
హీరో బాలకృష్ణకు రూ.10 వేల జరిమానా
అనుమతి లేకుండా బోర్ వేసినందుకు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణకు రెవెన్యూ అధికారులు శనివారం రూ.10 వేల జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని బాలకృష్ణ ఇటీవల బోర్ వేయించారు. అయితే బోర్ వేయించే క్రమంలో ముందస్తుగా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ విషయాన్ని బాలకృష్ణ విస్మరించినట్లు ఉన్నారు.
అనుమతి లేకుండా హీరో బాలకృష్ణ బోర్ వేయించినట్లు స్థానికులు కొంతమంది రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. అనుమతి లేకుండా బోర్ వేయించినట్లు అధికారుల విచారణలో తెలింది. దాంతో హీరో బాలకృష్ణకు అధికారులు రూ. 10 వేల జరిమానా విధించారు.