MRO
-
బాబుకు బాధిత అవ్వ మాస్ వార్నింగ్..
-
భూమి హక్కులకు ‘కొత్త చట్టం’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చింది. భూహక్కుల రికార్డులను ఎప్పటికప్పుడు సవరించడం, ఇప్పటివరకు పాస్‌బుక్‌లు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూహ క్కుల రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొంది.రిజి్రస్టేషన్, మ్యుటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్లను ముసాయి దా బిల్లులో ప్రతిపాదించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక.. ప్రత్యేకంగా అసెంబ్లీ ని సమావేశపర్చి బిల్లుకు ఆమోదం తీసుకునే అవ కాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ⇒ భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులు గుర్తించి.. వాటిలో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)’లో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ దస్తావేజులు, వారసత్వం, భాగ పంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధనను కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజి్రస్టేషన్, మ్యుటేషన్ చేస్తారు. అయితే మ్యుటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు ఉంటుంది. ⇒ ఆ విచారణలో తప్పులేమైనా గుర్తిస్తే.. ఆయా కారణాలను వివరిస్తూ మ్యుటేషన్ నిలిపేయవచ్చు. ప్రస్తుత చట్టంలో ఈ అవకాశం లేదు. రిజిస్టర్డ్ దస్తావేజులు, భాగ పంపకాలు, వారసత్వ హక్కుల మ్యుటేషన్‌ను విచారించే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది. మిగతా అంశాలకు సంబంధించి ఆర్డీవోకు అధికారం ఉంటుంది. ⇒ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్‌కు వెళ్లేవారు ఈ మ్యాప్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టేలా గతంలో లేని ఈ కొత్త నిబంధన తెస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత (ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్నాక) మాత్రమే ఈ మ్యాప్ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు. ⇒ ఇప్పటికే తీసుకున్న సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా పెండింగ్‌లో ఉన్న 9.4లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతాయి. వాటి పరిష్కార సమయంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా సాదాబైనామాల దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారాన్ని ఈ బిల్లులో పొందుపరిచారు. కొత్త దరఖాస్తుల పరిష్కార సమయంలో మాత్రం స్టాంపు డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాదాబైనామాల పరిష్కార అధికారం గతంలో కలెక్టర్లకు ఉండగా.. కొత్త చట్టంలో ఆర్డీవోలకు అధికారాలిచ్చారు. ⇒ ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూదార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే తర్వాత శాశ్వత భూదార్ జారీ చేస్తారు. ఈ భూదార్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. ⇒ కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు (ఆబాదీ) కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో పొందుపరిచారు. భూదార్తోపాటు ఈ ఆబాదీల ఆర్వోఆర్కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. గత చట్టంలో ఆర్వోఆర్ రికార్డుకు, గ్రామ పహాణీకి సంబంధం ఉండేదికాదు. ఈ కొత్త చట్టంలో.. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన విధించారు. ⇒ తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజి్రస్టేషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే.. అప్పీల్, రివిజన్‌కు కొత్త చట్టం అవకాశం ఇవ్వనుంది. కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత సీసీఎల్ఏకు సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. ఇది పాత చట్టంలో లేదు. ⇒ రివిజన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదా సీసీఎల్ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచారు. గతంలో జాయింట్ కలెక్టర్లకు ఉన్న రివిజన్ అధికారాలను ఇప్పుడు సీసీఎల్ఏకు దఖలు పర్చారు. ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే.. సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు. అయితే అడిషనల్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీల్ లేదా రివిజన్లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారు.2020 చట్టంలో ఈ అంశం లేదని.. కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్లతోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. యాజమాన్య హక్కుల వివాదాలు, భాగపంపకాల విషయంలో వివాదాలున్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని, తద్వారా కోర్టులపై భారం తగ్గుతుందని అంటున్నాయి. రూపకల్పన కోసం విస్తృత కసరత్తు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 చట్టం’è ముసాయిదా బిల్లు రూపకల్పన కోసం రెవెన్యూ వర్గాలు విస్తృతస్థాయిలో కసరత్తు చేశాయి. తెలంగాణలో ఇప్పటివరకు అమలైన 1936, 1948, 1971, 2020 నాటి చట్టాలను పరిశీలించి.. వాటి అమలు వల్ల వచి్చన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలను అంచనా వేసి 20 సెక్షన్లతో ముసాయిదాను సిద్ధం చేశారు.ఈ క్రమంలో 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించడంతోపాటు బిహార్‌లో అమల్లో ఉన్న మ్యుటేషన్ చట్టాన్ని కూడా అధ్యయనం చేశారు. భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూదార్), గ్రామీణ ప్రాంత ఆస్తుల రికార్డు తయారు చేయడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన వెసులుబాటును కలి్పంచనున్నారు. ముసాయిదా రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీఎంఆర్వో పీడీ వి.లచి్చరెడ్డి కీలకపాత్ర పోషించారు. ప్రజల సలహాలు, సూచనలకు అవకాశం ఈ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ వెల్లడించింది. సీసీఎల్ఏ వెబ్సైట్ ( ccla.telan gana.gov.in ) లో ఈ బిల్లును అందుబాటులో ఉంచుతున్నామని.. ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలియజేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను ror2024-rev@telangana.gov.in కు ఈ–మెయిల్ ద్వారా పంపవచ్చని.. లేదా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్‌రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్–500001కు పోస్టు ద్వారా పంపవచ్చని వెల్లడించారు. -
వీక్లీ వస్తారు సారు..తహసీల్దారు మాస్టారు!
చందంపేట: తహసీల్దార్ ఉద్యోగం అంటేనే ఊపిరిసలపనివ్వని విధి నిర్వహణతో ముడిపడి ఉంటుంది. అలాంటిది.. ఆ హోదాలో విధులు నిర్వహిస్తూనే.. పిల్లలకు ఆంగ్ల పాఠాలు బోధిస్తున్నారొక అధికారి. ఆయనే నల్లగొండ జిల్లా చందంపేట తహసీల్దార్ శ్రీనివాస్. ఆయన ఇటీవల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులతో ముచ్చటించారు. తమకు ఆంగ్ల ఉపాధ్యాయుడు లేక పాఠాలు చెప్పేవారే లేరని విద్యార్థినులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.తహసీల్దార్ శ్రీనివాస్ అప్పటికప్పుడే.. విద్యార్థినులకు కొద్దిసేపు ఆంగ్ల పాఠాలు బోధించారు. వారంలో ఒకరోజు సమయం కేటాయించి విద్యార్థులకు బోధిస్తున్నా రు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసిన శ్రీనివాస్.. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏవోగా ఉద్యోగం చేస్తూ పదోన్నతిపై చందంపేట తహసీల్దార్‌గా వచ్చారు. ఒకప్పటి ఉపాధ్యాయ వృత్తి మిగిల్చిన అనుభవంతో.. చందంపేట కస్తూర్బా పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు బోధిస్తున్నారు. శనివారం 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతూ కనిపించారు. -
రూ.10 లక్షల డిమాండ్.. ఏసీబీ వలలో శామీర్‌పేట తహసీల్దార్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ మల్కాజీగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ మంగళవారం తహసీల్దార్ సత్యనారాయణ ఏబీసీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తికి సంబంధిచిన భూమికి పట్టాదారు పాసుబుక్ జారీ చేసేందుకు సదరు తహసీల్దార్ రూ.10 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. పక్కా ప్రణాళికతో సత్యనారాయణ డ్రైవర్ డబ్బులు తీసుకునే క్రమంలో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అయితే తహసీల్దార్ సత్యనారాయణ తీసుకోమని చెబితేనే తాను లంచం డబ్బు తీసుకున్నానని డ్రైవర్ తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు.. తహసీల్దార్ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. -
AP: ఎమ్మార్వో రమణయ్య ఫ్యామిలీకి రూ.50 లక్షల సాయం
సాక్షి, విశాఖ: హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. రమణయ్య కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారీ సుబ్రమణ్యంను విశాఖ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో కంబైన్డ్ డీడ్ చేయడంలో రమణయ్య జాప్యం చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇదీచదవండి.. బరి తెగించిన ఎర్ర చందనం స్మగ్లర్లు -
హత్య చేసిన నిందితుడిని గుర్తించాం: సీపీ రవిశంకర్
-
MRO రమణయ్య హత్య కేసును చేధించాం: విశాఖ సీపీ
విశాఖపట్నం, సాక్షి: రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసును చేధించినట్లు కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు.. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం. నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడు. టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పది టీమ్‌లు రంగంలోకి దిగాయి. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలిస్తున్నాం. చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్‌కు నిందితుడు వెళ్లినట్లు తేలింది. నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదు అని సీపీ రవిశంకర్ వెల్లడించారు. రాత్రి పది గంటల సమయంలో హత్య జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. హత్యకు ఆర్ధిక లావాదేవీలు కారణమని భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్, భూవివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చు. హత్యకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చిన వారికి తహశీల్దార్ సెండాఫ్ చెప్పడానికి వెళ్లగా.. అదే అదనుగా నిందితుడు హత్య చేశాడు అని సీపీ మీడియాకు కేసు వివరాలను వివరించారు. ఇదీ చదవండి: విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్‌గా సనపల రమణయ్య రెండు రోజుల కిందటి దాకా విధులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి సమయంలో కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో రమణయ్య ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. వచ్చిరాగానే రమణయ్యతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు. అది చూసి నిందితుడిని పట్టుకునేందుకు అపార్ట్‌మెంట్‌వాసులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొలుత నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. -
ఎమ్మార్వో రమణయ్య కేసులో బయటపడ్డ సంచలన నిజాలు
-
విశాఖ ఎమ్మార్వో హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం
-
నేనే వీఆర్వో.. నేనే ఎమ్మార్వో..
కనిగిరి రూరల్: ‘‘నేనే వీఆర్వో.. నేనే ఎమ్మార్వో’’ అన్నట్లు జగన్నాథం సురేష్ అనే యువకుడు ఇష్టారాజ్యంగా భారీ అక్రమాలకు పాల్పడ్డాడు. నియోజకవర్గంలోని కనిగిరి, హెచ్‌ఎంపాడు, పీసీపల్లి తదితర మండలాలకు చెందిన సుమారు 12 మందికి దొంగ ఇళ్ల పట్టాలు, అసైన్డ్ భూముల డీకే పట్టాలు, పాస్ పుస్తకాలు తయారు చేసి ఇచ్చి సుమారు రూ.అర కోటి పైగా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మరో ఇద్దరు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా, కొందరూ రెవెన్యూ అధికారుల పాత్రకూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వెలుగు చూసింది ఇలా.. లింగసముద్రం మండలానికి చెందిన జగన్నాథం సురేష్ కొంత కాలంగా కనిగిరి ప్రాంతంలో ఉంటున్నాడు. గతంలో ఉన్న తహసీల్దార్‌కు ఇతను వాహన డ్రైవర్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతను అక్రమాలకు పాల్పడ్డాడు. సురేష్, పొదిలికి చెందిన అతని స్నేహితుడు మర్రిబోయిన రమణయ్య కలిసి పట్టణంలోని సూరా పాపిరెడ్డి కాలనీలో తమకు పట్టాలు ఉన్నాయని పట్టణానికి చెందిన సుధాకర్‌కు చెప్పారు. అతను అతని స్నేహితుడైన బాషాకు చెప్పాడు. వీరిద్దరూ కలిసి పట్టణంలోని చింతపాలేనికి చెందిన కొండారెడ్డికి రూ.1.50 లక్షలకు అమ్మించారు. రమణయ్య అమ్మిన పట్టాను కొనుగోలుదారుడు ఆన్లైన్ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయంలో చూపించుకున్నాడు. ప్రభుత్వ ఆన్లైన్, లిఖిత పూర్వక రికార్డుల్లో రమణయ్య పేరు లేదు. దీంతో బాధితుడు కొండారెడ్డి తనకు ఆ ఇంటి స్థలం వద్దని, అది దొంగపట్టా అని చెబుతూ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని దాన్ని అమ్మించిన బాషా, సుధాకర్‌లను కోరాడు. దీంతో వీరిద్దరు సురేష్, రమణయ్యలకు చెప్పారు. వారు డబ్బులు తిరిగి ఇవ్వకుండా, సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. సుమారు 6 నెలల నుంచి కనిపించకుండా తిరుగుతున్నారు. ఈక్రమంలో మంగళవారం అర్బన్ కాలనీలో మరొకరి దొంగపట్టాలు అమ్మేందుకు సురేష్, రమణయ్యలు వచ్చినట్లు బాధితులు తెలుసుకున్నారు. సుధాకర్, బాషా మరికొందరు వెళ్లి సురేష్, రమణయ్యలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్పీకి ఫిర్యాదు: అయితే అప్పటికే కనిగిరి మండలం చల్లగిరిగిలకు చెందిన వంగేపురం కోటమ్మ.. తనకు అసైన్డ్ భూమి 3 ఎకరాలు ఇప్పిస్తానని చెప్పి రూ.1.50 లక్షల డబ్బులు సురేష్ అనే అతను తీసుకుని మోసం చేశాడని, ఏడాది నుంచి నగదు ఇవ్వకుండా కనిపించడం లేదని ఎస్పీ మలికా గర్గ్‌కు స్పందనలో ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులకు ఎస్పీ ఆఫీసు నుంచి రిఫర్ చేశారు. ఈమేరకు కనిగిరి పోలీసులు సురేష్ కోసం గాలిస్తున్నారు. ఇంతలో సురేష్ దొరకడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసున్నారు. పట్టాలపై సంతకాలన్నీ గత తహసీల్దార్, ప్రస్తుత ఆర్డీఓ పేరుతోనే.. అయితే ఈ దొంగపట్టాలన్నీ గతంలో కనిగిరిలో పనిచేసిన తహసీల్దార్, ప్రస్తుత కనిగిరి ఆర్డీఓ అజయ్‌కుమార్ పేరుతో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంలో బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుతున్నారు. అసైన్డ్ భూములు ఇప్పిస్తానని రూ.3 లక్షలు స్వాహా... వాగుపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వ అసైన్డ్ భూములు పెట్టిస్తానని చెప్పి ఐదుగురి దగ్గర సురేష్ రెండు దఫాలుగా రూ.3 లక్షలు తీసుకున్నాడు. మొదట రూ.1.50 లక్షలు తీసుకుని భూమి డీకే పట్టాలు ఇచ్చాడు. ఆ తర్వాత రూ.1.50 లక్షలు తీసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆన్లైన్ పూర్తయ్యాక మరో రూ.3 లక్షలు ఇవ్వాలని తెలిపాడు. కానీ ఏడాది నుంచి కనిపించడం లేదు. ఫోన్ కూడా ఎత్తడం లేదు. దీంతో ఆ పట్టాలను, పాస్ పుస్తకాలను తహసీల్దార్ కార్యాలయంలో తీసుకెళ్లి చూపించగా, అవి దొంగవిగా చెప్పారు. కనీసం మ్యాన్యువల్ బుక్‌లో కూడా లేవని తేల్చారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వాగుపల్లికి చెందిన బాధితుడు వెంకటరెడ్డి తెలిపాడు. చిన ఇర్లపాడులో.. . అలాగే చిన ఇర్లపాడులో డీకే పట్టాలు పెడతామని చెప్పి ఆంధోని, రూత్, బ్రహ్మారెడ్డి, జయపాల్‌తో పాటు తన దగ్గర రూ.3 లక్షలు డబ్బులు తీసుకుని దొంగపట్టాలు ఇచ్చాడని ముద్దా బాబు అనే వ్యక్తి తెలిపాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మరొకరి దగ్గర రూ.5 లక్షల డబ్బులు తీసుకుని దొంగ ఇంటి పట్టాలు ఇచ్చి మోసం చేసినట్లు బాధి తులు తెలిపారు. ఇలా అనేక మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. బాధితుడు వాగుపల్లికి చెందిన మూలే వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఫోర్జరీ సంతకాలతో దొంగపట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చిన నెల్లూరు జిల్లా లింగసముద్రంకు చెందిన సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దాసరి ప్రసాద్ తెలిపారు. విచారణకు ఆదేశించా.. నా పేరుతో సంతకం పెట్టి కొందరు దొంగ పట్టాలు, పాస్ పుస్తకాలు తయారు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణ విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించాను. అలాగే ఫోర్జరీ సంతకాలు, దొంగ స్టాంప్‌లతో పట్టాలు తయారు చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. – టీ అజయ్‌కుమార్, కనిగిరి ఆర్డీవో -
ఏపీలో పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఏసీబీ తనిఖీలు
-
‘కాంతార’ వేషంలో అలరించిన తహసీల్దార్.. ప్రశంసించిన జిల్లా కలెక్టర్
విజయనగరం (కొత్తవలస): ఆయనో తహసీల్దార్... కళలంటే ఆయనకు ఎనలేని అభిమానం. అవకాశం దొరికితే తనలో ఉన్న కళను ప్రదర్శించిన పదుగురిని ఆకర్షించి అభినందనలు అందుకుంటారు. ఆయనే కొత్తవలస తహసీల్దార్ డి.ప్రసాదరావు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విడుదలైన సూపర్ డూపర్ హిట్ తమిళ డబ్బింగ్ చిత్రం కాంతారలో ఒక సీనుకు సంబంధించి తహసీల్దార్ ప్రసాదరావు ఏకపాత్ర అభినయం చేసి ప్రశంసలు అందుకున్నారు. గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఆరో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో ఆయన విజయనగరం జిల్లా తరఫున పాల్గొని అలరించారు. కల్చరల్ కార్యక్రమంలో భాగంగా కాంతార సినిమాలో హీరో పాత్రను ఏకపాత్ర అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి రెవెన్యూ సిబ్బంది పోటీ పడిన ఈ కార్యక్రమంలో కాంతార అభినయం ప్రశంసలు అందుకొంది. కాంతార హీరోకు సమాంతరంగా ప్రసాదరావు మేకప్ అయి అలరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రశంసల జల్లు కురిపించి సెల్ఫీ దిగారు. ప్రసాదరావుకు ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఈయనను రెవెన్యూ సిబ్బంది అభినందించారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తొగుట ఎమ్మార్వో కృష్ణమోహన్
-
ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం: ప్రియాంక
సాక్షి, గుంతకల్లు రూరల్: బుగ్గసంగమేశ్వరాలయంలో ఇటీవల వివాహం చేసుకున్న ఓ జంట తహసీల్దార్ రామును గురువారం ఆశ్రయించింది. వివరాలు.. మైదుకూరుకు చెందిన ప్రియాంక అనే సచివాలయ ఉద్యోగి, గుంతకల్లు పట్టణానికి చెందిన సుమంత్ అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరూ ఈనెల 18న గుంతకల్లు సమీపంలోని బుగ్గ సంగమేశ్వరాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కూతురు కిడ్నాప్ అయ్యిందని ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ జంట తహసీల్దార్‌ను కలిసి తామిద్దరూ ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని తెలిపింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని యువతి ప్రియాంక తహసీల్దార్‌కు తెలిపింది. తహసీల్దార్ సమక్షంలో మరోమారు దండలు మార్పించి ఒక్కటి చేశారు. చదవండి: (త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి) -
ఎమార్వో చేతివాటం
-
ఎంఆర్వో సేవలకు హబ్‌గా భారత్!
న్యూఢిల్లీ: మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ నూతన ఎంఆర్వో విధానాన్ని ప్రకటించింది. విమానాల నిర్వహణ, మరమ్మతులనే ఎంఆర్వోగా పేర్కొంటారు. ఎంఆర్వో సేవల కోసం భూ కేటాయింపులకు టెండర్ విధానాన్ని అనుసరించనుంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వసూలు చేసే రాయలీ్టని రద్దు చేసింది. అదే విధంగా భూమిని ప్రస్తుతం 3–5ఏళ్ల కాలానికే కేటాయిస్తుండగా.. ఇక మీదట 30 ఏళ్ల కాలానికి లీజ్ తీసుకోవచ్చు. భారత్‌ను ఎంఆర్వో సేవల కేంద్రంగా (హబ్) తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయంగా పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. నూతన విధానంలోని అంశాలు.. ► భూమికి ప్రస్తుతం ఎంత అద్దె వసూలు చేయాలన్నది ఏఏఐ ముందుగా నిర్ణయిస్తోంది. కొత్త విధానంలో బిడ్డింగ్ ద్వారా దీన్ని నిర్ణయించనున్నారు. ► అలాగే, భూమిని లీజుకు తీసుకున్న సంస్థలు ప్రతీ మూడేళ్లకు 7.5–10 శాతం స్థాయిలో 15 శాతం చొప్పున అద్దెను పెంచి చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకుంటే భూమిని కేటాయించే విధానం స్థానంలో.. టెండర్ ద్వారా కేటాయించే విధానం అమల్లోకి వస్తోంది. ► ఇప్పటికే తీసుకున్న లీజును రెన్యువల్ చేసుకునే సమయంలో చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత లీజు కాంట్రాక్టు ముగిసిపోతే టెండర్ విధానంలో కేటాయింపు ఉంటుంది. గరిష్ట బిడ్డర్‌కు 15 శాతం సమీపంలోనే పాత ఎంఆర్వో సంస్థ బిడ్ నిలిస్తే.. గరిష్ట బిడ్డర్ ఆఫర్ చేసిన ధరను చెల్లించడం ద్వారా కాంట్రాక్టును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. జాబితాలో బేగంపేట ఎయిర్పోర్ట్ విమానాలు, హెలికాప్టర్ల ఎంఆర్వో సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో.. పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను గుర్తించినట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. అందులో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంతోపాటు.. భోపాల్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, జుహు, కోల్‌కతా, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఎనిమిది ఫ్లయిట్ శిక్షణ సంస్థలను తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐదు విమానాశ్రయాలను ఉడాన్ పథకం కింద నిర్వహణలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇదే పథకం కింద ఆరు హెలిపోర్ట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. -
వామ్మో ఖైరతా‘బాధ’.. నేనక్కడ పనిచేయను నాయనో!
