బాలకృష్ణ కెరీర్‌లో 'అఖండ' ఓ టర్నింగ్ పాయింట్. లాక్‌డౌన్ టైంలో అసలు సీజన్ కాని డిసెంబరులో రిలీజైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అప్పట్లోనే ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం అధికారికంగా అనౌన్స్ చేశారు. 'అఖండ 2' అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు.
(ఇదీ చదవండి: Bigg Boss 8: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)
తొలి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ రెండో భాగం మొదలవుతుంది. పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. 'స్కంద' డిజాస్టర్ తర్వాత బయట కనిపించని బోయపాటి.. గత కొన్నాళ్లుగా దీని స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అది పూర్తి చేయడంతో అధికారికంగా ప్రకటించారు. బుధవారం పూజాతో మూవీ లాంచ్ చేయనున్నారు.
ప్రస్తుతం డైరెక్టర్ బాబీ మూవీతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. దీని షూటింగ్ డిసెంబరుకి పూర్తవుతుంది. దీని తర్వాతే 'అఖండ 2' షూటింగ్‌లో బాలకృష్ణ పాల్గొంటారు. సీక్వెల్‌కి తమన్ సంగీతమందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మిగతా విషయాల్ని త్వరలో వెల్లడిస్తారు. పాన్ ఇండియా మూవీగా ఇది రాబోతుంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!)
Comments
Please login to add a commentAdd a comment