Rs.10 thousand
-
ఏజెన్సీ సర్టిఫికెట్‌కు రూ. 10 వేలు ?
ఉపాధ్యాయులకు ఏజెన్సీ సర్టిఫికెట్ల గుబులు ఏటూరునాగారం : ఏజెన్సీలో ఉపాధ్యాయుల పోస్టు పొందాలంటే ఏజెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయ పోస్టులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో కొంత మంది నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లను పొందారని తెలుస్తోంది. ఐటీడీఏలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేలు చొప్పున వసూలు చేసి నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లను తయారు చేసి అభ్యర్థులకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల గిరిజన సంక్షేమశాఖ విభాగంలో కలకలం రేపిన తప్పుడు నిబంధనల ఉపాధ్యాయుల నియామకం విషయంలో కూడా ఏజెన్సీ సర్టిఫికెట్లు నకిలీవి ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీల సరిఫికెట్లుగా గుర్తించే డీఎల్సీ కమిటీ డీఎస్సీ- 2013 ఎంపిక జాబితాను రద్దు చేసింది. అయితే కొంత మంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫికేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగంలో డీటీల ద్వారా చేయించారు. వెరిఫికేషన్ చేయించి ఇవి నకిలీలు కావని, అసలు సర్టిఫికెట్లే అని ధ్రువీకరించి గిరిజన సంక్షేమశాఖకు అందజేశారు. ఒక్కసారి ఒక అభ్యర్థి సర్టిఫికెట్ డుప్లికేట్ అని తేలిన తర్వాత అతడు ఏజెన్సీవాసుడే అని ఏజెన్సీ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం బాధాకరం. ఇలా తప్పుడు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన వ్యక్తులు, ఇందుకు సహకరించిన ఉద్యోగస్తులపై కూడా చర్యలు చేపట్టాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలి ఆగబోయిన రవి, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి. గిరిజన సంక్షేమశాఖలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలి. నకిలీ సర్టిఫికెట్లను జారీ చేసిన వ్యక్తులపై కూడా చర్యలు చేపట్టాలి. -

తహశీల్దార్‌కు రూ.10 వేల జరిమానా
బేతంచర్ల : బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన ఓ ఎమ్మార్వో కు జరిమానా విధిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన ఎన్.రాధమ్మ...తహశీల్దార్ రామకృష్ణుడు వేధింపులపై హైకోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 688, 528బీలలో 4.2 ఎకరాల భూమికి రాధమ్మ యజమానురాలు. అయితే ఈ భూమితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమంగా సాగు చేస్తోందంటూ తహశీల్దార్ వేధింపులకు దిగడంతోపాటు కేసు పెట్టించారు. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తహశీల్దార్ రామకృష్ణుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ రూ.10 వేలు జరిమానా విధించింది. -
హీరో బాలకృష్ణకు రూ.10 వేల జరిమానా
-
హీరో బాలకృష్ణకు రూ.10 వేల జరిమానా
అనుమతి లేకుండా బోర్ వేసినందుకు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణకు రెవెన్యూ అధికారులు శనివారం రూ.10 వేల జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని బాలకృష్ణ ఇటీవల బోర్ వేయించారు. అయితే బోర్ వేయించే క్రమంలో ముందస్తుగా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ విషయాన్ని బాలకృష్ణ విస్మరించినట్లు ఉన్నారు. అనుమతి లేకుండా హీరో బాలకృష్ణ బోర్ వేయించినట్లు స్థానికులు కొంతమంది రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. అనుమతి లేకుండా బోర్ వేయించినట్లు అధికారుల విచారణలో తెలింది. దాంతో హీరో బాలకృష్ణకు అధికారులు రూ. 10 వేల జరిమానా విధించారు.