కులం పేరుతో మహిళా తహశీల్దార్‌ను దూషించి, దాడికి యత్నించినందుకు టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక కేసు నమోదైంది. ఈ ఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలం రంగన్నగారిగడ్డ గ్రామంలో జరిగింది. చిన్నగొట్టికల్లు మండల తహశీల్దార్ నారాయణమ్మ ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగన్నగారిగడ్డ గ్రామంలో ఆక్రమణకు గురైన చెరువు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు.