
ఇటీవల సంగీత దర్శకుడు తమన్‌కి హీరో బాలకృష్ణ(Balakrishna ) ఓ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ధర దాదాపు కోటీన్నర వరకు ఉంటుంది. బాలయ్య నుంచి అంతపెద్ద బహుమతి రావడం తమన్‌తో పాటు టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా బహుమతిగానే ఇచ్చాడా? లేదంటే దీని వెనుక ఏదైనా మతలబు ఉందా? అని నెటిజన్స్ చర్చిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తమన్ ఫ్రీగా ఫండ్ రైజింగ్ ప్రొగ్రాం చేశాడు. దానికి ప్రతిఫలంగా బాలయ్య ఈ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు కూడా నెట్టింట వినిపించాయి.
(చదవండి: సినీతారలకు ముద్దులూ, రొమాన్స్ నేర్పేది వీరే...)
అయితే ఇక్కడ వాస్తవం ఏంటనేది ఎవరికీ తెలియదు. గిఫ్ట్‌గా ఇచ్చానని బాలయ్య చెప్పడం..అభిమానంతో ఇచ్చాడని తమన్ మురిసిపోవడం మాత్రమే అందరికి తెలుసు. అయితే టాలీవుడ్‌లో ఇలా ఒకరు మరొకరి గిఫ్ట్ ఇచ్చారంటే.. ఏదో ఆశించి ఇచ్చినట్టేననే టాక్ అయితే ఉంది. అది సినమాల పరంగానా లేదా పర్సనల్‌గానా అనేది తెలియదు కానీ బహుమతి వెనుక బహుళ ప్రయోజనాలే ఉంటాయి.
ఇటీవల బాలయ్య నటించిన చిత్రాలన్నింటికి తమనే సంగీతం అందిస్తున్నాడు. ‘డిక్టేటర్’, ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ ‘డాకు మహారాజ్’ ఇవన్నీ మ్యూజిక్ పరంగా మంచి విజయం సాధించాయి. అందుకే తమన్ బాలయ్యకు క్లోజ్ అయ్యాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’(Akhanda 2 Movie) కి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు.
అయితే బాలయ్య కెరీర్‌కి బిగ్గెస్ట్ విజయాలు అందించిన బోయపాటిని కాదని తమన్‌కు బహుమతి ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గిఫ్ట్‌కి అఖండ 2 నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట డబ్బులు ఇచ్చారట. తన రెమ్యునరేషన్‌లో డబ్బులు కట్ చేసి కారు కొనివ్వమని బాలయ్య చెప్పడంతో నిర్మాతలు ఆ పని చేశారట.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆఖండ 2కి బాలయ్య అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. రూ.35 కోట్ల వరకు పారితోషికంగా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా వాయిదాల ప్రకారం బాలయ్య చేతికి చేరుతుంది. డాకు మహారాజ్‌కి రూ.28 కోట్లు తీసుకున్న బాలయ్య..తదుపరి చిత్రానికి ఏకంగా 7 కోట్లను పెంచేశాడు. అయితే ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే మాత్రం బాలయ్య తీసుకునేది తక్కువే అని ఇండస్ట్రీ టాక్.
Comments
Please login to add a commentAdd a comment