దక్షిణ మధ్య రైల్వేకు ఇద్దరు కొత్త అధికారులు వచ్చారు. చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా అర్జున్ ముండియా, చీఫ్ పర్సనల్ ఆఫీసర్‌గా ఎన్‌వీ రమణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేకు ఇద్దరు కొత్త అధికారులు వచ్చారు. చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా అర్జున్ ముండియా, చీఫ్ పర్సనల్ ఆఫీసర్‌గా ఎన్‌వీ రమణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ (ఐఆర్‌పీఎస్) 1986 బ్యాచ్‌కు చెందిన రమణారెడ్డి గతంలో దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వోగా, సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శిగా,ఏపీలో జీఏడీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు.
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఐఆర్‌ఎస్‌ఎంఈ) 1983 బ్యాచ్‌కు చెందిన అర్జున్ ముండియా గతంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో చీఫ్ వర్క్‌షాప్స్ ఇంజనీర్‌గా, సంబల్‌పూర్ డీఆర్‌ఎంగా, చీఫ్ మోటివ్ పవర్ ఇంజనీర్‌గా పనిచేశారు.