడ్డి, సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకుడు చదవండి: అబ్బాయి అబద్ధం చెప్పాడు.. ‘ఈ పెళ్లి నాకొద్దు’ -
హాస్య నటులలో నాన్న హైహై నాయకా
రమణారెడ్డి లేకుండా నాటి సినిమాను ఊహించడమా? మంచిగానో చెడ్డగానో ఆయన ఉండాల్సిందే. మిస్సమను, గుండమ్మ కథను, మాయాబజార్‌ను ఆయన పాత్రలు ఎంత మెరిపించాయి. నెల్లూరు యాసకు సినిమాలో యాక్సెప్టెన్స్ తెచ్చిన నటుడు. ఎవరైనా సన్నగా ఉంటే రమణారెడ్డిలా ఉంటాడు... అనే పోలిక ఇప్పటికీ సాగుతూనే ఉంటుంది. సన్నగా ఉన్నా శక్తిమంతమైన పాత్రలు పోషించారు. ఆయన పెద్ద కుమారుడు ప్రభాకర్ రెడ్డి తండ్రి గురించి చెప్పిన విశేషాలు ఇవి. నాన్నగారికి మేం ఐదుగురు పిల్లలం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. నేను ఇంటికి పెద్ద. నా తరవాత చెల్లాయి వసుమతి, స్వర్ణలత, పద్మావతి, తమ్ముడు శ్రీనివాసరెడ్డి. అల్లుళ్లు ముగ్గురూ డాక్టర్లు. ఇద్దరు మెడికల్ డాక్టర్లు, ఒకరు డాక్టరేట్. నేను, తమ్ముడు ఇద్దరం చెన్నైలోనే ఇంజినీరింగ్ చదివాం. నేను బిటెక్ తరవాత ఎంబిఏ పూర్తి చేశాను. ఎల్ అండ్ టి లో పని చేశాను. అందరం చక్కగా సెటిల్ అయ్యాం. నాన్నగారు 1974లో అల్సర్‌తో బాధపడుతూ కన్ను మూశారు. అదే సంవత్సరం నాన్నగారితోపాటు ఘంటసాల, ఎస్విఆర్ కూడా తుదిశ్వాస విడిచారు. ఆ మరుసటి సంవత్సరం రేలంగి గారు. మా తల్లిగారు సుదర్శనమ్మ 93 ఏళ్లపాటు జీవించి ఇటీవలే అంటే 2018 అక్టోబరులో నాన్నగారిని చేరుకున్నారు. నాకు ఒకర్తే అమ్మాయి. హైదరాబాద్ ఏఎండిలో పనిచేస్తోంది. అల్లుడు కూడా అదే కంపెనీలో పని చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం.. నెల్లూరు దగ్గర జగదేవిపేట నాన్నగారి జన్మస్థలం. మాది వ్యవసాయ కుటుంబం. తాతగారు నాన్నగారి చిన్నప్పుడే పోవడంతో నాన్న ఇంటర్ తో చదువు ఆపేశారు. చెన్నై వచ్చాక, సోషల్ లైఫ్ బాగా పెరగటంతో మంచి ఇంగ్లీషు నేర్చుకోగలిగారు. నాన్నగారిది మేనరికం. అమ్మగారిది కోవూరు. నాన్నగారికి ఎప్పుడైనా ఫ్రీ టైమ్ దొరికితే మమ్మల్నందరినీ ఎక్కడికైనా తీసుకువెళ్లేవారు. రిజర్వ్డ్.. స్నేహితులతో బాగా మాట్లాడేవారు. ఇంట్లో మాత్రం చాలా రిజర్వ్డ్గా ఉండేవారు. అప్పుడప్పుడు ప్రివ్యూలకు వెళ్లేవాళ్లం. నాన్నగారు విడిగా, మేమందరం విడిగా వెళ్లేవాళ్లం. అంత రిజర్వ్డ్గా ఉనా, పిల్లలు అడిగినదేదీ కాదనేవారు కాదు. బాగా బిజీగా ఉన్న రోజుల్లో రోజుకి రెండు మూడు షిఫ్టులు పనిచేయటం వల్ల నాన్నగారు ఇంట్లో చాలా తక్కువసేపు ఉండేవారు. అందుకే మాతో ఎక్కువసేపు గడపటానికి అవకాశం ఉండేది కాదు. ఒకసారి నాన్నని చూడటానికి ఎస్.వి. రంగారావు గారు మా ఇంటికి వచ్చారు. నేను ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చాను. ఆయన నా చేతిలో కాఫీ అందుకుంటూ, ‘అబ్బాయి ఏం చేస్తున్నాడు?’ అని నాన్నను అడిగారు. ఆయన వెంటనే చెప్పలేక నా వైపు చూశారు. మా చదువు గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేవారు. చిన్న వయసు – పెద్ద పాత్రలు చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాటకాలు వేయటం సరదా. చదువుకునే రోజుల నుంచే నాటకాలు వేయటం ప్రారంభించారు. ఆ తరవాత సినిమాలలోకి ప్రవేశించారు. నాన్నగారు నటించిన మొదటి సినిమా ‘మానవతి’. శంకర్రెడ్డిగారు నాన్నగారికి మొదటి అవకాశం ఇచ్చారు. ‘చరణదాసి’ లో సూర్యకాంతం గారికి కొడుకు వేషం వేశారు. రేలంగి గారి కంటె నాన్నగారు వయసులో కొద్దిగా చిన్నవారే. కాని ఇంచుమించు అన్ని సినిమాలలోను ఆయనకు తండ్రి, మామగారు పాత్రలే పోషించారు నాన్నగారు. నాన్న సినిమాలు.. సాధారణంగా అందరూ విజయవంతమైన సినిమాలలోని పాత్రలనే గుర్తుపెట్టుకుంటారు. ఫెయిల్ అయినవాటిని మర్చిపోతుంటారు. ‘గంగ గౌరి సంవాదం’ సినిమాలో నాన్నగారు భగ్న ప్రేమికుడు. కృష్ణకుమారి హీరోయిన్. నాన్నగారు చాలా డిఫరెంట్‌గా నటించిన సినిమా అది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. అది గుర్తుపెట్టుకోలేకపోయారు. ‘గుండమ్మ కథ’ సినిమాలో నాన్నగారు, రామారావు గారు, సూర్యకాంతం గారు... ఈ ముగ్గురి గురించే మాట్లాడుకునేవారు. అప్పట్లో ఒక సినిమా శతదినోత్సవం జరుపుకుంటే ఘనంగా ఉండేది. జగపతి వారి మొదటి సినిమా ‘అన్నపూర్ణ’ వేడుకలు విజయ గార్డెన్స్‌లో చేశారు. దానికి నాన్నగారు కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. అందరూ ఎదురు వచ్చి తప్పట్లు కొడుతూ వేదిక మీదకు ఘనంగా, సంతోషంగా తీసుకెళ్లారు. పొరపాటు జరిగింది.. నాన్నగారి దగ్గర రాధాకృష్ణమూర్తి అనే ఆయన మేనేజర్‌గా పనిచేసేవారు. ఆయన చాలా నమ్మకస్థుడు. అనుకోకుండా ఒకసారి చిన్న పొరపాటు జరిగింది. ఒకేరోజు మూడు ప్రొడక్షన్స్‌కి కాల్షీట్లు ఇచ్చేశారు. మూడు సినిమాల లోనూ పెద్ద నటులతో కలిసి నటించాలి. దాంతో నాన్న ఇరుకున పడ్డారట. అయినప్పటికీ ఆయనను ఏమీ అనలేదట. నాన్నగారు పోయిన రెండో రోజున ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పారు. ఆయనకు నాన్నగారంటే విపరీతమైన అభిమానం. అల్లు రామలింగయ్య.. ఇంజినీరింగ్ ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా చదువుకోవటం వల్ల అందరికీ నేను గుర్తుండిపోయాను. నాన్నగారు పోయిన రెండు సంవత్సరాల తరవాత ఆఫీస్ పని మీద హైదరాబాద్ సరోవర్ హోటల్‌కిlవచ్చాను. అక్కడ అల్లు రామలింగయ్య గారు నన్ను చూసి పలకరించి, నాన్నగారితో ఉన్న అనుబంధం గురించి చాలా సేపు ముచ్చటించారు. చెన్నైలో ఉన్న రోజుల్లో నేను ఆయనను చాలాసార్లు చూశాను. కాని ఎన్నడూ ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు. ఆయన నన్ను గుర్తు పెట్టుకుని, పలకరించార ంటే నేను రమణారెడ్డిగారి అబ్బాయిని కాబట్టే కదా! మెజీషియన్... పాత ‘అక్కచెల్లెళ్లు’ సినిమాలో నాన్నగారిది మెజీషియన్ పాత్ర. దానికోసం నాన్నగారు మ్యాజిక్ నేర్చుకున్నారు. ఆయనకు మ్యాజిక్ అంటే సరదా ఉండటం వల్ల, ఆ తరవాత చాలా ప్రదర్శనలిచ్చారు. అందుకోసం చాలా డబ్బు ఖర్చు చేశారు. సినిమాల వల్ల డబ్బులు సంపాదిస్తే, మ్యాజిక్ వల్ల డబ్బులు పోగొట్టుకున్నారు. 1957 లో నెల్లూరు టౌన్హాల్లో మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చారు. ఆ రోజున ఘంటసాల గారి కచేరీ కూడా ఉంది. ‘ఘంటసాల మ్యూజిక్, రమణారెడ్డి మ్యాజిక్’ అని పబ్లిసిటీ ఇచ్చారు. నాన్నగారు చివరి ప్రదర్శన ఢిల్లీలో జరిగింది. మంచి స్నేహం.. నాన్నను అందరూ ‘రమణయ్యా’ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆ రోజుల్లో స్నేహాలు బావుండేవి. నాన్నగారి స్నేహితులు ఒకాయన ఒక చిత్రంలో నాన్న నటించిన పాత్రకు వచ్చిన పారితోషికం తీసుకుని, ‘దీని గురించి నువ్వు నన్ను అడగకు’ అన్నారు. ఆ డబ్బులతో హైదరాబాద్‌లో ఒక స్థలం కొని, ఆ కాగితాలను, మిగిలిన డబ్బును మా చెల్లాయి పెళ్లి సమయంలో అందచేశారు. ఆ రోజు నాన్న కళ్లలో కనిపించిన ఆనందాన్ని ఇప్పటికీ మరచిపోలేను. అంత మంచి స్నేహాలుండేవి. అదే నంబరు నేటికీ... 1963 దాకా మా ఇంట్లో ఫోన్ లేదు. మా మొట్టమొదటి ఫోన్ నెంబరు 42537 ఇప్పటికీ అదే నెంబరులోని ఆఖరి మూడు డిజిట్లు కంటిన్యూ అవుతున్నాయి. నాన్నగారిది చాలా సింపుల్ లైఫ్. ఇంట్లో తీరికగా ఉన్నప్పుడు ఆంధ్ర క్లబ్‌కి కాని, టి. నగర్ క్లబ్‌కి కాని వెళ్లేవారు. ఆ సమయంలో డ్రైవర్ రాకపోతే నా సైకిల్ మీద వెళ్లిపోయేవారు. అజాత శత్రువు.. 1964 టైమ్‌లో మా పెద్ద నాన్నగారి అబ్బాయి టి. సుబ్బిరామిరెడ్డి (మా నాన్నగారు, వాళ్ల నాన్నగారు అన్నదమ్ములు) కాంట్రాక్ట్‌లు చేస్తున్నారు. నాన్నగారు హైదరాబాద్ వచ్చారని తెలిస్తే, షూటింగ్ చూడటానికి వచ్చేవారు. ఒకసారి నాగార్జున సాగర్ నుంచి సారథి స్టూడియోకి వచ్చి, ‘మా చిన్నాయన రమణారెడ్డిని చూడటానికి వచ్చాను’ అని చెప్పారు. నాన్నగారు ఆయనను అందరికీ పరిచయం చేశారు. సుబ్బిరామిరెడ్డిగారికి సినిమాల పరిచయం అప్పుడే కలిగింది. అలా ఆయనకు సినిమాల మీద మోజు బయలుదేరింది. సినిమాలలో ఎన్నో నెగిటివ్ పాత్రలుæవేసినా, నాన్నని అందరూ గౌరవించేవారు. ప్రేమించేవారు. నాన్నగారికి అజాతశత్రువు అని పేరు. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫొటోలు: సురేశ్ కుమార్ ఎ. అకాల భోజనంతో... చిన్నప్పటి నుంచి నాయనకు అల్సర్లు ఉండేవి. ఆయన వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అది అప్పుడప్పుడు బాధిస్తుండేది. అప్పట్లో సరైన వైద్యం కూడా లేదు. మూడు షిఫ్టులు పని చేస్తూండటం వల్ల అకాల భోజనంతో, తరచు ఆరోగ్యం దెబ్బ తినేది. 1968లో ఆపరేషన్ చేయించుకున్నారు. నెలరోజులపాటు కాల్షీట్లు తీసుకోలేకపోవటంతో, అవకాశా లు తగ్గిపోయాయి. ఆ తరవాత సినిమాలలో అతిథి పాత్రలలో మాత్రమే నటించారు. అంతకంటె చేయలేకపోయారు. ఆ సమయంలోనే ‘మనసు – మాంగల్యం’, ‘శ్రీమంతుడు’ చిత్రాలలో పూర్తి స్థాయి పాత్ర చేశారు. 1974లో అల్సర్ తిరగబెట్టింది. ఆపరేషన్ చేసిన నాలుగు నెలలకు ఆయన కన్నుమూశారు. నాన్నగారు పోయేనాటికి నా వయసు 28 సంవత్సరాలు. కుటుంబ బాధ్యత నాదే. అప్పటికి ఒక చెల్లాయికి మాత్రమే వివాహమైంది. -
రమణారెడ్డి ఎక్కడ?
అనంతపురం: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రమణారెడ్డి ఎక్కడ అనే చర్చ జోరుగా సాగుతోంది. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆయన మూన్నెళ్లవుతున్నా.. విధుల్లో చేరకపోవడమే ఇందుకు కారణమైంది. కూడేరు ఎంపీడీఓగా పని చేస్తున్న రమణారెడ్డి 2019 ఆగస్టు 1న డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 19న సెలవుపై వెళ్లారు. ముందుగా ఐదు రోజులు సెలవు పెట్టినా తర్వాత పొడిగించుకున్నారు. జిల్లా పరిషత్‌లో ఈ పోస్టు అత్యంత కీలకం. కార్యాలయంలో పది సెక్షన్లు ఉన్నాయి. పరిషత్ పరిధిలో జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరి జీతభత్యాలు, పెన్షన్లు, మెడికల్ రీయింబర్స్మెంట్, పదోన్నతులు ఇలా నిత్యం పదుల సంఖ్యలో ఫైళ్లు ఆయా సెక్షన్ల నుంచి వెళ్తుంటాయి. ప్రతి ఫైలూ సీఈఓ చూడడం సాధ్యం కాదు. సీఈఓ క్షేత్రస్థాయిలో పర్యటించి జెడ్పీ ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. పైళ్లకు సంబంధించి ఆయా సెక్షన్ల అడ్మినిస్ట్రేషన్ అధికారుల ద్వారా డిప్యూటీ సీఈఓకు వెళ్తాయి. వచ్చిన ఫైళ్లను డిప్యూటీ డీఈఓ పరిశీలించి పంపితే సీఈఓ ఆమోద ముద్ర వేస్తారు. ఉద్యోగులకు, సీఈఓకు మధ్య కీలకంగా ఉండే ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా ఎన్వీ రమణారెడ్డి..
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్ అఫిషియో కమిషనర్‌గా నియమితులైన ఎన్వి రమణారెడ్డి గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ అసిస్టెంట్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛా లతో ఆయనకు స్వాగతం పలికారు. ఐఆర్పీఎస్ (1986) బ్యాచ్ అధికారి అయిన రమణారెడ్డి ఇండియన్ రైల్వే లోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రోటోకాల్ విభాగం సెక్రటరీగా, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం మాతృ సంస్థ అయిన ఇండియన్ రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ విభాగంలో పనిచేస్తూ తిరిగి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన రమణారెడ్డిని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్ అఫీషియో కమిషనర్, టూరిజం శాఖ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. -
హాస్య నటుడు రమణా రెడ్డి భార్య మృతి
అలనాటి హాస్యనటుడు రమణారెడ్డి సతీమణి సుదర్శనమ్మ (93) అనారోగ్య కారణాలతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం టీనగర్‌లోని ఇంట్లో తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమ తొలినాళ్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రమణా రెడ్డి అలరించారు. ఆయన 1974లో మరణించిన సంగతి తెలిసిందే. రమణారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ రోజు (శనివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్
బద్వేలు అర్బన్: పోరుమామిళ్ల మండలం రేపల్లె గ్రామానికి చెందిన చవ్వా రమణారెడ్డి అనే మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్‌ను అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ బి.ఆర్.విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 13వ తేదీన గోపవరం మండలం లక్కవారిపల్లె గ్రామ సమీపంలోని కట్టెల వరువ కాలువ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయం తెలుసుకుని సీఐ, రూరల్ ఎస్ఐలు తమ సిబ్బందితో వెళ్లి దాడులు చేసిన సమయంలో ఎం.శ్రీను మొఘల్ నాయబ్‌లు పట్టుబడగా రమణారెడ్డి పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లు రువ్వుతూ పారిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం గోపవరం మండలంలోని కాలువపల్లె గ్రామానికి వెళ్లే ఆర్చివద్ద రమణారెడ్డి ఉన్నట్లు సమాచారం రావడంతో వెళ్లి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతన్ని విచారించగా గోపవరం మండల పరిధిలో లక్కవారిపల్లె గ్రామ సమీపంలో గల తెలుగుగంగ కాలువ వద్ద ఎర్రచందనం దుంగలు దాచి ఉంచినట్లు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితునిపై పోరుమామిళ్ల స్టేషన్లో ఐదు కేసులు, పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్లో రెండు కేసులు , బద్వేలు ఫారెస్టు రేంజ్లో ఐదు కేసులు , బి.కోడూరు పోలీసు స్టేషన్లో రెండు కేసులు, బద్వేలు అర్బన్ స్టేషన్లో ఒక కేసు చొప్పున 15 కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2015లో పోరుమామిళ్ల పోలీసులు ఇతనిపై పీడీయాక్ట్ కూడా పెట్టగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి తిరిగి వచ్చిన తర్వాత కూడా కూలీల సహాయంతో ఎర్రచందనం చెట్లను నరికించి అంతర్జాతీయ స్మగ్లర్లకు అందజేస్తుండేవాడని విచారణలో తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రామాంజినాయక్, రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు మూర్తి, చెంచురామయ్య, ఫారెస్టు బీట్ ఆఫీసర్ రమణయ్య, ఏబీవో కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో మోసం..
- 14 మంది అరెస్ట్ బెల్లంపల్లి(ఆదిలాబాద్ జిల్లా) సింగరేణి సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన 14 మందిని పోలీసులు బెల్లంపల్లిలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.14.70 లక్షల నగదు, 13.5 తులాల బంగారం, 7.5 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి తెలిపారు. -
నిర్భయ కేసు నమోదు
బాలికపై నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై నిర్భయచట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లికి చెందిన మామిడి జగన్ అదే గ్రామానికి చెందిన బాలికను కళాశాలకు వెళ్లి వస్తున్న క్రమంలో 2014నుంచి వేధించసాగాడు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి జగన్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ రమణారెడ్డి బుధవారం తెలిపారు. -
దక్షిణ మధ్య రైల్వేకు ఇద్దరు కొత్త అధికారులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేకు ఇద్దరు కొత్త అధికారులు వచ్చారు. చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా అర్జున్ ముండియా, చీఫ్ పర్సనల్ ఆఫీసర్‌గా ఎన్వీ రమణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ (ఐఆర్పీఎస్) 1986 బ్యాచ్‌కు చెందిన రమణారెడ్డి గతంలో దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వోగా, సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శిగా,ఏపీలో జీఏడీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఎంఈ) 1983 బ్యాచ్‌కు చెందిన అర్జున్ ముండియా గతంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో చీఫ్ వర్క్‌షాప్స్ ఇంజనీర్‌గా, సంబల్పూర్ డీఆర్ఎంగా, చీఫ్ మోటివ్ పవర్ ఇంజనీర్‌గా పనిచేశారు. -
ఎంపీడీఓల మధ్య కుదరని రాజీ
► వెనక్కు తగ్గేది లేదన్న రూరల్ ఎంపీడీఓ ► ఏజెన్సీ గంగవరం ఎంపీడీఓ అరెస్టు, బెయిల్‌పై విడుదల రాజమహేంద్రవరం: బదిలీల నేపథ్యంలో ఓ ఎంపీడీఓను మరో మహిళా ఎంపీడీఓ బెదిరించిన కేసులో వారి మధ్య రాజీ కుదరలేదు. వీరు రాజీ పడ్డారేమో అని అనుకుంటున్న తరుణంలో, రూరల్ ఎంపీడీఓ కేసు విషయంలో వెనక్కుతగ్గేది లేదని తేల్చిచెప్పడంతో అధికార వర్గాలు విస్తుపోయాయి. ఈ క్రమంలో ఆ మహిళా ఎంపీడీఓను వారం రోజుల క్రితం బొమ్మూరు పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయిగతంలో రాజమహేంద్రవరం రూరల్ ఎంపీడీఓగా పనిచేసి, బదిలీపై వెళ్లిన ఎస్.సుభాషిణి ప్రస్తుతం ఏజెన్సీ గంగవరంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న రాజమహేంద్రవరం రూరల్ ఎంపీడీఓ ఎ.రమణారెడ్డిని మేసేజ్‌ల ద్వారా బెదిరించారు. ఎంపీడీఓ రమణారెడ్డి అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులకు, రూరల్ ఎమ్మెల్యేకు, జిల్లా ఉన్నతాధికారులకు మేసేజ్‌లు పెట్టడంతో పాటు సెలవుపై వెళ్లిపోవాలంటూ ఎంపీడీఓకు మేసేజ్‌లు పెట్టారు. అలాగే ఎంపీడీఓ రమణారెడ్డి పనైపోయిందంటూ సహచర ఉద్యోగుల వద్ద మాట్లాడడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 29న ఎంపీడీఓ రమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మేసేజ్‌లు వచ్చిన సెల్‌ఫోన్ నంబరు ఎంపీడీఓ సుభాషిణి వినియోగిస్తున్నట్టు ఐఎంఈఐ నంబరు ద్వారా గుర్తించారు. కోర్టు అనుమతితో బొమ్మూరు పోలీసులు ఎంపీడీఓ సుభాషిణిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తప్పుకున్న సంఘ నేతలు : ఈ కేసులో ఎంపీడీఓల మధ్య రాజీ కుదిర్చేందుకు ఎంపీడీఓల సంఘ నాయకులు ముందుకు వచ్చేందుకు సాహసించ లేదు. ఆమె తీరు ముందునుంచీ వివాదాస్పదంగా ఉండడంతో, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అనవసరమంటూ తప్పుకున్నట్టు సమాచా రం. ఎంపీడీఓ సుభాషిణి భర్త, ఆమె న్యాయవాదులు ఎంపీడీఓ రమణారెడ్డిని కలిసి రాజీ ప్రయత్నాలు చేశారు. రూరల్ ఎంపీడీఓ రమణారెడ్డి కేసు విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చిచెప్పినట్టు సమాచారం. ఇదే విషయన్ని బొమ్మూరు పోలీసులకూ ఆయన స్పష్టం చేయడంతో ఎంపీడీఓ సుభాషిణిని వారం రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ విషయమై బొమ్మూరు ఇన్స్పెక్టర్ కనకారావును వివరణ కోరగా, ‘ఎంపీడీఓ కేసు విషయం ఎందుకు, వదిలేయండి’ అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. -
ఏసీబీ వలలో కోర్టు సూపరింటెండెంట్
మెదక్: భూ సంబంధ వివాదంలో లంచం తీసుకుంటూ కోర్టు ఉద్యోగి ఒకరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. మెదక్ పట్టణం మూడో అదనపు కోర్టులో లాల్‌సింగ్ అనే వ్యక్తికి చెందిన సివిల్ కేసు 2009 నుంచి నడుస్తోంది. అయితే, ఈ కేసు విషయంలో సమన్లు జారీ చేయటానికి సూపరింటెండెంట్ రమణారెడ్డి లంచం డిమాండ్ చేశారు. దీంతో లాల్ సింగ్ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కోర్టు ఆవరణలో గురువారం మధ్యాహ్నం లాల్‌సింగ్ నుంచి రూ.5 వేలు తీసుకుంటున్న రమణారెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పొగాకు రైతు ఆత్మహత్య
మద్దిపాడు: తాను పండించిన పంటకు మద్దతు ధర సరిగ్గా రావడం లేదని, దీంతో తెచ్చిన అప్పులు తీర్చే దారి కనపడక ఓ పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఎనమనమెల్లూరు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన వాకా రమణా రెడ్డి(46) రెండు బ్యారెన్లకు (ఒక బ్యారెన్ అంటే ఎడు ఎకరాలలో సాగు చేసిన పొగాకు నుంచి వచ్చే దిగుబడి) పొగాకు వేశాడు. కానీ ప్రస్తుతం ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టాల పాలయ్యాడు. ఇప్పటి వరకు పంట కోసం తెచ్చిన అప్పులను ఒక చీటీలో రాసుకొని పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మరో మహిళా తహశీల్దార్‌పై దాడికి యత్నం
-
ఆ.. రుణాల మాటేంటి?
మరణించిన రైతుల గురించి నోరెత్తని అధికారులు రూ.కోట్లలో బకాయిలు.. చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలు సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరులో నివాసం ఉంటున్న రమణారెడ్డి ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఐదెకరాల పొలం ఉంది. అందులో పంట సాగు చేసేందుకు రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన రైతు రుణమాఫీకి ఇతను అర్హుడేనని బ్యాంకు అధికారులు అర్హుల జాబితాలో చేర్చారు. అయితే ప్రభుత్వం రెండువిడతలుగా ప్రకటించిన రైతు రుణమాఫీ జాబితాలో ఇతని పేరులేదు. బ్యాంకర్లు ఇతను తీసుకున్న బకాయి వెంటనే చెల్లించాలంటూ నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న రమణారెడ్డి కుటుంబ సభ్యులు బ్యాంకర్లను కలిశారు. రైతు రుణమాఫీకి తాము అర్హులమేనని వివరించారు. అందుకు సంబంధించిన పాసుపుస్తకం, రేషన్‌కార్డు చూపించారు. అయితే ఆధార్‌కార్డు లేదు. దీంతో బ్యాంకర్లు వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అధికారులను కలవమని పంపేశారు. దీంతో రమణారెడ్డి భార్య లక్ష్మమ్మ కలెక్టరేట్‌కు వచ్చి రెవెన్యూ అధికారిని కలిశారు. తన భర్త తీసుకున్న రుణం మాఫీ అవుతుందా? అవ్వదా? వాస్తవంగా అయితే తన భర్త తీసుకున్న రుణం చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే ఆ బకాయి చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. అందుకు అధికారి ఒకరు ‘మీ భర్త మరణించిన విషయం మాకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఆ తరువాత అతని వివరాల కోసం ఆన్లైన్లో అన్వేషించారు. అయితే అందులో ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఏం చెప్పాలో తెలియక ‘మీరు డెత్ సర్టిఫికెట్ తీసుకురండి. ఆ తరువాత ఏం చేయాలో చెబుతాం’ అని సమాధానం ఇచ్చి పంపేశారు. ఆందోళనలో రైతు కుటుంబాలు.. అయోమయంలో అధికారులు అనారోగ్యంతోనో.. ప్రమాదవశాత్తు మరణించిన రైతులు జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. వారిలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులు సుమారు 2,700 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. వీరు తీసుకున్న రుణాలు రూ.కోట్లలో ఉన్నట్లు తెలిసింది. కుటుంబ యజమాని మరణించడంతో బ్యాంకులో తీసుకున్న రుణాలకు సంబంధించి బ్యాంకర్లు కొందరు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. మరి కొందరు తీసుకున్న రుణం చెల్లించేసి.. ప్రభుత్వం రుణమాఫీ కింద బ్యాంకులకు చెల్లించిన మొత్తాన్ని తీసుకునేందుకు తిరుగుతున్నారు. అలాగే నాయుడుపేటకు చెందిన రైతు కృష్ణయ్య కొడుకు గురువారం కలెక్టరేట్‌కు వచ్చి రుణమాఫీ సెల్లో పనిచేసే అధికారిని కలిశారు. తన తండ్రి రూ.75 వేలు రుణం తీసుకున్నట్లు తెలిపారు. తీసుకున్న రుణానికి సంబంధించి రూ.25 వేల వరకు చెల్లించినట్లు వివరించారు. అయితే రుణమాఫీ జాబితాలో తండ్రిపేరు ఉందని, అందుకు సంబంధించి మొదటి విడత కొంత మొత్తం కూడా ప్రభుత్వం చెల్లించినట్లు చెప్పుకొచ్చారు. ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే బ్యాంకర్లు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అధికారి తానేమీ చేయలేనని బ్యాంకు వారినే కలవమని చెప్పి పంపేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మరణించిన కుటుంబాల వారు రుణమాఫీకి సంబంధించి రకరకాల సమస్యలతో బ్యాంకర్లు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరణించిన రైతులకు సంబంధించి నిబంధనలు రాలేదుః -వెంకటేశ్వరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్, నెల్లూరు జిల్లాలో మరణించిన రైతులు వందల సంఖ్యలో ఉన్నారు. వారు తీసుకున్న రుణాలకు సంబంధించి నిబంధనలు ఏవీ రాలేదు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. నిబంధనలు వచ్చాక తెలియజేస్తాం. -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా వైఎస్సార్టీ ఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రెడ్డిశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని సక్సెస్ పాఠశాలల ద్వారా అందించిన ఘనత ఆయనదేనన్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్పరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చరిత్రలో లేని విధంగా 35,600 మందికి ప్రమోషన్లు కల్పించారన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయ సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మరిన్ని ఆందోళనలు తప్పవన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనాథరెడ్డి, జిల్లా కోశాధికారి దివాకర్‌బాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ సింగారెడ్డి అమర్నాథ్రెడ్డి ప్రసంగించారు. పలు సమస్యలపై డిమాండ్: 60 శాతం ఫిట్మెంట్తోపాటు 2013 జూలై నుంచి పీఆర్సీని ప్రకటించాలి. ఆరోగ్య కార్డులను వెంటనే వినియోగంలోకి తెచ్చి అన్ని రకాల వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు లేని వైద్యం అందేలా చూడాలి. క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటును వెంటనే ఆపాలి. భాషోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఎయిడెడ్, మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్‌ని వెంటనే అమలు చేయాలి. ఎయిడెడ్, మున్సిపల్ ఉపాధ్యాయులకు ఆరోగ్యకార్డులను వెంటనే అందించాలి తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్ఓ సులోచనకు అందజేశారు. -
‘సమాచార’ బాధ్యతలు రమణారెడ్డికి
దానకిషోర్ బీసీ సంక్షేమ శాఖకు బదిలీ మీడియా లైజనింగ్ ఆఫీసర్ల ఫైలు పెండింగే బదిలీకి కారణం! దానకిషోర్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కేంద్రం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్ బాధ్యతలను ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్.వి.రమాణారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం.దానకిషోర్‌ను బీసీ సంక్షేమశాఖకు బదిలీ చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వాణీప్రసాద్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి దానకిషోర్‌కు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దానకిషోర్ బదిలీకి ప్రధాన కారణం విధులకు సరిగా హాజరు కాకపోవడంతో పాటు లోకేశ్‌బాబు సూచించిన వ్యక్తులను మీడియా లైజనింగ్ ఆఫీసర్లగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయకపోవడమేనని చెప్తున్నారు. ఉన్నతాధికారుల పంపిణీలో భాగంగా దానకిషోర్‌ను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. అప్పటి నుంచి ఆయన ఏపీ సమాచార శాఖ కమిషనర్ బాధ్యతలను సరిగా నిర్వహించడం లేదని చెప్తున్నారు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా కలిసినట్లు ప్రచారం సాగుతోంది.తెలంగాణకు వెళ్లే ముందు ఏపీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదనే భావనలో దానకిషోర్ ఉన్నారని.. అందువల్లనే మీడియా లైజనింగ్ ఆఫీసర్ల నియామక ఫైలును పెండింగ్‌లో ఉంచారని చెప్తున్నారు. ఇక ఐఆర్పీఎస్ సర్వీసుకు చెందిన రమణారెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (ప్రోటోకాల్) ప్రత్యేక కార్యదర్శిగా సమర్ధంగా పనిచేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే రమాణారెడ్డికి సమాచార శాఖ కమిషనర్‌గా, ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. -
జైలుకు బదులు ఇంటికి...
