Boyapati Seenu
-
'అఖండ 2' సినిమాపై ప్రకటన.. పోస్టర్ రిలీజ్
బాలకృష్ణ కెరీర్లో 'అఖండ' ఓ టర్నింగ్ పాయింట్. లాక్డౌన్ టైంలో అసలు సీజన్ కాని డిసెంబరులో రిలీజైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అప్పట్లోనే ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం అధికారికంగా అనౌన్స్ చేశారు. 'అఖండ 2' అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)తొలి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ రెండో భాగం మొదలవుతుంది. పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. 'స్కంద' డిజాస్టర్ తర్వాత బయట కనిపించని బోయపాటి.. గత కొన్నాళ్లుగా దీని స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అది పూర్తి చేయడంతో అధికారికంగా ప్రకటించారు. బుధవారం పూజాతో మూవీ లాంచ్ చేయనున్నారు.ప్రస్తుతం డైరెక్టర్ బాబీ మూవీతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. దీని షూటింగ్ డిసెంబరుకి పూర్తవుతుంది. దీని తర్వాతే 'అఖండ 2' షూటింగ్లో బాలకృష్ణ పాల్గొంటారు. సీక్వెల్‌కి తమన్ సంగీతమందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మిగతా విషయాల్ని త్వరలో వెల్లడిస్తారు. పాన్ ఇండియా మూవీగా ఇది రాబోతుంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!) -
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.. రామ్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'స్కంద' హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- ఆట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' నెట్‌ఫ్లిక్స్‌లో రన్ అవుతుంది. ఈ రెండు చిత్రాలను థియేటర్‌కు వెళ్లి చూడని వారు ఈ వీకెండ్లో ఇంట్లోనే కూర్చోని చూసి ఎంజాయ్ చేయవచ్చు. జవాన్- నెట్‌ఫ్లెక్స్ బాలీవుడ్ కలెక్షన్స్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. నేడు నవంబర్ 2 షారుక్ పుట్టినరోజు సందర్భంగా 'జవాన్'ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' సుమారు రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్,విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఏ మాత్రం తగ్గకుండా మెప్పించారు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెట్‌ఫ్లెక్స్‌లో చూడొచ్చు. స్కంద- హాట్‌స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మొదటిరోజు నంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. తాజాగా హాట్‌స్టార్ ఓటీటీలో 'స్కంద' ఎంట్రీ ఇచ్చేసింది. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వర్సెన్ కూడా ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే కలిగింది. థియేటర్లలో మెప్పించలేకపోయిన స్కంద.. ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
క్లైమాక్స్ కాదు.. క్లై‘మ్యాక్స్’
భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను హీరో రామ్ కంప్లీట్ చేశారు. హీరో రామ్, దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్లో ఓ యాక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీ లీల హీరోయిన్. ఇటీవల మొదలైన ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది. ‘‘24 రోజుల చిత్రీకరణతో ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయింది. ఇది క్లైమాక్స్ కాదు.. క్లైమ్యాక్స్’’ అని ట్వీట్ చేశారు రామ్. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే. -
మళ్లీ ప్రారంభంకానున్న అఖండ జాతర..
నందమూరి నటసింహం బాలకృష్ణ మాసీవ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన చిత్రం 'అఖండ'. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గతేడాది విడుదలై అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. ఒకరకంగా చెప్పాలంటే థియేటర్లలో అఖండ జాతర జరిగింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో రిలీజై అక్కడ కూడా 'బోత్ ఆర్ సేమ్' అన్న రేంజ్లో వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పుడు ఆ జోరును కోలీవుడ్‌లో చూపెట్టనుంది అఖండ. ఈ యాక్షన్ డ్రామా చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబైంది. జనవరి 28న ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్దగా ఏ సినిమా రిలీజ్లు లేకపోవడంతో ఈ సూపర్ హిట్ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనుందని టాక్. -
‘చిట్టిబాబు’ ఎక్కడున్నాడు?
చిట్టిబాబు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత త్వరగా ఆ పాత్రను మరిచిపోలేము. ఆ పాత్రకు ప్రాణం పోసిన రామ్‌చరణ్‌ను మరిచిపోలేము. చిట్టిబాబు పాత్రలో చెర్రీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విదేశాల్లో, హైదరాబాద్‌లో రెండు షెడ్యుల్స్ కంప్లీట్ చేసిన చెర్రీ.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. రామ్‌చరణ్‌కు సంబంధించిన విషయాలను ఆయన సతీమణి ఉపాసన అప్డేట్స్ ఇస్తుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చెర్రీ ఫోటోను షేర్ చేశారు ఉపాసన. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో మాత్రం చెప్పలేదు. -
క్లా..క్లా.. క్లాస్ మ..మ..మాస్
మాస్ ప్రేక్షకులను ఎలా అలరించాలో.. క్లాస్ హీరోలను మాస్కు ఏ విధంగా దగ్గర చేయాలో తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ‘భద్ర‘ నుంచి ‘సరైనోడు‘ వరకూ హీరోలతో పాటు వాళ్ల పాత్రలను బోయపాటి చూపించిన విధానమే అందుకు నిదర్శనం. ఇప్పటి వరకూ చేసిన రెండు చిత్రాల్లో దాదాపు క్లాస్‌గానే కనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్‌ను తాజా చిత్రంలో అందుకు భిన్నంగా చూపించనున్నారు బోయపాటి. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా లుక్‌ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హీరో పాత్ర క్లాస్ ఆడియన్స్‌కి, మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఇది ఫీల్ గుడ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. హైదరాబాద్, వైజాగ్‌లలో జరిపిన షెడ్యూల్‌తో 20 శాతం పూర్తయింది. ఈ షెడ్యూల్లో శ్రీనివాస్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, జగపతిబాబు, శరత్ కుమార్, ధన్యా బాలకృష్ణ పాల్గొన్నారు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాత మేం నిర్మిస్తోన్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ. -
శ్రీను సెంటిమెంట్‌తో...
చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ. దర్శకుడు బోయపాటి శ్రీనుకీ ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ప్రతి సినిమా మొదటి రోజు సన్నివేశాన్ని హైదరాబాద్, గచ్చిబౌలిలోని వనదేవత గుడిలో చిత్రీకరిస్తారు. ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ.. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ జంటగా ఆయన దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణను ఆదివారం వనదేవత గుడిలో ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో, డిసెంబర్ 3 నుంచి 45 రోజుల పాటు విశాఖలో చిత్రీకరణ చేసి, ఫిబ్రవరిలో కీలక సీన్లు, పాటలు తీయడానికి బ్యాంకాక్ వెళ్లనున్నారు. -
11వ తేదీ సాయంత్రం నుంచే పుష్కర సందడి
రాష్ట్రంలో కృష్ణా పుష్కరాల హడావుడి ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచే ఆరంభం కానుంది. 12వ తేదీ తెల్లవారుజాము నుంచి పుష్కరాలు ప్రారంభమవుతుండగా.. ముందురోజు సూర్యాస్తమయం తర్వాత ఇబ్రహీంపట్నం వద్ద ఏర్పాటు చేసిన ఫెర్రీ ఘాట్‌లో పుష్కర ఆరంభ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మొదలపెట్టబోతోంది. ఈ ఆరంభ వేడుకల్లోనే కృష్ణానదికి నిత్యహారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పోలవరం కాల్వల ద్వారా గోదావరి జలాలు కృష్ణలో కలిసే ప్రాంతానికి కాస్త ఎగువ వైపు కొత్తగా నిర్మిస్తున్న ఫెర్రీ ఘాట్ వద్ద ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆరంభవేడుకల్ని అట్టహాసంగా నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు సూచన మేరకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను నేతృత్వంలో ఫెర్రీ ఘాట్ వద్ద భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆరంభ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి చేరుకోగానే వెయ్యి మంది కళాకారులు ఆయనకు స్వాగతం పలికేలా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో లక్ష విద్యుత్ బల్బులను అమర్చబోతున్నారు. ఇందుకోసం 400 మెగావాట్ల జనరేటర్లను ఏర్పాటు చేయనున్నారు. రాత్రంతా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశారు. కృష్ణా నదికి హారతి ఇచ్చేందుకు ఘాట్ వద్ద నది ఒడ్డు ప్రాంతంలో రెండు ప్రత్యేక బోట్లు కలగలిపి దానిపై భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా హారతి కోసం ప్రత్యేకంగా ఒక పాటను రూపొందించారు. తూర్పు నుంచి ఈశాన్యం కృష్ణా నదికి హారతిని తూర్పు వైపున చూపడం మొదలుపెట్టి చుట్టూ చూపుతూ ఈశాన్యం ప్రాంతంలో ముగిసేలా ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై హారతి మొదలయ్యే తూర్పు ప్రాంతంలో సంగమ ప్రాంతం ఉంటుంది. హారతిని చివరగా చూపే ఈశాన్య ప్రాంతంలో వేలాది మంది భక్తులు కూర్చునే ఏర్పాట్లు ఉన్నాయి. రూ. 48 లక్షలతో నమూనా ఆలయం కృష్ణా ఫుష్కరాలు జరిగే 12 రోజుల పాటు హారతి, సంగమ ఘాట్ వద్ద స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆ ప్రాంతంలో రూ. 48 లక్షల ఖర్చుతో ప్రత్యేక నమూనా ఆలయాన్ని నిర్మిస్తోంది. నమూనా ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మ గుడితో పాటు మొత్తం 8 చిన్న ఆలయాలు ఉంటాయి. -
లిఫ్టులో చిక్కుకుపోయిన అల్లు అర్జున్
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించేందుకు వచ్చిన సినీ నటుడు అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను కాసేపు లిఫ్టులో చిక్కుకుపోయారు. సరైనోడు సినిమా విజయవంతం కావడంతో శుక్రవారం సింహాచలం వచ్చిన అల్లు అర్జున్, బోయపాటి శ్రీను స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు అల్లు అర్జున్‌ని చుట్టుముట్టారు. దర్శనానంతరం ఆలయంలోంచి బయటకి వచ్చేటప్పుడు రాజగోపురం వద్ద ఉన్న లిఫ్టులో అల్లు అర్జున్, బోయపాటి పది నిమిషాలపాటు చిక్కుకుపోయారు. వారితోపాటు పరిమితికి మించి జనం ఎక్కడంతో లిఫ్టు ఆగిపోయి, తలుపులు తెరచుకోక కలకలం రేగింది. సెక్యూరిటీ సిబ్బంది లిఫ్టు తలుపులు వంచి అల్లు అర్జున్‌ని పంపించారు. లిఫ్టు మరమ్మతులకు అయ్యే ఖర్చుని తాము భరిస్తామని వారి వెంట వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ సత్యనారాయణ దేవస్థానం అధికారులకు తెలియజేశారు. -
మళ్లీ విలన్‌గా చేస్తా..!
‘‘ఇప్పటివరకూ నేను హీరోగానే చేస్తూ వచ్చాను. బోయపాటి శ్రీను కథ చెప్పగానే కొత్తగా అనిపించింది. అందుకే విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నా’’ అని హీరో ఆది పినిశెట్టి అన్నారు. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’లో ఆది విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. శనివారం పాత్రికేయులతో ఆది మాట్లాడుతూ - ‘‘ఇందులో వైరం ధనుష్ పాత్రను నేను ఊహించినదాని కన్నా తెర మీద బోయపాటి శ్రీను బాగా తీర్చిదిద్దారు. జస్ట్ ఆయన చెప్పినది ఫాలో అయిపోయానంతే. తమిళనాడులో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను చేసిన పాత్ర బన్నీకి కూడా బాగా నచ్చేసింది. అందుకే వేరే భాషలో రీమేక్ చేస్తే తానే హీరోగా చేస్తానని చెప్పాడు. ఈ సినిమా చూసి, చిరంజీవిగారు, వీవీ వినాయక్‌గారు ఫోన్ చేసి నా లుక్, స్టయిల్‌ను మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు వస్తే విలన్‌గా చేయడానికి వెనకాడను. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నేను హీరోగా రెండు చిత్రాలు రూపొందనున్నాయి. త్వరలో ఓ ఇంటి వాణ్ణి కాబోతున్నా. అమ్మా, నాన్నలు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నా’’ అన్నారు. -
వైజాగ్‌లో వైభవంగా...
సెలైంట్ గా ‘సరైనోడు’ పాటలు మార్కెట్లోకి వచ్చేశాయ్. కానీ, అభిమానులే వేడుక చేసి ఉంటే బాగుండేదని అనుకున్నారు. ఆ కొరతను తీర్చేయనుంది ‘సరైనోడు’ చిత్రబృందం. ఈ నెల 10న అత్యంత భారీ ఎత్తున ఆడియో సెలబ్రేషన్స్ చేయనున్నారు. ఈ వేడుకను విశాఖపట్నంలో చేయడానికి సర్వ సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథెరిన్ త్రెస్సా ముఖ్య తారలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఇక.. వైజాగ్‌లో జరగబోయే వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ వేడుక విశేషాలు తెలియజేయడానికి వైజాగ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ-‘‘కొత్త ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా షూటి ంగ్లు జరగాలని, ఇక్కడ కూడా పరిశ్రమ స్థిరపడాలని కోరకుంటున్నాను. ‘సరైనోడు’ ఫంక్షన్ ఘనంగా వైజాగ్‌లో చేస్తున్నందకు చిత్ర నిర్మాతకు ధన్యవాదాలు. సినిమా షూటింగ్స్‌కు ఇక్కడ సింగిల్ విండో పద్ధతిలో అనుమతి ఇస్తాం’’ అని అన్నారు. ‘‘బన్నీకి వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అతి పెద్ద ఫంక్షన్ ఇది. బన్నీతో పాటు ముగ్గురు హీరోయిన్స్ హాజరు కానున్నారు. ఇంకా ఇతర యూనిట్ సభ్యులు పాల్గొంటారు. చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఈ షోలో పెర్ఫార్మ్ చేయనున్నాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. -
బోయపాటి యాక్షన్... బన్నీ వినోదం...
కథానాయకుడు అల్లు అర్జున్ కొత్త సినిమా పనులు వేగం పుంజుకున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు వారి అబ్బాయి నటించే ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. నిజానికి, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరువాత కాస్తంత విశ్రాంతి తీసుకొని, భార్యాబిడ్డలతో సేద తీరుతున్నారు అల్లు అర్జున్. ఆయన సకుటుంబంగా ఇప్పుడు విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. ఫలితంగా, ఈ లాంఛనప్రాయపు షూటింగ్ ప్రారంభానికి ఈ యువ కథానాయకుడు అందుబాటులో లేరు. అయితే, మంచి ముహూర్తాలు మళ్లీ దగ్గరలో లేకపోవడంతో, హీరో అల్లు అర్జున్ అందుబాటులో లేకపోయినప్పటికీ, చిత్ర యూనిట్ లాంఛనంగా షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ‘‘మరో రెండు రోజుల్లో షెడ్యూల్ ప్లానింగ్, వివరాలు పక్కాగా ఖరారవుతాయి’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బోయపాటి శ్రీను మార్కు ఎమోషనల్ యాక్షన్ సన్నివేశాలు, అల్లు అర్జున్ మార్కు ఎంటర్టైన్మెంట్ కలగలసిన చిత్రంగా ఈ తాజా సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. -
బోళా బాలయ్య గోల తాతయ్య
అమాయకత్వం బాలయ్యకు ఆభరణం. అభిమానుల కోసం ఏదైనా చేయడానికి రెడీ... బోళా శంకరుడిలా! బహుశా ఇంత పర్సనల్... అప్‌ఫ్రంట్ ఇంటర్వ్యూ ఎప్పుడూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాళ్ల నాన్న గారి గురించి... తన గురించి... తన బిడ్డ మోక్షజ్ఞ గురించి... మళ్లీ పుట్టిన నాన్న (మనవడు) గురించి... మనవడిని కవ్వించడానికి ఈల వేసే గోల తాతయ్య గురించి... చాలా ఆత్మీయమైన విషయాలు మనతో పంచుకున్నారు. ఇవాళ్టి సండేలో ‘సింహ’ భాగం బోళా బాలయ్యదే... గోల తాతయ్యదే! ‘లయన్’ చిత్రంలో మీరు చేసిన రెండు పాత్రల్లో గాడ్సేలాంటి పాత్ర చేస్తే మీ అభిమానులు ఫీలవుతారని అనుకోలేదా? బాలకృష్ణ: కొత్తగా ఏదైనా ట్రై చేయకపోతే నాకే బోర్ కొట్టేస్తుంది. ఆ రోజుల్లో మా నాన్నగారు ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. అలాగే, నేను కూడా నటుడిగా అన్నీ ట్రై చేస్తాను... అభిమానులు కోరుకున్న అంశాలు కూడా ఉండేలా చూసుకుంటాను. ‘మీ కోసమే కథ తయారు చేశాం’ అని మీ దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు... మీరెలా రెస్పాండ్ అవుతారు? నా దగ్గరకు వచ్చినప్పుడు ‘ఈ కథ మీకోసమే..’ అని చెబుతుంటారు. (నవ్వుతూ) అప్పుడు నేను ‘కాదు.. దీన్ని వేరే హీరోల దగ్గర కూడా చెప్పారు.. నా కోసం కథ ఉంటే చెప్పండి’ అంటాను. ఎదుటి వ్యక్తి ఎంత నిజాయతీగా వ్యవహరిస్తారనేది గ్రహించేయగలుగుతాను. ఎన్టీఆర్ మంచి కమర్షియల్ మాస్ హీరోగా ఉన్న సమయంలో... ‘గుండమ్మ కథ’లో హీరోయిన్ కోసం ఏకంగా పిండి రుబ్బేశారు.. ‘మనం నటులం.. ఎలాంటి పాత్ర అయినా చేయాలి’ అని మీకెప్పుడైనా చెప్పారా? అసలలాంటి సలహాలు ఎప్పుడూ ఇవ్వలేదు. నా సినిమాలు చూడడం కానీ, ఏ సినిమాలు చేస్తున్నావ్? దాని కథ ఏంటి? అని కానీ ఎప్పుడూ అడగలేదు. ఆయన దర్శకత్వంలో సినిమాలు చేశాను. ఆ అనుభవం నాకు చాలని ఆయన అనుకున్నారేమో. నాన్నగారి దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చేస్తున్నప్పుడు ఓ సన్నివేశంలో శవం లేస్తుంది. ఆ సీన్లో కపాల మోక్షానికి లక్ష్మీ బాంబులు పెట్టారు. వాటిలో ఒక బాంబు సరిగ్గా నా కాలి మీద పడింది. కాలు కాలింది. కానీ, అది బయటపెట్టలేను. యూనిట్లో అందరికీ తెలిసినా సెలైంట్‌గా ఉండిపోయారు. షాట్ ఓకే అన్న తర్వాత నేను కదిలాను. ఆ తర్వాత కూడా నాన్నగారు దాని గురించి పట్టించుకోలేదు. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు? ‘అయ్యో కాలు కాలిందా..’ అని ప్యాకప్ అనీ, ఆస్పత్రికి తీసుకెళ్లమనీ.. ఏదో ఒకటి చెబుతారు కదా. కానీ, నాన్నగారు ‘ఓకే.. తర్వాత షాట్ రెడీ’ అన్నారు. ‘ఏంట్రా ఇది..’ అని చూస్తూ ఉండిపోయాను. మా నాన్నగారు ఎప్పుడూ గారాబం చేయలేదు. కష్టం నుంచి వచ్చే తృప్తి విలువ తెలుస్తూ పెరిగాను. అది ఎన్ని కోట్లిచ్చినా దొరకదు. మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు? ‘ఒరేయ్ నేను ఒక రైతు బిడ్డగా పుట్టాను. వ్యవసాయం చేశాను. పాలు అమ్మాను. సినిమాల్లోకొచ్చాను. పైకొచ్చాను. కానీ, ఇవాళ నీకు కష్టాలు లేవు. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పగానే ఇంటికెళ్లిపోవచ్చు..’ అని నాన్నగారు అనేవారు. అలా కష్టాలేవీ లేవు అన్నారు కదా అని నేను నా బాధ్యతలను అస్సలు విస్మరించలేదు. నా నిర్మాతలు, సినిమాలు, అభిమానుల గురించి ఆలోచిస్తాను. కష్టంలోనే తృప్తి ఉంటుందని నమ్ముతాను. మీ నాన్నగారు ఆచరించే వాటిలో మీరు కూడా ఆచరించే విషయాల గురించి? ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఓ నటుడు ఎంత క్రమశిక్షణగా ఉండాలో ఆయన్ను చూసే నేర్చుకున్నా. నాన్నగారిలా తెల్లవారుజామునే నిద్రలేస్తాను. వ్యాయామం చేస్తాను. అయితే, ఆయనకన్నా పూజలు ఎక్కువగా చేస్తా. ఆయనలానే పట్టుదల ఎక్కువ. మీరు చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవారట.. ఇప్పుడు కూడా ఆడుతుంటారా? అవును. ఫ్రెండ్స్‌తో బాగా ఆడేవాణ్ణి. సినిమాల్లోకొచ్చాక షూటింగ్లో షాట్ గ్యాప్‌లో ఆడుతుంటాను. మీకిష్టమైన క్రీడ అంటే క్రికెటేనా? టేబుల్ టెన్నిస్‌లో డబుల్స్‌లో స్కూల్ చాంపియన్ని. సింగిల్స్‌లో రన్నరప్‌ని. బాస్కెట్ బాల్ టీమ్ కెప్టెన్‌ని. కబడ్డీ టీమ్‌కి కెప్టెన్‌ని. అప్పుడు బాగా లావుగా ఉండేవాణ్ణి. కబడ్డీ ఆటలో ఎంతమందిని అయినా సునాయాసంగా లాగేసేవాణ్ణి (నవ్వుతూ). సినిమాలు, రాజకీయాలు, బసవ తారకం ఆస్పత్రి చైర్మన్ బాధ్యతలు.. ఎక్కువ పనుల కారణంగా విసుగనిపించదా? కరెక్టే. అన్ని సమయాల్లోనూ మూడ్ ఒకే విధంగా ఉండదు. ఎప్పుడైనా నాకు విసుగు అనిపించి, దాన్ని ప్రదర్శించినా నా అభిమానులు కానీ, ఇతరులు కానీ ఫీలవ్వరు. దానిక్కారణం నన్ను పరాయి మనిషిగా కాకుండా తమ మనిషిలా భావించడమే. అదే విధంగా నాక్కూడా వాళ్ల మీద అంతే ప్రేమ ఉంటుంది. మీకు త్వరగా కోపం వస్తుందనీ.. ప్రేమ కూడా అలానే అనీ అంటుంటారు.. అచ్చంగా బోళాశంకరునిలా? (నవ్వుతూ). క్రమశిక్షణ విషయంలో నేను చాలా పట్టుదలగా ఉంటాను. సినిమా పరిశ్రమలో ‘దే ఆర్ ఎట్ మై మెర్సీ’. కానీ, రాజకీయాల విషయంలో. ‘ఐయామ్ ఎట్ దెయిర్ మెర్సీ’. ప్రజలెప్పుడూ ‘మమ్మల్ని అందలాలు ఎక్కించండి’ అని కోరుకోరు. కనీస అవసరాలు తీర్చమని కోరుకుంటారు. అంతే కదా. కోపం, విసుగు... ఏవైనా సరే అప్పుడున్న పరిస్థితి, ఒత్తిడి కారణంగా వచ్చేవే. అవి అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయ్. అంతే. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన మీకు సామాన్యుల కష్టాలు... తెలుసు. నా ఆరో ఏట నేను హైదరాబాద్ వచ్చాను. ఆ సమయంలో రామకృష్ణ థియేటర్ కట్టిస్తున్నారు. అది కట్టినవాళ్లతోనే ఎక్కువగా గడిపేవాళ్లం. వాళ్ల కష్టాలు స్వయంగా చూశాను. నాన్నగారి సినిమా విడుదలైందంటే, ఓ పాతిక రిక్షాల్లో అందరం బయలుదేరేవాళ్లం. మొదటి రిక్షాలో మా పెద్దనాన్న, నేను, అన్నయ్య, ఇంకో అన్నయ్య కూర్చునేవాళ్లం. మిగతా రిక్షాల్లో పని చేసేవాళ్లు వచ్చేవాళ్లు. ఆ విధంగా సామాన్యులతో అనుబంధం ఎక్కువే. షూటింగ్స్‌తో బిజీగా ఉండడంవల్ల మీ నాన్నగారు మీకు గెస్ట్లానే అనిపించేవారేమో? దాదాపు అంతే. మా నాన్నగారు ఇంటికి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేవారు. నాన్న హైదరాబాద్ వస్తున్నారంటే, ‘నాన్నంట.. వస్తున్నారంట..’ అని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేవాళ్లం. కట్ చేస్తే.. ఆయన బయటికొచ్చి ‘ఆ వచ్చారా..’ అంటూ కారు ఎక్కేసేవారు. మమ్మల్ని కారు ఎక్కించుకునేవారు కాదు. ఒకవేళ ఎక్కించుకున్నా, ‘పనులు ఎంతవరకూ వచ్చాయి’ అని వేరేవాళ్లతో డిస్కషన్. నాన్నగారికి తెలియని విషయం లేదు. ఈ ఇంటికి డిజైన్ చేసింది కూడా ఆయనే. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు, నేల మీద ఆయన కర్రతో డిజైన్ గీసేసి, ‘ఇలా కట్టించండి’ అని వెళ్లిపోయారు. ఆ డిజైన్ గాలికి చెదిరిపోకుండా మేమంతా దడిలా నిలబడ్డాం. ఆ తర్వాత ఇంజనీర్ని పిలిపించి, బ్లూ ప్రింట్ తీశాం. నాన్నగారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆచరించే విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరిస్తారు. మీ అమ్మగారి పేరు మీద ఉన్న బసవ తారకం ఆస్పత్రికి వీలైనంత న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారు. అసలు మీ అమ్మగారిలో మీకు నచ్చిన కొన్ని విషయాల గురించి? నా దృష్టిలో మా అమ్మగారు దేవత. నాన్నగారు ఆయన వ్యాపకాల్లో బిజీగా ఉండేవారు. మేం మొత్తం పదమూడు మందిమి. అంతమంది ఆలనా పాలనా చూడటం సులువు కాదు. నాన్నగారి కోసం మద్రాసు వెళ్లడం, మా కోసం హైదరాబాద్ రావడం.. అన్నింటినీ సక్రమంగా చేసేవారు. చివర్లో కాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. అది చాలా బాధ కలిగించింది. ఇప్పుడామె జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న బసవ తారకం కేన్సర్ ఆస్పత్రికి నేను చైర్మన్‌గా ఉండటం ఆనందంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఉచితంగా కూడా చికిత్స చేస్తున్నాం. ఓకే... ఫుడ్ విషయంలో ఏమైనా నియమాలు పాటిస్తారా? ఎలాంటి నిబంధనలూ పెట్టుకోను. హాయిగా అన్నీ తింటాను. అప్పట్లో నాన్నగారు కూడా ఎలాంటి నియమాలు పెట్టుకునేవారు కాదు. డయాబెటిక్ అయిన తర్వాత కూడా ఆయన అరిసెలు తినేవారు. డబ్బాలో దాచుకుని మరీ తినేవారు. ‘ఏంటి నాన్నగారు.. డయాబెటిక్ కదా.. తినకూడదు’ అంటే... ‘కోరికలు చంపుకుని చావడం ఎందుకు? శుభ్రంగా తిని చద్దాం’ అనేవారు. నేనూ అంతే. శుభ్రంగా తింటా. మీ సరసన ఎంతోమంది కథానాయికలు నటించారు కదా.. మీతో కెమిస్ట్రీ బాగా కుదిరిన నలుగురైదుగురి గురించి... బాలకృష్ణ: విజయశాంతి, నేనూ చాలా సినిమాల్లో చేశాం. మాది సక్సెస్ఫుల్ కాంబినేషన్. కెమిస్ట్రీ బాగుంటుంది. ఒక పాట చేస్తుంటే నువ్వా? నేనా? అన్నట్లు పోటాపోటీగా డాన్స్ చేసేవాళ్లం. ఆ తర్వాత రమ్యకృష్ణ, రోజా, సిమ్రాన్, నయనతార.. వీళ్లందరితో కెమిస్ట్రీ కుదిరింది. హీరో వర్షిప్ అనేది సినిమాల్లో కామనే కానీ, నా సినిమాల్లో చేసే హీరోయిన్లకు కూడా మంచి పేరొస్తుంది. మీ మనవడి ముచ్చట్లు తెలుసుకోవాలనుంది.. మా నాన్న మళ్లీ వచ్చారని అన్నారట? (నవ్వుతూ). ఆ సమయంలో కలిగిన ఉద్వేగాన్ని మాటల్లో చెప్పడం కష్టం. జనరల్‌గా మా ఇంట్లో ఎక్కువగా గోల చేసేది నేనే. ఫ్యామిలీ ఫంక్షన్ అంటే కచ్చితంగా నేను ఉండాలని కోరుకుంటారు. ఇంకా బయట ఫంక్షన్స్‌లోనూ నా ప్రెజెన్స్‌ని కోరుకుంటారు. అంత సందడిగా ఉంటా. అందుకే, మా కుటుంబంలో ఉన్న పిల్లలు నాకు ‘గోల తాత’ అని పేరు పెట్టారు. ఇప్పుడు నా మనవడి దగ్గర కూడా గోల చేస్తున్నా. ఆ గోల గురించి? మా మనవడు ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు. ఆడించడానికి ఈలలు వేస్తుంటాను. ఈల వేస్తుంటే కళ్లు అటూ ఇటూ తిప్పుతుంటాడు. అందుకే మా బావగారి (చందబ్రాబునాయుడు) దగ్గర ‘మనవడు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు అయిపోతారు. నాకు తాత కావాలని ఏడుస్తుంటాడు. ఎందుకైనా మంచిది