Akhanda Movie Tamil Version Release in Theaters on Friday 28, 2022 - Sakshi
Sakshi News home page

Akhanda Movie: మళ్లీ ప్రారంభంకానున్న అఖండ జాతర !..

Published Thu, Jan 27 2022 6:49 PM | Last Updated on Thu, Jan 27 2022 7:54 PM

Akhanda Movie Tamil Version Release In Theaters - Sakshi

నందమూరి నటసింహం బాలకృష్ణ మాసీవ్​ పెర్ఫామెన్స్​ ఇచ్చిన చిత్రం 'అఖండ'. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గతేడాది విడుదలై అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. ఒకరకంగా చెప్పాలంటే థియేటర్లలో అఖండ జాతర జరిగింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో రిలీజై అక్కడ కూడా 'బోత్​ ఆర్​ సేమ్'​ అన్న రేంజ్​లో వ్యూస్​ సంపాదించుకుంది. ఇప్పుడు ఆ జోరును కోలీవుడ్​లో చూపెట్టనుంది అఖండ. 

ఈ యాక్షన్​ డ్రామా చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబైంది. జనవరి 28న ఈ సినిమా తమిళ డబ్బింగ్​ వెర్షన్​ రిలీజ్ కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం కోలీవుడ్​లో పెద్దగా ఏ సినిమా రిలీజ్​లు లేకపోవడంతో ఈ సూపర్​ హిట్​ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్​ నిర్ణయించుకున్నారట. అలాగే డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ ఓటీటీలో ఇతర భాషల్లో డబ్​ చేసి రిలీజ్​ చేయనుందని టాక్​. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement