బేతంచర్ల : బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన ఓ ఎమ్మార్వో కు జరిమానా విధిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన ఎన్.రాధమ్మ...తహశీల్దార్ రామకృష్ణుడు వేధింపులపై హైకోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 688, 528బీలలో 4.2 ఎకరాల భూమికి రాధమ్మ యజమానురాలు.
అయితే ఈ భూమితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమంగా సాగు చేస్తోందంటూ తహశీల్దార్ వేధింపులకు దిగడంతోపాటు కేసు పెట్టించారు. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తహశీల్దార్ రామకృష్ణుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ రూ.10 వేలు జరిమానా విధించింది.