ఈలలేయడం నేర్చుకోండి’ అని అంటుంటాను. మీ అబ్బాయి మోక్షజ్ఞ తాతను మించిన మనవడు కావాలని కోరుకుంటున్నారా? కావాలనే ఉంటుంది. కానీ, అది కష్టమండీ. ఎందుకంటే, అప్పట్లో పౌరాణిక, జానపద... ఇలా ఎన్నో నేపథ్యాలు ఉండేవి. దానివల్ల నాన్నగారి తరం ఎన్నో వైవిధ్యాలు చేయడానికి కుదిరింది. ఇన్ని పాత్రలు చేసే అవకాశం తర్వాతి తరానికి ఉండకపోవచ్చు. మీ నాన్నగారి నటవారసత్వాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించింది మీరే. మీ అబ్బాయీ అది సాధిస్తాడనుకుంటున్నారా? సాధించాలనే అనుకుంటున్నాను. కానీ, ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. ఇప్పుడు పెద్దగా కథలు లేవు. పౌరాణికాలు నా తరంలోనే కంటిన్యూ చేయలేకపోతున్నా. తర్వాతి తరంలో పూర్తిగా కనుమరుగవుతున్నాయ్. ‘శ్రీరామరాజ్యం’ చేశాను. ఇక ముందు నేను కూడా పౌరాణికాలు చేయలేనేమో. మరి.. మీ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘నర్తనశాల’కు ఫుల్స్టాప్ పెట్టేశారా? అవును. ఎందుకంటే, సౌందర్యగారు లేరు. శ్రీహరిగారు లేరు. ఆ పాత్రల్లో ఎవర్నీ ఊహించలేం. అందుకని పూర్తిగా పక్కనపెట్టేశా. ‘సమరసింహారెడ్డి’ తర్వాత ఆల్మోస్ట్ హై ఓల్టేజ్ ఎమోషనల్ మూవీస్‌కే పరిమితమయ్యారు.. పూర్తి స్థాయి కామెడీ మూవీస్ చేయాలని లేదా? ‘సమరసింహారెడ్డి’కి ముందు ‘మంగమ్మగారి మనవడు’, ‘నారీ నారీ నడుమ మురారి’ తరహా లైటర్ వెయిన్ మూవీస్ చేశాను. కానీ, ‘సమరసింహారెడ్డి’ తర్వాత ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సమయంలో పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ అంటే ఆలోచించాలి. వ్యక్తిగతంగా నాకైతే కామెడీ మూవీ చేయాలని ఉంటుంది. సింహాను మించి లెజెండ్, దాన్ని మించి లయన్, దాన్ని మించి తర్వాతి చిత్రం ఉండాలని అభిమానులు కోరుకుంటారు. శ్రీవాస్ దర్శకత్వంలో చేయబోయే ‘డిక్టేటర్’ గురించి? కథ చెప్పాడు. కొన్ని మార్పులు సూచించాను. మీ నూరవ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.. బోయపాటి శ్రీను ఈ చిత్రం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది? బోయపాటి చేసే అవకాశం ఉంది. కథ ఎలా ఉండాలి? సినిమా ఎలా ఉంటుంది? అనే విషయం గురించి ఆలోచించాలి. వేడి వేడిగా వడ్డిస్తాం. విచిత్రం ఏంటంటే... బోయపాటి శ్రీను నాతో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నా హావభావాలను గమనించో, నా మాటలను గమనించో కథ తయారు చేస్తుంటాడు. నా నిజజీవితం నుంచే పాత్రలు తయారు చేసుకుంటాడు. బి.గోపాల్ కూడా మీకు చాలా హిట్స్ ఇచ్చారు కదా.. ఆయన దర్శకత్వంలో ఎందుకు చేయడంలేదు? చేయాలనే ఉంది. ఎప్పుడు కనిపించినా కథ తయారు చేయండి అంటుంటాను. కానీ, కథ కుదరడం లేదు. జీవితాంతం సినిమాలు చేయాలనుకుంటున్నారా? లేక ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నారా? తిన్నా, నిద్రపోయినా.. ఏం చేసినా సినిమా గురించే ఆలోచిస్తాను. సినిమాలు లేకుండా ఉండలేను. హీరోగానే కొనసాగాలనుకుంటున్నారా? అవును. హీరోగానే చేస్తాను. రెండు పాత్రలున్న సినిమాలు ఎలాగూ చేస్తున్నా కదా. అలాంటివి చేస్తా. - డి.జి. భవాని మీ అబ్బాయి మోక్షజ్ఞ రంగప్రవేశం గురించి.. తను నటించే మొదటి సినిమా ఎలా ఉండాలని అనుకుంటున్నారు? 2017లో రంగప్రవేశం జరుగుతుంది. ఇంకా రెండేళ్లు ఉంది కాబట్టి, ఏమీ ఆలోచించడంలేదు. ఇప్పుడు వంట వండితే రెండేళ్లకి చల్లారిపోతుంది. చల్లారిన భోజనం ఎందుకు? వేడివేడిగా ఉండాలి. అందుకే, కథ, దర్శకులు గురించి అప్పుడు ఆలోచిస్తా. మొదటి సినిమా ఎలా ఉండాలని కూడా అనుకోలేదా? వయసుకి తగ్గట్టుగా ఉండాలనుకుంటున్నా. నా కెరీర్ అలానే మొదలైంది. -
శనీశ్వరాలయానికి వస్తే సినిమా హిట్టే..