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): ఖైరతాబాద్.. హైదరాబాద్ నగరంలో వీవీఐపీలు నివాసముండే ప్రాంతం..అటువంటి ప్రాంతంలో తహసీల్దార్‌గా పనిచేయాలంటే కత్తిమీద సాములాంటిదే.. అందరికీ అనుకూలంగా ఉండాలి..అందరికీ అందుబాటులో ఉండాలి..అందరికీ పనులు చేసిపెట్టాలి.. అయితే నిబంధనలు అనేవి ఉంటాయి కదా.. అధికారులు వాటినే ఫాలో అవుతారు.. అవి నాయకులకు పట్టవు కదా..ఇవి కొందరికి నచ్చకపోవచ్చు..దీంతో తహసీల్దార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం.. ఆ తరువాత బదిలీ అస్త్రం వారిపై ప్రయోగించడం జరిగిపోవడం మామూలే.. ఇదీ ఖైరతాబాద్ మండలంలో నిత్యం జరుగుతున్న తంతు. ► ఖైరతాబాద్ మండలంలో తహసీల్దార్లు పట్టుమని పది నెలలు కూడా పని చేయకుండానే బదిలీ అవుతున్నారు. వివిధ కారణాలతో బదిలీ అవుతుండటంతో మండల పరిధిలో పాలన అధ్వానంగా మారుతోంది. ► బదిలీల వెనుక కొందరి ఫిర్యాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మండల పరిధిలో సోమాజిగూడ, ఖైరతాబాద్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావునగర్, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ డివిజన్లు వస్తాయి. అ మండలాన్ని ఎల్లారెడ్డిగూడ, ఖైరతాబాద్ యూసూఫ్‌గూడ విలేజ్ల పేరుతో విభజించి పాలన అందిస్తున్నారు. ► 2011 నుంచి రికార్డులు తీసుకుంటే ఒకే సంవత్సరంలో ముగ్గురు తహసీల్దార్లకు స్థాన చలనం కలిగింది.కొందరైతే నెల రోజులకే బదిలీ అయ్యారు. ► ఇటీవల బదిలీ అయిన జుబేద అనే తహసిల్దార్ ఆ పదవిలో పట్టుమని ఏడు నెలలు కూడా ఉండలేకపోయారు. అంతకుముందు పని చేసిన తహసిల్దార్ హసీనా ఏడాది గడువు పూర్తి చేసుకోకుండానే ట్రాన్స్ఫర్ అయ్యారు. ► దీంతో రెండు, మూడు నెలలకు, అయిదారు నెలలకు ఒకసారి తహసిల్దార్లు బదిలీలు ఎందుకు అవుతున్నారో ఇటీవల జిల్లా కలెక్టర్ ఆరా తీసినట్లు కూడా తెలిసింది. పని ఒత్తిడి కూడా కారణమా..! ఖైరతాబాద్ మండల పరిధిలో ప్రముఖుల ఘాట్లు ఉన్నాయి. నెక్లెస్ రోడ్డుతో పాటు ఎన్టీఆర్ మార్గ్, ఇతరత్రా వీవీఐపీ ప్రాంతాలు కూడా అధికంగా ఉన్నాయి. వివిధ కార్యక్రమాల సందర్భంగా తహసీల్దార్లు నాలుగైదు రోజుల పాటు అక్కడే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది ఇక్కడ ఉండేందుకు మొగ్గు చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు పౌరుల సమస్యలతో పాటు అటు వీవీఐపీల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ► ఇటీవల ఓ తహసిల్దార్‌ను జిల్లా కలెక్టర్ ఆమె చేసిన నిర్వాకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డట్లుగా తెలిసింది. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవీ బదిలీలు.. ► 2011 జనవరి 3న పి.లీల ఖైరతాబాద్ మండల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించి అదే ఏడాది మే 28న బదిలీ అయ్యారు. ఆమె ఆ పదవిలో నాలుగు నెలలు కూడా ఉండలేదు. ► జె. శ్రీనివాస్ 2011 మే 29న బాధ్యతలు స్వీకరించగా రెండు నెలలు గడవకుండానే అదే ఏడాది జూలై 6వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎం. కృష్ణ జూలై 7న బాధ్యతలు స్వీకరించి 2012 జూలై 24న బదిలీ అయ్యారు. ► జె.శ్రీనివాస్ జూలై 25న బాధ్యతలు స్వీకరించి కేవలం ఒక్క రోజులోనే అంటే జూలై 26న బదిలీ అయ్యారు. ► వి. అనురాధ జూలై 27న బాధ్యతలు స్వీకరించగా 2013 జూన్ 6న బదిలీ అయ్యారు. ► సునీత 2013 జూన్ 7న బాధ్యతలు స్వీకరించి 20 రోజులు తిరగకముందే అదే ఏడాది 25వ తేదీన బదిలీ అయ్యారు. ►కె. వేణుగోపాల్‌రెడ్డి 2013 జూన్ 26న బాధ్యతలు స్వీకరించి నెలన్నర తిరక్కుండానే ఆగస్టు 31న బదిలీ అయ్యారు. ► వంశీకృష్ణ 2013 సెప్టెంబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించి అయిదు నెలలు తిరగకుండానే 2014 ఫిబ్రవరి 11వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎం. శ్రీనివాసరావు 2014 ఫిబ్రవరి 10వ తేదీన బాధ్యతలు స్వీకరించగా నాలుగు నెలలు తిరగకుండానే అదే ఏడాది జూన్ 3వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎన్.శ్రీనివాస్‌రెడ్డి 2014 జూన్ 4వ తేదీన బాధ్యతలు స్వీకరించగా 2015 సెప్టెంబర్ 10న బదిలీ అయ్యారు. ఈయన ఒక్కరే ఏడాది కాలం పూర్తి చేసుకున్న తహసిల్దార్. ► టి.సైదులు 2015 సెప్టెంబర్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్ళ పాటు సేవలు అందించి 2018 ఆగస్టు 17వ తేదీన బదిలీ అయ్యారు. ► కె. జానకి 2018 ఆగస్టు 18న బాధ్యతలు స్వీకరించి నెలన్నర తిరగకుండానే 2018 అక్టోబర్ 16న బదిలీ అయ్యారు. ► పి. కృష్ణకుమారి 2018 అక్టోబర్ 17వ తేదీన బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుండానే 2019 జూన్ 16న బదిలీ అయ్యారు. ► హసీన 2019 జూన్ 19న బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుముందే 2020 నవంబర్ 3న బదిలీ అయ్యారు. ► జుబేదా 2020 నవంబర్ 4న బాధ్యతలు స్వీకరించి 2021 ఆగస్టు 1వ తేదీన బదిలీ అయ్యారు. ఆమె తొమ్మిది నెలలు మాత్రమే విధుల్లో ఉన్నారు. ► ప్రస్తుత అన్వర్ ఖైరతాబాద్ మండల తహసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆగస్టు 2న బాధ్యతలు స్వీకరించారు. -
ఏసీబీకి చిక్కిన కాటారం తహసీల్దార్
సాక్షి, కాటారం: భూమి ఆన్లైన్ నమోదు, పట్టా పాస్పు స్తకం కోసం ఓ రైతునుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ మహిళా తహసీల్దార్ ఏసీబీకి పట్టుబ డ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం లో గురువారం జరిగింది. కాటారం మండలం సుంద రాజ్‌పేటకు చెందిన ఐత హరికృష్ణ అనే దివ్యాం గుడికి కొత్తపల్లి శివారులో ని సర్వేనంబర్ 3లో 4 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. ఈ భూమి గతంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆన్లైన్ ధరణి పోర్టల్‌లో నమోదు చేసి కొత్త పట్టా పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ మేడిపల్లి సునీతకు విన్నవించుకున్నాడు. భూమి వివాదంలో ఉన్నందున ఆన్లైన్ నమోదు, పట్టాపాస్ పుస్తకం ప్రక్రియ పూర్తి చేయడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని తహసీ ల్దార్ డిమాండ్ చేశారు. చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదిరింది. హరికృష్ణ 50 వేలు ఇచ్చినా మిగతా డబ్బు ఇస్తేనే పాస్‌పుస్తకం ఇస్తానని సునీత చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం గురువారం సాయంత్రం తహసీల్దార్‌కు తన కార్యాలయంలో రూ.2లక్షలు అందజేయగా.. ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సునీతను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
వాళ్లకి హెచ్చరిక.. అడుగు జాగా కూడా వదలం
కబ్జా.. కబ్జా.. కబ్జా.. మేడ్చల్ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఈ పదం వింటూనే ఉన్నారు. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు.. బాధితుల నుంచి లెక్కకుమించిన వినతులు.. నిత్యం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కబ్జాదారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ స్థలాలను హ్యాపీగా కబ్జా చేసేసి.. అక్రమంగా నిర్మాణాలు చేసేసి.. పేద, మధ్యతరగతి ప్రజలకు అంటగడుతూ కోట్లకు పడగెత్తుతున్నారు. పల్లె, పట్టణ ప్రగతి, సమీక్ష, సమావేశాలతో అధికారులు బిజీగా ఉండటంతో ఇదే అదనుగా పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై యంత్రాంగం సీరియస్ గా దృష్టి సారించింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సాక్షి,సిటీబ్యూరో: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అలాంటి వారిపై చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎల్ఆర్ఎస్లో భాగంగా అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తెప్పించుకున్న యంత్రాంగం ఇంకా అదనపు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అక్రమ కట్టడాలు, లేఅవుట్లు, రోడ్లు, పార్కులను కబ్జా చేసి నిర్మిస్తున్న భవనాలు, బహుళ అంతస్తులు, ఇండిపెండెంట్ ఇళ్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు ఉద్యోగులు, సిబ్బంది తీరుపై సీరియస్‌గా ఉన్న యంత్రాంగం ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి.. బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడ్చల్, జవహర్‌నగర్, నిజాంపేట్, కొంపల్లి, దుండిగల్, తూముకుంట, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, పోచారం, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఈ కట్టడాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా పడుతున్న గండిని నివారించి.. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగం దృష్టిసారిస్తోంది. కొంతమంది ఉద్యోగులు, సిబ్బందికి అక్రమ కట్టడాల పర్వాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ అక్రమ కట్టడాలపై ఇన్చార్జ్ కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతుండటంతో.. చర్యలకు ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లను వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గుర్తించిన అక్రమ కట్టడాలివే.. మేడ్చల్ జిల్లాలో పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో గుర్తించిన అక్రమ కట్టడాలు, లేఅవుట్లు, 3,643 ఉండగా, ఘట్కేసర్ మండలంలో 656, దుండిగల్‌లో 1,950, కీసరలో 650, శామీర్‌పేట్‌లో 191, మేడ్చల్ మండలంలో 196 ఉన్నట్లు తెలుస్తోంది. నాగారం పట్టణంలో 12 అక్రమ లేఅవుట్లు ఉండగా, దమ్మాయిగూడలో 7, మేడ్చల్‌లో 10, నిజాంపేట్‌లో 20, కొంపల్లిలో 11, దుండిగల్‌లో 12, తూముకుంటలో 15, పోచారంలో 12, ఘట్కేసర్లో 8 ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ఇటీవల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సమాచారం ద్వారా బయటపడినట్లు తెలుస్తోంది. మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో ఇలా.. మేడ్చల్ జిల్లా పరిధిలోని జీహెచ్ఎంసీ మున్సిపల్ సర్కిళ్లలోని పార్కులు, రోడ్లు ఆక్రమించి అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. ఉప్పల్ సర్కిల్లో 1,989 చదరపు గజాల స్థలం, కాప్రా సర్కిల్లో 194 చదరపు గజాల స్థలం, మల్కాజిగిరి సర్కిల్లో 36 చదరపు గజాలు, మూసాపేట్లో 20, కూకట్‌పల్లిలో 455, కుత్బుల్లాపూర్‌లో 62, గాజులరామారంలో 198, అల్వాల్ సర్కిల్లో 155 చదరపు గజాల స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన యంత్రాంగం ఆక్రమణలపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
ధరణి పోర్టల్‌లో సమస్యలు.. తహసీల్దార్‌పై డీజిల్ పోసిన మహిళ..
సాక్షి, జగిత్యాలటౌన్: మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్ పోయడం అమానుషమని ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎండీ.వకీల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధరణి వెబ్సైట్లో అన్ని ఆప్షన్లు లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ అధికారులపై ఇలాంటి దాడులు సబబు కాదని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు. చదవండి: ‘కోవాగ్జిన్’ ఒప్పందానికి బ్రేక్ -
షేక్‌పేట తహసీల్దార్.. బదిలీ రగడ!
సాక్షి, హైదరాబాద్: నగరంలో షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీపై రగడ రగులుకుంటోంది. తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యలతో దీనికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు బలం చేకూర్చినట్లయింది. బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికైన మరుసటి రోజు షేక్‌పేట తహసీల్దార్‌కు స్థానచలనం కలిగించడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. సరిగ్గా పక్షం రోజుల క్రితం జనవరి 20న ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగతున్న నిర్లక్ష్యం..జాప్యంపై ప్రశ్నించేందుకు బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి షేక్‌పేట తహసీల్ ఆఫీస్‌కు వెళ్లారు. ఈనేపథ్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్‌రెడ్డి..కార్పొరేటర్ విజయలక్ష్మి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ విజయలక్ష్మి ఒకరిపై మరొకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఈ నెల 11న కార్పొరేటర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికైన 72 గంటల్లోనే శ్రీనివాస్‌రెడ్డిపై బదిలీ వేటు వేస్తూ సీసీఎల్ఏలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌కు ఫిర్యాదు చేశాం: దానం నాగేందర్ షేక్‌పేట తహసీల్దార్‌పై ఎంపీ కేశవరావుతో కలిసి సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులంటే తహసీల్దార్‌కు గౌరవం లేదన్నారు. ఆదాయ, కులదృవీకరణ పత్రాల జారీలో నిర్లక్ష్యం వహించడం వల్లనే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అండగా ఉద్యోగ సంఘాలు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి అండగా నిలబడ్డాయి. రాజకీయ జోక్యంతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూన్నాయి. ఏకంగా మీడియా ముందుకు వచ్చి గళం విప్పుతున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ఎంపీ కె.కేశవరావు కుమార్తె, అమెరికాలో ఉన్నత ఉద్యోగం సైతం వదిలి ప్రజా సేవకు వచ్చిన ఆమె.. ఇటువంటి చిన్న చిన్న విషయాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. అధికారికంగా ఉత్తర్వులు అందలేదు: శ్రీనివాస్ రెడ్డి ఇంకా అధికారికంగా తనకు బదిలీ ఉత్తర్వులు అందలేదని షేక్‌పేట మండల తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు జరగడం సాధారణమేనని, తన బదిలీ కూడా అలా జరిగే ఉంటుందని భావిస్తున్నానన్నారు. తనను ఎందుకు బదిలీ చేశారో తెలియదన్నారు. కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి ముందుగా తనపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఆ తర్వాతే తాను కౌంటర్ పిటిషన్ వేశానన్నారు. ఆదాయ «ధృవీకరణ పత్రం కోసం ఆమె ఫోన్‌చేశారని, తన వద్ద వీఆర్వోలు లేరన్న విషయాన్ని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఆ కొద్దిసేపటికే ఆఫీస్‌కు వచ్చారని, ఆ సమయంలో కోర్టుకు వెళ్లాల్సి ఉండగా కేసును స్టడీ చేస్తున్నానని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే తాను నడుచుకున్నానన్నారు. చదవండి: మేయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ -
ధరణిలో ప్రక్రియ షురూ.. తహసీల్దార్లకు లాగిన్
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా ధరణి వెబ్సైట్ ద్వారా మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ‘నాలా’ (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్) మార్పిడి అధికారాలను ఆర్డీవో నుంచి తహసీల్దార్‌కు బదలాయించింది. వారికి లాగిన్ ఇచ్చే ప్రక్రియకు గురువారం నుంచి శ్రీకారం చుట్టనుంది. ఇక నుంచి నాలా (వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునే ప్రక్రియ) వ్యవహారం పూర్తిగా తహసీల్దార్ల పరిధిలోకి రానుంది. గతంలో తహసీల్దార్ ఇచ్చే నివేదిక ప్రకారం ఆర్డీవోలు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేవారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో ఆ అధికారాలను తహసీల్దార్లకు బదలాయించారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. ఆ అధికారాలు ఇంకా తహశీల్దార్లకు బదలాయించలేదు. ఇప్పుడు ధరణిలో తహశీల్దార్లకు నేటి నుంచి లాగిన్ ఇవ్వనుండటంతో వీలున్నంత తక్కువ సమయంలోనే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునే వీలు కలగనుంది. లక్షల్లో పెండింగ్.. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నవి లక్షల సంఖ్యలోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పెండింగ్ మ్యుటేషన్లు 2 లక్షల వరకు ఉంటాయని సమాచారం. అయితే ధరణి పోర్టల్‌లో పెండింగ్ మ్యుటేషన్ల పరిష్కారానికి తహశీల్దార్లకు ఆప్షన్ ఇచ్చినా ప్రాసెస్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పెండింగ్ మ్యుటేషన్ల సమస్య అలానే ఉండిపోతోంది. ఈ సమస్యను బుధవారం.. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టెస్రా) అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతంకుమార్లు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ సానుకూలంగా స్పందించడంతో ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు పెద్ద ఎత్తున సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరిస్తేనే ప్రక్రియ సజావుగా సాగుతుందని రెవెన్యూ సంఘాలు అంటున్నాయి. సీఎస్‌కు ట్రెసా ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలివీ.. – ధరణిలో వ్యవసాయ రిజిస్ట్రేషన్లపై కోర్టులు స్టే విధిస్తే.. ఆ స్టే ఉత్తర్వులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్లు కలెక్టర్లకు పంపే అవకాశం లేదు. – నిషేధిత జాబితాలోని భూముల వివరాలు పోర్టల్‌లో పూర్తి స్థాయిలో కన్పించట్లేదు. దీంతో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు పొరపాటున పట్టా భూములుగా నమోదైతే వాటి రిజిస్ట్రేషన్లను నిలువరించే అవకాశం లేకుండాపోతోంది. – ధరణి కంటే ముందే జరిగి పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, విరాసత్లను ధరణిలో నమోదు చేయలేదు. – గతంలో కొన్ని భూములను అమ్మి రిజిస్ట్రేషన్ చేసినా.. ఆ భూములు కొనుగోలుదారుడి పేరిట మ్యుటేషన్ కావట్లేదు. దీంతో గతంలో అమ్మిన వ్యక్తి మళ్లీ ఇంకొకరికి అమ్ముకునే అవకాశం ఉంది. – గతంలో జీపీఏ చేసుకున్న వారు మరొకరికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ధరణిలో ఇవ్వలేదు. – అపరిష్కృతంగా ఉన్న డిజిటల్ సంతకాలు కాని ఖాతాలకు సంబంధించి అన్ని ఆప్షన్స్ తహశీల్దార్లకు ఇవ్వాలి. – భూ రికార్డుల ప్రక్షాళనలో పరిష్కారం కాని పార్ట్–బి భూముల విషయంలో ప్రజల నుంచి తహశీల్దార్లపై ఒత్తిడి వస్తున్నందున వాటి పరిష్కారానికి తగిన మార్గదర్శకాలివ్వాలి. – అధికారులు సెలవు పెట్టినప్పుడు ధరణి లాగిన్‌ను కలెక్టర్ నుంచి అదనపు కలెక్టర్లకు, తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, ఆపరేటర్ల లాగిన్లను ఆర్డీవోలకు ఇవ్వాలి. – ధరణి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నకలును మీ–సేవ కేంద్రాల్లో ఇచ్చేలా ఆప్షన్ ఉండాలి. – కొనుగోలుదార్ల పేర్లు ఒకటి కంటే ఎక్కువ రిజిస్టర్ చేసే ఆప్షన్ ఇవ్వాలి. – పార్టీషన్ భూముల విషయంలో మొత్తం భూమికి (పార్ట్‌కు కాకుండా) ఫీజు జనరేట్ అవుతున్నందున ఆ ఆప్షన్ మార్చాలి. – ధరణిలో నమోదైన డేటాలో క్లరికల్ తప్పుల మార్పునకు అవకాశం ఇవ్వాలి. ఏ డాక్యుమెంట్ అయినా ఓకే.. ఆన్లైన్ స్లాట్ ద్వారానే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందిని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు మార్గదర్శకాలు పంపారు. దీని ప్రకారం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ కోసం క్రయ, విక్రయదారుల వివరాలు, ఆస్తి లావాదేవీల గురించి వివరాలు నమోదు చేయాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు ఆటోమేటిక్‌గానే వెబ్సైట్లో కనిపిస్తాయి. ఆ మేరకు మొత్తం స్టాంపు, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే పార్టీలు వెబ్సైట్ ఫార్మాట్లో ఉన్న డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్లే సొంతంగా డాక్యుమెంట్లు తెచ్చుకోవచ్చు. ఆ డాక్యుమెంట్‌లోని వివరాల బాధ్యతను రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకోదు. నిషేధిత ఆస్తులకు స్లాట్ బుకింగ్ కాకుండా ఆటోమేటిక్ లాక్ విధించారు. అయినా రిజిస్ట్రేషన్ చేసే ముందు ఆ భూమి నిషేధిత జాబితా (22ఏ)లో ఉందో లేదో సబ్ రిజిస్ట్రార్లు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ అయిన తర్వాత నిర్దేశిత సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్రయ, విక్రయదారులు, సాక్షులు వచ్చి ప్రక్రియ పూర్తి చేసిన రోజే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల విషయంలో ఎక్కడ ఉల్లంఘన జరిగినా సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుంటారు. వ్యవసాయేత రిజిస్ట్రేషన్లు సజావుగా జరిగేలా జిల్లా రిజిస్ట్రార్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుందని ఐజీ శేషాద్రి పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాలా రుసుము ఖరారు.. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు చెల్లించా ల్సిన రుసుమును సర్కార్ ఖరారు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో బేసిక్ విలువలో 2 శాతం, జీహెచ్ఎంసీయేతర ప్రాంతాల్లో 3 శాతం ఫీజు చెల్లించి నాలా మార్పిడి చేసుకోవచ్చని బుధవారం సీఎస్ సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్పిడి ప్రక్రియ బుధవారం ప్రారంభమైందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జీతాలు తీసుకుంటున్నారుగా.. జాగ్రత్తగా పనిచేయండి!
సాక్షి, అమరావతి: ప్రజలు చెల్లిస్తున్న డబ్బులను జీతాల రూపంలో తీసుకుంటున్న అధికారులు విధి నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల్లో దాఖలైన కేసుల విషయంలో అత్యంత శ్రద్ధ, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని హితవు పలికింది. కోర్టు కేసుల విషయంలో యాంత్రికంగా వ్యవహరించవద్దని తేల్చి చెప్పింది. ఒక కేసు దాఖలు విషయంలో 1,016 రోజులు (2.7 సంవత్సరాలు) ఆలస్యం చేసినందుకు ఓ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయడం కోర్టు సమయాన్ని వృథా చేయడమే అవుతుందని హెచ్చరించింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని గుర్తు చేస్తూ అప్పీల్ దాఖలులో ఇంత ఆలస్యం చేసినందుకు మంగళగిరి తహసీల్దార్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని ఆదేశించింది. అప్పీల్ దాఖలులో తీవ్ర ఆలస్యానికి కారణమైన అధికారుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలస్యాన్ని మాఫీ చేయాలంటూ తహసీల్దార్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ తహసీల్దార్ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని కూడా కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు రిజిస్ట్రీ (జ్యుడీషియల్ విభాగం) అధికారులను సైతం హైకోర్టు మందలించింది. అప్పీల్ దాఖలులో 669 రోజుల ఆలస్యం జరిగిందని తహసీల్దార్ పిటిషన్లో పేర్కొన్నారని, వాస్తవానికి 1,016 రోజుల ఆలస్యం జరిగినా ఆ విషయాన్ని రిజిస్ట్రీ పరిశీలించలేదని హైకోర్టు తప్పుబట్టింది. కేసులను స్క్రూటినీ చేసి ప్రాసెస్ చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా జ్యుడీషియల్ విభాగం అధికారులకు తగిన సూచనలు చేయాలని రిజిస్ట్రార్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం తీర్పు వెలువరించారు. (రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు?) ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది... ఈ తీర్పును సవాల్ చేస్తూ మంగళగిరి తహసీల్దార్ 2018 సెప్టెంబర్‌లో హైకోర్టులో సెకండ్ అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్ దాఖలులో 669 రోజుల ఆలస్యం ఉందని, దీన్ని మాఫీ చేయాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ స్కీంలో అధికారులంతా తీరిక లేకుండా ఉన్నందువల్ల అప్పీల్ దాఖలులో జాప్యం జరిగిందన్నారు. తహసీల్దార్ అనుబంధ పిటిషన్‌ను పద్మశాలి సంఘం వ్యతిరేకించింది. అప్పీల్ దాఖలులో 1,016 రోజులు ఆలస్యం జరిగినట్లు కోర్టు దృష్టికి తెచ్చింది. ఇంత ఆలస్యంగా అప్పీల్ దాఖలు చేశారంటే ఈ కేసు విషయంలో అధికారులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పులో పేర్కొన్నారు. నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని, అప్పీల్ దాఖలుకు చట్టం నిర్దేశించిన గడువు ప్రభుత్వంతో సహా అందరికీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. తహసీల్దార్ పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటిస్తూ విధి నిర్వహణలో అలసత్యం ప్రదర్శించినందుకు జరిమానా విధించారు. (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్ అభినందన) ఇదీ వివాదం... మంగళగిరిలో దామర్ల నాంచారమ్మ విరాళంగా ఇచ్చిన ఏడు ఎకరాల భూమిని పద్మశాలి సంఘం చెరువుగా మార్చింది. నాంచారమ్మ చెరువులో 3 ఎకరాలు ఆక్రమణకు గురి కాగా మిగిలిన నాలుగు ఎకరాల రక్షణకు సంఘం ఏర్పాట్లు చేసింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వటంపై మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం 2012లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేసింది. దీనిపై తమకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో పద్మశాలి సంఘం 2014లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీల్ సూట్ దాఖలు చేసింది. విచారణ అనంతరం పద్మశాలి సంఘానికి అనుకూలంగా 2015 ఆగస్టులో తీర్పు వెలువడింది. -
ఎమ్మార్వో కేసులో హైకోర్టు స్టే: సుప్రీం అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ తహసిల్దార్ అన్నే శ్రీధర్‌పై దాఖలైన క్రిమినల్ కేసు దర్యాప్తుపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అమరావతిలో భూసేకరణ పేరుతో పేద ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను ఆక్రమించిన ఎమ్మార్వోపై విచారణ జరపకుండా స్టే ఇవ్వడం సరైనది కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దాఖలు చేసిన పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు శుక్రవారం విచారణ చేపట్టారు. ఎమ్మార్వో శ్రీధర్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలున్నా.. హైకోర్టు స్టే విధించడం సరైనది కాదని తదుపరి కేసు విచారణను ఈనెల 22కి వాయిదా వేశారు. అమరావతి ప్రాంతానికి చెందిన మాజీ తహసీల్దార్ అన్నే శ్రీధర్, బ్రహ్మానంద రెడ్డిలు పేదల భూములను ఆక్రమించారని స్థానిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమకు భూమి ఇవ్వకుంటే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాకుండా చేస్తామని పేదలను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహరాన్ని ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో తమపై నమోదు చేసిన కేసులను రద్ద చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల అభ్యర్థన మేరకు కేసు దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. -
అవినీతి వివాదంలో మరో ఎమ్మార్వో
నాగర్ కర్నూల్ : రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం కొనసాగుతూనే ఉంది. కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం వ్యవహారం ముగివకముందే మరో అవినీతి బాగోతం బయటపడింది. ఓ రైతు నుంచి లక్షా 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా లింగాల తహసీల్దార్ మళ్లిఖార్జున్ వివాదంలో చిక్కుకున్నాడు. అయితే ఎమ్మార్వో మొత్తంలో డిమాండ్ చేయగా.. రైతు తరువాత ఇస్తానని ఒప్పుకోవడంతో తొలుత అడ్వాన్స్‌గా 50 వేలు తీసుకున్నాడు. అదే పనికి మరో రైతు నుంచి అదనపు డబ్బులకు కక్కుర్తిపడ్డాడు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇతరులకు పట్టా పంపిణీ చేశాడు. దీంతో తిరగబడ్డ రైతులంతా శుక్రవారం తహసీల్దార్ తీరు నిరశిస్తూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. (ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్) ఈ విషయం కాస్తా పెద్దది కావడంతో వివాదం నుంచి ఎమ్మార్వో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే తొలుత 50 తీసుకున్న రైతుకు 40 వేలు తిరిగి ముట్టజెప్పాడు. మిగతా పదివేలు కూడా ఇవ్వాలని పట్టుబట్టగా ఖర్చయ్యాయంటూ పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఎమ్మార్వో కారుకు రైతులు అడ్డుపడ్డారు. అయినప్పటికీ రైతులను తోసుకుంటు వెళ్లిపోయారు. (కలెక్టర్, ఆర్డీవో చెబితేనే వెళ్లాను) -
కదులుతున్న ‘పాముల పుట్ట’
సాక్షి, హైదరాబాద్/కీసర/అల్వాల్ : ఉన్నతాధికారుల ద్వారా మాత్రమే వెలువడే డ్రాఫ్ట్ ఆర్డర్ కాపీ, నోట్‌ఫైల్స్‌ను సైతం నకిలీవి సృష్టించి లంచాలు మరుగుతున్నారంటే రెవెన్యూ వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో తిష్టవేసి కూర్చుందో అర్థం చేసుకోవచ్చు. ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్ నాగరాజు వ్యవహారంలో కళ్లు బైర్లుకమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. కీసర మండలం రాంపల్లి దాయరలో పట్టాదారు, కౌలుదారుల మధ్య భూ వివాదం నడుస్తోంది. 19 ఎకరాలకు సంబంధించిన వివాదంలో 8 ఎకరాలకు సంబంధించి పట్టాదారులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అందుకు అనుగుణంగా ఆ భూమిని వారి పేరు మీదకు మార్చాల్సి ఉంది. మరో 11 ఎకరాల వివాదం ఆర్డీఓ పరిధిలో ఉంది. 8 ఎకరాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తహసీల్దార్‌ను సంప్రదించి ఈ భూమిని పట్టాదారుల పేర చేయాలని కోరారు. దీనికి తహసీల్దార్ రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన, మేడ్చల్ కలెక్టర్ ద్వారా వెలువడాల్సిన డ్రాఫ్ట్ ఆర్డర్ కాపీ, నోట్ ఫైల్‌ను తన కార్యాలయంలోనే తయారుచేసి, వాటిని తీసుకొని తహసీల్దార్ నాగరాజు రియల్టర్ కందాడి అంజిరెడ్డి గెస్ట్‌హౌస్‌కు వచ్చాడు. అప్పటికే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్ అక్కడ డబ్బులతో ఉన్నారు. దీనిపై ఉప్పందుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. పత్రాలు సృష్టించినట్టు అంగీకారం! తహసీల్దార్, వీఆర్ఏ, రియల్టర్లను శనివారం ఏసీబీ కార్యాలయంలో విచారించారు. కలెక్టర్ పేరిట పత్రాలు సృష్టించినట్టు తహసీల్దార్ ఈ విచారణలో అంగీకరించినట్టు తెలిసింది. ఇందులో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది ప్రమేయం ఉందా అనే దానిపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇదే భూమికి సంబంధించిన 11 ఎకరాలకు ఆర్డీఓ నుంచి ఆదేశాలు రానున్నట్టు విచారణలో తహసీల్దార్ చెప్పినట్లు సమాచారం. కాగా, శనివారం ఉదయం కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ సీఐలు గంగాధర్, నాగేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్ గదిలో ఉన్న రికార్డులు, కంప్యూటర్ రికార్డులు, ఇటీవల తహసీల్దార్ చేసిన ముటేషన్లు, రికార్డుల మార్పులు, చేర్పులు, ఫైళ్ల క్లియరెన్స్‌ను పరిశీలించారు. రాంపల్లి దాయరలోని సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల భూములకు సంబంధించిన కాస్రా పహాణీ నుంచి ఇప్పటివరకు పహాణీ రికార్డులు, నాగరాజు తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాక రెవెన్యూ రికార్డుల్లో జరిగిన మార్పులు తదితర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్‌డిస్క్, తహసీల్దార్ బీరువాలో లభించిన పలు ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలించి, కొన్నిటిని వెంట తీసుకెళ్లారు. కార్యాలయంలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న, ఆర్ఐ శశికళ ఇతర సిబ్బందిని ప్రశ్నించారు. బార్గా పెంట్‌హౌస్ టెంపుల్ అల్వాల్‌లో గల కీసర తహసీల్దార్ నాగరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. రూ. 28 లక్షల నగదు, సుమారు 2 కిలోల బంగారం లభ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం శామీర్‌పేట డిప్యూటీ తహసీల్దార్ ఉన్న సమయంలో ఇదే ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి. ఆ సమయంలోనూ పలు ఆస్తుల దస్తావేజులు దొరికాయి. ఇంటిపైని పెంట్‌హౌస్‌ను బార్ గా మలిచారు. పెద్ద మొత్తంలో లభ్యమైన విదేశీ మద్యాన్ని చూసి అధికారులు కంగుతిన్నారు. మూడంతస్తుల ఈ భవనంలో కింది ఫ్లోర్లను అద్దెకు ఇవ్వగా మొదటి అంతస్తులో నాగరాజు ఉంటున్నారు. నాగరాజు వద్దే ఆ భూముల రికార్డులు: ఆర్డీఓ రాంపల్లిదాయరలోని సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల వివాదాస్పద భూములకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులన్నీ తహసీల్దార్ నాగరాజు వద్దే ఉన్నాయని కీసర ఆర్డీఓ రవికుమార్ తెలిపారు. ఈ వివాదాస్పద భూముల్లోని ఐదెకరాలను ఏసీబీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఓ ఉన్నతాధికారి రాంపల్లిదాయరకు చెందిన రైతుల నుంచి కొన్నారని, ఆయనకు గతం లో పట్టాదారు పాసుపుస్తకాలు కూడా రెవెన్యూ కార్యాలయం నుంచి ఇచ్చారన్నారు. కాగా కీసర తహసీల్దార్ నాగరాజు ఇటీవల ఈ పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేయాలని ఓ ఫైల్ తయారు చేసి తమ కార్యాలయానికి పంపాడన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశామన్నారు. ఈ భూములకు సంబంధించిన రికార్డుల మార్పుచేర్పుల్లో తహసీల్దార్ పాత్రపై పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. -
అవినీతికి పడగలెత్తిన నాగరాజు
సాక్షి, మేడ్చల్ జిల్లా : అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. నాగరాజు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ , ఘట్కేసర్, హయత్‌నగర్, శామీర్‌పేట, కూకట్పల్లి, కీసర మండలాల్లో టైపిస్టుగా, ఆర్ఐ, డీటీ, తహసీల్దార్‌గా పనిచేశారు. దాదాపు రెండేళ్లు కీసరలో పనిచేసిన సందర్భంలో ఆయన అవినీతిపై ఆరోపణలు అంతులేకుం డా ఉన్నాయి. కీసర, కీసర దాయర, చీర్యాల, భోగారం, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, రాంపల్లిదాయర గ్రామాలతోపాటు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మట్టి నుంచి మొదలుకుని రికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రైతుబంధు వరకు దేన్ని వదలకుండా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది. రియల్ వెంచర్లు, ప్లాట్లుగా మారిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేసి రైతుబంధు వచ్చేలా చేశారనే ఆరోపణలున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి అహ్మద్‌గూడలోని అసైన్డ్ భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో ఇంటి యాజమాని వద్ద నుంచి అప్పటి మహిళా వీఆర్ఓ, వీఆర్ఏ సాయంతో రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 2011లో శామీర్‌పేట మండలంలో డీటీగా పనిచేసినపుడు వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడిచేసి జైలుకు పంపారు. 25 ఏళ్లుగా ఆ భూముల వివాదం.. ప్రస్తుతం నాగరాజు పట్టుబడటానికి కారణమైన రాంపల్లిదాయర రెవెన్యూ పరిధిలోని 53 ఎకరాల భూములకు సంబంధించి షరీఫ్, గాలిజంగ్ తదితర 20 మంది కుటుంబసభ్యులకు, రాంపల్లి దాయర గ్రామానికి చెందిన వేల్పుల ఆంజనేయులు, నర్సింగ్‌రావు, శ్రీనివాస్ మరో 25 మంది కుటుంబాల మధ్య 25 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ సర్వేనంబర్లలోని 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధిం చి ఇరువర్గాల మధ్య భూవివాదంపై హైకోర్టు స్థాయిలో విచారణ కొనసాగుతుండగా, మిగతా భూములకు సంబంధించి కొందరికి ఓఆర్సీలు అందజేసినట్లు తెలుస్తోంది. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న రియల్టర్ బ్రోకర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్ తదితరులు భూమార్పిడి, పట్టాదారు పాసు పుస్తకాల జారీకి కీసర తహసీల్దార్ నాగరాజుతో రూ.2 కోట్లకు డీల్ కుదుర్చుకున్నటు తెలుస్తున్నది. కూకట్‌పల్లిలోనూ అదేతీరు.. కూకట్పల్లి తహసీల్దార్‌గా 2017 జూన్ 20న బాధ్యతలు చేపట్టిన నాగరాజు ఏడాది పాటు ఇక్కడ పనిచేశారు. ఇక్కడి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యేందుకు సహకరించారనే ఫిర్యాదులు వచ్చాయి. సర్వే నంబర్ 91లో చిత్తారమ్మ ఆలయానికి చెందిన భూమిని సర్వే నంబర్ 90 పేరుతో కబ్జాదారులకు రిజిస్ట్రేషన్ చేయటం వివాదాస్పదమైం ది. కూకట్‌పల్లిలో సర్వే నంబర్ 1007 హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సుమారు 340 ఎకరాల భూమిలో ఓ నిర్మాణ సంస్థకు అనుకూలంగా మ్యుటేషన్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని నోటీసులు జారీ చేయటం సైతం అప్పట్లో వివాదాస్పదమైంది. -
1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్
సాక్షి, హైదరాబాద్ : కీసర రెవెన్యూశాఖలో ఓ భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వడం కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన సర్వే నంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టులో కేసు నడుస్తున్నట్టు సమా చారం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఓ వర్గానికి అనుకూలంగా రికార్డులు తయారుచేయడానికి తహసీల్దార్ రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఎస్రావు నగర్‌లోని తన ఇంటివద్ద మొదటి విడతగా రూ.కోటీ 10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంపల్లి దాయర గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి, వరంగల్‌కు చెం దిన శ్రీనాథ్ యాదవ్‌తోపాటు రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ తహసీల్దార్‌కు సహకరించినట్లు సమాచారం. ఈ ముగ్గురినీ కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుతోపాటు ఆయన బంధు వుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తొలినుంచీ అవినీతి ఆరోపణలే.. తహసీల్దార్ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలక అధికారి విల్లా బహుమతి.. రెవెన్యూశాఖలో టైపిస్ట్‌గా చేరిన నాగరాజు పదోన్నతిపై తహశీల్దార్‌గా ఎదిగాడు. మధ్యలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డాడు. అయినా.. రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనపై ఉన్న కేసులను తొలగించుకున్నాడు. ఇప్పుడు తన లంచాల స్థాయిని ఏకంగా రూ.కోట్లకు పెంచుకున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లాలోని ముగ్గురు తహశీల్దార్లు తమ అక్రమాల జోలికి రాకుండా.. ఓ కీలకాధికారికి రూ.కోట్లు విలువ జేసే విల్లాను కొనిచ్చారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో, వీరు ఎంత పెద్ద అధికారినైనా ఎలా మేనేజ్ చేయగలరో అర్థం చేసుకోవచ్చు. సీఎం కార్యాలయం కన్నెర్ర.. కీసరలో ఏసీబీ దాడులపై సీఎం కార్యాలయం కూడా ఆరా తీసినట్లు సమాచారం. రెవెన్యూ అధికారుల విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్.. రెవెన్యూశాఖ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. -
తహసీల్దార్‌కు మాజీ నక్సలైట్ బెదిరింపు
సాక్షి, కామారెడ్డి : ఇతరులకు చెందిన భూమిని తన పేరిట పట్టా చేయాలని ఓ మాజీ నక్సలైట్ ఏకంగా తహసీల్దార్‌నే బెదిరించారు. పట్టా చేయకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డిలో చోటు చేసుకుంది. రామారెడ్డి మండల తహసీల్దార్ షర్ఫుద్దీన్‌పై గిద్ద గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ నర్సారెడ్డి బెదిరింపులకు దిగారు. ఇతరులకు చెందిన 6 ఎకరాల భూమిని తన పేరిట రికార్డు చేయాలని బెదిరించాడు. దీంతో భయానికి లోనైన తహసీల్దార్ షర్ఫుద్దీన్ రామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతరుల భూమిని పట్టా చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కేసు కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పించమని అడిగితే, తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎల్లారెడ్డి కాంగ్రెస్ మండల మాజీ మహిళ అధ్యక్షురాలు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒడ్డెపల్లి సుభాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
-
‘లక్ష్మి’ నిందితులును ఉరితీయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): లింగాపూర్‌లో మహిళపై, వరంగల్‌లో యువతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవా రం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ రియాజ్ అలీకి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఒక్కొకరికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి వాటిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు మల్లయ్య, రాజేష్, దుర్గం రవీందర్, ఉపేందర్, పోశం, సోమయ్య, దేవాజీ, పద్మ, గోపాలక్రిష్ణ, మల్లేష్, శివాజీ, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: వివాహితపై అత్యాచారం.. హత్య -
విజయారెడ్డి కేసు: అటెండర్ మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయారెడ్డి హత్య కేసులో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన అటెంబర్ చంద్రయ్య సోమవారం కన్నుమూశారు. నవంబర్ 4న విజయారెడ్డికి అంటుకున్న మంటలను ఆర్పేస్తూ... చంద్రయ్య తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. చంద్రయ్య నెలరోజులుగా..డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. చంద్రయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరవుతున్నారు. సరైన వైద్యం అందించకే చంద్రయ్య చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారని.. కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారని ఆగ్రహిస్తున్నారు. చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విజయారెడ్డిపై సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటిచగా ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. ఎమ్మార్వోను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె కారు డ్రైవర్ గురునాథానికి మంటలంటుకోవడంతో మరుసటిరోజే మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు సురేష్ డిఆర్డిఓలో చికిత్స పొందుతూ నవంబర్ 7న మరణించాడు. ఈ ఘటనలో మొత్తంగా నలుగురు మరణించారు. చికిత్స పొందుతూ ఏఎస్ఐ నర్సింహులు మృతి.. బాలాపూర్: ఆత్మహత్యాయత్నం చేసిన ఏఎస్ఐ నర్సింహులు ఆసుపత్రిలో సోమవారం మృతి చెందాడు. కొన్నిరోజుల క్రితం బాలాపూర్ పోలీసు స్టేషన్ ఎదుట పెట్రోలు పోసి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహులు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం మరణించాడు. కాగా ఆయన మృతికి సీఐ సైదులు వేధింపులే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చర్యలు చేపట్టిన పోలీసు కమిషనర్ సీఐపై బదిలీ వేటు వేశారు. చదవండి.. తహశీల్దార్ సజీవదహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? దారుణం: మహిళా తహశీల్దార్ సజీవదహనం -
ఎమ్మార్వోలకు ‘పార్ట్–బీ’ బాధ్యత!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తేరుకుంది. చిక్కుముడిగా మారిన పార్ట్–బీ భూములను పరిష్కరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పేరిట కాలయాపన చేసిన రెవెన్యూశాఖ.. ఈ భూ వివాదాలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా.. సవరణ అధికారాన్ని తహసీల్దార్లకు ఇవ్వాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం.. పట్టాదార్ పాస్పుస్త కాలు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములు, భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు–రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, ప్రైవేటు భూముల మధ్య వివాదాస్పదంగా ఉన్నవాటిని కూడా ఈ కేటగిరీలో నమోదు చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల మేర భూము లకు పార్ట్–బీ కేటగిరీలో చేర్చింది. అయితే, వీటిని సకాలంలో పరిష్కరించడంలో రెవె న్యూ యంత్రాంగం ఎడతెగని జాప్యం ప్రదర్శించింది. సాఫ్ట్వేర్ సమస్యలు, తప్పొప్పు లను సవరించే అధికారం జేసీలకు కట్టబెట్టడంతో పార్ట్–బీ భూముల వ్యవహారం జటిలమైంది. ఈ భూములకు పాస్‌పుస్తకాలు నిలిపేయడంతో ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ రైతులు తిరగడం.. ఆ వివాదాలను పరిష్క రించే అధికారం తమకు లేదని తహసీల్దార్లు చెప్పినా వినకపోవడంతో ఉద్దేశపూర్వంగా రెవెన్యూ ఉద్యోగులే చేయడం లేదనే భావన రైతాంగంలో నెలకొంది. ఈ వివాదాలు మొ దలు. భౌతిక దాడులు వరకు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ప్రభుత్వం మేలుకుంది. సాం కేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఒక వైపు చర్యలు తీసుకుంటునే.. పార్ట్–బీ భూ ములను కూడా సాధ్యమైనంత త్వరగా కొలి క్కి తేవాలని నిర్ణయించింది. ఇందులో భా గంగా ఈ భూములను పరిశీలించి.. పరిష్క రించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్ప గిం చాలని యోచిస్తోంది. తాజాగా తహసీ ల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసినందున.. కొత్త తహసీల్దార్లు కుదురుకోగానే స్పష్టమైన మార్గ దర్శకాలను వెలువరించ నున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో సీఎంతో భేటీ! రెవెన్యూ సమస్యలపై త్వరలో సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో రెవెన్యూ ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేయ నున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీ ఆర్ హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ.. మం గళవారం రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌ను కలసింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై చర్చించింది. అలాగే తాజా పరిణామాలను వివరించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే సమావేశ తేదీని ఖరారు చేస్తానని హామీ ఇచ్చినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. అలాగే తహసీల్దార్ల బదిలీకి కృషి చేసినందున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. -
ఆర్డీఓ సంతకం ఫోర్జరీ.. నాయబ్ తహసీల్దార్ రిమాండు
సాక్షి, కందుకూరు: ఆర్డీఓ సంతకం ఫోర్జరీ కేసులో నాయబ్ తహసీల్దార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం తుమ్మలూరుకు చెందిన కావలి వెంకటయ్య, యశోద దంపతులకు సర్వే నంబర్ 239, 240, 250, 251లో 40 ఎకరాల భూమి ఉంది. సదరు భూమి వివాదంలో ఉండటంతో పాటు కోర్టులో కేసు నడుస్తోంది. భూమి ఇనాం పట్టాకు సంబంధించినది కావడంతో ఓఆర్సీ తీసుకోవాల్సి ఉంది. దీంతో యాచారం మండలానికి చెందిన కేశమోని వెంకటయ్య, నోములకు చెందిన బుట్టి బాలరాజు కలిసి వెంకటయ్య, యశోద దంపతుల అనుమతితో మాడ్గుల మండలం నాయబ్ తహసీల్దార్ ఈసన్నగారి శ్రీనివాస్(42) సహకారంతో ఓఆర్సీ పత్రాలను ఆర్డీఓ సంతకంతో ఫోర్జరీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కందుకూరు ఆర్డీఓ రవీందర్‌రెడ్డి సెప్టెంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 14న కేశమోని వెంకటయ్య, బుట్టి బాలరాజు, వెంకటయ్య, యశోదను అరెస్టు చేశారు. గురువారం నాయబ్ తహసీల్దార్‌ను రిమాండుకు పంపారు. -
‘ఏవండి.. మేమొచ్చాం లేవండి..’
సాక్షి, నిజామాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన తహసీల్దార్ నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లా అధికారుల్లో కలవరపాటుకు గురిచేసింది. జిల్లావాసి.. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్‌గా పని చేస్తున్న జ్వాలా గిరిరావు (50) బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వచ్చారు. రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిళ్లు తగ్గించాలని, తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జ్వాలా గిరిరావు స్వస్థలం నల్లగొండ పట్టణంలోని రామగిరి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్టోబర్ 11, 2018న ఆయన బదిలీపై ఇక్కడకు రాగా, కుటుంబ సభ్యులు మాత్రం హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో జ్వాలా గిరిరావు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య విషయం తెలుసుకున్న కలెక్టర్ రామ్మోహన్రావు, జేసీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులను నిర్వర్తించడంతో మానసిక సమస్యలు ఎదురవడం, పని ఒత్తిడి పెరిగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని రెవెన్యూ ఉద్యోగులు భావిస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ తహసీల్దార్ అనేక ఇబ్బందులు పడ్డారని వారు తెలిపారు. (చదవండి: నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆత్మహత్య) స్పందించక పోవడంతో.. జ్వాలా గిరిరావు బుధవారం రాత్రి తన కార్యాలయంలో మరో ఇద్దరు తహసీల్దార్లతో కలిసి ముచ్చటించారు. అనంతరం తొమ్మిది గంటల సమయంలో ఆర్యనగర్‌లోని అద్దెకుంటున్న ఇంటికి వెళ్లారు. ఉపవాసాలు ఉండటంతో ఆయన రాత్రి భోజనం చేయలేదు. కుటుంబ సభ్యులతో కాసేపు ఫోన్లో మాట్లాడిన ఆయన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. ఉదయం ఆయన భార్య ఫోన్ చేయగా, ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె డ్రైవర్ ప్రవీణ్, వీఆర్వో ప్రవీణ్‌కు ఫోన్ చేసి, సార్ స్పందించడం లేదని ఇంటికి వెళ్లాలని చెప్పడంతో వారిద్దరు ఆయన ఇంటికి వచ్చారు. లోపల గడియ ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా, తహసీల్దార్ బెడ్రూంలో వేలాడుతూ కన్పించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. కలెక్టర్, జేసీ, ఆర్డీవో, ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సూసైడ్ నోట్ రాసి ఉంటాడేమోనని పోలీసులు ఆయన ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి నోట్ లభించలేదు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, నాలుగో టౌన్ ఠాణాలో 174 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఏమండి.. మేమొచ్చాం.. లేవండి’ కుటుంబ సభ్యులను త్వరగా నిజామాబాద్ రావాలని పోలీసులు సమాచారమిచ్చారు. వారు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తహసీల్దార్ మృతదేహాన్ని భార్య, కొడుకు విలపించిన తీరు అక్కడున్న వారిని కలిచి వేసింది. జ్వాలా గిరిరావు చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చే వరకూ తెలియకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. ఆయన బీపీతో అనారోగ్యానికి గురయ్యారని, మీరు వెంటనే నిజామాబాద్ రావాలని సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అనారోగ్యానికి మాత్రమే గురయ్యారని భావించి ఇక్కడికి చేరుకున్నారు. కానీ జ్వాలా గిరిరావు మంచంపై విగత జీవిగా పడి ఉండటం చూసి ఆయన భార్య గుండెలు బాదుకుంటూ రోదించారు. ‘ఏమండి.. మేమొచ్చాం.. లేవండి’ అంటూ జ్వాలా గిరిరావును లేపే ప్రయత్నం చేయడం చూసి అక్కడున్న వారు కంటతడి పెట్టారు. -
నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆత్మహత్య
నిజామాబాద్ అర్బన్/మోపాల్ : నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ జ్వాలా గిరిరావు (50) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్లగొం డ జిల్లా రామగిరి మండలానికి చెందిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన బదిలీల్లో భాగంగా గతేడాది అక్టోబర్ 11న నిజామాబాద్ రూరల్ మండలానికి వచ్చారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లో పనిచేసే వారు. జ్వాలా గిరిరావు కుటుంబం హైదరాబాద్‌లో ఉంటుండగా, ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆయన భార్య శ్రీదేవి గురువారం ఉదయం ఫోన్ చేయగా, ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె డ్రైవర్ ప్రవీణ్, వీఆర్వోకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారిద్దరూ గిరిరావు అద్దెకు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలు కొట్టిలోనికి వెళ్లి చూడగా, బెడ్రూంలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కలెక్టర్ రామ్మోహన్రావు, జేసీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తహసీల్దార్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు మృతదేహంతో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దారు ఆత్మహత్య బాధాకరం సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా రూరల్ తహసీల్దారు జ్వాలా గిరిరావు ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లచ్చిరెడ్డి, రమేష్ రాథోడ్ అన్నారు. గిరిరావు కుటుంబానికి డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రగాఢ సానుభూతిని తెలుపుతోందన్నారు. రెవెన్యూ శాఖలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. -
నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఓ తహశీల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో కలకలం సృష్టించింది. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్‌గా ఉన్న గిరిధర్‌రావు..ఆర్యనగర్‌లో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. నల్లగొండ జిల్లా రామగిరి మండలానికి చెందిన గిరిధర్.. ఏడాది క్రితమే నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉండగా..ఆయన ఒక్కరే ఆర్యనగర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ఐదు రోజులు మరచిపోలేను..
కాజీపేట అర్బన్ : జిల్లాలోని కాజీపేట మండలంలోని కడిపికొండ, న్యూశాయంపేటకు చెందిన 14 మందితోపాటు జనగామ జిల్లా చిన్న పెండ్యాలకు చెందిన ఓ యువకుడు మొత్తం పదిహేను మంది పాపికొండల విహార యాత్ర కు వెళ్లి అక్కడ బోటు బోల్తా పడిన ఘటనలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు సురక్షితంగా బయటపడగా.. మిగతా వారు గల్లంతయ్యారు. ఆ తర్వాత గాలింపుల్లో ఏడుగురి మృతదేహాలు లభించినా ఇంకా ముగ్గురి ఆచూకీ తేలలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్లిన బృందంలో కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఉన్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉన్న అధికారుల బృందం మృతదేహాల ఆచూకీ కోసం జరిగిన గాలింపు చర్యల్లో పాల్గొనడంతో పాటు బాధిత కుటుంబాలకు సమచారం ఇస్తూ, ఓదార్చారు. ఇటీవలే రాజమండ్రి నుంచి వచ్చిన ఆయన అక్కడి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు తహసీల్దార్ మాటల్లోనే... హుటాహుటిన సంఘటనా స్థలానికి.. పాపికొండలు టూర్‌కు వెళ్లిన జిల్లా వాసులు తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపాన గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో చిక్కుకున్నారు. ఈ ఘ టన గత ఆదివారం(ఈనెల 15వ తేదీన) మ ధ్యాహ్నం 1.15 గంటలకు జరిగింది. ఈ మేరకు సమాచారం మాకు సాయంత్రం 4 గంటలకు చేరింది. దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక వాహనంలో కాజీపేట ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్, ఆర్ఐ సురేందర్, వీఆర్వో జోసెఫ్‌తో కలిసి ఐదు అంబులెన్స్‌లతో పాటు కాజీపేట నుండి బయలుదేరాం. సుమారు 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు రాజమండ్రికి చేరుకున్నాం. త్వరగా వెళ్లాలనే తపనతో కేవలం ఒంటి మీద బట్టలతోనే వెళ్లాం. అక్కడకు వెళ్లాకే మా అవసరాలు గుర్తుకొచ్చాయి. దుస్తులు, సబ్బులు, టూత్‌పేస్ట్ తదితర వస్తువులన్నీ అక్కడే కొనుగోలు చేశాం. మంత్రులు, ఎమ్మెల్యేల ఏరియల్ సర్వే కచ్చులూరు సమీపంలో బోటు బోల్తా పడగా తె లంగాణ వాసులు చిక్కుకున్నారని తెలియగానే రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పు వ్వాడ అజయ్, వరంగల్ ఎంపీ పసునూరి ద యాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా వచ్చారు. అక్కడ ఘటనా స్థలం వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులకు భరోసానందిస్తూ, అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. బాధిత కుటుంబీకులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి వెనక్కి.. ప్రమాదంలో గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ గురు, శుక్రవారం వరకు కూడా లభించలేదు. దీంతో ఇక్కడి మండల ప్రజలకు సేవలందించడంలో అవాంతరాలు ఎదురుకాకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి బయలుదేరాం. శనివారం ఇక్కడకు చేరుకున్నాం. మరిచిపోలేని ఘటన కలెక్టర్ ఆదేశాలతో రాజమండ్రికి వెళ్లిన మేం గత సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు సంఘటన స్ధలానికి దగ్గరలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సేవలందించాం. ఓ పక్క సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బాధితులకు సమాచారం ఇచ్చాం. మృతదేహాలను ఘటనా స్థలం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వరం బ్యారేజి, 120 కిలోమీటర్ల దూరంలోని యానాంలో రెస్క్యూటీం బృందాలు గుర్తించాయి. ఆ వెంటనే మృతులు బంధువులతో మాట్లాడడంతో పాటు ఆధార్‌కార్డు, బోటులో ప్రయాణం ప్రారంభించే సమయంలో దిగిన సెల్ఫీలతో గుర్తుపట్టేందుకు బయలుదేరాం. ఆ సమయంలో బంధువుల ఆర్తనాదాలు, మావారి ఆచూకీ చెప్పండయ్యా అంటూ కాళ్ల మీద పడి రోదిస్తుండడం కలిచివేసింది. మృతదేహాలను గుర్తుపట్టాక బంధువులు రోదించిన తీరు మాకు కూడా కన్నీళ్లు తెప్పించింది. ఆ ఐదు రోజులు తిండి సైతం మరిచిపోయి బాధితుల కోసం పడిన కష్టం మరిచిపోలేను. ఇదంతా జరిగిన పది రోజులు కావొస్తున్నా బాధితుల ఆర్తనాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. నా బ్యాచ్‌మేట్ సహకారంతో.... నేను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లగా రాజమండ్రి అర్బన్ తహసీల్దార్‌గా నా స్నేహితుడు సుస్వాగత్ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయనే మాకు బస ఏర్పాటుచేశాడు. అలాగే, అక్కడికి వచ్చిన బాధితుల బంధువులకు రాజమండ్రిలోని రత్న హోటల్లో వసతి ఏర్పాటు చేసి అన్ని విధాలా సహకరించాడు. కాగా, నేను తహసీల్దార్‌గా ఆరేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. నా పరిధిలోని ఒకే గ్రామానికి చెందిన 14 మంది ప్రమాదంలో చిక్కుకోవడం ఎప్పుడూ జరగలేదు. 14 మంది వివరాలు పంపించాం.. ప్రమాదం జరిగిన రోజు బోటులో ప్రయాణించిన కడిపికొండ, న్యూశాయంపేట, చిన్నపెండ్యాలకు చెందిన 14 మంది బాధితులు, మృతులు, ఆచూకీ లభించని వారి పూర్తి వివరాలను రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయానికి మంగళవారం పంపించాం. అలాగే, వారి బంధువుల వివరాలు, ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ల వివరాలను సమర్పించాం. ఆ వివరాల ఆధారంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి పరిహారం అందనుంది. -
‘రెవెన్యూ’ లో మరో అలజడి: వెలుగులోకి కలెక్షన్ దందా
సాక్షి, మహబూబ్‌నగర్: రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లంచావతారం వెలుగు చూసిన కొద్దిగంటల్లోనే మరో ఇద్దరు ఎమ్మార్వోల కలెక్షన్ దందా కలకలం రేపుతోంది. పాలమూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మార్వోల కలెక్షన్ దందా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రెవెన్యూ డిపార్టమెంట్ లో అలజడి రేగింది. సీసీకుంట ఎమ్మార్వో రాజు, పదరా ఎమ్మార్వో మల్లిఖార్జున రావు డబ్బులు లెక్కబెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ భూ దస్త్రాల ప్రక్షాళన రెవెన్యూ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
తహశీల్దార్ల అవినీతిపై రెవెన్యూశాఖలో అలజడి
-
అవినీతి లావణ్యం
-
ఆది నుంచీ.. అవినీతి మకిలే!