రిమాండ్ ఖైదీకి కానిస్టేబుల్ సహకారం కమిషనర్ ఆగ్రహం నగరంలోని కోర్టుల సిబ్బందిని తప్పించాలని ఆదేశం కొత్త వారిని నియమించాలని ఉత్తర్వులు సాక్షి, సిటీబ్యూరో: కాసుల కక్కుర్తితోఓ కానిస్టేబుల్ విద్యుక్త ధర్మానికి నీళ్లొదిలాడు.జైలుకు పంపించాల్సిన నిందితుడిని దర్జాగా ఇంటికి పంపించాడు. వివరాలివీ... దేవనాథ్రెడ్డికి బంజారాహిల్స్‌లో ఓ ప్రైయివేటు కార్యాలయం ఉం ది. ఈ కార్యాలయం ద్వారా ఆర్డర్ పొందిన రాంచ ందర్ నాయక్ ఆధార్ కార్డులను తయారు చేశాడు. బిల్లులు చెల్లించాలని పలుమార్లు నాయక్ అతని కార్యాలయానికి వెళ్లి నిలదీశాడు. దీంతో తన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని నాయక్‌పై 2010లో దేవనాథ్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నాయక్‌పై ఐపీసీ 384 (దాడికి పాల్పడినట్లు) కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాయక్ అరెస్టయి, బెయిల్ పొందాడు. తాను తయారు చేసిన ఆధార్ కార్డులకు బిల్లులు ఇవ్వకపోవడమే కాకుండా కేసు పెట్టించాడనే కక్షతో నాయక్ 2013లో దేవనాథ్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు రావల్సిన బిల్లును ఇవ్వకుండా మోసగించాడని ఫిర్యాదులో పేర్కొనడంతో దేవనాథ్రెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న దేవనాథ్‌రెడ్డి తన న్యాయవాది ద్వారా నాంపల్లి కోర్టులో రెండు నెలల క్రితం ఓ రోజు మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోయాడు. దీంతో మెజిస్ట్రట్ అతడికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. మలుపు తిరిగింది ఇక్కడే... జైలుకు వెళ్లడం ఇష్టంలేని దేవనాథ్‌రెడ్డి చేసేదిలేక నాయక్‌తో రాజీ కుదుర్చుకున్నాడు. పరస్పరం ఫిర్యాదులను వాపస్ తీసుకునేందుకు ఇద్దరూ సిద్ధపడ్డారు. ఈ మేరకు అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు లోక్దాలత్లో రాజీ అవుతున్నట్లు పిటిషన్ వేసుకున్నారు. పిటిషన్‌ను పరిశీలించిన లోక్‌అదాలత్ మెజిస్ట్రేట్ ఈ రెండు కేసుల్లో రాజీ చేసేందుకు వీలు ఉండదని, ఐపీసీ 384లో రాజీ కుదరదని తిరస్కరించారు. అప్పటికే సాయంత్ర ం నాలుగు గంటలైంది. పిటిషన్ తిరస్కరణకు గురికాగానే దేవనాథ్రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు జ్యూడీషియల్ కస్టడీకి తరలించాల్సి ఉంది. ఇక్కడ ఎలాంటి బేరసారాలు జరిగాయో తెలియదు గానీ ఎస్కార్ట్‌గా ఉన్న కానిస్టేబుల్ దేవనాథ్రెడ్డిని జైలుకు పంపకుండా ఇంటికి పంపించాడు. అందరినీ తప్పించండి ఈ విషయం కమిషనర్ ఎమ్.మహేందర్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితుడికి సహకరించిన కానిస్టేబుల్‌తో పాటు నగరంలోని అన్ని కోర్టులలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని వెంటనే తప్పించి, ఆగస్టు 7వ తేదీలోగా కొత్త వారిని నియమించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల ఠాణాలు, మహిళా ఠాణాలు, సైబర్ క్రైమ్ స్టేషన్, సీసీఎస్‌ల నుంచి సికింద్రాబాద్, నాంపల్లిలోని క్రిమినల్ కోర్టు, పాతబస్తీలోని సివిల్ కోర్టు తదితర చోట్ల విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐలను వెంటనే తప్పించి, కొత్తవారిని నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమూలంగా ప్రక్షాళన చేస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కమిషనర్ అభిప్రాయపడ్డారు. అయితే ఎవరో ఒకరు చేసిన పొరపాటుకు అందరినీ బలిచేయడం సబబు కాదని కోర్టు విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బంది అంటున్నారు. -
ఇద్దరు టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
బుక్కపట్నం : చౌక డిపో డీలర్‌షిప్‌లు తమకు దక్కలేదని అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేం ద్రంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యకు యత్నిం చారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. టీడీపీ అభివృద్ధి కో సం పని చేస్తున్న తనకు కాదని మరొకరికి రేషన్ డీలర్షిప్ కట్టబెట్టారని మదిరేబైలుకు చెందిన ఆ పార్టీ కార్యకర్త రమణారెడి సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఊజీ మాత్రలు మింగాడు. ఇదే రీతిలో రామసాగరానికి చెందిన కార్యకర్త శంకర్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు సిద్ధపడగా పక్కనున్న వారు వారించారు. ఊజీ మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్న రమణారెడ్డిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాము అనేక సంవత్సరాలుగా పార్టీలో నిజాయితీగా పని చేస్తున్నామని, అలాంటిది తమను కాదని డీలర్ షిప్పులు వేరే వారికి కట్టబెట్టడం ఏం న్యాయమని బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
మట్టెవాడ /కాజీపేటరూరల్, న్యూస్‌లైన్ : వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద స్లాబ్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో గురువారం పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. అండర్ బ్రిడ్జి కింది భాగంలో స్లాబ్ లేకపోవడంతో అప్‌అండ్‌డౌన్ మార్గాల నుంచి రైళ్లు వెళుతున్న సమయంలో ప్రయాణికులు వదిలేస్తున్న వ్యర్థాలు కింది నుంచి వెళ్లే వాహనదారులపై పడుతున్నాయి. దీంతో రైలు వచ్చినప్పుడు అటు, ఇటు వాహనాలను నిలిపివేయడం.. ఆ తర్వాత ఒక్కసారిగా కదలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రైల్వే అధికారులు గత మూడు రోజులుగా అండర్ బ్రిడ్జి కింద స్లాబ్‌ను నిర్మిస్తున్నారు. వరంగల్ ఆర్యూబీ బ్రిడ్జి స్టీల్ గట్టర్స్ కాలం చెల్లిపోవడంతో వాటిని తొలగించి వాటి స్థానంలో భారీ క్రేన్లు, పొక్లెయిన్ల సాయంతో రైల్వే అధికారులు, సిబ్బంది పిల్లర్స్ వేస్తున్నారు. అలాగే స్లాబ్‌పై సిమెంట్ బిళ్లలు పోయిస్తున్నారు. అయితే పనులను దృష్టిలో ఉంచుకుని గురువారం, శుక్రవారాల్లో అధికారులు ఇంజినీరింగ్ బ్లాక్ ఇచ్చారు. దీంతో గురువారం మధ్యాహ్నం 1.30 నుంచి సాయం త్రం 5 గంటల వరకు అప్‌అండ్‌డౌన్ మార్గాల గుండా వచ్చే రైళ్లను నిలిపివేశారు. దీంతో వరంగల్, కాజీపేట మీదుగా కొత్త్తఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ వె ళ్లే పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేటలో గంటకు పైగా నిలిపివేశారు. అలాగే మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లే పుష్పుల్ ప్యాసింజర్‌ను కాజీపేట వరకే నడిపించి వరంగల్-కాజీపేట మధ్య రద్దు చేశారు. కాగా, బ్రిడ్జి పనుల కారణంగా శుక్రవారం కూడా కాజీపేట-వరంగల్ మధ్య పుష్పుల్ రైలు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, రైళ్ల నిలిపివేతతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, వరంగల్‌లో జరుగుతున్న అండర్ బ్రిడ్జి పనులను రైల్వే ఏడీఆర్ఎం రమణారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ విజయ్‌కుమార్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీఐలు ఎస్.