లెజెండ్ వచ్చేది ఎప్పుడు?
లెజెండ్ వచ్చేది ఎప్పుడు?
Published Tue, Dec 10 2013 12:30 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
ఈ 30 ఏళ్లల్లో ఏడాది పాటు బాలకృష్ణ సినిమా ప్రేక్షకులను పలకరించకపోవడం ఇదే ప్రథమం. ఇంత గ్యాప్ తీసుకొని మరీ బాలయ్య ఓ సినిమా చేస్తున్నారంటే... ఆ సినిమాపై ఆటోమేటిగ్గా అంచనాలుంటాయి. పైగా బాలయ్యతో ‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, ‘దూకుడు’ లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకేటట్లు చేశాయి.
ఇందులో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం. బోయపాటి శ్రీను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘లెజెండ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకూ వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించి భారీ షెడ్యూల్ చేశారు. ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలు కానుంది.
జనవరి 14 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌లో ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇదిలావుంటే... ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే... ఫిబ్రవరిలో కూడా ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని యూనిట్ సభ్యుల సమాచారం. మరి విడుదల ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటించలేదు. బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే, సోనాలీ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ప్రతినాయకునిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన జోడీగా కల్యాణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: సాయి కొర్రపాటి.
Advertisement
Advertisement