సాక్షి, రంగారెడ్డి : కేశంపేట తహసీల్దార్ లావణ్య అవినీతి, అక్రమాల డొంక కదులుతోంది. ఆమె ఉద్యోగ జీవితమంతా అవినీతిమయమేనని తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆశీస్సులు, ప్రజాప్రతినిధుల అండదండలతో లంచావతారమెత్తినట్లు ఏసీబీ విచారణలో వెల్లడవుతోంది. పనిచేసిన ప్రతిచోటా కోటరీ ఏర్పాటు చేసుకుని తన దందాను దర్జాగా కొనసాగించేవారని బయటపడుతోంది. కాసులిస్తేనే ఫైలు కదిలేది.. లేదంటే నెలల తరబడి పెండింగ్‌లో పెట్టేవారని బాధితులు పేర్కొంటున్నారు. లావణ్య గతంలో పనిచేసిన మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఏసీబీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటం, వీఆర్ఓ లంచం తీసుకున్న కేసులో హస్తమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ లావణ్య కేసును ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. గతంలో ఆయా మండలాల్లో చేసిన కార్యాకలాపాల కూపీ లాగుతున్నారు. హయత్‌నగర్‌లోని తన ఇంట్లో రూ.93.50 లక్షల నగదు, 43 తులాల బంగారు ఆభరణాలు, విలువైన భూపత్రాలు ఏసీబీ దాడుల్లో బయటపడటం తెలిసిందే. కొందుర్గు వీఆర్ఓ అనంతయ్య బుధవారం ఓ రైతు నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కగా.. ఇందులో లావణ్య ప్రమేయమున్నట్లు విచారణలో తేలింది. దీంతో తహసీల్దార్ నివాసంలో సోదాలు నిర్వహించగా.. నివ్వెరపోయే రీతిలో నగదు లభ్యంకావడంతో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ సూర్య నారాయణ నేతృత్వంలో ఆమెను విచారించారు. గురువారం దాదాపు నాలుగైదు గంటలపాటు కూపీలాగగా.. పలు విస్తుగొలిపే అంశాలు వెల్లడించినట్లు సమాచారం. సాయంత్రం ఆమెను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. స్థానిక నేతల అండతో.. కేశంపేటకు బదిలీపై వచ్చాక తహసీల్దార్ లావణ్య తన అవినీతి విశ్వరూపాన్ని ప్రదర్శించారని స్థానికులు పేర్కొంటున్నారు. కేవలం లంచాలకే పరిమితం కాకుండా రియల్ వ్యాపారి అవతారమెత్తినట్లు తెలిసింది. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఆమె కన్ను భూ క్రయవిక్రయాలపై పడినట్లు వినికిడి. ఇందుకు అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల అండదండా సైతం ఉండటంతో మరింత రెచ్చిపోయారని ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం. చేతిలో అధికారం.. పైనుంచి నేతల ఆశీస్సులు ఉండటంతో తన అక్రమ కార్యకలాపాలకు ఎదురు లేకుండా పోయిందని ప్రచారం జరుగుతోంది. బినామీల పేర్లతో భూములను అగ్రిమెంట్ చేసుకోవడం.. కొంత ధర పెరగగానే ఇతరులకు విక్రయించేవారని ప్రతినోటా నానుతోంది. ముఖ్యంగా నాలుగైదు గ్రామాల్లోనే క్రయవిక్రయాలు బాగా జరిపారని తెలుస్తోంది. తన అవినీతి, అక్రమాలపై గట్టిగా ప్రశ్నిస్తే సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులను రంగంలోకి దించేవారని, చివరకు వాళ్లు సెటిల్ చేసేవారని తెలిసింది. ఫిర్యాదులు బుట్టదాఖలు.. తహసీల్దార్ లావణ్య అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినా.. అవి చివరకు బుట్టదాఖలుకాక తప్పలేదు. కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో ఓ నిరుపేదకు కేటాయించిన అసైన్డ్ భూమిలోంచి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తారు రోడ్డు వేసినా ఆమె మిన్నకుండిపోయారు. స్థానికులు కొందరు ఆమెపై ఒత్తిడితేగా ఎట్టకేలకు సదరు రోడ్డుపై అడ్డుగా మట్టిపోశారే తప్ప.. తొలగించలేదు. ఇందుకుగాను ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెకు రూ.5 లక్షలు బహుమానంగా ఇచ్చినట్లు స్థానికంగా చర్చజరుగుతోంది. అలాగే అల్వాల గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో కనీస నియమ నిబంధనలు పాటించని వెంచర్లకు అనుమతులిచ్చారు. పైగా ఓ బడా రియల్ వ్యాపారి ప్రభుత్వ భూములను, కుంటలను కబ్జా చేసినా చర్యలు తీసుకోకపోగా ఆయనకే వత్తాసు పలికినట్లు తెలుస్తోంది. దీనికి వెనక కూడా లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటా పోతే.. లావణ్య అవినీతి బాగోతం చేంతాడంత బయటకు వస్తోంది. అప్పటి నుంచే ఏసీబీ కన్ను.. కేశంపేటకు లావణ్య 2016 నవంబర్‌లో బదిలీపై వచ్చారు. అప్పటివరకు మెదక్ జిల్లాలోని కొండాపూర్‌లో దాదాపు 8 నెలల కాలం పనిచేశారు. ఈ సమయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మట్టి దందాలో ఆమె పాత్ర ఉన్నట్లు సమాచారం. వ్యాపారులతో కుమ్మక్కై డబ్బులు దండుకున్నట్లు తెలిసింది. అంతేగాక అనుమతి లేకుండా బోరుబావి తవ్విన రైతుపై ప్రతాపం చూపిన ఆమె.. చివరకు రూ.20 వేలు తీసుకుని వెనక్కి మళ్లినట్లు ప్రచారంలో ఉంది. అలాగే కేశంపేటకు బదిలీ కావడంతో ఇక్కడి విధుల నుంచి రిలీవ్ అయిన చివరి రోజున కూడా ఓ రైతు నుంచి లంచం తీసుకున్నట్లు సమాచారం. పాస్పుస్తకంపై సంతకం పెట్టినందుకు ఆమెకు రైతు రూ.2,500 సమర్పించుకున్నట్లు చర్చజరుగుతోంది. లావణ్య తీరు ఇలా ఉండటంతో భరించలేని పలువురు బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసింది. తాజాగా కొందుర్గులో ఏసీబీ దాడులు జరిగేకంటే ముందు మూడు నాలుగు రోజుల క్రితం అధికారులు ఇక్కడ ఆరా తీసినట్లు సమాచారం. ప్రతిచోటా ఆదే తీరు.. గ్రూప్–2 2007 బ్యాచ్‌కి చెందిన లావణ్య దాదాపు తొమ్మిదేళ్లు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే విధులు నిర్వహించారు. తొలుత డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమెకు.. కొంతకాలం తర్వాత తహసీల్దార్‌గా పదోన్నతి లభించింది. ఇక అప్పటి నుంచి ఆమె మరింత రెచ్చిపోయినట్లు, తన అవినీతికి ఎదురేలేకుండా పోయినట్లు ఆయా మండలాల్లోని బాధితులు పేర్కొంటున్నారు. ములుగు, దౌల్తాబాద్, కౌడిపల్లి, కొల్చారం, కొండాపూర్‌లో పనిచేశారు. కొల్చారంలో ఇసుక అక్రమ రవాణా పేరిట హల్చల్ చేసిన ఆమె.. వారం రోజులపాటు వ్యాపారులకు చుక్కలు చూపించారు. దీంతో మేడం చాలా స్ట్రిక్ట్ అనే భావన ఏర్పడ్డాక కాసుల దందా షురూ చేసినట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో నమోదుకు డబ్బులు ఇచ్చాను పాపిరెడ్డిగూడ గ్రామ శివారులో సర్వే నెంబర్ 41లో ఎకరం పొలాన్ని సంవత్సరం క్రితం కొనుగోలు చేశాం. రెవెన్యూ రికార్డుల్లో భూమిని పట్టా చేసి ఆన్లైన్లో నమోదు చేసేందుకు తహసీల్దార్ కార్యాలయానికి గత ఏడాది కాలంగా తిరుగుతున్నాం. ఆన్లైన్లో నమోదు కోసం వీఆర్ఓ అనంతయ్య రూ.5వేలు డిమాండ్ చేసి తీసుకున్నాడు. అయినా ఆన్లైన్లో భూ వివరాలను నమోదు చేయలేదు. – సూరమోని శంకర్, రైతు, పాపిరెడ్డిగూడ, కేశంపేట -
కేశంపేట ఎమ్మార్వో లావణ్య అరెస్ట్
-
ఎమ్మార్వో లావణ్య అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేశంపేట ఎమ్మార్వో లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. గురువారం సాయంత్రం నాంపల్లి ఏసీబీ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నారు. కాగా లావణ్య అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆమె భర్త వెంకటేష్ పరారయ్యారు. అడ్మినిస్ట్రేట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న వెంకటేష్ ఏసీబీ అధికారులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. బుధవారం ఓ రైతు దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కొందర్గు వీఆర్ఓ అనంతయ్య ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అనంతయ్య వెనకాల ఎమ్మార్వో లావణ్య పాత్ర ఉందని ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. హిమాయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 93.5లక్షల నగదు, 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు లావణ్యను అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఉత్తమ తహశీల్దార్ అవార్డు అందుకున్న లావణ్య.. ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్ కావడం గమనార్హం. -
అవినీతి తిమింగళాలు..
సాక్షి, షాద్‌నగర్: ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా రెవెన్యూ సిబ్బందిలో మార్పు కానరావడం లేదు. యథేచ్ఛగా అక్రమాలను కొనసాగిస్తున్నారు. చిన్నచిన్న పనుల కోసం వచ్చే రైతులను లంచాల పేరుతో వేధిస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ రైతు నుంచి కొందుర్గు వీఆర్వో రూ.4లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. హైదరాబాద్‌లోని కేశంపేట వీఆర్వో ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. ఒకే రోజు జరిగిన ఈ రెండు ఘటనలు రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపాయి. భూమి ఆన్లైన్లో నమోదుకు రూ.9లక్షలు లంచం డిమాండ్ కొందర్గు వీఆర్ఓ అనంతయ్య ఇటీవల కేశంపేట నుంచి బదిలీపై వచ్చారు. కాగా, కేశంపేట మండలం దత్తాయపల్లె శివారులో సర్వే నంబర్ 85/ఆ లో 9–07 ఎకరాల విస్తీర్ణం భూమి మామిడిపల్లి చెన్నయ్య పేరున పట్టా ఉంది. వీఆర్ఓ అనంతయ్య చెన్నయ్యకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే సమయంలో రూ.30 వేలు లంచం తీసుకున్నాడు. ఆ తర్వాత అనంతయ్య జూన్ 13న కొందుర్గు బదిలీపై వచ్చారు. అయితే, రైతు చెన్నయ్యకు సంబందించిన భూమి 2019 జూన్ 18 వరకు ఆన్లైన్లో ఆయన పేరుపైనే కనిపించింది. కానీ, జూన్ 24న ఆన్లైన్లో చూడగా ఆ భూమి కనిపించలేదు. దీంతో బాధిత రైతు సంబందిత వీఆర్ఓ అనంతయ్యను సంప్రదించారు. దీంతో ఆన్లైన్లో నమోదు చేయడం కోసం రూ.9 లక్షలు కావాలని, తనతోపాటు తహశీల్దార్ లావణ్యకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అనంతయ్య రైతు చెన్నయ్య, అతడి కుమారుడు భాస్కర్‌కు చెప్పాడు. దీంతో వారు రూ.8 లక్షలు లంచం ఇవ్వడానికి వీఆర్ఓ అనంతయ్యతో ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయమై రైతు చెన్నయ్య కుమారుడు భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్ఓ అనంతయ్యకు బుధవారం భాస్కర్ రూ.4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ దాడల్లో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు గంగాధర్, మాజీద్, రామలింగారెడ్డి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. రూ.9లక్షలు అడిగాడు : భాస్కర్ 1951లో మా నాన్న చెన్నయ్య భూమి కొనుగోలు చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు కూడా వచ్చాయి. ఆన్లైన్లో కూడా నమోదు చేశారు. కానీ, తిరిగి ఆన్లైన్లో నుంచి తొలగించారు. ఆన్లైన్ నమోదు చేయాలంటే రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. 8లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. నాలుగు బృందాలుగా ఏర్పడి.. అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి అవినీతి చేపలను పట్టుకున్నారు. అయితే బుధవారం ఏసీబీ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి కొందుర్గు, షాద్‌నగర్, కేశంపేట రెవెన్యూ కార్యాలయాలతో పాటుగా, హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కేశంపేట తహిసీల్దార్ లావణ్య ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొందుర్గు తహిసీల్దార్ కార్యాలయంలో రైతు మామిడిపల్లి భాస్కర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో షాద్‌నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంతో పాటు కేశంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుకు సంబంధించిన భూరికార్డులను అధికారులు పరిశీలించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలోని కంప్యూటర్లతో పాటుగా, రికార్డులను పరిశీలించారు. భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి తీసుకోవడం వెనక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రైతు మామిడిపల్లి భాస్కర్‌కు సంబంధించిన భూమి వివరాలను ఓసారి ఆన్లైన్లో నమోదు చేసి కొన్ని రోజుల తర్వాత ఏవిధంగా తొలగించారన్న విషయంపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. వీఆర్వో బదిలీ అయినా కేశంపేట మండలంలో సుమారు పదేళ్ళకు పైగా అనంతయ్య వీఆర్వోగా పనిచేశారు. కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, దత్తాయపల్లి, ఇప్పలపల్లి, కేశంపేట గ్రామాల్లో వీఆర్వోగా పనిచేసిన అనంతయ్యపై పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేశంపేటకు చెందిన చందన అనే మహిళా రైతుకు సంబంధించిన భూమిని ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో ఆమె తహిసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ వ్యవహారంలో తహిసీల్దార్ లావణ్య, వీఆర్వోలు ఇబ్బందులు పెడుతున్నారని మహిళా రైతు ఆరోపణలు చేసింది. ఇటీవల జిల్లా అధికారులు వీఆర్వోల బదిలీల నేపథ్యంలో అనంతయ్యను కొందుర్గు మండల కేంద్రానికి బదిలీ చేశారు. ఆయన బదిలీ అయినా కేశంపేట మండలానికి సంబంధించిన రైతుల భూ వ్యవహరాల్లో తలదూర్చి ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఇటీవల షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు కేశంపేట తహిసీల్దార్ లావణ్య కాళ్లుపట్టుకొని భూ సమస్యను పరిష్కరించాలని వేడుకున్న సంఘటన ఆ రోజు చర్చనీయాంశమైంది. ఆర్డీఓ కార్యాలయ అధికారుల పాత్ర? వీఆర్వో భారీ ఎత్తున లంచం డిమాండ్ చేయడంలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే అధికారుల హస్తం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నా.. తొలగించాలన్నా.. ఆర్డీఓ కార్యాలయం అధికారుల ప్రమేయం కూడా ఉంటుంది. అయితే భూమికి సంబంధించిన వివరాలను ఒకసారి ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత.. తొలగించడంలో ఎవరెవరి పాత్ర ఉంది, లంచాలు ఎవరెవరు డిమాండ్ చేశారు అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాపు చేపడుతున్నట్లు తెలిసింది. ఉలిక్కిపడిన అధికారులు రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడటంతో షాద్‌నగర్ డివిజన్లోని అన్ని శాఖల అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు అధికారులు సమయాని కంటే ముందే కార్యాలయాల నుంచి వెళ్లిపోయారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున లంచం తీసుకుంటూ పట్టుబడటం, ఏకకాలంలో కార్యాలయాల్లో తనిఖీలు జరగడంతో అసలు ఏం జరుగుతుందోనని, ఎవరెవరు మెడకు ఉచ్చుబిగించుకుంటుందనే చర్చ జరుగుతోంది. అవినీతి దందాలో కుమ్మక్కు తహసీల్దార్, వీఆర్వో ఇద్దరు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే రైతుకు సంబంధించిన భూమి వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. భూ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించాలంటే.. ఎందుకు తొలగించాల్సి వస్తుందోనన్న వివరాలను రైతుకు తెలియజేయడంతో పాటుగా దీనికి సంబంధించిన ప్రొసీడింగ్‌లు విధిగా ఉండాలని, అప్పుడే ఆన్లైన్లో నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ, ఇక్కడ మాత్రం అలాందేమీ లేకుండా ఆన్లైన్లో వివరాలు తొలగించినట్లు తెలుస్తోంది. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూర్యానారాయణ సూచించారు. అధికారులు లంచం అడిగితే 9440446140 సంప్రదించాలని తెలిపారు. -
సామూహిక సెలవులకు వెళ్దామా?
సాక్షి, హైదరాబాద్: కోడ్ కూత ముగిసినా.. సర్కారు కరుణిం చడంలేదు. తహసీల్దార్లు కుటుంబ సభ్యులను వదిలి పది నెలలైనా పాత జిల్లాలకు తిరిగి పంపేందుకు అంగీకరించడంలేదు. నేడో, రేపో బదిలీ ఉత్తర్వులు అందుతాయని దాటవేస్తూ వచ్చిన రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. తహసీల్దార్ల బదిలీల మాట అటుంచితే అన్ని కేడర్లలోనూ బదిలీలు, పదోన్నతులతోపాటు రెవెన్యూశాఖ ప్రక్షాళనపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సామూహిక సెలవుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సామూహిక సెలవులకు వెళ్దామని ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో అర్థంగాక రెవెన్యూ సంఘాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఉంటాయా... ఉండవా? సొంత జిల్లాలో పనిచేస్తున్న లేదా మూడేళ్లుగా ఒకే జిల్లాలో పోస్టింగ్ నిర్వర్తిస్తున్న తహసీల్దార్లను ఎన్నికల కోడ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. ఎన్నికల నియమావళి ముగిసిన అనంతరం వారికి తిరిగి పాత జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అలాగే ఉంటుందని భావించిన తహసీల్దార్లు.. వారి కుటుంబ సభ్యులను పూర్వ జిల్లాల్లోనే ఉంచేసి పొరుగు జిల్లాల్లో సేవలందించేందుకు వెళ్లారు. ఎన్నికలు అయిపోగానే వెనక్కి వస్తామనే భరోసాతో పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా వారిని అక్కడే కొనసాగించారు. మే నెలాఖరులో కోడ్ ముగియడంతో ఇక పాత జిల్లాలకు వెళ్తామని భావించారు. ఈ మేరకు బదిలీ ఉత్తర్వుల గురించి ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాకపోవడంతో తహసీల్దార్లలో ఆందోళన మొదలైంది. బదిలీలు ఉంటాయా లేదా అనే అనుమానం వారిని తొలిచేస్తోంది. సీఎంఓ చుట్టూ చక్కర్లు..? ముఖ్యమంత్రి కేసీఆర్ పరిధిలోనే రెవెన్యూశాఖ కూడా ఉండటంతో బదిలీలపై సీఎం నిర్ణయం తీసుకుంటే కానీ ముందడుగు వేసే పరిస్థితి కనిపించడంలేదు. ఎన్నికల వేళ వివిధ జిల్లాలకు బదిలీ అయిన 466 మందిని తిరిగి పూర్వ జిల్లాలకు పంపాలని ప్రతిపాదిస్తూ సీఎం పేషీకి చేరిన ఫైలుకు ఇప్పటివరకు మోక్షం కలగకపోవడంతో తహసీల్దార్లు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచిపోయాయి. మరో పక్షం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఆలోగా గనుక బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోతే తమ పరిస్థితేంటనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు బదిలీల వ్యవహారం రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు తలనొప్పిగా పరిణమించింది. రొటీన్‌గా జరిగే ఎన్నికల బదిలీల ఉత్తర్వులను కూడా ఇప్పించలేకపోయామనే ప్రచారం జరుగుతుండటంతో పరిస్థితిని అధిగమించేందుకు భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే సీఎంఓ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు తాజాగా ఏపీలో ఎన్నికల వేళ స్థానచలనం జరిగిన తహసీల్దార్లను పాత జిల్లాలకు పంపుతూ గురువారం ఉత్తర్వులు వెలువడటం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో బదిలీలపై నిర్ణయం తీసుకోకపోతే సామూహిక సెలవులపై వెళ్లాలని భావిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగ సంఘం నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
తహసీల్దార్ సేవలో..టీ బాయ్‌గా, కారు తుడుస్తూ!
సాక్షి, ఉలవపాడు(ఒంగోలు) : ప్రజలకు సేవలు చేయాల్సిన రెవెన్యూ సిబ్బంది తమ ఉన్నతాధికారుల సేవలో నిమగ్నమైపోతున్నారు. బానిసత్వ వ్యవస్థను ఎప్పుడో రద్దు చేసినా నేటికీ పలుచోట్ల అధికారులు తమ కింది స్థాయి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పలు పనులు చేయించుకుంటూ గతంలో పోలీసు శాఖలోని ఆర్డర్లీ వ్యవస్థను జ్ఞప్తికి తెస్తున్నారు. ఉలవపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఈ పరిస్థితి నెలకొంది. ఉలవపాడు వీఆర్వోగా పనిచేస్తున్న రామాంజనేయులు తహసీల్దార్ నగేష్ వచ్చిన వెంటనే బస్టాండ్‌కు వెళ్లి ఫ్లాస్క్‌లో టీ తీసుకు రావాలి. వీఆర్వోగా ప్రజలకు సేవ పనిచేయాల్సిన అధికారి టీ బాయ్‌గా అవతారమెత్తడం గమనార్హం. ఇక తహసీల్దార్ విధులకు కారులో వస్తారు. ఆ కారును కరేడు వీఆర్ఏ రామకోటేశ్వరి భర్త శ్రీను రోజూ శుభ్రం చేయాలి. రామకోటేశ్వరి బదులు విధులకు ఆమె భర్త శ్రీను హాజరై తహసీల్దార్ వ్యక్తిగత సేవలో తరలిస్తూ ఉంటాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వీఆర్ఏ భర్త కారును శుభ్రం చేస్తూ.. వీఆర్వో టీఫ్లాస్క్ తెస్తూ కనిపించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డర్లీ వ్యవస్థపై ఇటీవల స్థానికంగా పెద్ద చర్చే నడుస్తోంది. బయట చెబితే రెవెన్యూ ఉన్నతాధికారులు ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని ఫొటోలకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుండటం గమనార్హం. అటెండర్లతో టీ తెప్పించుకోవచ్చని, అలా కాకుండా ఒక అధికారితో తహసీల్దార్ టీ తెప్పించుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సొంత కారును కార్యాలయంలో కడిగించడం ఎంతవరకు సమంజసమని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. -
తహసీల్దార్ లైంగిక వేధింపులు
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల తహసీల్దార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అదే కార్యాలయంలో పని చేస్తున్న వీఆర్ఏ ఒకరు గురువారం డిప్యూటీ తహసీల్దార్ సుజాతకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏర్గట్ల వీఆర్ఏగా పని చేస్తున్న రజిత కొన్ని రోజుల నుంచి తన భర్తకు దూరంగా ఉంటోంది. అయితే, ఇది అవకాశంగా తీసుకున్న తహసీల్దార్ లక్ష్మణ్ కొన్ని రోజుల నుంచి తనతో అనైతికంగా వ్యవహరిస్తూ లోబరచుకోవాలని ప్రయత్నిస్తున్నాడని వీఆర్ఏ ఆరోపించారు. ఎన్నికల విధులను నిర్వహించే సమయంలోనూ తనతో అసభ్యకరంగా వ్యవహరించారని రజిత ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తోటి వీఆర్ఏలకు ఒక విధమైన విధులను అప్పగిస్తూ, తనకు మాత్రం మరో విధమైన డ్యూటీలను అప్పగిస్తు అవమానపరిచాడని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
దరి చేరని ‘ధరణి’
సాక్షి, జూలపల్లి: మండలాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రకటనలకే పరిమితమైంది. భూముల క్రమబద్ధీకరణతో పాటు భూముల క్రయవిక్రయాలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయడానికి సంకల్పించింది. ఈ విషయాన్ని ప్రకటించి జిల్లాలోని కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో సంబంధం లేకుండా మండలాల్లోనే భూముల కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసే ప్రకియ ఇంకా ప్రారంభం కాలేదు. ధరణి వెబ్సైట్ ద్వారా భూములకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ ఇంకా బాలరిష్టాలు దాటడం లేదు. ధరణి ప్రారంభమై ప్రభుత్వ అనుమతి వస్తే మం డలంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలుకలిగే రైతులకు దూర, సమయ, వ్యయ భారం తగ్గుతుంది. అధికారులకు శిక్షణ ధరణి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. పట్టణ ప్రజలకు పరిమితమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మండల కేంద్రాల్లో సైతం అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కాలేదు. నెలలు గడుస్తున్నా భూ రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రాలేదు. గతంలో ఆన్లైన్లో నమోదు కాని భూ వివరాలను భూరికార్డుల ప్రక్షాళన ఆనంతరం ఆన్లైన్లో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ విధానానికి ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించారు. సబ్ రిజిస్ట్రార్ల ప్రకియపై ఇప్పటికే తహసీల్దార్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించేందుకు వారికి ధరణి వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించారు. మండలకేంద్రాల్లో వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లి పనులు చేసిన సంఘటనలు ఉన్నాయి. నమోదు ప్రకియ పూర్తి కాక రిజిస్ట్రేషన్, రైతుబంధు, రైతుబీమా తదితర పనుల్లో జాప్యంపై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధరణితో రైతులకు ఉపయోగం మండల కేంద్రంలోనే రిజిస్ట్రేషన్లు చేయడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. దళారుల ప్రమేయం ఉండదు. అలాగే తప్పుడు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు. భూ వివరాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. మండల ప్రజల భూ వివరాలకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీంతో నకిలి రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టవచ్చు. సరళమైన దస్తావేజులతో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుంది. తహసీల్దార్ కార్యాలయంలోనే భూ రికార్డుల ప్రకియలో వివరాలు అన్లైన్లో నమోదు చేస్తారు. మండల పరిస్థితి ఇది మండలంలోని 7 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం 11594 ఖాతాలుండగా 8136 ఖాతాలు పూర్తి చేయబడి పాస్ పుస్తకాలు అందుకున్నారు. ఇంకా 3458 మంది రైతులు వివిధ కారణాలతో తమ భూములు ఆన్లైన్లో నమోదు కాలేదు. మండలంలో అబ్బాపూర్ గ్రామంలో 625, జూలపల్లిలో 1137, కాచాపూర్‌లో 1040, కుమ్మరికుంటలో 957, పెద్దాపూర్‌లో 1379, తేలుకుంట 1363,వడ్కాపూర్‌లో 1635 ఖాతాలు డిజిటల్ సైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుంది భూములు ఆన్లైన్ ప్రక్రి య కొనసాగుతోంది. దశాబ్దాలుగా భూముల రికార్డులు అస్తవ్యస్తంగా ఉండగా భూ ప్రక్షాళన తర్వాత కొలిక్కి వచ్చా యి. సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతోంది. మండలంలో రిజిస్ట్రేషన్ పనులకు సంబం ధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే సేవలు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ విధానంతో రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం నూతనంగా ఇంటిగ్రెటేడ్ ల్యాండ్ రెవె న్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎల్ఆర్ఎమ్ఎస్)ను తీసుకుని రావడం జరిగింది. – రమేశ్, తహసీల్దార్, జూలపల్లి -
ఓటు రక్షణకు సీ విజిల్ యాప్
సాక్షి, రామగిరి: ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ విజిల్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి తహసీల్దార్ రామ్మోహన్ అన్నారు. సెంటినరీకాలనీలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం సీ విజిల్ యాప్‌పై అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఎన్నికలు సజావుగా నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరూ సీ విజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో గ్రామాల్లో ఓటర్లను వివిధ పార్టీల నాయకులు ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకోవచ్చునని వివరించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సీ విజిల్ యాప్ ఎంతగానో దోహదపడుతోందని సూచించారు. సీ విజిల్ యాప్ ద్వారా గ్రామాల్లో ఎన్నికల నియామావళిని ఉల్లంఘినట్లయితే అందుకు సంబంధించిన ఫొటో లేదా వీడియోను అప్లోడ్ చేయడంతో సంబంధిత ఎన్నికల అధికారులకు చేరడంతో నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈయాప్ గురించి విద్యార్థులు ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అబ్బు కేశవరెడ్డి, ఆర్ఐ అజయ్ పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో ఆర్డీఓగా ప్రమోషన్.. కానీ ఇంతలోనే..
సాక్షి, కావలి: కావలి టీడీపీ నాయకులు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రల అడ్డమైన దోపిడీకి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న దగదర్తి తహసీల్దార్ డి.జయప్రకాష్ కేవలం రెండు రోజుల్లో ఆర్డీఓగా పదోన్నత పొందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇందుకు సంబంధించిన ఫైలు చాలా కాలంగా ఉంది. అయితే ప్రాధాన్యతల వారీగా రాష్ట్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ ఫైలుపై సంతకాలు చేయాల్సి ఉంది. ఇంతలో టీడీపీ నాయకుల భూ దందాలో చిక్కుకుని బలైపోయారు. అసలు భూములు కథ ఏమిటంటే.. దగదర్తి మండలంలో ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉండటం, ఆ ప్రాంతానికి చెందిన వారు ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలసలు పోవడం, సంపన్నులు తమ ఆస్తులు పెంచుకునే క్రమంలో మండలంలోని భూములపై కన్ను పడటం, వలస వెళ్లిపోయిన మండలానికి చెందిన ప్రజలు ఆర్థికంగా స్థిరత్వం పొందడంతో వారి గ్రామాల్లో ని భూములపై ఆసక్తి కనపరిచారు. అలాగే మండలంలో విమానాశ్రయం నిర్మించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం, పరిశ్రమలు స్థాపనకు మండలంలోని భూములను గుర్తించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ కూడా జరిగేసరికి 2014 సంవత్సరం వచ్చింది. అప్పుడే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కావలి నియోజకవర్గంలో అధికార టీడీపీ నాయకులుగా బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలు అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో తమ అదుపులోకి తెచ్చుకున్నారు. బీద సోదరులు తమ ఆక్వా సామ్రాజ్యాన్ని అల్లూరు మండలంలోని సముద్రతీరం వెంబడి వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో విస్తరించుకున్నారు. అక్కడికి ఆగక విస్తరణను దగదర్తి మండలంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు వరకు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఒక పక్క విమానాశ్రయ భూములు, మరో పక్క పరిశ్రమలకు భూములు అంటూ టీడీపీ ప్రభుత్వం దగదర్తి మండలంలో భూసేకరణకు తెరతీసింది. ఇవన్నీ ముందస్తుగానే తెలిసిన బీద సోదరులు దగదర్తి తహసీల్దార్‌గా తమ కనుసన్నల్లో ఉన్న వారినే నియమించుకోసాగారు. విలేజ్ అసిస్టెంట్ నుంచి.. రెవెన్యూ శాఖలో విలేజ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన డి.జయ ప్రకాష్, ప్రమోషన్లతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) అయిన, ప్రస్తుతం తాహసీల్దార్ వరకు చేరుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆర్డీఓగా ప్రమోషన్ ఉత్తర్వులను అందుకోవాల్సి ఉండగా, టీడీపీ నాయకులతో కలిసి చేసిన భూదందాల పాపంలో పాలు పంచుకుని వాటాలు మింగడంతో సస్పెండ్ ఉత్తర్వులు అందుకున్నారు. 2019 ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న డి.జయప్రకాప్‌ను, ఎన్నికల బదిలీల్లో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లను బదిలీ చేసినా ఆయన్ను చేయలేదు. ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉండటంతో డి.జయప్రకాస్ సేవలు దగదర్తి తాహసీల్దార్‌గానే అందిస్తారని టీడీపీ నాయకులు బీద మస్తన్‌రావు, బీద రవిచంద్ర చేసిన ఒత్తిళ్లకు ఉన్నత స్థాయి అధికారులు తలొగ్గి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల సంఘం ఆ పప్పులు ఉడకవని హెచ్చరించడంతో డి.జయప్రకాష్‌ను కోనేరు రంగారావు కమిటీలో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇంతలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశాలతో కావలి సబ్ కలెక్టర్ చామకూరు శ్రీధర్ కొన్ని భూదందా ఫిర్యాదులపై చేసిన విచారణలో దగదర్తి తాహసీల్దార్ హోదాలో డి.జయప్రకాష్ చేసిన అక్రమాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ అయ్యారు. ఆర్డీఓ హోదాలో ఉద్యోగ విరమణ చేయాల్సిన డి.జయప్రకాష్, టీడీపీ నాయకులు అక్రమాల దందాల్లో భాగస్వామ్యం కావడంతో ఆ ఉత్తర్వులు అందుకోకుండానే తాహసీల్దార్‌గానే పదవీ విరమణ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా తమ అక్రమాలకు తాహసీల్దార్ హోదాలో ఉన్న డి.జయప్రకాష్‌ను అన్ని రకాలుగా వాడుకున్న టీడీపీ నాయకులు బీద సోదరులు కనీసం సస్పెండ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆయన్ను పలకరించలేదు. దీంతో ఆయన పలువురి వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి క్షోభకు గురి అవుతాన్నట్లు సమాచారం. -
మా భూములు లాక్కోవద్దు సారు..
మద్నూర్(జుక్కల్): గత 30 ఏండ్ల సంది ఈ భూముల్లో పంటలు వేసి బతుకుతున్నాం.. మా పిల్లల పెండ్లీలు, శుభకార్యాలు ఈ భూములపై వచ్చిన ఆదాయంతోనే చేసినం.. ఇప్పుడు అటవీశాఖ సార్లు వచ్చి హద్దులు పాతడం ఏంటి.. అంటూ నిరుపేద రైతులు తహసీల్దార్ రవీందర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం చేయాలంటూ రైతులు వినతి పత్రం అందించారు. మండలంలోని సుల్తాన్‌పేట్ గ్రామ శివారులో గల 189 సర్వే నెంబరులోని అసైండ్ భూమిని 30ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఎస్సీ, ఓబీసీలైన నిరుపేదలకు పట్టాలు చేసి పంచిపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు ఆయా అసైండ్ భూముల్లో రైతులు పంటలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. పది రోజుల క్రితం ఆటవీశాఖ అధికారులు తమ పంట భూముల్లో హద్దులు పాతారని వారు తహసీల్దార్‌కు వివరించారు. రైతులకు పంపిణీ చేసిన భూములు ఆటవీశాఖకు చెందినవని చెబుతుండడంతో తమ దృష్టికి తెచ్చామని వారు అన్నారు. ఆ స్థలం పక్కన గల భూమిలో గ్రామ రెవెన్యూ అధికారులకు ఇండ్ల స్థలాలు కూడా కేటాయించారని అన్నారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. దీంతో స్పందించిన తహసీల్దార్ ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో పంటలు వేసుకుని పండించుకోవచ్చన్నారు. తహసీల్ కార్యాలయానికి వచ్చిన వారిలో సుందర్‌బాయి, మారుతి, లక్ష్మణ్, గంగవ్వ, జరినాబేగం, శారద, సాయిలు ఉన్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
-
రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత
రేణిగుంట/చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషాగౌడ్, రేణిగుంట తహసీల్దార్ నరసింహులునాయుడులపై నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత, నువ్వు నాకు చెప్పేవాడివా అంటూ తహసీల్దార్‌పై చిందులు తొక్కారు. నీ అంతు చూస్తానంటూ జాయింట్ కలెక్టర్‌ను హెచ్చరించారు. వివరాలు.. గురువారం సాయంత్రం 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రన్‌వే నుంచి వారు అరైవల్ ఎంట్రెన్స్ గుండా బయటకు వస్తారని ప్రొటోకాల్ అధికారులు వేచి ఉన్నారు. ఆ సమయంలో వారికి స్వాగతం పలికేందుకు ఉదయగిరి ఎమ్మెల్యే రామారావు అక్కడే వేచి ఉన్నారు. అయితే అతిథులు అనూహ్యంగా మెయిన్‌గేటు గుండా బయటకు వచ్చారు. ఎమ్మెల్యేను మెయిన్ గేటు వద్దకు తీసుకుని వెళ్లడానికి జేసీ వచ్చిన సమయంలో.. తనను అనసవరంగా అక్కడ కూర్చోబెట్టారంటూ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నీకు ప్రొటోకాల్ మర్యాదలు తెలియవా? నీ అంతు చూస్తా’’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న తహసీల్దార్ నరసింహులునాయుడు ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయనపై తీవ్ర దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారంతా హతాశులయ్యారు. ఎమ్మెల్యేది అహంకార ప్రవర్తన ఎమ్మెల్యే బొల్లినేని రామారావుది అహంకారపూరిత ప్రవర్తన అని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి నరసింహులునాయుడు, జిల్లా రెవెన్యూ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు విజయసింహారెడ్డి, వీఆర్వో సంఘనేత చెంగల్రాయులు అన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి అధికారుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సహించరానిదన్నారు. ఘటనపై తాము సీఎంకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందే.. జాయింట్ కలెక్టర్ గిరీష, తహసీల్దార్ నరసింహులునాయుడులకు శుక్రవారం ఉదయం 10 గంటలోపు ఎమ్మెల్యే రామారావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ విజయసింహారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులంతా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. -
మీ పని మీరు చేసుకోండి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావును ఇంటికి పిలిపించుకుని తిట్టిన వ్యవహారంలో జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ సంఘాల నేతలు తహసీల్దార్‌కు బాసటగా నిలిచారు. అదే సందర్భంలో అసలేం జరిగిందో తెలుసుకుని అప్పుడే మంత్రిపై స్పందిస్తామని వ్యాఖ్యానించారు. తనకు మాటమాత్రం చెప్పకుండా మండలంలోని 18 ఎకరాల భూములను టిట్కోకు కట్టబెట్టిన విషయమై మంత్రి గంటా తహసీల్దార్‌ను దూషించిన వైనంపై ‘ఏం వేషాలేస్తున్నావా’ అనే శీర్షికన బుధవారం సాక్షిలో వచ్చిన కథనం రెవెన్యూ వర్గాల్లో మనోస్థైరాన్ని నింపింది. జిల్లావ్యాప్తంగా అధికారవర్గాలతో పాటు కలెక్టరేట్ వర్గాల్లో కలకలం రేపిన ఈ కథనంపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజనలు స్పందించారు. తమను బుధవారం ఉదయం కలిసిన తహసీల్దార్ ఈశ్వరరావుతో మాట్లాడుతూ ‘మీ పని మీరు చూసుకోండి.. సెలవుపై వెళ్లొద్దు’.. అని భరోసా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇబ్బందిగా, ఒత్తిడిగా అనిపిస్తే ఒకటి, రెండు రోజులు క్యాజువల్ లీవ్ తీసుకోవాలని సూచించారు. అయితే రెవెన్యూ సంఘాల నేతలు మాత్రం లీవుపై వెళ్తే వేరే సంకేతాలు వస్తాయి.. అందువల్ల యధావిధిగా ఉద్యోగం చేసుకోనివ్వండి .. అని సూచించడంతో ఈశ్వరరావు బుధవారం మధ్యాహ్నం నుంచి యధావిధిగా ఆనందపురం వెళ్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. సహజంగా గంటా అలా అనరు: జిల్లా కలెక్టర్ తహసీల్దార్‌కు నైతిక మద్దతు ఇచ్చిన అధికారులు, రెవెన్యూ సంఘాల నేతలు.. అదే సందర్భంలో మంత్రి గంటా శ్రీనివాసరావును మాత్రం పల్లెత్తు మాట అనేందుకు సాహసించలేదు. సహజంగా మంత్రి అలా అనరు.. మరి ఈశ్వరరావును ఏ సందర్భంలో ఎందుకన్నారోనని జిల్లా కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఇక ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ నాగేశ్వరరెడ్డి కూడా తహసీల్దార్‌కు నైతిక మద్దతు ఇస్తూనే మంత్రి గంటాను వెనకేసుకొచ్చారు. ఇంతవరకూ ఆయన అధికారులను తిట్టిన దాఖలాల్లేవు.. ఇది ఎందుకు జరిగిందో తెలియదు.. అందుకే బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించాం.. ఉద్యోగ సంఘాల నేతలందరూ వచ్చారు. సీరియస్‌గా చర్చించాం... మంత్రి గంటాతో, జిల్లా కలెక్టర్‌తో ముఖాముఖి చర్చలు జరిపాక నిర్ణయం తీసుకుంటామని నాగేశ్వరరెడ్డి బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అ«ధ్యక్షుడు ఈశ్వరరావు ఇదే విషయమై స్పందిస్తూ.. వాస్తవానికి గంటా అలా అనరు.. అలా అంటే ఖండిస్తాం... అని వ్యాఖ్యానించారు. -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో తహసీల్దార్
సింగరాయకొండ : సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. వీరి ఉచ్చులో అమాయక ప్రజలతో పాటు చదువుకున్న వారు, ఉద్యోగులు చిక్కుకుంటూ తాము బ్యాంకు అకౌంట్లో దాచుకున్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శి ఈ విధంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తన బ్యాంకు అకౌంట్లోని 7 వేల రూపాయలు పోగొట్టుకోగా ఇప్పుడు తాజాగా తహసీల్దార్ కామేశ్వరరావు వారి ఉచ్చులో చిక్కుకున్నారు. కామేశ్వరరావు కార్యాలయంలో పని ఒత్తిడిలో ఉండగా బుధవారం ఫోన్ వచ్చింది. తాము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, పేరు, అకౌంట్ నంబర్, పుట్టిన తేదీ చెప్పి తనపై నమ్మకాన్ని ఏర్పరచుకున్న ఆ వ్యక్తి చివరకు ఓటీపీ నంబర్ అడిగాడు. పని ఒత్తిడిలో ఉన్న కామేశ్వరరావు బ్యాంకుకు చెందిన వ్యక్తి అనే నమ్మకంతో ఓటీపీ నంబరు చెప్పారు. సాయంత్రానికి తహసీల్దార్ సెల్‌కు మెసేజ్ వచ్చింది. జరిగిన పొరపాటు అప్పుడుగానీ తహసీల్దార్‌కు అర్ధం కాలేదు. తెలిసింది. ఫోన్ చేసింది బ్యాంకు సిబ్బంది కాదని, సైబర్ నేరగాడని అర్థమైంది. ఆ మెసేజ్‌లో తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.89 వేలు డ్రా అయినట్లు ఉంది. సదరు నేరగాడు తెలివిగా ఇతని అకౌంట్‌తో పాటు ఫోన్ నంబరును హ్యాక్ చేయడంతో ఎప్పుడు బ్యాంకు లవాదేవీలు జరగినా మొబైల్‌కు మెసేజ్ వస్తుండగా తహసీల్దార్‌కు సాయంత్రానికిగాని మెసేజ్ రాలేదు. వెంటనే సీఐ ఆర్.దేవప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆర్.దేవప్రభాకర్ తెలిపారు. సైబర్ నేరగాడు స్థానికుడు కాదని సీఐ చెప్పారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన
అనంతపురం జిల్లా: అధికారం అండ చూసుకుని రాష్ట్రంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారులపై తమ ప్రతాపం కొనసాగిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరిలో దళిత వర్గానికి చెందిన తహసీల్దార్‌పై నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నోరు తెరిచావో.. చెయ్యి చేసుకోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా తహసీల్దార్‌పై బండబూతులకు దిగారు. ఈ తతంగమంతా సీఐ సమక్షంలోనే కొనసాగడం గమనార్హం. నాపైన డెకాయిట్ కేసుంది.. నీకు తెలీదేమో.. తన వర్గీయులకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు జాప్యం చేయడమేగాక ఎమ్మెల్యే చాంద్‌బాషాను కలవమంటున్నారనే ఆగ్రహంతో కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కందికుంట తన వర్గీయులతో కలసి శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కందికుంటతోపాటు ఆయన వర్గీయులు దళిత వర్గానికి చెందిన తహసీల్దార్ పీవీ రమణను నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘‘నువ్వు నా కన్నా తక్కువ చదువుకున్నావు. నిన్ను ఏసీబీకి పట్టించడం నాకు రెండు నిమిషాలు పట్టదు. ఇంటిపట్టాలు ఇవ్వమంటే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లమంటావా? నాకు అనుకూలంగా ఉన్నాడని ఇక్కడున్న ఓ వీఆర్ఓను బదిలీ చేసి బ్రోకర్‌ను తెచ్చుకుంటావా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాపైన డెకాయిట్ కేసు నమోదైంది.. నీకు తెలీదేమో..’’ అంటూ కందికుంట తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తహసీల్దార్ అది కాదు సార్ అనబోగా.. ‘‘ఏందివయ్యా.. మళ్లీ అది కాదంటావు.. ఇంగ నేను బూతులే మాట్లాడతా.. నువ్వు నోరు తెరిచావనుకో.. నేను చెయ్యి చేసుకోవాల్సి ఉంటుంది’’ అని బెదిరింపులకు దిగారు. ‘‘ఇక్కడి రాజకీయాల్ని అనుకూలంగా మార్చుకుని మమ్మల్ని ఇబ్బంది పెడతావా? నా మనుషులొస్తే ఎమ్మెల్యే దగ్గరకు పొమ్మంటావా? వాడెవడు?’’ అని రెచ్చిపోయారు. ఇదే అదనుగా కందికుంట అనుచరుడు హరి మాట్లాడుతూ తాను వీఆర్వో అఖిలేష్‌కు రూ.70 వేలు, మీకు రూ.50 వేలు లంచమిచ్చానని అనగా.. తహసీల్దార్ అబద్ధాలు చెప్పొద్దని బదులిచ్చారు. ఇంతలో మున్సిపల్ చైర్పర్సన్ సురయాభాను అందుకుంటూ.. నీ దగ్గరకొస్తే ఎమ్మెల్యే దగ్గరకు పొమ్మంటావా? నువ్వు ఎమ్మార్వోనా లేక రాజకీయ బ్రోకర్‌వా? అంటూ రెట్టించారు. బలవంతంగా ఆయనతో కందికుంటకు క్షమాపణలు చెప్పించారు. -
ఎమ్మెల్యే చెబితేనే జాయినింగ్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ‘బదిలీపై వచ్చావా..? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫారసు లెటర్ ఉందా? బదిలీ లెటర్ తెచ్చినా... వారు చెపితేనే విధుల్లో చేర్చుకుంటా!’ అని ఓ తహసీల్దార్ గిర్ధావర్ (రెవెన్యూ ఇన్స్పెక్టర్ను వెనక్కు పంపడం మంచిర్యాల జిల్లా రెవెన్యూ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల జిల్లాలో చేపట్టిన రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా జన్నారం మండలంలో ఆర్ఐగా పనిచేసిన ఎం.మోహన్‌ను తొలుత భీమినికి బదిలీ చేశారు. మోహన్ విజ్ఞప్తి మేరకు స్వల్ప మార్పులతో భీమిని నుంచి జైపూర్ మండలానికి బదిలీ చేస్తూ గత నెల 29న కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు మోహన్ మే 31న జైపూర్ తహసీల్దార్ శేఖర్‌ను కలిసి విధుల్లో చేర్చుకోవాలని కోరగా, అందుకు నిరాకరించడం వివాదాస్పదమైంది. ‘ఎన్నికల సంవత్సరం ఇది. ఎమ్మెల్యే (నల్లాల ఓదెలు), ఎమ్మెల్సీ (పురాణం సతీష్)ల అనుమతి లేకుండా నిన్ను విధుల్లో చేర్చుకోలేను. వారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. వారి నుంచి లెటర్ తీసుకువస్తేనే జాయిన్ చేసుకుంటా’ అని తహసీల్దార్ శేఖర్ తనను వెనక్కు పంపారని శనివారం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చిన మోహన్ వివరించారు. ఆరోజు జైపూర్ తహసీల్ కార్యాలయం పరిశీలనకు వచ్చిన జాయింట్ కలెక్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేశానని, కలెక్టర్ ప్రొసీడింగ్స్‌ను తిరస్కరించకూడదని జేసీ హితువు చెప్పారని వివరించారు. జేసీ ముందు జాయిన్ చేసుకుంటానని చెప్పి తరువాత మళ్లీ వెనక్కు పంపారని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఆర్వీ.కర్ణన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తే ఏవో, ఆర్డీవోలకు కలెక్టర్ ఆదేశాలిచ్చారని మోహన్ తెలిపారు. కాగా శనివారం తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు గిర్ధావర్ హోదాలో జైపూర్‌కు వెళ్లగా, ఆఫీసులో కూర్చున్న తనను జాయిన్ చేసుకోలేనని చెప్పి మళ్లీ తహసీల్దార్ వెనక్కు పంపారని తెలిపారు. కలెక్టర్ బదిలీ ఉత్తర్వులను తీసుకొని వెళితే తనను విధుల్లో చేరకుండా అడ్డుకొని వెనక్కు పంపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తనను బెదిరిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు : తహసీల్దార్ శేఖర్ బదిలీ ఉత్తర్వులతో వచ్చిన గిర్దావర్ మోహన్ విధుల్లో చేరకముందే తన పై అధికారి అనే గౌరవం కూడా ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జైపూర్ తహసీల్దార్ శేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. గిర్ధావర్ ఆరోపణలపై వివరణ కోరగా... తనకు తెలియకుండా ఎవరిని విధుల్లో చేర్చుకోవద్దని ఓ ప్రజాప్రతినిధి చెప్పిన మాటలనే మోహన్‌కు చెప్పానని స్పష్టం చేశారు. ఈ మాటలకు తప్పుడు ప్రచారం చేస్తూ అధికార పార్టీ పేరును, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్ పేర్లను వివాదాస్పదం చేశాడని పేర్కొన్నారు. ‘జరిగిన పరిణామాలను కలెక్టర్‌కు నివేదించాను. కలెక్టర్ నుంచి నాకు తదుపరి ఆదేశాలు ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలోనే శనివారం మండల కార్యాలానికి వచ్చిన గిర్ధావర్ మోహన్‌ను విధుల్లో చేర్చుకోలేదు’ అని వివరించారు. -
కుక్కల దాడిలో పద్నాలుగు గొర్రెలు హతం
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామంలో ఆదివారం రాత్రి కుక్కలు కొట్టంపై దాడి చేయడంతో పద్నాలుగు గొర్రెలు చనిపోయా యి. మరో 8 గొర్రెలు గాయపడ్డాయి. గ్రామస్తుల కథనం ప్రకారం కూడవెళ్లి చంద్రం ఆదివారం తన గొర్రెలను కొట్టంలోకి పంపాడు. రాత్రి సమయంలో చంద్రం వాటికి కాపలా ఉండేందుకు అ క్కడే పడుకున్నాడు. మధ్యలో లేచి చూసేసరికి గొర్రెల కొట్టంలోకి చేరిన నాలుగు కుక్కలు దాడి చేసి పద్నాలుగు జీవాలను బలిగొన్నాయి. మరో 8 గొర్రెలను గాయపర్చాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు మృత్యువాతపడ్డాయి. దీంతో బాధితుడికి సుమారు రూ. 60 వేల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనిపై గ్రామ రెవెన్యూ అధికారి రమేష్ పంచనామా చేసి పైఅధికారులకు సమాచారాన్ని అందజేశారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ ప్రమీల కోరారు. -
లంచం కేసులో 'చిరంజీవి' అరెస్టు..
సాక్షి, విశాఖపట్నం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గూడెం కొత్త వీధి (జీకే వీధి) తహసీల్దార్ చిరంజీవి రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మైనింగ్ క్వారీకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చేందుకు చిరంజీవి లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఎంఆర్ఓ ఇంటిపై ఆకస్మిక దాడిచేసి.. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా చిరంజీవిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
చెరువు గర్భంలో నిర్మించిన ఇళ్లను తొలగించాలి
బొబ్బిలి : పట్టణంలోని 8వ వార్డులోని శివాలయం వీధి వద్ద ఉన్న కూర్మయ్య బందలో ఆక్రమణలు వెంటనే తొలగించాలని రామలింగేశ్వర దేవాంగుల సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. సంఘ సభ్యులకు పట్టణ పౌరసంక్షేమ సంఘం సంఘీభావంగా రావడంతో మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ కూర్మయ్య బంద పూర్వం నుంచి స్మశాన వాటికగా ఉపయోగించుకునే వారమన్నారు. ఆ తరువాత ఇక్కడి చెరువు గట్టుపై అధికారులు ఇచ్చిన పట్టాలతో ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అధికారులు 30–10 వెడల్పుతో పట్టాలు ఇస్తే సుమారు వంద అడుగుల వరకూ ఇళ్ల నిర్మాణం చేపట్టి స్మశానం ముందుకు వచ్చేశారని సంఘం సభ్యులు ఆరోపించారు. స్మశానంగా వాడుకునే చెరువు గర్భంలోకి ఇళ్ల నిర్మాణంతో వాడుకున్నది కాక ఇప్పుడు స్మశాన నిర్మాణాన్ని అడ్డుకోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్లను, నిర్మించుకున్న కొలతలను పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. తహసీల్దార్ పరిశీలన.. పట్టణంలోని స్మశాన వాటిక నిర్మాణానికి ఆక్రమణ దారులే అడ్డుపడుతున్నారని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడంతో తహసీల్దార్ సాయికృష్ణ తన సిబ్బందితో వచ్చి పరిశీలన చేశారు. స్థలం ఎంత వరకు ఉంది? అక్కడ ఇళ్లను ఎంత వరకు నిర్మించుకున్నారన్న విషయం పరిశీలించారు. దీనిపై పూర్తి స్థాయిలో అందరినీ విచారించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మాకు స్మశాన వాటికను నిర్మించి ఇవ్వాలని స్థానికులు కోరారు. వి ఇందిర, జాడ గోవింద రావు, కే పార్వతీశం, ఆదెం అప్పారావు, సర్వేశ్వరరావు, బాబ్జీ, బల్ల శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
తహశీల్దార్లకే భూముల రిజిస్ట్రేషన్ అధికారం
-
సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
బెజ్జూర్(సిర్పూర్) : మండలంలోని మర్తడిలో గురువారం రాత్రి స్రవంతికి చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి దగ్దమైంది. ప్రమాదంలో ఇంట్లోని ఆహార ధాన్యాలు, బట్టలు అన్ని పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న బెజ్జూర్ ఎస్సై శివప్రసాద్, తహసీల్దార్ రఘునాధ్‌లు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. సర్పంచ్ ఉమ్మెర పోచక్కలింగయ్య, ఎంపీటీసీ బూస సుశీలసారయ్య, కోఆప్షన్ సభ్యులు బసరాత్ ఖాన్, వార్డు మెంబర్ శంకర్ బాధితురాలిని పరామర్శించారు. బాధిత మహిíßళకు మండల కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నహీర్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్, మండల శాఖ అధ్యక్షుడు దేవనపల్లి సత్యనారాయణ, నాయకులు పూల్లూరి సతీష్, జిల్లాల సుధాకర్‌గౌడ్, శంకర్, పెంటయ్య, బాపు, తిరుపతి, ఎంపీటీసీ తాళ్ళ ఇందిరా రామయ్య, నియోజక వర్గ నాయకులు రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 25కిలోల బియ్యం, బట్టలతో పాటు వెయ్యి రూపాయల నగదు అందజేశారు. -
ఎదురు తిరిగి... బలయ్యాడు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎదురు తిరిగిన వ్యక్తిని అణిచివేసేందుకు గ్రామస్థాయి నాయకులు ఆడిన చదరంగంలో అధికారులు పావులు అయ్యారు. ఓ గీతకార్మికుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించారు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎస్టీ కాదని నెత్తీనోరు కొట్టుకున్నా న్యాయం జరగలేదు. చివరిసారిగా కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు వెళ్లినా సరైన స్పందన రాలేదు. దీంతో మనస్తాపం చెందిన అతడు కలెక్టరేట్ సాక్షిగా పురుగుల మందు తాగి ప్రాణాలొదిలాడు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అక్కడే విషంతాగి ఆత్మహత్యకు పాల్పడ్డ నెన్నెల మండల కేంద్రానికి చెందిన రంగు రామాగౌడ్ (45) విషాదగాథ ఇది. నెన్నెల మండల అధికార పార్టీ నాయకుల అక్రమాలను ప్రశ్నించిన పాపానికి అట్రాసిటీ కేసులో ఇరుక్కొని బలవన్మరణానికి గురైన రామాగౌడ్ ఉదంతం ప్రతిఒక్కరిని కలిచివేస్తోంది. ఈ ఉదంతం అధికార బలంతో అక్రమాలకు పాల్పడుతూ అట్రాసిటీ చట్టాన్నే అపహాస్యం చేస్తున్న స్థానిక ప్రజా ప్రతినిధుల తీరును బట్టబయలు చేసింది. తప్పుడు కేసులు పెట్టిస్తున్న ప్రజాప్రతినిధులకు పోలీస్, రెవెన్యూ శాఖలు దాసోహమనే దయనీయ పరిస్థితిని కళ్లకు కట్టింది. టీడీపీ మండలాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, కల్లుగీత కార్మికుడిగానే జీవనోపాధి పొందుతున్న రామాగౌడ్ అత్మహత్యతో ఆయన భార్య, కూతురు అనాథలుగా మారారు. అక్రమంగా అట్రాసిటీ కేసులో ఇరికించి వేధిస్తున్నారని, న్యాయం చేయాలని ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్‌కు పిటిషన్ ఇచ్చేందుకు వచ్చిన రామాగౌడ్... అక్కడ సరైన స్పందన లేకపోవడంతో ఆవేదనతో పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అక్రమాలను బయటపెట్టడమే నేరమా..? నెన్నెల మండలం భూ వివాదాలకు కేంద్రంగా మారింది. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా సుమారు 17వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఈ మండలంలో ఉన్నాయి. నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండతో నెన్నెలలో గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు చేసే అరాచకాలకు లెక్కే లేదు. నెన్నెలలో సాగుతున్న రాజకీయ నాయకుల అరాచకాలపై గత సంవత్సరం సెప్టెంబర్‌లో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఆత్మహత్యకు పాల్పడ్డ రామాగౌడ్ నెన్నెల మండల కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, గ్రామ సర్పంచ్ అయిన అస్మా ఇబ్రహీం అక్రమాలకు పాల్పడుతున్నారని మీడియా సమావేశాలు పెట్టి ఆరోపించేవాడు. దీంతో కక్ష పెంచుకున్న వీరు తమ వద్ద పనిచేసే పల్ల మహేష్‌ను ఆయుధంగా వాడుకున్నారు. పెద్దచెరువు శిఖం భూమిలో మహేష్ శెనగ పంట సాగు చేయగా, సర్పంచ్‌పై రామాగౌడ్ ఆరోపణలు చేయడాన్ని కూడా సాకుగా వాడుకున్నారు. మహేష్ తండ్రి బీసీ, తల్లి ఎస్టీ కాగా... మహేష్‌కు ఎస్టీ సర్టిఫికేట్ ఇప్పించి గొడవ పెట్టుకునేలా చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయించారనేది ఆరోపణ. తహసీల్దార్, ఏసీపీల ద్వారా చట్టం దుర్వినియోగం? ఈ ఘటనలో నెన్నెల తహసీల్దార్ సత్యనారాయణ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటే... ఏసీపీ స్థాయి అధికారి విచారణ జరపాల్సి ఉంటుంది. ఏసీపీ విచారణలో కులం పేరుతో దూషించినట్లు నిర్దారణ అయితే... ఫిర్యాదుదారు షెడ్యూల్డ్ కులం లేదా తెగలకు చెందిన వ్యక్తే అని కూడా రూఢీ చేసుకోవాలి. ఇందుకోసం తహసీల్దార్ నుంచి కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఫిర్యాదు చేసిన మహేష్ తండ్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, తల్లి ఎస్టీ. ఇక్కడే అధికార పార్టీ నాయకులు రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభావితం చేశారు. మండల కో ఆప్షన్ సభ్యుడు, సర్పంచ్‌తో పాటు స్థానిక ఎంపీటీసీ, ఎమ్మెల్యే అందరూ అధికార పార్టీ వారే కావడంతో తహసీల్దార్ కూడా ఎస్టీ కుల సర్టిఫికేట్ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇదే మహేష్ చెల్లెలుకు మాత్రం బీసీ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రంతో ఏసీపీ బాలుజాదవ్ గత డిసెంబర్ 13న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసు నమోదులో కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది. భూ వివాదాలు, సర్పంచ్, కో ఆప్షన్ సభ్యుడిపై పిటిషన్లు ఇస్తున్న వ్యక్తిపై సర్పంచ్ దగ్గర పనిచేసే వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఏసీపీ ఎలా నమోదు చేశారనేది ఇక్కడ ప్రశ్న. నియోజకవర్గ ప్రజాప్రతినిధి స్థాయిలో ఒత్తిళ్లు ఉంటే తప్ప ఏసీపీ స్థాయిలో కేసు నమోదు అయ్యే అవకాశం లేదు. దీంతో అట్రాసిటీ చట్టం దుర్వినియోగంతో పాటు అధికార పార్టీ సర్పంచి, మండల స్థాయి నాయకులు సాగిస్తున్న దురాగతాల తీరు తేటతెల్లమైంది. ప్రజావాణికి విలువేది..? రామాగౌడ్‌పై డిసెంబర్ 13న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అప్పటినుంచి రామాగౌడ్Š నెన్నెల గ్రామానికి రాకుండా పోలీసుల కంటపడకుండా న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 2న కలెక్టరేట్‌కు వచ్చిన అతడు కలెక్టర్ ఆర్వీ.కర్ణన్‌ను కలిసి తన గోడు వినిపించుకున్నాడు. ఎస్టీ కాని వ్యక్తితో కేసు నమోదు చేయించారని, అదే వ్యక్తి చెల్లెలుకు బీసీ సర్టిఫికేట్ ఇచ్చారని జిరాక్స్ కాపీలతో సహా కలెక్టర్‌కు చూపించాడు. యథా ప్రకారం కలెక్టర్ ఆ పిటిషన్‌ను నెన్నెల తహసీల్దార్‌కు పంపించారు. అక్రమార్కులతో తహసీల్దార్ కూడా కుమ్మక్కయ్యాడని పిటిషనర్ ఆరోపిస్తుండగా, ఆ అధికారికే నివేదిక ఇవ్వమని కలెక్టర్ సిఫారసు చేయడంతో కేసు పక్కకు పోయింది. ఇరవై రోజులైనా తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యకు సిద్ధమయ్యే బాధితుడు సోమవారం మళ్లీ కలెక్టరేట్‌కు వచ్చాడు. జేసీ ఈ కేసును సాధారణమైనదిగానే పరిగణించడంతో పాటు తహసీల్దార్ నుంచి నివేదిక రాలేదని చెప్పారు. ఇక తాను అట్రాసిటీ చట్టం కింద జైలుకు వెళ్లడం ఖాయమనుకున్న రామాగౌడ్ కలెక్టరేట్ హాల్లోనే తన వెంట తెచ్చుకున్న విషం తాగాడు. గమనించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని జేసీ పరామర్శించి ఉన్నత వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. రామాగౌడ్ చికిత్స పొందుతూ సాయంత్రం నాలుగున్నర గంటలకు మృతి చెందాడు. ఈ ఘటనలో తహసీల్దార్ సత్యనారాయణ, ఏసీపీ బాలుజాదవ్ తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టి ప్రజావాణి కూడా బాధితులకు ఉపయోగపడని కార్యక్రమంగా మారిందని రుజువైంది. దీనిపై జిల్లా కలెక్టర్ గానీ, పోలీస్ కమిషనర్ గానీ ఏం చర్యలు తీసుకొంటారో వేచిచూడాలి. -
కిడ్నీ రాకెట్‌పై ఎమ్మార్వో వివరణ
-
నకిలీ సర్టిఫికెట్లపై ఎమ్మార్వో వివరణ
గుంటూరు జిల్లా : కిడ్నీ మార్పిడి కోసం వెంకటేశ్వర నాయక్‌ను వేదాంత ఆసుపత్రి యాజమాన్యం రిఫర్ చేసిందని నరసరావుపేట ఎమ్మార్వో విజయ జ్యోతి కుమారి తెలిపారు. గుంటూరు, నరసరావుపేటల్లో కిడ్నీ రాకెట్ వెలుగులోకి రావడంతో ఆమె వివరణ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ నేత కపిలవాయి విజయకుమార్ తనకు ఫోన్ చేశారని, వెంటేశ్వర నాయక్ తమ వాడే త్వరగా సర్టిఫికెట్ ఇవ్వమని తనతో చెప్పినట్లు వెల్లడించారు. వెంకటశ్వరనాయక్ సర్టిఫికేట్లు పోలీసు వెరిఫికేషన్‌లో నకిలీవని తేలిందని, వెంకటేశ్వర నాయక్‌ని పిలిచి విచారించామని చెప్పారు. కిడ్నీ ఇస్తే తనకున్న అప్పులు తీర్చేస్తామని చెప్పినందుకే తాను కిడ్నీ ఇస్తున్నానని వెంకటేశ్వర నాయక్ చెప్పారని వివరించారు. తన పైన కేసు పెడతామని చెప్పటంతో నాయక్ పారిపోయాడని చెప్పారు. -
గుంటూరులో కిడ్నీ రాకెట్ కలకలం
-
సాక్షి ఎఫెక్ట్: ఎమ్మార్వో సస్పెండ్
సాక్షి, వరంగల్ రూరల్: పర్వతగిరి తహసీల్దార్ తోట విజయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అమ్రపాలి కాట శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్వతగిరి మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో తహసీల్దారు విజయలక్ష్మి రైతుల నుంచి డబ్బులు తీసుకున్నట్టు సాక్షి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశం మేరకు వరంగల్ రూరల్ ఆర్డీఓ సీహెచ్.మహేందర్‌జీ విచారణ నిర్వహించి నివేదిక సమర్పిం చారు. నివేదక ఆధారంగా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు సీసీఎల్ఏ నుంచి సైతం రాటిఫికేషన్ తీసుకున్నారు. -
ఎమ్మార్వోపై వేటు
ఎర్రుపాలెం: నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి పేరిటి రిజిస్ర్టేషన్ చేసిన ఎమ్మార్వోపై వేటు పడింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల తహశీల్దార్ మాధవి అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో ఆమెపై వేటు వేశారు. మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన ఐదెకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆమెతో పాటు గ్రామ వీఆర్వో ఎంవీఎస్ చారీని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ శనివారం ఆదేశాలు జారీచేశారు. -
భూ కుంభకోణం కేసు: తహశీల్దార్లకు మెమోలు
విశాఖపట్నం: విశాఖపట్నం భూకుంభ కోణం కేసులో పలువురు తహశీల్దార్లకు మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కుంభకోణాలపై విచారణ జరుపుతున్న ‘సిట్’ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కాగా మాన్సాస్ భూముల కుంభకోణం కేసులో భీమిలి మాజీ తహశీల్దార్ బీటీవీ రామారావును అరెస్టు చేశారు. కోర్టుకు హాజరుపరచగా ఈ నెల 11 వరకు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు -
ప్రశ్నలు కాదు.. బుల్లెట్లే
- ప్రజాస్వామ్యంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన అధికారులు - ఊహకందని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన పదో తరగతి విద్యార్థులు - సమాధానం చెప్పేందుకు తడబడ్డ అధికారులు వారంతా పదో తరగతి విద్యార్థులు. మన సర్కారు పాఠశాలలో చదువుతున్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాయి. వారు సంధించిన ప్రశ్నాస్త్రాలు అధికారులకు నోటమాటరాకుండా చేశాయి. సమాజం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కుపైనా వారికున్న అవగాహన అధికారులను నోరెళ్లబెట్టేలా చేసింది. అసలేం జరిగింది. ఎవ్వరా విద్యార్థులు. వారు అధికారులకు సంధించిన ప్రశ్నలేంటి.. అన్న వివరాలు తెలుసుకుందాం రండి.. ప్రత్తిపాడు: ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ప్రత్తిపాడు భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ సిహెచ్.పద్మావతి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటు, ఓటు హక్కు అనే అంశాలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు తాండవకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, పౌరులహక్కులపై వివరించారు. తదనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కు, ప్రభుత్వాల ఏర్పాటు, ఓటర్లు, ప్రజల పాత్రపై తెలియజేశారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు ఓటు హక్కు పొందే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో డబ్బు తీసుకుని ఓట్లు వెయ్యడం చట్టరీత్యా నేరమని, డబ్బు తీసుకున్నా, ఇచ్చినా రెండూ నేరమేనన్నారు. ఎన్నికల సమయంలో మద్యంపైన కూడా నిషేధాన్ని విధిస్తారని చెప్పారు. తదనంతరం మీకేమైనా సందేహాలుంటే అడగాలని తహసీల్దార్ పద్మావతి విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. విద్యార్థులు ఎస్కె.నసీమా, మల్లేశ్వరి, రమ్య, శిరీష అధికారుల ఊహకందని రీతిలో ప్రశ్నలు సంధించడంతో అధికారులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. విద్యార్థుల ప్రశ్నలు, అధికారుల సమాధానాలు వారి మాటల్లోనే.. విద్యార్థి: ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులు గెలిచిన తర్వాత పార్టీ మారుతున్నారు కదా? వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు? తహసీల్దార్: అది వాళ్ల ఇష్టం. ఏ పార్టీకైనా వాళ్లు మారవచ్చు. వాళ్లపై చర్యలు తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన సమాధానం చెబుతారు. విద్యార్థి: బెల్టు షాపులను రద్దు చేస్తున్నాం, చేస్తున్నాం అంటున్నారు. కానీ అసలు మద్యం దుకాణాలకు ఎందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది? తహసీల్దార్: మద్యం వలన రాష్ట్రానికి ఆదాయం ఎక్కువగా వస్తుంది. అందు వలన మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తున్నారు. అయినా ఎన్నికల సమయంలో మాత్రం నిషేదం ఉంటుంది. విద్యార్థి: మీరేమో ఎన్నికల సమయంలో మద్యం నిషేదం అంటున్నారు. కానీ అసలు ఎక్కువగా గ్రామాల్లో మద్యం పంచేది అప్పుడే కదా? తహసీల్దార్: ఎన్నికల సమయంలో ఖచ్చితంగా గ్రామాల్లో నిషేదం అమల్లో ఉంటుంది. దానికి తోడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. రహస్యంగా గ్రామాల్లో మద్యం పంపిణీ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. విద్యార్థి: ఇందాక మీరు మద్యంను ఆదాయ వనరు అన్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసే మద్యంను ఆదాయ వనరుగా ఎంచుకునే బదులు, ప్రభుత్వాలు ఆదాయ వనరులుగా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవచ్చుగా? తహసీల్దార్: అవును అలా చేయవచ్చు. చేస్తే బాగుంటుంది. విద్యార్థి: ఐదేళ్లకోసారే ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు? తహసీల్దార్: ఎన్నికలు బాగా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఐదేళ్లకోసారి నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేసేందుకు కనీసం అంత సమయం పడుతుంది. ఈ విధానం బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది. విద్యార్థి: ఓటు హక్కు పొందడానికి పద్దెనిమిది సంవత్సరాలు కావాలంటున్నారు. మరి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి 21 సంవత్సరాలు ఉండాలంటున్నారు? అలా ఎందుకు? ఓటు హక్కుకు సరిపోయిన వయస్సు ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి ఎందుకు సరిపోదు? పద్దెనిమిది సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు యువతకు కల్పించవచ్చు కదా? తహసీల్దార్: ఏం చెప్పాలో అర్థం కాక కొద్ది నిమిషాల పాటు తహసీల్దార్ మౌనం. ఆ తర్వాత ఈ విషయాన్ని నేను ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తా అని తహసీల్దార్ తెలిపారు. విద్యార్థి: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చని ఎమ్మెల్యేలను ఎందుకు రీకాల్ చెయ్యకూడదు? ఉపాధ్యాయుడు: అలా రీకాల్ చేసే పద్ధతి మన రాజ్యాంగంలో లేదు. -
తహసీల్దార్ కనుసన్నల్లో భూపందేరం
వినుకొండ: ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బొల్లాపల్లి తహసీల్దార్ మండలంలోని పలు గ్రామాల్లో 500 ఎకరాల ప్రభుత్వ భూములను అనర్హులకు ధారాదత్తం చేశారని ఎంపీపీ పట్రా కోటేశ్వరరావు ఆరోపించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండలంలోని అయ్యన్నపాలెం, బొల్లాపల్లి, పెరూరుపాడు, మేళ్లవాగు, గుమ్మనంపాడు, రేమిడిచర్లతో పాటు పలు గ్రామాల్లో అసైన్డ్ భూములను అక్రమంగా అన్యులకు కట్టబెట్టడం తహశీల్దారు అక్రమాలకు నిదర్శనమన్నారు. అయ్యన్నపాలెంలో 374ఏ, 374బీ సర్వేనంబర్లలోని అటవీ భూమికి ఇద్దరికి పాసు పుస్తకాలు సైతం మంజూరు చేశారన్నారు. దొమ్మర్లగొంది ప్రాజెక్ట్‌కు కేటాయించిన భూమి, బొల్లాపల్లి, పేరూరుపాడు సొసైటీ భూములను కూడా వదలలేదన్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములకు వారికి తెలియకుండానే ఇతరులకు పాస్ పుస్తకాలు మంజూరు చేశారన్నారు. గుమ్మనంపాడు అగ్రహారం భూపందేరంలో తహసీల్దారుదే కీలకపాత్ర అన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. తహశీల్దార్ అక్రమాలను ఆర్డీవో, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. సొసైటీ అధ్యక్షుడు గోవింద్ నాయక్, పార్టీ మండల కన్వీనర్ బత్తి గురవయ్య, జెడ్పీటీసీ కిన్నెర సంతోషమ్మ దేవయ్య, తిప్పిశెట్టి కోటేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో జియమ్మవలస ఎమ్మార్వో
జియలమ్మవలస: డబ్బు కో్సం అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోక ప్రజలను పట్టి పీడిస్తున్నారు. తాజాగా ఓ రైతు నుంచి తహశీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. విజయనగరం జిల్లా జియమ్మవలసకు చెందిన ఓ రైతు వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటున్న తహిశీల్దార్ కొల్లి వెంకటరావును ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిన్ని వివరాల కోసం ఆయన్ని విచారణ చేపడుతున్నారు. పార్వతీపురంలో ఉన్న తహశీల్దార్ నివాసంలో కూడా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎంఈఓ, తహసీల్దార్‌పై దళిత మహిళ ఫిర్యాదు
బ్రహ్మసముద్రం : ఎంఈఓ మల్లికార్జున, తహసీల్దార్ సుబ్రమణ్యంలు తనను, తన భర్తను కులం పేరుతో దూషించి, అవమానించారని గొంచిరెడ్డిపల్లికి చెందిన పిల్లలపల్లికి చెందిన నాగమ్మ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గొంచిరెడ్డిపల్లిలోని ఎంఈఓ పొలంలో కూలి పనులకు వెళ్లిన తమను పనులు సక్రమంగా పనిచేయలేదని ఎంఈఓతోపాటు అదే సమయానికి అక్కడకు వచ్చిన తహసీల్దార్ కూడా కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొంది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. -
చీటింగ్ కేసులో మాజీ ఎమ్మార్వో అరెస్ట్