రవికుమార్, ఎల్ఎస్.హరిబాబు, ధారాసింగ్ ఉన్నారు. ఇదిలా ఉం డగా అండర్‌బ్రిడ్జి స్లాబ్ పనులు చేస్తుండడంతో అటు పోస్టాఫీస్ వైపు ఇటు ఖమ్మం రహదారి వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బ్రిడ్జి పక్కనే ఉన్న దారి గుండా రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి అక్కడి నుంచి ప్రయాణికులు వెళ్లడంతో రద్దీ ఏర్పడింది. మరో రెండు మూడు రోజులపాటు స్లాబ్ పనులు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. -
సినీ మాయలోళ్లు
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. ఇది ఇంద్రజాలానికి కూడా వర్తిస్తుంది. కాగితపు ముక్క, బ్లేడు ముక్క, పేకముక్క.. కాదేదీ మేజిక్కుకి అనర్హం. అయితే తెలియాల్సిందల్లా రెప్పపాటులో ప్రేక్షకులను మాయ చేయడమే. వాస్తవానికి ఇంద్రజాలం తెలిసినవారు చాలా తక్కువమంది ఉంటారు. కానీ, వారు చేసే ఆ మేజిక్ చూసినప్పుడు ఎంచక్కా మనక్కూడా ఆ విద్య తెలిస్తే బాగుండు అనుకుంటాం. ముఖ్యంగా పసిపిల్లలు చందమామ కావాలని మారాం చేసినప్పుడో, ప్రేయసికి ఇవ్వాలనుకున్న గులాబీ దొరకనప్పుడో మేజిక్ తెలిస్తే చటుక్కున సృష్టించేయొచ్చుగా అనుకోకుండా ఉండరు. ఇలా సందర్భానికి తగ్గట్టు మేజిక్ తెలిసుంటే బాగుంటుంది అనుకుంటాం. కొంతమంది పనిగట్టుకుని ఆ విద్యను నేర్చుకుంటారు. అదే వృత్తిగా స్వీకరించేవాళ్లూ ఉంటారు. అలాగే ప్రవృత్తిగా చేసుకునేవాళ్లూ ఉంటారు. అలాంటి కొంతమంది గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోతున్నవారు సినిమా పరిశ్రమలో తెరవెనుకా, తెరపైనా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసినవారే. సినిమా కళతో పాటు వారికి మేజిక్ అనే కళ కూడా తెలుసు. నేడు ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ఆ సినీ మేజిక్ కళాకారుల గురించి తెలుసుకుందాం... తెరపై ఇందజ్రాలికుడుగా: నాటితరం ప్రేక్షకులను ఓ స్థాయిలో నవ్వించిన అద్భుతమైన హాస్యనటుడు రమణారెడ్డి.. తన కామెడీతో మేజిక్ చేసిన రమణారెడ్డికి నిజంగా కూడా మేజిక్ తెలుసు. ఎంతో పట్టుదల, క్రమశిక్షణతో నేర్చుకుని ప్రజల ముందు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. బ్లేడు ముక్కను అమాంతంగా మింగేసి, ప్రేక్షకులను అబ్బురపరిచేవారు రమణారెడ్డి. ఆయన చేసే ఈ రిస్కీ మేజిక్‌ను అప్పట్లో ఎంతో ఉత్కంఠగా చూసేవారట. ఇంకా పలు వస్తువులతో ఆయన మేజిక్ చేసేవారు. వెండితెరపైన ఆయన ‘అక్కాచెల్లెలు’ చిత్రంలో మెజిషియన్‌గా చేశారు. ఆయన కలం ఓ మేజిక్: ఆరుద్ర వాడే కలానికి ఏదో మేజిక్ ఉంది. ఆ కలం నుంచి జాలువారిన ప్రతి కవితా, పాటా ఓ మేజిక్కే. అదే కలంతోనే ఆయన మేజిక్ చేసేవారు. ఇష్టమైన పువ్వు పేరు తల్చుకోమని అడిగేవారట. ఆ తర్వాత పేపర్ మీద పెన్నుతో ఏదైనా రాసి, వాసన చూడమనేవారట ఆరుద్ర. వాసన చూడగానే ఆ పువ్వు తాలూకు పరిమళం ముక్కుపుటాలను తాకేదని ఆ అనుభూతి పొందినవారు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ముక్కలతో మేజిక్: హాస్యం అపహాస్యం కాకుండా కుటుంబమంతా కలిసి ఆస్వాదించదగ్గ చక్కని కామెడీ చిత్రాలను అందించిన జంధ్యాల నిజజీవితంలో కూడా చాలా సరదాగా ఉండేవారు. జంధ్యాల చమత్కారాలు బాగుంటాయని ఆయన స్నేహితులు అంటుంటారు. అలాగే, తీరిక చిక్కినప్పుడు పేకముక్కలు, అగ్గిపుల్లలతో ఆయన బోల్డన్ని మేజిక్కులు చేసేవారనీ అవన్నీ రసవత్తరంగా ఉండేవని చెబుతుంటారు. జంధ్యాల తీసే సినిమాలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ప్రేక్షకులు. ఆయన మేజిక్ కూడా అదే విధంగా ఉండేదట. భలే మాయలోడు: వెండితెరపై తనదైన శైలిలో నవ్వుల పువ్వులు పూయించే రాజేంద్రప్రసాద్‌కి మేజిక్ తెలుసు. ‘మాయలోడు’ సినిమాలో బోల్డన్ని మాయలు చేసిన రాజేంద్రుడు నిజంగా కూడా కొన్ని మేజిక్‌లు చేస్తుంటారు. మేజిక్ అంటే తనకు వచ్చిన కళను చేసుకుంటూ పోవడం కాదు. కొన్ని చమత్కారాలు జోడించాలి. హావభావాలు పలికించాలి. వీటిలో దిట్ట అయిన రాజేంద్రప్రసాద్ చేసే మేజిక్స్ భలే పసందుగా ఉంటాయట. రబ్బర్ బ్యాండ్స్‌తో: ఆడవాళ్లు జడలకు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లే శరత్‌బాబు మేజిక్‌కి ఆయుధాలు. వాటితో శరత్‌బాబు చేసే మేజిక్కులు వీక్షకులను అబ్బురపరుస్తాయి. శరత్‌బాబుకి ఉన్న ఈ ప్రతిభ తెలుసుకుని, ఆయన్ను కదిలిస్తే... రబ్బర్ బ్యాండ్స్‌తో బోల్డన్ని ప్రదర్శనలు ఇస్తారట. - డి.జి. భవాని -
నాటకాలాడొద్దు
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా నాటకాలు ఆడుతూ తప్పించుకుంటున్న నాయకులపై వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసేందుకు కూడా వెనుకాడమని ఉద్యోగ సంఘం నాయకులు వెల్లడించారు. అవసరమైతే ఉద్యోగులతో రాజీనామా చేయించి నాయకులపై పోటీకి సిద్ధంగా వున్నామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యదర్శి జయరామప్ప తదితరులు హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు ఉద్యోగులు విధులకు దూరంగా వుండటంతో జిల్లాలో రెండో రోజు కూడా కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. సమైక్యాంద్ర కోసం ఉద్యోగాలను వదులుకునేందుకు కూడా సిద్దంగా ఉన్నామని ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు దేవరాజు వెల్లడించారు. విభజన బిల్లు పార్లమెంట్ వరకు వెళ్తే ఉద్యోగుల సత్తా ఏంటో రుచి చూపిస్తామని ెహ చ్చరించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆశా నోడల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహిస్తున్న అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణప్పతో వాగ్వాదానికి దిగి సమావేశం నిర్వహించకుండా అడ్డుకున్నారు. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి అనంతరం యూనివర్సిటీ ప్రధాన ముఖ ద్వారం వద్ద రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగేంతవరకూ ఉద్యమిస్తామని నీటి పారుదల శాఖ ఉద్యోగులు పిలుపునిచ్చారు. సమైక్యాంద్రకు మద్దతుగా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలుగు జాతిని ఒక్కటిగానే ఉంచాలని పంచాయితీ రాజ్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి సమైక్యాంధ్ర నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మూజువాణి ఓటుతో తిరస్కారానికి గురైన రాష్ట్ర విభజన బిల్లు మరెక్కడా ఆమోదం పొందడానికి వీలులేదని ఉద్యోగులు పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దీక్ష చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి అనంతరం అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూత వేయించారు. కదిరి, హిందూపురం, రాయదుర్గం, పెనుకొండ, గుత్తి తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. -
ఏపీఎండీసీ ‘టెండర్’పై స్టే
ఓబులవారిపల్లె, న్యూస్‌లైన్: బడాబాబులకు లబ్ధి చేకూరేలా ఏపీఎండీసీ పిలిచిన సీఅండ్‌డీ ఆన్లైన్ టెండర్‌పై గురువారం హైకోర్టు స్టే ఇచ్చింది. సీఅండ్‌డీ గ్రేడ్ రాయిపై ప్రస్తుతం ఉన్న ధర రూ. 1,920లు కాగా కొత్త టెండర్ రూ.1,126లకే పిలిచారు. ఈఎండీ రూపంలో పెద్ద ఎత్తున చెల్లించాల్సి రావడంపై మిల్లర్లు భగ్గుమన్నారు. ఈవ్యవహారంపై సాక్షి సమగ్రంగా కథనాలను ప్రచురించింది. కనీసం రూ.23కోట్లు ఉంటేనే టెండర్లో పాల్గొనే పరిస్థితులను కల్పించారు. దీంతో 150 మిల్లులు మూతపడే అవకాశం ఏర్పడింది. ఈమొత్తం వ్యవహారంపై ప్రముఖ పారిశ్రామికవేత్త గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి హైకోర్టులో రిట్‌పిటీషన్ నెంబర్ 39463-2013 దాఖలు చేశారు. ఆమేరకు గురువారం హైకోర్టు స్టే ఆర్డర్ నెంబర్ ఎంపీ48995-2013పై తీర్పునిచ్చారు. ఈవిషయంపై మరో పారిశ్రామికవేత్త రమణారెడ్డి కూడా హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటీషన్లను విచారించిన హైకోర్టు స్టే మంజూరు చేసింది. గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం రూ.1,926 ధరతో బైరటీస్‌ను కొనుగోలు చేసి నిల్వ చేశామన్నారు. ప్రస్తుత టెండర్లో రాయి రేటును రూ. 1,126లకే నిర్ణయించడంతో ప్రతి మిల్లుకు సుమారు రూ. 2కోట్ల వరకు నష్టపోనున్నట్లు తెలిపారు. పాలకపక్షం కనుసన్నల్లో ఏపీఎండీసీ టెండర్లు నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మంగంపేట బైరటీస్ గనులనే నమ్ముకుని 150 మిల్లుల యజమానులు మనుగడ సాగిస్తున్నారు. టెండర్లలో వారు పాల్గొనే అవకాశం లేకుండా ఒక్కొక్క బిడ్ 2లక్షల మెట్రిక్ టన్నులకు నిర్ణయించడం వెనుక బడా మిల్లర్లుకు అనుకూలంగా వ్యవహరించడమేనని పలువురు పేర్కొంటున్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన స్టేతో మిల్లుల యజమానులు ఊపిరిపీల్చుకున్నారు. -
రైళ్లలో గంజాయి రవాణా నిరోధిస్తాం
తాండూరు, న్యూస్‌లైన్: రైళ్లలో గంజాయి రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) రమణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి 11గంటలకు గూడ్సు రైలు ఇంజిన్‌లో తాండూరుకు చేరుకున్న ఏడీఆర్ఎం స్థానిక హోం సిగ్నల్ వద్ద దిగారు. అక్కడి నుంచి రాత్రి తాండూరు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. రాత్రి అతిథి గృహంలో బస చేసిన ఆయన తెల్లవారుజాము నుంచి ఉదయం 10.30గంటల వరకు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో రవాణా అవు తూ తాండూరు రైల్వేస్టేషన్లో పట్టుబడ్డ గంజాయి వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపిస్తామన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ను బలోపేతం చేస్తామని, రైళ్లలో ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు. రైళ్లలో గంజాయి రవాణా చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న తాండూరు - సికింద్రాబాద్ పుష్పుల్ రైలును ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఏడీఆర్ఎం చెప్పారు. ప్యాసిం జర్ రైలుకు అవసరమైన 12 బోగీలను సమకూర్చే ప్రక్రియ జరుగుతోందన్నారు. గుంటూరు - వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను తాండూరు వరకు పొడిగించేం దుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తాండూరు రైల్వేస్టేషన్లో క్యాం టీన్ ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. రెండో ప్లాట్‌ఫాంపై టికెట్ కౌంటర్ ఏర్పాటుకు యోచిస్తామన్నారు. ఆదర్శ రైల్వేస్టేషన్‌గా ఎంపికైన తాండూరులో చేయాల్సిన అభివృద్ధి చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. రైల్వేస్టేషన్ ఆవరణలో ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల పా ర్కింగ్‌పై ఆంక్షలు విధించామన్నారు. పా ర్కింగ్ స్థలాన్ని విస్తరించాలని కాంట్రాక్టర్ చేసిన విన్నపానికి ఏడీఆర్ఎం సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట సికిం ద్రాబాద్ డివిజనల్ ఏడీఎం యాదగిరి, ఏసీఎం చంద్రబాబు, సీఐ వెంకటేశం పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఏడీఆర్ఎం తనిఖీలు... అంతకుముందు ఏడీఆర్ఎం రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికుల విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, టికెట్ కౌంటర్, కంప్యూటర్ విభాగం, విచారణ గది, సిగ్నల్ వ్యవస్థ, తాగునీటి నల్లాలు, సిబ్బంది క్వార్టర్స్, వాహనాల పార్కింగ్ స్థలాన్ని తనిఖీ చేశారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్లాట్‌ఫాంలతో పాటు స్టేషన్ ఆవరణలో అడ్డగోలుగా చెత్త డంపింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ ఆవరణలో ఒక చెత్తకుండీని ఏర్పాటు చేయాలని తాండూరు ఏడీఎన్‌ను ఆయన ఆదేశించారు. తాగునీటి నల్లాల వద్ద గుట్కాలు ఉమ్మి వేయకుండా, భోజనం ప్లేట్లు శుభ్రం చేయకుండా చూడాలన్నారు. తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. ఫ్లాట్‌ఫాంలపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. రైళ్లు వచ్చే సమయంలో స్టేషన్లో విశ్రాంతి గదులను తెరిచి ఉంచాలని సూచించారు. స్టేషన్లో రైళ్లు ఆగినప్పుడు, బోగీలు, ఇంజిన్లు వేరుచేసే సమయంలో పకడ్బందీగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - రమణారెడ్డి