నర్శింగోలు(జరుగుమల్లి) : సినిమా ప్రారంభించడానికి ముందు శనీశ్వరాలయంలో పూజలు చేస్తే ఆ సినిమా హిట్టవుతుందని తన నమ్మకమని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శీను పేర్కొన్నారు. మండలంలోని నర్శింగోలు రామలింగేశ్వర శనీశ్వరాలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోయపాటి విలేకర్లతో ముచ్చటించారు. సినిమాలపై ఆసక్తి ఎలా కలిగింది ? మొదట్లో నేను ఫోటోగ్రాఫర్‌గా పని చేశా. ఆ ఆసక్తితోనే సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశా. దమ్ము చిత్రం నిరుత్సాహపరిచింది కదా ? లేదు.. నా కెరీర్లో అది ఒక బెస్ట్ సినిమా. మళ్లీ ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు ? మంచి కథ దొరికితే తప్పకుండా సినిమా తీస్తా. రామ్‌చరణ్‌తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు? నా కథకు రామ్‌చరణ్ సరిపోతే తప్పకుండా చేస్తా. బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా ఎప్పుడు మొదలవబోతోంది? నవంబరులో సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. జానపద, పౌరాణిక చిత్రాలేమైనా తీసే ఆలోచన ఉందా? జానపద, పౌరాణిక చిత్రాలు నిర్మించాలంటే భారీ బడ్జెట్ అవసరమవుతుంది. చక్కని కథతో పాటు నిర్మాత దొరికితే అలాంటి సినిమాలు చేస్తా. ప్రతి సినిమా ప్రారంభానికి ముందు శనీశ్వరాలయానికి వస్తున్నారు. ఏదైనా సెంటిమెంటా? అవును. నా సినిమా ప్రారంభించడానికి ముందు శనీశ్వరాయాలనికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేయించుకుని వెళ్తా. సినిమా హిట్టయిన తర్వాత మళ్లీ వచ్చి స్వామి వారికి మొక్కు చెల్లించుకుంటా. భద్ర, తులసి, దమ్ము, సింహా, లెజండ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. శనీశ్వర స్వామిపై నమ్మకంతో ప్రత్యేక పూజలు చేస్తున్నా. ప్రతి రోజూ నా పేరుతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజకీయాలపై మీ అభిప్రాయం? ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల పైనే ఉంది. రాజకీయాలపై ఆసక్తి లేదు. -
బాలకృష్ణ 'లెజెండ్' మూవీ స్టిల్స్
-
బాలయ్య ‘లెజెండ్’ స్టిల్
-
లెజెండ్ వచ్చేది ఎప్పుడు?
ఈ 30 ఏళ్లల్లో ఏడాది పాటు బాలకృష్ణ సినిమా ప్రేక్షకులను పలకరించకపోవడం ఇదే ప్రథమం. ఇంత గ్యాప్ తీసుకొని మరీ బాలయ్య ఓ సినిమా చేస్తున్నారంటే... ఆ సినిమాపై ఆటోమేటిగ్గా అంచనాలుంటాయి. పైగా బాలయ్యతో ‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, ‘దూకుడు’ లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకేటట్లు చేశాయి. ఇందులో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం. బోయపాటి శ్రీను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘లెజెండ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకూ వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించి భారీ షెడ్యూల్ చేశారు. ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలు కానుంది. జనవరి 14 వరకూ జరిగే ఈ షెడ్యూల్లో ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇదిలావుంటే... ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే... ఫిబ్రవరిలో కూడా ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని యూనిట్ సభ్యుల సమాచారం. మరి విడుదల ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటించలేదు. బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే, సోనాలీ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ప్రతినాయకునిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన జోడీగా కల్యాణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: సాయి కొర్రపాటి. -
సాగర తీరంలో బాలయ్య సరాగాలు
సింహా, శ్రీరామరాజ్యం తర్వాత బాలకృష్ణ చేసిన సినిమాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవనే చెప్పాలి. బాలయ్య సినిమాకు అన్నీ కుదిరితే.. ఆ సక్సెస్ ప్రభావం బాక్సాఫీస్‌పై చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకు ఆయన గత విజయాలే నిదర్శనాలు. ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ‘లెజెండ్’ సినిమా కథ... బాలయ్య అభిమానులు పండగ చేసుకునే రీతిలో చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. మొన్నటివరకూ సాగరతీరంలో బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం బాలయ్య, కథానాయిక రాధికా ఆప్టేపై ఓ పాటను షూట్ చేస్తున్నారు. ఈ నెల 21 దాకా ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 3 వరకూ జరిగే చిత్రీకరణతో ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తవుతుంది. జనవరిలో బాలకృష్ణ, చిత్ర కథానాయికలతో పాటు ఓ గెస్ట్ కథానాయికపై చిత్రీకరించే పాట ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని యూనిట్ వర్గాల భోగట్టా. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. -
బాలకృష్ణకు జోడీగా రాధిక ఆప్టే
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రంలో ప్రధాన కథానాయిక ఎవరు? గత కొన్నాళ్లుగా అటు పరిశ్రమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ ఇదే ప్రశ్న. ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇక్కడున్న స్టిల్ చూశాక ఆ సమాధానమేంటో మీకూ అర్థమయ్యే ఉంటుంది. రక్తచరిత్ర, ధోని చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధిక ఆప్టే ఇందులో బాలయ్యతో జతకట్టనున్నారు. ఈ పాత్ర అభినయానికి ఆస్కారమున్నది కావడంతో ఏరికోరి మరీ రాధిక ఆప్టేను ఎంపిక చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్లో రాధిక పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ -‘‘ఇందులోని కథానాయిక పాత్రకు రాధిక ఆప్టే యాప్ట్. అందుకే ఆమెను ఎంపిక చేశాం. ఇందులో మరో నాయికగా సోనాల్‌చౌహాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర కూడా కథలో కీలకమైనదే. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘సింహా’ను మించే సినిమా ఇది’’ అని చెప్పారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.