తల్లాడ(ఖమ్మం జిల్లా): ఓ ఛీటింగ్ కేసులో తల్లాడ మాజీ ఎమ్మార్వో టి. ప్రకాశ్‌బాబు, మాజీ వీఆర్ఓ నర్సింహారావును తల్లాడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాలు..తల్లాడ సర్వే నెంబర్ 705లో గురజాల సీతారామచంద్రరావు అనే వ్యక్తికి 23 కుంటల భూమి ఉంది. దీనిని తల్లాడకు చెందిన పెండ్రు పున్నమ్మ అనే మహిళ పేరిట ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలు సృష్టించి భూబదలాయింపు చేశారు. ఈ తతంగం అంతా ప్రకాశ్‌బాబు తల్లాడ ఎమ్మార్వో ఉన్న 2011లో జరిగింది. మూడు రోజుల క్రితం అసలు భూమి యజమాని గురజాల సీతారామచంద్రరావుకు విషయం తెలిసింది. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి మంగళవారం మాజీ వీఆర్ఓ, ఎమ్మార్వోలను అరెస్ట్ చేశారు. -
ధర్మవరానికి రెగ్యులర్ తహశీల్దార్
సాక్షి ఎఫెక్ట్ అనంతపురం అర్బన్: ధర్మవరం మండలానికి రెగ్యులర్ తహశీల్దార్ ని నియమిస్తూ కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరంలో అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా రెగ్యులర్ తహశీల్దార్లు విధులు నిర్వర్తించలేని పరిస్థితి నెలకొంది. రెగ్యులర్ తహశీల్దార్‌ని నియమించినా ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి సెలవుపై వెళ్లేలా చేయడం పరిపాటిగా మారింది. ఏడాదిన్నరగా ఇక్కడ ఇన్చార్జి పాలన కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సాక్షిలో ఈ నెల 4న ''అధర్మ రాజ్యం'' శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఇందులో భాగంగానే విడపనకల్లు తహశీల్దారుగా పనిచేస్తున్న శంకరయ్యని ధర్మవరం తహశీల్దారుగా నియమించారు. గతంలో ధర్మవరం తహశీల్దారుగా నియమించిన నాగరాజు జాయిన్ అయిన వెంటనే సెలవుపై వెళ్లారు. దీంతో ఆయనను యల్లనూరు తహశీల్దారుగా అప్పట్లో నియమించారు. అప్పటి వరకు అక్కడ తహశీల్దారుగా ఉన్న అన్వర్ హుసేన్ వీఆర్‌లో ఉన్నారు. ఈ క్రమంలో అన్వర్హుసేన్ని డ్వామాలో సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఇక్కడున్న తహశీల్దారు శివయ్యని విడపనకల్లు తహశీల్దారుగా నియమించారు. ఇదిలా ఉండగా ధర్మవరానికి రెగ్యులర్ తహశీల్దారు నియామకం అధికార పార్టీ నేతల సిఫారసు ద్వారానే జరిగిందనే చర్చ రెవెన్యూ శాఖలో వినిపిస్తోంది. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు పోలింగ్ కేంద్రాలు
ఎర్రగుంట్ల: శాసన మండలి ఎన్నికలకు సంబంధించి మండలంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ బీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయలంలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా శాసన మండలి పట్టబద్రల ఓట్లు 2810, టీచర్ల ఓట్లు 117 నమోదైనట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎర్రగుంట్ల పట్టణంలోని జెడ్పీ పాఠశాలలో పట్టభద్రులకు సంబంధించి 66, 67 నంబర్లు గల పొలింగ్ బూత్‌లను, ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో 68వ నంబరు పొలింగ్ బూత్‌ను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 36వ నంబరు గల పొలింగ్ బూత్‌ను జెడ్పీ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 66వ పొలింగ్ పరిధిలో చిలంకూరు, నిడుజివ్వి, సిర్రాజుపల్లి, వలసపల్లి, పెద్దనపాడు, తుమ్మలపల్లి, వై కోడూరు, తిప్పలూరు, టీ సుంకేసుల, హనుమను గుత్తి, పొట్లదుర్తి గ్రామాలు వస్తాయని, 67వ పొలింగ్ బూత్‌లో ఎర్రగుంట్ల పట్టణం వస్తుందన్నారు. 68వ పొలింగ్ బూత్ పరిధిలో మాలెపాడు, కలమల్ల, ఆర్టీపీపీ, చిన్నదండ్లూరు, మేకలబాయపల్లి, సున్నపురాళ్లపల్లి గ్రామాలు వస్తాయని, 66 పొలింగ్ బూత్‌లో 858 ఓట్లు, 67వ పొలింగ్ బూతులో 1042, 68వ పొలింగ్ బూత్‌లో 910 ఓట్లు వస్తాయని ఆయన వివరించారు. 36వ పొలింగ్ బూత్‌లో 117 ఓట్లు వస్తాయని తెలిపారు. ఈ నెల 23న చివరి జాబితా విడుదల చేస్తామని తహసీల్దార్ తెలిపారు. -
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం
రామన్నపేట అధికార యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషిచేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శిం చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలానిన సందర్శించి ప్రభుత్వపథకాల అమలుతీరును సమీక్షించనున్నట్లు తెలిపారు. పాలనలో పారదర్శకత, అధికారులు అంకితభావంతో పనిచేసేవిధంగా జిల్లాను ముందుకు తీసుకువెళ్లనున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్నిప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లోని సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేవిధంగా అధికారులను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రామన్నపేటలోని ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దనే ప్రజల మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. బహిరంగ మలవిసర్జన లేని మండలంగా తీర్చిదిద్దాలి వచ్చేఏడాది మార్చి31 నాటికి రామన్నపేటను బహిరంగ మలవిసర్జనలేని మండలంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వపథకాలపై వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. హరితహారం, స్వచ్ఛభారత్, ఉపాధిహామీపథకం, మిషన్‌కాకతీయ,భగీరథ పథకాల అమలుతీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్యపై ఆరా తీశారు. పలు విషయాలను ఎంపీడీఓ వారికి వివరించారు. ప్రభుత్వస్థలాలలో, కాలువలు, చెరువులగట్లపై మొక్కలునాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో నిధులులేక అసంపూర్తిగాఉన్న పాఠశాల, అంగన్వాడీ భవనాల వివరాలు, వంటగదులు అవసరమైన పాఠశాలలను తనకు తెలియజేస్తే నిధులు విడుదల చేయిస్తాని చెప్పారు. మండలంలోని పీఆర్రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలస్థితిపై నివేదిక పంపించాలని ఆదేశించారు. ఏరియా ఆస్పత్రిని తనిఖీచేసిన కలెక్టర్ అనంతరం కలెక్టర్ అనితారామచంద్రన్ మండలకేంద్రంలోని ఏరియాఆసుపత్రిని తనిఖీచేశారు. చిల్డ్రన్కేర్యూనిట్, ప్రసూతిగది, జనరల్‌వార్డు, ప్రసూతివార్డు, పీపీయూనిట్ను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. వైద్యసేవలు, సమస్యలపై ఆరా తీశారు. కలెక్టర్ సందర్శన సమయంలోనే రోగుల సహాయకులు భోజనాలు చేస్తున్న చోటనే పందులు తిరుగడం చూసి విస్మయానికి గురయ్యారు. ఆస్పత్రిలోని సమస్యలను ఆరోగ్యశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. ఆమెవెంట చౌటుప్పల్ ఆర్డీఓ ఆర్. మహేందర్‌రెడ్డి, ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, తహసిల్దార్ ఎ.ప్రమోదిని, ఎంపీడీఓ కె.జానకిరెడ్డి, మండలవిద్యాధికారి ఎస్.దుర్గయ్య, ఏఈ ప్రశాంత్, డీటీ జె.ఎల్లేశం, ఆర్ఐ డి.జానయ్య, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సిద్దార్ద, సుజాత, సర్పంచ్‌లు నకిరేకంటి మొగులయ్య, గెగ్గెలపల్లి యాదగిరిరెడ్డిలు ఉన్నారు. -
అధికారులపై దాడులు సరికాదు
చాగలమర్రి: కార్యాలయాల్లో అధికారులు పనులు చేయకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప దాడులకు పాల్పడకూడదని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ అంజనేయులును దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. తహసీల్దార్ అంజనేయులుపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. వెంటనే జిల్లా ఎస్పీకి తెలియజేశామన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసిన పోలీసు శాఖాధికారులను ఆయన అభినందించారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరించారు.సమస్యలు పరిష్కరించాలని సహకార సంఘం అధ్యక్షుడు రఘనాథ్‌రెడ్డి, సర్పంచ్‌లు మస్తాన్‌రెడ్డి, నరసింహారెడ్డి, దేశంరెడ్డి, వీరభద్రుడు, బాబు, సుబ్బారెడ్డిలు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, సీఐ దస్తగిరి బాబు, తహసీల్దార్లు శ్రీనివాసులు, షెక్‌మోహిద్దీన్, మాలకొండయ్య, ఆల్ఫ్రెడ్, రాజశేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. నిరాశతో వెనుతిరిగిన రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ వస్తున్నారని తెలిసి రైతులు భారీగా తరలివచ్చారు. భూసమస్యలు కలెక్టర్‌కు విన్నవించాలని ఉదయం నుంచి వేచి ఉన్నారు. అయితే కలెక్టర్ సాయంత్రం 5.00 గంటలకు వచ్చారు. కేవలం 20 నిమిషాల్లో తహసీల్దార్, ఆర్డీఓతో చర్చించి రైతుల సమస్యలు వినకుండానే వెళ్లిపోయారు. దీంతో రైతులు విలేకరుల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. చాగలమర్రి రెవెన్యూ కార్యాలయంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని.. చేయి తడిపితే తప్ప పనులు కావడం లేదన్నారు. -
తహసీల్దార్ కార్యాయంలో చోరీ
హాలియా : తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కంప్యూటర్ మానిటర్, ల్యాప్‌టాప్‌ను అపహరించినట్టు తహసీల్దార్ వేణుమాధవరావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుముల మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ రామకృష్ణ మంగళవారం ఉదయం కార్యాలయానికి వచ్చి చూసేసరికి మానిటర్, ల్యాప్‌టాప్ లేవని గుర్తించి వెంటనే తహసీల్దార్‌కు తెలిపాడు. వెంటనే పోలీసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి తనిఖీ నిర్వహించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్ తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన మెదక్ జిల్లా ఎమ్మార్వో
-
ప్రతిఒక్కరూ సేవాదృక్పథం అలవర్చుకోవాలి
రాయికల్(షాద్‌నగర్‌రూరల్): ప్రతిఒక్కరూ సేవాధక్పథం అలవర్చుకొని సేవా కార్యక్రమాలు చేపట్టాలని తహసీల్దార్ చందర్రావు అన్నారు. కష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు ఆర్యవైశ్య, అనుబంధసంఘాల ఆధ్వర్యంలో మండల పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద ఉచితంగా అల్పాహారం అందించే కార్యరకమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం వాసవీ, వనితాక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పుష్కరభక్తులకు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ చందర్రావు హాజరై‡కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన కష్ణా పుష్కరాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని వసతులను కల్పించిందని అన్నారు. పుష్కరాలకు వెళ్లే భక్తులను దష్టిలో పెట్టుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విట్టదుర్గయ్య, హకీంరాజేష్, విఠ్యాల రామేశ్వర్, కిశోర్గుప్త, శివప్రసాద్, దొంతు పాండురంగయ్య, గందెసురేష్, శశిధర్, మాధవీలత, శ్రీలత, ఎంసానిశ్రీను, పెద్దిరాంమోహన్, శివభాస్కర్, శ్రీనివాస్, నాగిళ్లభవాని, సంతోష్‌బాబు, బాల్‌రాజ్, అనుమారివెంకటయ్య, గోవర్ధన్, సూర్యప్రకాష్, రంగయ్య, వెంకటరమణ, విజయభాస్కర్, చంద్రశేఖర్, సంధ్య, నవలత, శిరీష, శారద తదితరులు పాల్గొన్నారు. -
చురుగ్గా పుష్కర ఏర్పాట్లు
బెళుగుప్ప : మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ వద్ద కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం అధికారులు ప్రారంభించారు. స్థానిక తహశీల్దార్ వెంకటా చలపతి రిజర్వాయర్‌లో లోతు తక్కువ ఉన్న ప్రాంతాలను పరిశీలించి పలు ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పుష్కర ఏర్పాట్లను వేగవంతంగా చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు దుస్తులు మార్చుకునే గదులను తాత్కాలికంగా తడకలతో ఏర్పాటు చేస్తామని, పురోహితులను సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. స్నానం తరువాత పూజలు నిర్వహించేందుకు కృష్ణమ్మ దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పనులను ప్రారంభించామని తెలిపారు. రాత్రి వేళల్లో వెలుగు కోసం ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ లైన్లను వేస్తున్నారని, రిజర్వాయర్‌లో బ్యారికేడ్లను ఏర్పాటు చేయిస్తామని అన్నారు. తహశీల్దార్‌తో పాటు ఆర్ఐలు జగన్నాథం, భాగ్యమ్మ, ఏఓ పృథ్వీసాగర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ విజయ భాస్కర్, వెటర్నరీ అధికారి మహేశ్ తదితరులు రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
మంగపేట : ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతూ భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు–లెనినిస్టు) సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ములుగు(భూపాలపల్లి) డివిజన్ కమిటీ కార్యదర్శి ఆధ్వర్యంలో తహసీల్దార్ తిప్పర్తి శ్రీనివాస్‌కు సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాల పరిస్థితుల వల్ల ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు, గూడాల్లో ఈగలు, దోమల వలన ప్రజలు మలేరియా, డెంగీ, కల రా, విషజ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి వైద్యశిబిరాలు నిర్వహించి గిరిజనులకు మెరుగైన వైద్యం అందేవిధంగా చూడాలని తహసీల్దార్‌ను కోరారు. ఆ సంఘం మం డల నాయకులు గాడిచర్ల సాంబన్న, శంకర్, కిరణ్, బాపురత్నం, ముత్తన్న, ఎల్లన్న, సోమన్న, బుచ్చిరెడ్డి, బుచ్చన్న పాల్గొన్నారు. -
తహశీల్దార్, వీఆర్వోను అరెస్ట్ చేసిన ఏసీబీ
-
అక్కడ నివాసం ఉంటేనే స్థానికత
- ఎమ్మార్వో సర్టిఫికెట్ ఇస్తారు - సీఎస్‌కు చేరిన ఫైలు - నేడో రేపో మార్గదర్శకాలు హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్లి అక్కడ నివాసం ఉంటేనే స్థానికత కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) మార్గదర్శకాలను రూపొందించింది. మార్గదర్శకాలతో కూడిన ఫైలు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్‌కు చేరింది. స్థానికతకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి అంటే 2014 సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి 2017 సంవత్సరం జూన్ 2వ తేదీలోగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివెళ్లే వారికి స్థానికత కల్పించేందుకు ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, అలాగే ఉద్యోగాలకు స్థానికత వర్తించనుంది. 2017 జూన్ 2వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నవారు స్థానిక సరిఫికెట్ కోసం ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మార్వో ఆ దరఖాస్తు ఆధారంగా పరిశీలన చేసి అక్కడే నివాసం ఉంటే స్థానికత సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. స్థానికత సర్టిఫికెట్ వ్యక్తి ఆధారంగా జారీ చేయనున్నారు. ఉద్యోగులకే కాకుండా అక్కడికి తరలివెళ్లే ఎవరికైనా స్థానికత కల్పించనున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు వెళితే అతనికి స్థానికత కల్పిస్తారు. ఆ ఉద్యోగి పిల్లలు హైదరాబాద్‌లోనే ఉంటే వారు హైదరాబాద్‌లోనే స్థానికులుగా కొనసాగుతారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో జూన్ 2, 2017లోగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడకు తరలివెళ్లినా స్థానికత వర్తిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా మాత్రమే మార్గదర్శకాలను రూపొందించారు. -
‘కల్యాణలక్ష్మి’కి దరఖాస్తుల కళ
► 23 రోజుల్లోనే 4,709 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ► తహసీల్దార్ల ద్వారా పరిశీలనకు బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు(బీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ)ల కల్యాణలక్ష్మి పథకానికి మంచి స్పందన వ్యక్తమవుతోంది. ఈ పథకం లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అధికారికంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించిన 23 రోజుల్లోనే 4,700 పైచిలుకు దరఖాస్తులు నమోదయ్యాయి. బీసీ, ఈబీసీ లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తులను నమోదు చేసుకునేందుకు ఒక వెబ్ సైట్‌ను గత నెల 13న బీసీ సంక్షేమ శాఖ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీల కల్యాణలక్ష్మి, మైనారిటీల షాదీముబారక్, బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకాలు కలుపుకుని ఈ శనివారం వరకు 33,345 దరఖాస్తులు నమోదయ్యాయి. ఎస్సీల అభివృద్ధి శాఖ 13,348, ఎస్టీ సంక్షేమ శాఖ 9,421, మైనారిటీ శాఖ పరిధిలో 5,907 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. బీసీ, ఈబీసీ కల్యాణలక్ష్మిలో భాగంగా 2016-17లో రూ.300 కోట్లతో 58,820 మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత సంఖ్య మేరకు దీని కింద సహాయం అందించనుంది. దీనితోపాటు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తేదీ, సమయం రికార్డు అయ్యేలా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు ద్వారా సీనియారిటీని నిర్ధారించి చెల్లింపులు చేస్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆయా జిల్లాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు అవినీతి నిరోధకశాఖ తనిఖీల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చే దరఖాస్తుల పరిశీలన బాధ్యతను ఎమ్మార్వోలకే అప్పగించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సీసీఎల్ఏకు కూడా లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తుదారులు ఇంకా కొంత కాలం వేచిచూడాల్సి ఉంటుంది. 2016 ఏప్రిల్ 1, ఆ తర్వాత వివాహం అయిన వాళ్లందరికీ ఈ పథకం కింద రూ.51 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు బీసీ శాఖ గతంలోనే ప్రకటించింది. -
రత్నమయ్య అక్రమాస్తులు రూ. 7 కోట్లపైనే
అనంతపురం : ప్రస్తుతం ఓడీ చెరువు తహశీల్దార్‌గా పనిచేస్తున్న రత్నమయ్య రూ.7కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు బుధవారం నిగ్గు తేల్చారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో అనంతపురం ఏసీబీ డీఎస్పి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం, బెంగళూరు, మదనపల్లె తదితర ప్రాంతాల్లో ఏడు ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంగళవారం ఈ దాడులు మొదలైయ్యాయి. ఈ దాడుల్లో బెంగుళూరులో రెండు బంగళాలు, చిత్తూరు జిల్లా మదనపల్లెలో మేడలు, ఇళ్లు, అనంతపురంలో అపార్ట్మెంట్లు, హిందూపురంలో ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే పలు కీలక పత్రాలు, ఖాళీ చెక్కులు, 25 తులాల బంగారు నగలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రత్నమయ్య నంబులుపూలకుంటలో తహశీల్దార్‌గా పనిచేసినపుడు సోలార్సిటీకి వ్యవహారంలో కోట్ల రూపాయిలు అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే చిలమత్తూరు తహశీల్దార్‌గా పని చేసినపుడు కూడా ఆయనపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై దృష్టిలో పెట్టుకుని ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఏడుచోట్ల దాడులు నిర్వహించారు. తహశీల్దార్ అక్రమాస్తుల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది. -
ప్రభుత్వ స్థల ఆక్రమణకు యత్నం, ముగ్గురి అరెస్టు
బంజారాహిల్స్: బోగస్ డాక్యుమెంట్లతో ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో రిటైర్డు సర్వేయర్ కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 13ఏలో టీఎస్ నంబర్ 3/1, బ్లాక్ -ఎస్, వార్డు 11, సర్వే నంబర్ 403లో ప్రభుత్వ స్థలం ఉంది. బుధవారం ఉదయం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసి రిటైర్డ్ అయిన సర్వేయర్ ఎం.రామారావు, బహదూర్‌పురకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఏ.రిఫీక్, ఎండి.సాదిక్ తదితరులు ఈ ప్రభుత్వ స్థలంలోకి వెళ్లి కొలతలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న షేక్‌పేట తహసీల్దార్ చంద్రకళ సిబ్బందితో కలిసి ఆ స్థలం వద్దకు వెళ్లి మీరెవరంటూ ప్రశ్నించారు. ఇక్కడ 925 గజాల ప్లాట్ ఉందని, దీన్ని తాము ఖరీదు చేశామని వారు తెలిపారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా చూపించారు. అయితే, ఈ స్థలం పక్కాగా ప్రభుత్వానిదని రికార్డులున్నాయని, ఈ ప్లాట్‌కు సంబంధించిన సర్వే నంబర్ వారిచ్చిన రికార్డుల ప్రకారం ఇక్కడ లేదంటూ తహ సీల్దార్ స్పష్టం చేశారు. అయితే, ఈ స్థలాన్ని తాము కొనుగోలు చేశామంటూ వారు వాగ్వాదానికి దిగగా వెంటనే ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలంలో రామారావు, రఫీక్, ఎండీ సాదిక్‌లను అరెస్టు చేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ప్రవేశించటం, తవ్వకాలు చేపట్టటం, స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించటం, బోగస్ డాక్యుమెంట్లను సృష్టించటంపై తహసిల్దార్ ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని తహసీల్దార్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మనస్తాపంతో ఎమ్మార్వో ఆత్మహత్యాయత్నం
అనంతపురం: మనస్తాపం చెందిన ఓ ఎమ్మార్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. సోమందేపల్లి ఎమ్మార్వోగా తిమ్మప్ప గత కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నారు. భూ వివాదంలో తనపై ఆరోపణలు చేస్తున్నారని..మనస్తాపం చెందిన ఆయన కార్యాలయంలో తలుపులు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన సిబ్బంది, స్థానికులు తలుపులు పగలకొట్టి తిమ్మప్పను రక్షించారు. -
తహశీల్దార్ ఇంట్లో చోరీ
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం హెచ్‌టీ రోడ్డులోని కుప్పం తహశీల్దార్ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగత పనుల నిమిత్తం అబ్దుల్ మునాఫ్ పొరుగూరు వెళ్లగా ఈ చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని వస్తువులంతా చిందరవందర చేశారు. స్థానికుల సమాచారాన్ని పోలీసులకు, యజమానికి చేరవేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'ఆయన' తహ తహ..తహశీల్దార్!
రెవెన్యూ కార్యాలయమే వడ్డీ వసూళ్ల కేంద్రం! రూ.2 కోట్లు టర్నోవర్? అధికార పార్టీ నేతలే బాధితులు తిరుపతి : ఆయనో మండల తహశీల్దార్. అటెండర్ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. తహశీల్దార్‌గా ఉద్యోగోన్నతి పొందాక ఆయన ఆహార్యం మారింది. తన చేతులకున్న పదివేళ్లలో ఏడు వేళ్లకు పెద్దసైజు ఉంగరాలు, మెడలో భారీగా బంగారు గొలుసులు వేసుకుని ఫైనాన్స్ వ్యాపారిగా కనిపిస్తుంటాడు. ఆయన అసలు వ్యవహారం కూడా అదే! వడ్డీ వ్యాపారానికి తెరతీసి ప్రభుత్వ కార్యాలయాన్నే వసూళ్ల కేంద్రంగా మార్చుకున్నాడు. వ్యవహారంలో ఇతర వడ్డీ వ్యాపారులకేమీ తీసిపోడు. ఇప్పుడు అత్తగారి మండలంలోనే విధులు నిర్వర్తిస్తూ ‘మూడు చెక్కులు ఆరు ప్రామిసరీ నోట్లు’గా వడ్డీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఓ మండలంలో తహశీల్దార్ కాల్‌మనీని తలపించేలా దందా నడిపిస్తున్న తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మెక్రోఫైనాన్స్ను తలదన్నేలా జలగల్లా పీక్కుతింటున్నట్లు చెబుతున్నారు. అవసరాలను ఆసరాగా చూసుకుని అధికవడ్డీలతో అప్పుల వల వేస్తాడు. అప్పు ఇచ్చిన సాకుతో బయటకు చెప్పుకోలేని విధంగా యాతనపెడతాడు. మధ్య తరగతి ప్రజలతో పాటు పలువురు వ్యాపారులు ఈయన చేతికి చిక్కుతున్నారు. డైలీ, వారం, నెల వారిగా ఫైనాన్స్ ఇస్తున్నారు. నూటికి రూ.10, అంతకంటే ఎక్కువకు కూడా వడ్డీని ముక్కుపిండి వసూలు చేస్తాడని చెబుతున్నారు. కొందరు అప్పులు కట్టలేక ఆస్తులను ఆయనకు వదిలేసినవారు కూడా ఉన్నట్లు సమాచారం. ఆయన డాబు, దర్పం చూసి పలువురు బాధితులు బయటపడి చెప్పలేక లోలోన వేదన పడుతున్నారు. దాదాపు 70 మందికి ఆయన దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా వడ్డీలకు ఇచ్చినట్లు సమాచారం. కాగా, సదరు అధికారి ముందుచూపుతో కొందరు అధికార పార్టీ నాయకులను తన కస్టమర్లుగా మార్చుకున్నాడని తెలుస్తోంది. వారిని తనకు రక్షణ కవచంగా ఉపయోగించుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా వారికి పనులు చే సి పెడుతున్నట్లు టీడీపీ నాయకులే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి సైతం చెప్పారు. వడ్డీకి అప్పు తీసుకున్న వారితో సెటిల్మెంట్ వ్యవహారాలన్నీ తన కార్యాలయంలోనే సాయంత్రం 6 నుంచి రాత్రి 11గంటల వరకు ఆయన చక్కబెడుతుంటారని అక్కడి సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య కోసం పాకాలలోనూ, పూతలపట్టు మండలంలో అనధికారికంగా ఉన్న మూడో భార్య కోసం ఇళ్లలో కాపురం పెట్టాడని.. ఆయా ఇళ్లు సైతం వడ్డీబాధితులవేనని తీవ్రమైన ఆరోపణలున్నాయి. కాగా, ఇలా వడ్డీ దందాతో వచ్చిన డబ్బులతోనే రాజకీయంగా ఎదగాలని ఆ తహశీల్దార్ తహతహలాడుతున్నట్లు సమాచారం. డీకేటీ పట్టాలు సైతం.. పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములను సదరు తహశీల్దార్ గద్దలా తన్నుకుపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఆర్ఐగా, డెప్యూటీ తహశీల్దార్‌గా, తహశీల్దార్‌గా పనిచేసిన ఈయన తన భార్య పేరుతో నేండ్రగుంట-పెనుమూరు రోడ్డులో ఐదు ఎకరాల భూమికి డీకేటీ పట్టా తీసుకున్నాడు. విమర్శలు వెల్లువెత్తడంతో తన భార్య పేరు నుంచి కుటుంబ సభ్యుల పేరుతో డీకేటీ పట్టాను మార్చుకున్నాడు. ఏదేమైనా ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటివారిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
ఏసీబీ వలలో తహశీల్దార్
లంచం డబ్బుల కలెక్షన్ కోసం సోదరుడిని పంపిన అంబర్‌పేట తహశీల్దార్ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన వైనం అంబర్‌పేట: విధుల్లో చేరిన కొద్దిరోజులకే అవినీతికి తెరలేపి..అడ్డంగా దొరికిపోయారు అంబర్‌పేట తహశీల్దార్ సంధ్యారాణి, అవినీతి ఆరోపణలతో ఆ స్థానం నుంచి బదిలీ అయిన తహశీల్దార్ స్థానంలో కొత్తగా వచ్చిన సంధ్యారాణి సైతం అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ కథనం ప్రకారం...అంబర్‌పేట తహసీల్దార్ ఎస్.సంధ్యారాణి రెండు నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆమె మలక్‌పేట అక్బర్పుర ప్రాంతంలో మహ్మద్ అతర్ అహ్మద్ అనే వ్యక్తి నిర్మిస్తున్న అపార్టుమెంట్‌ను తనిఖీ చేశారు. ఆ స్థలం ప్రభుత్వానిదని, దానికి సంబంధించిన పత్రాలు తీసుకుని తనను కలవాలని ఆమె అతర్ అహ్మద్‌ను ఆదేశించారు. దీంతో అతర్ తాను 1974లో కొనుగోలు చేసిన 525 గజాల స్థలానికి చెందిన పత్రాలను, జీహెచ్ఎంసీ జారీ చేసిన అనుమతి పత్రాలను తీసుకుని సంధ్యారాణిని కార్యాలయంలో కలిశారు. వాటిని పరిశీలించిన తర్వాత ఆ స్థలం ప్రభుత్వానిదేనని, వెంటనే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. రూ. 10 లక్షలు ఇస్తే నోటీసులు ఇవ్వకుండా చూస్తామని చెప్పారు. దీంతో బాధితుడు చేసేదేమీలేక రూ.7 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో తహసీల్దార్‌పై నిఘా వేసిన ఏసీబీ అధికారులు, గురువారం బాధితునికి రంగు పూసిన రూ. 4 లక్షలను అందించి ఆమెకు ఇవాల్సిందిగా సూచించారు. ఈమేరకు మహ్మద్ అతర్ అహ్మద్రూ.4 లక్షలను తీసుకొని తహశీల్దార్ సంధ్యారాణికి ఫోన్ చేయగా...అబిడ్స్‌కు రావాలని సూచించారు. అబిడ్స్‌కు వెళ్లి తిరిగి ఫోన్ చేయగా డబ్బులను పంజగుట్టలో ఉన్న తన సోదరుడు వెంకటనాగేశ్వర్రావుకు ముట్టజెప్పాల్సిందిగా ఆమె తెలిపారు. దీంతో అతర్ అహ్మద్ పంజగుట్ట ప్రాంతానికి వెళ్లి వెంకట నాగేశ్వర్రావుకు ఫోన్ చేయగా అతను వచ్చి రూ.4 లక్షలను తీసుకున్నాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంకటనాగేశ్వర్‌రావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. అనంతరం తహసీల్దార్‌ను కూడా అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఏక కాలంలో అంబర్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయం, మల్కాజిగిరిలోని ఆమె నివాసం వద్ద కూడా సోదాలు చేస్తున్నట్లు అధికారులు విలేకరులకు తెలిపారు. ఇంటికి తాళం గౌతంనగర్: అంబర్‌పేట తహశీల్దార్ సంధ్యారాణి నివాసంపై గురువారం ఏసీబీ అధికారులు దాడికి ప్రయత్నించారు. మల్కాజిగిరి కృపాకాంప్లెక్స్లోని శ్రీకృష్ణనగర్ కాలనీలో ఉంటున్న ఆమె నివాసానికి గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడానికి వచ్చారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండడంతో గంటపాటు వేచి చూసి అధికారులు వెనుదిరిగారు. -
ధరాఘాతంపై వైఎస్సార్సీపీ ఆందోళనలు
విజయవాడ: పెరిగిన నిత్యావసర ధరలను వెంటనే అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకు నిరసనగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు నిర్వహించింది. జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల ఎదుట ఆందోళనలు చేపట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. విజయనగరం: విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా చేశారు. విజయనగరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వీరభద్రస్వామి, బొబ్బిలిలో వైఎస్సార్సీపీ నేత బేబి నాయన ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. శ్రీకాకుళం: శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి ధర్మాన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ధర్నా చేశారు. విశాఖపట్టణం: విశాఖ జిల్లా వ్యాప్తంగా పెరిగిన ధరలకు నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. సీతమ్మధార ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తైనాల విజయ్‌కుమార్ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ పాల్గొన్నారు. టర్నర్ చౌల్ట్రీలో వైఎస్సార్సీపీ నేతలు కోలా గురువులు, జాన్ వెస్లీ, చిన్న గదిలి రూరల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేత వంశీ కృష్ణా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.శ్రీహరిపురంలో పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మళ్లా విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. తూర్పుగోదావరి: రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తుని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రత్తిపాడు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ధర్నాచేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ పాల్గొన్నారు. కోరుకొండలో జక్కంపూడి విజయలక్ష్మీ, అనపర్తిలో డా.సూర్యనారాయణరెడ్డి, అమలాపురంలో విశ్వరూప్, చిట్టబ్బాయి ఆధ్వర్యంలో స్ధానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆందోళన చేశారు. మండపేట, కడియం ఎమ్మార్వో కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ నేత పట్టాభి రామయ్య, వెంకటస్వామి నాయుడు ధర్నాలు చేశారు. రాజమండ్రి రూరల్‌లో ఆకుల వీర్రాజు, పి.గన్నవరంలో కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాకినాడ అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, ఆచంటలో ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు.నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు, పోలవరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా, సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్థం చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. పాలకొల్లులో మేకాశేషుబాబు, కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, వందనపు సాయిబాల పద్మ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఏలూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణా: కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. నూజివీడు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌అప్పారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ధర్నా చేశారు. విజయవాడ గాంధీనగర్‌లో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారుఅవనిగడ్డలో రమేశ్, గన్నవరంలో దుత్తా రామచంద్రారావు ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. పామర్రు తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నందిగామలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అరుణ్‌కుమార్, మైలవరంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో నిర్వహించిన కార్యక్రమంలో సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు: గుంటూరు తహశీల్దార్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రాష్ట్ర కార్యదర్మి లేళ్ల అప్పారెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, గురజాలలో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకాశం: ఎర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పాలకొండ డేవిడ్ రాజు ధర్నా నిర్వహించారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, చీరాలలో, కనిగిరిలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేశారు. చిన్నగంజాంలో గొట్టిపాటి భరత్ కుమార్, కొండేటిలో అశోక్ బాబు ఆందోళనలో పాల్గొన్నారు. ఒంగోలులో వైఎస్సార్సీపీ నేతలు కుప్పం ప్రసాద్, చిన్న రాజు వెంకట్రావు, కటారి శంకర్, గంగాడ సుజాత ధర్నాలో పాల్గొన్నారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధర్నా చేశారు. కడవలూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. పప్పు దినుసుల ధరను నియంత్రించడంలో సర్కార్ విఫలమైందని ఎంపీ మేకపాటి అన్నారు. వెంటనే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని మేకపాటి తెలపారు. చిత్తూరు: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమత ధర్నా నిర్వహించారు. సత్యవేడు, చంద్రగిరి, జంగాలపల్లి, బైరెడ్డిపల్లి, గంగాధర నెల్లూరు, తంబళ్లపల్లి, బి.కొత్తకోట,పలమనేరులలో ధర్నా కార్యక్రమాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వడమాలపేటలో ఎమ్మెల్యే రోజా, మదనపల్లిలో ఎమ్మెల్యే తిప్పారెడ్డి నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా: పులివెందుల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కమలాపురంలో పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్వో రామ్మోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్, బద్వేల్లో ఎమ్మెల్యే జయరాములు ధర్నాలో పాల్గొన్నారు. జమ్ములమడుగులో వైఎస్ఆర్ సీపీ యువజన కార్యదర్శి హనుమంతరెడ్డి ధర్నా చేశారు. అనంతపురం: ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నా నిర్వహించారు. వినూత్నంగా తోపుడు బండిపై నిత్యావసర సరుకులు అమ్మి నిరసన తెలిపారు.ధర్మారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రిలో రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.జిల్లాలోని రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కర్నూలు: బనగానపల్లిలో వైఎస్సార్సీపీ నేత కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మిగనూరు, ఆలూరులో ధర్నాలు నిర్వహించారు. కోరుమూడులో ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. -
దుర్గ గుడిలో రెచ్చిపోయిన ఖాకీలు
విజయవాడ: విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో మరోసారి ఖాకీలు రెచ్చిపోయారు. ఇష్టమొచ్చిన తీరుగా వ్యవహరించారు. విధుల్లో ఉన్న ఉంగుటూరు తహశీల్దార్ శ్రీనివాస్‌పై సీఐ దురుసుగా ప్రవర్తించారు. వీఐపీ గేటు వద్ద సీఐ అప్పలస్వామి తహశీల్దారు శ్రీనివాస్‌ను తోసేశాడు. దీంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
బెజ్జంకి (కరీంనగర్): కొనుగోలు చేసిన భూమికి తహశీల్దార్ మ్యుటేషన్ చేయడం లేదని.. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం కీలాపూర్ గ్రామంలో దంపతులు శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన అర్జున్, స్వరూప దంపతులు 2 ఎకరాల 37 గుంటల భూమిని కొనుగోలు చేశారు. దానికి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేయగా, రికార్డుల్లోని వివరాల ఆధారంగా 2 ఎకరాలకే మ్యుటేషన్ చేయడం వీలవుతుందని తహశీల్దార్ స్పష్టం చేశారు. 37 గుంటల భూమిని యజమాని అప్పటికే వేరొకరికి విక్రయించినట్టు ఆయన చెప్పారు. అయినప్పటికీ తాము కొనుగోలు చేసిన మొత్తం భూమికి మ్యుటేషన్ చేయాలని కోరగా, వీలు కాదని స్పష్టం చేయడంతో మనస్తాపం చెందారు. శనివారం అర్జున్, స్వరూప తమ ఇంట్లో పురుగుల ముందు తాగి పడిపోగా 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఏసీబీ వలలో చిప్పగిరి ఎమ్మార్వో
కర్నూలు : ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఎమ్మార్వో అక్బర్ ఏసీబీ అధికారులకు రెడ్ హాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన కర్నూలులో మంగళవారం చోటు చేసుకుంది. జిల్లాలోని చిప్పగిరి ఎమ్మార్వోగా అక్బర్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించ వలసిందిగా వ్యక్తి ... ఎమ్మార్వోను ఆశ్రయించారు. అందుకు సదరు వ్యక్తిని అక్బర్ రూ. 7 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వల పన్ని ఎమ్మార్వోను అరెస్ట్ చేశారు. -
తహశీల్దార్‌కు రూ.10 వేల జరిమానా
బేతంచర్ల : బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన ఓ ఎమ్మార్వో కు జరిమానా విధిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన ఎన్.రాధమ్మ...తహశీల్దార్ రామకృష్ణుడు వేధింపులపై హైకోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 688, 528బీలలో 4.2 ఎకరాల భూమికి రాధమ్మ యజమానురాలు. అయితే ఈ భూమితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమంగా సాగు చేస్తోందంటూ తహశీల్దార్ వేధింపులకు దిగడంతోపాటు కేసు పెట్టించారు. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తహశీల్దార్ రామకృష్ణుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ రూ.10 వేలు జరిమానా విధించింది. -
'వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరాం'
విజయవాడ: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఘటనపై ఏపీ ఎన్జీవో చైర్మన్ విద్యాసాగర్ స్పందించారు. వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈనెల 7వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఏపీ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు ఏపీ ఎన్జీవో, జేఏసీల నుంచి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ధర్నాకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ధర్నాకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానిస్తామన్నారు. ఈనెల 8వ తేదీన రాష్ట్ర ఉద్యోగ నేతలంతా కేంద్ర హోంమంత్రిని, మిగిలిన కేంద్ర మంత్రులను ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరతామన్నారు. దీంతో పాటు ఈనెల 10 వ తేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు కూడా తాము సంఘీ భావం తెలుపుతామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు ఎవరు ఉద్యమం చేసినా తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ నెల 16వ తేదీన జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరులో విభజన హామీలపై సమావేశం ఏర్పాటు చేసి.. తమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన తహశీల్దార్
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆళ్లకొత్తపేట గ్రామంలో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ స్థలాన్ని స్థానిక తహశీల్దార్ రాజేందర్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎల్లయ్య కబ్జా చేశాడని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో తహశీల్దార్ సదరు భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తహశీల్దార్ ఎదుట ఎవరివాదనలు వారు వినిపించారు. పరిసర భూములను సర్వేయర్ ద్వారా కొలిచిన తర్వాత కబ్జా చేసిన భూమి ప్రభుత్వానిదా ? కాదా ? అన్న విషయం తేలుతుందని తహశీల్దార్ రాజేందర్ వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలో సదరు భూములను కొలతలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. -
తహసిల్దార్ వనజాక్షిదే తప్పన్న ఏపీ కేబినెట్
-
తహశీల్దార్ x సీడీపీఓ
మహబూబ్‌నగర్(నవాబుపేట): ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు సంధించారు. ఒకరికొకరు సూచనలు చేశారు. మీరు పనితీరు మార్చుకోవాలని సూచిస్తే.. మీరే మార్చుకుని నడుచుకోవాలని మరొకరు..! ఇలా తహశీల్దార్, సీడీపీఓల మధ్య మాటలయుద్ధం సాగింది. ఇందుకు మంగళవారం మండలంలోని కారూర్లో జరిగిన పల్లెవికాసం కార్యక్రమం వేదికైంది. మొదట తహశీల్దార్ చెన్నకిష్టప్ప స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పౌష్టికాహారం పక్కదారిపడుతోందని, మీపై ఫిర్యాదులు వస్తున్నాయని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని సీడీపీఓ బాలమణిని హెచ్చరించారు. దీంతో స్పందించిన ఆమె.. మీరూ ఓ ప్రభుత్వ అధికారే కదా! కిందిస్థాయిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. అందరిశాఖల్లో లొసుగులు మామూలే కదా అని బదులిచ్చారు. ఇద్దరి మధ్య నడిచిన ఈ తతంగాన్ని అక్కడే ఉన్న మిగతా అధికారులు, గ్రామస్తులంతా చూస్తుండి పోయారు. -
ఎమ్మార్వోపై దాడిని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పట్ల మహిళా కమిషన్ గర్హం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు దాడి ఘటనపై నాలుగు వారాల్లోగా సంపూర్ణ నివేదికను అందజేయాల్సిందిగా జిల్లా ఎస్సీకి శనివారం ఆదేశాలు జారీచేసింది. -
మరో మహిళా తహశీల్దార్‌పై దాడికి యత్నం
-
ఆయనకలా.. ఈయనకిలా..
హైదరాబాద్ : ఇద్దరూ ప్రజాప్రతినిధులు...వేర్వేరు జిల్లాలు..ఒకరిపైన పోలీసులను దూషించారని ఆరోపణ.. వెనువెంటనే అరెస్ట్.. రిమాండ్.. జైలుకు తరలింపు... ఆరోగ్యం బాగాలేదని నిమ్స్‌కు తరలించమంటే.. మీనమేషాలు.. వైద్యబృందంతో పరీక్షలు..చివరకి బెయిల్ వచ్చే వరకు తాత్సారం మరొకరు.. అదేస్ధాయి ప్రజాప్రతినిధి...ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై బూతుల దండకం అందుకొని దాడి చేసి... బెదిరింపులు.. ఒక్క ఎమ్మార్వోనే కాదు.. మిగతా రెవెన్యూ సిబ్బందిపై దాడి... పోలీసులు వచ్చి దాడి చేసిన వారిని బుజ్జగించి పంపేశారు.. దాడి విషయం బయటకు పొక్కి రభస జరుగుతుంటే అప్పుడు పోలీసులు అప్రమత్తమై ఇలా కేసులు బుక్ చేసి అలా వదిలేశారు. మొదటిది కర్నూలు జిల్లా.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, తన కూతురు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పట్ల పోలీసులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నందుకు అడ్డు పడితే ఆగమేఘాలపై కేసు ..అరెస్ట్... రెండవది పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ అంశం. కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేట ఇసుక రేవులో బుధవారం ... ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఇసుక తవ్వకం జరుపుతున్నారు. ఆ విషయం తెలిసి స్థానిక ఎమ్మార్వో వనజాక్షి... తన సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి వెళ్లారు. ఇదేం పని అని ప్రశ్నించిన ఆమెపై ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరణగణం దాడి చేసింది. దీనిపై బుధవారం మధ్యాహ్నం...రెవెన్యూ ఉద్యోగులు సమ్మెబాట పట్టినా, జిల్లా కలెక్టర్‌తో మొరపెట్టుకున్నా పోలీసుల నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. సరికదా డ్వాక్రా మహిళల ఫిర్యాదుతో బాధిత ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమ గోదావరి జిల్లాలో ఎదురు కేసు పెట్టారు. ఒకవైపు ఇంత హడావిడి జరుగుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే తాపీగా విలేకరుల సమావేశం పెట్టి వనజాక్షి వ్యక్తిగత విషయాల పట్ల అసభ్యంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ' ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేస్తాం.. ఆత్మహత్య మినహా మరో మార్గంలేదు ' అని వనజాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి సంఘటనలు చూస్తోంటే.. ప్రభుత్వ మహిళా అధికారులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల మాటేమిటీ అనే ప్రశ్నకు జవాబు మాత్రం దొరకదు. సోమవారం వరకు ప్రభాకర్‌పై చర్య తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అంటే పోలీసులకి సోమవారం వరకు వెసులు బాటు ఉందన్నమాట...చేసింది తప్పుకానే కాదని ఎమ్మెల్యే ప్రభాకర్ ధైర్యంగా ఉన్నట్టున్నారు. తన అనుయాయులతో రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా పోటీ ధర్నాలు చేయిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై చింతమనేని యూత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఇసుక అమ్ముకునే హక్కు కల్పించిన నాయకుడి పట్ల ఆ మాత్రం స్వామి భక్తి లేకపోతే ఎలా...అందుకే ఇసుకాసురులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఏ చిన్న విషయంపైన అయినా ఒంటి కాలిమీద లేచి నానా యాగి చేసే అధికారపార్టీ నాయకులు మాత్రం..ఈ విషయం పై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. 'బాస్ జపాన్ నుంచి వచ్చిన తర్వాతే చర్యలుంటాయి' అని లీకులు మాత్రం ఇస్తున్నారు. చర్యలంటే ప్రభాకర్‌ను అరెస్ట్ చేస్తారని ఆశపడటం తప్పేమో.. బహుశా ఎమ్మెల్యేకు ఎదురు తిరిగినందుకు వనజాక్షిని ఏదో ఒక లూప్ లైన్ పోస్ట్‌కి బదిలీ చేస్తారేమో.. -
దోచుకోవడం..దాచుకోవడమే..
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తోందన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుడి నుంచి మొదలుకొని సీఎం చంద్రబాబు వరకు దోచుకోవడం..దాచుకోవడమే సింగిల్ ఎజెండా గా పెట్టుకున్నారన్నారు. వారు చేసే పనికి ఎవరు అడ్డొచ్చినా ఖాతరు చేయడంలేదన్నారు. తాజాగా దెందులూరులో మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే ఈ విధంగానే ఉన్నారని విమర్శించారు. అవినీతి, దౌర్జన్యాలపై ఆదేశాలు జారీ చేస్తే ప్రభుత్వ అధికారులకు తలనొప్పి ఉండదన్నారు. ఏపీ కి ప్రత్యేక హోదాపై ప్రశ్నించే హక్కు పవన్‌కే కాదు ఎవరికైనా ఉందని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ కు మాజీ ఎంపీ అనంతవెంకటరెడ్డి పేరును తొలగించడం దారుణమన్నారు.ఈ నెల 24 న కాంగ్రె స్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురంలో పర్యటిస్తారని తెలియజేశారు. -
ఏసీబీ వలలో జీలుగుమిల్లి తహశీల్దార్
జీలుగుమిల్లి : లంచం తీసుకుంటూ పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి తహశీల్దార్ బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు దొరికారు. మండలానికి చెందిన ఒక రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేసేందుకు తహశీల్దార్ జి.సాంబశివరావు రూ.10వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం తహశీల్దారుకు పైకం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీ వలలో గుట్ట తహసీల్ధార్!
-
సస్పెండ్ అయినా తీరు మారలేదు
నల్లగొండ : ఆరోపణలు ఎదుర్కొని సస్పెండైనా ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారడంలేదు. నిబంధనలను మీరి విధులు నిర్వర్తించడమే కాకుండా, లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడో తహశీల్దార్. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట తహశీల్దార్ సోమ్లా నాయక్ రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. వివరాలు.. యాదగిరిగుట్ట తహశీల్దార్ సోమ్లానాయక్ ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొని వారం క్రితం సస్పెండ్ అయ్యారు. అయినా నింబంధనలను మీరి ఇంటిలో విధులు నిర్వర్తిస్తూ సదరు తహశీల్దార్ ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేశాడు. భూమి వాల్యువేషన్ పత్రాలను ఇవ్వాలని కోరిన మండలంలోని కాసారం గ్రామానికి చెందిన రైతు మల్లేష్ ను రూ. 25 వేలు అడిగాడు.దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సోమ్లానాయక్ రైతు వద్ద నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. (యాదగిరిగుట్ట) -
అనారోగ్యంతో తహశీల్దార్ మృతి
బాడంగి : అనారోగ్యంతో బాడంగి మండల తహశీల్దార్ రఘురామ్ సోమవారం మృతి చెందారు. వివరాలు.. విజయనగరం జిల్లా బాడంగి మండల తహశీల్దార్ రఘురామ్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అతను ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న రఘరామ్ సోమవారం మృతి చెందారు. -
ఎమ్మార్వోపై దాడి కేసులో ఒకరు అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ అమీర్‌పేట ఎమ్మార్వో వెంకటేశ్వర్లుపై దాడి చేసిన కేసులో ఒకరిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలంలో 'ఫ్లాట్ ఫర్ సేల్' అని బోర్డు పెట్టి అమ్మకానికి పెట్టాడు. అది తెలిసిన ఎమ్మార్వో ఆ బోర్డును తీసేయించారు. దాంతో ఆ వ్యక్తి ఆ స్థలం తనదేనని ఎమ్మార్వోతో గొడవపడి దాడికి దిగాడు. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు పోలీసులు హుస్సేన్ని శనివారం అరెస్ట్ చేశారు. -
డీలర్తోనే డీల్!
♦ నోటిమాటతో కార్డుల జారీ ♦ పట్టించుకోని అధికార యంత్రాంగం ‘ఇంట్లో నేనొక్కదాన్నే. గతంలో తెల్లాకార్డు ఉండేది. మూన్నెళ్లాయె కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసి. ఆఫీసు చుట్టు తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకుంటలేరు’ ఇదీ లష్కర్ సింగారానికి చెందిన భాగ్యమ్మ ఆవేదన. సాక్షి, హన్మకొండ : ‘నాకు కొత్త కార్డు మంజురు కాలేదని రేషన్ షాపుల బియ్యం ఇస్తలేరు. ఎమ్మార్వో కాడికి పోయి కార్డు తెచ్చుకోమని చెప్పిళ్లు. మూడునెలల నుంచి తిరుగుతున్నా పనైతలేదు. ఆటోలకే డబ్బులు అయితన్నై. పాతకార్డు మీదనన్న బియ్యం ఇస్తే బాగుండేది’ ఇదీ జహహర్నగర్కు చెందిన గుగులోతు మరియ ఆక్రందన. ఇలాంటి వారికి లేనది అర్హత కాదు.. రేషన్ డీలర్ల అనుగ్రహం! అవును.. రేషన్‌కార్డుల జారీలో డీలర్లు చక్రం తిప్పుతున్నారు. రేషన్ డీలర్లను కాదని.. నిబంధనలు అన్ని పాటించినా కార్డు సంపాదించడం గగనమవుతోంది. కూలీనాలీ చే సి పొట్టపోసుకునే పేదలు అటు పనులుకు వెళ్లలేక ఇటు ఆఫీసుల్లో పని కాక తిప్పలు పడుతున్నారు. కొత్త రేషన్ కార్డు జారీలో పేదరికం, కుటుంబ వార్షిక ఆదాయం అర్హతగా కాకుండా తమకు నచ్చిన, తమను మెప్పించిన రేషన్ డీలర్ పరిధిలోకి వస్తాడా ? రాడా ? అనేదే పట్టించుకుంటున్నారు. సదరు దరఖాస్తుదారుడి ప్రాంతానికి చెందిన రేషన్డీలర్తో ‘డీల్’ కుదిరేదాక కార్డులు జారీకి మొరారుుస్తున్నారుు. ఫలితంగా.. దరఖాస్తుల్లో మూడొంతుల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. స్వయంగా దరఖాస్తు చేసుకున్నవారికి, వీఆర్వోలు ప్ర తిపాదించిన వారికి తక్కువ మొత్తంలో అంత్యోదయ కార్డు లు అందగా... డీలర్లు ప్రతిపాదించిన పేర్లలో 95 శాతం మందికి అంత్యోదయ కార్డులు జారీ అయ్యాయని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
నేడు ఎమ్మార్వో కార్యాలయాల బంద్
హైదరాబాద్: హైదరాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయాలు గురువారం బోసిపోనున్నాయి. బహదుర్ పురా ఎమ్మార్వోపై ఎంఐఎం కార్యకర్తల దాడికి నిరసనగా ఎంఆర్వోల సంఘం గురువారం హైదరాబాద్ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో నగరంలోని 16 మండల కార్యాలయాల్లో విధులకు ఆటంకం ఏర్పడనుంది. అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్వోలు ధర్నా నిర్వహించనున్నారు. -
తహసీల్దార్, వీఆర్ఓల సస్పెన్షన్
నిజామాబాద్ : రైతులకు నకిలీ పాసుపుస్తకాలను జారీ చేసినందుకు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తహసీల్దార్ వీణ, నల్లవెల్లి వీఆర్ఓ శ్రీనివాస్‌లపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో చనిపోయిన రైతుల పాసుపుస్తకాలలో ఉన్న ఫోటోలను మార్చి ఇద్దరికి కొత్తగా పాసుపుస్తకాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆర్డీఓ విచారణ చేపట్టారు. దీంతో నకిలీ పాసు పుస్తకాల విషయం వెలుగులోకి వచ్చింది. (ధర్పల్లి) -
నేను డ్రైవర్‌ను కాను VRAను..!